14-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఆత్మ ప్రవేశించినప్పుడే ఈ శరీరానికి విలువ ఉంటుంది, అలంకరణ శరీరానికే జరుగుతుంది కానీ ఆత్మకు కాదు"

ప్రశ్న:-

పిల్లలైన మీ బాధ్యత ఏమిటి? మీరు ఎటువంటి సేవను చేయాలి?

జవాబు:-

మీ తోటివారికి నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారయ్యే యుక్తిని తెలియజేయడం - మీ బాధ్యత. ఇప్పుడు మీరు భారత్ కు సత్యమైన ఆత్మిక సేవ చేయాలి. మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభించింది కావున మీ బుద్ధి మరియు నడవడిక చాలా రిఫైన్ గా ఉండాలి. ఎవరిపట్ల కొద్దిగా కూడా మోహముండకూడదు.

గీతము:-

నయనహీనునికి మార్గము చూపించండి ప్రభూ..... ( నయన్ హీన్ కో రాహ్ దిఖావో.....)

ఓంశాంతి. డబల్ శాంతి. పిల్లలైన మీరు ఓం శాంతి అని బదులు చెప్పాలి. మన స్వధర్మము శాంతి. మీరిప్పుడు శాంతి కోసం ఎక్కడకీ వెళ్ళరు. మనుష్యులు మనశ్శాంతి కోసం సాధు-సన్యాసుల వద్దకు కూడా వెళ్తారు కదా. ఇప్పుడు మనసు-బుద్ధి అయితే ఆత్మ యొక్క ఇంద్రియాలు. ఏ విధంగా ఈ శరీరంలో ఇంద్రియాలున్నాయో, అదే విధంగా మనసు, బుద్ధి మరియు చక్షువులు ఉన్నాయి. ఇప్పుడు ఈ చక్షువులు ఈ నయనాల వంటివి కావు. నయనహీనునికి మార్గం చూపించండి ప్రభూ అని అంటారు. ఇప్పుడు ప్రభు లేక ఈశ్వరుడు అని అన్నప్పుడు తండ్రి ప్రేమ అంతగా కలుగదు. తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. చదువుకుంటారు కూడా. మిమ్మల్ని ఎవరు చదివిస్తారు? పరమాత్మ లేక ప్రభువు చదివిస్తారు అని ఈ విధంగా మీరు అనరు. శివబాబా చదివిస్తారని మీరు అంటారు. బాబా అన్న పదమైతే చాలా సాధారణమైనది. బాప్ దాదాలు ఉన్నారు. ఆత్మను ఆత్మ అనే అంటారు, అలాగే వారు పరమ ఆత్మ. నేను పరమ ఆత్మను అంటే పరమాత్మను, మీ తండ్రిని. మళ్ళీ డ్రామానుసారంగా పరమ ఆత్మనైన నాకు శివ అన్న పేరు పెట్టడం జరిగింది. డ్రామాలో అందరికీ పేరు కూడా ఉండాలి కదా. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. భక్తిమార్గం వారైతే ఒక పేరుకు బదులుగా అనేక పేర్లు పెట్టేసారు. అలాగే అనేక మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. కాని వారైతే ఒక్కరే. సోమనాథ మందిరము ఎంత పెద్దది, ఎంతగా అలంకరిస్తారు. మహళ్ళు మొదలైనవాటిని కూడా ఎంతగా అలంకరిస్తారు. ఆత్మకైతే ఎటువంటి అలంకరణ లేదు, అలాగే పరమాత్మకు కూడా అలంకరణ లేదు. వారు ఒక బిందువు. అలంకరణంతా శరీరాలకే ఉంటుంది. నాకు గానీ, ఆత్మలకు గానీ అలంకరణ ఉండదు అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ ఒక బిందువే. ఇంత చిన్న బిందువు తనకు తానుగా ఎటువంటి పాత్రనూ అభినయించలేదు. ఆ చిన్న ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు, శరీరాన్ని ఎన్ని రకాలుగా అలంకరిస్తారు. మనుష్యులకు ఎన్ని పేర్లున్నాయి. రాజా-రాణుల అలంకరణ ఎలా జరుగుతుంది, ఆత్మ అయితే సాధారణమైన బిందువే. ఇప్పుడు పిల్లలైన మీరు ఇది కూడా అర్థము చేసుకున్నారు. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. నాలో కూడా జ్ఞానముంది కదా అని తండ్రి చెప్తున్నారు. శరీరంలో అయితే జ్ఞానముండదు. ఆత్మనైన నాలో జ్ఞానముంది, మీకు వినిపించేందుకు ఈ శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. శరీరం లేకుండానైతే మీరు వినలేరు. నయనహీనునికి మార్గం చూపించండి.... అన్న ఈ పాటను ఇప్పుడు తయారుచేశారు, అంటే శరీరానికి మార్గాన్ని చూపించాలా? లేదు. ఆత్మకు చూపించాలి. ఆత్మయే పిలుస్తుంది. శరీరానికైతే రెండు నేత్రాలున్నాయి. మూడు నేత్రాలైతే ఉండవు. మూడవ నేత్రానికి గుర్తుగా ఇక్కడ (మస్తకంలో) తిలకమును కూడా పెడతారు. కొందరు కేవలం బిందవులా పెడతారు, కొందరు గీతను పెడతారు. ఆత్మయే బిందువు. జ్ఞానమనే మూడవ నేత్రము లభిస్తుంది. మొదట ఆత్మకు ఈ జ్ఞానమనే మూడవ నేత్రము ఉండేది కాదు. మనుష్యమాత్రులెవ్వరికీ ఈ జ్ఞానము లేదు, అందుకే జ్ఞాననేత్ర హీనులు అని అంటారు. ఈ నేత్రాలు అయితే అందరికీ ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఎవ్వరికీ ఈ మూడవ నేత్రము లేదు. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు. భక్తిమార్గానికి మరియు జ్ఞానమార్గానికి ఎంత తేడా ఉందో మీకు తెలుసు. మీరు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకుని చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఐ.సి.ఎస్ వారు కూడా చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. కానీ ఇక్కడ చదువు ద్వారా ఎవ్వరూ ఎం.పి మొదలైనవారిగా అవ్వరు. ఇక్కడైతే ఎన్నికలు జరుగుతాయి, ఓట్ల ద్వారా ఎం.పి మొదలైనవారిగా అవుతారు. ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి శ్రీమతం లభిస్తుంది. మేము ఆత్మకు మతమును ఇస్తాము అని ఇంకెవ్వరూ ఇలా అనరు. వారందరూ దేహాభిమానులు. తండ్రియే వచ్చి దేహీ-అభిమానులుగా అవ్వడం నేర్పిస్తారు. అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. మనుష్యులు శరీర అలంకరణను ఎంతగా చేసుకుంటారు. ఇక్కడైతే తండ్రి ఆత్మలనే చూస్తారు. శరీరమైతే వినాశీ, పైసా అంత విలువ కూడా లేనిది. జంతువులకైతే చర్మం మొదలైనవి అమ్ముడుపోతాయి. మనుష్యుల శరీరమైతే ఎందుకూ పనికిరాదు. ఇప్పుడు తండ్రి వచ్చి విలువైనవారిగా తయారుచేస్తారు.

ఇప్పుడు మనమే దేవతలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు, కావున ఈ నషా ఎక్కి ఉండాలి. కానీ ఈ నషా కూడా నంబరువారు పురుషార్థానుసారంగానే ఉంటుంది. ధనం యొక్క నషా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. మీ సంపాదన ఎంతగానో జరుగుతుంది. మీ మహిమ కూడా అనేక రకాలుగా ఉంటుంది. మీరు పుష్పాల తోటను తయారుచేస్తారు. సత్యయుగాన్ని పుష్పాలతోట అని అంటారు. దీని అంటు ఎప్పుడు కట్టబడుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. మీకు తండ్రి అర్థం చేయిస్తారు. ఓ తోటయజమాని, రండి అని కూడా పిలుస్తారు. వారిని తోటమాలి అని అనరు. సేవాకేంద్రాలను సంభాళించే పిల్లలైన మీరే తోటమాలులు. అనేకరకాలైన తోటమాలులు ఉంటారు. తోట యజమాని అయితే ఒక్కరే. మొగల్ గార్డన్ లోని తోటమాలికి జీతం కూడా ఎక్కువగానే లభిస్తూ ఉండవచ్చు కదా. వారు తోటను ఎంత సుందరంగా తయారుచేస్తారంటే, దానిని చూడడానికి అందరూ వస్తారు. మొగలులు ఎంతో అభిరుచి కలవారిగా ఉంటారు. అతని భార్య మరణిస్తే తాజ్ మహల్ ను నిర్మించారు. వారి పేరు కొనసాగుతూ వస్తుంది. ఎంతో మంచి-మంచి స్మృతిచిహ్నాలను నిర్మించారు. దానితో మనుష్యుల మహిమ ఎంతగా జరుగుతుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. మనుష్యులు మనుష్యులే. యుద్ధాలలో లెక్కలేనంతమంది మరణిస్తారు, తర్వాత ఏం చేస్తారు. కిరోసిన్, పెట్రోలు వేసి తగలబెట్టేస్తారు. కొందరి దేహాలైతే అలాగే పడి ఉంటాయి. పూడ్చిపెట్టరు కూడా. ఎటువంటి గౌరవమూ లేదు. కావున పిల్లలైన మీకిప్పుడు నారాయణీ నషా ఎంతగా ఎక్కి ఉండాలి. ఇది విశ్వానికి యజమానులుగా అయ్యేటటువంటి నషా. సత్యనారాయణ కథ అంటే తప్పకుండా నారాయణునిగానే అవుతారు. ఆత్మకు జ్ఞానమనే మూడవ నేత్రం లభిస్తుంది. ఇచ్చేవారు తండ్రి. మూడవ నేత్రం యొక్క కథ కూడా ఉంది. వీటన్నిటి అర్థాన్ని తండ్రి కూర్చుని తెలియజేస్తున్నారు. కథలను వినిపించేవారికేమీ తెలియదు. అమరకథను కూడా వినిపిస్తారు. అమరనాథుని వద్దకు దూర-దూరాల వరకూ వెళ్తారు. తండ్రి అయితే ఇక్కడకు వచ్చి వినిపిస్తారు. పైన వినిపించరు. అక్కడ కూర్చొని పార్వతికి అమరకథను వినిపించలేదు. ఈ కథలు మొదలైనవి ఏవైతే తయారుచేశారో, ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. మళ్ళీ జరుగుతాయి. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు భక్తికి మరియు జ్ఞానానికి గల తేడాను తెలియజేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. ఓ ప్రభూ, అంధులకు మార్గము చూపించండి అని అంటారు కదా. భక్తిమార్గములో పిలుస్తారు. తండ్రి వచ్చి మూడవ నేత్రాన్నిస్తారు, దీని గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. జ్ఞానమనే మూడవ నేత్రము లేకపోతే ఒంటికన్నువారు, అంధులు అని అంటారు. కళ్ళు కూడా ఒక్కొకరివి ఒక్కోలా ఉంటాయి. కొందరికి చాలా సుందరమైన కళ్ళు ఉంటాయి. కావున వారికి బహుమతి కూడా లభిస్తుంది. మళ్ళీ వారికి మిస్ ఇండియా, మిస్ ఫలానా అని పేరును కూడా పెడతారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేస్తారు. అక్కడైతే సహజ సౌందర్యం ఉంటుంది. కృష్ణుడికి ఇంతటి మహిమ ఎందుకు ఉంది? ఎందుకంటే వారు అందరికన్నా ఎక్కువ సుందరంగా అవుతారు. కర్మాతీత స్థితిని నంబరువన్ లో పొందుతారు, అందుకే నంబరువన్ గా గాయనముంది. ఇది కూడా తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. పిల్లలూ, మన్మనాభవ అని తండ్రి పదే-పదే చెప్తారు. హే ఆత్మలూ, మీ తండ్రిని స్మృతి చేయండి. పిల్లల్లో కూడా నంబరువారుగా ఉన్నారు కదా. ఒకవేళ లౌకిక తండ్రికి కూడా ఐదుగురు పిల్లలుంటే, వారిలో ఎవరైతే చాలా వివేకవంతులుగా ఉంటారో వారిని నంబరువన్ లో పెడతారు. మాలలోని మణులవంటివారు కదా. వీరు రెండవ నంబరు వారు, వీరు మూడవ నంబరు వారు అని అంటారు. ఒకే విధంగా ఎప్పుడూ ఉండరు. తండ్రి ప్రేమ కూడా నంబరువారుగా ఉంటుంది. అది హద్దుకు సంబంధించిన విషయం. ఇది అనంతమైన విషయం.

ఏ పిల్లలకైతే జ్ఞానమనే మూడవ నేత్రము లభించిందో, వారి బుద్ధి మరియు నడవడిక మొదలైనవి చాలా రిఫైన్ గా ఉంటాయి. పుష్పాల రాజు అని ఉంటుంది. ఈ బ్రహ్మా మరియు సరస్వతులు కింగ్ మరియు క్వీన్ ఫ్లవర్ వంటి వారు. జ్ఞానం మరియు స్మృతి రెండింటిలోనూ చురుకుగా ఉన్నారు. మనము దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ముఖ్యంగా 8 రత్నాలు తయారౌతారు. మొట్టమొదట పుష్పముంటుంది. ఆ తర్వాత బ్రహ్మా-సరస్వతులు జంట పూసలుగా ఉంటారు. మాలను స్మరిస్తారు కదా. వాస్తవానికి మీకు పూజ జరగదు, స్మరణ జరుగుతుంది. మీపై పుష్పాలను అర్పించడం జరుగదు. శరీరము కూడా పవిత్రంగా ఉన్నప్పుడే పుష్పాలను అర్పిస్తారు. ఇక్కడ ఎవరి శరీరమూ పవిత్రంగా లేదు. అందరూ విషము ద్వారానే జన్మిస్తారు, అందుకే వికారులు అని అంటారు. ఈ లక్ష్మీ-నారాయణులను సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. పిల్లలైతే జన్మిస్తూ ఉంటారు కదా. అలాగని ఏదో ట్యూబ్ ద్వారా పిల్లలు జన్మిస్తారని కాదు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. పిల్లలైన మిమ్మల్ని ఇక్కడ 7 రోజుల భట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. భట్టీలో కొన్ని ఇటుకలు పూర్తిగా కాలి గట్టి పడతాయి, కొన్ని పచ్చిగానే మిగిలిపోతాయి. భట్టీ ఉదాహరణను ఇస్తారు. ఇటుకల భట్టీ శాస్త్రాలలో వర్ణించబడదు. ఇందులో పిల్లి ఉదాహరణ కూడా ఉంది. గులేబకావళి కథలో కూడా పిల్లిని చూపించారు. అది దీపాన్ని ఆర్పివేసేది. మీకు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. మాయా పిల్లి విఘ్నాలను కలిగిస్తుంది. మీ స్థితినే కిందకు పడేస్తుంది. దేహాభిమానము మొట్టమొదటిది, ఆ తర్వాత మిగిలిన వికారాలు వస్తాయి. మోహము కూడా ఎంతో ఉంటుంది. నేను భారత్ ను స్వర్గంగా తయారుచేసే ఆత్మిక సేవ చేస్తాను అని కూతురు అంటే, మోహానికి వశమై తల్లిదండ్రులు మేము అనుమతించము అని అంటారు. ఇది కూడా ఎంతటి మోహము. మీరు మోహము గల పిల్లులుగా అవ్వకూడదు. మీ లక్ష్యమే ఇది. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. మీ తోటివారికి సేవ చేయడం, భారత్ కు సేవ చేయడం మీ బాధ్యత కూడా. మనమెలా ఉండేవారము, ఎలా అయ్యామో మీకు తెలుసు. ఇప్పుడు రాజులకే రాజులుగా అయ్యేందుకు పురుషార్థము చేయండి. మనము మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఇందులో కష్టమైన విషయమేదీ లేదు. వినాశనము కోసం కూడా డ్రామాలో యుక్తి రచించబడి ఉంది. ఇంతకుముందు కూడా మూసలాల (మిస్సైల్స్) యుద్ధము జరిగింది. మీ ఏర్పాట్లు పూర్తైనప్పుడు, అందరూ పుష్పాలుగా అయిపోతారు. అప్పుడు వినాశనం జరుగుతుంది. కొందరు పుష్పాల రాజుగా, కొందరు గులాబీలుగా, కొందరు మల్లెలుగా ఉన్నారు. మేము జిల్లేడు పుష్పాలుగా ఉన్నామా లేక వేరే పుష్పాలుగా ఉన్నామా అని ప్రతి ఒక్కరు తమను తాము బాగా అర్థం చేసుకోగలరు. చాలామందిలో జ్ఞాన ధారణ ఏ మాత్రమూ జరుగదు. నంబరువారుగా అయితే అవుతారు కదా. అయితే పూర్తిగా ఉన్నతోన్నతంగా అవుతారు లేకపోతే చాలా సాధారణంగా అవుతారు. రాజధాని ఇక్కడే తయారౌతుంది. పాండవులు కరిగి మరణించారని శాస్త్రాలలో చూపించారు, ఆ తర్వాత ఏమయింది అన్నది ఏమీ తెలియదు. కథలైతే ఎన్నో తయారుచేశారు కానీ అటువంటి విషయమేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత స్వచ్ఛ బుద్ధి కలవారిగా అవుతున్నారు. బాబా మీకు అనేక రకాలుగా అర్థము చేయిస్తూ ఉంటారు. ఇది ఎంత సహజమైనది. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. నేనే పతిత-పావనుడిని అని తండ్రి చెప్తున్నారు. మీ ఆత్మ మరియు శరీరము రెండూ పతితంగా ఉన్నాయి. ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రంగా అవుతుంది. ఇప్పుడు మీరు చాలా శ్రమ చేయాలి. పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు, స్మృతిని మర్చిపోతున్నారు అని తండ్రి చెప్తున్నారు. బాబా స్వయంగా తమ అనుభవాన్ని తెలియజేస్తారు. భోజనము చేసేటప్పుడు శివబాబా నాకు తినిపిస్తున్నారు అని స్మృతి చేస్తాను, మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ గుర్తుకొస్తుంది. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు. కొందరైతే బంధనముక్తులుగా ఉంటూ కూడా మళ్ళీ చిక్కుకుని మరణిస్తారు. పిల్లలను దత్తత కూడా తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రమును ఇచ్చే తండ్రి లభించారు - దీనికి తీజరీ కథ అనగా మూడవ నేత్రము యొక్క కథ అన్న పేరును పెట్టారు. ఇప్పుడు మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు. తండ్రి బిందువు అని పిల్లలకు తెలుసు. వారు జ్ఞానసాగరుడు. వారు నామ-రూపాలకు అతీతమైనవారు అని అంటారు. అరే, జ్ఞాన సాగరుడు తప్పకుండా జ్ఞానాన్ని వినిపించేవారై ఉంటారు కదా. వారిని లింగం రూపములో చూపిస్తారు. మరి అటువంటప్పుడు వారిని నామ-రూపాలకు అతీతమైనవారు అని ఎలా అంటారు! లెక్కలేనన్ని పేర్లు పెట్టేశారు. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానమంతా మంచి రీతిలో ఉండాలి. పరమాత్మను జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. మొత్తం అడవినంతా కలముగా చేసినా కూడా సమాప్తమవ్వదు . అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు మేము తండ్రి ద్వారా ఎంతో విలువైనవారిగా అయ్యాము, మేమే దేవతలుగా అవ్వనున్నాము అని ఇదే నారాయణీ నషాలో ఉండాలి, బంధన-ముక్తులుగా అయ్యి సేవను చేయాలి. బంధనాలలో చిక్కుకోకూడదు.

2. జ్ఞాన-యోగాలలో చురుకుగా అయ్యి మాతాపితల సమానంగా పుష్పాల రాజుగా అవ్వాలి మరియు మీ తోటివారికి కూడా సేవ చేయాలి.

వరదానము:-

ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నల వల నుండి సదా ముక్తులుగా ఉండే విశ్వ సేవాధారీ చక్రవర్తీ భవ

ఎప్పుడైతే స్వదర్శన చక్రము సరైన దిశలో తిరిగేందుకు బదులుగా వ్యతిరేక దిశలో తిరుగుతుందో, అప్పుడు మాయాజీతులుగా అయ్యేందుకు బదులుగా పరదర్శన యొక్క చిక్కుల చక్రములోకి వచ్చేస్తారు. దీని ద్వారా ఎందుకు మరియు ఏమిటి అన్న ప్రశ్నల వల తయారవుతుంది. దీనిని స్వయమే రచిస్తారు, మళ్ళీ అందులో స్వయమే చిక్కుకుపోతారు. కావున జ్ఞానస్వరూపులుగా అయి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నల వల నుండి ముక్తులై యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా, చక్రవర్తులుగా అయి తండ్రితో పాటు విశ్వకళ్యాణపు సేవలో తిరుగుతూ ఉంటారు. విశ్వ సేవాధారి, చక్రవర్తీ రాజులుగా అయిపోతారు.

స్లోగన్:-

ప్లెయిన్ బుద్ధితో ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చినట్లయితే అందులో సఫలత ఇమిడి ఉంటుంది.