ఓంశాంతి
పిల్లలు రెండు పదాలను విన్నారు. పిల్లలు అర్థం చేసుకున్నారు, మేము ఇక్కడ కొత్త
ప్రపంచం కోసం అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు వచ్చాము. అదృష్టాన్ని
తయారుచేసుకునేందుకు పురుషార్థము కావాలి. పిల్లలకు తెలుసు, ఇక్కడ శ్రీమతము లభిస్తుంది,
మహామంత్రము లభిస్తుంది, మన్మనాభవ. పదాలైతే ఉన్నాయి కదా. ఈ మంత్రాన్ని ఎవరు ఇస్తారు?
వారు ఉన్నతోన్నతమైనవారు మరియు మతము ఇవ్వడంలో కూడా సాగరుడు. వారి మతము ఒక్కసారే
లభిస్తుంది. డ్రామాలో ఒకసారి ఏదైతే జరిగిపోయిందో, అది మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత
జరుగుతుంది. ఈ ఒక్క మహామంత్రముతోనే నావ తీరానికి చేరుకుంటుంది. పతిత-పావనుడైన తండ్రి
ఒక్కసారి మాత్రమే వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు. పతిత-పావనుడు ఎవరు? పరమపిత పరమాత్మనే
పతితము నుండి పావనంగా చేసి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. వారినే పతిత-పావనుడు,
సద్గతిదాత అని అంటారు. మీరు వారి ఎదురుగా కూర్చున్నారు. వారే మనకు అన్నీ అని మీకు
తెలుసు. మన అదృష్టాన్ని తయారుచేసేవారు ఉన్నతోన్నతమైనవారు. అనంతమైన తండ్రి ద్వారా ఈ
మహామంత్రము లభిస్తుందని మీకు నిశ్చయం ఉంది. వారు తండ్రి కదా. ఒకరు నిరాకారుడు మరియు
ఇంకొకరు సాకారుడు. పిల్లలు కూడా స్మృతి చేస్తారు, తండ్రి కూడా స్మృతి చేస్తారు.
కల్ప-కల్పము తమ పిల్లలకు మాత్రమే వినిపిస్తారు. తండ్రి అంటారు, సర్వుల సద్గతి కోసం
మంత్రము ఒక్కటే మరియు ఇచ్చేవారు కూడా ఒక్కరే. సద్గురువే సత్యమైన మంత్రాన్ని
ఇచ్చేవారు. మీకు తెలుసు, మనం ఇక్కడకు మన సుఖధామం కోసం అదృష్టాన్ని
తయారుచేసుకునేందుకు వచ్చాము. సుఖధామము అని సత్యయుగాన్ని అంటారు, ఇది దుఃఖధామము.
ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారికే శివబాబా బ్రహ్మా ముఖం ద్వారా మంత్రాన్ని
ఇస్తారు. తప్పకుండా సాకారునిలోకి రావాల్సి వస్తుంది, లేదంటే ఎలా ఇస్తారు. వారంటారు
- కల్ప-కల్పము మీకు ఈ మహామంత్రాన్ని ఇస్తాను - నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహం
యొక్క అన్ని ధర్మాలను త్యాగము చేసి, దేహము మరియు దేహము యొక్క అన్ని ధర్మాలను
మర్చిపోండి. స్వయాన్ని దేహముగా భావించడంతో ఇక దేహ సంబంధీకులైన పినతండ్రి, మామయ్య,
గురువులు మొదలైనవారంతా గుర్తుకొస్తారు. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు
ప్రపంచం మరణించినట్లే అని కూడా అంటారు. తండ్రి అంటారు, నేను మీకు మంత్రమే అటువంటిది
ఇస్తాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, అశరీరిగా అవ్వండి. శరీర భానాన్ని
విడిచిపెట్టండి. ఇక్కడ ఉన్నవారు దేహాభిమానులు. సత్యయుగంలో ఉన్నవారు ఆత్మాభిమానులు.
ఈ సంగమములో మీరు ఆత్మాభిమానులుగా కూడా అవుతారు మరియు పరమాత్మను తెలుసుకొని
ఆస్తికులుగా కూడా అవుతారు. ఎవరికైతే పరమపిత పరమాత్మ మరియు వారి రచన గురించి తెలుసో,
వారిని ఆస్తికులు అని అంటారు. ఆస్తికులు కలియుగంలోనూ ఉండరు, సత్యయుగంలోనూ ఉండరు,
సంగమంలోనే ఉంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని పొంది వారే మళ్ళీ సత్యయుగంలో రాజ్యం
చేస్తారు. ఇక్కడ ఆస్తికులు మరియు నాస్తికులు అన్న విషయం ఉంటుంది, అక్కడ ఉండదు.
ఆస్తికులుగా, బ్రాహ్మణులు అవుతారు, వారు ఇంతకుముందు నాస్తికులుగా ఉండేవారు. ఈ సమయంలో
మొత్తం ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు. ఎవ్వరికీ తండ్రి గురించి మరియు తండ్రి రచన
గురించి తెలియదు. సర్వవ్యాపి అని అనేస్తారు. పిల్లలైన మీకు ఒక్క అనంతమైన తండ్రితోనే
పని ఉంది. వారి శ్రీమతము లభిస్తుంది అనగా పురుషార్థము చేయిస్తారు. వారంటారు -
పిల్లలూ, దేహ సహితంగా దేహ భానాన్ని మర్చిపోయి ఎవ్వరినీ స్మృతి చేయకండి. స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దీనినే మహామంత్రము అని అంటారు,
దీనితో మీ అదృష్టము తయారవుతుంది. మీకు 21 జన్మల కోసం స్వరాజ్య తిలకము లభిస్తుంది.
అది ఉన్నదే ప్రారబ్ధము. గీత ఉన్నదే నరుని నుండి నారాయణునిగా అవ్వడానికి, మనుష్యుల
నుండి దేవతలుగా అవ్వడానికి.
ఈ ప్రపంచం మారుతుందని పిల్లలైన మీకు తెలుసు. కొత్త ప్రపంచం కొరకు అదృష్టాన్ని
తయారుచేసుకుంటున్నారు. ఇది మృత్యులోకము. ఇక్కడ చూడండి, మనుష్యుల అదృష్టము ఎలా ఉంది.
దీని పేరే దుఃఖధామము. ఇది ఎవరన్నారు? ఆత్మ అన్నది. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా
అయ్యారు. ఇది దుఃఖధామమని ఆత్మ అంటుంది. ఎక్కడైతే బాబా ఉంటారో, అదే మన పరంధామము.
ఇప్పుడు తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు అదృష్టాన్ని తయారుచేస్తారు. తండ్రి,
నన్ను స్మృతి చేయండి అని ఒక మహామంత్రాన్ని ఇస్తారు. ఏ దేహధారి ద్వారానైనా వినండి,
కానీ స్మృతి విదేహి అయిన నన్ను మాత్రమే చేయండి. వినడమైతే తప్పకుండా దేహధారుల
ద్వారానే వినవలసి ఉంటుంది. బ్రహ్మాకుమారీలు-కుమారులు కూడా పతిత-పావనుడిని స్మృతి
చేయండి అని నోటి ద్వారానే వినిపిస్తారు. మీ తలపై వికర్మల భారం ఏదైతే ఉందో, దానిని
స్మృతి బలముతోనే భస్మం చేసుకోవాలి. నిరోగిగా అవ్వాలి. పిల్లలైన మీరు తండ్రి
సమ్ముఖంలో కూర్చున్నారు. మీకు తెలుసు, బాబా అదృష్టాన్ని తయారుచేయడానికి వచ్చారు
మరియు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. బాబా, స్మృతిని మర్చిపోతున్నాము అని
మీరంటారు. అరే, సిగ్గుగా అనిపించడం లేదా! లౌకిక తండ్రి, ఎవరైతే మిమ్మల్ని పతితంగా
చేస్తారో, వారి స్మృతి ఉంటుంది మరియు ఈ పారలౌకిక తండ్రి, ఎవరైతే మిమ్మల్ని పావనంగా
చేస్తారో, వారంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి.
వారి విషయములో, బాబా, మర్చిపోతున్నాము అని అంటారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని
మందిర యోగ్యులుగా చేయడానికి వచ్చాను. మీకు తెలుసు, భారత్ శివాలయంగా ఉండేది, మనం
రాజ్యము చేసేవారము, తర్వాత మన జడ చిత్రాలను మందిరాలలో పూజిస్తూ వచ్చారు. మనమే
దేవతలుగా ఉండేవారము అన్నది మర్చిపోయారు. మీ మమ్మా బాబా, ఎవరైతే పూజ్యులుగా
దేవీ-దేవతలుగా ఉండేవారో, వారు మళ్ళీ పూజారులుగా అయ్యారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది.
కల్పవృక్షంలో కూడా ముఖ్యమైనదానిని చూపించారు. మొదట పునాదిలో ఆది సనాతన
దేవీ-దేవతలుండేవారు, ఇప్పుడు లేరు. 5 వేల సంవత్సరాల క్రితము సత్యయుగం ఉండేది,
ఇప్పుడిది కలియుగము. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం రానున్నది. తప్పకుండా శ్రీమతము
ఇచ్చేవారు రావాలి. ప్రపంచము తప్పకుండా మారనున్నది. దండోరా వేయిస్తూ ఉంటారు.
వృక్షమైతే వేగంగా పెరగదు. విఘ్నాలు కలుగుతాయి. భిన్న-భిన్న నామ రూపాలలో
చిక్కుకుపోతారు. తండ్రి అంటారు, చిక్కుకోకండి. గృహస్థ వ్యవహారంలోనైతే ఉండండి,
తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రంగా ఉండండి. భగవానువాచ - కామము మహాశత్రువు.
ఇంతకుముందు కూడా గీతా భగవానుడు ఇలా అన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నారు. గీతా
భగవానుడు తప్పకుండా కామముపై విజయం ప్రాప్తింపజేసి ఉంటారు. ఒకటేమో రావణ రాజ్యము,
రెండవది రామ రాజ్యము. రామ రాజ్యము పగలు, రావణ రాజ్యము రాత్రి. తండ్రి అంటారు,
ఇప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నది, దీని కోసమే ఈ అన్ని ఏర్పాట్లు. తండ్రి
చదివించి తీసుకొని వెళ్తారు, మళ్ళీ మీకు రాజ్యం కావాలి. ఈ పతిత పృథ్విపై రాజ్యం
ఏమైనా చేస్తారా. ఇక్కడ పాదాలు మోపేందుకు శివబాబాకైతే కాళ్ళు లేవు. దేవతల పాదాలు ఈ
పతిత ప్రపంచంలోకి రాజాలవు. మనం దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. మళ్ళీ భారత్ లోకే
వస్తాము. కానీ సృష్టి మారి కలియుగము నుండి సత్యయుగముగా అవుతుంది. ఇప్పుడు మీరు
శ్రేష్ఠంగా అవుతున్నారు. చాలా మంది పిల్లలంటారు, బాబా, తుఫానులు వస్తాయి. తండ్రి
అంటారు, మీరు తండ్రిని మర్చిపోతారు. తండ్రి మతాన్ని అనుసరించరు. శ్రేష్ఠాతి
శ్రేష్ఠమైన తండ్రి మతము లభిస్తుంది - పిల్లలూ, భ్రష్టాచారిగా అవ్వకండి. మిమ్మల్ని
చదివించేవారు ఒక్కరే. వారంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ రథాన్ని కూడా స్మృతి
చేయకండి. రథం యొక్క యజమాని మరియు రథాన్ని నడిపించేవారు ఉన్నారు. గుర్రపు బండి విషయము
కాదు. అందులో కూర్చుని జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుందా ఏమిటి? ఈ రోజుల్లోనైతే
విమానాలలో ప్రయాణాలు చేస్తారు. సైన్సు బాగా తీవ్రంగా ఉంది. మాయ యొక్క ఆర్భాటం చాలా
తీవ్రంగా ఉంది. ఈ సమయంలో ఒకరికొకరు ఎంత గౌరవమిచ్చుకుంటారు. ఫలానా స్థానం యొక్క
ప్రైమ్ మినిస్టర్ వచ్చారంటే, వారికి గౌరవం లభిస్తుంది. 15 రోజుల తర్వాత మళ్ళీ
దించేస్తారు. చక్రవర్తులకు కూడా కష్టము ఉంటుంది. భయపడుతూ ఉంటారు. మీకు ఎంత సహజమైన
జ్ఞానము లభిస్తుంది. మీరు ఎంత పేదవారు, గవ్వలు కూడా లేవు. బాబా, ఇదంతా మీదే అని
వారిని ట్రస్టీగా చేస్తారు. తండ్రి అంటారు, అచ్ఛా, మీరు కూడా ట్రస్టీగా అవ్వండి.
ఒకవేళ మీదిగా భావించినట్లయితే అది మీ తెలివైన పని కాదు. శ్రీమతమును అనుసరించాల్సి
ఉంటుంది. ఎవరైతే ట్రస్టీగా ఉంటారో, వారు శ్రీమతంపై నడుచుకుంటారు. మీరు పేదవారు, ఈ
గవ్వలనంతా బాబాకు ఇవ్వాలని భావిస్తారు. బాబా మళ్ళీ ఫస్ట్ క్లాస్ సలహానిస్తారు.
పిల్లలను సంభాళించాలి కూడా. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది, దీనితో మీ భవిష్యత్తు
చక్కబడుతుంది మరియు రాజులకే రాజులుగా అవుతారు. ఇక సలహానివ్వడము కూడా తండ్రి
కర్తవ్యము. తండ్రిని స్మృతి చేయండి, దయ కలగాలి. ఎవరినైనా గోతిలో పడకుండా రక్షించాలి.
చాలా యుక్తిగా నడుచుకోవాల్సి ఉంటుంది. సూర్పణఖ, పూతన, అజామిళ్, దుర్యోధనుడు ఇవన్నీ
ఇప్పటి పేర్లే. ఇప్పటి ఈ దృశ్యాలే మళ్ళీ కల్పము తర్వాత ఉంటాయి. ఆ తండ్రే సమ్ముఖంలో
వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. మనుష్యుల నుండి దేవతా పదవిని ప్రాప్తింపజేయిస్తారు. మీరు
5 వేల సంవత్సరాల క్రితము వలె వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ముందు కూడా
మహాభారీ యుద్ధం జరిగింది. దానికి దీనితోనే సంబంధం ఉంది. తండ్రి మంచి రీతిలో అర్థం
చేయించి మనుష్యుల నుండి దేవతా పదవిని ప్రాప్తి చేయిస్తారు. తండ్రి నుండి వారసత్వం
తీసుకునేందుకు మీరు వచ్చారు, బ్రహ్మా లేక జగదంబ లేక బి.కె.ల ద్వారా వారసత్వం లభించదు.
వీరు కూడా వారసత్వం తండ్రి నుండే తీసుకుంటారు. ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మీరు
కూడా జగత్పితకు పిల్లలుగా అయి వారి నుండి వారసత్వం తీసుకుంటారు. అందరికీ వేర్వేరుగా
చెప్తారు, పిల్లలూ, నన్ను స్మృతి చేయండి. ఈ బాణము నేరుగా తగులుతుంది. తండ్రి అంటారు,
పిల్లలూ, వారసత్వం మీరు నా నుండి తీసుకోవాలి. మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరైనా
మరణించినా, వారసత్వం మీరు తండ్రి నుండి తీసుకోవాలి. ఇందులో చాలా సంతోషం ఉండాలి. అరే,
అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు వచ్చారు, బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా
ఇప్పుడు మళ్ళీ తయారుచేస్తారని మీకు తెలుసు. కావున ఆ మ్యానర్స్ ను ధారణ చేయాలి.
వికారాల నుండి రక్షించుకోవాలి. మనం పావనంగా, నిర్వికారిగా అవుతున్నాము. డ్రామాను
మరియు వృక్షాన్ని అర్థం చేసుకోవాలి, ఇంకే కష్టమూ లేదు, అతి సాధారణము. అయినా, బాబా,
మర్చిపోయాము, భూతము వచ్చేసింది అని అంటారు. బాబా అంటారు, ఈ భూతాలను తొలగించండి. మనసు
అనే దర్పణంలో చూసుకోండి - మేము యోగ్యులుగా అయ్యామా! నరుని నుండి నారాయణునిగా
అవ్వాల్సి ఉంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు - మధురాతి-మధురమైన సౌభాగ్యశాలి
పిల్లలూ, మీరు సౌభాగ్యశాలిగా అయ్యేందుకు వచ్చారు. ఇప్పుడైతే అందరూ దుర్భాగ్యశాలిగా
ఉన్నారు కదా. భారతవాసులే సౌభాగ్యశాలిగా ఉండేవారు, ఎంత షావుకార్లుగా ఉండేవారు. ఇది
భారత్ కు సంబంధించిన విషయము. తండ్రి అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి -
ఎందుకంటే మీరు నా వద్దకు రావాలి, అప్పుడిక అంతి మతి సో గతి అవుతుంది. ఇప్పుడు నాటకము
పూర్తవుతుంది, మనము ఇక వెళ్ళిపోనున్నాము. ఉపాయము కూడా తెలియజేస్తారు. అన్ని పాపాల
నుండి ముక్తులై, పుణ్యాత్మగా అవుతారు. పుణ్యాత్ముల ప్రపంచం ఉండేది కదా, అది మళ్ళీ
స్థాపన అవుతుంది. పాత ప్రపంచం మారి కొత్తదిగా అవ్వనున్నది. భారత్ ప్రాచీనంగా ఉండేది,
స్వర్గంగా ఉండేది అని భావిస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ యే హెవెన్ ను తయారుచేసారు.
వారెప్పుడు వచ్చారు? ఈ సమయంలోనే వస్తారు. దీనిని కళ్యాణకారి అయిన తండ్రి వచ్చే సమయము
అని అంటారు. ఈ రావణ సంప్రదాయము ఎంత పెద్దది. రాముని సంప్రదాయము ఎంత చిన్నది. ఇక్కడ
వృద్ధి చెందుతూ ఉంటారు. పిల్లలు మళ్ళీ తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు వస్తూ
ఉంటారు. ప్రదర్శినీ మరియు ప్రొజెక్టర్ ద్వారా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడైతే చాలా
సేవ చేయాలి. తండ్రి చెప్తూ ఉంటారు, ప్రియమైన పిల్లలూ, ఇది డ్రామా. కానీ ఈ సమయం వరకు
ఏదైతే తయారయ్యిందో, దానిని ఖచ్చితమైన డ్రామా అనే అంటారు. డ్రామా యొక్క విధిలో నేను
కూడా ఉన్నాను అని తండ్రి అంటారు. పిల్లలూ, పతిత ప్రపంచంలో నేను కూడా రావలసి ఉంటుంది.
నేను పరంధామాన్ని విడిచి పిల్లల కోసము ఇక్కడకు ఎలా వస్తానో చూడండి. ప్లేగు వ్యాధి
నుండి డాక్టర్లు దూరంగా పారిపోరు. వారికైతే రావాల్సే ఉంటుంది. పతిత-పావనా రండి, మీరు
వచ్చి 5 వికారాల నుండి విడిపించి పావనంగా చేయండి అనగా ముక్తులుగా చేయండి అని
పాడుతారు కూడా. దుఃఖధామము నుండి సుఖధామంలోకి తీసుకువెళ్ళండి. భగవంతుడు ముక్తి దాత.
వారు సర్వులకు ముక్తిదాత కూడా కదా మరియు మార్గదర్శకునిగా అయి తిరిగి తీసుకువెళ్తారు,
ఆ తర్వాత నంబరువారుగా వస్తారు. సూర్యవంశీయులు, తర్వాత చంద్రవంశీయులు, ఆ తర్వాత
ద్వాపరము మొదలవుతుంది, అప్పుడు మీరు పూజారులుగా అవుతారు. దేవతలు వామ మార్గంలోకి
వెళ్ళిపోయారు అని అంటూ ఉంటారు. వామ మార్గంలోని చిత్రాలను కూడా చూపిస్తారు. మేమే
దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్నారు, అర్థం
చేసుకోవడానికి ఎంత సహజమైన విషయాలు. ఇవైతే మంచి రీతిలో బుద్ధిలో ధారణ అవ్వాలి.
ఇప్పుడు పిల్లలైన మీరు మీ అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు వచ్చారు. ఇక్కడ తండ్రి
సమ్ముఖంలో కూర్చున్నారు. ఇకపోతే, టీచర్లు నంబరువారుగా ఉన్నారు. ఇక్కడ ప్రజాపిత
బ్రహ్మా ముఖం ద్వారా భగవంతుడు అన్ని వేద శాస్త్రాల సారాన్ని తెలియజేసారు. మొదట అయితే
బ్రహ్మా వింటారు కదా. బ్రహ్మా, విష్ణు, శంకరులను సూక్ష్మవతనంలో చూపించారు. ఇప్పుడు
విష్ణువైతే సత్యయుగానికి యజమాని మరియు బ్రహ్మా సంగమయుగానికి సంబంధించినవారు. బ్రహ్మా
అయితే ఇక్కడ కావాలి కదా, అప్పుడే బ్రాహ్మణులు మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇది రుద్ర
జ్ఞాన యజ్ఞము. ఇంతకుముందు కూడా యజ్ఞం రచించారు, ఇందులోనే ప్రపంచమంతా స్వాహా అవుతుంది,
అందరూ సమాప్తమైపోతారు. పిల్లలైన మీరు మళ్ళీ ఇక్కడకు వచ్చి కొత్త ప్రపంచంలో రాజ్యం
చేస్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. లోపల ఉన్న భూతాలను తొలగించి నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు యోగ్యులుగా
అవ్వాలి, మనసు అనే దర్పణంలో, మేము ఎంత వరకు యోగ్యులుగా అయ్యాము అన్నది చూసుకోవాలి.
2. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అశరీరిగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. శరీర భానం
ఉండకూడదు - దీని అభ్యాసం చేయాలి.