ఓంశాంతి
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలకు తెలుసు, బాబా కూడా పిల్లలూ, అని
పిలుస్తారు మరియు ఈ బాప్ దాదా ఇరువురూ కంబైండ్ గా ఉన్నారు. మొదట బాప్ దాదా తర్వాత
పిల్లలు, ఇది కొత్త రచన అయ్యింది కదా మరియు తండ్రి రాజయోగము కూడా నేర్పిస్తున్నారు.
5 వేల సంవత్సరాల క్రితము వలె అదే విధంగా మళ్ళీ మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు.
భక్తి మార్గంలో తర్వాత దాని పుస్తకం తయారుచేసి దానిని గీత అని అన్నారు. కానీ ఈ
సమయములోనైతే గీత యొక్క విషయమేమీ లేదు. ఇది తర్వాత శాస్త్రాన్ని తయారుచేసి దానిని
శ్రీమద్భగవద్గీత, సహజ రాజయోగము యొక్క పుస్తకము అని అన్నారు. భక్తి మార్గంలోని
పుస్తకాలు చదవడంతో లాభము ఉండదు. అలాగే కేవలం శివుడిని స్మృతి చేయడంతో వారసత్వమేమీ
లభించజాలదు. వారసత్వము కేవలం ఇప్పుడు సంగమములోనే లభించగలదు. తండ్రి ఉన్నదే అనంతమైన
వారసత్వాన్ని ఇచ్చేవారు మరియు వారసత్వము కూడా సంగమములో ఇస్తారు. తండ్రి రాజయోగము
నేర్పిస్తారు. సన్యాసులు మొదలైనవారు ఏదైతే నేర్పిస్తారో, వారు నేర్పించేదానికి మరియు
దీనికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారి బుద్ధిలో గీత ఉంటుంది మరియు కృష్ణుడు
గీతను వినిపించారు, వ్యాసుడు రాసారు అని భావిస్తారు. కానీ గీతనైతే కృష్ణుడు
వినిపించలేదు, సమయము కూడా అది కాదు, ఆ సమయంలో కృష్ణుని రూపము కూడా ఉండజాలదు. తండ్రి
అన్ని విషయాలను స్పష్టము చేసి అర్థం చేయిస్తారు మరియు ఇప్పుడు నిర్ణయించుకోండి అని
అంటారు. వారి పేరు కూడా ప్రసిద్ధి చెందింది. సత్యాన్ని తెలియజేసేవారే నరుని నుండి
నారాయణునిగా చేయగలరు. మనం నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఈ పాఠశాలలో లేక రుద్ర
జ్ఞాన యజ్ఞంలో కూర్చున్నామని పిల్లలైన మీకు తెలుసు. శివబాబా అన్న పదము మంచిగా
అనిపిస్తుంది. తప్పకుండా తండ్రి మరియు దాదా ఉన్నారు. ఈ నిశ్చయముతో మీరు వచ్చారు.
తండ్రి బ్రహ్మా ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు మరియు నేను
మిమ్మల్ని త్రికాలదర్శిగా చేస్తున్నానని అర్థం చేయిస్తున్నారు. మీరు త్రిలోకనాథులుగా
అవుతారని కాదు. అలా అవ్వరు, మీరు కేవలం ఒక్క శివపురికి మాత్రమే నాథునిగా అవుతారు.
దానిని లోకము అని అనరు. లోకము అని మనుష్య సృష్టిని అనడం జరుగుతుంది. మనుష్య లోకము
చైతన్య లోకము, అది నిరాకారీ లోకము. మీకు కేవలం మూడు లోకాల జ్ఞానాన్ని వినిపిస్తారు,
మూడు లోకాలకు నాథులుగా చేయరు. మూడు లోకాల జ్ఞానం లభించింది, అందుకే త్రిలోకదర్శి అని
అంటారు. లక్ష్మీ-నారాయణులను కూడా త్రిలోకనాథులు అని అనరు. విష్ణువును కూడా
త్రిలోకనాథుడని అనరు. వారికైతే మూడు లోకాల జ్ఞానమే లేదు. లక్ష్మీ-నారాయణులు, ఎవరైతే
బాల్యములో రాధే-కృష్ణులుగా ఉంటారో, వారికి మూడు లోకాల జ్ఞానం ఉండదు. మీరు
త్రికాలదర్శులుగా అవ్వాలి. జ్ఞానం తీసుకోవాలి. ఇకపోతే, కృష్ణుడి కోసం
త్రిలోకనాథుడిగా ఉండేవారని అంటారు, కానీ అలా కాదు. ఎవరైతే మూడు లోకాలపై రాజ్యం
చేస్తారో, వారిని మూడు లోకాలకు నాథుడు అని అంటారు. వారైతే కేవలం వైకుంఠనాథునిగా
అవుతారు, సత్యయుగాన్ని వైకుంఠమని అంటారు. త్రేతాను వైకుంఠమని అనరు. ఈ లోకానికి కూడా
మనము నాథునిగా అవ్వలేము. బాబా కూడా కేవలం బ్రహ్మతత్వానికి నాథుడు. బ్రహ్మాండము,
దేనిలోనైతే ఆత్మలైన మనము అండాకారములో ఉంటాము, దానికి మాత్రమే వారు యజమాని. బ్రహ్మా,
విష్ణు మరియు శంకరులు సూక్ష్మవతనంలో ఉండేవారు, కావున వారిని అక్కడి నాథులు అని
అంటారు. మీరు వైకుంఠనాథులుగా అవుతారు. ఇది సూక్ష్మవతనం యొక్క విషయము, అది మూలవతనం
యొక్క విషయము. కేవలం మీరు మాత్రమే త్రికాలదర్శిగా అవ్వగలరు. మీ మూడవ నేత్రము
తెరుచుకుంది. భృకుటి మధ్యలో మూడవ నేత్రము ఉంటుంది అని చూపిస్తారు కూడా, అందుకే
త్రినేత్రి అని అంటారు. కానీ ఈ గుర్తును దేవతలకు చూపిస్తారు ఎందుకంటే ఎప్పుడైతే మీది
కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో, అప్పుడు మీరు త్రినేత్రిగా అవుతారు, అదైతే ఈ సమయం
యొక్క విషయమే. ఇకపోతే, వారు జ్ఞాన శంఖాన్ని మోగించరు. వారు మళ్ళీ స్థూల శంఖమని
రాసేసారు. ఇది నోటికి సంబంధించిన విషయము. దీనితో మీరు జ్ఞాన శంఖాన్ని మోగిస్తారు.
జ్ఞానాన్ని చదువుకుంటున్నారు. ఏ విధంగా పెద్ద యూనివర్సిటీలో నాలెడ్జ్ చదువుకుంటారు.
ఇది పతిత-పావనుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీ ఎంత పెద్ద యూనివర్శిటీకి మీరు
విద్యార్థులు. దీనితో పాటు మీకు ఇది కూడా తెలుసు, మన బాబా తండ్రి, టీచరు, సద్గురువు,
అన్నీ. ఈ తల్లి తండ్రి ప్రతి పరిస్థితిలోనూ సుఖాన్ని ఇచ్చేవారు, అందుకే మీరే తల్లి
తండ్రి... అని అంటారు. వీరు శ్యాక్రీన్, చాలా మధురమైనవారు. దేవతల వలె మధురంగా
ఎప్పుడూ ఎవ్వరూ ఉండలేరు. పిల్లలకు తెలుసు, భారత్ చాలా సుఖమయంగా, సదా ఆరోగ్యంగా, సదా
సంపన్నంగా ఉండేది. పూర్తిగా పవిత్రముగా ఉండేది. నిర్వికారీ భారత్ అని అనడం
జరుగుతుంది. ఇప్పుడైతే అలా అనరు. ఇప్పుడైతే వికారీగా, పతితంగా ఉంది అని అంటారు.
తండ్రి ఎంత సహజము చేసి అర్థము చేయిస్తున్నారు. తండ్రిని మరియు వారసత్వాన్ని
తెలుసుకుంటారు. బాబా ఎంత మధురంగా తయారుచేస్తారు. మనం శ్రీమతాన్ని అనుసరించి
చదువుకోవాలి మరియు చదివించాలి అని మీరు కూడా ఫీల్ అవుతారు. ఇదే వ్యాపారము. ఇకపోతే,
జన్మ-జన్మాంతరాల కర్మభోగమైతే చాలా ఉంది కదా. ఎవరికైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి,
రేపు హార్ట్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, అప్పుడు డ్రామా యొక్క విధి అని భావించడం
జరుగుతుంది. బహుశా వారు వేరే పాత్రను అభినయించాల్సి ఉంది, అందుకే దుఃఖం యొక్క విషయము
ఉండదు. డ్రామా స్థిరమైనది. వారు మరొక పాత్రను అభినయించాలి, చింతించే విషయమేముంది.
ఇంకా భారత్ కు మంచి సేవ చేస్తారు ఎందుకంటే సంస్కారాలే అటువంటివి తీసుకొని వెళ్తారు,
ఎవరికైనా కళ్యాణము చేయడము కోసము. కావున సంతోషించాలి కదా. అమ్మ మరణించినా హల్వా
తినాలి...అని అర్థం చేయిస్తారు. దీనిలో వివేకము కావాలి. మీకు తెలుసు, మనము
పాత్రధారులము. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించాలి. డ్రామాలో నిశ్చయించబడి ఉంది.
ఒక శరీరాన్ని వదిలి మరొక పాత్రను అభినయించాలి. ఇక్కడ నుండి ఏ సంస్కారాలతో వెళ్తారో,
అక్కడ గుప్తంగా కూడా సేవనే చేస్తారు. ఆత్మలో సంస్కారాలైతే ఉంటాయి కదా. ఎవరైతే
ముఖ్యమైన సర్వీసబుల్ పిల్లలుగా ఉన్నారో, గౌరవము కూడా వారికే ఉంది. సేవ చేసేవారు,
భారత్ యొక్క కళ్యాణము చేసేవారు కేవలం పిల్లలైన మీరు మాత్రమే. మిగిలిన వారంతా
అకళ్యాణమే చేస్తారు, పతితులుగా చేస్తారు. ఎవరైనా ఫస్ట్ క్లాస్ సన్యాసి
మరణించారనుకోండి, వారు, నేను శరీరాన్ని వదిలి బ్రహ్మతత్వములోకి వెళ్ళి లీనమైపోతాను
అని ఆ విధంగా కూర్చుంటారు. అప్పుడు వారు వెళ్ళి ఎవ్వరి కళ్యాణమూ చేయలేరు ఎందుకంటే
వారేమైనా కళ్యాణకారి తండ్రికి సంతానమా. మీరు కళ్యాణకారి యొక్క సంతానము. మీరు
ఎవ్వరికీ అకళ్యాణము చేయలేరు. మీరైతే కళ్యాణము కోసము వెళ్తారు. ఇది పతిత ప్రపంచము.
ఇప్పుడు ఈ భోగబలం యొక్క రచన అవసరము లేదని తండ్రి యొక్క ఆర్డినెన్స్ వెలువడింది. ఇది
తమోప్రధానమైనది. అర్ధకల్పము నుండి మీరు ఒకరికొకరు కామ ఖడ్గముతో దుఃఖాన్ని ఇచ్చుకుంటూ
వచ్చారు. ఇవి రావణుని 5 భూతాలు, ఇవి మీకు దుఃఖాన్ని ఇస్తాయి. ఇవి మీకు పెద్ద
శత్రువులు. అంతేకానీ, బంగారు లంక మొదలైనవేవీ ఉండేవి కావు. ఈ విషయాలన్నింటినీ
కూర్చుని తయారుచేసారు. తండ్రి అంటారు, ఇదైతే అనంతమైన విషయము. మొత్తం మనుష్య సృష్టి
ఈ సమయములో రావణుడి సంకెళ్ళలో బంధించబడి ఉంది. అందరూ రావణుడి పంజరములో పడి ఉన్నారు,
అందరూ శోక వాటికలో ఉన్నారు అని మ్యాగజిన్ లో కూడా మంచి చిత్రాలు వెలువడ్డాయి. అశోక
వాటిక లేదు. అశోక హోటలూ లేదు. ఇవన్నీ శోకము యొక్క హోటళ్ళు, చాలా అశుద్ధము చేస్తారు.
పిల్లలైన మీకు స్వచ్ఛమైన వారు ఎవరు, అశుద్ధమైనవారు ఎవరు అన్నది తెలుసు. ఇప్పుడు మీరు
పుష్పాలుగా అవుతున్నారు.
పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు, ఆత్మ యొక్క రికార్డులో ఎంత పెద్ద పాత్ర
నిశ్చయించబడి ఉంది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశీ
పాత్ర నిండి ఉంది. మేము పతితంగా, తమోప్రధానంగా ఉన్నామని అంటారు కూడా. ఇప్పుడిది
అంతిమము. అనవసరముగా చంపే ఆట కదా. ఒక్క బాంబుతో ఎంత మంది మరణిస్తారు. మీకు తెలుసు,
ఇప్పుడు పాత ప్రపంచము ఉండేదే లేదు. ఇది పాత శరీరము, పాత ప్రపంచము. మనకు కొత్త
ప్రపంచములో కొత్త శరీరము లభించనున్నది, అందుకే శ్రీమతం అనుసారంగా పురుషార్థము
చేస్తున్నాము. తప్పకుండా ఈ పిల్లలందరూ వారికి సహాయకులు. శ్రీ శ్రీ యొక్క శ్రీమతము
అనుసరించి మనము శ్రీ లక్ష్మీ, శ్రీ నారాయణులుగా అవుతాము. వైస్ ప్రెసిడెంట్ ను
ప్రెసిడెంట్ అని ఏమైనా అంటారా. అదైతే జరగజాలదు. భగవంతుడు రాయి-రప్పలలో ఎలా
అవతరిస్తారు. వారి కోసమే, యధా యదాహి... అని పాడుతారు. ఎప్పుడెప్పుడైతే పూర్తిగా
పతితంగా అవుతారో, కలియుగ అంతిమము సమీపంగా వస్తుందో, అప్పుడు నేను రావలసి ఉంటుంది.
ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. బాబా అడుగుతారు - బాబా స్మృతి
ఉంటుందా? వారంటారు, బాబా, ఘడియ-ఘడియ మర్చిపోతాము. ఎందుకు? లౌకిక తండ్రినైతే ఎప్పుడూ
మర్చిపోరు. ఈ విషయము పూర్తిగా కొత్తది. తండ్రి నిరాకారుడు, ఒక బిందువు. ఈ అభ్యాసము
లేదు. మేమైతే ఎప్పుడూ ఈ విధంగా వినలేదు, ఎప్పుడూ వారిని ఈ విధంగా స్మృతి చేయలేదు అని
అంటారు కదా. దేవతలకు కూడా ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. వారిని
స్వదర్శన చక్రధారి అని కూడా అనరు. విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులుగా
అవుతారని అంటారు. ప్రవృత్తి మార్గము కోసం రెండు రూపాలను చూపిస్తారు. బ్రహ్మా సరస్వతి,
శంకర పార్వతి, లక్ష్మీ నారాయణులు. ఉన్నతోన్నతమైనవారు ఒక్కరే, తర్వాత సెకండు, థర్డ్...
ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలూ, దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలను
విడిచిపెట్టండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, తండ్రి సంతానాన్ని. నేను
సన్యాసిని కాను. తండ్రిని స్మృతి చేయండి, ఈ దేహ ధర్మాన్ని మర్చిపోండి. ఇది చాలా
సహజము. ఇప్పుడు తండ్రితో పాటు కూర్చున్నారు. బాబా బ్రహ్మా ద్వారా కూర్చుని
తెలియజేస్తారు. బాప్ దాదా ఇరువురూ కంబైండ్ గా ఉన్నారు. ఏ విధంగానైతే ఇద్దరు పిల్లలు
కలిసి జన్మిస్తారు కదా, ఇది కూడా ఇద్దరి పాత్ర కలిసి నడుస్తుంది. అంతి మతి సో గతి
అని పిల్లలకు అర్థం చేయించారు. ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడతారో, ఆ సమయంలో బుద్ధి
ఎక్కడికైనా వెళ్తే, అక్కడికి వెళ్ళి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అంతిమ సమయంలో పతి
ముఖము చూసినట్లయితే బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది. అంతిమ సమయంలో ఎవరు ఎటువంటి
స్మృతిలో ఉంటారో, ఆ సమయం యొక్క ప్రభావము చాలా ఉంటుంది. ఒకవేళ ఆ సమయములో, కృష్ణుని
వంటి బాలుడిగా అవ్వాలి అని స్మృతి ఉన్నట్లయితే, ఇక అడగకండి. చాలా సుందరమైన బాలుడిగా
అయి జన్మ తీసుకుంటారు. ఇప్పుడైతే అంతి మతి, ఒకే ఒక్క లగనము ఉంచుకోవాలి కదా. ఈ సమయంలో
మీరు ఏం చేస్తున్నారు! మనం శివబాబాను స్మృతి చేస్తున్నామని మీకు తెలుసు. అందరికీ
సాక్షాత్కారమైతే జరుగుతుంది. కిరీటధారి అయితే కృష్ణుడు కూడా, రాధే కూడా.
రాకుమారీ-రాకుమారులుగా అయితే ఉంటారు కానీ ఎప్పుడు? సత్యయుగములోనా లేక త్రేతాలోనా?
అది మళ్ళీ పురుషార్థము పైన ఆధారపడి ఉంది. ఎంతగా పురుషార్థం చేస్తారో, అంత ఉన్నత
పదవిని పొందుతారు. మీరంటారు, మేమైతే 21 జన్మల కోసం రాజ్యాన్ని తీసుకుంటాము. మమ్మా
బాబా తీసుకుంటున్నారు అంటే మనమెందుకు ఫాలో చేయకూడదు. జ్ఞానాన్ని ధారణ చేసి మళ్ళీ
చేయించాలి, ఇంతటి సేవ చేయాలి, అప్పుడే 21 జన్మల కోసం ప్రారబ్ధం లభిస్తుంది. స్కూలులో
ఎవరైతే మంచి రీతిలో పురుషార్థము చేయరో, వారైతే తక్కువ మార్కులు తీసుకుంటారు. మీరు
ఇప్పుడు 5 వికారాల రూపీ మాయా రావణుడిపై విజయము పొందుతారు. మీది అహింసక యుద్ధము.
ఒకవేళ రామునికి గుర్తులు చూపించకపోతే సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు అని ఎలా
పిలవబడతారు. కావున తండ్రి అంటారు, మీరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అంతి మతి సో గతి
అవుతుంది. దేహము గురించి కూడా ఆలోచన ఉండకూడదు, అందరినీ మర్చిపోవాలి. తండ్రి అంటారు,
మీరు వివస్త్రగా (అశరీరి)గా వచ్చారు, మళ్ళీ వివస్త్రగా వెళ్ళాలి. మీరు ఇంత చిన్న
బిందువు, ఈ చెవుల ద్వారా వింటారు, ముఖం ద్వారా మాట్లాడుతారు. ఆత్మలైన మనము ఒక శరీరం
వదిలి మళ్ళీ మరొక దానిలోకి వెళ్తాము. ఇప్పుడు ఆత్మలైన మనము ఇంటికి వెళ్తున్నాము.
బాబా చాలా అలంకరణ చేయిస్తారు, దీనితో మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. శివబాబాను
స్మృతి చేయడంతో మనం ఈ విధంగా అవుతామని మీకు తెలుసు. గీతలో కూడా ఉంది - నన్ను స్మృతి
చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, అప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా
అవుతారు. ఇది చాలా సహజము. నిజంగా మేము కల్ప-కల్పము మీ నుండి బ్రహ్మా ద్వారా
వారసత్వము పొందుతామని అర్థం చేసుకుంటారు కూడా. బ్రహ్మా ద్వారా దేవతా ధర్మ స్థాపన
జరుగుతుందని పాడుతారు కూడా. ఫెయిల్ అయినట్లయితే తర్వాత త్రేతాలో క్షత్రియ ధర్మంలోకి
వెళ్ళిపోతారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ... మూడు ధర్మాల స్థాపన
జరుగుతుంది. సత్యయుగములో ఇంకే ధర్మమూ ఉండదు, మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. వాటికి
మనతో ఎటువంటి కనెక్షన్ లేదు. మనం ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని
భారతవాసులు మర్చిపోయారు. ఇది కూడా డ్రామా యొక్క పాత్ర ఆ విధంగా తయారై ఉంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతమనుసారంగా చదువుకుని మరియు చదివించే వ్యాపారము చేయాలి. డ్రామా విధిపై
స్థిరంగా ఉండాలి. ఏ విషయం గురించి చింతించకూడదు.
2. అంతిమ సమయంలో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు, అందుకే ఈ దేహాన్ని
కూడా మర్చిపోయే అభ్యాసం చేయాలి. అశరీరిగా అవ్వాలి.