20-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారు, మీకు జ్ఞాన సూర్యుడైన తండ్రి లభించారు, ఇప్పుడు మీరు మేల్కొన్నారు కనుక ఇతరులను కూడా మేలుకొలపండి”

ప్రశ్న:-

అనేక రకాల సంఘర్షణలకు కారణమేమిటి మరియు వాటి నివారణ ఏమిటి?

జవాబు:-

దేహాభిమానములోకి వచ్చినప్పుడు అనేక రకాల సంఘర్షణలు ఏర్పడతాయి, మాయ గ్రహచారము కూర్చుంటుంది. బాబా అంటారు - దేహీ అభిమానులుగా అవ్వండి, సేవలో నిమగ్నమవ్వండి. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే గ్రహచారము తొలగిపోతుంది.

ఓంశాంతి. ఆత్మిక పిల్లల వద్దకు తండ్రి శ్రీమతమునిచ్చేందుకు మరియు అర్థము చేయించేందుకు వచ్చారు. మొత్తం కార్యమంతా డ్రామా ప్లాన్ అనుసారముగా జరగనున్నదని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. ఈ భారతదేశాన్ని రావణపురి నుండి మళ్ళీ విష్ణుపురిగా తయారుచేయాలి. ఇప్పుడు తండ్రి కూడా గుప్తంగా ఉన్నారు, చదువు కూడా గుప్తమైనదే, సెంటర్లు అయితే చాలా ఉన్నాయి, చిన్న గ్రామాలలో చిన్న సెంటర్లున్నాయి, పెద్ద గ్రామాలలో పెద్ద సెంటర్లున్నాయి మరియు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఛాలెంజ్ చేశారు. కనుక ఎప్పుడైనా ఏదైనా లిటరేచర్ తయారుచేసేటప్పుడు అందులో - మా ఈ భారతభూమిని మేము తప్పకుండా స్వర్గంగా తయారుచేస్తామని కూడా వ్రాయాలి. మీకు కూడా మీ భారతభూమి చాలా ప్రియమైనది, ఎందుకంటే ఈ భారతదేశమే 5 వేల సంవత్సరాలు క్రితం స్వర్గంగా ఉండేదని మీకు తెలుసు. భారతదేశము చాలా సుందరంగా ఉండేది, దానిని స్వర్గమని అంటారు. బ్రహ్మా ముఖవంశావళి అయిన మీకు మాత్రమే ఈ జ్ఞానముంది. మనము తప్పకుండా శ్రీమతము ఆధారంగా ఈ భారతదేశాన్ని స్వర్గముగా తయారుచేయాలి. అందరికీ మార్గాన్ని తెలియజేయాలి, అంతేకానీ గొడవల గురించిన విషయాలేవీ లేవు. ఎలాగైతే గవర్నమెంట్ వారు పరస్పరములో కలుసుకొని - భారతదేశాన్ని మనం ఎలా సరిదిద్దాలి, ఇక్కడ ఇన్ని అభిప్రాయ బేధాలు ఏవైతే ఏర్పడ్డాయో, వాటిని పరస్పరంలో కలిసి ఎలా సరి చేయాలి మరియు భారతదేశంలో సుఖ-శాంతులను ఎలా స్థాపన చేయాలి అని చర్చించుకుంటారో, అలా మీరు కూడా - వార్తాపత్రికలలో కూడా చిత్రాలు ముద్రింపబడే విధంగా, మనం ఈ ప్రదర్శనిలోని చిత్రాల ద్వారా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అని సెమినార్ ఏర్పాటు చేసుకుని పరస్పరములో చర్చించుకోవాలి. ఆ గవర్నమెంట్ వారి పురుషార్థము కూడా నడుస్తుంది. మీరు కూడా పాండవ గవర్నమెంట్ గా గాయనం చేయబడ్డారు. ఇది పెద్ద ఈశ్వరీయ గవర్నమెంట్, వాస్తవానికి దీనినే పావనమైన ఈశ్వరీయ గవర్నమెంట్ అని అంటారు, పతితపావనుడైన తండ్రియే కూర్చొని పతితులైన పిల్లలను పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు, ఈ విషయము పిల్లలకు మాత్రమే తెలుసు. భారతదేశపు ఆదిసనాతన దేవీదేవతా ధర్మమే ముఖ్యమైనది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞమని కూడా పిల్లలకు తెలుసు. ఈశ్వరుడైన తండ్రినే, శివుడినే రుద్రుడని అంటారు. తప్పకుండా తండ్రి వచ్చి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారని గాయనము చేయబడింది. వారు కాలమును పొడిగించి ఎక్కువగా చూపించారు. వారు అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మేలుకొలిపారు, మీరు మళ్ళీ ఇతరులను మేలుకొలపాలి. డ్రామా ప్లాన్ అనుసారముగా మీరు మేలుకొలుపుతూ ఉంటారు. ఇప్పటివరకు, ఎవరు, ఏ విధంగా, ఎంతెంత పురుషార్థము చేశారో, కల్పక్రితము కూడా అంతే చేశారు. యుద్ధ మైదానములో గెలుపు-ఓటములు ఉంటూనే ఉంటాయి. అప్పుడప్పుడు మాయ శక్తివంతంగా ఉంటుంది, అప్పుడప్పుడు ఈశ్వరీయ సంతానము శక్తివంతంగా ఉంటారు. అప్పుడప్పుడు సేవ చాలా మంచి వేగంతో జరుగుతుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ పిల్లలకు మాయ విఘ్నాలు కలుగుతాయి, మాయ పూర్తిగా మూర్ఛితులుగా చేసేస్తుంది. ఇది యుద్ధ మైదానము కదా. రావణ మాయ, రాముని సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తుంది. లక్ష్మణుడి గురించి కూడా కథ ఉంది కదా.

మనుష్యులందరూ కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారని మీరు అంటారు. ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారైన మీరు మాత్రమే ఈ విధంగా అంటారు. ఎవరికైతే జ్ఞాన సూర్యుడు లభించారో మరియు ఎవరైతే మేలుకొన్నారో, వారే అర్థం చేసుకుంటారు. ఇందులో ఒకరికొకరు చెప్పుకునే విషయమేమీ లేదు. తప్పకుండా ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన మేము మేలుకున్నామని, మిగిలిన వారంతా నిదురిస్తున్నారు మీకు తెలుసు. పరమపిత పరమాత్మ పిల్లలకు వారసత్వమునిచ్చేందుకు వచ్చేసారని వారికి తెలియదు, వారు దీన్ని పూర్తిగా మర్చిపోయారు. తండ్రి భారతదేశములోనే వస్తారు. వారు వచ్చి భారతదేశాన్ని స్వర్గానికి యజమానిగా తయారుచేస్తారు. భారతదేశము స్వర్గానికి యజమానిగా ఉండేది, ఇందులో ఎటువంటి సంశయము లేదు. పరమపిత పరమాత్ముని జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. శివజయంతిని జరుపుతారు కదా, అంటే వారు వచ్చి తప్పకుండా ఏదో చేసి ఉంటారు కదా. వారు వచ్చి తప్పకుండా స్వర్గ స్థాపన చేసి ఉంటారని బుద్ధి అంటుంది. ప్రేరణ ద్వారా స్థాపన జరగదు. ఇక్కడ పిల్లలైన మీకు రాజయోగమును నేర్పించడం జరుగుతుంది, స్మృతియాత్రను అర్థము చేయించడం జరుగుతుంది. ప్రేరణ ద్వారా ఎటువంటి శబ్దము వ్యాపించదు. శంకరుని ప్రేరణ కూడా ఉంటుంది, అప్పుడే ఈ యాదవులు కూడా ముసలాలు (మిసైల్స్) మొదలైనవి తయారుచేస్తారని మీరు భావిస్తారు. కానీ ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. ఈ ముసలాలు మొదలైనవి తయారుచేయడమే డ్రామాలో వీరి పాత్ర అని మీరు అర్థము చేసుకున్నారు. ఇక్కడ ప్రేరణ అనే మాటేమీ లేదు. డ్రామానుసారముగా వినాశనము అయితే తప్పకుండా జరగాల్సిందే. మాహాభారత యుద్ధములో ముసలాలు ఉపయోగించారని అంటారు. ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము భారతదేశములో స్వర్గ స్థాపన చేస్తామని, అక్కడ ఒకే ధర్మము ఉంటుందని మీరు గ్యారెంటీ ఇస్తారు. అనేక ధర్మాలు వినాశనమవుతాయని మీరు ఇలా వ్రాయరు. స్వర్గ స్థాపన జరిగినప్పుడు ఇంకే ధర్మము ఉండదని చిత్రములో వ్రాయబడి ఉంది, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అందరికన్నా గొప్ప పాత్ర శివునిది, బ్రహ్మాది మరియు విష్ణువుది. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు అనేవి చాలా గుహ్యమైన విషయాలు. విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు, బ్రహ్మా నుండి మళ్ళీ విష్ణువుగా ఎలా అవుతారు అనేది తెలివైన పిల్లల బుద్ధిలోకి వెంటనే వస్తుంది. దైవీ సంప్రదాయానికి చెందినవారైతే తయారవుతారు, ఇది కేవలం ఒక్కరి విషయము కాదు. ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు, ప్రపంచములోని మనుష్యులలో ఒక్కరికి కూడా అర్థము కాదు. లక్ష్మీనారాయణులను మరియు విష్ణువును పూజిస్తారు కూడా, కానీ విష్ణువు యొక్క రెండు రూపాలే లక్ష్మీనారాయణులని, వారే కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారని వారికి తెలియదు. ఇకపోతే, నాలుగు భుజాలు గల మనుష్యులు ఎవ్వరూ ఉండరు. సూక్ష్మవతనంలో ఈ గుర్తును ప్రవృత్తి మార్గం యొక్క లక్ష్యము ఉద్దేశ్యముగా చూపిస్తారు. ఈ మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళము ఎలా తిరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. తండ్రి గురించే తెలియనప్పుడు తండ్రి యొక్క రచన గురించి ఎలా తెలుసుకోగలరు. తండ్రియే రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తెలియజేస్తారు, ఋషులు-మునులు కూడా మాకు తెలియదని అనేవారు. తండ్రిని తెలుసుకుంటే, రచన ఆదిమధ్యాంతాలను కూడా తెలుసుకుంటారు. తండ్రి అంటారు - నేను ఒక్కసారి మాత్రమే వచ్చి, పిల్లలైన మీకు కూడా మొత్తం జ్ఞానాన్ని అర్థం చేయిస్తాను, ఇక తర్వాత నేను రాను, మరి అటువంటప్పుడు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను ఎలా తెలుసుకోగలరు. తండ్రి స్వయంగా అంటారు - నేను సంగమయుగములో తప్ప ఇంకెప్పుడూ రాను, నన్ను మీరు సంగమయుగములోనే పిలుస్తారు. సత్యయుగాన్ని పావనమైనదని, కలియుగాన్ని పతితమైనదని అంటారు. అంటే తప్పకుండా నేను పతిత ప్రపంచం యొక్క అంతిమములోనే వస్తాను కదా, కలియుగాంతములో వచ్చి పతితుల నుండి పావనంగా తయారుచేస్తాను. సత్యయుగము ఆదిలో పావనముగా ఉంటారు, ఇది సహజమైన విషయము కదా. పతిత పావనుడైన తండ్రి ఎప్పుడు వస్తారు అనేది మనుష్యులు ఏమీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు దీన్ని కలియుగం యొక్క అంతమని అంటారు. ఒకవేళ కలియుగానికి ఇంకా 40 వేల సంవత్సరాలున్నాయి అని అంటే, ఇంకెంతగా పతితముగా అవుతారు! ఎంత దుఃఖముంటుంది! ఇక సుఖమనేది అసలు ఉండదు. వారికేమీ తెలియని కారణంగా పూర్తిగా ఘోరమైన అంధకారములో ఉన్నారు. మీరు అర్థము చేసుకోగలరు. కనుక పిల్లలు పరస్పరములో కలుసుకోవాలి. చిత్రాలపై మంచి రీతిగా అర్థం చేయించవలసి ఉంటుంది. చిత్రాలు మొదలైనవన్నీ కూడా డ్రామానుసారముగా తయారుచేసారు. ఏదైతే సమయము గడుస్తుందో, డ్రామా అలాగే నడుస్తూ ఉంటుందని పిల్లలకు తెలుసు. పిల్లల అవస్థలు కూడా అప్పుడప్పుడు కిందకు, అప్పుడప్పుడు పైకి అవుతూ ఉంటాయి, ఇవి బాగా అర్థము చేసుకునే విషయాలు. అప్పుడప్పుడు గ్రహచారము వచ్చి కూర్చుంటుంది, అప్పుడు దానిని తొలగించుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు. బాబా పదే-పదే అంటారు - పిల్లలూ, మీరు దేహాభిమానములోకి వస్తారు, అందుకే సంఘర్షణ జరుగుతుంది, ఇక్కడ దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. పిల్లలలో దేహాభిమానము చాలా ఉంది. మీరు దేహీ అభిమానులుగా అవ్వండి, అప్పుడు తండ్రి స్మృతి ఉంటుంది మరియు సేవలో ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఎవిరికైతే ఉన్నత పదవిని పొందేది ఉంటుందో, వారు సదా సేవలో నిమగ్నమై ఉంటారు. భాగ్యములో లేకపోతే పురుషార్థము కూడా చేయరు. వారే స్వయంగా అంటారు - బాబా, మాకు ధారణ జరగడం లేదు. వారి బుద్ధిలో కూర్చోదు. ఎవరికైతే ధారణ జరుగుతుందో, వారికి సంతోషము కూడా చాలా ఉంటుంది. శివబాబా వచ్చేసారని వారు అర్థము చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, మీరు మంచి రీతిగా అర్థము చేసుకుని ఇతరులకు అర్థం చేయించండి. కొంతమందైతే సేవలోనే నిమగ్నమై ఉంటారు, పురుషార్థము చేస్తూ ఉంటారు. ఏ సెకండు అయితే గడుస్తుందో, అది డ్రామాలో నిశ్చితమై ఉందని, అది మళ్ళీ అలాగే రిపీట్ అవుతుందని కూడా పిల్లలకు తెలుసు. బయట భాషణ మొదలైనవి వినేందుకు అనేక రకాల మనుష్యులు వస్తారని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఎంతోమంది మనుష్యులు గీత, వేద శాస్త్రాల మొదలైనవాటిపై భాషణ చేస్తారని మీకు తెలుసు, కానీ ఇక్కడ ఈశ్వరుడు తన గురించి మరియు తన రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాలను గురించి అర్థం చేయిస్తారని వారెవ్వరికీ తెలియదు. రచయితే వచ్చి మొత్తం జ్ఞానాన్ని వినిపిస్తారు. త్రికాలదర్శులుగా తయారుచేయడమనేది కేవలం తండ్రి పని. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. ఇవి కొత్త విషయాలు. బాబా పదే-పదే అర్థం చేయిస్తారు - ఎక్కడికి వెళ్ళినా సరే, మొట్టమొదట, గీతా భగవంతుడు ఎవరు - శ్రీకృష్ణుడా లేక నిరాకార శివుడా అన్నది అర్థము చేయించండి. ఈ విషయాలను మీరు ప్రొజెక్టరు ద్వారా అర్థం చేయించలేరు. ప్రదర్శనీలో చిత్రాలు ఎదురుగా ఉంటాయి, వాటి గురించి అర్థం చేయించి - గీతా భగవంతుడు ఎవరు? జ్ఞానసాగరుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, అని వారిని అడగవచ్చు. కృష్ణుడని వారిప్పుడు చెప్పలేరు. పవిత్రత మరియు సుఖ-శాంతుల సాగరుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు ఎవరు? మొట్టమొదట ఈ విషయము వారితో వ్రాయించాలి, ఫారం నింపించాలి, తర్వాత అందరి దగ్గర సంతకాలు తీసుకోవాలి.

(పక్షుల శబ్దాలు వినిపించాయి) ఎంతగా కొట్లాడుకుంటున్నాయో చూడండి. ఈ సమయములో మొత్తం ప్రపంచములో గొడవలు-కొట్లాటలే ఉన్నాయి. మనుష్యులు కూడా పరస్పరములో కొట్లాడుకుంటున్నారు. మనుష్యుల్లోనే అర్థము చేసుకునే బుద్ధి ఉంటుంది, 5 వికారాలు కూడా మనుష్యుల్లోనే ఉంటాయని అంటారు. ఇక్కడ జంతువుల విషయమేమీ లేదు. ఇది వికారీ ప్రపంచము. ప్రపంచమని మనుష్యుల కోసమే అంటారు. కలియుగములో ఆసురీ సంప్రదాయము వారుంటారు, సత్యయుగంలో దైవీ సంప్రదాయము వారుంటారు. ఇప్పుడు మీకు ఈ తేడా అంతా తెలిసింది కనుక మీరు ఋజువు చేసి చెప్పగలరు. మెట్ల చిత్రములో కూడా చాలా స్పష్టంగా చూపించబడింది, కింద పతితులు, పైన పావనమైనవారున్నారు, ఇందులో చాలా స్పష్టంగా ఉంది. మెట్ల చిత్రమే ముఖ్యమైనది - అందులో దిగే కళను మరియు ఎక్కే కళను చూపిస్తారు. ఈ మెట్ల చిత్రము చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా పతిత ప్రపంచమని, స్వర్గము పావన ప్రపంచమని మనుష్యులు పూర్తిగా, మంచి రీతిగా అర్థము చేసుకునే విధంగా ఈ చిత్రములో ఏమి చూపించాలి. ఇక్కడ అందరూ పతితముగా ఉన్నారు, ఒక్కరు కూడా పావనమైనవారు ఉండరు. రాత్రింబవళ్ళు ఈ ఆలోచనలు నడవాలి. బాబా, ఈ చిత్రము తయారుచేయనా అని ఆత్మప్రకాశ్ బచ్చా రాస్తారు. అప్పుడు బాబా అంటారు - విచార సాగర మథనము చేసి ఏ చిత్రాన్ని అయినా తయారుచేయండి, కానీ మెట్ల చిత్రము చాలా బాగా తయారవ్వాలి. మీరు 84 జన్మలను పూర్తి చేసుకొని మళ్ళీ మొదటి నంబరు జన్మ తీసుకున్నారు, దిగే కళ నుండి మళ్ళీ ఎక్కే కళలోకి వెళ్ళాలి అని ఈ చిత్రముపై చాలా బాగా అర్థము చేయించవచ్చు. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లేదంటే సేవ ఎలా చేయగలరు. చిత్రాలపై అర్థము చేయించడము చాలా సహజము. సత్యయుగము తర్వాత మెట్లు దిగవలసి ఉంటుంది. మనము పాత్రధారులమని, నటులమని కూడా పిల్లలకు తెలుసు. ఇక్కడ నుండి నేరుగా సత్యయుగంలోకి ట్రాన్స్ఫర్ అవ్వరు, మొదట శాంతిధామానికి వెళ్ళాలి. స్వయాన్ని ఈ డ్రామాలో పాత్రధారులుగా భావించేవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ప్రపంచములో ఎవ్వరూ మేము పాత్రధారులమని అనలేరు. పాత్రధారులుగా, నటులుగా అయి కూడా డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్ గురించి, ఆదిమధ్యాంతాల గురించి తెలుసుకోలేదంటే వారు ఫస్ట్ క్లాస్ తెలివిహీనులని మనము వ్రాస్తాము కూడా. ఇదైతే భగవానువాచ, బ్రహ్మా తనువు ద్వారా శివభగవానువాచ. ఆ నిరాకారుడు జ్ఞానసాగరుడు, వారికి తమ శరీరము లేదు. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన యుక్తులు. పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి, మనము ఎవ్వరినీ నిందించము. ఇది రైట్ విషయము కదా. ఎవరైతే పెద్ద-పెద్ద వారున్నారో, వారందరి చిత్రాలను మీరు పెట్టవచ్చు. మెట్ల చిత్రమును ఎవరికైనా చూపించవచ్చు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. భారతదేశంలో సుఖ-శాంతులను స్థాపన చేసేందుకు మరియు భారతదేశాన్ని స్వర్గముగా తయారుచేసేందుకు పరస్పరంలో సెమినార్లు జరుపుకోవాలి, శ్రీమతముపై భారతదేశానికి ఇటువంటి సేవ చేయాలి.

2. సేవలో ఉన్నతి చేయడం కోసం మరియు సేవ ద్వారా ఉన్నత పదవిని పొందేందుకు, దేహీ అభిమానులుగా ఉండే శ్రమ చేయాలి. జ్ఞానము యొక్క విచార సాగర మథనము చేయాలి.

వరదానము:-

తమ శ్రేష్ఠ ధారణలలో త్యాగంలో భాగ్యాన్ని అనుభవము చేసే సత్యమైన త్యాగీ భవ

బ్రాహ్మణుల శ్రేష్ఠమైన ధారణ సంపూర్ణ పవిత్రత. ఈ ధారణ కోసమే - ప్రాణం పోయినా ధర్మం పోకూడదు అనే గాయనముంది. ఏ రకమైన పరిస్థితిలోనైనా తమ ఈ ధారణ కోసము ఏది త్యాగము చేయవలసి వచ్చినా, సహనం చేయవలసి వచ్చినా, ఎదుర్కోవలసి వచ్చినా, సాహసము చేయవలసి వచ్చినా సరే చాలా సంతోషముగా చేయండి - ఇందులో త్యాగాన్ని త్యాగముగా భావించకుండా భాగ్యము యొక్క అనుభవము చేయండి, అప్పుడు సత్యమైన త్యాగులు అని అంటారు. ఇటువంటి ధారణ చేసేవారే సత్యమైన బ్రాహ్మణులుగా పిలవబడతారు.

స్లోగన్:-

సర్వశక్తులను తమ ఆర్డర్ లో ఉంచుకునేవారే మాస్టర్ సర్వ శక్తివంతులు.