14-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - తండ్రి మీకు ఏ చదువునైతే చదివిస్తున్నారో, దానిని బుద్ధిలో ఉంచుకొని అందరినీ చదివించాలి, ప్రతి ఒక్కరికీ తండ్రి మరియు సృష్టి చక్రముల పరిచయమునివ్వాలి”

ప్రశ్న:-

ఆత్మ సత్యయుగంలో కూడా పాత్రనభినయిస్తుంది మరియు కలియుగంలో కూడా అభినయిస్తుంది కానీ తేడా ఏమిటి?

జవాబు:-

సత్యయుగంలో పాత్రను అభినయించేటప్పుడు అక్కడ పాప కర్మలేవీ జరగవు, అక్కడ ప్రతి కర్మ అకర్మగా అవుతుంది ఎందుకంటే రావణుడు ఉండడు. మళ్ళీ కలియుగంలో పాత్రను అభినయించేటప్పుడు ప్రతి కర్మ వికర్మ లేక పాపముగా అవుతుంది ఎందుకంటే ఇక్కడ వికారాలున్నాయి. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. మీకు పూర్తి జ్ఞానమంతా ఉంది.

ఓంశాంతి. ఇప్పుడు మనము బాబా ఎదురుగా కూర్చున్నామని పిల్లలకు తెలుసు. పిల్లలు నా ఎదురుగా కూర్చున్నారని బాబాకు కూడా తెలుసు. తండ్రి మనకు శిక్షణనిస్తున్నారు, దీనిని మళ్ళీ ఇతరులకివ్వాలని కూడా మీకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి ఎందుకంటే అందరూ తండ్రిని మరియు తండ్రి శిక్షణలను మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో, ఈ చదువు మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయము, తర్వాత మనమందరమూ సోదరులమని కూడా అర్థము చేయించాలి. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. అందరూ తమకు లభించిన పాత్రను శరీరం ద్వారా అభినయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు, దానిని స్వర్గమని అంటారు. కానీ సోదరులైన మనమందరమూ పతితులుగా ఉన్నాము, ఒక్కరు కూడా పావనంగా లేరు. పతితులందరినీ పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది పతిత, వికారీ, భ్రష్టాచారీ రావణ ప్రపంచముగా ఉన్నది. రావణుడు అంటే అర్థము - 5 వికారాలు స్త్రీలోనివి, 5 వికారాలు పురుషుడిలోనివి. బాబా చాలా సింపుల్ రీతిలో అర్థం చేయిస్తారు. మీరు కూడా ఇలా అర్థం చేయించగలరు. కనుక ఆత్మలైన మనందరికీ వారు తండ్రి అని మొట్టమొదట అర్థము చేయించండి. మనమందరమూ సోదరులము, ఇది సరేనా అని వారిని అడగండి. మనమంతా సోదరులము, మనందరికీ తండ్రి ఒక్కరే, ఆత్మలైన మనందరికీ వారు సుప్రీమ్ సోల్, వారిని ఫాదర్ అని అంటారు అని వ్రాయమనండి. దీనిని బుద్ధిలో పక్కాగా కూర్చోబెట్టండి, అప్పుడు సర్వవ్యాపి మొదలైన విషయాలు ముందు తొలగిపోతాయి. మొదట అల్ఫ్ గురించి చదువుకోవాలి. ఇంతకుముందు సర్వవ్యాపి అని అనేవాడిని, ఇప్పుడు సర్వవ్యాపి కాదని భావిస్తున్నానని మంచిరీతిగా కూర్చుని వ్రాయమని చెప్పండి. మనమందరమూ సోదరులము, ఆత్మలందరూ గాడ్ ఫాదర్, పరమపిత అని అంటారు. మొదట ఈ నిశ్చయాన్ని కూర్చోబెట్టాలి - మనము ఆత్మలము, పరమాత్మ కాదు, మనలో పరమాత్మ వ్యాపించి ఉండరు, అందరిలోనూ ఆత్మ వ్యాపించి ఉంది. ఆత్మ శరీరం ఆధారంతో పాత్రను అభినయిస్తుందని పక్కా చేయించండి. అచ్ఛా, తర్వాత ఆ తండ్రి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు, ఈ సృష్టిచక్ర ఆయువు ఎంత అనేది ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రియే టీచరు రూపంలో కూర్చొని అర్థం చేయిస్తారు. లక్షల సంవత్సరాల విషయమే లేదు. ఈ చక్రము అనాదిగా, ఏక్యురేట్ గా తయారై-తయారవుతున్నది, దీనిని తెలుసుకోవలసి ఉంటుంది. సత్య-త్రేతా యుగాలు గడిచిపోయాయి, ఇది నోట్ చేసుకోండి. వాటిని స్వర్గము మరియు సెమీ స్వర్గము అని అంటారు. అక్కడ దేవీదేవతల రాజ్యము నడుస్తుంది, వారికి 16 కళలు, వీరికి 14 కళలు ఉంటాయి. కళలు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. ప్రపంచమైతే తప్పకుండా పాతదిగా అవుతుంది కదా. సత్యయుగ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. దాని పేరే స్వర్గము, హెవెన్, కొత్త ప్రపంచము..... దానినే మహిమ చేయాలి. కొత్త ప్రపంచంలో ఒక్క ఆదిసనాతన దేవీదేవతా ధర్మమే ఉంటుంది. మొదట తండ్రి పరిచయాన్ని, తర్వాత చక్రం యొక్క పరిచయాన్ని ఇవ్వడం జరుగుతుంది. నిశ్చయం ఏర్పరిచేందుకు మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టిచక్రము తిరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, త్రేతాయుగంలో సీతా-రాముల రాజ్యముండేది. వీటితో అర్ధకల్పము ఉంటుంది, రెండు యుగాలు గడిచిపోతాయి, తర్వాత ద్వాపర-కలియుగాలు వస్తాయి. ద్వాపరయుగంలో రావణ రాజ్యము ఉంటుంది. దేవతలు వామమార్గములోకి వెళ్ళిపోతారు కనుక వికారాల సిస్టమ్ తయారవుతుంది. సత్య-త్రేతా యుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఒక్కటే ఉంటుంది. చిత్రాలను కూడా చూపించాలి, నోటి ద్వారా కూడా అర్థం చేయించాలి. తండ్రి మనకు టీచర్ గా అయి ఈ విధంగా చదివిస్తున్నారు. తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్నిస్తారు. నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను కనుక నాకు శరీరము తప్పకుండా కావాలని తండ్రి స్వయంగా అంటారు. లేకపోతే నేను ఎలా మాట్లాడగలను. నేను చైతన్యుడిని, సత్యమును మరియు అమరుడిని. ఆత్మ సతో, రజో, తమోలలోకి వస్తుంది. ఆత్మయే పావనంగా మరియు పతితంగా అవుతుంది, అందుకే పతితాత్మ, పావనాత్మ అని అంటారు. సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉన్నాయి. గతము యొక్క కర్మ-వికర్మల సంస్కారాలను ఆత్మ తీసుకొస్తుంది. సత్యయుగంలో వికర్మలే జరగవు. కర్మలు చేస్తారు, పాత్రను అభినయిస్తారు కానీ ఆ కర్మ అకర్మగా అవుతుంది. ఈ పదాలు గీతలో కూడా ఉన్నాయి, మీరిప్పుడు ప్రాక్టికల్ గా అర్థము చేసుకుంటున్నారు. పాత ప్రపంచాన్ని మార్చి, కొత్త ప్రపంచాన్ని తయారుచేసేందుకు బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఎక్కడైతే కర్మలు అకర్మలుగా అవుతాయో, దానినే సత్యయుగమని అంటారు మరియు ఎక్కడైతే కర్మలు వికర్మలుగా అవుతాయో దానిని కలియుగమని అంటారు. మీరిప్పుడు సంగమయుగములో ఉన్నారు. బాబా ఇరువైపులా ఉన్న విషయాలను అర్థం చేయిస్తారు. సత్య, త్రేతా యుగాలు పవిత్ర ప్రపంచము, అక్కడ ఏ పాపమూ జరగదు. ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో అప్పుడే పాపాలు జరుగుతాయి. అక్కడ వికారాల పేరే ఉండదు. రామరాజ్యం మరియు రావణరాజ్యం యొక్క చిత్రాలు ఎదురుగా ఉన్నాయి. ఇది చదువు అని తండ్రి అర్థము చేయిస్తారు. ఇది బాబాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ చదువైతే మీ బుద్ధిలో ఉండాలి, తండ్రి కూడా గుర్తుకొస్తారు, చక్రము కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. క్షణంలో అంతా గుర్తుకొచ్చేస్తుంది. వర్ణించేందుకైతే సమయం పడుతుంది. వృక్షము ఇలా ఉంటుందని, దీనికి మూడు ఫౌంటెన్ లు (శాఖలు) ఉన్నాయని, బీజము మరియు వృక్షము క్షణంలో గుర్తుకొచ్చేస్తాయి. ఈ బీజము ఫలానా వృక్షముదని, ఈ విధంగా దీని నుండి ఫలాలు వెలువడతాయని గుర్తుకొచ్చేస్తాయి. ఈ అనంతమైన మనుష్య సృష్టి రూపీ వృక్షము ఎలా ఉంటుంది అనే రహస్యాన్ని మీరు అర్థము చేయిస్తారు. అర్ధకల్పము రాజ్యం ఎలా నడుస్తుంది, తర్వాత రావణ రాజ్యము వచ్చినప్పుడు సత్య, త్రేతా యుగవాసులే, ద్వాపరయుగ వాసులుగా అవుతారని పిల్లలకు మొత్తం అర్థం చేయించారు. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము ఉంటుంది, వికారులుగా అయిపోతారు. తండ్రి ద్వారా ఏ వారసత్వమైతే లభించిందో, అది అర్ధకల్పము కొనసాగింది. జ్ఞానము వినిపించి వారసత్వమునిచ్చారు, ఆ ప్రారబ్ధాన్ని అనుభవించారు అనగా సత్య-త్రేతా యుగాలలో సుఖాన్ని పొందారు. దానిని సుఖధామము, సత్యయుగమని అంటారు. అక్కడ దుఃఖమే ఉండదు. ఎంత సింపుల్ గా అర్థం చేయిస్తారు. ఒకరికి అర్థం చేయిస్తున్నా లేక అనేకులకు అర్థం చేయిస్తున్నా - వారు అర్థము చేసుకుంటున్నారా? అవును-అవును అని అంటున్నారా? అని అటెన్షన్ పెట్టాలి. నోట్ చేసుకుంటూ ఉండండి, ఏదైనా సందేహము వస్తే అడగండి, ఏ విషయమైతే ఎవ్వరికీ తెలియదో దాన్ని మేము అర్థం చేయిస్తున్నాము, మీకు ఏమీ తెలియదు, ఇంకేమి అడుగుతారు అని చెప్పండి.

బాబా ఈ అనంతమైన వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానాన్ని మీరిప్పుడే అర్థం చేసుకుంటారు. మీరు 84 జన్మల చక్రములోకి ఎలా వస్తారు అనేది తండ్రి అర్థము చేయించారు. దీనిని బాగా నోట్ చేసుకోండి, తర్వాత దీనిపై ఆలోచించాలి. టీచరు ఎస్సే (వ్యాసం) ఇస్తే తర్వాత ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకొని వస్తారు కదా. మీరు కూడా ఈ జ్ఞానాన్నిస్తారు, తర్వాత ఏమవుతుందో చూడండి. అడుగుతూ ఉండండి. ఒక్కొక్క విషయాన్ని మంచి రీతిగా అర్థము చేయించండి. తండ్రి-టీచర్ల కర్తవ్యాన్ని అర్థం చేయించిన తర్వాత గురువు గురించి అర్థం చేయించండి. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని వారిని పిలిచారు. ఆత్మ పావనంగా అయినట్లయితే శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. బంగారం ఏ విధంగా ఉంటుందో, ఆభరణము అదే విధంగా తయారవుతుంది. 24 క్యారెట్ల బంగారాన్ని తీసుకొని, అందులో మలినాలు కలపకపోతే ఆభరణము కూడా అదే విధంగా సతోప్రధానంగా తయారవుతుంది. కల్తీ కలపడంలో తమోప్రధానంగా అయిపోయింది. మొట్టమొదట భారతదేశము 24 క్యారెట్ల పక్కా బంగారు పిచ్చుకగా ఉండేది అనగా సతోప్రధాన కొత్త ప్రపంచంగా ఉండేది, తర్వాత తమోప్రధానంగా అయ్యింది. ఇది తండ్రియే అర్థం చేయిస్తారు, ఇతర ఏ మనుష్యులకు, గురువులకు తెలియదు. మీరు వచ్చి పావనంగా చేయండని పిలుస్తారు. అది గురువు పని. వానప్రస్థ అవస్థలో మనుష్యులు గురువులను ఆశ్రయిస్తారు. వాణి నుండి అతీతమైన స్థానము నిరాకార ప్రపంచము, అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఇది సాకారీ ప్రపంచము. ఇది రెండిటి మేళా. అక్కడ శరీరమే ఉండదు. అక్కడ కర్మలేవీ జరగవు. తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా వారినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. వారు చైతన్యము, సత్-చిత్-ఆనంద స్వరూపులైన కారణంగా వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఓ పతిత పావన, నాలెడ్జ్ ఫుల్ శివబాబా అని కూడా పిలుస్తారు, వారి పేరు సదా శివ అనే ఉంటుంది. మిగిలిన ఆత్మలంతా పాత్రను అభినయించేందుకు వస్తాయి. రకరకాల పేర్లను ధారణ చేస్తాయి. బాబాను పిలుస్తారు కానీ వారికేమీ అర్థం కాదు. తప్పకుండా భాగ్యశాలి రథం కూడా ఉంటుంది, దానిలోనే తండ్రి ప్రవేశించి మిమ్మల్ని పావన ప్రపంచములోకి తీసుకువెళ్తారు. మధురాతి-మధురమైన పిల్లలూ, ఎవరైతే అనేక జన్మల అంతిమంలో ఉన్నారో, పూర్తి 84 జన్మలను తీసుకున్నారో, నేను వారి తనువులోకే వస్తానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. భాగ్యశాలి రథములోకి రావలసి ఉంటుంది. మొదటి నంబరులో శ్రీకృష్ణుడు ఉంటారు. వారు కొత్త ప్రపంచానికి యజమాని. మళ్ళీ వారే క్రిందికి దిగిపోతారు. బంగారు నుండి వెండి, రాగి, ఇనుప యుగములోకి వచ్చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇనుము నుండి బంగారంగా అవుతున్నారు. కేవలం మీరు తండ్రినైన నన్ను స్మృతి చేయండని తండ్రి అంటారు. ఎవరిలోనైతే నేను ప్రవేశించానో, ఆ ఆత్మలో కొద్దిగా కూడా జ్ఞానముండేది కాదు. నేను వీరిలో ప్రవేశిస్తాను, అందుకే వీరిని భాగ్యశాలి రథమని అంటారు. లేదంటే అందరికన్నా ఉన్నతమైనవారు ఈ లక్ష్మీనారాయణులు, వీరిలో ప్రవేశించాలి. కానీ వారిలో పరమాత్మ ప్రవేశించరు కావున వారిని భాగ్యశాలి రథమని అనరు. రథములోకి వచ్చి పతితులను పావనంగా చేయాలి కనుక తప్పకుండా అది కలియుగీ తమోప్రధానమైనదే ఉంటుంది కదా. నేను అనేక జన్మల అంతిమంలో వస్తానని వారు స్వయంగా చెప్తున్నారు. గీతలో కూడా ఏక్యురేట్ పదాలున్నాయి. గీతనే సర్వశాస్త్రమయి శిరోమణి అని అంటారు. ఈ సంగమయుగంలోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని మరియు దేవతా కులాన్ని స్థాపన చేస్తారు. అనేక జన్మల అంతిమంలో అనగా సంగమయుగంలోనే తండ్రి వస్తారు. నేను బీజరూపుడను అని తండ్రి అంటారు. కృష్ణుడు సత్యయుగ నివాసి. వారిని వేరే చోట ఎవ్వరూ చూడలేరు. పునర్జన్మలలో నామ, రూప, దేశ, కాలాలు అన్నీ మారిపోతాయి. ముఖ కవళికలే మారిపోతాయి. మొదట చిన్న బిడ్డగా, సుందరంగా ఉంటాడు, పెద్దవారైన తర్వాత వారు శరీరాన్ని వదిలి మరొక చిన్నదానిని తీసుకుంటారు. ఈ తయారై-తయారవుతున్న ఆట డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. మరో శరీరము తీసుకున్న తర్వాత వారిని కృష్ణుడని అనరు. ఆ శరీరానికి పేరు మొదలైనవి వేరేవి ఉంటాయి. సమయం, ముఖ కవళికలు, తిథి-తారీఖులు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర-భూగోళాలు యథావిధిగా రిపీట్ అవుతాయని అంటారు. కావున ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. సతో, రజో, తమోలోకి రావాల్సిందే. సృష్టి నామము, యుగం యొక్క నామము అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడిది సంగమయుగము. నేను సంగమయుగములోనే వస్తాను. నేను మీకు మొత్తం ప్రపంచ చరిత్ర-భూగోళం యొక్క సత్యాన్ని తెలియజేస్తాను. ఆది నుండి అంతిమం వరకు ఇంకెవ్వరికీ తెలియదు. సత్యయుగం ఆయువు ఎంతో తెలియని కారణంగా లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో అన్ని విషయాలున్నాయి. తండ్రి, తండ్రి-టీచరు-సద్గురువు అని, మళ్ళీ సతోప్రధానంగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలియజేస్తున్నారని మీ లోపల పక్కా చేసుకోవాలి. దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండని గీతలో కూడా ఉంది. తిరిగి తమ ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. భగవంతుని వద్దకు వెళ్ళేందుకు భక్తి మార్గంలో ఎంతగా శ్రమిస్తారు. అది ముక్తిధామము, అక్కడ కర్మల నుండి ముక్తులుగా ఉంటారు. మనము నిరాకార ప్రపంచములోకి వెళ్ళి కూర్చుంటాము. పాత్రధారి ఇంటికి వెళ్తే పాత్ర నుండి ముక్తులైనట్లే. మేము ముక్తిని పొందాలని అందరూ కోరుకుంటారు. మోక్షమైతే ఎవ్వరికీ లభించదు. ఈ డ్రామా అనాది-అవినాశి. రావడం-వెళ్ళడం యొక్క ఈ పాత్ర మాకు ఇష్టం లేదని ఎవరైనా అన్నాసరే, ఇందులో ఏమీ చెయ్యలేరు. ఈ అనాది డ్రామా రచింపబడి ఉంది. ఒక్కరు కూడా మోక్షమును పొందలేరు. అవన్నీ అనేక రకాల మనుష్య మతాలు. ఇది శ్రేష్ఠంగా తయారుచేసేందుకు శ్రీమతము. మనుష్యులను శ్రేష్ఠులని అనరు. దేవతలను శ్రేష్ఠులని అంటారు. వారి ఎదురుగా అందరూ నమస్కరిస్తారు కనుక వారు శ్రేష్ఠమైనవారు కదా. కృష్ణుడు దేవత, అతను వైకుంఠానికి రాకుమారుడు. అతను ఇక్కడకు ఎలా వస్తారు. అతను గీతను కూడా వినిపించలేదు. శివుని ఎదురుగా వెళ్ళి మాకు ముక్తినివ్వండని అంటారు. వారెప్పుడూ జీవన్ముక్తి, జీవన బంధనములోకి రానే రారు, అందుకే వారిని ముక్తినివ్వమని పిలుస్తారు. జీవన్ముక్తి కూడా వారే ఇస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనమంతా ఆత్మ రూపంలో సోదరులము, ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి మరియు చేయించాలి. తమ సంస్కారాలను స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా చేసుకోవాలి.

2. 24 క్యారెట్ల సత్యమైన బంగారంగా (సతోప్రధానంగా) అయ్యేందుకు కర్మ-అకర్మ-వికర్మల గుహ్య గతిని బుద్ధిలో ఉంచుకొని ఇప్పుడిక ఎటువంటి వికర్మలనూ చేయకూడదు.

వరదానము:-

సమయానికి ప్రతి గుణమును మరియు శక్తిని ఉపయోగించే అనుభవీ మూర్త భవ

బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత అనుభవము. ఒకవేళ ఒక్క గుణం లేక శక్తి యొక్క అనుభూతి లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు విఘ్నానికి వశమవుతారు. ఇప్పుడు అనుభూతి యొక్క కోర్సును ప్రారంభించండి. ప్రతి గుణము మరియు శక్తి రూపీ ఖజానాను ఉపయోగించండి. ఏ సమయంలో ఏ గుణము యొక్క అవసరముంటుందో, ఆ సమయంలో దాని స్వరూపంగా అయిపోండి. జ్ఞానం యొక్క రూపంలో బుద్ధి అనే లాకర్లో ఖజానాలను దాచివేయకండి, వాటిని ఉపయోగించండి, అప్పుడే విజయులుగా అవ్వగలరు మరియు వాహ్ రే మై (వాహ్ నేను) అనే పాటను సదా పాడుతూ ఉంటారు.

స్లోగన్:-

నాజూకుతనపు సంకల్పాలను సమాప్తం చేసి శక్తిశాలీ సంకల్పాలను రచించేవారే డబల్ లైట్ గా ఉంటారు.