14-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు సత్యాతి-సత్యమైన రాజఋషులు, మీ కర్తవ్యము తపస్య చేయడము, తపస్య ద్వారానే పూజా యోగ్యులుగా అవుతారు”

ప్రశ్న:-

ఏ పురుషార్థం సదాకాలానికి పూజా యోగ్యులుగా తయారుచేస్తుంది?

జవాబు:-

ఆత్మ జ్యోతిని వెలిగించే మరియు తమోప్రధాన ఆత్మలను సతోప్రధానంగా తయారుచేసే పురుషార్థము చేసినట్లయితే సదాకాలం కోసం పూజా యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు ఎవరైతే పొరపాట్లు చేస్తారో, వారు చాలా ఏడుస్తారు. ఒకవేళ పురుషార్థము చేసి పాస్ అవ్వకపోతే, ధర్మరాజు శిక్షలను పొందితే, శిక్షలు పొందేవారు పూజింపబడరు. శిక్షలను అనుభవించేవారు తల ఎత్తుకోలేరు.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి అని మొట్టమొదట పిల్లలకు అర్థము చేయిస్తారు. మొదట ఆత్మ, తర్వాత శరీరము. ప్రతిచోట, ప్రదర్శనీలు మరియు మ్యూజియంలలో, క్లాసులో మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని సావధాన పరచాలి. పిల్లలు కూర్చున్నప్పుడు, అందరూ దేహీ అభిమానులై కూర్చోరు. ఇక్కడ కూర్చున్నా కూడా ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. సత్సంగాలలో ఎవరైనా సాధువు మొదలైనవారు వచ్చేంతవరకు కూర్చొని ఏం చేస్తారు. ఏవో ఆలోచనల్లో కూర్చొని ఉంటారు. సాధువు వచ్చిన తర్వాత కథలు మొదలైనవి వినడం మొదలుపెడతారు. భక్తిమార్గంలో ఇవన్నీ వినడం-వినిపించడం ఉంటుంది అని తండ్రి అర్థం చేయించారు. ఇవన్నీ కృత్రిమమైనవని తండ్రి అర్థం చేయిస్తారు. వీటిలో ఏమీ ఉండదు. దీపావళిని కూడా కృత్రిమంగా జరుపుకుంటారు. జ్ఞానం యొక్క మూడవ నేత్రము తెరుచుకోవాలి, అప్పుడు ఇంటింటిలోనూ ప్రకాశముంటుంది అని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడైతే ఇంటింటిలోనూ అంధకారమే ఉంది. ఇదంతా బాహ్య ప్రకాశము. మీరు మీ జ్యోతిని వెలిగించుకునేందుకు పూర్తిగా శాంతిలో కూర్చుంటారు. స్వధర్మములో ఉండడం ద్వారా పాపాలు తొలగిపోతాయని పిల్లలకు తెలుసు. జన్మ-జన్మాంతరాల పాపాలు ఈ స్మృతియాత్ర ద్వారానే తొలగిపోతాయి. ఆత్మ జ్యోతి ఆరిపోయింది కదా. శక్తి యొక్క పెట్రోల్ పూర్తిగా సమాప్తమైపోయింది. అది మళ్ళీ నిండిపోతుంది ఎందుకంటే ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు లక్ష్మికి ఎంతగా పూజలు జరుగుతాయి. కొందరు పిల్లలు వ్రాస్తారు, లక్ష్మి గొప్పవారా లేక సరస్వతి మాత గొప్పవారా. శ్రీనారాయణునికి చెందిన లక్ష్మి ఒక్కరే ఉంటారు. ఒకవేళ మహాలక్ష్మిని పూజించినట్లయితే, ఆమెకు నాలుగు భుజాలను చూపిస్తారు. వారిలోనే ఇద్దరూ వచ్చేస్తారు. వాస్తవానికి దానిని లక్ష్మీ-నారాయణుల పూజ అని అనాలి. చతుర్భుజాలు కదా - ఇద్దరూ కలిసి ఉన్నట్లు. కానీ మనుష్యులకు ఏ తెలివి లేదు. అందరూ తెలివిహీనులుగా అయిపోయారని అనంతమైన తండ్రి చెప్తారు. లౌకిక తండ్రి ఏప్పుడైనా మొత్తం ప్రపంచములోని పిల్లలు తెలివిహీనులుగా అయిపోయారని అంటారా. విశ్వపిత ఎవరు అనేది పిల్లలైన మీకిప్పుడు తెలుసు. నేను ఆత్మలందరికీ తండ్రిని, మీరందరూ నా పిల్లలు అని స్వయంగా అంటారు. ఆ సాధువులైతే అందరూ భగవంతులే అని అనేస్తారు. అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు అనంతమైన జ్ఞానాన్ని అర్థము చేయిస్తున్నారని మీకు తెలుసు. మనుష్యులకైతే నేను ఫలానా...... అని దేహాభిమానము ఉంటుంది. శరీరాలకు ఏ పేర్లు అయితే ఉంటాయో, వాటి ఆధారంగా నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు శివబాబా అయితే నిరాకారుడు, వారు సుప్రీమ్ సోల్ (పరమ ఆత్మ). వారి ఆత్మ పేరు శివ. ఒక్క శివబాబాకు మాత్రమే ఆత్మకు పేరుంటుంది. కేవలం వారు పరమ ఆత్మ, పరమాత్మ, వారి పేరు శివ. ఇక మిగిలిన లెక్కలేనన్ని ఆత్మలందరి శరీరాలకు పేర్లున్నాయి. శివబాబా ఇక్కడ ఉండరు, వారు పరంధామము నుండి వస్తారు. శివ అవతరణ కూడా జరుగుతుంది. ఆత్మలందరూ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు అని ఇప్పుడు తండ్రి మీకు అర్థము చేయించారు. తండ్రికి కూడా పాత్ర ఉంది. తండ్రి ఇక్కడ చాలా గొప్ప కార్యం చేస్తారు. అవతారము అని అంగీకరించినట్లయితే వారికి హాలిడే మరియు స్టాంపు మొదలైనవి ఉండాలి. అన్ని దేశాలలోనూ హాలిడే ఉండాలి ఎందుకంటే తండ్రి అందరి సద్గతిదాత కదా. వారి జన్మదినము మరియు వెళ్ళిపోయే రోజు, తేదీ మొదలైనవి కూడా తెలియవు ఎందుకంటే వారు అతీతమైనవారు కదా, అందుకే కేవలం శివరాత్రి అని అంటారు. అర్థకల్పము అనంతమైన పగలు, అర్థకల్పము అనంతమైన రాత్రి అని కూడా పిల్లలైన మీకు తెలుసు. రాత్రి పూర్తయిన తర్వాత పగలు వస్తుంది. ఆ మధ్యలో తండ్రి వస్తారు. అది ఖచ్ఛితమైన సమయము. మనుష్యులు జన్మించినప్పుడు మునిసిపాలిటివారి వద్ద నోట్ చేస్తారు కదా, మళ్ళీ 6 రోజుల తర్వాత వారికి పేరు పెడతారు, దానిని నామకరణము అని అంటారు. కొందరు ఆరవ రోజు పండుగ అని అంటారు. భాషలైతే ఎన్నో ఉన్నాయి కదా. లక్ష్మిని పూజించినప్పుడు టపాకాయలు కాలుస్తారు. మీరు ఏ లక్ష్మి పండుగనైతే జరుపుకుంటున్నారో, వారు సింహాసనముపై ఎప్పుడు కూర్చున్నారు అని మీరు అడగవచ్చు. సింహాసనముపై కూర్చున్నప్పడు పట్టాభిషేకం రోజును జరుపుతారు, వారి పుట్టిన రోజును జరపరు. లక్ష్మి చిత్రమును పళ్ళెములో పెట్టి వారిని ధనం అడుగుతారు. అంతే, ఇంకేమీ అడగరు. మందిరాలకు వెళ్ళినప్పుడు ఏమైనా అడుగుతారు కానీ దీపావళి రోజున వారిని కేవలం ధనము అడుగుతారు. కానీ వారు ధనము ఇవ్వరు. ఇది వారి భావన..... ఒకవేళ ఎవరైనా సత్యమైన భావనతో పూజించినట్లయితే, అల్పకాలము కొరకు ధనము లభించవచ్చు. ఇది అల్పకాలిక సుఖము. ఏదో ఒకచోట స్థిరమైన సుఖము కూడా ఉంటుంది కదా. వారికి స్వర్గము గురించి అసలు తెలియదు. ఇక్కడ స్వర్గంతో పోలికగా ఏదీ ఉండదు.

అర్థకల్పము జ్ఞానము, అర్థకల్పము భక్తి అని మీకు తెలుసు. తర్వాత వైరాగ్యం ఉంటుంది. ఇది పాత ఛీ-ఛీ ప్రపంచమని మీకు అర్థము చేయించడం జరుగుతుంది, అందుకే తప్పకుండా క్రొత్త ప్రపంచము కావాలి. వైకుంఠమునే క్రొత్త ప్రపంచమని అంటారు, దానిని స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు. ఈ డ్రామాలోని పాత్రధారులు కూడా అవినాశీగా ఉన్నారు. ఆత్మలమైన మనము పాత్రనెలా అభినయిస్తాము అనేది పిల్లలైన మీకు తెలిసింది. ఎవరికైనా ప్రదర్శిని మొదలైనవి చూపించాలంటే మొట్టమొదట ఈ లక్ష్యము ఉద్దేశ్యమును అర్థము చేయించాలని బాబా అర్థము చేయించారు. సెకెండులో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది - జనన-మరణాలలోకి అయితే తప్పకుండా రావలసిందే. మీరు మెట్ల చిత్రంపై చాలా బాగా అర్థము చేయించవచ్చు. రావణ రాజ్యములోనే భక్తి ప్రారంభమవుతుంది, సత్యయుగంలో భక్తి యొక్క నామ రూపాలుండవు. జ్ఞానము మరియు భక్తి, రెండూ వేర్వేరు కదా. ఇప్పుడు మీకు ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. తండ్రి సదా పిల్లలకు సుఖాన్నిచ్చేవారిగానే ఉంటారు. పిల్లల కోసమే తండ్రి ఎంతగా తల కొట్టుకుంటారు. కొడుకు కావాలని గురువుల వద్దకు వెళ్తారు, సాధువుల వద్దకు వెళ్తారు - ఎలాగైనా సరే కొడుకు ఉండాలనుకుంటారు, ఎందుకంటే కొడుకు ఉన్నట్లయితే వారికి ఆస్తినిచ్చి వెళ్ళవచ్చని భావిస్తారు. కొడుకు ఉంటే నేను అతడిని వారసునిగా చేయాలి. కనుక తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖాన్నివ్వరు, అది అసాధ్యము. మీరు, తల్లి-తండ్రి అని అంటూ ఎంతగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఆత్మిక తండ్రి పిల్లలందరికీ సుఖము యొక్క మార్గమునే తెలియజేస్తారు. సుఖమునిచ్చువారు తండ్రి ఒక్కరే. దుఃఖహర్త, సుఖకర్త ఆత్మిక తండ్రి ఒక్కరే. ఈ వినాశనము కూడా సుఖము కోసమే ఉంది. లేకపోతే ముక్తి-జీవన్ముక్తిని ఎలా పొందుతారు? కానీ ఇది కూడా ఎవ్వరూ అర్థము చేసుకోరు. ఇక్కడ నిరుపేదలు, అబలలు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోగలరు. ఇకపోతే, గొప్పవారికి దేహం యొక్క అభిమానము ఎంత గట్టిగా పక్కా అయిపోయిందంటే, ఇక ఆ విషయం అడగకండి. మీరు రాజఋషులు అని బాబా పదే-పదే అర్థము చేయిస్తారు. ఋషి ఎప్పుడూ తపస్సు చేస్తారు. వారు బ్రహ్మమును, తత్వాన్ని స్మృతి చేస్తారు లేదా కొందరు కాళీ మొదలైనవారిని కూడా స్మృతి చేస్తూ ఉంటారు. చాలా మంది సన్యాసులు కూడా కాళీని పూజిస్తారు. కాళీమాత అని అంటూ పిలుస్తారు. ఈ సమయంలో అందరూ వికారులుగా ఉన్నారు, కామచితిపై కూర్చొని అందరూ నల్లగా అయిపోయారు అని తండ్రి చెప్తారు. తల్లి, తండ్రి, పిల్లలు, అందరూ నల్లగా ఉన్నారు. ఇది అనంతమైన విషయము. సత్యయుగంలో నల్లగా ఉండరు, అందరూ సుందరంగా ఉంటారు. తర్వాత ఎప్పుడు నల్లగా అవుతారు అనేది పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. కొద్ది-కొద్దిగా పతితంగా అవుతూ-అవుతూ అంతిమంలో పూర్తిగా నల్లగా అయిపోతారు. రావణుడు కామచితి పైకి ఎక్కించి పూర్తిగా నల్లగా చేసేశాడు, ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ జ్ఞానచితిపైకి ఎక్కిస్తాను అని తండ్రి అంటారు. ఆత్మనే పవిత్రంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు పతితపావనుడైన తండ్రి వచ్చి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. నీరు ఏం యుక్తిని తెలియజేస్తుంది. కానీ మీరెవరికి అర్థము చేయించినా సరే, కోట్లలో కొందరే అర్థము చేసుకొని ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు 21 జన్మల కోసం తండ్రి నుండి మీ వారసత్వం తీసుకునేందుకు వచ్చారు. మున్ముందు మీరు చాలా సాక్షాత్కారాలను పొందుతారు. మీకు మీ చదువు గురించి అంతా తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు పొరపాట్లు చేస్తారో, వారు తర్వాత చాలా ఏడుస్తారు. శిక్షలు కూడా చాలా ఉంటాయి కదా. ఇక పదవి కూడా భ్రష్టమైపోతుంది. తల ఎత్తుకోలేరు, అందుకే తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, పురుషార్థము చేసి పాస్ అవ్వండి, ఏ మాత్రమూ శిక్షలు అనుభవించకుండా ఉన్నప్పుడే పూజా యోగ్యంగా కూడా అవుతారు. శిక్షలు అనుభవిస్తే పూజింపబడరు. పిల్లలైన మీరు చాలా పురుషార్థము చేయాలి. తమ ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆత్మ తమోప్రధానంగా అయ్యింది, దానినే సతోప్రధానంగా చేసుకోవాలి. ఆత్మ అయితే బిందువు. ఒక నక్షత్రము. దానికి ఇంకే పేరు పెట్టలేము. దాని సాక్షాత్కారము జరిగిందని పిల్లలకు అర్థము చేయించారు. స్వామి వివేకానంద మరియు రామకృష్ణ పరమహంసల గురించి చెప్తారు. వారి నుండి ఏదో ప్రకాశము బయటకు వచ్చినట్లుగా వివేకానంద చూశారు, అంటే ఆత్మయే బయటకు వస్తుంది. అది నాలో లీనమైపోయిందని అతను భావించారు. ఇప్పుడు అలా ఆత్మ వచ్చి ఏమీ లీనమవ్వలేదు. అది వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. చివర్లో మీరు చాలా చూస్తారు. నామం మరియు రూపానికి అతీతమైన వస్తువేదీ ఉండదు. ఆకాశం పోలార్, దానికి కూడా పేరు ఉంది. కల్ప-కల్పము ఏదైతే స్థాపన జరుగుతూ వచ్చిందో, అది జరగాల్సిందేనని ఇప్పుడు పిల్లలు భావిస్తారు. బ్రాహ్మణులైన మనము నంబరువారుగా పురుషార్థము చేస్తూ ఉంటాము. ఏ సెకెండు అయితే గడుస్తుందో, దానిని డ్రామా అనే అంటారు. మొత్తం ప్రపంచం యొక్క చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది 5 వేల సంవత్సరాల చక్రము, ఇది పేను వలె తిరుగుతూ ఉంటుంది. టిక్-టిక్ అని నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీరు కేవలం తండ్రినే స్మృతి చేయాలి. నడుస్తూ-తిరుగుతూ, పనులు చేస్తూ తండ్రిని స్మృతి చేయడంలోనే కళ్యాణముంది. మళ్ళీ మాయ చెంపదెబ్బ వేస్తుంది. మీరు బ్రాహ్మణులు, భ్రమరి వలె కీటకాలను తమ సమానంగా బ్రాహ్మణులుగా తయారుచేయాలి. ఆ భ్రమరి ఒక ఉదాహరణ. మీరు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి, అందుకే ఇది మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమయుగము. ఇక్కడకు మీరు పురుషోత్తములుగా అవ్వడానికే వస్తారు. మొదట తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వవలసి ఉంటుంది. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది కదా. మీరు బ్రాహ్మణులకు అర్థము చేయించవచ్చు. ఇలా చెప్పండి - మీది బ్రాహ్మణ కులము, బ్రాహ్మణులకు రాజధాని ఉండదు. మీ ఈ కులాన్ని ఎవరు స్థాపించారు? మీకు పెద్దవారు ఎవరు? ఇక తర్వాత మీరు అర్థం చేయించినప్పుడు చాలా సంతోషపడతారు. బ్రాహ్మణులకు గౌరవమునిస్తారు ఎందుకంటే వారు శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు. ఇదివరకు రాఖీ కట్టేందుకు కూడా బ్రాహ్మణులు వెళ్ళేవారు. ఈ రోజుల్లో కుమార్తెలు వెళ్తారు. ఎవరైతే పవిత్రతా ప్రతిజ్ఞను చేస్తారో, వారికే మీరు రాఖీ కట్టాలి. తప్పకుండా ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. భారతదేశాన్ని మళ్ళీ పావనంగా చేసేందుకు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తాము. మీరు కూడా పావనంగా అవ్వండి, ఇతరులను కూడా పావనంగా తయారుచేయండి. ఈ విధంగా చెప్పే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఈ అంతిమ జన్మ పావనంగా అవ్వడంతో మనము పావన ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇదే మీ వ్యాపారము. ఇటువంటి మనుష్యులెవ్వరూ ఉండరు. మీరు వెళ్ళి ఈ ప్రతిజ్ఞను చేయించాలి. కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందాలి అని తండ్రి చెప్తారు. దీనిపై విజయమును పొందటంతోనే మీరు జగత్ జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ముందు జన్మలో తప్పకుండా ఈ పురుషార్థము చేసారు, అందుకే ఆ విధంగా తయారయ్యారు కదా. ఏ కర్మల ద్వారా వీరికి ఈ పదవి లభించింది అనేది మీరిప్పుడు చెప్పగలరు, ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. మీకు ఈ దీపావళి మొదలైనవాటి గురించి సంతోషమేమీ కలగదు. మనము తండ్రికి చెందినవారిగా అయ్యాము, వారి ద్వారా వారసత్వాన్ని పొందుతామని మీకు సంతోషము కలుగుతుంది. భక్తిమార్గములో మనుష్యులు ఎంతగా ఖర్చు చేస్తారు. ఎంతో నష్టము కూడా కలుగుతుంది. నిప్పంటుకుంటుంది. అయినా అర్థము చేసుకోరు.

ఇప్పుడు మనము మళ్ళీ మన కొత్త ఇంటికి వెళ్ళబోతున్నామని మీకు తెలుసు. చక్రము మళ్ళీ యథావిధిగా పునరావృతం అవుతుంది కదా. ఇది అనంతమైన ఫిల్మ్. అనంతమైన స్లైడ్. అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక అపారమైన సంతోషముండాలి. మనము తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. పురుషార్థము ద్వారా ఏది కావాలనుకుంటే అది తీసుకోండి అని తండ్రి చెప్తారు. మీరు తప్పకుండా పురుషార్థము చేయాలి. పురుషార్థము ద్వారానే మీరు ఉన్నతంగా అవ్వగలరు. ఈ బాబా (వృద్ధుడు) ఇంత ఉన్నతంగా అవ్వగలరంటే మీరెందుకు అవ్వలేరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విధంగా తండ్రి పిల్లలకు సదా సుఖాన్నిస్తారో, అదే విధంగా సుఖమిచ్చేవారిగా అవ్వాలి. అందరికీ ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేయాలి.

2. దేహీ అభిమానులుగా అయ్యే తపస్య చేయాలి. ఈ పాత ఛీ-ఛీ ప్రపంచం పట్ల అనంతమైన వైరాగిగా అవ్వాలి.

వరదానము:-

దివ్య గుణాలను ఆహ్వానించడం ద్వారా సర్వ అవగుణాలను ఆహుతినిచ్చే సంతుష్ట ఆత్మ భవ

ఎలాగైతే దీపావళి నాడు విశేషంగా శుభ్రత మరియు సంపాదన పట్ల ధ్యానముంచుతారో, అదే విధంగా మీరు కూడా అన్ని రకాల శుభ్రత మరియు సంపాదన యొక్క లక్ష్యముంచి సంతుష్ట ఆత్మగా అవ్వండి. సంతుష్టత ద్వారానే సర్వ దివ్య గుణాలను ఆహ్వానించగలరు. తర్వాత స్వతహాగానే అవగుణాల ఆహుతి జరిగిపోతుంది. లోపల ఏవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత మిగిలి ఉన్నాయో, వాటిని సమాప్తం చేసి ఇప్పుడు కొత్త ఖాతాను ప్రారంభించండి మరియు కొత్త సంస్కారాలు అనే కొత్త వస్త్రాలను ధరించి సత్యమైన దీపావళిని జరుపుకోండి.

స్లోగన్:-

స్వమానమనే సీటుపై సదా సెట్ అయ్యి ఉండాలంటే దృఢ సంకల్పమనే బెల్టును బాగా కట్టుకోండి.