16-09-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - అనంతమైన తండ్రి ఈ అనంతమైన సభలో పేద పిల్లలను దత్తత తీసుకునేందుకు వచ్చారు, వారికి దేవతల సభలోకి రావాల్సిన అవసరం లేదు

ప్రశ్న:-
పిల్లలు ఏ రోజును చాలా వైభవంగా జరుపుకోవాలి?

జవాబు:-
ఏ రోజున మరజీవా జన్మ జరిగిందో, తండ్రి పట్ల నిశ్చయం ఏర్పడిందో..... ఆ రోజును చాలా వైభవంగా జరుపుకోవాలి. ఆ రోజే మీకు జన్మాష్టమి వంటిది. ఒకవేళ మీ మరజీవా జన్మను జరుపుకున్నట్లయితే, మేము పాత ప్రపంచం నుండి పక్కకు వచ్చేసామని, మేము బాబాకు చెందినవారిగా అయ్యామని అనగా వారసత్వానికి అధికారులుగా అయ్యామని బుద్ధిలో గుర్తుంటుంది.

గీతము:-
సభలో దీపం వెలిగింది..... (మెహఫిల్ మే జల్ ఉఠీ షమా.....)

ఓంశాంతి.
పాటలు, కవితలు, భజనలు, వేద-శాస్త్రాలు, ఉపనిషత్తులు, దేవతల మహిమ మొదలైనవి భారతవాసీ పిల్లలైన మీరు చాలానే వింటూ వచ్చారు. ఇప్పుడు మీకు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం లభించింది. పిల్లలు గతాన్ని గురించి కూడా తెలుసుకున్నారు. వర్తమాన ప్రపంచం ఎలా ఉంది అనేది కూడా మీరు చూస్తున్నారు. దీనిని ప్రాక్టికల్ గా అనుభవం కూడా చేసారు. ఇకపోతే, ఏదైతే జరగబోతుందో, దానిని ఇంతవరకు ప్రాక్టికల్ గా అనుభవం చేయలేదు. ఏదైతే గతంలో జరిగిందో, దానిని అనుభవం చేసారు. ఈ విషయాలను తండ్రియే అర్థం చేయించారు. తండ్రి తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. ఎంతోమంది మనుష్యులున్నారు కానీ వారికేమీ తెలియదు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి ఏమీ తెలియదు. ఇప్పుడిది కలియుగాంతమని కూడా మనుష్యులకు తెలియదు. అవును, మున్ముందు అంతిమం గురించి తెలుసుకుంటారు. మూలాన్ని తెలుసుకుంటారు, అంతేకాని మొత్తం జ్ఞానాన్ని తెలుసుకోరు. చదువుకునే విద్యార్థులు మాత్రమే దీనిని తెలుసుకోగలరు. ఇది మనుష్యుల నుండి రాజులకే రాజులుగా అయ్యేందుకు చదువుకునే చదువు. ఇది ఆసురీ రాజులుగా అయ్యేందుకు కాదు, ఆసురీ రాజులచే పూజించబడే దైవీ రాజులుగా తయారయ్యేందుకు చదువుకునే చదువు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. విద్వాంసులు, ఆచార్యులు మొదలైనవారికి కొంచెం కూడా తెలియదు. ఏ భగవంతుడినైతే జ్యోతి అని పిలుస్తారో, వారి గురించి తెలియదు. పాటలు పాడేవారికి కూడా ఏమీ తెలియదు. వారు కేవలం మహిమను పాడుతూ ఉంటారు. భగవంతుడు కూడా ఏదో ఒక సమయంలో ఈ ప్రపంచమనే సభలోకి వచ్చారు. సభ అనగా చాలా మంది కలుసుకునే స్థానము. సభలో ఆహార-పానీయాలు, మద్యం మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు ఈ సభలో మీకు తండ్రి నుండి అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తుంది లేదా తండ్రి నుండి మనకు వైకుంఠం యొక్క రాజ్యాధికారం లభిస్తుందని అనవచ్చు. ఈ మొత్తం సభలో కేవలం పిల్లలకు మాత్రమే తండ్రి గురించి తెలుసు, వారు మనకు కానుకను ఇచ్చేందుకు వచ్చారని పిల్లలకే తెలుసు. ఈ సభలో తండ్రి ఏమి ఇస్తారు, ఆ సభలలో మనుష్యులు ఒకరికొకరు ఏమి ఇచ్చుకుంటారు - ఈ రెండింటికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి హల్వా తినిపిస్తారు మరియు వారు చాలా చవకైన శెనగలను తినిపిస్తారు. హల్వా మరియు శెనగలు, ఈ రెండింటికి ఎంత తేడా ఉంది. ఒకరికొకరు శెనగలు తినిపించుకుంటూ ఉంటారు. ఎవరైనా సంపాదించకపోతే, వారిని - ఇతడు శెనగలు నములుతున్నాడని అంటారు.

అనంతమైన తండ్రి మనకు స్వర్గ రాజ్యం యొక్క వరదానాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. శివబాబా ఈ సభలోకి వస్తారు కదా! శివజయంతిని కూడా జరుపుకుంటారు కదా. కానీ వారు వచ్చి ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. వారు తండ్రి. తండ్రి తప్పకుండా ఏదో ఒకటి తినిపిస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. మాతా-పితలు జీవన పాలనైతే చేస్తారు కదా. ఆ మాతా-పితలు వచ్చి జీవితాన్ని సంభాళిస్తారని, దత్తత తీసుకుంటారని మీకు కూడా తెలుసు. పిల్లలు స్వయంగా అంటారు - బాబా, మేము మీకు పది రోజుల పిల్లలము అనగా పది రోజుల నుండి మీ వారిగా అయ్యాము. కావున మీరు వారి నుండి స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు హక్కుదారులుగా అయ్యారని అర్థం చేసుకోవాలి. బాబా దత్తత తీసుకున్నారు. జీవించి ఉండగానే ఎవరి వద్దకైనా దత్తతలో వెళ్తే, అంధ శ్రద్ధతో వెళ్ళరు కదా. తల్లిదండ్రులు కూడా పిల్లలను దత్తతలో ఇచ్చేస్తారు. మా పిల్లలు వారి వద్ద ఇంకా ఎక్కువ సుఖంగా ఉంటారు, వారు ఇంకా ప్రేమగా సంభాళిస్తారని భావిస్తారు. మీరు కూడా లౌకిక తండ్రికి పిల్లలు, ఇక్కడ అనంతమైన తండ్రి ద్వారా దత్తత తీసుకోబడతారు. అనంతమైన తండ్రి ఎంత అభిరుచితో దత్తత తీసుకుంటారు. బాబా, మేము మీ వారిగా అయిపోయాము అని పిల్లలు కూడా రాస్తారు. ఈ మాటను కేవలం దూరం నుండే అనరు. ప్రాక్టికల్ గా దత్తత తీసుకోవడం జరిగినప్పుడు ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు. జన్మదినాన్ని జరుపుకుంటారు కదా. అలా ఇక్కడ కూడా పిల్లలుగా అవుతారు. మేము మీ వారము అని అంటారు. మరి 6-7 రోజుల తర్వాత నామకరణాన్ని కూడా జరుపుకోవాలి కదా. కానీ అలా ఎవరూ జరుపుకోరు. తమ జన్మాష్టమిని చాలా వైభవంగా జరుపుకోవాలి. కానీ అలా జరుపుకోవటం లేదు. మేము జయంతిని జరుపుకోవాలి అనే జ్ఞానం కూడా లేదు. 12 నెలల తర్వాత జరుపుకుంటారు. అరే, మొదట్లో జరుపుకోనప్పుడు, 12 నెలల తర్వాత అయినా ఎందుకు జరుపుకుంటారు. జ్ఞానమే లేదు కనుక నిశ్చయం కూడా ఉండదు. ఒకసారి జన్మదినాన్ని జరుపుకున్నారు, పక్కా అయిపోయారు. ఒకవేళ జన్మదినాన్ని మళ్ళీ జరుపుకుంటూ పారిపోయినట్లయితే, వారు మరణించారని అనుకుంటారు. కొంతమంది జన్మదినాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఒకవేళ ఎవరైనా పేదవారైతే, బెల్లం-శెనగలను కూడా పంచవచ్చు. ఎక్కువేమీ అవసరం లేదు. పిల్లలకు పూర్తిగా అర్థం కాదు, అందుకే సంతోషముండదు. జన్మదినాన్ని జరుపుకున్నట్లయితే ఆ స్మృతి కూడా పక్కాగా ఉంటుంది. కానీ అటువంటి బుద్ధి లేదు. ఈ రోజు తండ్రి మళ్ళీ అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే కొత్తగా పిల్లలుగా అయ్యారో, వారికి నిశ్చయం ఏర్పడితే జన్మదినాన్ని జరుపుకోవాలి. ఫలానా రోజు మాకు నిశ్చయం ఏర్పడింది, ఆ రోజు నుండి మా జన్మాష్టమి ప్రారంభమవుతుంది. కావున పిల్లలు తండ్రిని మరియు వారసత్వాన్ని పూర్తిగా స్మృతి చేయాలి. నేను ఫలానా వారి బిడ్డను అని పిల్లలు ఎప్పుడూ మర్చిపోరు. కానీ ఇక్కడ, బాబా, మీరు మాకు గుర్తుండడం లేదు అని అంటారు. అజ్ఞాన కాలంలో ఎప్పుడూ ఈ విధంగా అనరు. గుర్తుకు రాకపోవడమనే ప్రశ్నే తలెత్తదు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, తండ్రి అయితే అందరినీ స్మృతి చేస్తారు. నా పిల్లలందరూ కామ చితిపై కాలిపోయి భస్మమైపోయారు. ఈ విధంగా ఇంకే గురువు లేక మహాత్మ అనరు. మీరంతా నా పిల్లలే అన్నది భగవానువాచ. భగవంతునికి అందరూ పిల్లలే కదా. ఆత్మలందరూ పరమాత్మ తండ్రికి పిల్లలు. తండ్రి కూడా శరీరంలోకి వచ్చినప్పుడు - ఈ ఆత్మలందరూ నా పిల్లలు అని అంటారు. కామ చితి పైకి ఎక్కి భస్మీభూతులై తమోప్రధానంగా అయిపోయారు. భారతవాసులు ఎంతగా ఇనుప యుగము వారిగా అయిపోయారు. కామ చితిపై కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు. ఎవరైతే నంబరువన్ పూజ్యులుగా, సుందరంగా ఉండేవారో, వారే ఇప్పుడు పూజారులుగా, నల్లగా అయిపోయారు. సుందరంగా ఉన్నవారు శ్యామంగా (నల్లగా) అయిపోయారు. కామ చితి పైకి ఎక్కడము అనగా పాము పైకి ఎక్కడమే. ఎవరినైనా కాటు వేసేందుకు వైకుంఠంలో పాములు మొదలైనవేవీ ఉండవు. అక్కడ ఇలాంటి విషయాలు ఉండవు. 5 వికారాలు ప్రవేశించడంతో మీరు అడవి ముళ్ళ వలె అయిపోయారని తండ్రి అంటారు. బాబా, ఇది ముళ్ళ అడవి అని మేము ఒప్పుకుంటాము అని అంటారు. ఒకరినొకరు కాటు వేసుకొని అందరూ భస్మీభూతులైపోయారు. భగవానువాచ - జ్ఞానసాగరుడినైన నా పిల్లలు, ఎవరినైతే నేను కల్పక్రితం కూడా వచ్చి స్వచ్ఛంగా తయారుచేసానో, వారు ఇప్పుడు పతితంగా, నల్లగా అయిపోయారు. తెల్ల ఉన్న తాము నల్లగా ఎలా అయ్యారు అనేది పిల్లలకు తెలుసు. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చరిత్ర-భూగోళాలు సార రూపంలో ఉన్నాయి. కొంతమందికి 5-6 సంవత్సరాల వయసు నుండి మొదలుకొని తమ జీవిత చరిత్ర గురించి నంబరువారు బుద్ధి అనుసారంగా తెలుసని ఈ సమయంలో మీకు తెలుసు. మేము ఏమేమి చెడు పనులు చేసాము - అని ప్రతి ఒక్కరికీ తమ గత చరిత్ర గురించి కూడా తెలుసు. మేము ఏమేమి చేసాము అని పెద్ద-పెద్ద విషయాలను గురించి చెప్పగలుగుతారు. పూర్వ జన్మను గురించైతే చెప్పలేరు. జన్మ-జన్మల చరిత్రను గురించి ఎవరూ చెప్పలేరు. ఇకపోతే, ఎవరైతే పూర్తి 84 జన్మలను తీసుకున్నారో, వారికి తండ్రి కూర్చొని, 84 జన్మలను ఎలా తీసుకున్నారు అనేది అర్థం చేయిస్తారు. వారికే ఈ విషయాలు స్మృతిలోకి వస్తాయి. నేను మీకు ఇంటికి వెళ్ళేందుకు మతాన్ని ఇస్తాను. అందుకే తండ్రి అంటారు - ఈ జ్ఞానం అన్ని ధర్మాల వారి కోసముంది. ఒకవేళ ఇల్లు అయిన ముక్తిధామానికి వెళ్ళాలనుకుంటే తండ్రి మాత్రమే తీసుకువెళ్ళగలరు. తండ్రి లేకుండా ఎవరూ తమ ఇంటికి వెళ్ళలేరు. తండ్రిని స్మృతి చేసి అక్కడికి (శాంతిధామానికి) చేరగలిగే యుక్తి ఎవరి వద్ద లేదు. పునర్జన్మలనైతే అందరూ తీసుకోవాల్సిందే. తండ్రి తప్ప ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. మోక్షం గురించైతే ఎప్పుడూ ఆలోచించకూడదు ఎందుకంటే అది లభించదు. ఇది అనాదిగా రచించబడిన డ్రామా. దీని నుండి ఎవరూ బయట పడలేరు. అందరికీ ఒక్క తండ్రియే లిబరేటర్ (ముక్తిదాత) మరియు గైడ్ (మార్గదర్శకుడు). వారే వచ్చి యుక్తిని తెలియజేస్తారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. లేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పురుషార్థం చేయడం లేదు అంటే వీరు ఇక్కడికి సంబంధించినవారు కాదు అని అనుకోవడం జరుగుతుంది. ముక్తి-జీవన్ముక్తుల మార్గం పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. ప్రతి ఒక్కరి అర్థం చేయించే వేగం ఎవరిది వారిదే. ఈ సమయంలో ప్రపంచం పతితంగా ఉందని మీరు కూడా చెప్పవచ్చు. ఎంతగా మారణహోమం మొదలైనవి జరుగుతాయి. సత్యయుగంలో ఇవేవీ ఉండవు. ఇప్పుడిది కలియుగము, ఈ విషయాన్ని మనుష్యులందరూ ఒప్పుకుంటారు. సత్యయుగం, త్రేతాయుగం..... బంగారు యుగం, వెండి యుగం..... ఇతర భాషలలో కూడా తప్పకుండా ఏవో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీషు అయితే అందరికీ తెలుసు. ఇంగ్లీషు నుండి హిందీకి డిక్షనరీ కూడా ఉంటుంది. బ్రిటీషు వారు చాలా కాలం రాజ్యం చేసి వెళ్ళారు కనుక వారి ఇంగ్లీషును ఉపయోగిస్తారు.

మాలో ఏ గుణాలు లేవు అని ఈ సమయంలో మనుష్యులు అంగీకరిస్తారు. బాబా, మీరు వచ్చి దయ చూపించండి, మమ్మల్ని మళ్ళీ పవిత్రంగా తయారుచేయండి, మేము పతితంగా ఉన్నామని అంటారు. పతితాత్మలు ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అందరూ సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. ఇప్పుడు తండ్రి ఈ పతిత సభలోకి వస్తారు, ఇది ఎంత పెద్ద సభ. నేను దేవతల సభలోకి ఎప్పుడూ రాను. ఎక్కడైతే 36 రకాల సంపన్న భోజనం లభిస్తుందో, అక్కడకు నేను అసలు రాను. ఎక్కడైతే పిల్లలకు రొట్టె కూడా లభించదో, వారి వద్దకు వచ్చి, వారిని దత్తత తీసుకొని, పిల్లలుగా చేసుకొని వారసత్వాన్ని ఇస్తాను. షావుకార్లను దత్తత తీసుకోను, వారు తమ నషాలోనే నిమగ్నమై ఉంటారు. మాకైతే స్వర్గం ఇక్కడే ఉందని వారు స్వయం అంటారు, మళ్ళీ ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. అంటే తప్పకుండా ఇది నరకమైనట్లే కదా. మీరు ఎందుకు అర్థం చేయించరు. ఇప్పుడు వార్తాపత్రికలలో కూడా ఇంకా ఎవరూ యుక్తియుక్తంగా రాయలేదు. డ్రామా మన చేత పురుషార్థం చేయిస్తుందని పిల్లలకు కూడా తెలుసు. మనం ఏ పురుషార్థమైతే చేస్తున్నామో, అది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. పురుషార్థం కూడా తప్పకుండా చేయాలి. డ్రామా అని అంటూ కూర్చుండిపోకూడదు. ప్రతి విషయంలోనూ తప్పకుండా పురుషార్థం చేయాల్సిందే. మీరు కర్మయోగులు, రాజయోగులు కదా. వారు కర్మ సన్యాసులు, హఠయోగులు. మీరు అన్నీ చేస్తారు. ఇంట్లో ఉంటూ పిల్లలను సంభాళిస్తారు. వారైతే పారిపోతారు, వారికి అవి నచ్చవు. కానీ భారత్ లో వారి పవిత్రత కూడా కావాలి కదా. ఎంతైనా మంచిదే. ఇప్పుడైతే పవిత్రంగా కూడా ఉండటం లేదు. పవిత్రంగా ఉన్నంత మాత్రాన వారు పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళగలరు అనేమీ కాదు. తండ్రి తప్ప ఎవరూ తీసుకువెళ్ళలేరు. శాంతిధామం మన ఇల్లు అని ఇప్పుడు మీకు తెలుసు. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి? చాలా పాపాలు చేసారు. ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇలా అంటూ ఎవరి గౌరవాన్ని పోగొడుతున్నారు? శివబాబా గౌరవాన్ని పోగొడుతున్నారు. కుక్కలో, పిల్లిలో, కణ-కణంలో పరమాత్మ ఉన్నారని అంటారు. ఇప్పుడు నేను ఎవరికి రిపోర్టు చేయాలి! తండ్రి అంటారు - నేనే సమర్థుడను. నాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ఇది అందరికీ వినాశన సమయము. అందరూ శిక్షలు మొదలైనవి అనుభవించి తిరిగి వెళ్ళిపోతారు. డ్రామా రచనయే ఈ విధంగా ఉంది. శిక్షలు తప్పకుండా అనుభవించాల్సిందే. ఇవి సాక్షాత్కారమవుతాయి కూడా. గర్భ జైలులో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి - నీవు ఈ-ఈ పనులు చేసావు కనుక వాటికి ఇప్పుడు శిక్ష లభిస్తుందని సాక్షాత్కారమవుతుంది. అప్పుడిక ఈ జైలు నుండి బయటకు తీయండి, నేను మళ్ళీ ఇటువంటి పాపాలు చేయను అని అంటారు. ఇక్కడ తండ్రి సమ్ముఖంగా వచ్చి ఈ విషయాలన్నింటినీ మీకు అర్థం చేయిస్తారు. గర్భంలో శిక్షలు అనుభవిస్తారు. అది కూడా జైలే, దుఃఖం అనుభవమవుతుంది. అక్కడ సత్యయుగంలో శిక్షలు అనుభవించేందుకు రెండు రకాల జైళ్ళు ఉండవు.

ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. మీ ఈ మాటలను చాలామంది అంగీకరిస్తారు. భగవంతుడు అన్న పేరు అయితే ఉంది కానీ కేవలం కృష్ణుని పేరు రాసి పొరపాటు చేసారు. ఇప్పుడు తండ్రి కూడా పిల్లలకు అర్థం చేయిస్తారు - మీరు ఏదైతే వింటారో, దానిని విని వార్తాపత్రికలలో ముద్రించండి. శివబాబా ఈ సమయంలో అందరికీ చెప్తున్నారు - మీరు 84 జన్మలను అనుభవించి తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నేను సలహా ఇస్తున్నాను - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, తర్వాత మీరు ముక్తి-జీవన్ముక్తి ధామాలకు వెళ్ళిపోతారు. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. అచ్ఛా పిల్లలూ, మీకు ఎంత అర్థం చేయించాను, ఇంకెంతని అర్థం చేయించాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రతి విషయము కోసం తప్పకుండా పురుషార్థం చేయాలి. డ్రామా అని అంటూ కూర్చుండిపోకూడదు. కర్మయోగులుగా, రాజయోగులుగా అవ్వాలి. కర్మ సన్యాసులుగా, హఠయోగులుగా అవ్వకూడదు.

2. శిక్షలు అనుభవించకుండా తండ్రితో పాటు ఇంటికి వెళ్ళేందుకు స్మృతిలో ఉంటూ ఆత్మను సతోప్రధానంగా తయారుచేసుకోవాలి. నల్లగా ఉన్నవారు తెల్లగా అవ్వాలి.

వరదానము:-
తమ శ్రేష్ఠత ద్వారా నవీనత యొక్క జెండాను ఎగురవేసే శక్తి స్వరూప భవ

ఇప్పుడు సమయ ప్రమాణంగా, సమీపత అనుసారంగా శక్తి రూపం యొక్క ప్రభావాన్ని ఇతరులపై కలిగించినప్పుడు అంతిమ ప్రత్యక్షతను సమీపంగా తీసుకురాగలరు. ఎలాగైతే స్నేహాన్ని మరియు సహయోగాన్ని ప్రత్యక్షం చేసారో, అలా సేవ యొక్క దర్పణంలో శక్తి రూపాన్ని అనుభవం చేయించండి. ఎప్పుడైతే తమ శ్రేష్ఠత ద్వారా శక్తి రూపం యొక్క నవీనత అనే జెండాను ఎగరవేస్తారో, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. తమ శక్తి స్వరూపంతో సర్వశక్తివంతుడైన తండ్రిని సాక్షాత్కారం చేయించండి.

స్లోగన్:-
మనస్సు ద్వారా శక్తులను మరియు కర్మల ద్వారా గుణాలను దానం చేయటమే మహాదానము.