17-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు ఒక్కొక్కరిని దేవతలుగా తయారుచేయాలి, మీరు అందరి కళ్యాణము చేసేవారు, పేదవారిని షావుకారులుగా చేయడం మీ కర్తవ్యము”

ప్రశ్న:-

తండ్రికి గల ఏ పేరు సాధారణమైనదైనా కానీ కర్తవ్యము చాలా గొప్పది?

జవాబు:-

బాబాను తోట యజమాని-నావికుడు అని అంటారు. ఈ పేరు ఎంత సాధారణమైనది కానీ మునిగిపోయేవారిని తీరానికి చేర్చడం, ఇది ఎంత మహాన్ కర్తవ్యము. ఏ విధంగా ఈత ఈదే ఈతగాడు ఒకరిద్దరికి చేయినందించి తీరానికి చేరుస్తాడో, అదే విధంగా తండ్రి చేయి లభించడంతో మీరు స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు మీరు కూడా మాస్టర్ నావికులు. మీరు ప్రతి ఒక్కరి నావను తీరం చేర్చే మార్గాన్ని తెలియజేస్తారు.

ఓంశాంతి. స్మృతిలోనైతే పిల్లలు కూర్చునే ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి, దేహము కూడా ఉంది. అలాగని దేహము లేకుండా కూర్చున్నారని కాదు. కానీ దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అయి కూర్చోండి అని తండ్రి అంటున్నారు. దేహీ అభిమానము శుద్ధమైనది, దేహాభిమానము అశుద్ధమైనది. దేహీ అభిమానులుగా అవ్వడంతోనే మేము శుద్ధంగా, పవిత్రంగా అవుతున్నామని మీకు తెలుసు. దేహాభిమానులుగా అవ్వడంతో అశుద్ధంగా, అపవిత్రంగా అయిపోయాము. ఓ పతితపావనా రండి అని కూడా పిలుస్తారు. పావన ప్రపంచముండేది. ఇప్పుడు పతితంగా ఉంది, మళ్ళీ తప్పకుండా పావన ప్రపంచము ఉంటుంది. సృష్టిచక్రము తిరుగుతుంది. ఈ సృష్టిచక్రం గురించి తెలుసుకున్నవారిని స్వదర్శన చక్రధారులని అంటారు. మీరు ప్రతి ఒక్కరు స్వదర్శన చక్రధారులు. స్వ ఆత్మకు సృష్టిచక్ర జ్ఞానము లభించింది. జ్ఞానమిచ్చినదెవరు? వారు కూడా తప్పకుండా స్వదర్శన చక్రధారులే అయి ఉంటారు. తండ్రి తప్ప ఇతర మనుష్యులెవరూ నేర్పించలేరు. తండ్రియైన పరమాత్మనే పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలూ, మీరు దేహీ అభిమానులుగా అవ్వండి అని అంటారు. సత్యయుగంలో ఈ జ్ఞానము లేక శిక్షణనిచ్చే అవసరముండదు. అక్కడ భక్తి కూడా ఉండదు. జ్ఞానముతో వారసత్వము లభిస్తుంది. ఈ విధంగా మీరు శ్రేష్ఠంగా అవుతారు అని తండ్రి శ్రీమతమునిస్తారు. మేము శ్మశానవాసులుగా ఉండేవారము, ఇప్పుడు తండ్రి శ్రేష్ఠమైన దేవతలుగా తయారుచేస్తున్నారు అని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచము శ్మశానముగా మారనుంది. మృత్యులోకాన్ని శ్మశానమనే అంటారు. కొత్త ప్రపంచాన్ని పరిస్తాన్ అని అంటారు. డ్రామా రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ మొత్తం సృష్టిని అడవి అని అంటారు.

మొత్తం సృష్టిపై ఈ సమయములో రావణ రాజ్యముంది అని బాబా అర్థం చేయించారు. దసరాను కూడా జరుపుకుంటారు, ఎంత సంతోషిస్తారు. పిల్లలందరినీ దుఃఖము నుండి విడిపించేందుకు నేను కూడా పాత రావణుని ప్రపంచంలోకి రావలసి ఉంటుంది అని తండ్రి అంటున్నారు. ఒక కథను వినిపిస్తారు. నీకు మొదట సుఖము కావాలా లేదా దుఃఖము కావాలా అని ఎవరో అడిగారు. సుఖము కావాలని అన్నారు. సుఖములోకి వెళ్ళినట్లయితే అక్కడకు ఎలాంటి యమదూతలు మొదలైనవారు రాలేరు. ఇది కూడా ఒక కథ. సుఖధామంలోకి ఎప్పుడూ కాలుడు రాడు అని తండ్రి చెప్తున్నారు, అది అమరపురిగా అవుతుంది. మీరు మృత్యువుపై విజయం పొందుతారు. మీరు ఎంత సర్వశక్తివంతులుగా అవుతారు. ఫలానావారు మరణించారని అక్కడ ఎప్పుడూ ఈ విధంగా అనరు, మరణమనే పేరే ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. సర్పము కూడా చర్మాన్ని మారుస్తుంది కదా. మీరు కూడా పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మంలోకి అంటే కొత్త శరీరములోకి వస్తారు. అక్కడ పంచ తత్వాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి. అన్ని వస్తువులు సతోప్రధానము అయిపోతాయి. ప్రతి వస్తువు, ఫలాలు మొదలైనవి కూడా ది బెస్ట్ గా ఉంటాయి. సత్యయుగాన్నే స్వర్గమని అంటారు. అక్కడ చాలా ధనవంతులుగా ఉండేవారు. వీరంత సుఖంగా, విశ్వానికి యజమానులుగా ఎవ్వరూ ఉండరు. మనమే అలా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు, కనుక ఎంత సంతోషం ఉండాలి. ఒక్కొక్కరిని దేవతగా చేయాలి, అనేకుల కళ్యాణము చేయాలి. మీరు చాలా షావుకారులుగా అవుతారు. వారంతా పేదవారు. మీ చేతికి చేతిని అందించనంతవరకు వారు స్వర్గవాసులుగా అవ్వలేరు. తండ్రి చేయి అయితే అందరికీ లభించదు. తండ్రి చేయి మీకే లభిస్తుంది. మీ చేయి మళ్ళీ ఇతరులకు లభిస్తుంది. వారి చేతులు మళ్ళీ ఇంకొంతమందికి లభిస్తుంది. ఏ విధంగా ఈదేవారు ఒక్కొక్కరిని తీరానికి చేరుస్తారో, అలా మీరు కూడా మాస్టర్ నావికులు. అనేకమంది నావికులుగా అవుతున్నారు. మీ వ్యాపారమే ఇది. మనము ప్రతి ఒక్కరి నావను తీరం చేర్చే మార్గమును తెలియజేయాలి. నావికుని పిల్లలు నావికులుగా అవ్వాలి. పేరు ఎంత సాధారణమైనది - తోట యజమాని, నావికుడు. ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు చూస్తున్నారు. మీరు పరిస్తాన్ ను స్థాపన చేస్తున్నారు. మీ స్మృతిచిహ్నము ఎదురుగా నిలబడి ఉంది. క్రింద రాజయోగ తపస్య, పైన రాజ్యము కనిపిస్తుంది. దిల్వాడా అన్న పెరు కూడా చాలా బాగుంది. తండ్రి అందరి హృదయాలను గెలుచుకుంటారు. అందరికీ సద్గతినిస్తారు. మీ హృదయమును గెలుచుకునేవారెవరు. ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మాకు కూడా తండ్రి శివబాబా. అందరి హృదయాలను గెలుచుకునేవారు అనంతమైన తండ్రియే అవుతారు. తత్వాలు మొదలైనవాటన్నిటి కళ్యాణము చేస్తారు, ఇది కూడా పిల్లలకు అర్థము చేయించడం జరిగింది. ఇతర ధర్మాల వారి శాస్త్రాలు మొదలైనవి నిలిచి ఉంటాయి. మీకు సంగమయుగములోనే జ్ఞానము లభిస్తుంది, వినాశనమైన తర్వాత ఏ శాస్త్రాలు ఉండవు. శాస్త్రాలు భక్తి మార్గానికి గుర్తు. ఇది జ్ఞానము. తేడా చూశారు కదా. భక్తి అపారమైనది, దేవీలు మొదలైనవారి పూజల కోసం ఎంత ఖర్చు చేస్తారు. వీటితో అల్పకాలిక సుఖముంటుంది అని తండ్రి అంటున్నారు. ఎటువంటి భావన పెట్టకుంటారో, అది పూర్తవుతుంది. దేవీలను అలంకరిస్తూ-అలంకరిస్తూ ఎవరికైనా సాక్షాత్కారమయితే, ఇక చాలా సంతోషిస్తారు. లాభమేమీ ఉండదు. మీరా పేరు కూడా గాయనం చేయబడింది. భక్తుల మాల ఉంది కదా. స్త్రీలలో మీరా, పురుషులలో నారదుడు భక్తశిరోమణులుగా గాయనం చేయబడతారు. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. మాలలోని పూసలైతే చాలామంది ఉన్నారు. పైనున్న పుష్పము బాబా, తర్వాత జంట పూస. పుష్పానికి అందరూ నమస్కరిస్తారు. ఒక్కొక్క పూసకు నమస్కరిస్తారు. రుద్రయజ్ఞమును రచించినప్పుడు అందులో కూడా శివుడిని ఎక్కువగా పూజిస్తారు. సాలిగ్రామాలను అంతగా పూజించరు. ధ్యాస అంతా శివుని వైపే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నట్లుగా శివబాబా ద్వారానే సాలిగ్రామాలు ఇంత చురుకైనవిగా అయ్యాయి. పతితపావనుడైన తండ్రి పిల్లలైన మీరు కూడా మాస్టర్ పతితపావనులు. ఒకవేళ ఎవ్వరికీ మార్గమును తెలియజేయకపోతే పైసాకు విలువచేయని పదవి లభిస్తుంది. అయినా తండ్రినైతే కలుసుకున్నారు కదా. అది కూడా తక్కువేమీ కాదు. అందరికీ తండ్రి వారొక్కరే. కృష్ణుని కోసం అలా అనరు. కృష్ణుడు ఎవరికి తండ్రి అవుతారు? కృష్ణుడిని ఫాదర్ అని అనరు. పిల్లలను ఫాదర్ అని అనలేరు. యుగల్ గా అయిన తర్వాత, పిల్లలు జన్మించినప్పుడు ఫాదర్ అని అంటారు. తర్వాత ఆ పిల్లలే వారిని ఫాదర్ అని అంటారు. ఇతరులెవ్వరూ అనరు. ఇక వృద్ధులు ఎవరినైనా బాపూజీ అని అంటారు. వీరు (శివబాబా) అందరికీ తండ్రి. సోదరత్వము అని కూడా పాడుతారు. ఈశ్వరుడిని సర్వవ్యాపి అనడంతో ఫాదర్ హుడ్ అవుతుంది.

పిల్లలైన మీరు పెద్ద-పెద్ద సభలలో అర్థం చేయించవలసి ఉంటుంది. ఎప్పుడైనా భాషణ చేసేందుకు వెళ్ళవలసి ఉంటే, ఏ టాపిక్ పైన అయితే భాషణ చేయాలో, దానిపై విచార సాగర మథనము చేసి వ్రాసుకోవాలి. తండ్రి అయితే విచార సాగర మథనము చేయరు. కల్పక్రితము ఏదైతే వినిపించారో, అది వినిపించి వెళ్ళిపోతారు. మీరు టాపిక్ పై అర్థం చేయించాలి. మొదట వ్రాసుకుని, తర్వాత చదువుకోవాలి. భాషణ చేసిన తర్వాత ఫలానా పాయింట్లు చెప్పలేదని మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇవి అర్థం చేయించి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఏవో కొన్ని పాయింట్లు మర్చిపోతారు, ఇలా జరుగుతుంది. సోదరీ, సోదరులారా, ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని మొట్టమొదట చెప్పవలసి ఉంటుంది. ఇదైతే ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎవ్వరూ ఇటువంటి సమాచారమును బాబాకు వ్రాయరు. ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని మొట్టమొదట అందరికీ చెప్పాలి. ఆత్మలైన మీరు అవినాశీ. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానాన్నిస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి చెప్తున్నారు. దేహధారులెవ్వరినీ గుర్తు చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, మనం అక్కడ ఉండేవారము. మన తండ్రి కళ్యాణకారి శివ, ఆత్మలైన మనము వారి పిల్లలము. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి అంటున్నారు. నేను ఒక ఆత్మను. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమౌతాయి. గంగా స్నానం మొదలైనవాటితో వికర్మలు వినాశనం అవ్వవు. మీరు నన్ను స్మృతి చేయండి అని తండ్రి యొక్క డైరెక్షన్ ఉంది. వారు గీతను చదువుతారు, యదా యదాహి ధర్మస్య...... అని అంటారు కానీ అర్థమేమీ తెలియదు. కావున బాబా సేవ కొరకు సలహాలనిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారు. వారు కృష్ణుడు చెప్పారని భావిస్తారు, మీరు, శివబాబా పిల్లలైన మనకు వారిని స్మృతి చేయమని చెప్తున్నారని అంటారు. నన్ను ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సతోప్రధానంగా అయి ఉన్నత పదవిని పొందుతారు. లక్ష్యము ఉద్దేశ్యము కూడా ఎదురుగా ఉంది. పురుషార్థము ద్వారా ఉన్నత పదవిని పొందాలి. అటువైపు వారు తమ ధర్మాలలో ఉన్నతపదవిని పొందుతారు, మనము ఇతర ధర్మాలలోకి వెళ్ళము. వారు రావడమే వెనుక వస్తారు. మా కన్నా ముందు స్వర్గముండేదని వారికి కూడా తెలుసు. భారతదేశము అన్నిటికన్నా ప్రాచీనమైనది. కానీ అలా ఎప్పుడుండేదో, ఎవ్వరికీ తెలియదు. వారిని భగవాన్-భగవతి అని కూడా అంటారు కానీ భగవాన్-భగవతీ అని అనకూడదని తండ్రి అంటున్నారు. నేను ఒక్కరిని మాత్రమే భగవంతుడను. మనము బ్రాహ్మణులము. తండ్రిని బ్రాహ్మణుడని అనరు. వారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు, వారి శరీరానికి పేరు లేదు. మీ శరీరాలన్నిటికీ పేర్లు ఉంటాయి. ఆత్మ అయితే ఆత్మనే. వారు కూడా పరమాత్మ. ఆ ఆత్మ పేరు శివ, వారు నిరాకారుడు. వారికి సూక్ష్మ, స్థూల శరీరాలు లేవు. అలాగని వారికి ఆకారము లేదని కాదు. ఎవరికైతే పేరుంటుందో, వారికి ఆకారము కూడా తప్పకుండా ఉంటుంది. నామ-రూపాలు లేని వస్తువేదీ ఉండదు. తండ్రియైన పరమాత్మను నామ-రూపాలకు అతీతమైనవారని అనడం ఎంత పెద్ద అజ్ఞానము. తండ్రి కూడా నామ-రూపాలకు అతీతమైనవారైతే, పిల్లలు కూడా నామ-రూపాలకు అతీతమైనవారైతే, ఇక సృష్టియే ఉండదు. మీరిప్పుడు బాగా అర్థము చేయంచగలరు. గురువులు చివరిలో అర్థం చేసుకుంటారు. ఇప్పుడిది వారి రాజ్యము.

ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతారు. అహింసా పరమో దేవీదేవతా ధర్మము, డబల్ అహింసాయుత ధర్మముగా గాయనం చేయబడింది. ఎవరిపైనైనా చేయి చేసుకోవడం, దుఃఖమునివ్వడం, ఇది కూడా హింస అయినట్లు. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు అని తండ్రి ప్రతి రోజూ అర్థము చేయిస్తారు. మనసులో దుఃఖము తప్పకుండా వస్తుంది. సత్యయుగంలో మనసులో కూడా రాదు. ఇక్కడైతే మనసా-వాచా-కర్మణా వస్తుంది. మీరు ఈ పదాలు అక్కడ అసలు వినరు. అక్కడ సత్సంగము మొదలైనవేవీ ఉండవు. సత్యము ద్వారా సత్యంగా అయ్యేందుకు సత్సంగం జరుగుతుంది. సత్యము ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి కూర్చుని నరుని నుండి నారాయణునిగా అయ్యే కథను వినిపిస్తున్నారు, దీనితో మీరు నారాయణునిగా అవుతారు. తర్వాత భక్తిమార్గములో సత్యనారాయణ కథను చాలా ప్రేమగా వింటారు. మీ స్మృతి చిహ్నమైన దిల్వాడా మందిరము ఎంత బాగుందో చూడండి. తప్పకుండా సంగమయుగంలో హృదయాన్ని గెలుచుకుని ఉంటారు. ఆదిదేవ్ మరియు దేవి, పిల్లలు కూర్చుని ఉన్నారు. ఇది యథార్థమైన స్మృతి చిహ్నము. వారి చరిత్ర-భూగోళాలు మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. అవి మీ స్మృతిచిహ్నాలే. ఇది కూడా అద్భుతము. లక్ష్మీనారాయణుల మందిరములోకి వెళ్ళినప్పుడు మేము ఇలా తయారవుతున్నామని మీరంటారు. క్రీస్తు కూడా ఇక్కడే ఉన్నారు. క్రీస్తు బెగ్గర్ రూపములో ఉన్నారని చాలామంది అంటారు. తమోప్రధానమనగా బెగ్గర్ అయినట్లు కదా. పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు కదా. శ్రీకృష్ణుడు రాకుమారునిగా ఉండేవారు, ఇప్పుడు బెగ్గర్. తెల్లనివారు మరియు నల్లనివారు. ఒకప్పుడు భారతదేశము ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు కూడా తెలుసు. తండ్రి అయితే పేదల పెన్నిధి. మనుష్యులు ఈశ్వరార్థము దాన-పుణ్యాలు కూడా పేదవారికే చేస్తారు. చాలామందికి ధాన్యం లభించదు. మున్ముందు గొప్ప-గొప్ప షావుకారులకు కూడా ధాన్యము లభించకపోవడం మీరు చూస్తారు. ప్రతి ఊరిలోనూ షావుకారులు ఉంటారు కదా, వారిని దొంగలు దోచుకుంటారు. పదవులలో తేడా ఉంటుంది కదా. నంబరువన్ లోకి వెళ్ళే పురుషార్థము చేయండి అని తండ్రి అంటున్నారు. సావధానపరచడం టీచరు పని. పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. ఇది అనంతమైన పాఠశాల. రాజ్యస్థాపన చేసేందుకు ఈ రాజయోగము ఉంది. అయినా పాత ప్రపంచము వినాశనమవ్వాలి. లేకపోతే రాజ్యము ఎక్కడ చేస్తారు. ఇదైతే పతిత భూమి.

గంగ పతితపావని అని మనుష్యులు అంటారు. ఈ సమయంలో పంచ తత్వాలన్నీ తమోప్రధానంగా, పతితంగా ఉన్నాయి అని తండ్రి అంటారు. మొత్తం మురికి, చెత్త అంతా అందులోకి వెళ్ళి కలుస్తుంది. చేపలు మొదలైనవి కూడా అందులో ఉంటాయి. నీరు కూడా ఒక ప్రపంచము వలె ఉంటుంది. నీటిలో ఎన్ని జీవులుంటాయి. పెద్ద-పెద్ద సముద్రాల నుండి కూడా ఎంత ఆహారము లభిస్తుంది. మరి అది కూడా ఒక ఊరు వంటిదే కదా. ఒక ఊరిని మళ్ళీ పతితపావని అని ఎలా అంటారు. మధురాతి-మధురమైన పిల్లలూ, తండ్రి ఒక్కరే పతితపావనుడు అని తండ్రి అర్థం చేయిస్తారు. మీ ఆత్మ మరియు శరీరము పతితంగా అయిపోయాయి, ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లియితే పావనంగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా, సుందరమైనవారిగా అవుతారు. అక్కడ ఇతర ఖండాలేవీ ఉండవు. భారతదేశానిదే ఆల్ రౌండ్ పాత్ర. మీరంతా ఆల్ రౌండర్లు. నాటకంలో పాత్రధారులు నంబరువారుగా వస్తూ-వెళ్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని మీరు భావించండి అని బాబా అంటున్నారు. మేము పతితపావనుడైన గాడ్ ఫాదర్లీ విద్యార్థులము, ఇందులో అన్నీ వచ్చేస్తాయి. వారు పతితపావనుడు కూడా అయ్యారు, గురువు టీచరు కూడా అయ్యారు. తండ్రి కూడా అయ్యారు. వారు నిరాకారుడు. ఇది నిరాకారీ గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. ఎంత మంచి పేరు. ఈశ్వరుని మహిమ ఎంతగా చేస్తారు. బిందువు అని విన్నప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది. ఈశ్వరుని మహిమ ఇంతగా చేస్తారు, అయితే వారు ఎలా ఉంటారు! బిందువు. వారిలో ఎంత పాత్ర నిండి ఉంది. దేహం ఉంటూ కూడా, గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. భక్తిమార్గములో నవవిధ భక్తి చేసేవారి భక్తిని సతోప్రధానమైన నౌధా భక్తి అని అంటారు. ఎంత తీవ్రమైన భక్తి ఉంటుంది. ఇప్పుడు స్మృతిలో తీవ్ర వేగము కావాలి. తీవ్రంగా స్మృతి చేసేవారి పేరే ఉన్నతంగా ఉంటుంది. విజయమాలలో మణిగా అవుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు రోజూ సత్యమైన తండ్రి ద్వారా వినాలి. సత్సంగము చేయాలి. మనసా-వాచా-కర్మణా ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు.

2. విజయమాలలో మణిగా అయ్యేందుకు లేక పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు స్మృతి వేగాన్ని తీవ్రము చేయాలి. మాస్టర్ పతితపావనులుగా అయి అందరినీ పావనంగా చేసే సేవ చేయాలి.

వరదానము:-

మరజీవా జన్మ యొక్క స్మృతి ద్వారా సర్వ కర్మ బంధనాలను సమాప్తం చేసే కర్మయోగీ భవ

ఈ మరజీవా దివ్య జన్మ కర్మబంధన జన్మ కాదు, ఇది కర్మయోగీ జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణాత్మ స్వతంత్రమైనది, పరతంత్రమైనది కాదు. ఈ దేహం లోన్ గా లభించింది, మొత్తం విశ్వానికి సేవ చేసేందుకు తండ్రి పాత శరీరాలలో శక్తిని నింపి నడిపిస్తున్నారు, బాధ్యత తండ్రిది, మీది కాదు. కర్మలు చేయండి, మీరు స్వతంత్రులు, నడిపించేవారు నడిపిస్తున్నారని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు. ఈ విశేషమైన ధారణ ద్వారా కర్మ బంధనాలను సమాప్తం చేసి కర్మ యోగులుగా అవ్వండి.

స్లోగన్:-

సమయం యొక్క సమీపతకు పునాది - అనంతమైన వైరాగ్య వృత్తి.