16-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - మీరు ఏ దేహధారి నామ రూపాలలోనూ చిక్కుకోకూడదు, మీరు అశరీరిగా అయ్యి తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆయువు పెరుగుతుంది, నిరోగిగా అవుతూ ఉంటారు

ప్రశ్న:-

తెలివైన పిల్లల ముఖ్యమైన గుర్తులేమిటి?

జవాబు:-

తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు మొదట స్వయంలో ధారణ చేసి తర్వాత ఇతరుల చేత చేయిస్తారు. మేఘాలు నింపుకుని వెళ్ళి వర్షము కురిపిస్తాయి. చదువుకునే సమయంలో ఆవలింతలు తీయరు. బ్రాహ్మణీలపై ఈ బాధ్యత ఉంది - రిఫ్రెష్ అయ్యి వెళ్ళి మళ్ళీ వర్షించేవారిని మాత్రమే ఇక్కడకు తీసుకురావాలి. 2. ఎవరైతే యోగములో మంచి రీతిలో ఉంటూ వాయుమండలాన్ని శక్తివంతముగా తయారుచేయడంలో సహాయము చేస్తారో, విఘ్నాలు వేయరో, వారే ఇక్కడకు రావాలి. ఇక్కడ చుట్టుపక్కల చాలా శాంతిగా ఉండాలి. ఏ రకమైన శబ్దము ఉండకూడదు.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి

ఓం శాంతి అర్థాన్ని అయితే అర్థం చేయించారు కదా - తండ్రి అంటారు, ఆత్మ మరియు పరమాత్మ శాంతి స్వరూపులు. తండ్రి ఎలా ఉన్నారో, పిల్లలు అలాగే ఉన్నారు. కనుక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, మీరైతే శాంతి స్వరూపులే. బయట నుండి శాంతి ఏమీ లభించదు. ఇది రావణ రాజ్యము కదా. ఇప్పుడు ఈ సమయంలో కేవలం మీరు మీ తండ్రిని స్మృతి చేయండి, నేను వీరిలో విరాజమానమై ఉన్నాను. మీకు ఏ మతాన్ని అయితే ఇస్తానో, దానిపై నడుచుకోండి. బాబా ఏ నామ రూపాలలోనూ చిక్కుకునేలా చేయరు. ఈ నామ రూపాలు బయటివి. ఈ రూపములో మీరు చిక్కుకోకూడదు. మొత్తం ప్రపంచమంతా నామ రూపాలలో చిక్కుకునేలా చేస్తుంది. బాబా అంటారు, వీరందరికీ నామ రూపాలున్నాయి, వీరిని స్మృతి చేయకండి. మీ తండ్రిని స్మృతి చేయండి, మీ ఆయువు కూడా స్మృతితో పెరుగుతుంది, నిరోగిగా కూడా అవుతారు. లక్ష్మీ-నారాయణులు కూడా మీలానే ఉండేవారు, కేవలం అలంకరించబడి ఉండేవారు. వారేమీ ఇంటి పైకప్పు అంత పొడవుగా ఉండేవారని కాదు. మనుష్యులైతే మనుష్యులే. కావున తండ్రి అంటారు, ఏ దేహధారిని స్మృతి చేయకూడదు. దేహాన్ని మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి - ఈ శరీరాన్ని అయితే విడిచిపెట్టాల్సిందే. రెండవ విషయము, నిర్లక్ష్యము చేయకండి, వికర్మల భారము తలపై చాలా ఉంది. చాలా పెద్ద భారముంది. కేవలం ఒక్క తండ్రి స్మృతితో తప్ప అది తగ్గలేదు. తండ్రి అర్థం చేయించారు, ఎవరైతే అందరికన్నా ఉన్నతంగా, పావనంగా అవుతారో, వారే మళ్ళీ అందరికన్నా పతితంగా అవుతారు, ఇందులో ఆశ్చర్యపడకూడదు. స్వయాన్ని చూసుకోవాలి. తండ్రిని ఎంతో స్మృతి చేయాలి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి, ఇది చాలా సహజము. ఇంత ప్రియమైన తండ్రిని లేస్తూ-కూర్చుంటూ స్మృతి చేయాలి. వారిని పతితపావనా రండి అని పిలుస్తారు కానీ అమితమైన ప్రేమ ఉండదు. ఎంతైనా ప్రేమ అనేది తమ పతి, పిల్లలు మొదలైన వారి పట్ల ఉంటుంది. కేవలం పతితపావనా రండి, అని పిలుస్తారు. తండ్రి అంటారు, పిల్లలూ, నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమములో వస్తాను. రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటూ ఉంటారు కూడా. కృష్ణుడైతే సత్యయుగ రాకుమారుడు. వారు మళ్ళీ అవే నామ-రూప-దేశ-కాలాలలో తప్ప రాలేరు. నెహ్రూ అదే రూపములో, అదే పొజిషన్ లో మళ్ళీ కల్పము తర్వాత వస్తారు. అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా సత్యయుగంలోనే వస్తారు. వారి రూపు-రేఖలు మారవు. ఈ యజ్ఞము పేరే రుద్ర జ్ఞాన యజ్ఞము. రాజస్వ అశ్వమేధ యజ్ఞము. రాజ్యం కోసము బలిహారమవ్వడము అనగా వారికి చెందినవారిగా అవ్వడము. తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున ఆ ఒక్కరినే స్మృతి చేయాలి. హద్దు నుండి తెంచి అనంతముతో జోడించాలి, వారు చాలా పెద్ద తండ్రి. తండ్రి వచ్చి ఏమిస్తారు అన్నది మీకు తెలుసు. అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు, దానిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మనుష్యులైతే అందరూ ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు, గాయపర్చుకుంటూ ఉంటారు, ఇంతకుముందు ఏమైనా ఈ విధంగా జరిగేదా.

బాబా మళ్ళీ వచ్చారని మీకు తెలుసు. వారంటారు, కల్ప-కల్పము యొక్క సంగమయుగములో, ఎప్పుడైతే కొత్త ప్రపంచ స్థాపన చేయాల్సి ఉంటుందో, అప్పుడు నేను వస్తాను. కొత్త ప్రపంచాన్ని, కొత్త రామ రాజ్యాన్ని కోరుకుంటారు కూడా. అక్కడ సుఖము, సంపద అన్నీ ఉన్నాయి, కొట్లాడేవారు ఎవ్వరూ ఉండరు. శాస్త్రాలలోనైతే సత్య-త్రేతా యుగాలను కూడా నరకంగా చేసేసారు. ఇది పొరపాటు కదా. వారు అసత్యము వినిపిస్తారు, తండ్రి సత్యము వినిపిస్తారు. తండ్రి అంటారు, మీరు నన్ను సత్యము అని అంటారు కదా. నేను వచ్చి సత్యమైన కథను వినిపిస్తాను. 5000 సంవత్సరాల క్రితము భారత్ లో ఎవరి రాజ్యముండేది. పిల్లలకు తెలుసు - తప్పకుండా 5000 సంవత్సరాల క్రితము ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితము భారత్ స్వర్గముగా ఉండేదని అంటారు కూడా. లెక్క అయితే స్పష్టముగా ఉంది. కల్పము ఆయువును ఇంతగా ఎందుకు రాసారని అంటారు. అరే, లెక్క తీయండి కదా. క్రైస్టు వచ్చి ఇంత కాలం అయ్యింది. యుగాలు ఉన్నవే ఈ నాలుగు. అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి ఉంటుంది. అర్థం చేయించేవారు చాలా బాగుండాలి. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, కామము మహాశత్రువు. భారతవాసులే దేవతల మహిమను పాడుతారు - సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు... అని. మరి 16,108 రాణులు ఎక్కడ నుండి వచ్చారు! ధర్మ శాస్త్రము ఏదీ లేదని మీకు తెలుసు. ధర్మ స్థాపకుడు ఏదైతే ఉచ్చరించారో, దానినే ధర్మ శాస్త్రము అని అంటారు. ధర్మ స్థాపకుని పేరు మీద శాస్త్రాలు తయారయ్యాయి. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచములోకి వెళ్తారు. ఇదంతా పాతది, తమోప్రధానమైనది, అందుకే తండ్రి అంటారు, పాత వస్తువుల నుండి బుద్ధి యోగము తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి - అప్పుడు మీ వికర్మలు వినాశనమవుతాయి. నిర్లక్ష్యము చేస్తే, వీరి అదృష్టమే ఈ విధంగా ఉంది అని బాబా అనుకుంటారు. ఇది చాలా సహజమైన విషయము. దీనిని మీరు అర్థము చేసుకోలేరా? మోహము యొక్క బంధనాలను అన్ని వైపుల నుండి తొలగించి ఒక్క తండ్రిని స్మృతి చేయండి. 21 జన్మల కోసం మీకు ఇక ఏ దుఃఖము ఉండదు. అలాగే ఇటువంటి గూని స్త్రీలు మొదలైనవారిగా అవ్వరు. ఆయువు పూర్తి అయ్యింది, ఇక ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి అని అక్కడ అర్థం చేసుకుంటారు. ఎలాగైతే సర్పము యొక్క ఉదాహరణ ఉంది, జంతువుల ఉదాహరణ ఇస్తారు. తప్పకుండా వారికి తెలుస్తూ ఉండి ఉండవచ్చు. ఈ సమయంలోని మనుష్యుల కన్నా ఎక్కువ తెలివి జంతువులకు కూడా ఉంటుంది. భ్రమరము ఉదాహరణ కూడా ఇక్కడికి సంబంధించినదే. పేడ పురుగులను ఎలా తీసుకువెళ్తుంది. ఇప్పుడు మీ సుఖం యొక్క రోజులు వస్తున్నాయి. కుమార్తెలు అంటారు, మేము పవిత్రంగా ఉంటాము, అందుకే చాలా దెబ్బలు తినాల్సి వస్తుంది. అవును పిల్లలూ, ఎంతోకొంతైతే సహనము చేయాల్సే ఉంటుంది. అబలలపై అత్యాచారాలు అని అంటూ ఉంటారు. అత్యాచారాలు జరిగినప్పుడే పాపం యొక్క కుండ నిండుతుంది. రుద్ర జ్ఞాన యజ్ఞములో విఘ్నాలైతే చాలా వస్తాయి. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ఇది శాస్త్రాలలో కూడా వివరించబడినది. కుమార్తెలు అంటారు, బాబా, నేటికి 5000 సంవత్సరాల క్రితము మిమ్మల్ని కలిసాము, స్వర్గ వారసత్వాన్ని తీసుకున్నాము, మహారాణిగా అయ్యాము. బాబా అంటారు, అవును బచ్చీ, అంతటి పురుషార్థము చేయాల్సి ఉంటుంది. స్మృతి శివబాబాను చేయాలి, వీరిని కాదు. వీరు గురువు కాదు. వీరి చెవులు కూడా వింటాయి. వారు మీ తండ్రి, టీచరు, సద్గురువు. వారి ద్వారా నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తారు. అందరి తండ్రి వారొక్కరే. మనకు కూడా నేర్పించేవారు వారు, అందుకే అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. విష్ణువును లేక బ్రహ్మాను పతులకే పతి అని ఏమైనా అంటారా. శివబాబానే పతులకే పతి అని అంటారు. కావున వారిని ఎందుకు పట్టుకోకూడదు. మీరంతా మొదట మూలవతనానికి, తమ పుట్టినింటికి వెళ్తారు, ఆ తర్వాత అత్తవారింటికి వస్తారు. మొదట శివబాబా వద్ద సలామ్ చేసే తీరాలి. ఆ తర్వాత సత్యయుగంలోకి వస్తారు. ఇది ఎంత సులభమైన చిన్న విషయము.

బాబా అన్ని వైపులా ఉన్న పిల్లలను చూస్తారు. ఎక్కడా ఎవరూ కునికిపాట్లు పడడం లేదు కదా. కునికిపాట్లు పడితే, ఆవలింతలు తీస్తే, బుద్ధి యోగం తప్పిపోతే, మరి వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు, ఎందుకంటే బుద్ధియోగం బయట భ్రమిస్తుంది కదా. అందుకే బాబా ఎప్పుడూ అంటారు - ఎటువంటి మేఘాలను తీసుకురండి అంటే, వారు రిఫ్రెష్ అయ్యి వెళ్ళి వర్షించాలి. లేదంటే వచ్చి ఏం చేస్తారు. తీసుకువచ్చేవారిపై కూడా బాధ్యత ఉంటుంది. ఏ బ్రాహ్మణి తెలివైనవారు? ఎవరైతే నింపుకుని వెళ్ళి వర్షిస్తారో, వారు. అటువంటివారిని తీసుకురావాలి. మిగిలినవారిని తీసుకురావడం వలన లాభమేముంది. విని, ధారణ చేసి, ఆ తర్వాత ధారణ చేయించాలి. శ్రమించాలి కూడా. ఈ భండారి నుండి తింటే, కష్టాలు-దుఃఖాలు దూరమైపోతాయి. కావున ఎవరైతే యోగములో కూడా మంచి రీతిలో ఉండగలరో, వారే ఇక్కడకు రావాలి. లేకపోతే వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఈ సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫొటోలు మొదలైనవి తీసే విషయము కూడా లేదు. ఎంత వీలైతే అంత తండ్రి స్మృతిలో ఉంటూ యోగ దానము ఇవ్వాలి. చుట్టుపక్కల చాలా శాంతి ఉండాలి. హాస్పిటల్ ఎప్పుడూ బయట ఏకాంతములో ఉంటుంది, అక్కడ శబ్దాలు ఉండవు. రోగులకు శాంతి కావాలి. మీకు డైరెక్షన్ లభిస్తుంది - కావున ఆ శాంతిలో ఉండాలి. తండ్రిని స్మృతి చేయడము అనేది నిజమైన శాంతి. మిగిలినదంతా కృత్రిమమైనది. వారు, రెండు నిమిషాలు డెడ్ సైలెన్స్ అని అంటారు కదా. కానీ ఆ రెండు నిమిషాలు బుద్ధి ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు. ఒక్కరికి కూడా సత్యమైన శాంతి ఉండదు. మీరు అతీతముగా అవుతారు. నేను ఆత్మను, ఇది మన స్వధర్మములో ఉండడము. ఇకపోతే గుటకలు మింగుతూ శాంతిగా ఉండడము, ఇదేమీ నిజమైన శాంతి కాదు. మూడు నిమిషాలు సైలెన్స్, అశరీరి భవ అని అంటారు - ఈ విధంగా చెప్పేందుకు ఇంకెవ్వరికీ శక్తి లేదు. తండ్రి మహావాక్యాలేమిటంటే - ప్రియమైన పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. లేకపోతే పద భ్రష్టులుగా కూడా అవుతారు మరియు శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. శివబాబా డైరెక్షన్లపై నడుచుకోవడంలోనే కళ్యాణముంది. తండ్రిని సదా స్మృతి చేయాలి. ఎంత వీలైతే అంత అతి మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. విద్యార్థికి, తమ టీచరు యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనేక మంది విద్యార్థులు పాస్ అవ్వకపోతే, టీచర్ కు బహుమతి లభించదు. ఇక్కడ కృప లేక ఆశీర్వాదం యొక్క విషయము ఉండదు. ప్రతి ఒక్కరూ తమపై తాము కృప చూపించుకోవాలి మరియు ఆశీర్వదించుకోవాలి. విద్యార్థులు తమపై తాము కృప చూపించుకుంటారు, శ్రమిస్తారు. ఇది కూడా చదువు. ఎంతగా యోగం జోడిస్తారో, అంతగా వికర్మాజీతులుగా అవుతారు, ఉన్నత పదవిని పొందుతారు. స్మృతితో సదా నిరోగులుగా అవుతారు. మన్మనాభవ. కృష్ణుడు ఏమైనా ఈ విధంగా అనగలరా. ఈ నిరాకార తండ్రి అంటారు - విదేహిగా అవ్వండి. ఇది ఈశ్వరీయ అనంతమైన పరివారము. తల్లి-తండ్రి, సోదరీ-సోదరులు, అంతే, ఇంకే సంబంధాలు లేవు. వేరే సంబంధాలలో చిన్నాన్న, మామయ్య, పెదనాన్న ఉంటారు. ఇక్కడ ఉన్నదే సోదరీ-సోదరుల సంబంధము. ఈ విధంగా సంగమములో తప్ప ఇంకెప్పుడూ ఉండదు. ఇప్పుడు మనం మాతా-పితల నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. అపారమైన సుఖాన్ని తీసుకుంటారు కదా. రావణ రాజ్యములో అపారమైన దుఃఖముంది. రామ రాజ్యములో అపారమైన సుఖముంది, దాని కోసం మీరు పురుషార్థం చేస్తారు. ఎవరెంత పురుషార్థం చేస్తారో, అది ఇక కల్ప-కల్పము కోసం నిశ్చితమవుతుంది. ప్రాప్తి చాలా గొప్పది. కోటీశ్వరులు, పదమపతులు ఎవరైతే ఉన్నారో, వారి ధనమంతా మట్టిలో కలిసిపోనున్నది. యుద్ధము కొంచెం ప్రారంభం కానివ్వండి, అప్పుడిక ఏం జరుగుతుందో చూడండి. మిగిలిన కథ అంతా పిల్లలైన మీదే. సత్యమైన కథను విని పిల్లలైన మీరు సత్య ఖండానికి యజమానులుగా అవుతారు. ఈ నిశ్చయం పక్కాగా ఉంది కదా. నిశ్చయం లేకుండా ఇక్కడకు ఎవ్వరూ రాలేరు. పిల్లలైన మీరు ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాగైతే మమ్మా-బాబా తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటున్నారో, అలా మీరు కూడా తీసుకోవాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శరీరం నుండి డిటాచ్ అయ్యి స్వ ధర్మంలో స్థితులై ఉండే అభ్యాసం చేయాలి. ఎంత వీలైతే అంత అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. మోహపు బంధనాలను అన్ని వైపుల నుండి తొలగించాలి.

2. చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టి తమపై తామే కృప చూపించుకోవాలి మరియు ఆశీర్వదించుకోవాలి. బుద్ధియోగాన్ని హద్దు నుండి తొలగించి అనంతముతో జోడించాలి. తండ్రికి చెందినవారిగా అయ్యి తండ్రిపై పూర్తి-పూర్తిగా బలిహారమవ్వాలి.

వరదానము:-

సదా సత్యము యొక్క సాంగత్యము ద్వారా బలహీనతలను సమాప్తం చేసుకునే సహజ యోగీ, సహజ జ్ఞానీ భవ

ఏదైనా బలహీనత ఎప్పుడు వస్తుందంటే, సత్యము యొక్క సాంగత్యము దూరమై, వేరే సాంగత్యము ఏర్పడినప్పుడు. అందుకే భక్తిలో, సదా సత్సంగములో ఉండండి అని అంటారు. సత్సంగము అనగా సదా సత్యమైన తండ్రి యొక్క సాంగత్యములో ఉండడము. మీ అందరికీ సత్యమైన తండ్రి సాంగత్యము అతి సహజము ఎందుకంటే అది సమీప సంబంధము. కావున సదా సత్సంగములో ఉంటూ బలహీనతలను సమాప్తం చేసుకునే సహజ యోగిగా, సహజ జ్ఞానిగా అవ్వండి.

స్లోగన్:-

సదా ప్రసన్నంగా ఉండాలంటే, ప్రశంసలను వినాలి అనే కోరికను త్యాగం చేయండి.

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు - ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క స్టేజ్

ముక్తి మరియు జీవన్ముక్తి, ఈ రెండు స్థితులు వేర్వేరు. మనమెప్పుడైతే ముక్తి అన్న పదాన్ని ఉపయోగిస్తామో, అక్కడ ముక్తి అనగా అర్థమేమిటంటే ఆత్మ శరీరము యొక్క పాత్ర నుండి ముక్తిగా ఉంది, అనగా ఆత్మకు శరీర సహితంగా ఈ సృష్టిపై పాత్ర లేదు. ఎప్పుడైతే ఆత్మకు మనుష్య తనువులో పాత్ర ఉండదో, అనగా ఆత్మ నిరాకారీ ప్రపంచంలో ఉంటుందో, సుఖ-దుఃఖాలకు అతీతమైన ప్రపంచంలో ఉంటుందో, దానినే ముక్తి యొక్క స్టేజ్ అని అంటారు. దీనిని ఎవరూ ముక్తి యొక్క పదవి అని అనరు. మరియు ఏ ఆత్మ అయితే కర్మ బంధనం నుండి ముక్తిగా ఉంటుందో అనగా శరీరముతో పాత్రధారిగా ఉన్నప్పటికీ కర్మ బంధనం నుండి అతీతంగా ఉంటుందో, దానిని జీవన్ముక్త పదవి అని అంటారు, అది అన్నింటికన్నా ఉన్నతమైన స్టేజ్. అది మన దైవీ ప్రారబ్ధము, ఈ జన్మలోనే పురుషార్థం చేయడంతో ఈ సత్యయుగ దైవీ ప్రారబ్ధము లభిస్తుంది, అది మన ఉన్నతమైన పదవి, కానీ ఏ ఆత్మలైతే పాత్రలో లేవో, వారి విషయములో పదవి అని ఎలా అనాలి? ఎప్పుడైతే ఆత్మకు స్టేజ్ పై పాత్ర ఉండదో, అప్పుడు ముక్తి అనేది పదవి ఏమీ కాదు. ఇప్పుడు ఇంతమంది మనుష్య సంప్రదాయం వారు ఎవరైతే ఉన్నారో, వారేమీ అందరికి అందరూ సత్యయుగంలోకి వెళ్ళరు ఎందుకంటే అక్కడ మనుష్య సంప్రదాయం వారు తక్కువ ఉంటారు. కావున ఎవరెంతగా ప్రభువుతో యోగం జోడించి కర్మాతీతులుగా అయ్యారో, వారు సత్యయుగీ జీవన్ముక్త దేవీ-దేవతా పదవిని పొందుతారు. మిగిలినవారు ఎవరైతే ధర్మరాజు శిక్షలను అనుభవించి కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయి, శుద్ధంగా అయి ముక్తిధామంలోకి వెళ్తారో, వారు ముక్తిలో ఉంటారు కానీ ముక్తిధామంలో పదవేమీ లేదు, ఆ స్టేజ్ అయితే పురుషార్థం చేయకుండానే దానంతటది సమయానికి తప్పకుండా లభిస్తుంది. మేము జనన-మరణ చక్రములోకి రాకూడదు అని మనుష్యుల్లో ద్వాపరం నుండి మొదలుకుని కలియుగ అంతిమం వరకు ఏదైతే కోరిక ఉత్పన్నమవుతూ ఉందో, ఆ ఆశ ఇప్పుడు పూర్తవుతుంది. అర్థమేమిటంటే సర్వ ఆత్మలు ముక్తిధామము మీదగా తప్పకుండా వెళ్ళాలి. అచ్ఛా.