16-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు మీ జీవితమనే దారాన్ని ఒక్క తండ్రితో ముడి వేసారు, మీ కనెక్షన్ ఒక్కరితోనే ఉంది, ఒక్కరితోనే తోడును నిర్వర్తించాలి”

ప్రశ్న:-

సంగమయుగములో ఆత్మ తన దారాన్ని పరమాత్మతో ముడి వేస్తుంది, అజ్ఞానములో ఇది ఏ ఆచారముగా కొనసాగుతూ వస్తుంది?

జవాబు:-

వివాహ సమయములో స్త్రీ కొంగును పతికి ముడి పెడతారు. జీవితాంతము వీరి సహచరిగానే అయ్యి ఉండాలని స్త్రీ భావిస్తుంది. మీరిప్పుడు మీ కొంగును తండ్రితో ముడి వేసారు. అర్థకల్పము కోసం మన పాలన తండ్రి ద్వారా జరుగుతుందని మీకు తెలుసు.

గీతము:-

జీవితమనే దారమును నీతోనే ముడి వేసుకున్నాను..... (జీవన్ డోర్ తుమ్ హీ సంగ్ బాందీ.....)

ఓంశాంతి. జీవితమనే దారమును నీతో ముడి వేసుకున్నానని పాటలో అంటారు చూడండి. ఒక కన్య, తన జీవితమనే కొంగును పతితో ముడి వేసుకుంటుంది. ఆమె జీవితాంతము వారికి సహచరిగానే అయ్యి ఉండాలని, వారే ఆమెను చూసుకోవాలని భావిస్తుంది. కన్య తన పతిని చూసుకోవాలని కాదు, పతి జీవితాంతము ఆమెను చూసుకోవాలి. పిల్లలైన మీరు కూడా తమ జీవిత దారమును ముడి వేసారు. అనంతమైన తండ్రి అనండి, టీచరు అనండి, గురువు అనండి ఏమన్నా అనండి..... ఆత్మల జీవితమనే దారమును పరమాత్మతో ముడి వేయాలి. అది హద్దు యొక్క స్థూలమైన విషయము, ఇది సూక్ష్మమైన విషయము. కన్య జీవితమనే దారమును పతితో ముడి వేయడం జరుగుతుంది. ఆమె అతని ఇంటికి వెళ్తుంది. చూడండి, ప్రతి ఒక్క విషయాన్ని అర్థము చేసుకునే బుద్ధి కావాలి. కలియుగములో అన్నీ ఆసురీ మతానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. మనము మన జీవితమనే దారమును ఒక్కరితోనే ముడి వేసుకున్నామని మీకు తెలుసు. మీ కనెక్షన్ ఒక్కరితోనే ఉంది. ఒక్కరితోనే తోడు నిర్వర్తించాలి ఎందుకంటే వారి నుండి మనకు చాలా మంచి సుఖము లభిస్తుంది. వారు మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. కనుక ఇటువంటి తండ్రి శ్రీమతముపై నడవాలి. ఇది ఆత్మిక దారము. ఆత్మయే శ్రీమతము తీసుకుంటుంది. ఆసురీ మతమును తీసుకోవడంతో కిందకు పడిపోయారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి శ్రీమతముపై నడుచుకోవాలి.

ఆత్మలైన మనము మన జీవితమనే దారమును పరమాత్మతో ముడి వేసామని మీకు తెలుసు, అందుకే మనకు వారి నుండి 21 జన్మలకు సదా సుఖము యొక్క వారసత్వము లభిస్తుంది. అక్కడ అల్పకాలిక జీవిత దారముల వలన (కొంగు ముడి వలన) కిందకు పడుతూ వచ్చారు. ఇక్కడ 21 జన్మలకు గ్యారంటీ ఉంది. మీ సంపాదన ఎంత గొప్పది, ఇందులో పొరపాట్లు చేయకూడదు. మాయ చాలా పొరపాట్లను చేయిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులు తప్పకుండా తమ జీవితమనే దారమును ఎవరితోనో ముడి వేసారు, దానితో వారికి 21 జన్మల వారసత్వము లభించింది. కల్ప-కల్పము ఆత్మలైన మీ జీవితమనే దారము పరమాత్మతో ముడి వేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు అనేది లెక్క లేదు. మనము శివబాబాకు చెందినవారిగా అయ్యామని, వారితో మన జీవితమనే దారమును ముడి వేసుకున్నామని బుద్ధిలో కూర్చుంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. కల్పక్రితము కూడా తండ్రితో ముడి వేసుకున్నామని మీకు తెలుసు. ఇప్పుడు శివజయంతిని జరుపుతారు, కానీ ఎవరిది జరుపుతున్నారు అనేది వారికి తెలియదు. పతిత పావనుడైన శివబాబా తప్పకుండా సంగమయుగములోనే వస్తారు. ఇది మీకు తెలుసు, ప్రపంచములోని వారికి తెలియదు, అందుకే కోట్లలో కొందరు అని అంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయః లోపమైపోయింది మరియు శాస్త్రాలు, కథలు మొదలైనవన్నీ మిగిలి ఉన్నాయి. ఈ ధర్మము లేనే లేనప్పుడు ఎలా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు జీవితమనే దారమును ముడి వేస్తున్నారు. ఆత్మల జీవితమనే దారము పరమాత్మతో జోడించబడింది, ఇందులో శరీరాల విషయమేమీ లేదు. ఇంట్లో కూర్చొని ఉన్నా, బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. ఆత్మలైన మీ జీవితమనే దారము ముడి వేయబడి ఉంది. కొంగు ముడి వేస్తారు కదా. అది స్థూలమైన కొంగు, ఇది పరమాత్మతో ఆత్మల యోగము. భారతదేశములో శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అనేది ఎవ్వరికీ తెలియదు. కృష్ణుని జయంతి ఎప్పుడు, రాముని జయంతి ఎప్పుడు అనేది వారికి తెలియదు. పిల్లలూ, మీరు త్రిమూర్తి శివజయంతి అనే పదమును వ్రాస్తారు కానీ ఈ సమయంలో ముగ్గురు మూర్తులు లేనే లేరు. శివబాబా బ్రహ్మా ద్వారా సృష్టిని రచిస్తారని మీరంటారు, మరి బ్రహ్మా సాకారములో తప్పకుండా ఉండాలి కదా. మీరు త్రిమూర్తి అని అంటున్నప్పుడు, మరి విష్ణువు మరియు శంకరుడు ఈ సమయంలో ఎక్కడున్నారు. ఇవి చాలా అర్థము చేసుకునే విషయాలు. త్రిమూర్తికి అర్థమే బ్రహ్మా-విష్ణు-శంకరులు. బ్రహ్మా ద్వారా స్థాపన అయితే ఈ సమయంలోనే జరుగుతుంది. సత్యయుగంలో విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. వినాశన కార్యము అంతిమములో జరుగనున్నది. ఈ ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము ఒక్కటే భారతదేశములో ఉంటుంది. మిగిలిన వారంతా ధర్మ స్థాపన చేసేందుకు వస్తారు. ఫలానా వారు ధర్మ స్థాపన చేసారు మరియు ఆ ధర్మము యొక్క శకము ఇది, ఫలానా సమయంలో, ఫలానా ధర్మమును స్థాపన చేశారని ప్రతి ఒక్కరికీ తెలుసు. భారతదేశము గురించి ఎవ్వరికీ తెలియదు. గీతా జయంతి, శివజయంతి ఎప్పుడు జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. కృష్ణుని వయసుకు మరియు రాధ వయసుకు 2-3 సంవత్సరముల తేడా ఉంటుంది. సత్యయుగములో మొదట కృష్ణుడు జన్మ తీసుకుని ఉంటారు, తర్వాత రాధ తీసుకుని ఉంటారు. కానీ సత్యయుగము ఎప్పుడు ఉండేది అనేది ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా అర్థము చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది, అటువంటప్పుడు ఎవరైనా 2 రోజులలో ఎంతవరకు అర్థము చేసుకుంటారు. తండ్రి అయితే చాలా సహజంగా అర్థం చేయిస్తారు, వారు అనంతమైన తండ్రి, వారి నుండి తప్పకుండా అందరికీ వారసత్వము లభించాలి కదా. ఓ గాడ్ ఫాదర్, అని అంటూ స్మృతి చేస్తారు. లక్ష్మీనారాయణుల మందిరాలున్నాయి. వీరు స్వర్గములో రాజ్యము చేసేవారు కానీ ఈ వారసత్వమును వారికి ఎవరు ఇచ్చారు? తప్పకుండా స్వర్గ రచయితయే ఇచ్చి ఉంటారు. కానీ ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది ఎవ్వరికీ తెలియదు. సత్యయుగము ఉన్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదని పిల్లలైన మీకు తెలుసు. సత్యయుగములో మనము పవిత్రంగా ఉండేవారము, కలియుగములో మనము పతితంగా ఉన్నాము, అంటే సంగమయుగంలోనే జ్ఞానమిచ్చి ఉంటారు, సత్యయుగములో కాదు, అక్కడ ప్రారబ్ధముంటుంది. తప్పకుండా మునపటి జన్మలో జ్ఞానము తీసుకొని ఉంటారు. మీరు కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఆదిసనాతన దేవీదేవతా ధర్మాన్ని తండ్రే స్థాపన చేస్తారని మీకు తెలుసు. కృష్ణుడు సత్యయుగంలో ఉండేవారు, అతనికి ఈ ప్రారబ్ధము ఎక్కడ నుండి లభించింది? లక్ష్మీనారాయణులే రాధా కృష్ణులుగా ఉండేవారని ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే కల్పక్రితము అర్థము చేసుకున్నారో, వారే ఇప్పుడు అర్థము చేసుకుంటారని తండ్రి అంటారు. ఈ అంటు కట్టబడుతుంది. అతి మధురమైన వృక్షం యొక్క అంటు కట్టబడుతుంది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము కూడా తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేశారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. మొదట బ్రాహ్మణులుగా అవ్వాలి. పిల్లి మొగ్గలాట ఆడుతున్నప్పుడు పిలక భాగము మళ్ళీ పైకి వస్తుంది. తప్పకుండా మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. యజ్ఞములో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది శివుని యజ్ఞము లేక రుద్రుని యజ్ఞము. రుద్ర జ్ఞాన యజ్ఞమనే అంటారు. కృష్ణుడు యజ్ఞమును రచించలేదు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది. ఈ శివబాబా యజ్ఞము పతితులను పావనముగా తయారుచేసేందుకు ఉంది. రుద్రుడైన శివబాబా నిరాకారుడు, వారు మనుష్య తనువులోకి రానంతవరకు యజ్ఞమును ఎలా రచిస్తారు. మనుష్యులే యజ్ఞాలను రచిస్తారు. సూక్ష్మవతనములో లేక మూలవతనములో ఈ విషయాలుండవు. ఇది సంగమయుగమని తండ్రి అర్థము చేయిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు సత్యయుగముండేది. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ విధంగా తయారవుతున్నారు. ఆత్మల జీవితమనే దారము పరమాత్మతో జోడించబడి ఉంది. ఈ దారమును ఎందుకు ముడి వేసుకున్నారు. సదా సుఖపు వారసత్వమును పొందేందుకు ముడి వేసుకున్నారు. అనంతమైన తండ్రి ద్వారా మనము ఈ లక్ష్మీనారాయణులుగా అవుతామని మీకు తెలుసు. తండ్రి అర్థం చేయించారు - మీరే దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, ఆ సమయంలో మీ రాజ్యము ఉండేది, తర్వాత మీరు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్షత్రియ ధర్మములోకి వచ్చారు. సూర్యవంశీయుల రాజ్యము గడిచిపోయిన తర్వాత చంద్రవంశీయులు వచ్చారు. మనము ఈ చక్రములో ఎలా తిరుగుతాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము అనేది మీకు తెలుసు. భగవానువాచ - ఓ పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ సమయములో ఈ తనువులో రెండు మూర్తులున్నాయి, బ్రహ్మా ఆత్మ మరియు శివ పరమ ఆత్మ. ఈ సమయంలో రెండు మూర్తులు కలిసి ఉన్నాయి - బ్రహ్మా మరియు శివ. శంకరుడు ఎప్పుడూ పాత్రలోకి రారు. ఇక విష్ణువైతే సత్యయుగంలో ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, వాస్తవానికి హమ్ సో కు అర్థము ఇదే. వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అనేశారు. ఎంత తేడా ఉంది. రావణుడు రావడముతోనే రావణుని మతము ప్రారంభమయింది. సత్యయుగంలో ఈ జ్ఞానమే ప్రాయః లోపమైపోతుంది. ఇదంతా జరగడం డ్రామాలో నిశ్చయింపబడింది కదా, అప్పుడే తండ్రి వచ్చి స్థాపన చేయగలరు. ఇప్పుడు ఇది సంగమము. తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తాను, జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. ఇక మిగిలినదంతా ఈ యజ్ఞములో స్వాహా అవ్వనున్నది. ఈ యజ్ఞము నుండే వినాశ జ్వాల ప్రజ్వలితమవ్వనున్నది. పతిత ప్రపంచము యొక్క వినాశనం జరగాలి, లేకపోతే పావన ప్రపంచము ఎలా ఏర్పడుతుంది. ఓ పతితపావనా రండి, అని మీరు అంటారు కూడా, మరి పతిత ప్రపంచము, పావన ప్రపంచము కలిసి ఉంటాయా. పతిత ప్రపంచము యొక్క వినాశనం జరుగుతుంది, అందుకు సంతోషపడాలి. మహాభారత యుద్ధము జరిగింది, దీని ద్వారా స్వర్గము యొక్క గేటు తెరవబడింది. ఇది అదే మహాభారత యుద్ధమని అంటారు. ఇలా జరగడం మంచిదే, పతిత ప్రపంచము సమాప్తమైపోతుంది. శాంతి కోసం తల బాదుకునే అవసరం ఏముంది. ఇప్పుడు మీకు లభించిన మూడవ నేత్రము ఇతరులెవ్వరికీ లేదు. మనము అనంతమైన తండ్రి నుండి మళ్ళీ వారసత్వమును తీసుకుంటున్నామని పిల్లలైన మీరు సంతోషపడాలి. బాబా, మేము అనేకసార్లు మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము. రావణుడు మళ్ళీ శాపాన్నిచ్చాడు. ఈ విషయాలను గుర్తుంచుకోవడం సహజము. మిగిలినవన్నీ కట్టుకథలు. మిమ్మల్ని ఇంతటి షావుకారులుగా తయారుచేశాను, మళ్ళీ పేదవారిగా ఎందుకయ్యారు. ఇదంతా డ్రామలో నిశ్చయింపబడింది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని గాయనం చేయడం జరుగుతుంది. జ్ఞానము లభించినప్పుడే భక్తి పట్ల వైరాగ్యము కలుగుతుంది. మీకు జ్ఞానము లభించింది కనుక భక్తి పట్ల వైరాగ్యము కలిగింది, మొత్తం పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలిగింది. ఇది శ్మశానము. మీరు 84 జన్మల చక్రమును తిరిగారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే నా వద్దకు వచ్చేస్తారు, వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే ఉపాయము లేదు. యోగాగ్ని ద్వారా పాపాలు భస్మమవుతాయి. గంగా స్నానము వలన కావు.

బాబా అంటారు - మాయ మిమ్మల్ని ఫూల్ (మూర్ఖులు)గా చేసేసింది, ఏప్రిల్ ఫూల్ అని అంటారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని లక్ష్మీనారాయణుల వలె తయారుచేయడానికి వచ్చాను. ఈ రోజు మనం ఎలా ఉన్నాము, రేపు ఎలా అవుతాము - ఈ చిత్రమైతే చాలా బాగుంది. కానీ మాయ తక్కువేమీ కాదు. మాయ జీవితమనే దారాన్ని ముడి వేయనివ్వదు. పెనుగులాట జరుగుతుంది. మనము బాబాను స్మృతి చేస్తాము, మళ్ళీ ఏమవుతుందో తెలియదు, బాబాను మర్చిపోతాము. ఇందులో శ్రమ ఉంది, అందుకే భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధి చెందింది. వారికి వారసత్వాన్ని ఎవరు ఇచ్చారు అనేది ఎవ్వరూ అర్థము చేసుకోరు. బాబా అంటారు - పిల్లలూ, నేను మీకు మళ్ళీ వారసత్వాన్నిచ్చేందుకు వచ్చాను. ఇదైతే తండ్రి పని. ఈ సమయములో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు సంతోషిస్తున్నారు. ఇక్కడకు ఎవరైనా వచ్చినప్పుడు, అర్థము చేసుకుంటే సంతోషపడతారు, వీరు చెప్తున్నది తప్పకుండా రైట్ అని భావిస్తారు. 84 జన్మల లెక్క ఉంది. తండ్రి నుండి వారసత్వమును తీసుకోవాలి. అర్ధకల్పము భక్తి చేసి మీరు అలసిపోయారని తండ్రికి తెలుసు. మధురమైన పిల్లలూ, తండ్రి మీ అలసటనంతా దూరము చేస్తారు. ఇప్పుడు అంధకార మార్గమైన భక్తి పూర్తవుతుంది. ఈ దుఃఖధామమెక్కడ, ఆ సుఖధామమెక్కడ. నేను దుఃఖధామాన్ని సుఖధామంగా తయారుచేయడానికి కల్పము యొక్క సంగమములో వస్తాను. తండ్రి పరిచయమునివ్వాలి. తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేవారు. వారొక్కరికే మహిమ ఉంది. శివబాబా లేకపోతే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారుచేస్తారు. డ్రామాలో అంతా నిశ్చితమై ఉంది. ఓ పతిత పావనా రండి అని మీరు కల్ప-కల్పము నన్ను పిలుస్తారు. శివ జయంతి ఉంటుంది. బ్రహ్మా స్వర్గ స్థాపన చేశారని అంటారు, మరి శివజయంతిని జరుపుకోవడానికి శివుడు ఏమి చేసారు. ఏమీ అర్థము చేసుకోరు. మీ బుద్ధిలో జ్ఞానము పూర్తిగా కూర్చుండిపోవాలి. జీవితమనే దారము ఒక్కరితోనే ముడి వేయబడింది, ఇక ఇతరులెవరితోనూ ముడి వేసుకోకండి, లేకపోతే పడిపోతారు. పారలౌకిక తండ్రి అతి సాధారణమైనవారు, ఎటువంటి ఆర్భాటము లేదు. ఆ తండ్రి అయితే కార్లలో, విమానాలలో తిరుగుతారు. ఈ అనంతమైన తండ్రి అంటారు - నేను పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి పిల్లలకు సేవ చేసేందుకు వచ్చాను. ఓ అవినాశీ సర్జన్ రండి, వచ్చి మాకు ఇంజెక్షన్ వేయండి అని మీరు నన్ను పిలిచారు. మీకు ఇంజెక్షన్ వేస్తున్నారు. యోగము జోడించినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయని తండ్రి చెప్తారు. తండ్రి 63 జన్మల దుఃఖహర్త, 21 జన్మల సుఖకర్త. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ బుద్ధి యొక్క ఆత్మిక దారాన్ని ఒక్క తండ్రితోనే ముడి వేసుకోవాలి. ఒక్కరి శ్రీమతముపైనే నడుచుకోవాలి.

2. మనము అతి మధురమైన వృక్షము యొక్క అంటు కడుతున్నాము కనుక మొదట స్వయాన్ని చాలా చాలా మధురంగా తయారుచేసుకోవాలి. స్మృతియాత్రలో తత్పరులై వికర్మలను వినాశనము చేసుకోవాలి.

వరదానము:-

సర్వ ఖజానాలను విశ్వ కళ్యాణము కోసం ఉపయోగించే సిద్ధి స్వరూప భవ

మీరు మీ హద్దు ప్రవృత్తులలో, మీ హద్దు స్వభావ-సంస్కారాల ప్రవృత్తిలో, చాలా సమయాన్ని వెచ్చిస్తారు, కానీ మీ-మీ ప్రవృత్తుల నుండి అతీతంగా అనగా ఉపరామముగా ఉండండి మరియు ప్రతి సంకల్పము, మాట, కర్మ మరియు సంబంధ-సంపర్కాలలో బ్యాలెన్స్ ఉంచినట్లయితే, సర్వ ఖజానాల ఎకానమీ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభము పొందేవారిగా అవుతారు. ఇప్పుడు సమయము రూపీ ఖజానా, శక్తుల ఖజానా మరియు స్థూల ఖజానాలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభము పొందేవారిగా అవ్వండి, వీటిని స్వయం కోసము కాకుండా విశ్వకళ్యాణము కోసము ఉపయోగించినట్లయితే సిద్ధి స్వరూపులుగా అయిపోతారు.

స్లోగన్:-

ఒక్కరి లగనములో సదా నిమగ్నమై ఉన్నట్లయితే నిర్విఘ్నులుగా అయిపోతారు.