19-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
06-04-1991
‘‘కర్మాతీత స్థితి యొక్క
గుర్తులు’’
కర్మాతీత స్థితికి సమీపంగా వస్తున్నారు. కర్మ కూడా వృద్ధి
చెందుతూ ఉంటుంది. కానీ కర్మాతీతము అనగా కర్మ యొక్క ఏ బంధనం
యొక్క స్పర్శ నుండైనా అతీతము. ఈ విధమైన అనుభవమే పెరుగుతూ ఉండాలి.
ఎలాగైతే ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా కర్మ చేసాను కదా - ఇటువంటి
అతీతత్వము ఉండాలి. కార్యము స్పర్శించడంలో కూడా అతీతత్వము మరియు
కార్యము చేసిన తర్వాత ఏదైతే రిజల్టు వస్తుందో, ఆ ఫలాన్ని
ప్రాప్తి చేసుకోవడంలో కూడా అతీతత్వము. కర్మ ఫలము అనగా రిజల్టు
ఏదైతే వస్తుందో, దాని స్పర్శ కూడా ఉండకూడదు, పూర్తిగా అతీతత్వము
అనుభవమవుతూ ఉండాలి. ఇతరులు ఎవరో చేయించారు మరియు నేను చేసాను
అన్నట్లు ఉండాలి. ఎవరో చేయించారు మరియు నేను నిమిత్తంగా అయ్యాను.
కానీ నిమిత్తంగా అవ్వడంలో కూడా అతీతత్వము. ఇటువంటి కర్మాతీత
స్థితి పెరుగుతూ ఉందా - ఇలా అనుభవమవుతుందా?
మహారథుల స్థితి ఇతరుల కంటే అతీతంగా మరియు ప్రియంగా ఉన్నట్లు
స్పష్టమవుతూ ఉంది కదా. ఏ విధంగా బ్రహ్మాబాబా స్పష్టంగా ఉండేవారో,
అలా నిమిత్త ఆత్మలైన మీరు కూడా నంబరువారుగా సాకార స్వరూపం
ద్వారా స్పష్టమవుతూ ఉంటారు. కర్మాతీతము అనగా అతీతము మరియు
ప్రియము. కర్మలు ఇతరులు కూడా చేస్తారు మరియు మీరు కూడా చేస్తారు
కానీ మీరు కర్మ చేయడంలో తేడా ఉంటుంది. స్థితిలో తేడా ఉంటుంది.
ఏదైతే గడిచిపోయిందో, దాని నుండి అతీతులుగా అయ్యారు. కర్మ చేసారు
మరియు అది చేసిన తర్వాత ఎలా అనుభవమవుతుందంటే - అసలేమీ చేయలేదు,
చేయించేవారు చేయించారు. ఇటువంటి స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు.
తేలికదనం ఉంటుంది. కర్మలు చేస్తూ కూడా తనువులో కూడా తేలికదనము,
మనసు యొక్క స్థితిలో కూడా తేలికదనము. కర్మ యొక్క రిజల్టు మనసును
దానివైపు లాగుతుంది. ఇటువంటి స్థితి ఉందా? ఎంతగా కార్యం
పెరుగుతూ ఉంటుందో, అంతగానే తేలికదనం కూడా పెరుగుతూ ఉంటుంది.
కర్మ తనవైపుకు ఆకర్షించదు కానీ యజమానిగా అయి కర్మ చేయించేవారు
చేయిస్తున్నారు మరియు నిమిత్తంగా చేసేవారు నిమిత్తంగా అయి
చేస్తున్నారు.
ఆత్మ యొక్క తేలికదనానికి గుర్తేమిటంటే - ఆత్మ యొక్క విశేష
శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు కూడా
అలా తేలికగా అవుతూ ఉంటాయి. సంకల్పాలు కూడా పూర్తిగా తేలికైన
స్థితిని అనుభవం చేయిస్తాయి. బుద్ధి యొక్క నిర్ణయ శక్తి కూడా
అసలేమీ చేయనే చేయలేదు అన్నట్లు నిర్ణయం చేస్తుంది మరియు ఏ
సంస్కారము తనవైపుకు ఆకర్షితం చేయదు. తండ్రి సంస్కారాలు కార్యం
చేస్తున్నాయి అన్నట్లుగా ఉంటుంది. సూక్ష్మ శక్తులైన ఈ మనసు,
బుద్ధి, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మూడింటిలోనూ లైట్ (తేలిక)
గా అనుభవం చేస్తారు. స్వతహాగానే అందరి హృదయం నుండి, నోటి నుండి
ఇలా వెలువడుతూ ఉంటుంది - తండ్రి ఎలాగో, అలాగే పిల్లలు కూడా
అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు అని. ఎందుకంటే సమయమనుసారంగా
బయటి వాతావరణము రోజురోజుకు ఇంకా భారీగా అవుతూ ఉంటుంది. ఎంతగా
బయటి వాతావరణము భారీగా అవుతుందో, అంతగా అనన్యులైన పిల్లల యొక్క
సంకల్పాలు, కర్మలు, సంబంధాలు లైట్ (తేలిక) గా అవుతూ ఉంటాయి
మరియు ఈ తేలికదనం కారణంగా మొత్తం కార్యమంతా తేలికగా నడుస్తూ
ఉంటుంది. వాయుమండలము తమోప్రధానంగా ఉన్న కారణంగా ఇంకా రకరకాలుగా
భారీతనాన్ని అనుభవం చేస్తారు. ప్రకృతి యొక్క భారీతనం కూడా
ఉంటుంది. మనుష్యాత్మల వృత్తుల యొక్క భారీతనం కూడా ఉంటుంది.
ఇందువలన కూడా తేలికదనము ఇతరులను కూడా తేలికగా చేస్తుంది. అచ్ఛా,
అంతా బాగా నడుస్తుంది కదా. కార్యవ్యవహారాల ప్రభావము మీపై పడదు
కానీ మీ ప్రభావము కార్యవ్యవహారాలపై పడుతుంది. ఏం చేసినా, ఏం
విన్నా మీ తేలికతనపు స్థితి యొక్క ప్రభావం కార్యంపై పడుతుంది.
కార్యంలోని అలజడి యొక్క ప్రభావము మీపై పడదు. అచల స్థితి
కార్యాన్ని కూడా అచలంగా చేస్తుంది. అన్ని రకాలుగా అసంభవ
కార్యాలు సంభవంగా మరియు సులభంగా అవుతున్నాయి మరియు అవుతూ ఉంటాయి.
అచ్ఛా.
19-06-2022 ప్రాతఃమురళి ఓంశాంతి
‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్:10-04-91 మధువనము
‘‘హృదయ సింహాసనాధికారులుగా మరియు
విశ్వ సింహాసనాధికారులుగా అయ్యేందుకు సుఖం ఇవ్వండి మరియు సుఖం
తీసుకోండి’’
ఈ రోజు విశ్వానికి యజమాని తమ బాలకులు మరియు యజమానులైన పిల్లలను
చూస్తున్నారు. పిల్లలందరూ ఈ సమయంలో కూడా స్వయానికి యజమానులు
మరియు అనేక జన్మలు విశ్వానికి కూడా యజమానులు. పరమాత్ముని
బాలకులు యజమానులుగా అవుతారు. బ్రాహ్మణాత్మలు అనగా యజమాని ఆత్మలు.
ఈ సమయంలో సర్వ కర్మేంద్రియాలకు యజమానులు, ఆధీనులైన ఆత్మలు కాదు.
అధికారులు అనగా యజమానులు. కర్మేంద్రియాలకు వశీభూతులై లేరు,
అందుకే బాలకుల నుండి యజమానులు. బాలకులము అనే ఈశ్వరీయ నషాను కూడా
అనుభవం చేస్తారు మరియు స్వరాజ్యము యొక్క యజమానత్వపు నషాను కూడా
అనుభవం చేస్తారు. డబల్ నషా ఉంది. నషాకు గుర్తు, అవినాశీ ఆత్మిక
సంతోషము. సదా స్వయాన్ని విశ్వంలోని అదృష్టవంతులైన ఆత్మలుగా
భావిస్తున్నారా? వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము అనగా శ్రేష్ఠ అదృష్టము!
మీరు అదృష్టవంతులు కూడా మరియు సదా సంతోషమనే ఔషధాన్ని తింటారు
మరియు తినిపిస్తారు. అంతేకాక, సదా సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉంటారు.
ఇతరులకు కూడా సంతోషమనే మహాదానమునిచ్చి అదృష్టవంతులుగా
తయారుచేస్తారు. ఇటువంటి అమూల్యమైన, వజ్రతుల్యమైన జీవితాన్ని
తయారు చేసుకునేవారు. అలా తయారయ్యారా లేక ఇంకా తయారవ్వాలా?
బ్రాహ్మణ జీవితం యొక్క అర్థమే - సంతోషంలో ఉండడము, సంతోషం యొక్క
ఔషధాన్ని తినడము మరియు సంతోషమనే ఊయలలో ఉండడము. ఇటువంటి
బ్రాహ్మణులు కదా? సంతోషం తప్ప ఇక జీవితంలో ఏముంది! జీవితమే
సంతోషం. సంతోషం లేకపోతే బ్రాహ్మణ జీవితమే లేదు. సంతోషంగా ఉండడమే
జీవించడము.
ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి పుణ్య ఖాతాను చూస్తున్నారు
ఎందుకంటే మీరందరూ పుణ్యాత్ములు. పుణ్య ఖాతాను అనేక జన్మల కోసం
జమ చేసుకుంటున్నారు. మొత్తం రోజంతటిలో ఎంత పుణ్యాన్ని జమ
చేసుకున్నారు? ఇది స్వయం కూడా చెక్ చేసుకోగలరు కదా. ఒకటేమో దానం
చేయడము, రెండవది పుణ్యం చేయడము. దానం కంటే పుణ్యానికి ఎక్కువ
మహత్వముంది. పుణ్య కర్మ అంటే నిస్వార్థ సేవాభావంతో కూడిన కర్మ.
పుణ్య కర్మను చూపించుకునేందుకు చేయరు, అది హృదయపూర్వకంగా
జరుగుతుంది. దానము చూపించుకునేందుకు కూడా చేస్తారు,
హృదయపూర్వకంగా కూడా జరుగుతుంది. పుణ్య కర్మ అనగా అవసరమైన సమయంలో
ఏ ఆత్మకైనా సహయోగిగా అవ్వడము అనగా వారికి ఉపయోగపడడము. పుణ్య
కర్మ చేసే ఆత్మకు అనేకమంది ఆత్మల హృదయపూర్వక ఆశీర్వాదాలు
ప్రాప్తిస్తాయి. కేవలం నోటి ద్వారా ధన్యవాదాలు లేక థేంక్స్ అని
చెప్పరు కానీ హృదయపూర్వకమైన ఆశీర్వాదాల యొక్క గుప్త ప్రాప్తి
జమ అవుతూ ఉంటుంది. పుణ్యాత్ములు తమకు ప్రాప్తించిన పరమాత్మ
ఆశీర్వాదాలు, ఆత్మల ఆశీర్వాదాలు అనే ప్రత్యక్ష ఫలంతో నిండుగా
ఉంటారు. పుణ్యాత్ముల వృత్తి, దృష్టి ఇతరులకు కూడా ఆశీర్వాదాలను
అనుభవం చేయిస్తుంది. పుణ్యాత్ముల ముఖంపై సదా ప్రసన్నత,
సంతుష్టతల మెరుపు కనిపిస్తుంది. పుణ్యాత్మ సదా ప్రాప్తించిన ఫలం
కారణంగా అభిమానము మరియు అవమానము నుండి అతీతంగా ఉంటారు ఎందుకంటే
వారు నిండుగా ఉన్న చక్రవర్తి వలె ఉంటారు. అభిమానము మరియు
అవమానాల విషయములో నిశ్చింత చక్రవర్తి. పుణ్యాత్ములు పుణ్యం
యొక్క శక్తి ద్వారా స్వయం యొక్క ప్రతి సంకల్పాన్ని, ప్రతి
సమయంలోని అలజడిని, ప్రతి కర్మను సఫలం చేసుకునేవారిగా ఉంటారు.
పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది. జమ అయినదానికి గుర్తు - వ్యర్థం
యొక్క సమాప్తి. ఇటువంటి పుణ్యాత్మ విశ్వ రాజ్యానికి
సింహాసనాధికారిగా అవుతారు. కనుక మీ ఖాతాను చెక్ చేసుకోండి -
ఇటువంటి పుణ్యాత్మగా ఎంతవరకు అయ్యారు? ఒకవేళ అందరూ
పుణ్యాత్ములేనా అని అడిగితే, అందరూ అవును అని అంటారు. నిజానికి
అందరూ పుణ్యాత్ములే. కానీ నంబరువారుగా ఉన్నారా లేక అందరూ
నంబరువన్ గా ఉన్నారా? నంబరువారుగా ఉన్నారు కదా. సత్య-త్రేతా
యుగాలలో విశ్వ సింహాసనంపై ఎంతమంది కూర్చుంటారు? అందరూ కలిసి
కూర్చుంటారా? కనుక నంబరువారుగా ఉన్నారు కదా. నంబరు ఎందుకు
తయారవుతుంది, కారణమేమిటి? బాప్ దాదా పిల్లలలో ఒక విశేషమైన
విషయాన్ని చెక్ చేసారు. మరియు ఆ విషయమే నంబరువన్ గా అవ్వడంలో
ఆటంకం వేస్తుంది. ఇప్పుడీ తపస్యా సంవత్సరంలో అందరికీ సంపూర్ణంగా
అవ్వాలనే లక్ష్యముందా లేక నంబరువారుగా అవ్వాలని ఉందా?
సంపూర్ణంగా అవ్వాలి కదా. మీరందరూ ఒక స్లోగన్ ను చెప్తారు కూడా
మరియు రాసి పెడతారు కూడా. అదేమిటంటే - సుఖం ఇవ్వండి మరియు సుఖం
తీసుకోండి. దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. ఇది పక్కా
స్లోగన్. అయితే రిజల్టులో ఏం చూసారు? దుఃఖం ఇవ్వకండి - దీని
పట్ల మెజారిటీకి అటెన్షన్ ఉంది. సగం స్లోగన్ బాగానే ఉంది. దుఃఖం
ఇచ్చే విషయంలో ఇవ్వకూడదు అని అనుకుంటారు. కానీ తీసుకునే విషయంలో
- వారు ఇచ్చారు, అందుకే ఇలా జరిగింది అని అంటారు. వీరిలా
అన్నారు, వీరిలా అన్నారు, అందుకే ఇలా జరిగింది అని ఇటువంటి
తీర్పునిస్తారు కదా. మీకు మీరే వకీలుగా అయి కేసులో ఇలాగే
చెప్తారు. కనుక సగం స్లోగన్ పట్ల అటెన్షన్ బాగానే ఉంది, ఇంకా
అండర్ లైన్ చేసుకోవాలి. ఎంతైనా సగం స్లోగన్ పట్ల అటెన్షన్ ఉంది
కానీ మిగతా సగం స్లోగన్ ఏదైతే ఉందో, దాని పట్ల అటెన్షన్
నామమాత్రంగా ఉంది. వారు ఇచ్చారు కానీ మీరెందుకు తీసుకున్నారు?
మీరు తీసుకోండి అని ఎవరు చెప్పారు? దుఃఖం తీసుకోండి, మీ జోలిని
దుఃఖంతో నింపుకోండి అన్నది ఏమైనా తండ్రి శ్రీమతమా. కావున దుఃఖం
ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి, అప్పుడే పుణ్యాత్ములుగా అవుతారు,
తపస్వీలుగా అవుతారు. తపస్వీ అనగా పరివర్తన, కనుక వారు ఇచ్చిన
దుఃఖాన్ని కూడా మీరు సుఖం రూపంలో స్వీకరించండి. పరివర్తన చేయండి,
అప్పుడు తపస్వీ అని అంటారు. నిందను కూడా ప్రశంసగా భావించండి,
అప్పుడు పుణ్యాత్మ అని అంటారు. జగదంబ తల్లి సదా పిల్లలందరికీ
ఇదే పాఠాన్ని పక్కా చేయించారు - నిందించే లేక దుఃఖమిచ్చే ఆత్మను
కూడా మీ దయాహృదయ స్వరూపంతో, దయా దృష్టితో చూడండి.
నిందిస్తున్నారు అన్న దృష్టితో కాదు. వారు నిందిస్తే మీరు
పుష్పాలు వేయండి. అప్పుడు పుణ్యాత్మ అని అంటారు. నిందించేవారిని
హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకోండి. బాహ్యంగా ఆలింగనం చేసుకోవడం
కాదు, కానీ మనసుతో ఆలింగనం చేసుకోండి. కనుక పుణ్య ఖాతా జమ
అవ్వడంలో ఈ విషయమే విఘ్నరూపంగా అవుతుంది. నేను దుఃఖం
తీసుకోకూడదు కూడా. ఇవ్వడమైతే ఇవ్వనే ఇవ్వకూడదు కానీ తీసుకోకూడదు
కూడా. అది మంచి వస్తువు కానప్పుడు మరి చెత్తను తీసుకుని జమ
ఎందుకు చేసుకుంటారు? ఎక్కడైనా దుఃఖం తీసుకుని చెత్త జమ అయితే,
ఆ చెత్త నుండి ఏం వెలువడతాయి? పాపం యొక్క అంశము రూపీ క్రిములు.
ఇప్పుడు పెద్ద పాపాలైతే చేయరు కదా. ఇప్పుడు పాపం యొక్క అంశం
మిగిలిపోయింది. కానీ అంశం కూడా ఉండకూడదు. చాలామంది పిల్లలు చాలా
మధురాతి-మధురమైన మాటలను వినిపిస్తారు. ఆత్మిక సంభాషణను అయితే
అందరూ చేస్తారు కదా? ఒక స్లోగన్ అయితే అందరికీ పక్కా అయిపోయింది
- ‘‘మేము కోరుకోలేదు కానీ జరిగిపోయింది...’’ అని. మీరు
కోరుకోనప్పుడు ఇంకెవరు కోరుకున్నారు? మరి జరిగిపోయింది అని
ఎవరంటారు! ఇంకెవరైనా ఆత్మ ఉన్నారా! జరగకూడదు కానీ జరుగుతుంది -
ఈ మాట ఎవరంటారు? ఇంకెవరైనా ఆత్మ అంటారా లేక మీరు అంటారా? కనుక
తపస్యను ఈ విషయాల కారణంగా నిరూపించుకోలేరు. ఏదైతే జరగకూడదో,
ఏదైతే చేయాలని అనుకోరో, అది జరగకుండా ఉండడమే, అది చేయకుండా
ఉండడమే పుణ్యాత్ముల గుర్తు. బాప్ దాదా వద్దకు ప్రతిరోజు పిల్లల
నుండి ఇటువంటి కథలు చాలా వస్తాయి. చెప్పేటప్పుడు ఎంత ఇంటరెస్ట్
కల కథలుగా చేసి చెప్తారంటే, వినేవారికి వింటూ ఉండిపోవాలని
అనిపిస్తుంది. కొందరికి పెద్ద కథలు చెప్పే అలవాటు ఉంది, కొందరు
చిన్న కథలు చెప్తారు. కానీ కథలు చాలా చెప్తారు. ఈ రోజు ఈ
సంవత్సరంలోని మిలనం యొక్క చివరి మునక కదా. అందరూ మునక వేసేందుకు
వచ్చారు కదా. భక్తి మార్గంలో కూడా మునకలు వేసేటప్పుడు తప్పకుండా
ఏదో ఒక సంకల్పం చేస్తారు, ఏదో ఒకటి స్వాహా అన్నా చేస్తారు లేక
ఏదైనా స్వార్థం పెట్టుకుంటారు. రెండు రకాలగానూ సంకల్పం చేస్తారు.
కనుక తపస్యా సంవత్సరంలో ఈ సంకల్పం చేయండి - మొత్తం రోజంతా
సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా పుణ్యాత్మగా అయి
పుణ్యం చేస్తాను. మరియు పుణ్యానికి గుర్తు ఏమిటంటే - పుణ్యం
యొక్క ప్రత్యక్ష ఫలముగా ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి.
ప్రతి సంకల్పంలో పుణ్యం జమ అవ్వాలి. మాటలతో ఆశీర్వాదాలు జమ
అవ్వాలి. సంబంధ-సంపర్కాలలో సహయోగం చేసినందుకు హృదయం నుండి
కృతజ్ఞతలు వెలువడాలి - దీనినే తపస్య అని అంటారు. ఇటువంటి తపస్య
విశ్వ పరివర్తనకు ఆధారమవుతుంది. ఇటువంటి రిజల్టుకు ప్రైజ్
లభిస్తుంది. ఇలా జరిగిపోయింది... అని మళ్ళీ కథలు వినిపించకండి.
ఆ మాటకొస్తే మొదటి నంబరు ప్రైజ్ ను టీచర్లందరూ తీసుకోవాలి మరియు
వీరితో పాటు మధుబన్ నివాసులు తీసుకోవాలి ఎందుకంటే మధుబన్ యొక్క
అల, నిమిత్త టీచర్ల యొక్క అల ప్రవృత్తిలోని వారి వరకు, ఈశ్వరీయ
విద్యార్థుల వరకు సహజంగా చేరుకుంటుంది. అప్పుడు మీరందరూ ముందు
నంబరులోకి తప్పకుండా వస్తారు. ప్రైజ్ తీసుకోవడంలో ఎవరెవరి
పేర్లు ఉంటాయో ఇప్పుడు చూస్తాము. టీచర్ల పేర్ల వస్తాయా లేక
మధుబన్ వాసులవా లేక ఈశ్వరీయ విద్యార్థులవి వస్తాయా? డబల్
విదేశీయులు కూడా తీవ్ర పురుషార్థం చేస్తున్నారు. బాప్ దాదా
వద్ద ప్రైజ్ లు చాలా ఉన్నాయి, ఎన్ని కావాలనుకుంటే అన్ని
తీసుకోవచ్చు. ప్రైజ్ లకు లోటు లేదు. భండారము నిండుగా ఉంది.
అచ్ఛా.
అందరూ మేళాకు చేరుకున్నారు. మేళా బాగా అనిపించిందా లేక ఏదైనా
ఇబ్బంది కలిగిందా? వర్షం కూడా స్వాగతం పలికింది, ప్రకృతికి కూడా
మీ పట్ల ప్రేమ ఉంది. భయపడలేదు కదా? బ్రహ్మాభోజనం అయితే మంచిగా
లభించింది కదా. 63 జన్మలైతే ఎదురుదెబ్బలు తిన్నారు. ఇప్పుడైతే
ఇంకా ఆశ్రయం లభించింది కదా. మూడు అడుగుల భూమి అయితే లభించింది
కదా. ఇంత పెద్ద హాలు ఏదైతే తయారుచేసారో, ఆ హాలు యొక్క శోభను
కూడా పెంచారు కదా. హాలును సఫలం చేసారు కదా. ఎవ్వరికీ ఏ ఇబ్బంది
కలగలేదు కదా. కానీ అలాగని మేళాలు చేస్తూ ఉండమని కాదు. రచనతో
పాటు సాధనాలు కూడా తోడుగానే వస్తాయి.
బాలకుల నుండి యజమానులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా ప్రతి
అడుగులో పుణ్య ఖాతాను జమ చేసుకునే పుణ్యాత్ములకు, సదా హృదయ
సింహాసనాధికారులు మరియు విశ్వ సింహాసనాధికారులైన విశేష ఆత్మలకు,
సదా సుఖమునిచ్చే, సుఖము తీసుకునే మాస్టర్ సుఖసాగరులైన ఆత్మలకు,
సదా సంతోషంలో ఉండే మరియు సంతోషాన్ని ఇచ్చే మాస్టర్ దాతా
పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:-
మహారథులందరూ మనస్ఫూర్తిగా అందరినీ శక్తిశాలిగా తయారుచేసే సేవను
చాలా బాగా చేసారు అన్నదానిని బాప్ దాదా చూసారు. దీని కోసం ఏమని
కృతజ్ఞతలు తెలపాలి కానీ ఖాతా చాలా జమ అయింది. చాలా పెద్ద ఖాతా
జమ అయింది. బాప్ దాదా మహావీరులైన పిల్లల యొక్క ధైర్యాన్ని మరియు
ఉల్లాస-ఉత్సాహాలను చూసి పదమాలరెట్ల కన్నా ఎక్కువగా హర్షిస్తారు.
ధైర్యముంచారు, సంగఠన సదా స్నేహ సూత్రములో ఉంది, అందుకే దీనికి
సఫలత లభించింది. సంగఠన దృఢంగా ఉంది కదా! చిన్న మాల దృఢంగా ఉంది.
కంకణమైతే తయారయింది. మాల అయితే తయారవ్వలేదు కానీ కంకణమైతే ఉంది
కదా, అందుకే చిన్న మాల కూడా పూజించబడుతుంది. పెద్ద మాల మంచిగా
తయారవుతూ ఉంది, అది కూడా తయారైపోతుంది, తయారవ్వాల్సిందే. పెద్ద
మాలలోని పూసలు తయారుగా ఉన్నాయని వినిపించాము కదా కానీ పూస పూసతో
కలవడంలో కొద్దిగా మార్జిన్ ఉంది. చిన్న మాల మంచిగా తయారై ఉంది.
ఈ మాల కారణంగానే సఫలత సహజంగా ఉంది మరియు సఫలత సదా మాలలోని మణుల
మెడలో కూర్చబడి ఉంది. విజయీ తిలకము దిద్దబడి ఉంది. బాప్ దాదా
సంతోషంగా ఉన్నారు, పదమాలగుణాల అభినందనలు. నిమిత్తమైతే మీరు కదా.
తండ్రి అయితే చేయించేవారు. చేసేవారు ఎవరు? చేయడానికి నిమిత్తులు
మీరు, తండ్రి అయితే బ్యాక్ బోన్, అందుకే చాలా బాగా ప్రీతి
యొక్క రీతిని కూడా నిర్వర్తించారు మరియు పాలన యొక్క రీతిని కూడా
బాగా నిర్వర్తించారు. అచ్ఛా.
వరదానము:-
మంచి సంకల్పాల రూపీ బీజం ద్వారా మంచి
ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప ఆత్మా భవ
సిద్ధి స్వరూప ఆత్మల ప్రతి సంకల్పము
స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల సిద్ధించేదిగా ఉంటుంది. వారికి
ప్రతి కర్మలో సిద్ధి ప్రాప్తిస్తుంది. వారు ఏ మాటలైతే
మాట్లాడుతారో, అవి సిద్ధిస్తాయి, అందుకే సత్య వచనాలు అని అంటారు.
సిద్ధి స్వరూప ఆత్మల ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ సిద్ధి
ప్రాప్తి అయ్యేవిగా ఉంటాయి, వ్యర్థంగా ఉండవు. ఒకవేళ సంకల్పం
రూపీ బీజము చాలా మంచిగా ఉంది కానీ ఫలం మంచిది వెలువడకపోతే,
దృఢమైన ధారణ అనే ధరణి సరిగ్గా లేనట్లు లేక అటెన్షన్ యొక్క
పథ్యములో లోపమున్నట్లు.
స్లోగన్:-
దుఃఖపు అల నుండి ముక్తులుగా అవ్వాలంటే
కర్మయోగులుగా అయి ప్రతి కర్మ చేయండి.
సూచన:- ఈ రోజు నెలలో మూడవ ఆదివారము,
రాజయోగీ తపస్వీ సోదర-సోదరీలందరూ సాయంకాలం 6.30 నుండి 7.30 గం.
వరకు, విశేషంగా యోగాభ్యాస సమయంలో తమ ఆకారీ ఫరిశ్తా స్వరూపంలో
స్థితులై, విశ్వ భ్రమణం చేస్తూ ప్రకృతి సహితంగా సర్వాత్మలకు
లైట్ మైట్ ను ఇచ్చే సేవ చేయండి.
|
|
|