15-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - నాజూకుతనము కూడా దేహాభిమానము, అలగడము, ఏడ్వడము, ఈ ఆసురీ సంస్కారాలు పిల్లలైన మీలో ఉండకూడదు, దుఃఖం-సుఖం, మానావమానాలు అన్నిటినీ సహనం చేయాలి”

ప్రశ్న:-

సేవలో ఢీలాతనం రావడానికి ముఖ్యమైవ కారణమేమిటి?

జవాబు:-

దేహాభిమానము కారణంగా ఒకరి బలహీనతలు ఒకరు చూడడం మొదలుపెట్టినప్పుడు సేవలో ఢీలాతనం వస్తుంది. పరస్పరం మనస్పర్థలు ఉండడం కూడా దేహాభిమానము. నేను ఫలానావారితో నడువలేను, నేను ఇక్కడ ఉండలేను...... ఇదంతా నాజూకుతనము. ఇటువంటి మాటలు నోటి నుండి రావడం అనగా ముల్లుగా అవ్వడము, ఆజ్ఞకారులుగా అవ్వకపోవడము. మీరు ఆత్మిక మిలిటరీ కనుక ఆర్డరు లభించిన వెంటనే హాజరవ్వాలి, ఏ విషయాన్ని పెడచెవిన పెట్టకండి.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి అని పిల్లలకు మొట్టమొదట ఈ శిక్షణ లభిస్తుంది. దేహాభిమానమును వదిలి దేహీ-అభిమానులుగా అవ్వాలి. నేను ఒక ఆత్మను, దేహీ అభిమానిగా అయినప్పుడే తండ్రిని స్మృతి చేయగలను. అది అజ్ఞాన కాలము. ఇది జ్ఞాన కాలము. సర్వులకూ సద్గతినిచ్చే ఆ తండ్రి ఒక్కరు మాత్రమే జ్ఞానమునిస్తారు. మరియు వారు నిరాకారుడు అనగా వారికి మనుష్య ఆకారమేమీ లేదు. ఎవరికైతే మనుష్య ఆకారముంటుందో, వారిని భగవంతుడని అనలేము. ఇప్పుడు ఆత్మలన్నీ నిరాకారీనే. కానీ దేహాభిమానములోకి రావడంతో స్వయాన్ని ఆత్మ అని మర్చిపోయారు. మీరు తిరిగి వెళ్ళాలి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తే జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి, ఇంకే ఉపాయమూ లేదు. ఆత్మనే పతితంగా, ఆత్మనే పావనంగా అవుతుంది. సత్య-త్రేతా యుగాలలో పావన ఆత్మలు ఉంటాయని తండ్రి అర్థం చేయించారు. రావణ రాజ్యములో మళ్ళీ పతితాత్మగా అవుతుంది. పావనంగా ఉన్నవారే పతితంగా అయ్యారని మెట్ల చిత్రంలో కూడా అర్థం చేయించారు. 5 వేల సంవత్సరాల క్రితం ఆత్మలైన మీరందరూ శాంతిధామంలో పావనంగా ఉండేవారు. దానిని నిర్వాణధామమని అంటారు. కలియుగములో మళ్ళీ పతితంగా అయినప్పుడు ఓ పతితపావనా రండి అని ఆర్తనాదాలు చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలూ, నేను మీకు పతితుల నుండి పావనంగా అయ్యే జ్ఞానమునేదైతే ఇస్తున్నానో, అది కేవలం నేను మాత్రమే ఇస్తాను, అది తర్వాత ప్రాయః లోపమైపోతుంది. తండ్రికి మాత్రమే వచ్చి వినిపించాల్సి వస్తుంది. ఇక్కడ మనుష్యులు అనేక శాస్త్రాలు తయారుచేశారు. సత్యయుగంలో శాస్త్రాలేవీ ఉండవు. అక్కడ అంశమాత్రము కూడా భక్తి మార్గముండదు.

మీరు నా ద్వారా మాత్రమే పతితుల నుండి పావనంగా అవ్వగలరు అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. పావన ప్రపంచం తప్పకుండా తయారవ్వవలసిందే. నేనైతే పిల్లలకే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. అలగడం, ఏడ్వడం ఇదంతా ఆసురీ స్వభావము. పిల్లలు దుఃఖము-సుఖము, మానావమానాలు అన్నిటినీ సహనం చేయాలి, నాజూకుతనము ఉండకూడదు అని తండ్రి అంటున్నారు. నేను ఫలానా స్థానములో ఉండలేను, ఇది కూడా నాజూకుతనము. వీరి స్వభావము ఇలా ఉంది, వీరు ఇలాంటివారు, అలాంటివారు, అసలు ఇవేవీ ఉండకూడదు. నోటి నుండి సదా పుష్పాలే వెలువడాలి. ముళ్ళు వెలువడకూడదు. ఎంతోమంది పిల్లల నోటి నుండి చాలా ముళ్ళు వెలువడుతూ ఉంటాయి. ఎవరిపైనైనా కోపం చేయడం కూడా ముల్లు వంటిదే. పిల్లలకు పరస్పరంలో చాలా మనస్పర్థలు ఉంటాయి. దేహాభిమానలుగా ఉన్న కారణంగా ఇతరుల లోపాలను చూస్తూ, స్వయంలో అనేక రకాల లోపాలు మిగిలిపోతాయి, అందుకే సేవ మళ్ళీ ఢీలాగా అయిపోతుంది. ఇది కూడా డ్రామానుసారంగా జరుగుతుందని బాబా భావిస్తారు. కానీ పరివర్తన అవ్వాలి కదా. మిలిటరీ వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులతో యుద్ధము చేయడమే వారి పని. వరదలు వచ్చినా లేక ఏవైనా గొడవలు జరిగినా కూడా మిలిటరీ వారినే పిలుస్తారు. అప్పుడు మిలిటరీ వారు కూలీలు మొదలైనవారు చేసే పనిని కూడా చేయడం మొదలుపెడతారు. గవర్నమెంట్ మిలిటరీ వారికి ఈ మట్టినంతా నింపండి అని ఆర్డర్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా చేసేందుకు రాకపోతే తుపాకీతో కాల్చేస్తారు. గవర్నమెంట్ ఆర్డర్ ను అంగీకరించవలసిందే. మీరు కూడా సేవ చేసేందుకు బంధింపబడి ఉన్నారని తండ్రి అంటున్నారు. తండ్రి సేవ కోసం ఎక్కడికి వెళ్ళమని చెప్పినా, వెంటనే హాజరవ్వాలి. అంగీకరించకపోతే వారిని మిలిటరీ అని అనరు. అటువంటివారు బాబా హృదయాన్ని అధిరోహించలేరు. మీరు అందరికీ సందేశమునివ్వడంలో తండ్రికి సహాయకులు. ఒకవేళ ఎక్కడైనా పెద్ద మ్యూజియంను తెరిస్తే, అది 10 మైళ్ళ దూరమని అంటారు, సేవ కోసమైతే వెళ్ళాలి కదా. ఖర్చు గురించి ఆలోచించకూడదు. అతి గొప్ప గవర్నమెంట్ అయిన అనంతమైన తండ్రి నుండి ఆర్డర్ లభిస్తుంది, వారి రైట్ హ్యాండ్ ధర్మరాజు. వారి శ్రీమతంపై నడవకపోతే పడిపోతారు. మీ కళ్ళను పవిత్రంగా చేసుకోండి అని శ్రీమతం చెప్తుంది. కామంపై విజయం పొందే ధైర్యం వహించాలి. ఇది తండ్రి ఆజ్ఞ, ఒకవేళ మనం పాటించకపోతే పూర్తిగా ముక్కలు-ముక్కలుగా అయిపోతాము. 21 జన్మల రాజ్యంలో నష్టం వాటిల్లుతుంది. నన్ను పిల్లలు తప్ప ఇంకెవ్వరూ ఎప్పుడూ తెలుసుకోలేరని తండ్రి అంటున్నారు. కల్పక్రితము వారే నెమ్మది-నెమ్మదిగా వెలువడుతూ ఉంటారు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఇది గీతా యుగము. కానీ శాస్త్రాలలో ఈ సంగమయుగము యొక్క వర్ణన లేదు. గీతనే ద్వాపర యుగములోకి తీసుకువెళ్ళారు. కానీ రాజయోగము నేర్పించినప్పుడు తప్పకుండా సంగమయుగము ఉంటుంది కదా. కానీ ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క నషా ఎక్కి ఉంది. మనుష్యులది భక్తి మార్గం యొక్క నషా. భగవంతుడు వచ్చినా కూడా మేము భక్తిని వదలము అని అంటారు. ఈ ఉన్నతి మరియు పతనం యొక్క మెట్ల చిత్రము చాలా బాగుంది, అయినా మనుష్యుల కళ్ళు తెరుచుకోవు. మాయ నషాలో పూర్తిగా ముక్కలు-ముక్కలుగా అయిపోయారు. జ్ఞానము యొక్క నషా చాలా ఆలస్యంగా ఎక్కుతుంది. మొదటైతే దైవీ గుణాలు కూడా కావాలి. తండ్రి ఇచ్చిన ఏ ఆర్డరునైనా పెడచెవిన పెట్టకూడదు. ఇది నేను చేయలేను, ఇలా అనేవారిని ఆజ్ఞను ఉల్లంఘించేవారు అని అంటారు. ఇలా-ఇలా చేయాలి అని శ్రీమతము లభిస్తున్నప్పుడు ఇది శివబాబా యొక్క శ్రేష్ఠ మతము అని భావించాలి. వారే సద్గతిదాత. దాత ఎప్పుడూ తప్పుడు మతమునివ్వరు. నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను అని బాబా అంటున్నారు. వీరి కన్నా లక్ష్మి ఉన్నతంగా వెళ్ళిపోతారు చూడండి. స్త్రీలను ముందు పెట్టడం జరుగుతుంది అని గాయనం కూడా ఉంది. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు, యథా రాజా రాణి తథా ప్రజా ఉంటుంది. మీరు కూడా అంత శ్రేష్ఠంగా తయారవ్వాలి. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యముంది. అందరూ రామరాజ్యము కావాలని అంటారు. ఇప్పుడు ఇది సంగమయుగము. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు రావణరాజ్యము లేదు, తర్వాత ఎలా చేంజ్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందరూ ఘోరమైన అంధకారములో ఉన్నారు. కలియుగము ఇంకా చిన్నబాలునిగా ఉందని, పాకుతూ ఉందని భావిస్తారు. కావున మనుష్యులు ఇంకా నిద్రలో నిద్రపోతున్నారు. ఈ ఆత్మిక జ్ఞానము, ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మలకు ఇస్తారు, రాజయోగం కూడా నేర్పిస్తారు. కృష్ణుడిని ఆత్మిక తండ్రి అని అనరు. ఓ ఆత్మిక పిల్లలూ, అని వారు ఈ విధంగా అనరు. జ్ఞానసాగరుడైన ఆత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక పిల్లలకు ఇస్తున్నారని కూడా వ్రాయాలి.

ప్రపంచములోని మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను ఆత్మను అన్నది ఎవ్వరికీ తెలియదు. ఏ ఆత్మ కూడా లీనమవ్వదు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు దసరా అంటే ఏమిటో, దీపావళి అంటే ఏమిటో అర్థము చేయించడం జరిగింది. మనుష్యులు చేసే పూజలు, మొదలైనవన్నీ అంధ విశ్వాసము, వాటిని బొమ్మల పూజ అని అంటారు, రాతి పూజ అని అంటారు. ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు కావున రాతి పూజ చేయరు. చిత్రాల ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. కొంచెం కూడా అర్థము చేసుకోరు. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని కూడా అంటారు. అర్థకల్పము జ్ఞానం నడిచింది, తర్వాత భక్తి ప్రారంభమయ్యింది. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది కనుక భక్తిపై వైరాగ్యము కలుగుతుంది. ఈ ప్రపంచమే మార్పు చెందుతుంది. కలియుగంలో భక్తి ఉంది. సత్యయుగములో భక్తి ఉండదు. అక్కడ ఉండేదే పూజ్యులు. పిల్లలూ, మీరు ఎందుకు తల వంచుతారు, అర్థకల్పము నుండి మీ నుదురు కూడా అరిగిపోయింది, ధనము కూడా పోగొట్టుకున్నారు, ఏమీ లభించలేదు అని తండ్రి అంటున్నారు. మాయ మీ తలను పూర్తిగా తిప్పేసింది. నిరుపేదగా చేసేసింది. తర్వాత తండ్రి వచ్చి అందరి తలలను సరి చేస్తారు. ఇప్పుడు నెమ్మది-నెమ్మదిగా కొంతమంది యూరోపియన్లు కూడా అర్థము చేసుకుంటారు. ఈ భారతవాసులైతే పూర్తిగా తమోగుణీగా అయిపోయారని తండ్రి అర్థం చేయించారు. ఇతర ధర్మాలవారు ఇంకా వెనుక వస్తారు, అప్పుడు సుఖము కూడా తక్కువగా, దుఃఖము కూడా తక్కువగానే లభిస్తుంది. భారతవాసులకు సుఖమూ ఎక్కువే ఉంటుంది, దుఃఖం కూడా ఎక్కువే ఉంటుంది. ప్రారంభంలోనే ఎంత ధనవంతులుగా, పూర్తి విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇతర ధర్మాలవారెవ్వరూ ప్రారంభములో ధనవంతులుగా అవ్వరు. తర్వాత వృద్ధి చెందుతూ-చెందుతూ ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అందరికన్నా భారతదేశమే బికారిగా అయ్యింది. అంధ విశ్వాసం ఉన్నవారు కూడా భారతదేశములోనే ఉన్నారు. ఇది కూడా డ్రామా తయారుచేయబడింది. నేను దేనినైతే స్వర్గంగా తయారుచేశానో, అది నరకంగా అయిపోయింది అని తండ్రి చెప్తున్నారు. మనుష్యులు కోతిబుద్ధి కలవారిగా అయిపోయారు, నేను వచ్చి వారిని మందిరయోగ్యులుగా చేస్తాను. వికారాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎంత క్రోధముంది. మీలో ఏ మాత్రము క్రోధముండకూడదు. పూర్తిగా మధురంగా, శాంతిగా, అతి మధురంగా అవ్వండి. కోట్లలో ఏ ఒక్కరో రాజ్యపదవిని పొందేవారు వెలువడుతారని కూడా మీకు తెలుసు. నేను మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. అందులో కూడా ముఖ్యంగా అష్టరత్నాలు గాయనం చేయబడతారు. అష్టరత్నాలు మరియు మధ్యలో తండ్రి ఉన్నారు. 8 మంది పాస్ విత్ ఆనర్స్, అది కూడా నంబరువారు పురుషార్థానుసారంగా అవుతారు. దేహాభిమానమును తొలగించుకోవడం చాలా శ్రమ అనిపిస్తుంది. దేహ భానము పూర్తిగా తొలగిపోవాలి. కొంతమంది పక్కా బ్రహ్మా జ్ఞానులకు కూడా ఇలాగే జరుగుతుంది. వారు కూర్చుని-కూర్చుని దేహాన్ని త్యాగము చేస్తారు. కూర్చుని-కూర్చుని అలా శరీరం విడిచిపెడతారు, వాయుమండలము పూర్తిగా శాంతిగా అయిపోతుంది మరియు చాలావరకు శుద్ధమైన ప్రభాత సమయంలో శరీరాన్ని విడిచిపెడతారు. రాత్రివేళ మనుష్యులు చాలా అశుద్ధంగా ఉంటారు, ఉదయం స్నానము మొదలైనవి చేసి భగవంతుడా-భగవంతుడా అని అనడం ప్రారంభిస్తారు. పూజలు చేస్తారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రదర్శినీ మొదలైనవాటిలో కూడా మొట్టమొదట మీరు అల్ఫ్ (బాబా) యొక్క పరిచయాన్నివ్వండి. మొదట అల్ఫ్ (బాబా) తర్వాత బే (వారసత్వము). ఆ నిరాకారుడు ఒక్కరే తండ్రి. రచయిత అయిన తండ్రినే కూర్చుని రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానమును అర్థం చేయిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండని ఆ తండ్రే చెప్తున్నారు. మీరు తండ్రి పరిచయాన్నిస్తే ఇక ఎవ్వరికీ ప్రశ్నోత్తరాలు చేసే ధైర్యముండదు. మొదట తండ్రిపై నిశ్చయము పక్కా అయిన తర్వాత 84 జన్మలు ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పండి. చక్రాన్ని అర్థము చేసుకుంటే, తండ్రిని అర్థము చేసుకుంటే ఇంకే ప్రశ్నలూ రావు. తండ్రి పరిచయాన్నివ్వకుండా మిగిలిన విషయాలు ఎన్ని చెప్పినాసరే, అందులో మీ సమయం చాలా వృథా అవుతుంది. గొంతు ఎండిపోతుంది. మొట్టమొదట అల్ఫ్ గురించి చెప్పండి. మిగతా విషయాలు ఎక్కువగా మాట్లాడడం వలన ఏమీ అర్థము చేసుకోలేరు. పూర్తిగా సింపుల్ గా మరియు నెమ్మదిగా కూర్చుని అర్థము చేయించాలి, ఎవరైతే దేహీ అభిమానులుగా ఉంటారో వారే బాగా అర్థము చేయించగలరు. పెద్ద-పెద్ద మ్యూజియంలలో బాగా అర్థం చేయించగలిగేవారు సహాయం అందించవలసి ఉంటుంది. కొన్ని రోజులు మీ సెంటర్లను వదిలి సహాయము అందించడానికి రావాలి. మీ వెనుక సెంటరును సంభాళించడానికి ఎవరినైనా కూర్చోబెట్టండి. ఒకవేళ ఎవరినీ తమ సమానంగా గద్దెను సంభాళించే యోగ్యంగా తయారుచేయకపోతే, ఇక దేనికీ పనికి రారని, సేవ చేయలేదని బాబా భావిస్తారు. సేవను వదిలి ఎలా వెళ్ళాలి అని బాబాకు వ్రాస్తారు. అరే, ఫలానా స్థానంలో ప్రదర్శిని ఉంది, సేవకు వెళ్ళండి అని బాబా ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ ఎవరినీ గద్దెకు యోగ్యంగా చేయకపోతే మీరు దేనికి పనికొస్తారు. బాబా ఆజ్ఞాపించారు, వెంటనే పరుగెత్తాలి. అటువంటివారిని మహారథీ బ్రాహ్మణీలని అంటారు. మిగిలినవారంతా గుర్రపు స్వారీ వారు, పాదచారులు. అందరూ సేవలో సహాయం చేయాలి. ఇన్ని సంవత్సరాలలో మీరు ఎవరినీ తమ సమానంగా తయారుచేయలేదంటే ఏమి చేస్తూ ఉన్నారు. ఇంత సమయంలో సెంటరును సంభాళించే సందేశకులను తయారుచేయలేదా. రకరకాల మనుష్యులు వస్తారు - వారితో మాట్లాడే తెలివి కూడా ఉండాలి. మురళీని కూడా తప్పకుండా రోజూ చదవుకోవాలి లేదా వినాలి. మురళీ చదవలేదంటే ఆబ్సెంట్ పడినట్లు. పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని చుట్టుముట్టాలి. మీరు మొత్తం విశ్వానికి సేవ చేస్తారు కదా. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడం చుట్టుముట్టడం కదా. అందరికీ ముక్తి-జీవన్ముక్తి ధామం యొక్క మార్గమును తెలియజేయాలి, దుఃఖము నుండి విడిపించాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చాలా మధురంగా, శాంతిగా, అతి మధురమైన స్వభావము కలవారిగా అవ్వాలి. ఎప్పుడూ క్రోధం చేయకూడదు. మీ కళ్ళను చాలా-చాలా పవిత్రంగా తయారుచేసుకోవాలి.

2. బాబా ఇచ్చే ఆజ్ఞలను వెంటనే అంగీకరించాలి. మొత్తం విశ్వాన్ని పతితము నుండి పావనంగా చేసే సేవ చేయాలి అనగా చుట్టుముట్టాలి.

వరదానము:-

తమ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకునే సదా వెలిగే జ్యోతి భవ

పిల్లలైన మీరు ప్రపంచానికి జ్యోతులు, మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుంది కావున గతించిన దానిని వదిలి మీ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకొని సదా వెలిగే జ్యోతులుగా అవ్వండి. మీరు సెకండులో స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయగలరు. కేవలం ఇప్పుడిప్పుడే కర్మయోగీ, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. ఎలాగైతే మీ రచన అయిన తాబేలు సెకండులో అన్ని ఇంద్రియాలను సర్దుకుంటుందో, అదే విధంగా మాస్టర్ రచయితలైన మీరు సర్దుకునే శక్తి ఆధారంతో సెకండులో అన్ని సంకల్పాలను ఇముడ్చుకుని ఒకే సంకల్పంలో స్థితులవ్వండి.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేసేందుకు స్మృతి-విస్మృతుల యుద్ధాన్ని సమాప్తం చేయండి.