15-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు అర్ధకల్పము ఎవరి భక్తినైతే చేశారో, ఆ తండ్రియే స్వయంగా మిమ్మల్ని చదివిస్తున్నారు, ఈ చదువు ద్వారానే మీరు దేవీ దేవతలుగా అవుతారు”

ప్రశ్న:-

యోగబలమనే లిఫ్టు యొక్క అద్భుతము ఏమిటి?

జవాబు:-

పిల్లలైన మీరు యోగబలమనే లిఫ్టు ద్వారా ఒక్క సెకెండులో పైకి ఎక్కిపోతారు అనగా ఒక్క సెకెండులో జీవన్ముక్తి యొక్క వారసత్వము మీకు లభిస్తుంది. మెట్లు దిగడానికి 5 వేల సంవత్సరాలు పట్టింది మరియు ఒక్క సెకండులో ఎక్కుతారని మీకు తెలుసు, ఇదే యోగబలము యొక్క అద్భుతము. తండ్రి స్మృతి ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి మహిమనైతే పిల్లలకు వినిపించారు. వారు జ్ఞానసాగరుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు. వారు శాంతి సాగరుడు. వారికి అనంతమైన మహిమను చేయడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి జ్ఞానసాగరుడు, ఈ సమయంలోని మనుష్యులందరికీ తాము భక్తిసాగరులని తెలుసు. భక్తిలో ఎవరైతే అందరికన్నా చురుకుగా ఉంటారో, వారికి గౌరవము లభిస్తుంది. ఈ సమయంలో కలియుగంలో భక్తి, దుఃఖము ఉన్నాయి. సత్యయుగంలో జ్ఞాన సుఖము ఉంటుంది. అలాగని అక్కడ జ్ఞానముంటుందని కాదు. కావున ఈ మహిమ కేవలం ఒక్క తండ్రిది మాత్రమే మరియు పిల్లలకు కూడా మహిమ ఉంది, ఎందుకంటే తండ్రి పిల్లలను చదివిస్తారు మరియు యాత్రను నేర్పిస్తారు. రెండు యాత్రలు ఉన్నాయని తండ్రి అర్థం చేయించారు. భక్తులు తీర్థయాత్రలు చేస్తారు, నలువైపులా చుట్టి వస్తారు. ఎంత సమయమైతే అలా నలువైపులా తిరుగుతారో, అంత సమయం వికారాలలోకి వెళ్ళరు. మద్యం మొదలైన ఛీ-ఛీ పదార్థాలేవీ తినరు, తాగరు. అప్పుడప్పుడు బద్రీనాథ్, అప్పుడప్పుడు కాశీ చుట్టివస్తారు. భగవంతుని భక్తి చేస్తారు. భగవంతుడైతే ఒక్కరే ఉండాలి కదా. అన్ని వైపులా చుట్టి రాకూడదు కదా. శివబాబాకు చెందిన తీర్థాలను కూడా చుట్టి వస్తారు. బనారస్ లోని తీర్థ స్థానం అన్నింటికన్నా పెద్దదిగా గాయనం చేయబడుతుంది, దానిని శివుని పురి అని అంటారు. నలువైపులకూ వెళ్తారు కానీ ఎవరి దర్శనం చేసుకోవడానికైతే వెళ్తారో లేక ఎవరి భక్తినైతే చేస్తారో, వారి జీవితచరిత్ర, వారి కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియదు, కావున దానిని అంధశ్రద్ధ అని అంటారు. ఎవరినైనా పూజించడం, వారికి తల వంచి నమస్కరించడం కానీ వారి జీవిత కథ గురించి తెలుసుకోకపోవడం, దీనిని అంధశ్రద్ధ అని అంటారు. ఇంట్లో కూడా జరుపుకుంటారు, దేవీలకు ఎంతగా పూజలు చేస్తారు, మట్టితో లేక రాతితో దేవీలను తయారుచేసి వారిని బాగా అలంకరిస్తారు. లక్ష్మి చిత్రాన్ని తయారుచేస్తే, వీరి జీవిత చరిత్ర గురించి చెప్పమని వారిని అడగండి, అప్పుడు వారు సత్యయుగపు మహారాణి అని అంటారు. త్రేతాయుగ మహారాణిగా సీత ఉండేవారు. కానీ వారు ఎంత సమయము రాజ్యం చేశారు, లక్ష్మీనారాయణుల రాజ్యము ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది అన్నది ఎవరికీ కూడా తెలియదు. మనుష్యులు భక్తి మార్గంలో యాత్రలకు వెళ్తారు, ఇవన్నీ భగవంతుడిని కలుసుకునే ఉపాయాలు. శాస్త్రాలు చదవడం కూడా భగవంతుడిని కలుసుకునే ఉపాయాలే. కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నారని అడిగితే వారు సర్వవ్యాపి అని అంటారు.

చదువు ద్వారా మేము ఈ దేవీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తారు, వారిని కలుసుకునేందుకు అర్ధకల్పము భక్తి మార్గము నడుస్తుంది. బాబా, పావనంగా చేయండి మరియు మీరు ఎవరు అన్న మీ పరిచయాన్ని కూడా ఇవ్వండి అని అంటారు. ఆత్మలైన మీరు బిందువులు, ఆత్మకే ఈ శరీరము లభించింది, అందుకే ఇక్కడ కర్మలు చేస్తుందని బాబా అర్థం చేయించారు. దేవతలు సత్యయుగంలో రాజ్యం చేసి వెళ్ళారని అంటారు. తప్పకుండా గాడ్ ఫాదర్ ప్యారడైజ్ (స్వర్గము) స్థాపన చేశారని, మేము అందులో లేము అని క్రైస్తవులు భావిస్తారు. భారతదేశంలో ప్యారడైజ్ ఉండేది, వారి బుద్ధి కొంతైనా బాగుంది. భారతవాసులు సతోప్రధానంగా కూడా అవుతారు, మళ్ళీ తమోప్రధానంగా కూడా అవుతారు. వారైతే అంతటి సుఖాన్ని చూడరు, అంతటి దుఃఖాన్ని కూడా చూడరు. ఇప్పుడు చివరిలో ఉన్న క్రిస్టియన్లు ఎంత సుఖంగా ఉన్నారు. మొదట వారు నిరుపేదలుగా ఉండేవారు. డబ్బును కష్టపడి సంపాదించడం జరుగుతుంది కదా. మొదట క్రీస్తు ఒక్కరే వచ్చారు, తర్వాత వారి ధర్మము స్థాపనవుతుంది, ఇక వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు..... ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవుల వృక్షము ఎంతగా పెరిగిపోయిందో చూడండి. దేవీ-దేవతా వంశమే పునాది. అది మళ్ళీ ఇక్కడ ఈ సమయంలో స్థాపనవుతుంది. మొదట బ్రహ్మా ఒక్కరే, తర్వాత దత్తత తీసుకోబడిన బ్రాహ్మణ సంతానం వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రి చదివిస్తారు కావున ఎంతోమంది బ్రాహ్మణులు తయారవుతారు. మొదట ఇతను ఒక్కరే ఉండేవారు కదా. ఒక్కరి నుండి ఎంత వృద్ధి జరిగింది, ఇంకా ఎంతగా జరగనున్నది. ఎంతమంది సూర్యవంశీ, చంద్రవంశీ దేవతలు ఉండేవారో, అంతమంది మళ్ళీ తయారవ్వనున్నారు. మొదట తండ్రి ఒక్కరే ఉంటారు, వారి ఆత్మ ఉండనే ఉంది. ఆ తండ్రి సంతానమైన ఆత్మలైన మనము ఎంతమంది ఉన్నాము? ఆత్మలైన మనందరికీ అనాది అయిన తండ్రి ఒక్కరే, మళ్ళీ సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. మనుష్యులందరూ సదా ఉండరు కదా. ఆత్మలు భిన్న-భిన్న పాత్రలను అభినయించాలి. ఈ వృక్షానికి మొట్టమొదటి కాండము దేవీదేవతలది, తర్వాత దాని నుండి కొమ్మలు వెలువడ్డాయి. కావున నేను వచ్చి ఏం చేస్తాను అనేది తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మలోనే ధారణ జరుగుతుంది. తాను ఎలా వచ్చారు అనేది తండ్రి కూర్చొని వినిపిస్తారు. పిల్లలైన మీరంతా పతితులుగా అయినప్పుడు స్మృతి చేస్తారు. సత్య-త్రేతా యుగాలలో మీరు సుఖంగా ఉండేవారు, అప్పుడు స్మృతి చేసేవారు కాదు. ద్వాపరయుగము తర్వాత దుఃఖము ఎక్కువైనప్పుడు - ఓ పరమపిత పరమాత్మ బాబా అని పిలిచారు. అవును పిల్లలూ, విన్నాను, మీకు ఏం కావాలి అని అడుగుతారు. బాబా, మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి, మేము చాలా దుఃఖితులుగా, పతితులుగా ఉన్నాము, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, కృప చూపండి, ఆశీర్వదించండి అని పిల్లలు పిలుస్తారు. బాబా, మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి అని మీరు నన్ను పిలిచారు. పావనము అని సత్యయుగాన్ని అంటారు. ఇది కూడా స్వయంగా తండ్రి కూర్చొని తెలియజేస్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే సంగమయుగం ప్రారంభమవుతుందో, సృష్టి పాతబడుతుందో, అప్పుడు నేను వస్తాను.

సన్యాసులు కూడా రెండు రకాలుగా ఉంటారని మీరు అర్థం చేసుకుంటారు. వారు హఠయోగులు, వారిని రాజయోగులని అనరు. వారిది హద్దు సన్యాసము. ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవిలో ఉంటారు. గురువులకు శిష్యులుగా అవుతారు. గోపిచంద్ రాజు గురించి కూడా ఒక కథను వినిపిస్తారు. మీరు ఇళ్ళు-వాకిళ్ళను ఎందుకు విడిచిపెడతారు, ఎక్కడికి వెళ్తారు అని అతను అడుగుతారు. శాస్త్రాలలో చాలా కథలున్నాయి. ఇప్పుడు బి.కె.లైన మీరు రాజులకు కూడా వెళ్ళి జ్ఞాన యోగాలను నేర్పిస్తారు. ఒక అష్టావక్ర గీత కూడా ఉంది, అందులో రాజుకు వైరాగ్యము కలిగినప్పుడు నన్ను ఎవరైనా పరమాత్మతో కలిపించగలరా అని దండోరా వేయించినట్లు చూపిస్తారు. ఆ సమయము ఇదే. రాజులను తండ్రితో కలిపించేందుకు మీరు వెళ్ళి జ్ఞానాన్నిస్తారు కదా. మీరు ఎలాగైతే కలిశారో, అలా ఇతరులను కూడా కలిపించేందుకు ప్రయత్నము చేస్తారు. మేము మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాము, ముక్తి-జీవన్ముక్తిని ఇస్తామని మీరంటారు. శివబాబానే స్మృతి చేయండి, ఇంకెవ్వరినీ స్మృతి చేయకండని మీరు వారికి చెప్పండి. ప్రారంభములో మీ వద్ద కూడా కూర్చొంటూ-కూర్చొంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ధ్యానములోకి వెళ్ళిపోయేవారు కదా. చాలా అద్భుతంగా అనిపించేది. వీరిలో తండ్రి ఉండేవారు కదా, కావున వారు చమత్కారము చూపించేవారు. అందరి తాళ్ళను తమవైపుకు ఆకర్షించేవారు. బాప్ దాదా ఇరువురు కలిసి ఉన్నారు కదా. కబ్రిస్తాన్ (స్మశానవాటిక) లా తయారుచేసేవారు. అందరూ తండ్రి స్మృతిలో పడుకోండి అనేవారు. దానితో అందరూ ధ్యానములోకి వెళ్ళిపోయేవారు. ఇదంతా శివబాబా యొక్క చతురత. దీనిని చాలా మంది ఇంద్రజాలమని భావించేవారు. ఇదంతా శివబాబా ఆట. తండ్రి ఇంద్రజాలికుడు, వ్యాపారస్థుడు, రత్నాకరుడు కదా. వారు చాకలి కూడా, కంసాలి కూడా, వకీలు కూడా. అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. అందరూ వారినే - ఓ పతితపావనా, ఓ దూరదేశ నివాసీ..... మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. ఇప్పుడు మీరు దీని అర్థాన్ని కూడా తెలుసుకున్నారు. పిల్లలైన మీరు రావణుని దేశంలోకి నన్ను పిలిచారు, నేనైతే పరంధామంలో కూర్చుని ఉన్నాను అని తండ్రి వచ్చి తెలియజేస్తారు. ఇప్పుడిక సుఖధామానికి తీసుకువెళ్ళండి అని స్వర్గ స్థాపన చేసేందుకు నన్ను నరకములోకి, రావణుని దేశములోకి పిలిచారు. ఇప్పుడు వారు పిల్లలైన మిమ్మల్ని తీసుకువెళ్తారు కదా. ఇదంతా డ్రామా. నేను మీకు ఏ రాజ్యమునైతే ఇచ్చానో, అది పూర్తయ్యింది, మళ్ళీ ద్వాపరయుగము నుండి రావణ రాజ్యము నడుస్తూ ఉంది. 5 వికారాలలోకి పడిపోయారు, ఆ చిత్రాలు కూడా జగన్నాథపురిలో ఉన్నాయి. ఎవరైతే మొదటి నెంబరులో ఉండేవారో, వారే 84 జన్మలను తీసుకొని ఇప్పుడు చివరిలో ఉన్నారు, వారే మళ్ళీ మొదటి నంబరులోకి వెళ్ళాలి. ఇక్కడ బ్రహ్మా కూర్చుని ఉన్నారు, విష్ణువు కూడా కూర్చుని ఉన్నారు. వీరిరువురికీ పరస్పరంలో ఏ సంబంధం ఉంది? ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మా సరస్వతులు కూడా నిజానికి సత్యయుగానికి యజమానులైన లక్ష్మీ నారాయణులుగా ఉండేవారు. ఇప్పుడు నరకానికి యజమానులుగా ఉన్నారు. ఇప్పుడు వీరు ఆ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు తపస్సు చేస్తున్నారు. దిల్వాడా మందిరంలో పూర్తి స్మృతి చిహ్నాలు ఉన్నాయి. తండ్రి కూడా ఇక్కడికే వచ్చారు, అందుకే ఆబూ అన్నీ తీర్థ స్థానాలలోని ముఖ్యమైనది, సర్వ ధర్మాల తీర్థాలకు ముఖ్యమైనదని వ్రాస్తారు, ఎందుకంటే తండ్రి ఇక్కడికే వచ్చి సర్వ ధర్మాల సద్గతిని చేస్తారు. మీరు శాంతిధామానికి వెళ్ళి స్వర్గంలోకి వెళ్తారు. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది జడమైన స్మృతిచిహ్నము, ఇది చైతన్యమైనది. మీరు చైతన్యంగా ఆ విధంగా తయారైనప్పుడు ఈ మందిరాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ భక్తి మార్గంలో ఈ స్మృతిచిహ్నాలను తయారుచేస్తారు. ఇప్పుడు మీరు స్వర్గ స్థాపన చేస్తున్నారు. స్వర్గము పైన ఉందని మనుష్యులు భావిస్తారు. ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేదని, ఇప్పుడు నరకంగా ఉందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ చక్రాన్ని చూడడంతోనే మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ద్వాపరయుగం నుండి వేరే ధర్మాలు వస్తాయి, కావున ఇప్పుడు ఎన్ని ధర్మాలున్నాయో చూడండి. ఇది ఇనుపయుగము. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. సత్యయుగంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థము చేస్తారు. కలియుగములో అందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. సత్యయుగములో అందరూ పారసబుద్ధి కలవారిగా ఉంటారు. మీరే పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, మీరే మళ్ళీ రాతిబుద్ధి కలవారిగా అయ్యారు. మళ్ళీ పారసబుద్ధి కలవారిగా అవ్వాలి. మీరు పిలిచారు కావున నేను వచ్చాను మరియు కామమును జయిస్తే జగత్ జీతులుగా అవుతారని మీకు తెలియజేస్తాను అని ఇప్పుడు తండ్రి అంటారు. ముఖ్యమైనది ఈ వికారమే. సత్యయుగంలో అందరూ నిర్వికారులుగా ఉంటారు, కలియుగంలో అందరూ వికారులే.

పిల్లలూ, ఇప్పుడు నిర్వికారులుగా అవ్వండని తండ్రి అంటారు. 63 జన్మలు వికారాలలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు అందరూ మరణించవలసిందే. నేను స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చాను కావున ఇప్పుడు నా శ్రీమతముపై నడవండి. నేను ఏమి చెప్తే అది వినండి. ఇప్పుడు మీరు రాతిబుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా చేసేందుకు పురుషార్థము చేస్తున్నారు. మీరే మెట్లను పూర్తిగా దిగుతారు, మళ్ళీ ఎక్కుతారు. మీరు జిన్నుభూతం వంటివారు. జిన్ను కథ ఉంది కదా - అది నాకు పని ఇవ్వమని అడిగితే, అచ్ఛా, మెట్లు ఎక్కు, మళ్ళీ దిగు అని రాజు అన్నట్లుగా చెప్తారు. అసలు భగవంతునికి ఏమి అవసరమని మెట్లు ఎక్కిస్తూ మరియు దింపుతూ ఉంటారు, అసలు భగవంతునికి ఏమయ్యిందని ఇటువంటి మెట్లను తయారుచేశారు అని ఎంతోమంది మనుష్యులు అంటారు! ఇది అనాది ఆట అని తండ్రి అర్థము చేయిస్తారు. మీరు 5 వేల సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. కిందికి దిగేందుకు మీకు 5 వేల సంవత్సరాలు పట్టింది, మళ్ళీ ఒక్క సెకెండులో పైకి వెళ్ళిపోతారు. ఇది మీ యోగబలం యొక్క లిఫ్టు. స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయని తండ్రి అంటారు. తండ్రి రావడంతో ఒక్క సెకెండులో మీరు పైకి ఎక్కిపోతారు, మళ్ళీ కిందికి దిగేందుకు 5 వేల సంవత్సరాలు పట్టింది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కేందుకైతే లిఫ్టు ఉంది. సెకెండులో జీవన్ముక్తి. సతోప్రధానంగా అవ్వాలి. తర్వాత నెమ్మది-నెమ్మదిగా తమోప్రధానంగా అవుతారు. అందుకు 5 వేల సంవత్సరాలు పడుతుంది. అచ్చా, మళ్ళీ తమోప్రధానము నుండి ఒక్క జన్మలోనే సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు నేను మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నప్పుడు మీరు పవిత్రంగా ఎందుకు అవ్వరు. కానీ కామేషు, క్రోధేషు కూడా ఉన్నారు కదా (కామానికి, క్రోధానికి వశమయ్యేవారు). వికారాలు లభించకపోవడంతో స్త్రీలను కొడతారు, బయటకు పంపించేస్తారు, నిప్పు అంటించేస్తారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జగత్తుకు అధిపతులుగా తయారయ్యేందుకు లేక విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు ముఖ్యంగా కామ వికారముపై విజయము పొందాలి. సంపూర్ణ నిర్వికారులుగా తప్పకుండా అవ్వాలి.

2. ఏ విధంగా మనకు తండ్రి లభించారో, అదే విధంగా అందరినీ తండ్రితో కలిపేందుకు ప్రయత్నించాలి. తండ్రి యొక్క సత్యమైన పరిచయమునివ్వాలి. సత్యాతి సత్యమైన యాత్రను నేర్పించాలి.

వరదానము:-

సైలెన్స్ శక్తి ద్వారా సెకండులో ప్రతి సమస్యను పరిష్కరించే ఏకాంతవాసీ భవ

ఏదైనా కొత్త లేక శక్తిశాలీ ఆవిష్కరణను చేసినప్పుడు అండర్ గ్రౌండ్ లో చేస్తారు. ఇక్కడ ఏకాంతవాసులుగా అవ్వడమే అండర్ గ్రౌండ్. మీకు ఎంత సమయం లభించినా, కార్యవ్యవహారాలు చేస్తూ, వింటూ-వినిపిస్తూ, డైరెక్షన్లు ఇస్తూ కూడా ఈ దేహపు ప్రపంచము మరియు దేహ భానము నుండి అతీతంగా సైలెన్స్ లోకి వెళ్ళిపోండి. ఈ అభ్యాసమును లేక అనుభవమును చేసుకునే మరియు చేయించే స్టేజి ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. దీని ద్వారా ఒక్క సెకండులో ఎవరికైనా శాంతి లేక శక్తిని అనుభూతి చేయిస్తారు. ఎవరు మీ ముందుకు వచ్చినా, వారు ఈ స్టేజ్ లోనే సాక్షాత్కారాన్ని అనుభవం చేసుకుంటారు.

స్లోగన్:-

వ్యర్థ సంకల్పాలు లేక వికల్పాల నుండి పక్కకు తప్పుకుని ఆత్మిక స్థితిలో ఉండడమే యోగయుక్తులుగా అవ్వడం.