16-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు ఈ ఆత్మిక విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థులు, విశ్వమంతటికీ తండ్రి సందేశాన్నివ్వడం మీ పని”

ప్రశ్న:-

పిల్లలైన మీరిప్పుడు ఏ దండోరా వేయిస్తారు మరియు ఏ విషయాన్ని అర్థం చేయిస్తారు?

జవాబు:-

ఈ కొత్త దైవీ రాజధాని మళ్ళీ స్థాపన అవుతుంది, ఇప్పుడు అనేక ధర్మాల వినాశనం అవ్వనున్నది అని మీరు దండోరా వేస్తారు. అందరూ నిశ్చింతగా ఉండండి అని మీరు అందరికీ అర్థం చేయిస్తారు, ఇది అంతర్జాతీయ సమస్య. యుద్ధము తప్పకుండా జరగనున్నది, దాని తర్వాత దైవీరాజధాని వస్తుంది.

ఓంశాంతి. ఇది ఆత్మిక విశ్వవిద్యాలయం. మొత్తం ప్రపంచములోని ఆత్మలన్నీ యూనివర్సిటీలో చదువుకుంటాయి. యూనివర్స్ అనగా విశ్వము. ఇప్పుడు నియమానుసారంగా యూనివర్సిటీ అనే పదము పిల్లలైన మీకు చెందినది. ఇది ఆత్మిక యూనివర్సిటీ. దైహిక యూనివర్సిటీ ఉండదు. ఇది ఒక్కటే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఆత్మలందరికీ పాఠము లభిస్తుంది. మీ ఈ సందేశం అందరికీ ఏదో ఒక రకంగా తప్పకుండా చేరుకోవాలి, సందేశాన్ని అందించాలి కదా మరియు ఈ సందేశం చాలా సింపుల్ అయినది. వారు మన అనంతమైన తండ్రి, అందరూ వారినే స్మృతి చేస్తారని పిల్లలకు తెలుసు. వారు మన అనంతమైన ప్రియుడు అని కూడా అనవచ్చు, విశ్వములోని జీవాత్మలన్నీ ఆ ప్రియుడిని తప్పకుండా స్మృతి చేస్తాయి. ఈ పాయింట్లను బాగా ధారణ చేయాలి. ఫ్రెష్ బుద్ధి కలవారు బాగా ధారణ చేయగలరు. విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. యూనివర్సిటీలో మనుష్యులే చదువుకుంటారు కదా. మనమే 84 జన్మలు తీసుకుంటాము అని కూడా ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. 84 లక్షల విషయమ అసలు లేదు. విశ్వంలో ఉన్న ఆత్మలన్నీ, ఈ సమయంలో పతితంగా ఉన్నాయి. ఇది ఛీ-ఛీ ప్రపంచము, దుఃఖధామము. వారిని సుఖధామానికి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారిని ముక్తిదాత అని కూడా అంటారు. మీరు మొత్తం ప్రపంచానికి లేక విశ్వానికి యజమానులుగా అవుతారు కదా. ఈ సందేశాన్ని అందించి రండి అని బాబా అందరికీ చెప్తారు. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు, వారిని మార్గదర్శకుడు, ముక్తిదాత, దయాహృదయుడు అని కూడా అంటారు. అనేక భాషలున్నాయి కదా. ఆత్మలన్నీ ఒక్కరినే పిలుస్తాయి కనుక వారొక్కరే మొత్తము విశ్వానికి టీచరుగా కూడా అయ్యారు కదా. వారు తండ్రి కూడా కానీ వారు ఆత్మలైన మనందరికీ టీచరు కూడా, గురువు కూడా అని ఎవ్వరికీ తెలియదు. వారు అందరినీ గైడ్ కూడా చేస్తారు. ఈ అనంతమైన గైడ్ గురించి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఆత్మ అంటే ఏమిటి అని ఆత్మ గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ప్రపంచంలోని మనుష్యులలో ఒక్కరు కూడా, మొత్తం ప్రపంచంలో, విశేషంగా భారతదేశంలో ఆత్మ అంటే ఏమిటో తెలిసినవారు లేరు. భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రము అని అనడం అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మ అవినాశీ అని ఇప్పుడు మీకు తెలుసు. అది ఎప్పుడూ పెద్దదిగా లేక చిన్నదిగా అవ్వదు. ఆత్మలైన మీలానే, తండ్రి కూడా అదే బిందువు. వీరు పెద్దగా, చిన్నగా అవ్వరు. వారు కూడా ఆత్మనే, కేవలం వారు పరమ ఆత్మ, సుప్రీమ్. ఆత్మలన్నీ తప్పకుండా పరంధామంలో నివసించేవి. పాత్ర అభినయించేందుకు ఇక్కడకు వస్తాయి. మళ్ళీ తమ పరంధామానికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తాయి. పరమపిత పరమాత్మను అందరూ గుర్తు చేస్తారు ఎందుకంటే పరమపితనే ఆత్మలను ముక్తిలోకి పంపించారు, కావున వారినే స్మృతి చేస్తారు. ఆత్మనే తమోప్రధానంగా అయ్యింది. ఎందుకు స్మృతి చేస్తారు అనేది కూడా తెలియదు. ఎలాగైతే పిల్లలు "బాబా” అని అంటారో, అంతే. వారికేమీ తెలియదు. మీరు కూడా బాబా మమ్మా అని అంటారు, ఏమీ తెలియదు. భారతదేశంలో ఒకే మతము ఉండేది, దానిని దైవీ మతమని అంటారు. తర్వాత ఇందులోకి వేరేవి ప్రవేశించాయి. ఇప్పుడు అనేకమైపోయాయి, అందుకే ఇన్ని కొట్లాటలు మొదలైనవి జరుగుతున్నాయి. ఎక్కడెక్కడైతే ఇతర మతాలవారు ఎక్కువగా దూరిపోయారో, అక్కడ నుండి వారిని పంపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా గొడవలు జరిగాయి. అంధకారము కూడా చాలా ఏర్పడింది. దానికి ఎంతో కొంత లిమిట్ కూడా ఉండాలి కదా. పాత్రధారులకు లిమిట్ ఉంటుంది. ఇది కూడా తయారై తయారవుతున్న ఆట. ఇందులో ఎంతమంది పాత్రధారులైతే ఉంటారో, అందులో ఎక్కువ తక్కువ అవ్వదు. పాత్రధారులందరూ స్టేజి పైకి వచ్చిన తర్వాత, మళ్ళీ వారు తిరిగి వెళ్ళాలి కూడా. మిగిలిపోయిన పాత్రధారులందరూ, వస్తూ ఉంటారు. కంట్రోల్ చేసేందుకు ఎంతగా తల కొట్టుకుంటూ ఉన్నా కానీ చెయ్యలేరు. బి.కె.లైన మేము ఎటువంటి బర్త్ కంట్రోల్ చేస్తామంటే, ఇక 9 లక్షల మందే వెళ్ళి ఉంటారని వారికి చెప్పండి. తర్వాత మొత్తం జనాభా తగ్గిపోతుంది. మేము మీకు సత్యము చెప్తున్నాము, ఇప్పుడు స్థాపన చేస్తున్నాము. కొత్త ప్రపంచము, కొత్త వృక్షము తప్పకుండా చిన్నదిగానే ఉంటుంది. ఇక్కడైతే కంట్రోల్ చేయలేరు ఎందుకంటే ఇంకా తమోప్రధానంగా అయిపోతూ ఉంటుంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. వచ్చే పాత్రధారులంతా, ఇక్కడికే వచ్చి శరీరాలను ధారణ చేస్తారు. ఈ విషయాలను ఎవ్వరూ అర్థము చేసుకోరు. తెలివైన బుద్ధికలవారు అర్థము చేసుకుంటారు, రాజధానిలో అన్ని రకాల పాత్రధారులు ఉంటారు. సత్యయుగంలో ఏ రాజధాని అయితే ఉండేదో, అది మళ్ళీ స్థాపనవుతుంది. ట్రాన్స్ఫర్ అవుతారు. మీరిప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధాన క్లాసులోకి ట్రాన్స్ఫర్ అవుతారు. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్తారు. మీ చదువు ఈ ప్రపంచము కోసం కాదు. ఇటువంటి యూనివర్సిటీ మరొకటి ఉండదు. నేను మిమ్మల్ని అమరలోకము కోసం చదివిస్తున్నానని గాడ్ ఫాదర్ యే అంటున్నారు. ఈ మృత్యులోకము సమాప్తమవ్వనున్నది. సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఉండేది. ఇది ఎలా స్థాపించబడింది అనేది ఎవ్వరికీ తెలియదు.

మీరు ఎక్కడైతే భాషణ చేస్తారో, అక్కడ ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తప్పకుండా పెట్టుకోండి అని బాబా ఎప్పుడూ చెప్తారు. ఇందులో తేదీ కూడా తప్పకుండా వ్రాసి ఉండాలి. కొత్త విశ్వము ప్రారంభము నుండి 1250 సంవత్సరాల వరకు ఈ వంశస్థుల రాజ్యము ఉండేదని మీరు అర్థం చేయించవచ్చు. క్రిస్టియన్ల రాజ్యం ఒకప్పుడు ఉండేది అని అంటారు కదా. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. ఈ దేవతా వంశమున్నప్పుడు ఇంకెవ్వరిదీ ఉండేది కాదు. ఇప్పుడు ఈ వంశము మళ్ళీ స్థాపన అవుతుంది. మిగిలినవన్నీ వినాశనమవ్వనున్నాయి. యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. భాగవతము మొదలైనవాటిలో దీనిపై కూడా కథ రాసారు. చిన్నతనంలో ఈ కథలవి వింటూ ఉండేవారు. ఇప్పుడు ఈ రాజ్యం ఎలా స్థాపన జరుగుతుంది అనేది మీకు తెలుసు. తప్పకుండా తండ్రియే రాజయోగాన్ని నేర్పించారు. పాస్ అయిన వారు విజయమాలలోని మణులుగా అవుతారు, ఇంకెవ్వరికీ ఈ మాల గురించి తెలియదు. మీకు మాత్రమే తెలుసు. మీది ప్రవృత్తి మార్గము. పైన బాబా నిలబడి ఉన్నారు, వారికి తమ శరీరము లేదు. తర్వాత బ్రహ్మా-సరస్వతులు, వారే లక్ష్మీ-నారాయణులు. మొదట తండ్రి ఉండాలి, తర్వాత జంట ఉండాలి. రుద్రాక్ష పూసలు ఉంటాయి కదా. నేపాల్ లో ఒక వృక్షముంది, అక్కడ నుండి ఈ రుద్రాక్ష పూసలు వస్తాయి. అందులో సత్యమైనవి కూడా ఉంటాయి. ఎంత చిన్నవిగా ఉంటాయో, అంత ఎక్కువ ఖరీదు ఉంటుంది. ఇప్పుడు మీరు దాని అర్థమును తెలుసుకున్నారు. ఇది విష్ణువు యొక్క విజయమాలగా లేక రుండమాలగా అవుతుంది. వారు కేవలము మాలను తిప్పుతూ-తిప్పుతూ రామ-రామ అని అంటూ ఉంటారు, అర్థమేమీ తెలియదు. మాలను జపిస్తారు. నన్ను స్మృతి చేయండి అని ఇక్కడ తండ్రి చెప్తారు. ఇది అజపాజపము. నోటితో ఏమీ మాట్లాడకూడదు. పాటలు కూడా స్థూలమైనవే. పిల్లలు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. లేకపోతే మళ్ళీ పాటలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం స్మృతి. మీరు శబ్దము నుండి అతీతంగా వెళ్ళాలి. తండ్రి డైరెక్షన్ - మన్మనాభవ. పాటలు పాడండి, మొర పెట్టుకోండి అని తండ్రి చెప్పరు. నా మహిమను గాయనం చేసే అవసరం కూడా లేదు. వారు జ్ఞానసాగరులు, సుఖ-శాంతిసాగరులని మీకు తెలుసు. మనుష్యులకు తెలియదు. ఒట్టినే పేర్లు పెట్టేశారు. మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి తన నామ రూపాలు మొదలైనవి తెలియజేస్తారు - నేను ఎలా ఉంటాను, ఆత్మలైన మీరు ఎలా ఉంటారు! మీరు పాత్రను అభినయించేందుకు చాలా శ్రమ చేస్తారు. అర్థకల్పము భక్తి చేశారు, నేనైతే అటువంటి పాత్రలోకి రాను. నేను సుఖ-దుఃఖాలకు అతీతంగా ఉంటాను. మీరు దుఃఖమును అనుభవిస్తారు, మళ్ళీ సత్యయుగంలో మీరే సుఖమును అనుభవిస్తారు. మీ పాత్ర నా పాత్ర కన్నా ఉన్నతమైనది. నేనైతే అర్థకల్పము అక్కడే వానప్రస్థంలో ప్రశాంతంగా కూర్చుని ఉంటాను. మీరు నన్ను పిలుస్తూ వస్తారు. అలాగని నేను అక్కడ కూర్చుని మీ పిలుపును వింటానని కాదు. నా పాత్ర ఈ సమయంలోనే ఉంది. డ్రామా యొక్క పాత్ర గురించి నాకు తెలుసు. ఇప్పుడు డ్రామా పూర్తయ్యింది, నేను వెళ్ళి పతితులను పావనంగా చేసే పాత్రను అభినయించాలి, ఇంకే విషయమూ లేదు. మనుష్యులు, పరమాత్మ సర్వశక్తివంతుడు, అంతర్యామి, అందరిలో ఏమేమి నడుస్తుందో వారికి తెలుసు అని భావిస్తారు. అలాంటిదేమీ లేదు అని తండ్రి అంటారు. మీరు పూర్తిగా తమోప్రధానమైనప్పుడు - ఏక్యురేట్ సమయానికి నేను రావలసి వస్తుంది. సాధారణ శరీరములోనే వస్తాను. వచ్చి పిల్లలైన మిమ్మల్ని దుఃఖము నుండి విడిపిస్తాను. బ్రహ్మా ద్వారా ఏక ధర్మస్థాపన, శంకరుని ద్వారా అనేక ధర్మాల వినాశనము..... హాహాకారాల తర్వాత జయజయకారాలు జరుగుతాయి. ఎన్ని హాహాకారాలు జరుగుతాయి. ఆపదలలో మరణిస్తూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు సహాయం కూడా చాలా ఉంటుంది. లేకపోతే మనుష్యులు చాలా రోగగ్రస్థులుగా, దుఃఖితులుగా అవుతారు. పిల్లలు దుఃఖితులుగా అవ్వకూడదు, అందుకే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా జోరుగా వచ్చి అందరినీ సమాప్తము చేసేస్తాయి అని తండ్రి చెప్తారు. బాంబులు అసలేమీ కావు, ప్రకృతి వైపరీత్యాలు చాలా సహాయం చేస్తాయి. భూకంపాలలో అనేక మంది సమాప్తమైపోతారు. నీరు ఒకటి రెండు సార్లు ఉప్పొంగగానే అంతా సమాప్తమైపోతుంది. సముద్రం కూడా తప్పకుండా ఉప్పొంగుతుంది. భూమిని ముంచేస్తాయి, నీరు 100 అడుగుల ఎత్తుకు ఉప్పొంగితే ఏమవుతుంది. ఇవి హాహాకారాల దృశ్యాలు. ఇటువంటి దృశ్యాలను చూసేందుకు ధైర్యం కావాలి. శ్రమ కూడా చేయాలి, నిర్భయులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీకు ఏ మాత్రం అహంకారముండకూడదు. దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహీ అభిమానిగా ఉండేవారు చాలా మధురంగా ఉంటారు. తండ్రి అంటారు - నేనైతే నిరాకారుడను మరియు విచిత్రుడను. ఇక్కడకు సేవ చేసేందుకు వస్తాను. నన్ను ఎంతగా మహిమ చేస్తారో చూడండి. జ్ఞానసాగరా, ఓ బాబా, అని అంటూ, మళ్ళీ పతిత ప్రపంచములోకి రండి పిలుస్తారు. మీరు చాలా బాగా ఆహ్వానిస్తారు. స్వర్గములోకి వచ్చి సుఖాన్ని చూడమని అనరు. ఓ పతితపావనా, మేము పతితంగా ఉన్నాము, మమ్మల్ని పావనంగా చేయడానికి రండి అని అంటారు. ఎలా ఆహ్వానిస్తున్నారో చూడండి. పూర్తిగా తమోప్రధానమైన పతిత ప్రపంచములోకి మరియు పతిత శరీరములోకి పిలుస్తారు. భారతవాసులు చాలా బాగా ఆహ్వానిస్తారు! డ్రామా రహస్యమే ఇలా ఉంది. ఇది నా అనేక జన్మల అంతిమ జన్మ అని వీరికి కూడా తెలియదు. బాబా ప్రవేశించినప్పుడే తెలియజేస్తారు. బాబా ప్రతి ఒక్క విషయం యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. బ్రహ్మాయే పత్నిగా అవ్వాలి. వీరు నా పత్ని అని బాబా స్వయంగా చెప్తారు. నేను వీరిలో ప్రవేశించి వీరి ద్వారా మిమ్మల్ని నా వారిగా చేసుకుంటాను. వీరు సత్యాతి-సత్యమైన పెద్ద తల్లి అయ్యారు మరియు వారు దత్తత తల్లి అయ్యారు. తల్లి-తండ్రి అని మీరు వీరిని అనవచ్చు. శివబాబాను కేవలం తండ్రి అని మాత్రమే అనాలి. వీరు బ్రహ్మాబాబా. మమ్మా గుప్తముగా ఉన్నారు. బ్రహ్మా తల్లి, కానీ శరీరము పురుషునిది. వీరు సంభాళించలేరు, అందుకే కూతురును దత్తత తీసుకున్నారు. మాతేశ్వరి అని పేరు పెట్టారు. వీరు హెడ్ అయ్యారు. డ్రామానుసారంగా సరస్వతి ఒక్కరే ఉంటారు. ఇకపోతే దుర్గ, కాళీ మొదలైన అనేక పేర్లు ఉన్నాయి. తల్లి-తండ్రి అయితే ఒక్కరే ఉంటారు కదా. మీరంతా పిల్లలు. సరస్వతి బ్రహ్మాపుత్రిక అనే గాయనము కూడా ఉంది. మీరు బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు కదా. మీకు చాలా పేర్లున్నాయి. ఈ విషయాలన్నీ మీలో కూడా నంబరువారుగా అర్థము చేసుకుంటారు. చదువులో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఒకరు మరొకరితో కలవరు. ఈ రాజధాని స్థాపనవుతుంది. ఇది తయారై తయారవుతున్న డ్రామా. దీనిని విస్తారంగా అర్థము చేసుకోవాలి. లెక్కలేనన్ని పాయింట్లు ఉన్నాయి. బ్యారిస్టరీ చదువుతారు, వారిలో కూడా నంబరువారుగా ఉంటారు. కొంతమంది బ్యారిస్టర్లు 2-3 లక్షలు సంపాదిస్తారు. కొంతమందిని చూడండి, చిరిగిపోయిన వస్త్రాలను ధరిస్తారు. ఇక్కడ కూడా అలాగే ఉంటారు.

ఇది అంతర్జాతీయ సమస్య అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. అందరూ నిశ్చింతగా ఉండండి అని మీరిప్పుడు అర్థము చేయిస్తారు. యుద్ధము తప్పకుండా జరగనున్నది. కొత్త దైవీ రాజధాని మళ్ళీ స్థాపనవుతుందని మీరు దండోరా వేస్తారు. అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. ఇది ఎంత స్పష్టంగా ఉంది. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఈ ప్రజలు రచింపబడతారు. వీరు నా ముఖవంశావళి అని అంటారు. మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. వారు కుఖవంశావళి బ్రాహ్మణులు. వారు పూజారులు, మీరిప్పుడు పూజ్యులుగా అవుతున్నారు. మనమే పూజ్య దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మీపై లైట్ కిరీటము లేదు. మీ ఆత్మ పవిత్రంగా అయినప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తుంది. మీకు ఈ శరీరముపై లైట్ కిరీటము ఇవ్వలేరు, శోభించదు. ఈ సమయంలో మీరు గాయన యోగ్యులుగా అయ్యారు. ఈ సమయంలో ఎవ్వరి ఆత్మ పవిత్రంగా లేదు, కనుక ఈ సమయంలో ఎవరి పైనా లైట్ ఉండకూడదు. లైట్ సత్యయుగంలో ఉంటుంది. రెండు కళలు తక్కువున్నవారికి కూడా ఈ లైట్ ఇవ్వకూడదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంతిమ వినాశన దృశ్యాన్ని చూడగలిగే విధంగా తమ స్థితిని అచలంగా మరియు నిర్భయంగా తయారుచేసుకోవాలి. దేహీ అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి.

2. కొత్త రాజధానిలో ఉన్నత పదవిని పొందేందుకు చదువుపై పూర్తిగా ధ్యానముంచాలి. పాస్ అయి విజయమాలలో మణులుగా అవ్వాలి.

వరదానము:-

నిర్బల, నిరుత్సాహ, అసమర్థ ఆత్మకు ఎక్స్ ట్రా బలమునిచ్చే ఆత్మిక దయాహృదయ భవ

ఎవరైతే ఆత్మిక దయాహృదయులైన పిల్లలుంటారో - వారు మహాదానులుగా అయి పూర్తిగా హోప్ లెస్ కేసులో హోప్ ను ఉత్పన్నం చేస్తారు. వారు నిర్బలంగా ఉన్నవారిని బలవంతులుగా చేస్తారు. దానం అనేది సదా పేదవారికి, ఆధారము లేనివారికి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎవరైతే నిర్బల, నిరుత్సాహ, అసమర్థ, ప్రజా క్వాలిటీ ఆత్మలున్నారో, వారి పట్ల ఆత్మిక దయాహృదయులుగా అయి మహాదానులుగా అవ్వండి. పరస్పరంలో ఒకరికొకరు మహాదానులుగా అవ్వకండి. మీరు పరస్పరంలో సహయోగీ సహచరులు, సోదరులు, సమాన పురుషార్థులు కావున సహయోగమివ్వండి, దానం కాదు.

స్లోగన్:-

సదా ఒక్క తండ్రి యొక్క శ్రేష్ఠమైన సాంగత్యంలో ఉన్నట్లయితే ఇంకెవరి సాంగత్యపు రంగు ప్రభావం చూపించలేదు.