14-10-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - యోగబలంతో వికారాల రూపీ రావణునిపై విజయం ప్రాప్తించుకొని, సత్యాతి-సత్యమైన దసరాను జరుపుకోండి

ప్రశ్న:-

రామాయణానికి మరియు మహాభారతానికి పరస్పరంలో ఏ సంబంధముంది? దసరా ఏ విషయాన్ని నిరూపిస్తుంది?

జవాబు:-

దసరా జరుపుకోవడం అనగా రావణుడు సమాప్తమవ్వడము మరియు సీతలకు విముక్తి లభించడము. కానీ కేవలం దసరాను జరుపుకోవడం వల్ల రావణుని నుండి విముక్తి లభించదు. మహాభారతం జరిగినప్పుడు సీతలందరికీ విముక్తి లభిస్తుంది. మహాభారత యుద్ధంతో రావణ రాజ్యం సమాప్తమవుతుంది, కనుక రామాయణం, మహాభారతం మరియు గీతకు పరస్పరంలో చాలా సమీప సంబంధముంది.

గీతము:-
సభలో జ్యోతి వెలిగింది... (మెహఫిల్ మే జల్ ఉఠీ షమా...)

ఓంశాంతి.

తండ్రి చెప్తున్నారు - మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారు, ఇప్పుడు మిమ్మల్ని దైవీ సంప్రదాయానికి చెందినవారని అనలేము. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారు, తర్వాత దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతారు. ఈ రోజున (దసరా రోజున) వీరు రామాయణం పూర్తి అవ్వనున్నట్లుగా భావిస్తారు, కానీ నిజానికి అది పూర్తి అవ్వదు. ఒకవేళ రావణుడు మరణిస్తే, రామాయణ కథ పూర్తవ్వాలి కానీ అలా జరగదు. మహాభారతంతోనే విముక్తి లభిస్తుంది. ఇప్పుడు, ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. రామాయణం ఏమిటి మరియు మహాభారతం ఏమిటి? ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. రామాయణం మరియు మహాభారతం - ఈ రెండింటికీ కనెక్షన్ ఉంది. మహాభారత యుద్ధంతో రావణ రాజ్యం సమాప్తమవుతుంది. అప్పుడిక, ఈ దసరా మొదలైనవి జరుపుకోవడమనేది ఉండదు. గీత మరియు మహాభారతం కూడా రావణ రాజ్యాన్ని సమాప్తం చేస్తాయి. ఇప్పుడింకా సమయముంది, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి - అది హింసాత్మకమైనది, మీది అహింసాత్మకమైనది. మీది గీత, మీరు గీతా జ్ఞానాన్ని వింటారు. దానితో ఏమి జరగనున్నది? రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నది. వారు రావణుడిని హతమారుస్తారు కానీ దాని వల్ల రామ రాజ్యమైతే రాదు. ఇప్పుడు రామాయణం మరియు మహాభారతం ఉన్నాయి కదా. మహాభారతము, రావణుడిని సమాప్తం చేసేందుకు ఉంది. ఇవి చాలా గుహ్యమైన, అర్థం చేసుకోవాల్సిన విషయాలు, దీని కోసం విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి అర్థం చేయిస్తారు - మహాభారత యుద్ధంలో రావణ రాజ్యం సమాప్తమవుతుంది, అంతేకానీ కేవలం రావణుడిని హతమారిస్తే రావణ రాజ్యం సమాప్తమవుతుందని కాదు. దాని కోసం సంగమం కావాలి. ఇప్పుడిది సంగమము. ఇప్పుడు మీరు రావణునిపై విజయం పొందేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీని కోసం జ్ఞానం యొక్క అస్త్ర-శస్త్రాలు కావాలే కానీ స్థూలమైనవి కావు. రావణుడికి మరియు రాముడికి మధ్యన యుద్ధం జరిగినట్లుగా చూపిస్తారు. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. ఇప్పుడు మీరు యోగబలంతో రావణ రాజ్యంపై విజయాన్ని పొందుతారు. ఇది గుప్తమైన విషయము. మీకు 5 వికారాల రూపీ రావణునిపై విజయం లభిస్తుంది. దేని ద్వారా? గీత ద్వారా. బాబా మీకు గీతను వినిపిస్తున్నారు. ఇది భాగవతం కాదు. భాగవతంలో కృష్ణుని చరిత్రను చూపిస్తారు. కృష్ణ చరిత్ర అంటూ ఏమీ లేదు. వినాశనం జరిగినప్పుడు, మహాభారీ యుద్ధం జరుగుతుందని, దాని ద్వారానే రావణ రాజ్యం సమాప్తమవుతుందని మీకు తెలుసు. మెట్ల చిత్రంలో కూడా చూపించడం జరిగింది. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి భక్తి మార్గం ప్రారంభమయింది. ఇది మీకు మాత్రమే తెలుసు. గీతకు, మహాభారత యుద్ధంతో కనెక్షన్ ఉంది. మీరు గీతను విని రాజ్యాన్ని పొందుతారు మరియు ఈ ప్రపంచమంతటినీ శుభ్రం చేసేందుకే యుద్ధం జరుగుతుంది. ఇకపోతే, భాగవతంలో చూపించిన చరిత్రలు మొదలైనవన్నీ వ్యర్థమైనవే. శివ పురాణంలో ఏమీ లేదు, లేదంటే గీతకు శివ పురాణం అనే పేరు ఉండాలి. శివబాబా కూర్చొని - అన్నింటికన్నా ఉన్నతమైనది గీత అనే జ్ఞానాన్ని ఇస్తారు. గీత అన్ని శాస్త్రాల కన్నా చిన్నది, మిగిలిన పుస్తకాలన్నీ చాలా పెద్దవిగా తయారుచేసారు. మనుష్యుల జీవిత కథలను కూడా చాలా పెద్దవిగా తయారుచేసారు. నెహ్రూ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, వారి గురించి ఎంత పెద్ద-పెద్ద పుస్తకాలను తయారుచేసారు. శివబాబా చెప్పే ఈ గీత ఎంత పెద్దదిగా ఉండాలి. కానీ గీత ఎంతో చిన్నది, ఎందుకంటే తండ్రి కేవలం ఒక్క విషయాన్నే వినిపిస్తారు - నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు చక్రాన్ని అర్థం చేసుకోండి, అంతే. అందుకే గీతను చిన్నదిగా తయారుచేసారు. ఇది కంఠస్థం చేయాల్సిన జ్ఞానము. గీతను లాకెట్ లా తయారుచేస్తారని మీకు తెలుసు. అందులో చాలా చిన్న అక్షరాలుంటాయి. ఇప్పుడు బాబా కూడా మీ మెడలో - త్రిమూర్తి మరియు రాజ్యాధికారం యొక్క లాకెట్ ను ధరింపజేస్తారు. బాబా అంటారు - గీత అంటే రెండు పదాలు - అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (రాజ్యాధికారం). ఇది మన్మనాభవ అనే గుప్తమైన మంత్రం యొక్క లాకెట్. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. యోగబలంతో విజయం పొందడం మీ కర్తవ్యము, తర్వాత మీ కోసం శుభ్రత కూడా ఉండాలి. మీ యోగబలంతోనే రావణ రాజ్య వినాశనం జరగనున్నది అని తండ్రి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యం ఎప్పుడు మొదలయిందో కూడా ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానం చాలా సహజమైనది. ఇది సెకెండు యొక్క విషయం కదా. 84 జన్మల మెట్ల చిత్రంలో కూడా ఇన్ని జన్మలు తీసుకున్నారు అన్నది చూపించారు, ఇది ఎంత సహజము. తండ్రి జ్ఞానసాగరుడు. వారు జ్ఞానం వినిపిస్తూనే ఉంటారు. మీరు మురళీ కాగితాలన్నింటినీ పోగు చేస్తే, లెక్కలేనన్ని అవుతాయి. తండ్రి వివరంగా అర్థం చేయిస్తారు. సారంలో - అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేయండి అని చెప్తారు. మరి మిగిలిన సమయాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? మీ తలపైన పాపాల భారం చాలా ఉంది. దానిని స్మృతి ద్వారానే తొలగించుకోవాలి, ఇందులో శ్రమ అనిపిస్తుంది. మీరు పదే-పదే మర్చిపోతూ ఉంటారు. మీరు బాబాను స్మృతి చేస్తూ ఉంటే, ఎప్పుడూ విఘ్నాలు కలగవు. దేహాభిమానులుగా అవ్వడంతో విఘ్నాలు కలుగుతాయి. చివర్లో దేహీ-అభిమానులుగా అవుతారు. ఇక తర్వాత, అర్ధకల్పం వరకు ఏ విఘ్నాలు కలగవు. ఇవి ఎంతగానో అర్థం చేసుకోవాల్సిన, గుహ్యమైన విషయాలు. ప్రారంభం నుండి ఎంతో వినిపిస్తూ వచ్చారు, అయినా మళ్ళీ - కేవలం అల్ఫ్ (భగవంతుడిని) మరియు బే (వారసత్వాన్ని) స్మృతి చేయండి అని చెప్తున్నారు. అంతే. వృక్షం అనేది విస్తారము. బీజం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ బీజం నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది.

ఈ రోజు దసరా కదా. రామాయణానికి, మహాభారతానికి మధ్యన ఏ సంబంధముంది అనేది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. రామాయణం భక్తి మార్గానికి సంబంధించినది. అర్ధకల్పం నుండి కొనసాగుతూ వస్తుంది, అనగా ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తుంది. తర్వాత, మహాభారతం వచ్చిందంటే రావణ రాజ్యం సమాప్తమై రామ రాజ్యం మొదలవుతుంది. రామాయణానికి మరియు మహాభారతానికి మధ్యన ఏమి తేడా ఉంది? రామ రాజ్య స్థాపన మరియు రావణ రాజ్య వినాశనం జరగనున్నది. గీతను విని మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు యోగ్యులుగా తయారవుతారు. గీత మరియు మహాభారతం కూడా ఈ సమయానికి చెందినవే, ఇవి రావణ రాజ్యం సమాప్తమయ్యేందుకు ఉన్నాయి. ఇకపోతే, వారు ఏ యుద్ధాన్ని అయితే చూపించారో, అది తప్పు. ఇది 5 వికారాలపై విజయం పొందేటువంటి యుద్ధము. తండ్రి మీకు గీత యొక్క రెండు పదాలను వినిపిస్తారు - మన్మనాభవ, మధ్యాజీభవ. గీత ప్రారంభంలో మరియు చివర్లో ఈ రెండు పదాలు వస్తాయి. ఇప్పుడు నిజంగా గీతా ఎపిసోడ్ జరుగుతుందని పిల్లలు అర్థం చేసుకుంటారు. కానీ ఎవరికైనా చెప్తే, కృష్ణుడు ఎక్కడ ఉన్నారని అడుగుతారు. బాబా అర్థం చేయించినదానికి మరియు భక్తి మార్గపు శాస్త్రాలకు మధ్యన ఎంత తేడా ఉంది. ఈ రామాయణం ఏమిటి, మహాభారతం ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు, మహాభారత యుద్ధం తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. కానీ మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోరు, అందుకే మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వండి. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి ఈ మాటను మొత్తం ప్రపంచానికి చెప్తారు. ఒక్క గీతను మాత్రమే ఖండించారు. గీత అన్ని భాషలలోనూ ప్రాచుర్యం పొందింది. మీ రాజ్యంలో ఒకే భాష ఉంటుంది. అక్కడ శాస్త్రాలు, పుస్తకాలు మొదలైనవేవీ ఉండవు. అక్కడ భక్తి మార్గానికి చెందిన విషయాలేవీ ఉండవు. భారత్ కు రామాయణము, మహాభారతము మరియు గీతతోనే సంబంధముంది. భగవంతుడు పిల్లలకు గీతను వినిపిస్తారు, దీని ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మహాభారత యుద్ధం తప్పకుండా జరగాలి, దాని ద్వారా పతిత ప్రపంచం సమాప్తమవుతుంది. గీత ద్వారా మీరు పావనంగా అవుతారు. పతితపావనుడైన భగవంతుడు అంతిమంలోనే వస్తారు. వారు అంటారు - కామం మహాశత్రువు, దీనిపై విజయం పొందాలి. కామ వికారంతో ఎప్పుడూ ఓడిపోకూడదు, దీని వలన చాలా నష్టం కలుగుతుంది. వికారాల వెనుక చాలా గొప్ప-గొప్ప పేరు-ప్రఖ్యాతులున్న మినిస్టర్లు మొదలైనవారు కూడా తమ పేరును అప్రతిష్ఠపాలు చేసుకుంటారు. కామం వెనుక పడి చాలా పాడైపోతారు, అందుకే తండ్రి అర్థం చేయిస్తారు - బాబా వద్దకు యవ్వనంలో ఉన్న పిల్లలు వస్తారు. బ్రహ్మచర్యంలో ఉండేవారు చాలామంది ఉన్నారు. వారు మొత్తం జీవితాంతం వివాహం చేసుకోరు. స్త్రీలు కూడా ఉంటారు. నన్స్ ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరు. కానీ దాని వల్ల ప్రాప్తి ఏమి లేదు. ఇక్కడ పవిత్రంగా అయి, జన్మ-జన్మలకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. జన్మ-జన్మల పాపాల భారం తలపై ఉంది. అది తొలగినప్పుడు స్వర్గంలోకి వెళ్లగలుగుతారు. ఇక్కడ మనుష్యులు పాపాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఒక్క జన్మ కోసం సన్యాసిగా మారినా, వారి జన్మ అయితే వికారాలతోనే జరిగింది కదా. రావణ రాజ్యంలో వికారాలు లేకుండా జన్మ జరగదు. స్వర్గంలో జన్మ ఎలా జరుగుతుంది, యోగబలం అని దేనిని అంటారు అని అడుగుతూ ఉంటారు. ఇలా అడగాల్సిన అవసరమే లేదు. అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. అక్కడ రావణ రాజ్యమే లేనప్పుడు, ఇక ఈ ప్రశ్నే ఉత్పన్నమవ్వదు. అన్నీ సాక్షాత్కారమవుతాయి. అక్కడ వృద్ధులుగా అయినప్పుడు, నేను వెళ్ళి బాలుడిగా అవుతానని, తల్లి గర్భంలోకి వెళ్తానని సాక్షాత్కారం జరుగుతుంది. అయితే, ఫలానా ఇంట్లోకి వెళ్తాను అనేది తెలియదు. కేవలం, ఇప్పుడు చిన్న బాలుడిగా అవ్వాలి అన్నది మాత్రమే తెలుస్తుంది. మగ నెమలి, ఆడ నెమలి ఉదాహరణ ఉంది కదా. కంటి అశ్రువుల ద్వారా గర్భం ధరిస్తుంది. బొప్పాయి వృక్షాలలో కూడా స్త్రీ-పురుష వృక్షాలు ఉంటాయి. ఒకదానికొకటి పక్క పక్కన ఉన్నప్పుడు ఫలాలను ఇస్తాయి. ఇది కూడా అద్భుతము కదా. జడమైన వస్తువులలోనే ఇలా ఉన్నప్పుడు, చైతన్యంలో సత్యయుగంలో ఎందుకు జరగదు. వీటన్నింటి విస్తారము వివరంగా మున్ముందు అర్థమవుతుంది. ముఖ్యమైన విషయము - మీరు తండ్రిని స్మృతి చేసి తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయి వారసత్వాన్ని తీసుకోండి, ఆ తర్వాత అక్కడి ఆచార-పద్ధతులను చూస్తారు. మీరు యోగబలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు, అలాంటప్పుడు యోగబలంతో పిల్లలెందుకు జన్మించరు. ఇలాంటి ప్రశ్నలు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఒకవేళ ఏ విషయంలోనైనా పూర్తిగా జవాబు లభించకపోతే పడిపోతారు. చిన్న విషయంలో కూడా సంశయం వస్తుంది. శాస్త్రాలలో ఇలాంటి విషయాలేవీ లేవు. శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి. పరమపిత పరమాత్మ వచ్చి బ్రాహ్మణ ధర్మం, సూర్యవంశ, చంద్రవంశ ధర్మాల స్థాపనను చేస్తారు. బ్రాహ్మణులు సంగమయుగం వారు. బాబాకు సంగమయుగంలోకి రావాల్సి ఉంటుంది. ఓ పతితపావనా రండి, అని పిలుస్తారు కూడా. విదేశాలవైపు, ఓ లిబరేటర్ (ముక్తిదాత), దుఃఖం నుండి ముక్తులుగా చేయండి అని అంటారు. దుఃఖం ఎవరిస్తారు అనేది కూడా వారికి తెలియదు. రావణ రాజ్యం సమాప్తమవుతుందని మీకు తెలుసు. మీకు బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. చదువు పూర్తి అయినప్పుడు వినాశనం జరుగుతుంది, దానికే మహాభారతం అన్న పేరు పెట్టారు. మహాభారతంలో రావణ రాజ్యం సమాప్తమవుతుంది. దసరా సమయంలో ఒక రావణుడిని మాత్రమే సమాప్తం చేస్తారు. అవి హద్దు విషయాలు. ఇవి అనంతమైన విషయాలు. ఈ ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. కనుక ఇంత చిన్న-చిన్న కన్యలు ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. భౌతిక జ్ఞానం నూనె వంటిది, ఇది స్వచ్ఛమైన నెయ్యి వంటిది. కనుక రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. రావణ రాజ్యంలో మీరు నూనె తినవలసి వస్తుంది. ఇంతకుముందు స్వచ్ఛమైన నెయ్యి ఎంతో చౌకగా లభించేది, తర్వాత ధర పెరిగిపోయింది కనుక నూనెను తినవలసి వస్తుంది. ఇంతకుముందు ఈ గ్యాసు, కరెంటు మొదలైనవేవీ ఉండేవి కావు. కొన్ని సంవత్సరాలలోనే ఎంత తేడా వచ్చేసింది. అంతా సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా మనల్ని లక్ష్మీనారాయణుల వలె తయారుచేసేందుకు చదివిస్తున్నారు. ఈ నషా ఈ బాబాకు చాలా ఉంటుంది. మాయ పిల్లల్ని మరపింపజేస్తూ ఉంటుంది. మేము బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు వచ్చాము అన్నప్పుడు ఆ నషా ఎందుకు ఎక్కదు! స్వీట్ హోమ్ ను, స్వీట్ రాజధానిని మర్చిపోతారు. ఎవరెవరు ఎముకలు అరిగేలా అనగా చాలా సేవ చేస్తారో, వారే మహా-రాజకుమారులుగా అవుతారని బాబాకు తెలుసు. మీకు ఈ నషా ఎందుకుండదు? ఎందుకంటే స్మృతిలో ఉండరు. సేవలో పూర్తిగా తత్పరులై ఉండరు. అప్పుడప్పుడు సేవలో ఉత్సాహంతో ఉంటారు, అప్పుడప్పుడు చల్లబడిపోతారు. ప్రతి ఒక్కరు స్వయాన్ని ప్రశ్నించుకోండి - ఇలా జరుగుతుంది కదా. అప్పుడప్పుడు పొరపాట్లు కూడా జరుగుతాయి, అందుకే బాబా అర్థం చేయిస్తారు - చాలా మధురంగా మాట్లాడాలి, అందరినీ సంతోషపరచాలి. ఎవ్వరికీ ఆవేశం రాకూడదు. తండ్రి ఎంత ప్రేమసాగరుడు. ఇప్పుడు గోహత్యను అపుచేసేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. తండ్రి అంటారు - అన్నింటికంటే పెద్ద హత్య కామ ఖడ్గాన్ని ఉపయోగించడము. ముందు దానిని ఆపుచేయండి. కానీ అదేమీ ఆగేది కాదు, ఎంతగా తల కొట్టుకుంటారు. ఈ కామ ఖడ్గాన్ని ఇరువురూ ఉపయోగించకూడదు. మనుష్యుల వినిపించే మాటలు ఎక్కడ, తండ్రి మాటలు ఎక్కడ. ఎవరైతే కామ వికారాన్ని జయిస్తారో, వారే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా ప్రేమసాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ ఆవేశంలోకి రాకూడదు. మీ మాటలను చాలా మధురంగా ఉంచుకోవాలి. అందరినీ సంతుష్టపరచాలి.

2. ఎముకలు అరిగేలా (చాలా) సేవ చేయాలి. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి రాకుమార-రాకుమారీలుగా అవుతామనే నషాలో ఉండాలి.

వరదానము:-

సేవ యొక్క తపన ద్వారా లౌకికాన్ని అలౌకిక ప్రవృత్తిలోకి పరివర్తన చేసే నిరంతర సేవాధారి భవ

నిరంతరం సేవలో ఉండడము సేవాధారుల కర్తవ్యము - అది మనసా సేవ కావచ్చు, వాచా సేవ కావచ్చు లేక కర్మణా సేవ కావచ్చు. సేవాధారులు ఎప్పుడూ సేవ వేరు, నేను వేరు అని భావించరు. ఎవరి బుద్ధిలోనైతే సదా సేవ చేయాలనే తపన ఉంటుందో, వారి లౌకిక ప్రవృత్తి పరివర్తనై ఈశ్వరీయ ప్రవృత్తిగా అవుతుంది. సేవాధారులు ఇల్లును ఇల్లుగా భావించరు, దానిని సేవా స్థానంగా భావిస్తూ నడుచుకుంటారు. సేవాధారుల ముఖ్య గుణము త్యాగము. త్యాగ వృత్తి కలవారు ప్రవృత్తిలో తపస్వీ మూర్తులుగా ఉంటారు, దీని ద్వారా సేవ స్వతహాగా జరుగుతుంది.

స్లోగన్:-

తమ సంస్కారాలను దివ్యంగా చేసుకోవాలంటే మనసు-బుద్ధిని తండ్రి ముందు సమర్పణ చెయ్యండి.