19-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఈ ప్రపంచమంతా రోగుల యొక్క పెద్ద ఆసుపత్రి, ప్రపంచమంతటినీ నిరోగిగా చేసేందుకు బాబా వచ్చారు"

ప్రశ్న:-

ఏ స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా వాడిపోవడం లేదా దుఃఖపు అల రావడం జరగదు?

జవాబు:-

ఇప్పుడు మనం ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము, మళ్ళీ కొత్త ప్రపంచములో పునర్జన్మ తీసుకుంటాము. మనమిప్పుడు రాజ్యములోకి వెళ్ళేందుకు రాజయోగము నేర్చుకుంటున్నాము. పిల్లలైన మన కోసం తండ్రి ఆత్మిక రాజస్థాన్ ను స్థాపన చేస్తున్నారు, ఈ స్మృతి ఉన్నట్లయితే దుఃఖపు అల రాలేదు.

గీతము:-

తల్లివి నీవే, తండ్రివి నీవే...... (తుమ్ హీ హో మాతా, తుమ్ హీ హో పితా......)

ఓంశాంతి. ఈ పాటలు పిల్లలైన మీ కోసమేమీ కాదు, అవి కొత్తవారికి అర్థము చేయించేందుకు ఉన్నాయి. అలాగని ఇక్కడ అందరూ తెలివైనవారని కూడా కాదు. తెలివిహీనులను తెలివైనవారిగా తయారుచేయడం జరుగుతుంది. మనమెంత తెలివిహీనులుగా అయిపోయాము అనేది పిల్లలు అర్థం చేసుకుంటారు, ఇప్పుడు తండ్రి మనల్ని తెలివైనవారిగా తయారుచేస్తారు. పిల్లలు స్కూల్లో చదువుకుని ఎంత తెలివైనవారిగా అవుతారు. ప్రతి ఒక్కరూ తమ-తమ తెలివి ద్వారా బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైనవారిగా అవుతారు. ఇక్కడైతే ఆత్మను తెలివైనదిగా తయారుచేయాలి. శరీరము ద్వారా చదువుకునేది కూడా ఆత్మయే. కానీ బయట లభించే శిక్షణ అంతా, అల్పకాల శరీర నిర్వహణ కోసం లభిస్తుంది. కొంతమంది కన్వర్ట్ కూడా చేస్తారు, హిందువులను క్రిస్టియన్లుగా చేసేస్తారు - దేనికోసం? కొద్దిగా సుఖం పొందేందుకు. ధనము, ఉద్యోగము మొదలైనవి సహజంగా లభించేందుకు, జీవనాధారం కోసం చేస్తారు. మనము మొట్టమొదట ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుందని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇదే ముఖ్యమైన విషయము ఎందుకంటే ఇది ఉన్నదే రోగుల ప్రపంచము. రోగులుగా అవ్వనటువంటి మనుష్యులు ఎవ్వరూ లేరు. ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. ఈ ప్రపంచమంతా అతి పెద్ద హాస్పిటల్, ఇందులోని మనుష్యులందరూ పతితులుగా, రోగులుగా ఉన్నారు. ఆయుష్షు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా మృత్యువును పొందుతారు. కాలుడి పంజాలోకి వచ్చేస్తారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీరు కేవలం భారతదేశానికే కాక, మొత్తం విశ్వానికి గుప్తరీతిలో సేవ చేస్తారు. ముఖ్యమైన విషయమేమిటంటే, తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. మనుష్యులై ఉండి పారలౌకిక తండ్రి గురించి తెలియదు, వారి పట్ల ప్రేమనుంచరు. నా పట్ల ప్రేమనుంచండి అని ఇప్పుడు తండ్రి అంటారు. నా పై ప్రేమను ఉంచుతూ-ఉంచుతూ మీరు నాతో పాటుగానే తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్ళేంతవరకు ఈ ఛీ-ఛీ ప్రపంచములో ఉండవలసి ఉంటుంది. మొట్టమొదట దేహాభిమానుల నుండి దేహీ-అభిమానులుగా అవ్వండి, అప్పుడు మీరు ధారణ చేయగలరు మరియు తండ్రిని స్మృతి చేయగలరు. ఒకవేళ దేహీ-అభిమానులుగా అవ్వకపోతే, ఇక దేనికీ పనికి రారు. అందరూ దేహాభిమానులుగానే ఉన్నారు. మేము ఆత్మాభిమానులుగా అవ్వకపోతే, తండ్రిని స్మృతి చేయకపోతే, మేము మునుపటిలాగానే ఉండిపోతామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. దేహీ అభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయము, రచన గురించి తెలుసుకోవడం కాదు. రచయిత మరియు రచనల జ్ఞానమని గాయనం కూడా చేయబడుతుంది. మొదట రచన, తర్వాత రచయిత యొక్క జ్ఞానమని చెప్పరు. మొదట రచయిత, వారే తండ్రి. ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా తయారుచేస్తారు. తండ్రి అయితే సదా ఆత్మాభిమానిగానే ఉంటారు, అందుకే వారు సుప్రీమ్. నేను అయితే ఆత్మాభిమానిని అని తండ్రి అంటారు. ఎవరిలోనైతే ప్రవేశించానో, వారిని కూడా ఆత్మాభిమానిగా చేస్తాను. వీరిని కన్వర్ట్ చేసేందుకు వీరిలో ప్రవేశిస్తాను ఎందుకంటే వీరు కూడా దేహాభిమానిగా ఉండేవారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను యథార్థ రీతిగా స్మృతి చేయమని వీరికి కూడా చెప్తాను. ఆత్మ వేరు, జీవము వేరు అని భావించే మనుష్యులు చాలా మంది ఉన్నారు. ఆత్మ దేహము నుండి బయటకు వచ్చేస్తుందంటే, రెండు వస్తువులుగా ఉన్నట్లే కదా. నీవు ఒక ఆత్మ అని తండ్రి అర్థము చేయిస్తారు. ఆత్మయే పునర్జన్మలు తీసుకుంటుంది. ఆత్మనే శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించమని బాబా పదే-పదే అర్థం చేయిస్తారు, ఇందులోనే చాలా శ్రమ కావాలి. విద్యార్థులు చదువుకునేందుకు ఏకాంతంలోకి, పూదోటలు మొదలైనవాటిలోకి వెళ్ళి చదువుకుంటారు. ఫాదర్లు కూడా వాకింగ్ కు వెళ్ళినప్పుడు పూర్తిగా శాంతిగా ఉంటారు. వారేమీ ఆత్మాభిమానులుగా ఉండరు. వారు క్రీస్తు స్మృతిలో ఉంటారు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయవచ్చు కానీ విశేషంగా క్రీస్తును స్మృతి చేసేందుకు ఏకాంతములోకి వెళ్తారు, ఇంకెటువైపు చూడరు. ఎవరైతే చాలా మంచివారుంటారో, వారు మేము క్రీస్తును స్మృతి చేస్తూ-చేస్తూ వారి వద్దకు వెళ్ళిపోతామని భావిస్తారు. క్రీస్తు స్వర్గములో కూర్చున్నారు, మేము కూడా స్వర్గంలోకి వెళ్ళిపోతామని భావిస్తారు. క్రీస్తు హెవెన్లీ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళారు, మేము కూడా స్మృతి చేస్తూ-చేస్తూ వారి వద్దకు వెళ్ళిపోతాము అని కూడా భావిస్తారు. క్రిస్టియన్లంతా వారొక్కరి సంతానమే. వాళ్ళలో కొంత జ్ఞానము సరిగ్గా ఉంది. కానీ వారు ఇలా భావించడం కూడా తప్పు అని మీరంటారు ఎందుకంటే క్రీస్తు ఆత్మ పైకి వెళ్ళనే లేదు. క్రీస్తు అనే పేరు శిలువ పైకి ఎక్కించిన శరీరానిది. ఆత్మ శిలువ పైకి ఎక్కదు. ఇప్పుడు క్రీస్తు ఆత్మ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళిందని అనడం కూడా తప్పే అవుతుంది. ఎవరైనా తిరిగి ఎలా వెళ్తారు? ప్రతి ఒక్కరూ స్థాపనను, తర్వాత పాలనను తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇంటికి సున్నం మొదలైనవి వేయించడం జరుగుతుంది, ఇది కూడా పాలనే కదా.

ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఈ జ్ఞానము అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. స్వయం యొక్క కళ్యాణము చేసుకోవాలి. రోగులు నుండి నిరోగులుగా అవ్వాలి. ఇది రోగగ్రస్థుల పెద్ద హాస్పిటల్. మొత్తం విశ్వం రోగుల హాస్పిటల్. రోగులు తప్పకుండా త్వరగా మరణిస్తారు, తండ్రి వచ్చి ఈ విశ్వమంతటినీ నిరోగిగా చేస్తారు. ఇక్కడే నిరోగులుగా అవుతారని కాదు. కొత్త ప్రపంచములోనే నిరోగులు ఉంటారు, పాత ప్రపంచములో నిరోగులుండరు అని బాబా అంటారు. ఈ లక్ష్మీనారాయణులు నిరోగులు, సదా ఆరోగ్యవంతులు. అక్కడ ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది, వికారులే రోగులుగా ఉంటారు. నిర్వికారులు రోగులుగా ఉండరు. వారు సంపూర్ణ నిర్వికారులు. ఈ సమయంలో మొత్తం విశ్వం, విశేషంగా భారతదేశము రోగగ్రస్థంగా ఉందని తండ్రి స్వయంగా చెప్తారు. పిల్లలైన మీరు మొట్టమొదట నిరోగి ప్రపంచములోకి వస్తారు, స్మృతియాత్ర ద్వారా నిరోగులుగా అవుతారు. స్మృతి ద్వారా మీరు మీ మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది కూడా ఒక యాత్ర. ఇది తండ్రి అయిన పరమాత్మ వద్దకు వెళ్ళేందుకు ఆత్మ యొక్క యాత్ర. ఇది ఆధ్యాత్మిక యాత్ర. ఈ పదాలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మీకు కూడా నంబరువారుగా తెలుసు కానీ మర్చిపోతారు. ఇదే ముఖ్యమైన విషయము, అర్థము చేయించడం కూడా చాలా సహజము. కానీ ఎవరైతే స్వయం ఆత్మిక యాత్రలో ఉంటారో, వారే అర్థము చేయించగలరు. స్వయం యాత్రలో లేకుండా ఇతరులకు చెప్తే బాణము తగలదు. సత్యత యొక్క పదును కావాలి. మేము బాబాను ఎంతో స్మృతి చేస్తాము. స్త్రీ పతిని ఎంతగా స్మృతి చేస్తారు. వీరు పతులకు పతి, తండ్రులకు తండ్రి, గురువులకు గురువు. గురువులు కూడా ఈ తండ్రినే స్మృతి చేస్తారు. క్రీస్తు కూడా తండ్రినే స్మృతి చేసేవారు. కానీ వారి గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చినప్పుడే తమ పరిచయాన్నివ్వగలరు. భారతవాసులకే తండ్రి గురించి తెలియకపోతే ఇతరులకు ఎక్కడ నుండి లభిస్తారు. యోగాన్ని నేర్చుకునేందుకు విదేశాల నుండి కూడా ఇక్కడకు వస్తారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడే నేర్పించారని వారు భావిస్తారు. ఇది భావన. నేనే కల్ప-కల్పము, ఒక్కసారి మాత్రమే వచ్చి సత్యాతి-సత్యమైన యోగాన్ని నేర్పిస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము, దీనినే ఆత్మిక యోగమని అంటారు. మిగిలినవారందరివీ దైహిక యోగాలు. బ్రహ్మ తత్వముతో యోగం జోడిస్తారు. అది కూడా తండ్రి కాదు. అది మహాతత్వము, నివసించే స్థానము. కనుక తండ్రి ఒక్కరే రైట్. ఒక్క తండ్రినే సత్యమని అంటారు. ఒక్క తండ్రినే ఎలా సత్యమైనవారు అనేది కూడా భారతవాసులకు తెలియదు. వారే సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. సత్య ఖండము మరియు అసత్య ఖండము. మీరు సత్య ఖండములో ఉన్నప్పుడు అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అర్థకల్పము తర్వాత రావణ రాజ్యము, అసత్య ఖండము ప్రారంభమౌతుంది. పూర్తి సత్యయుగాన్ని సత్య ఖండమని అంటారు. తర్వాత పూర్తి కలియుగము అసత్య ఖండము. ఇప్పుడు మీరు సంగమయుగములో కూర్చున్నారు. ఇక్కడా లేరు, అక్కడా లేరు. మీరు ప్రయాణం (యాత్ర) చేస్తున్నారు. ఆత్మ ప్రయాణం చేస్తుంది, శరీరము కాదు. తండ్రి వచ్చి యాత్ర చేయడం నేర్పిస్తారు. ఇక్కడి నుండి అక్కడకు వెళ్ళాలి. మీకిది నేర్పిస్తారు. వారు నక్షత్రాలు, చంద్రుడు మొదలైనవాటి వైపుకు వెళ్ళేందుకు ప్రయాణము చేస్తారు. దానివల్ల లాభమేమీ ఉండదని మీకిప్పుడు తెలుసు. వీటి ద్వారానే పూర్తి వినాశనము జరగవలసి ఉంది. ఇక చేస్తున్న ఈ శ్రమ అంతా వ్యర్థము. సైన్సు ద్వారా తయారవుతున్న ఈ వస్తువులన్నీ భవిష్యత్తులో మీకే పనికొస్తాయని మీకు తెలుసు. ఈ డ్రామా తయారుచేయబడింది. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తున్నప్పుడు ఎంత గౌరవమునుంచాలి. టీచరుకు మామూలుగా కూడా చాలా గౌరవాన్నిస్తారు. మంచి రీతిగా చదువుకొని పాస్ అవ్వమని టీచర్ ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ ఆజ్ఞను స్వీకరించకపోతే ఫెయిల్ అయిపోతారు. మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు చదివిస్తున్నాని తండ్రి కూడా అంటారు. ఈ లక్ష్మీనారాయణలు యజమానులు. ప్రజలు కూడా యజమానులు కానీ హోదాలు అయితే చాలా ఉన్నాయి కదా. భారతదేశవాసులు అందరూ కూడా మేము యజమానులమని అంటారు కదా. పేదవారు కూడా స్వయాన్ని భారతదేశానికి యజమానులమని భావిస్తారు. కానీ రాజులకు మరియు వీరికి ఎంత తేడా ఉంటుంది. జ్ఞానము కారణంగా పదవులలో తేడా వచ్చేస్తుంది. జ్ఞానములో కూడా తెలివితేటలు ఉండాలి. పవిత్రత కూడా అవసరము మరియు ఆరోగ్యము-సంపద కూడా ఉండాలి. స్వర్గములో అన్నీ ఉంటాయి కదా. తండ్రి లక్ష్యము-ఉద్దేశ్యము అర్థం చేయిస్తారు. ప్రపంచంలో ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ లక్ష్యము-ఉద్దేశ్యము ఉండవు. మేము ఇలా తయారవుతామని మీరు వెంటనే అంటారు. పూర్తి విశ్వంలో మన రాజధాని ఉంటుంది. ఇదైతే ఇప్పుడు పంచాయితీ రాజ్యము. మొదట ద్వికిరీటధారులుగా ఉండేవారు, తర్వాత ఒకే కిరీటము ఉండేది, ఇప్పుడు ఏ కిరీటమూ లేదు. ద్వికిరీటధారి రాజుల ఎదురుగా ఏక కిరీటధారులు తల వంచుతున్నట్లుగా కూడా చిత్రముండాలి అని బాబా మురళీలో చెప్పారు. నేను మిమ్మల్ని రాజులకే రాజుగా, ద్వికిరీటధారులుగా చేస్తానని ఇప్పుడు తండ్రి అంటారు. అది అల్పకాలము కోసం, ఇది 21 జన్మల విషయము. మొట్టమొదటి ముఖ్యమైన విషయము, పావనంగా అవ్వడము. మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు కానీ రాజుగా తయారుచేయమని అనరు. ఇప్పుడు పిల్లలైన మీది అనంతమైన సన్యాసము. ఈ ప్రపంచము నుండి మన ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత స్వర్గములోకి వస్తాము. మేము ఇంటికి వెళ్తాము, తర్వాత రాజ్యములోకి వస్తాము అని అర్థం చేసుకున్నప్పుడు లోలోపల సంతోషం ఉండాలి, మరి వాడిపోవడం, దుఃఖము కలగడం మొదలైనవన్నీ ఎందుకు ఉండాలి. ఆత్మలైన మనం ఇంటికి వెళ్ళిపోతాము, తర్వాత కొత్త ప్రపంచములో పునర్జన్మలు తీసుకుంటాము. పిల్లలకు స్థిరమైన సంతోషం ఎందుకు ఉండదు? మాయ యొక్క అపోజిషన్ చాలా ఉంది, అందుకే సంతోషం తగ్గిపోతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి అని స్వయంగా పతిత-పావనుడు అంటారు. మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మళ్ళీ మనము మన రాజస్థాన్ లోకి వెళ్ళిపోతామని మీకు తెలుసు. ఇక్కడ రకరకాల రాజులుండేవారు, ఇప్పుడు మళ్ళీ ఆత్మిక రాజస్థాన్ తయారవ్వాలి. స్వర్గానికి యజమానులుగా అవుతాము. క్రిస్టియన్లు హెవెన్ యొక్క అర్థాన్ని తెలుసుకోరు. వారు ముక్తిధామమునే స్వర్గమని అనేస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్లో ఉంటారని కాదు. వారు శాంతిధామంలోనే ఉంటారు. ఇప్పుడు మీరు ప్యారడైజ్ లోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తారు. ఈ తేడాను తెలియజేయాలి. గాడ్ ఫాదర్ ముక్తిధామంలో నివసించేటటువంటివారు. స్వర్గమని కొత్త ప్రపంచాన్ని అంటారు. అక్కడ క్రిస్టియన్లు ఉండరు. ఫాదర్ నే వచ్చి ప్యారడైజ్ ను స్థాపన చేస్తారు. మీరు దేనినైతే శాంతిధామము అని అంటారో, దానిని వారు హెవెన్ గా భావిస్తారు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు.

జ్ఞానము అయితే చాలా సహజమని తండ్రి అంటారు. ఇది పవిత్రంగా అయ్యే జ్ఞానము, ముక్తి-జీవన్ముక్తిలోకి వెళ్ళేందుకు జ్ఞానము, ఇది తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఎవరికైనా ఉరిశిక్ష వేసేటప్పుడు, మేము భగవంతుని వద్దకు వెళ్తామని వారికి లోపల ఉంటుంది, అలానే ఉరి తీసేవారు కూడా భగవంతుడిని గుర్తు చేయమని చెప్తారు. ఇరువురికీ భగవంతుని గురించి తెలియదు. ఆ సమయంలో వారికి మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకొస్తారు. ఎవరైతే అంతిమకాలంలో స్త్రీని స్మరిస్తారో...... అని గాయనము కూడా ఉంది. ఎవరో ఒకరు తప్పకుండా గుర్తుకొస్తారు. సత్యయుగంలో మాత్రమే మోహజీతులుగా ఉంటారు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటామని అక్కడ వారికి తెలుసు. అక్కడ స్మృతి చేయవలసిన అవసరముండదు, అందుకే దుఃఖములో అందరూ స్మరిస్తారు అని అంటారు. ఇక్కడ దుఃఖముంటుంది, అందుకే భగవంతుడి నుండి ఏదైనా లభించాలి అని స్మృతి చేస్తారు. అక్కడైతే అన్నీ లభించే ఉంటాయి. మా ఉద్దేశ్యము మనుష్యులను ఆస్తికులుగా చేయడం, ఆ యజమానికి (భగవంతునికి) చెందినవారిగా చేయడమని మీరు చెప్పవచ్చు. ఇప్పుడు అందరూ అనాథలుగా ఉన్నారు. మనము ఆ యజమానికి (భగవంతునికి) చెందినవారిగా అవుతాము. సుఖ-శాంతులు, సంపదల వారసత్వాన్నిచ్చేవారు తండ్రి మాత్రమే. ఈ లక్ష్మీనారాయణులకు ఎంత ఎక్కువ ఆయుష్షు ఉండేది. మొట్టమొదట భారతవాసీయులకు చాలా ఎక్కువ ఆయుష్షు ఉండేదని కూడా మీకు తెలుసు. ఇప్పుడు తక్కువగా ఉంది. ఎందుకు తగ్గిపోయింది అనేది ఎవ్వరికీ తెలియదు. అర్థము చేసుకోవడం మరియు అర్థము చేయించడం అనేది మీకు చాలా సహజమైపోయింది. అది కూడా నంబరువారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరి అర్థము చేయించడం ఎవరిది వారిది ఉంటుంది, ఎవరు ఎలా ధారణ చేస్తారో, అలా అర్థము చేయిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విధంగా తండ్రి సదా ఆత్మాభిమానిగా ఉంటారో, అదే విధంగా ఆత్మాభిమానిగా ఉండేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి. ఒక్క తండ్రినే హృదయపూర్వకంగా ప్రేమిస్తూ-ప్రేమిస్తూ తండ్రితో పాటుగా ఇంటికి వెళ్ళాలి.

2. అనంతమైన తండ్రి పట్ల పూర్తిగా గౌరవమునుంచాలి అనగా తండ్రి ఆజ్ఞపై నడుచుకోవాలి. తండ్రి యొక్క మొట్టమొదటి ఆజ్ఞ - పిల్లలూ, బాగా చదువుకుని పాస్ అవ్వండి. ఈ ఆజ్ఞను పాలన చేయాలి.

వరదానము:-

సెన్స్ మరియు ఎస్సెన్స్ ల బ్యాలెన్స్ ద్వారా నాది అనే దానిని స్వాహా చేసే విశ్వ పరివర్తక భవ

సెన్స్ అనగా జ్ఞానం యొక్క పాయింట్లు, వివేకము మరియు ఎస్సెన్స్ అనగా సర్వశక్తి స్వరూపము యొక్క స్మృతి మరియు సమర్థ స్వరూపము. ఈ రెండిటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే అపనాపన్ (నాది) మరియు పురానాపన్ (పాతది) స్వాహా అయిపోతుంది. ప్రతి సెకండు, ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మ విశ్వ పరివర్తన సేవ కోసం స్వాహా అయినందుకు స్వతహాగా విశ్వపరివర్తకులుగా అయిపోతారు. ఎవరైతే తమ దేహం యొక్క స్మృతి సహితంగా స్వాహా అయిపోతారో, వారి శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం యొక్క పరివర్తన సహజంగా అవుతుంది.

స్లోగన్:-

ప్రాప్తులను గుర్తు చేసుకున్నట్లయితే దుఃఖము మరియు చింత కలిగించే విషయాలను మర్చిపోతారు.