14-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - శరీర నిర్వహణార్థం కర్మలైతే చేయండి కానీ తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రిని స్మృతి చేసి మొత్తం విశ్వానికి శాంతి యొక్క దానాన్ని ఇవ్వండి, తమ సమానంగా తయారుచేసే సేవ చేయండి

ప్రశ్న:-

సూర్యవంశీ కుటుంబంలో ఉన్నత పదవి పొందడానికి పురుషార్థం ఏమిటి?

జవాబు:-

సూర్యవంశీ కుటుంబంలో ఉన్నత పదవిని పొందడానికి తండ్రిని స్మృతి చేయండి మరియు ఇతరులతో చేయించండి. ఎంతెంతగా స్వదర్శన చక్రధారులుగా అవుతారో మరియు తయారుచేస్తారో అంతగా ఉన్నత పదవి పొందుతారు. 2. పురుషార్థం చేసి పాస్ విత్ ఆనర్ గా అవ్వండి. శిక్షలు అనుభవించాల్సి వచ్చేటటువంటి కర్మలేవీ జరగకూడదు. శిక్షలు అనుభవించేవారి పదవి భ్రష్టమైపోతుంది.

గీతము:-
ఈ పాపపు ప్రపంచం నుండి... (ఇస్ పాప్ కీ దునియా...)

ఓంశాంతి

ఇది పిల్లల ప్రార్థన. ఏ పిల్లలది? ఎవరైతే ఇప్పటివరకు తెలుసుకోలేదో వారిది. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, ఈ పాపపు ప్రపంచం నుండి బాబా మనల్ని పుణ్యపు ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారని. అక్కడ ఎల్లప్పుడూ విశ్రాంతియే విశ్రాంతి ఉంటుంది. దుఃఖం యొక్క పేరు కూడా ఉండదు. ఇప్పుడు మీ మనసును ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది, మనం ఆ సుఖధామం నుండి మళ్ళీ ఈ దుఃఖధామానికి ఎలా వచ్చేసాము. ఇదైతే అందరికీ తెలుసు, భారత్ ప్రాచీన దేశము. భారత్ యే సుఖధామంగా ఉండేది. ఒకే భగవాన్-భగవతీల రాజ్యముండేది. గాడ్ కృష్ణ, గాడెస్ రాధే అనగా గాడ్ నారాయణ, గాడెస్ లక్ష్మి రాజ్యం చేసేవారు. అందరికీ తెలుసు, ఇప్పుడు మళ్ళీ భారతవాసులే తమను తాము పతితులము, భ్రష్టాచారులమని ఎందుకు చెప్పుకుంటారు? వారికి తెలుసు కూడా, భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది, పారసనాథ్, పారసనాథినీల రాజ్యముండేది, మళ్ళీ ఈ భ్రష్టాచారి అవస్థను ఎలా పొందారు? బాబా కూర్చుని అర్థం చేయిస్తారు - నా జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. కానీ నా జన్మ దివ్యమైనది. మీకు తెలుసు, మనం శివవంశీయులము మరియు ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలము. అందుకే బాబా అర్థం చేయించారు, మొట్టమొదట ఇది అడగండి - గాడ్ ఫాదర్ గురించి మీకు తెలుసా? ఫాదర్ కదా మళ్ళీ సంబంధము ఏమి అడుగుతారు అని అంటారు. తండ్రి అయినట్లే కదా. ఆత్మలంతా శివవంశీయులు అయినప్పుడు అందరూ సోదరులు. మరి సాకార ప్రజాపిత బ్రహ్మాతో సంబంధం ఏమిటి? అప్పుడు, అందరూ తండ్రి కదా అని అంటారు. వారిని ఆదిదేవ్ అని కూడా అంటారు. శివుడు నిరాకార తండ్రి, వారు అవినాశీ. ఆత్మలు కూడా అవినాశీ. ఇకపోతే సాకారంలో ఉన్నవారు ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొకటి తీసుకుంటారు. నిరాకార శివవంశీయులు. వారిని మళ్ళీ కుమారులు-కుమారీలు అని అనరు. ఆత్మలలో కుమారులు-కుమారీలు అనేది ఉండదు. ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలు అయినప్పుడు అక్కడ కుమారులు-కుమారీలు అన్నది ఉంటుంది. శివవంశీయులుగా అయితే ముందు నుండే ఉన్నారు. శివబాబా పునర్జన్మలలోకి రారు. ఆత్మలైన మనం పునర్జన్మలలోకి వస్తాము. అచ్ఛా, మీరు ఎవరైతే పుణ్యాత్మలుగా ఉండేవారో, మళ్ళీ పాపాత్ములుగా ఎలా అయ్యారు? తండ్రి అంటారు, భారతవాసులైన మీరు మీకు మీరే చెంపదెబ్బ వేసుకున్నారు. పరమపిత అని కూడా అంటారు, మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. మీరు పుణ్యాత్మగా చేసేటువంటి తండ్రిని కుక్క, పిల్లి, రాయి, రప్పల్లో అన్నింటిలోనూ పడేసారు. వారు అనంతమైన తండ్రి. వారిని మీరు స్మృతి చేస్తారు. వారే ప్రజాపిత బ్రహ్మా నోటి ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణులైన మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. పతితుల నుండి పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారికి అందరికన్నా ఎక్కువగా మీరే అపకీర్తి కలిగించారు అందుకే మీ పై ధర్మరాజు ద్వారా కేసు నడుస్తుంది. మీకు అందరికన్నా పెద్ద శత్రువు - 5 వికారాల రూపీ రావణుడు. మీది రామ బుద్ధి, మిగిలినవారందరిదీ రావణ బుద్ధి. రామ రాజ్యంలో మీరు ఎంత సుఖమయంగా ఉండేవారు. రావణ రాజ్యంలో మీరు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. అక్కడ పావన వంశం ఉండేది. ఇక్కడ పతిత వంశం ఉంది. ఇప్పుడు ఎవరి మతంపై నడుచుకోవాలి? పతిత-పావనుడైతే ఒక్క నిరాకారుడే. ఈశ్వరుడు సర్వవ్యాపి అని, ఈశ్వరుడు ప్రస్తుతం హాజరై ఉన్నారు అని, ప్రమాణం కూడా ఈ విధంగా చేయిస్తారు. ఇది కేవలం పిల్లలైన మీకే తెలుసు, తండ్రి ఈ సమయంలోనే హాజరై ఉన్నారు. మనం కళ్ళతో చూస్తాము. పరమపిత పరమాత్మ ఈ శరీరంలోకి వచ్చారని ఆత్మకు తెలుస్తుంది. మనకు తెలుసు, గుర్తిస్తాము. శివబాబా మళ్ళీ బ్రహ్మాలోకి ప్రవేశించి మనకు వేద-శాస్త్రాల సారాన్ని మరియు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేసి, త్రికాలదర్శులుగా తయారుచేస్తున్నారు. స్వదర్శన చక్రధారులనే త్రికాలదర్శులని అంటారు. విష్ణువుకు ఈ చక్రాన్ని ఇస్తారు. బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. దేవతల ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. మీ శరీరమైతే వికారాలతో తయారయ్యింది కదా. అంతిమంలోనైతే మీ ఆత్మ పవిత్రమవుతుంది, కానీ శరీరమైతే పతితమైనది కదా. అందుకే మీకు స్వదర్శన చక్రాన్ని ఇవ్వలేరు. మీరు సంపూర్ణులుగా అవుతారు, అప్పుడు విష్ణువు యొక్క విజయమాలగా అవుతారు. రుద్రమాల మరియు ఆ తర్వాత విష్ణుమాల. రుద్రమాల నిరాకారీ మరియు వారు ఎప్పుడైతే సాకారంలో రాజ్యం చేస్తారో, అప్పుడు మాల తయారవుతుంది. ఇవన్నీ విషయాలు మీకిప్పుడు తెలుసు, పతిత పావనా రండి అని పాడుతారు కూడా, అంటే తప్పకుండా వారు ఒక్కరే అయినట్లు కదా. పతితులందరినీ పావనంగా చేసేవారు ఒక్క తండ్రే, కావున పతితపావనుడు, అత్యంత ప్రియమైన నిరాకారి గాడ్ ఫాదర్. వారు పెద్ద తండ్రి. చిన్న బాబానైతే అందరూ బాబా-బాబా అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే దుఃఖం కలుగుతుందో, అప్పుడు పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మొట్టమొదట ఈ విషయం అర్థం చేయించాలి, పరమపిత పరమాత్మతో మీకున్న సంబంధమేమిటి? శివజయంతినైతే జరుపుకుంటారు. నిరాకార పరమపిత పరమాత్ముని మహిమ చాలా గొప్పది. ఎంత పెద్ద పరీక్ష అయితే, అంత పెద్ద టైటిల్ లభిస్తుంది కదా. బాబా యొక్క టైటిల్ అయితే చాలా పెద్దది. దేవతల మహిమ అయితే సామాన్యమైనది. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు... కామ ఖడ్గాన్ని నడిపించి ఒకరికొకరు ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తారు, ఇది పెద్ద హింస. ఇది చాలా పెద్ద హింస. ఇప్పుడు మీరు డబుల్ అహింసకులుగా అవ్వాలి.

భగవానువాచ - ఓ పిల్లలూ, మీరు ఆత్మలు, నేను పరమాత్మను. మీరు 63 జన్మలు విషయ సాగరంలో ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకువెళ్తాను. ఇకపోతే చివర్లో ఉన్న ఈ కొద్ది సమయము కోసం మీరు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి. ఇదైతే మంచి మతం కదా. ముమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు కూడా. పావనాత్మలు ముక్తిలో ఉంటారు. సత్యయుగంలో జీవన్ముక్తి ఉంటుంది. తండ్రి అంటారు, ఒకవేళ సూర్యవంశీయులుగా అవ్వాలంటే పూర్తి పురుషార్థం చేయండి. నన్ను స్మృతి చేయండి మరియు ఇతరుల చేత స్మృతి చేయించండి. ఎంతెంతగా స్వదర్శన చక్రధారులుగా అవుతారో మరియు తయారుచేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు చూడండి, ఈ ప్రేమ్ బచ్చీ డెహ్రాడూన్ లో ఉంటారు. ఇంతమంది డెహరాడూన్ నివాసులంతా స్వదర్శన చక్రధారులుగా ఉండేవారు కాదు. వారంతా ఎలా తయారయ్యారు? ప్రేమ్ బచ్చీ తమ సమానంగా తయారుచేసారు. అలా తమ సమానంగా తయారుచేస్తూ-చేస్తూ దైవీ వృక్షం వృద్ధి చెందుతుంది. అంధులను నేత్రవంతులుగా చేసే పురుషార్థం చేయాలి కదా. 8 గంటలైతే మీకు అనుమతి ఉంది. శరీర నిర్వహణార్థం వ్యాపారము మొదలైనవి చేయాలి. ఎక్కడికైనా వెళ్ళండి, ప్రయత్నం చేసి నన్ను స్మృతి చేయండి. ఎంతగా మీరు బాబాను స్మృతి చేస్తారో అంతగా మీరు మొత్తం సృష్టికి శాంతి యొక్క దానాన్ని ఇస్తారు. యోగం ద్వారా శాంతి యొక్క దానమివ్వడం కష్టమేమీ కాదు. అవును, అప్పుడప్పుడు యోగంలో కూర్చోబెట్టడం జరుగుతుంది ఎందుకంటే సంగఠన యొక్క బలము జమ అవుతుంది. బాబా అర్థం చేయించారు - శివబాబాను స్మృతి చేసి వారికి చెప్పండి - బాబా, వీరు మన కులానికి చెందినవారు, వీరి బుద్ధి తాళాన్ని తెరవండి. ఇది కూడా స్మృతి చేసేందుకు యుక్తి. నడుస్తూ-తిరుగుతూ శివబాబా స్మృతి ఉండేలా తమ అభ్యాసాన్ని పెట్టుకోవాలి. బాబా, వీరిని ఆశీర్వదించండి. ఆశీర్వదించే దయాహృదయుడైతే ఒక్క బాబానే. ఓ భగవంతుడా, వీరిపై దయ చూపించండి. భగవంతుడినే అంటారు కదా. వారు మర్సీఫుల్, నాలెడ్జ్ ఫుల్, బ్లిస్ ఫుల్. పవిత్రతలో కూడా ఫుల్, ప్రేమలో కూడా ఫుల్ గా ఉన్నారు. కావున బ్రాహ్మణ కులభూషణులకు కూడా పరస్పరంలో ఎంత ప్రేమ ఉండాలి. ఎవ్వరికీ దుఃఖమివ్వకూడదు. అక్కడ జంతువులు మొదలైనవి కూడా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వవు. పిల్లలైన మీరు ఇంట్లో ఉంటూ, చిన్న విషయంలో సోదరులు పరస్పరంలో కొట్లాడుకుంటారు. అక్కడైతే జంతువులు మొదలైనవి కూడా కొట్లాడుకోవు. మీరు కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకపోయినట్లైతే, తండ్రి అంటారు - మీరు చాలా శిక్షలు అనుభవిస్తారు, పదవి భ్రష్టమైపోతుంది. శిక్షకు యోగ్యులుగా మనమెందుకు అవ్వాలి! పాస్ విత్ ఆనర్ అవ్వాలి కదా. మున్ముందు బాబా అన్ని సాక్షాత్కారాలు చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు కొద్ది సమయము ఉంది, అందుకే త్వరగా చేస్తూ ఉండండి. వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారితో కూడా అందరూ రామ-రామ అనండి అని అంటారు కదా. లోపల నుండి కూడా అంటారు. చివర్లో కూడా కొంతమంది చాలా వేగంగా వెళ్తారు. శ్రమ చేసి ముందుకు వెళ్ళిపోతారు. మీరు చాలా అద్భుతాలను చూస్తూ ఉంటారు. నాటకం చివర్లో అద్భుతమైన పాత్ర ఉంటుంది కదా. చివర్లోనే వాహ్-వాహ్ జరుగుతుంది, ఆ సమయంలోనైతే చాలా సంతోషంగా ఉంటారు. ఎవరిలోనైతే ఈ జ్ఞానం ఉండదో, వారైతే అక్కడే స్పృహ కోల్పోతారు. ఆపరేషన్ మొదలైనవి జరిగే సమయంలో డాక్టర్లు బలహీనంగా ఉన్నవారిని నిలబడనివ్వరు. విభజన జరిగినప్పుడు ఏం అయ్యిందో అందరూ చూసారు కదా! అదైతే చాలా బాధాకరమైన సమయము. దీనిని అనవసరమైన రక్తపాతమని అంటారు. దీనిని చూడడానికి చాలా ధైర్యం కావాలి. మీది 84 జన్మల కథ. దేవీ-దేవతలమైన మనమే రాజ్యం చేసేవారము. తర్వాత మాయకు వశమై వామ మార్గంలోకి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు దేవతలుగా అవుతాము. ఇది స్మరణ చేస్తూ ఉన్నా కూడా నావ తీరానికి చేరుకుంటుంది. ఇదే స్వదర్శన చక్రము కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా సర్వ గుణాలలో ఫుల్ గా అవ్వాలి. పరస్పరంలో చాలా ప్రేమగా ఉండాలి. ఎప్పుడూ ఎవరికీ కూడా దుఃఖమివ్వకూడదు.

2. నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. స్మృతిలో ఉంటూ మొత్తం విశ్వానికి శాంతి యొక్క దానాన్ని ఇవ్వాలి.

వరదానము:-

జ్ఞానం యొక్క రహస్యాలను అర్థం చేసుకుని సదా అచలంగా ఉండే నిశ్చయబుద్ధి, విఘ్న-వినాశక భవ

విఘ్న-వినాశక స్థితిలో స్థితులై ఉండడం వలన ఎంత పెద్ద విఘ్నమైనా కూడా ఆట వలె అనుభవమవుతుంది. ఆటగా భావించిన కారణంగా విఘ్నాలకు ఎప్పుడూ గాభరాపడరు కానీ సంతోషంగా విజయులుగా అవుతారు మరియు డబల్ లైట్ గా ఉంటారు. డ్రామా జ్ఞానం యొక్క స్మృతి ద్వారా ప్రతి విఘ్నము నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అని అనిపిస్తుంది. కొత్త విషయమని అనిపించదు, చాలా పాత విషయమని అనిపిస్తుంది. అనేకసార్లు విజయులుగా అయ్యాము - ఇటువంటి నిశ్చయబుద్ధి, జ్ఞానం యొక్క రహాస్యాలను అర్థం చేసుకునే పిల్లల స్మృతిచిహ్నంగా అచల్ ఘర్ ఉంది.

స్లోగన్:-

దృఢతా శక్తి తోడుగా ఉన్నట్లయితే సఫలత మెడలో హారంగా అవుతుంది.

మాతేశ్వరి గారి అముల్యమైన మహావాక్యాలు

మనం ఏవైతే మంచి లేదా చెడు కర్మలు చేస్తామో, వాటి ఫలం తప్పకుండా లభిస్తుంది. ఎవరైనా దాన-పుణ్యాలు చేసినా, యజ్ఞాలు-హోమాలు చేసినా, పూజలు చేసినా, అప్పుడు వారు - మేము ఈశ్వరుని కోసం ఏదైతే దానం చేసామో, అది పరమాత్మ దర్బారులో నమోదు అవుతుంది అని భావిస్తారు. ఎప్పుడైతే మేము మరణిస్తామో, అప్పుడు ఆ ఫలము తప్పకుండా లభిస్తుంది మరియు మాకు ముక్తి లభిస్తుంది, కానీ ఇదైతే మనం తెలుసుకున్నాము, ఇలా చేయడం ద్వారా సదా కాలం కోసమేమీ లాభముండదు. ఎలాంటి కర్మలు మనం చేస్తామో, దాని ద్వారా అల్పకాలిక క్షణభంగుర సుఖం యొక్క ప్రాప్తి తప్పకుండా ఉంటుంది. కానీ ఎప్పటివరకైతే ఈ ప్రాక్టికల్ జీవితము సదా సుఖమయంగా అవ్వదో, అప్పటివరకు దాని రిటర్న్ లభించలేదు. ఏదైతే మీరు చేస్తూ వచ్చారో అది చేయడం ద్వారా మీకు పూర్తి లాభం కలింగిందా? అని మనం ఎవరినైనా అడిగితే, వారి వద్ద దీనికి ఎటువంటి జవాబు ఉండదు. ఇప్పుడు పరమాత్మ వద్ద నమోదు అయ్యిందా లేదా అని మనకేమి తెలుసు? ఎప్పటివరకైతే తమ ప్రాక్టికల్ జీవితంలో కర్మలు శ్రేష్ఠంగా అవ్వవో, అప్పటివరకు ఎంతగా శ్రమించినా కూడా ముక్తి-జీవన్ముక్తి ప్రాప్తించవు. అచ్ఛా, దాన-పుణ్యాలు చేసారు, కానీ అవి చేయడం ద్వారా వికర్మలేవీ భస్మమవ్వలేదు, మరి ముక్తి-జీవన్ముక్తి ఎలా ప్రాప్తిస్తాయి. ఇంతమంది సాధువులు, మహాత్ములు అయితే ఉన్నారు, కానీ ఎప్పటివరకైతే వారికి కర్మల జ్ఞానం ఉండదో, అప్పటివరకు ఆ కర్మలు అకర్మలుగా అవ్వలేవు, ముక్తి-జీవన్ముక్తిని వారు ప్రాప్తి చేసుకోరు. సత్య ధర్మమేమిటి మరియు సత్-కర్మ ఏమిటి అనేది వారికి కూడా తెలియదు, కేవలం నోటి ద్వారా రామ-రామ అని అనడము, దీని ద్వారా ఎటువంటి ముక్తి కలగదు. ఇకపోతే, మరణించిన తర్వాత మాకు ముక్తి కలుగుతుంది అని అనుకుని కూర్చోవాలి. మరణించిన తర్వాత ఏం లాభం లభిస్తుంది అనేది వారికి తెలియనే తెలియదు. ఏమీ లభించదు. ఇకపోతే మనుష్యులు తమ జీవితంలో చెడు కర్మలు చేసినా, మంచి కర్మలు చేసినా, అవి కూడా ఈ జీవితంలోనే అనుభవించాలి. ఏ విధంగా శుద్ధ కర్మలు చేసి తమ ప్రాక్టికల్ జీవితాన్ని తయారుచేసుకోవాలి అనే జ్ఞానమంతా ఇప్పుడు మనకు పరమాత్మ టీచరు ద్వారా లభిస్తుంది. అచ్ఛా. ఓం శాంతి.