19-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు ఈ శ్మశానవాటికను పరిస్తాన్ గా తయారుచేస్తున్నారు కనుక మీకు ఈ శ్మశానవాటికైన పాత ప్రపంచము పట్ల పూర్తిగా వైరాగ్యముండాలి”

ప్రశ్న:-

అనంతమైన తండ్రి తన ఆత్మిక పిల్లలకు అద్భుతమైన సేవకుడు, ఎలా?

జవాబు:-

బాబా అంటారు - పిల్లలూ, నేను మీ చాకలివాడిని, నేను పిల్లలైన మీ వస్త్రాలనే కాక మొత్తం ప్రపంచము యొక్క ఛీ-ఛీ అశుద్ధమైన వస్త్రాలను సెకండులో శుభ్రము చేసేస్తాను. ఆత్మ రూపీ వస్త్రము స్వచ్ఛంగా అయినట్లయితే శరీరము కూడా శుద్ధమైనది లభిస్తుంది. వారు మన్మనాభవ అనే ఛూ మంత్రముతో అందరినీ సెకండులో శుభ్రము చేసే అద్భుతమైన సేవకుడు.

ఓంశాంతి. తండ్రి పిల్లలకు ఓంశాంతి యొక్క అర్థమును తెలియజేసారు - నేను ఆత్మను, నా స్వధర్మము శాంతి. శాంతిధామానికి వెళ్ళేందుకు ఏ పురుషార్థమూ చేయవలసిన అవసరము ఉండదు. స్వయంగా ఆత్మనే శాంత స్వరూపము, శాంతిధామ నివాసి. అయితే, కొద్ది సమయము కోసం శాంతిగా ఉండగలదు. ఆత్మ అంటుంది - నేను కర్మేంద్రియాల భారముతో అలసిపోయాను, నేను నా స్వధర్మములో స్థితి అవుతాను, శరీరము నుండి వేరవుతాను. కానీ కర్మలైతే చేయవలసిందే. ఎంత సేపని శాంతిగా కూర్చొని ఉంటుంది. ఆత్మ అంటుంది - నేను శాంతిదేశ నివాసిని, కేవలం ఇక్కడ శరీరములోకి రావడంతో నేను టాకీగా అయ్యాను, ఆత్మనైన నేను అవినాశీ, నా శరీరము వినాశీ. ఆత్మ పావనముగా మరియు పతితముగా అవుతుంది. సత్యయుగములో 5 తత్వాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి, ఇక్కడ 5 తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయి. బంగారములో మాలిన్యము చేరడంతో బంగారము పతితముగా అయిపోతుంది, దానిని శుభ్రము చేసేందుకు అగ్నిలో వేయడం జరుగుతుంది, దీని పేరే యోగాగ్ని. ప్రపంచములో అనేక రకాల హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. వాటిని యోగాగ్ని అని అనరు. దేనితోనైతే పాపాలు కాలిపోతాయో, దానిని యోగాగ్ని అని అంటారు. ఆత్మను పతితము నుండి పావనముగా చేసేవారు పరమాత్మ. ఓ పతితపావనా రండి అని వారిని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారముగా అందరూ పతితముగా, తమోప్రధానముగా అవ్వాల్సిందే. ఇది ఒక వృక్షము, దీని బీజరూపుడు పైన ఉన్నారు. తండ్రిని పిలిచినప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఎవరి నుండైతే మీరు వారసత్వమును తీసుకుంటున్నారో, వారు ఇప్పుడు కిందకు వచ్చి ఉన్నారు. నేను రావలసి వస్తుంది అని వారు అంటారు. మనుష్య సృష్టి రూపీ వృక్షము ఏదైతే ఉందో, అది అనేక వెరైటీ ధర్మాల వృక్షము, ఇప్పుడది తమోప్రధానముగా, పతితముగా ఉంది, శిథిలావస్థను చేరుకుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తారు. సత్యయుగములో దేవతలుంటారు, కలియుగములో అసురులు ఉంటారు, ఇకపోతే అసురులకు మరియు దేవతలకు యుద్ధము జరగలేదు. మీరు ఈ ఆసురీ పంచ వికారాలపై యోగబలముతో విజయమును పొందుతారు. అంతేకానీ హింసాత్మక యుద్ధము యొక్క విషయమేమీ లేదు. మీరు ఏ రకమైన హింసను చేయరు, ఎప్పుడూ ఎవరిపైనా చేయి చేసుకోరు. మీరు డబల్ అహింసకులు. కామ ఖడ్గమును నడిపించడం, ఇది అన్నింటికన్నా పెద్ద పాపము. ఈ కామ ఖడ్గము ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది, వికారాల్లోకి వెళ్ళకూడదు అని తండ్రి అంటారు. మీరు సర్వ గుణ సంపన్నులు..... అని దేవతల ఎదురుగా మహిమను పాడుతారు కదా. నేను పతితముగా అయ్యానని ఆత్మ అంటుంది, అందుకే ఓ పతితపావనా, రండి అని పిలుస్తుంది. పావనంగా ఉన్నప్పుడు ఆత్మ ఎవ్వరినీ పిలవదు. దానిని స్వర్గమని అంటారు. ఓ పతితపావన సీతారామ అని ఇక్కడ సాధు-సన్యాసులు మొదలైనవారు ఎంతగా జపం చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు - ఈ సమయములో మొత్తం ప్రపంచము పతితముగా ఉంది, ఇందులో ఎవ్వరి దోషమూ లేదు, ఇది తయారై-తయారవుతున్న డ్రామా. నేను వచ్చేంతవరకు ప్రతి ఒక్కరు తమ పాత్రను అభినయించాల్సిందే. జ్ఞానము మరియు భక్తి, తర్వాత వైరాగ్యము. పాత ప్రపంచము పట్ల వైరాగ్యము. ఇక్కడ అనంతమైన వైరాగ్యము ఉంటుంది. వారిది హద్దు వైరాగ్యము.

ఇప్పుడు ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కొత్త ఇల్లు నిర్మిస్తున్నప్పుడు పాత ఇంటి పట్ల వైరాగ్యము కలుగుతుంది కదా. ఇప్పుడు మీకు స్వర్గము రూపీ ఇంటిని నిర్మించి ఇస్తానని అనంతమైన తండ్రి అంటారు. ఇప్పుడిది నరకము. స్వర్గమంటే కొత్త ప్రపంచము. నరకము పాత ప్రపంచము. ఇప్పుడు మనం పాత ప్రపంచములో ఉంటూ కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తున్నాము. పాత శ్మశానవాటికపై మనము పరిస్తాన్ ను తయారుచేస్తాము. ఇదే జమునా నది తీరము ఉంటుంది, దీనిపై మహళ్ళు తయారవుతాయి. ఇదే ఢిల్లీ, ఇదే జమునా నది మొదలైనవి ఉంటాయి, ఇకపోతే, పాండవుల కోటలు ఉండేవి అని వేటినైతే చూపిస్తారో, అవన్నీ కట్టుకథలు. డ్రామా ప్లాన్ అనుసారముగా ఇవి మళ్ళీ తప్పకుండా తయారవుతాయి. ఏ విధంగా మీరు యజ్ఞ-తపాదులు, దానాలు మొదలైనవి చేస్తూ వచ్చారో, వాటిని మళ్ళీ చేయవలసి ఉంటుంది. మొదట మీరు శివుని భక్తి చేస్తారు, ఫస్ట్ క్లాస్ మందిరాలను నిర్మిస్తారు, దానిని వ్యభిచారీ భక్తి అని అంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గములో ఉన్నారు, ఇది అవ్యభిచారీ జ్ఞానము, మీరు దీన్ని ఒక్క శివబాబా నుండి మాత్రమే వింటారు. మొట్టమొదట మీరు వారి భక్తినే ప్రారంభించారు. ఆ సమయములో (స్వర్గములో) ఇంకే ధర్మమూ ఉండదు, మీరు మాత్రమే ఉంటారు, మీరు చాలా సుఖంగా ఉంటారు. దేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేది, ఆ పేరు వింటేనే నోరు తీపి అవుతుంది. మీరు ఒక్క తండ్రి నుండి మాత్రమే జ్ఞానమును వింటారు. ఇతరులెవ్వరి నుండి వినకండి అని తండ్రి అంటారు. ఇది మీ అవ్యభిచారీ జ్ఞానము. మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి ద్వారానే నంబరువారు పురుషార్థానుసారముగా వారసత్వము లభిస్తుంది. తండ్రి కూడా కొంత సమయము కోసమే సాకారములోకి వచ్చి ఉన్నారు. బాబా అంటారు - నేనే పిల్లలైన మీకు జ్ఞానమును ఇవ్వాలి, నాకంటూ శరీరము లేదు, నేను వీరిలో ప్రవేశిస్తాను. శివజయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరుగుతుంది, అప్పటి నుండి జ్ఞానము ప్రారంభమవుతుంది. ఈ ఆత్మిక విద్యను మీకు సుప్రీమ్ ఆత్మనే ఇస్తున్నారు. ఇది నీటి విషయము కాదు, నీటిని జ్ఞానమని అనరు. జ్ఞానముతో పతితము నుండి పావనముగా అవుతారు, నీటి ద్వారా పావనముగా అవ్వరు. నదులైతే ప్రపంచమంతటా ఉన్నాయి. ఇక్కడకు జ్ఞానసాగరుడైన తండ్రి వస్తారు, వీరిలో ప్రవేశించి జ్ఞానమును వినిపిస్తారు. ఇక్కడ ఎవరైనా మరణించినప్పుడు, వారి నోటిలో గంగా జలమును వేస్తారు. ఈ జలము పతితము నుండి పావనముగా చేస్తుంది కనుక స్వర్గములోకి వెళ్ళిపోతారని భావిస్తారు. ఇక్కడ కూడా గోముఖం వద్దకు వెళ్తారు. వాస్తవానికి మీరే చైతన్యమైన గోముఖాలు, మీ నోటి నుండి జ్ఞానామృతము వెలువడుతుంది. గోవు నుండి పాలు లభిస్తాయి, అంతేకానీ నీటి విషయము కాదు. ఇది మీకిప్పుడు తెలిసింది. డ్రామాలో ఏదైతే ఒక్కసారి జరిగిందో, అది మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత యథావిధిగా రిపీట్ అవుతుందని మీకు తెలుసు. దీన్ని సర్వుల సద్గతిదాత అయిన తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు. ఇప్పుడైతే అందరూ దుర్గతిలో ఉన్నారు. రావణుడిని ఎందుకు కాలుస్తారు అనేది మీకు ఇంతకుముందు తెలియదు. అనంతమైన దసరా జరగనున్నదని మీకిప్పుడు తెలుసు. మొత్తం సృష్టిపై రావణ రాజ్యముంది కదా. ఈ మొత్తం పృథ్వి అంతా లంకయే. రావణుడు కేవలం హద్దు వరకే ఉండడు, మొత్తము సృష్టిపై రావణ రాజ్యము ఉంది. భక్తి కూడా అర్ధ కల్పము నడుస్తుంది. మొదట అవ్యభిచారీ భక్తి ఉంటుంది, తర్వాత వ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. దసరా, రక్షాబంధన్ మొదలైనవన్నీ ఇప్పటి పండుగలే. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు కృష్ణపురి స్థాపనవుతుంది, ఈ రోజు కంసపురిలో ఉన్నారు, రేపు కృష్ణపురిలో ఉంటారు. కృష్ణుడు ఇక్కడ ఉండరు, కృష్ణుడు సత్యయుగములోనే జన్మ తీసుకుంటారు. వారు మొదటి రాకుమారుడు. స్కూల్లో చదువుకోవడానికి వెళ్తారు, పెద్దవారైనప్పుడు సింహాసనానికి యజమానిగా అవుతారు. అయితే, ఈ రాసలీల మొదలైనవి పరస్పరము వేడుకగా జరుపుకుంటూ ఉండవచ్చు. ఇకపోతే, కృష్ణుడు కూర్చొని ఎవరికైనా జ్ఞానమును వినిపించడము అనేది ఎలా జరుగుతుంది. మహిమంతా ఒక్క శివబాబాదే, వారే పతితులను పావనముగా చేస్తారు. మీరు ఎవరైనా పెద్ద ఆఫీసర్లకు అర్థం చేయించినప్పుడు, మీరు రైట్ చెప్తున్నారని వారంటారు, కానీ వారు ఇతరులెవ్వరికీ వినిపించలేరు, వారి మాటను ఎవ్వరూ వినరు. బి.కె.లుగా అయ్యారంటే, వీరికి గారడి జరిగిందని అందరూ అంటారు. బి.కె.ల పేరు వింటే చాలు, వీరు గారడి చేస్తారని భావిస్తారు. ఎవరికైనా కొద్దిగా జ్ఞానమునిచ్చినా, ఈ బి.కె.లు గారడి చేస్తారని అనేస్తారు. వీరు తమ దాదాను తప్ప ఇంకెవ్వరినీ నమ్మరు, భక్తి మొదలైనవి ఏమీ చేయరు అని అంటారు. బాబా అంటారు - భక్తి చేయకండి అని ఎవ్వరికీ చెప్పకండి, వారంతట వారే వదిలేస్తారు. మీరు భక్తిని వదిలేస్తారు, వికారాలను వదిలేస్తారు, దీని గురించే హంగామాలు జరుగుతాయి. నేను రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను, ఇందులో ఆసురీ సంప్రదాయము వారి విఘ్నాలు కలుగుతాయని బాబా అన్నారు. ఇది శివబాబా యొక్క అనంతమైన యజ్ఞము, ఇందులో మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యిందని కూడా అంటారు. పాత ప్రపంచము వినాశనమైనప్పుడు మీరు కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు. మనుష్యులు అంటారు - మేము శాంతి ఏర్పడాలని అంటాము కానీ ఈ బి.కె.లు వినాశనము జరగాలని అంటారు. ఈ పాత ప్రపంచమంతా ఈ జ్ఞాన యజ్ఞములో స్వాహా అయిపోతుందని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. వినాశనమైతే జరగాల్సిందే. మనుష్యులందరూ ఆవగింజల వలె నలిగిపోయి సమాప్తమైపోతారు, ఇకపోతే ఆత్మలు రక్షింపబడతాయి. ఆత్మ అవినాశీ అని ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు అనంతమైన హోలిక జరగనున్నది, అందులో శరీరాలన్నీ సమాప్తమైపోతాయి, ఇకపోతే ఆత్మలు పవిత్రముగా అయి వెళ్ళిపోతాయి. అగ్నిలో వస్తువులు శుద్ధముగా అవుతాయి కదా, శుద్ధి కోసమే యజ్ఞాన్ని చేస్తారు. ఇవన్నీ భౌతిక విషయాలు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. తప్పకుండా వినాశనానికి ముందే స్థాపన జరగాలి. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు, మొదట స్థాపన, తర్వాత వినాశనము జరుగుతుందని చెప్పండి. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది, ప్రజాపిత అన్న పేరు ప్రసిద్ధమైనది కదా. ఆది దేవ్ మరియు ఆది దేవీ ఉంటారు. జగదంబకు కూడా లక్షలాది మందిరాలున్నాయి, ఎన్ని మేళాలు జరుగుతాయి. మీరు జగదంబ పిల్లలు, ఇప్పుడు జ్ఞానజ్ఞానేశ్వరులు, తర్వాత రాజరాజేశ్వరులుగా అవుతారు. మీరు చాలా ధనవంతులుగా అవుతారు, తర్వాత భక్తి మార్గములో దీపావళి నాడు లక్ష్మిని వినాశీ ధనాన్ని అడుగుతారు. ఇక్కడైతే అన్నీ లభిస్తాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. మన ఆయువు 150 సంవత్సరాలుంటుందని మీకు తెలుసు. ఎంతగా యోగమును జోడిస్తూ ఉంటారో, అంతగా ఆయువు పెరుగుతూ ఉంటుందని తండ్రి అంటారు. మీరు ఈశ్వరునితో యోగమును జోడించి యోగేశ్వరులుగా అవుతారు. మనుష్యులైతే భోగేశ్వరులు. వికారీ మురికి పట్టిన వస్త్రాలను శుభ్రము చేస్తారు..... అని కూడా అంటారు. తండ్రి అంటారు - నన్ను చాకలివాడని కూడా అంటారు, నేను వచ్చి ఆత్మలందరినీ శుభ్రము చేస్తాను, తర్వాత శరీరము కూడా కొత్తది మరియు శుద్ధమైనది లభిస్తుంది. నేను సెకండులో మొత్తం ప్రపంచములోని వస్త్రాలను శుభ్రము చేస్తానని తండ్రి అంటారు. కేవలం మన్మనాభవగా అయినట్లయితే, ఆత్మ మరియు శరీరము పవిత్రముగా అయిపోతాయి. సెకండులో జీవన్ముక్తి - ఇది ఛూ మంత్రము కదా. ఇది ఎంత సహజమైన ఉపాయము. తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. నడుస్తూ తిరుగుతూ కేవలం తండ్రిని స్మృతి చేయండి, నేను మీకు కొద్దిగా కూడా ఏ కష్టమును ఇవ్వను. కేవలం స్మృతి చేయాలి. ఇప్పుడు మీకు ఒక్కొక్క సెకండులో ఎక్కే కళ జరుగుతుంది.

తండ్రి అంటారు - నేను పిల్లలైన మీకు సేవకుడినై వచ్చాను. ఓ పతితపావనా, రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని మీరే పిలిచారు. సరే పిల్లలూ, అని వచ్చేశాను అంటే నేను సేవకుడిని అయినట్లే కదా. మీరు చాలా పతితముగా అయినప్పుడే తీవ్రముగా ఆర్తనాదాలు చేస్తారు. ఇప్పుడు నేను వచ్చాను, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు అన్న ఈ మంత్రమును నేను కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మీకు ఇస్తాను, మన్మనాభవకు అర్థము కూడా ఇదే. మన్మనాభవ, మధ్యాజీభవ అంటే తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. విష్ణుపురి యొక్క రాజ్యాన్ని తీసుకోవడానికే మీరు ఇక్కడకు వచ్చారు. రావణపురి తర్వాత విష్ణుపురి ఉంటుంది, కంసపురి తర్వాత కృష్ణపురి ఉంటుంది, ఎంత సహజముగా అర్థం చేయించడం జరుగుతుంది. ఈ పాత ప్రపంచము పట్ల మమకారాన్ని తొలగించుకోండి అని బాబా అంటారు. ఇప్పుడు మనము 84 జన్మలు పూర్తి చేశాము. మనము ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచములోకి వెళ్తాము. స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతూ ఉంటాయి, అంతటి ధైర్యము చేయాలి. వారైతే బ్రహ్మతత్వాన్ని గుర్తు చేస్తారు, బ్రహ్మతత్వములో లీనమైపోతామని భావిస్తారు. కానీ బ్రహ్మతత్వమంటే నివసించే స్థానము. మేము బ్రహ్మతత్వములోకి వెళ్ళి లీనమైపోవాలని మనుష్యులు తపస్సులో కూర్చుంటారు. కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. బ్రహ్మతత్వముతో యోగాన్ని జోడించడముతో పావనముగా అవ్వలేరు. అక్కడకు ఒక్కరు కూడా వెళ్ళలేరు. పునర్జన్మలనైతే తీసుకోవాల్సిందే. తండ్రి వచ్చి సత్యాన్ని తెలియజేస్తారు, సత్యమైన బాబా సత్యఖండమును స్థాపన చేస్తారు. రావణుడు వచ్చి అసత్య ఖండమును తయారుచేస్తాడు. ఇప్పుడిది సంగమయుగము, ఇందులో మీరు ఉత్తమోత్తములుగా అవుతారు, అందుకే దీనిని పురుషోత్తమ యుగమని అంటారు. మీరు గవ్వ నుండి వజ్రం వలె అవుతారు. ఇది అనంతమైన విషయము. దేవతలు ఉత్తమోత్తమమైన మనుష్యులు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో కూర్చున్నారు. మిమ్మల్ని పురుషోత్తములుగా తయారుచేసేవారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి. వారు మీకు ఉన్నతాతి ఉన్నతమైన స్వర్గ వారసత్వమునిస్తారు, దీన్ని మీరు ఎందుకు మర్చిపోతారు? నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. పిల్లలంటారు - బాబా, మేము మర్చిపోకుండా ఉండే విధంగా మాపై కృప చూపించండి. ఇది ఎలా సాధ్యమవుతుంది! తండ్రి డైరెక్షన్ పై నడుచుకోవాలి కదా. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితము నుండి పావనముగా అవుతారని తండ్రి అంటారు. సలహాపై నడుచుకోండి కదా. అంతేకానీ, నేను ఏమి ఆశీర్వాదాలను ఇవ్వాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ పై నడుస్తూ స్వయాన్ని గవ్వ నుండి వజ్రం వలె తయారుచేసుకోవాలి. ఒక్క తండ్రి స్మృతిలో ఉంటూ స్వయం యొక్క వస్త్రాలను (ఆత్మలను) స్వచ్ఛంగా తయారుచేసుకోవాలి.

2. ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళాలి కనుక ఈ పాత ఇంటి పట్ల అనంతమైన వైరాగ్యాన్ని పెట్టుకోవాలి. ఈ పాత శ్మశానవాటికపై మేము పరిస్తాన్ ను తయారుచేస్తామనే నషా ఉండాలి.

వరదానము:-

సంగమయుగము యొక్క శ్రేష్ఠమైన చిత్రమును ఎదురుగా పెట్టుకొని భవిష్యత్తును దర్శనం చేసుకునే త్రికాలదర్శీ భవ

సంగమయుగ బ్రాహ్మణులైన మీరు భవిష్యత్తుకు ముందే సర్వ ప్రాప్తులను అనుభవము చేస్తారు. ఇప్పుడు మీరు డబల్ కిరీటమును, సింహాసనమును పొందుతారు మరియు తిలకధారులుగా, సర్వ అధికారీ మూర్తులుగా అవుతారు. భవిష్యత్తులో అయితే బంగారు స్పూన్ ఉంటుంది, కానీ ఇప్పుడు వజ్ర సమానంగా అవుతారు. జీవితమే వజ్రము వలె అయిపోతుంది. అక్కడ బంగారము మరియు వజ్రాల ఊయలలో ఊగుతారు, ఇక్కడ బాప్ దాదా ఒడిలో, అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతారు. కనుక త్రికాలదర్శులుగా అయి వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క శ్రేష్ఠమైన చిత్రాలను చూస్తూ సర్వ ప్రాప్తులను అనుభవము చేయండి.

స్లోగన్:-

కర్మ మరియు యోగముల బ్యాలన్సే పరమాత్మ బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలు) కు అధికారులుగా చేస్తుంది.