15-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఈ సంగమయుగము ఎక్కే కళ యొక్క యుగము, ఇందులో అందరికీ మేలు జరుగుతుంది, అందుకే మీ ఎక్కే కళ వలన అందరికీ మేలు జరుగుతుందని అంటారు”

ప్రశ్న:-

బాబా బ్రాహ్మణ పిల్లలందరికీ చాలా చాలా అభినందనలను తెలుపుతారు - ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే బాబా అంటారు - నా పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు రావణుని సంకెళ్ళ నుండి విడుదలవుతారు, మీరు స్వర్గ రాజ్యాన్ని పొందుతారు, పాస్ విత్ ఆనర్ గా అవుతారు, నేను అవ్వను, అందుకే బాబా మీకు చాలా-చాలా అభినందనలను తెలుపుతారు. ఆత్మలైన మీరు గాలిపటాలు, మీ దారాలు నా చేతిలో ఉన్నాయి. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను.

గీతము:-

చివరికి ఆ రోజు రానే వచ్చింది..... (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్.....)

ఓంశాంతి. ఈ అమరకథను ఎవరు వినిపిస్తున్నారు? అమరకథ అనండి, సత్యనారాయణ కథ అనండి లేదా మూడవ నేత్రం కథ అనండి - మూడూ ముఖ్యమైనవి. ఇప్పుడు మీరు ఎవరి ఎదురుగా కూర్చున్నారు మరియు ఎవరు మీకు వినిపిస్తున్నారు? వీరు (బ్రహ్మా) కూడా చాలా సత్సంగాలు చేశారు. అక్కడైతే అందరూ మనుష్యులే కనిపిస్తారు. ఫలానా సన్యాసి కథను వినిపిస్తారని అంటారు. శివానందుడు వినిపిస్తారని అంటారు. భారతదేశంలో ఎన్నో సత్సంగాలున్నాయి. ప్రతి వీధిలోనూ సత్సంగముంది. మాతలు కూడా పుస్తకాలు తీసుకొని, కూర్చుని సత్సంగాలు జరుపుతూ ఉంటారు. అయితే అక్కడ మనుష్యులను చూడవలసి వస్తుంది, కానీ ఇక్కడ ఇది అద్భుతమైన విషయము. మీ బుద్ధిలో ఎవరు ఉన్నారు? పరమాత్మ. ఇప్పుడు బాబా మన ఎదురుగా వచ్చి ఉన్నారని, నిరాకార బాబా మమ్మల్ని చదివిస్తున్నారని మీరంటారు. ఆ ఈశ్వరుడు నామ రూపాలకు అతీతమైనవారని మనుష్యులు అంటారు. నామ రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదని తండ్రి అర్థము చేయిస్తారు. ఇక్కడ సాకార మనుష్యులెవ్వరూ చదివించడం లేదని పిల్లలైన మీకు తెలుసు, ఇకపోతే మొత్తం ప్రపంచములో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సాకారులే చదివిస్తారు. ఇక్కడైతే సుప్రీమ్ తండ్రి ఉన్నారు, వారిని నిరాకార గాడ్ ఫాదర్ అని అంటారు, ఆ నిరాకారుడు సాకారునిలో కూర్చుని చదివిస్తారు. ఇది పూర్తిగా కొత్త విషయము. వీరు ఫలానా పండితుడు, వీరు ఫలానా గురువు అని మీరు జన్మ జన్మలుగా వింటూ వచ్చారు. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. భారతదేశమైతే చాలా పెద్దది. ఇక్కడ ఏమి నేర్పించినా, అర్థం చేయించినా, అది మనుష్యులే నేర్పిస్తారు. మనుష్యులే శిష్యులుగా అయ్యారు. అనేక రకాల మనుష్యులున్నారు. ఫలానా వారు వినిపిస్తున్నారని అంటారు. ఎప్పుడూ శరీరము పేరునే తీసుకోవడం జరుగుతుంది. భక్తి మార్గములో ఓ పతిత పావనా రండి అని నిరాకారుడినే పిలుస్తారు. వారే వచ్చి పిల్లలకు అర్థము చేయిస్తారు. కల్ప-కల్పము పతితంగా అవుతున్న మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేసేవారు ఒక్క నిరాకార తండ్రి మాత్రమేనని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు, మీలో కూడా కొంతమంది కచ్చాగా (అపరిపక్వంగా) ఉన్నారు, కొంతమంది పక్కాగా (పరిపక్వంగా) ఉన్నారు ఎందుకంటే అర్ధకల్పము మీరు దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు ఈ జన్మలో దేహీ అభిమానులుగా అవ్వాలి. మీ దేహంలో ఉండే ఆత్మకు పరమాత్మ కూర్చొని అర్థము చేయిస్తారు. ఆత్మనే సంస్కారాన్ని తీసుకువెళ్తుంది. నేను ఫలానా అని ఆత్మ ఇంద్రియాల ద్వారా చెప్తుంది కానీ ఆత్మాభిమానులుగా అయితే ఎవ్వరూ లేరు. ఈ భారతదేశంలో ఎవరైతే సూర్యవంశీయులు-చంద్రవంశీయులుగా ఉండేవారో, వారే ఈ సమయంలో వచ్చి బ్రాహ్మణులుగా అవుతారని, తర్వాత దేవతలుగా అవుతారని తండ్రి అర్థము చేయిస్తారు. మనుష్యులకు దేహాభిమానులుగా ఉండే అలవాటు ఉంది, దేహీ అభిమానులుగా ఉండడం మర్చిపోతారు, అందుకే తండ్రి దేహీ అభిమానులుగా అవ్వండి అని పదే-పదే చెప్తారు. ఆత్మయే రకరకాల వస్త్రాలను (శరీరము) ధరించి పాత్రను అభినయిస్తుంది. ఇవి ఆత్మకు ఇంద్రియాలు. ఇప్పుడు తండ్రి పిల్లలకు మన్మనాభవ అని చెప్తున్నారు. అయితే, కేవలం గీతను చదవడంతో రాజ్య భాగ్యము ఏమీ లభించదు. ఈ సమయంలో మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారుచేయడం జరుగుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. నేను మీకు రాజయోగమును నేర్పిస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. కృష్ణుడైతే సత్యయుగ రాకుమారుడు. సూర్యవంశీ దేవతలుగా ఎవరైతే ఉండేవారో, వారిలో జ్ఞానమేమీ ఉండేది కాదు. జ్ఞానము అయితే ప్రాయః లోపమైపోతుంది. జ్ఞానము అనేది సద్గతి కోసమే ఉన్నది. సత్యయుగములో దుర్గతిలో ఎవరూ ఉండరు. అది సత్యయుగము. ఇప్పుడిది కలియుగము. భారతదేశంలో మొదట సూర్యవంశీయులు 8 జన్మలను తీసుకుంటారు, తర్వాత చంద్రవంశీయులు 12 జన్మలను తీసుకుంటారు. ఇప్పుడు మీ ఈ ఒక్క జన్మ అన్నింటికన్నా మంచి జన్మ. మీరు ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి. ఇది సర్వోత్తమమైన ధర్మము. దేవతా ధర్మాన్ని సర్వోత్తమమైన ధర్మమని అనరు. బ్రాహ్మణ ధర్మము అన్నింటికన్నా ఉన్నతమైనది. దేవతలైతే ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు.

ఈ రోజుల్లో సోషల్ వర్కర్లు చాలామంది ఉన్నారు. మీది ఆత్మిక సేవ. వారు దైహిక సేవను చేస్తారు. ఆత్మిక సేవ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇంతకుముందు ఈ సోషల్ వర్కర్లు మొదలైనవారు ఉండేవారు కాదు. రాజా-రాణులు రాజ్యము చేసేవారు. సత్యయుగములో దేవీ-దేవతలుండేవారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. లక్ష్మీనారాయణులు ద్వాపరయుగములో వామమార్గములోకి వెళ్ళినప్పుడు మందిరాలను నిర్మిస్తారు. మొట్టమొదట శివుని మందిరాన్ని నిర్మిస్తారు. వారు సర్వుల సద్గతిదాత కనుక తప్పకుండా వారికి పూజ జరగాలి. శివబాబాయే ఆత్మలను నిర్వికారులుగా తయారుచేసారు కదా. ఆ తర్వాత దేవతలకు పూజ జరుగుతుంది. మీరే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ మీరే పూజారులుగా అయ్యారు. చక్రాన్ని గుర్తు చేస్తూ ఉండండి అని బాబా అర్థం చేయించారు. మెట్లు దిగుతూ-దిగుతూ పూర్తిగా నేలపైకి వచ్చి పడ్డారు. ఇప్పుడు మీది ఎక్కే కళ. మీ ఎక్కే కళ వలన అందరికీ మేలు జరుగుతుందని అంటారు. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులను ఇప్పుడు ఎక్కే కళలోకి తీసుకువెళ్తాను. పతితపావనుడు వచ్చి అందరినీ పావనంగా చేస్తారు. సత్యయుగము ఉన్నప్పుడు ఎక్కే కళ ఉండేది, ఆ సమయంలో మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములో ఉండేవి.

తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, నా జన్మ భారతదేశంలోనే జరుగుతుంది. శివబాబా వచ్చారని గాయనం ఉంది. ఇప్పుడు వారు మళ్ళీ వచ్చారు. దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. స్వరాజ్యాన్ని పొందేందుకు యజ్ఞము రచించబడింది. అప్పుడు కూడా విఘ్నాలు కలిగాయి, ఇప్పుడు కూడా కలుగుతున్నాయి. మాతలపై అత్యాచారాలు జరుగుతాయి. బాబా, వీరు మమ్మల్ని వివస్త్రలుగా చేస్తున్నారు, మమ్మల్ని వదిలి పెట్టడం లేదు, బాబా, మమ్మల్ని రక్షించండి అని అంటారు. ద్రౌపది రక్షణ జరిగినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి 21 జన్మల కోసం వారసత్వమును తీసుకునేందుకు వచ్చారు. స్మృతి యాత్రలో ఉంటూ స్వయాన్ని పవిత్రంగా తయారుచేసుకుంటారు. మళ్ళీ వికారాలలోకి వెళ్ళినట్లయితే ఇక సమాప్తమైపోతారు, పూర్తిగా పడిపోతారు, అందుకే తప్పకుండా పవిత్రంగా ఉండాలని తండ్రి అంటారు. ఎవరైతే కల్పక్రితము పవిత్రంగా అయ్యారో, వారే పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేస్తారు, ఇక తర్వాత కొంతమంది పవిత్రంగా ఉండగలరు, కొంతమంది ఉండలేరు. ముఖ్యమైన విషయము స్మృతికి సంబంధించినది. స్మృతి చేస్తూ, పవిత్రంగా ఉంటూ, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. విష్ణువు యొక్క రెండు రూపాలు రాజ్యం చేస్తారు కదా. కానీ విష్ణువుకు ఏవైతే శంఖము, చక్రములను ఇచ్చారో, అవి దేవతలకు ఉండవు. లక్ష్మీనారాయణులకు కూడా ఉండేవి కావు. విష్ణువైతే సూక్ష్మవతనంలో ఉంటారు, వారికి చక్రం జ్ఞానము యొక్క అవసరము లేదు. అక్కడ మూవీ నడుస్తుంది. మనము శాంతిధామ నివాసులమని ఇప్పుడు మీకు తెలుసు. అది నిరాకారీ ప్రపంచము. ఆత్మ అంటే ఏమిటో కూడా మనుష్యమాత్రులకు తెలియదు. ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఆత్మ ఒక ప్రకాశించే నక్షత్రమని, అది భృకుటి మధ్యలో ఉంటుందని అంటారు. ఈ కనులతో ఆత్మను చూడలేరు. అద్దాల పెట్టె మొదలైనవాటిలో శరీరాన్ని బంధించి ఆత్మ బయటకు ఎలా వస్తుంది అనేది చూడాలని, ఎవరు ఎంతగా ప్రయత్నించినా సరే చూడలేరు. ప్రయత్నం చేస్తారు కానీ ఆత్మ అంటే ఏమిటి, ఎలా బయటకు వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఆత్మ నక్షత్రము వలె ఉంటుందని మాత్రం అంటారు. దివ్యదృష్టి లేకుంటే దానిని చూడలేరు. భక్తి మార్గములో చాలా మందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. అర్జునుడికి అఖండ జ్యోతి సాక్షాత్కారము జరిగినట్లుగా, నేను సహించలేను అని అర్జునుడు అన్నట్లుగా వ్రాశారు. నేనేమీ అంతటి తేజోమయుడిని కాను అని తండ్రి అర్థము చేయిస్తారు. ఆత్మ వచ్చి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీకు తెలియదు. బాబా ఎలా ప్రవేశించి మాట్లాడుతారు అనేది మీకు కూడా ఇప్పుడు తెలుసు. ఆత్మయే వచ్చి మాట్లాడుతుంది. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది, ఇందులో ఎవ్వరి శక్తి యొక్క విషయము లేదు. ఆత్మ ఏమీ శరీరాన్ని వదిలి వెళ్ళదు. ఇది సాక్షాత్కారము యొక్క విషయము. ఇది అద్భుతమైన విషయము కదా. నేను కూడా సాధారణ తనువులోకి వస్తాను అని తండ్రి అంటారు. ఆత్మను పిలుస్తారు కదా. ఇంతకుముందు ఆత్మలను పిలిచి వారిని అడిగేవారు కూడా. ఇప్పుడు తమోప్రధానమైపోయారు కదా. పతితులైన మనల్ని పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు. 84 జన్మలు అని కూడా అంటారు. ఎవరైతే మొదట వచ్చారో, వారే తప్పకుండా 84 జన్మలు తీసుకొని ఉంటారని అర్థము చేసుకోవాలి. వారైతే లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు - నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను, మీరే వెళ్ళి రాజ్యం చేశారు, భారతవాసులైన మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను, సంగమయుగములో రాజయోగాన్ని నేర్పించాను. నేను కల్పము యొక్క సంగమయుగములో వస్తానని తండ్రి అంటారు. గీతలో యుగే యుగే అనే పదాలు వ్రాసేశారు.

మనము మెట్లను ఎలా దిగుతాము, మళ్ళీ ఎలా ఎక్కుతాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఎక్కే కళ, తర్వాత దిగే కళ. ఇప్పుడు ఈ సంగమయుగము సర్వుల ఎక్కే కళ యొక్క యుగము. అందరూ ఎక్కేస్తారు. అందరూ పైకి వెళ్ళిపోతారు, తర్వాత మీరు స్వర్గములో పాత్రను అభినయించేందుకు వస్తారు. సత్యయుగములో వేరే ధర్మమేదీ ఉండేది కాదు. దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు. తర్వాత దేవీ దేవతలు వామమార్గములోకి వెళ్ళి అందరూ వికారులుగా అవ్వడం మొదలుపెడతారు, యథా రాజా-రాణి, తథా ప్రజ అందరూ వికారులుగా అయిపోతారు. ఓ భారతవాసులారా, మీరు నిర్వికారీ ప్రపంచములో ఉండేవారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. అనేక ధర్మాలున్నాయి కానీ ఒక్క దేవీదేవతా ధర్మము మాత్రము లేదు. తప్పకుండా దేవతా ధర్మము లేనప్పుడే మళ్ళీ స్థాపన జరుగుతుంది. నేను బ్రహ్మా ద్వారా వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను అని తండ్రి అంటారు. ఇక్కడే చేస్తారు కదా. సూక్ష్మవతనంలో అయితే చేయరు. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము యొక్క రచనను రచిస్తారని రాసి ఉంది. ఈ సమయంలో మిమ్మల్ని పావనమైనవారని అనరు. పావనంగా అవుతున్నారు. సమయం పడుతుంది కదా. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అనేది ఏ శాస్త్రములోనూ లేదు. వాస్తవానికి ఈ మహిమ అయితే ఒక్క తండ్రిది మాత్రమే. ఆ తండ్రిని మర్చిపోయిన కారణంగానే అనాథలుగా అయిపోయారు. కొట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కలిసిపోయి ఒక్కటిగా ఎలా అవ్వాలని అంటారు. వారందరూ సోదరులు కదా. బాబా అయితే అనుభవజ్ఞులు. వీరు భక్తిని కూడా పూర్తిగా చేశారు. అందరికన్నా ఎక్కువమంది గురువులను ఆశ్రయించారు. ఇప్పుడు వారందరినీ వదలేయండి, ఇప్పుడు నేను మీకు లభించానని తండ్రి అంటారు. వారిని సర్వుల సద్గతిదాత, సత్ శ్రీ అకాల్ అని అంటారు కదా. చాలా చదువుతూ ఉంటారు కానీ అర్థము తెలుసుకోరు. ఇప్పుడు అందరూ పతితంగా ఉన్నారని, మళ్ళీ పావన ప్రపంచము తయారవుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. భారతదేశమొక్కటే అవినాశీ. ఇది ఎవ్వరికీ తెలియదు. భారతదేశము ఎప్పుడూ వినాశనమవ్వదు మరియు ప్రళయం ఎప్పుడూ జరగదు. సాగరములో రావి ఆకు పై శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా చూపిస్తారు - ఇప్పుడు రావి ఆకు పై బాలుడు రాలేడు. మీరు గర్భము ద్వారా చాలా విశ్రాంతిగా జన్మ తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తారు. అక్కడ గర్భ మహల్ అని అంటారు. ఇక్కడ గర్భ జైలు ఉంటుంది. సత్యయుగములో గర్భ మహల్ ఉంటుంది. ఈ తనువును వదిలి మరొకటి తీసుకోవాలని ఆత్మకు ముందే సాక్షాత్కారమవుతుంది. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. మనుష్యులకు రచయిత గురించి గాని, రచన ఆదిమధ్యాంతాల గురించి గాని తెలియదు. తండ్రి జ్ఞానసాగరుడు అని మీకిప్పుడు తెలుసు. మీరు మాస్టర్ సాగరులు. మీరు (మాతలు) నదులు మరియు ఈ గోపులు జ్ఞాన మానసరోవరాలు. మీరు జ్ఞాన నదులు. వారు సరోవరాలు. ప్రవృత్తి మార్గము కావాలి కదా. మీది పవిత్రమైన గృహస్థ ఆశ్రమముగా ఉండేది. ఇప్పుడు పతితంగా ఉంది. నేను ఒక ఆత్మను అన్నది సదా గుర్తుంచుకోండి అని తండ్రి అంటారు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహధారినీ గుర్తు చేయకండి అని బాబా ఆజ్ఞాపించారు. ఈ కనులతో చూసేదంతా సమాప్తమవ్వనున్నది, అందుకే తండ్రి అంటారు - మన్మనాభవ, మధ్యాజీభవ. ఈ శ్మశానవాటికను మర్చిపోతూ వెళ్ళండి. మాయా తుఫానులైతే చాలా వస్తాయి, వాటికి భయపడకూడదు. చాలా తుఫానులు వస్తాయి కానీ కర్మేంద్రియాలతో కర్మలు చేయకూడదు. మీరు తండ్రిని మర్చిపోయినప్పుడే తుఫానులు వస్తాయి. ఈ స్మృతియాత్ర ఒక్కసారే ఉంటుంది. అవి మృత్యులోక యాత్రలు, ఇది అమరలోక యాత్ర. ఏ దేహధారినీ గుర్తు చేయకండి అని ఇప్పుడు తండ్రి అంటారు.

పిల్లలు శివజయంతికి ఎన్ని టెలిగ్రాములు పంపిస్తారు. తండ్రి తతత్వమ్ అని అంటారు. పిల్లలైన మీకు కూడా తండ్రి అభినందనలు తెలుపుతున్నారు. వాస్తవానికి మీకే అభినందనలు ఎందుకంటే మీరే మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇక ఎవరైతే పాస్ విత్ ఆనర్ అవుతారో, వారికి ఎక్కువ మార్కులు లభిస్తాయి మరియు మంచి నంబరు లభిస్తుంది. ఇప్పుడు మీరు రావణుడి సంకెళ్ళ నుండి విడుదలవుతారని తండ్రి మీకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆత్మలందరూ గాలిపటాలు. అందరి దారాలు తండ్రి చేతిలో ఉన్నాయి. వారు అందరినీ తీసుకువెళ్తారు. వారు సర్వుల సద్గతిదాత. కానీ మీరు స్వర్గ రాజ్యమును పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయాలి, ఏ దేహధారినీ గుర్తు చేయకూడదు. ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో, దానిని చూస్తూ కూడా చూడకూడదు.

2. మనము అమరలోక యాత్రకు వెళ్తున్నాము కనుక మృత్యులోకానికి సంబంధించినది ఏమీ గుర్తు రాకూడదు, ఈ కర్మేంద్రియాలతో ఏ వికర్మ జరగకూడదు, ఈ అటెన్షన్ పెట్టుకోవాలి.

వరదానము:-

అతీంద్రియ సుఖమయ స్థితి ద్వారా అనేక ఆత్మలను ఆహ్వానించే విశ్వకళ్యాణకారీ భవ

లాస్ట్ కర్మాతీత స్థితి ఎంతగా సమీపంగా వస్తూ ఉంటుందో, అంతగా శబ్దానికి అతీతమైన శాంతి స్వరూప స్థితి ఎక్కువగా ప్రియమనిపిస్తుంది - ఈ స్థితిలో సదా అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి కలుగుతుంది మరియు ఈ అతీంద్రియ సుఖమయ స్థితి ద్వారానే అనేక ఆత్మలను సహజంగా ఆహ్వానించగలరు. ఈ పవర్ ఫుల్ స్థితియే విశ్వ కళ్యాణకారీ స్థితి. ఈ స్థితి ద్వారా ఎంత దూరంగా ఉన్న ఆత్మకైనా సరే సందేశాన్ని చేర్చగలరు.

స్లోగన్:-

ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకొని విశ్వాసపాత్రులుగా అయినట్లయితే సంగఠన ఏకమతంగా అవుతుంది.