20-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరిప్పుడు పూర్తిగా తీరం వద్ద నిలబడి ఉన్నారు, ఇప్పుడు మీరు ఈ తీరము నుండి ఆ తీరానికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి”

ప్రశ్న:-

ఏ ఒక్క విషయాన్ని గుర్తుంచుకున్నట్లయితే స్థితి అచలంగా-స్థిరంగా తయారవుతుంది?

జవాబు:-

జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన వాటి గురించి ఆలోచించకూడదు, ముందుకు సాగిపోతూ ఉండాలి. సదా ఒక్కరి వైపే చూస్తూ ఉన్నట్లయితే స్థితి అచలంగా-స్థిరంగా అయిపోతుంది. మీరిప్పుడు కలియుగపు హద్దును వదిలేశారు, మళ్ళీ వెనుకకు ఎందుకు చూస్తారు? అటువైపుకు బుద్ధి కొద్దిగా కూడా వెళ్ళకూడదు - ఇదే సూక్ష్మమైన చదువు.

ఓంశాంతి. రోజులు మారుతూ ఉంటాయి, సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆలోచించండి, సత్యయుగము నుండి మొదలుకొని సమయం గడిచిపోతూ-గడిచిపోతూ ఇప్పుడు వచ్చి కలియుగంలో, అది కూడా చివరిలో నిలబడి ఉన్నారు. ఈ సత్యయుగ, త్రేత, ద్వాపర, కలియుగాల చక్రము కూడా ఒక మోడల్ వంటిది. సృష్టి అయితే చాలా పొడవు-వెడల్పుగలది. దాని మోడల్ రూపాన్ని పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు కలియుగము పూర్తవుతుందన్న విషయం ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తెలిసింది - కనుక పిల్లలు కూడా బుద్ధి ద్వారా సత్యయుగం నుండి ప్రారంభించి చక్రము తిరిగి కలియుగాంతములో తీరానికి వచ్చి నిలబడాలి. టిక్ టిక్ అవుతూ ఉంటుంది, డ్రామా తిరుగుతూ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇంకా ఎంత లెక్క మిగిలి ఉంటుంది? కొద్దిగా మిగిలి ఉంటుంది. ఇది ఇంతకుముందు తెలియదు. చిన్న కొన మిగిలి ఉందని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఈ ప్రపంచము నుండి ఆ ప్రపంచములోకి వెళ్ళేందుకు ఇప్పుడిక కొద్ది సమయము మిగిలి ఉంది. ఈ జ్ఞానము కూడా ఇప్పుడే లభించింది. మనము సత్యయుగము నుండి మొదలుకొని చక్రములో తిరుగుతూ-తిరుగుతూ ఇప్పుడు కలియుగాంతములోకి వచ్చి చేరుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. రావడానికి మరియు తిరిగివెళ్ళడానికి గేటు ఉంటుంది కదా. ఇది కూడా అలాంటిదే. ఇంకా కొద్దిగా మిగిలి ఉందని పిల్లలు అర్థము చేయించాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము కదా. ఇప్పుడు మనము తీరంలో ఉన్నాము. సమయం చాలా కొద్దిగా ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచముపై మమత్వాన్ని తొలగించాలి. ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. చాలా సహజమైన వివరణ లభిస్తుంది. దీనిని బుద్ధిలో ఉంచుకోవాలి. చక్రము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు కలియుగములో లేరు. మీరు ఈ హద్దును వదిలేశారు, పాత ప్రపంచాన్ని వదిలేసినప్పుడు మళ్ళీ అటువైపు వారినెందుకు గుర్తు చేయాలి? మనము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము, మళ్ళీ వెనుకకెందుకు చూడాలి? వికారీ ప్రపంచముతో బుద్ధియోగమును ఎందుకు జోడించాలి? ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. కొంతమందైతే రూపాయిలో ఒక్క అణా అంత కూడా అర్థము చేసుకోరని బాబాకు తెలుసు. వింటారు మరియు మర్చిపోతారు. మీరు వెనుకకు చూడకూడదు. బుద్ధిని ఉపయోగించాలి కదా. మనము దూరంగా వచ్చేశాము - మళ్ళీ వెనుకకు ఎందుకు చూడాలి? గతం గతః. ఎంత సూక్ష్మమైన విషయాలను అర్థము చేయిస్తానని తండ్రి అంటారు. అయినా పిల్లల భుజాలెందుకు వెనుకకు వేలాడుతూ ఉంటాయి. కలియుగము వైపు వేలాడుతూ ఉన్నాయి. భుజాలను ఇటువైపు తిప్పమని తండ్రి అంటారు. ఆ పాత ప్రపంచము మీకు ఉపయోగపడేది కాదు. బాబా పాత ప్రపంచము పట్ల వైరాగ్యమునిప్పిస్తారు, క్రొత్త ప్రపంచము ఎదురుగా నిలబడి ఉంది, ఇక పాత ప్రపంచం పట్ల వైరాగ్యము. మా స్థితి ఆ విధంగా ఉందా అని ఆలోచించండి. గతం గతః అని తండ్రి అంటారు. గతించిన దాని గురించి ఆలోచించకండి. పాత ప్రపంచం పట్ల ఎటువంటి ఆశను పెట్టుకోకండి. మనము సుఖధామానికి వెళ్ళాలి అన్న ఒక్కటే ఉన్నతమైన ఆశను ఇప్పుడు పెట్టుకోవాలి. బుద్ధిలో సుఖధామమే గుర్తుండాలి. వెనుకకు ఎందుకు తిరగాలి. కానీ అనేకులు వెనుకకు తిరిగిపోతారు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు, పాత ప్రపంచము నుండి పక్కకు వచ్చేసారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. ఎక్కడా ఆగిపోకూడదు. ఏటూ చూడకూడదు. గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకోకూడదు. ముందుకు సాగిపోతూ ఉండండి, వెనుకకు చూడకండి అని తండ్రి చెప్తారు. ఒకవైపే చూస్తూ ఉండండి, అప్పుడే అచలమైన, స్థిరమైనా, చలించని స్థితి ఉంటుంది. అటు వైపే చూస్తూ ఉన్నట్లయితే పాత ప్రపంచము యొక్క మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు. వారు నంబరువారుగా ఉంటారు కదా. ఈ రోజు చూస్తే చాలా బాగా నడుస్తూ ఉంటారు, రేపు పడిపోయినట్లయితే మనసు ఒక్కసారిగా తొలగిపోతుంది. మురళి వినేందుకు కూడా మనస్సు రాని విధంగా గ్రహచారము కూర్చుండిపోతుంది. ఆలోచించండి - అలా జరుగుతుంది కదా?

మీరిప్పుడు సంగమయుగంలో నిలబడి ఉన్నారు కనుక ముఖము ముందువైపే ఉండాలి అని తండ్రి అంటారు. ముందున్నది కొత్త ప్రపంచము, అందుకే సంతోషము కలుగుతుంది. ఇప్పుడు మీరు తీరానికి సమీపంగా ఉన్నారు. ఇప్పుడు మన దేశపు వృక్షాలు కనిపిస్తున్నాయి, ఎవిరినైనా పిలిచినట్లయితే వారు వెంటనే వింటారని అంటారు కదా. సమీపంగా అంటే పూర్తిగా ఎదురుగా ఉన్నారు. మీరు గుర్తు చేసుకున్న వెంటనే దేవతలు వచ్చేస్తారు. ఇంతకుముందు వచ్చేవారు కాదు. సూక్ష్మవతనంలో అత్తవారింటి వారు వస్తారా? ఇప్పుడు పుట్టినింటివారు మరియు అత్తింటివారు వెళ్ళి కలుస్తారు, అయినా పిల్లలు నడుస్తూ-నడుస్తూ మర్చిపోతారు. బుద్ధియోగము వెనుకకు తిరిగిపోతుంది. మీ అందరికీ ఇది అంతిమ జన్మ అని తండ్రి అంటారు. మీరు వెనుకకు తిరగకూడదు. ఇప్పుడు దాటేయాలి. ఇటు వైపు నుండి అటు వైపుకు వెళ్ళాలి. మృత్యువు కూడా సమీపంగా వస్తూ ఉంటుంది. ఇక కేవలం ఒక అడుగు వేయాలి, నావ తీరానికి చేరుకున్నప్పుడు అటువైపు అడుగు వేయాల్సి ఉంటుంది కదా. పిల్లలైన మీరు తీరములో నిలబడాలి. ఆత్మలు తమ స్వీట్ హోమ్ కు వెళ్తాయని మీ బుద్ధిలో ఉంది. ఇది గుర్తుంచుకున్నా కూడా ఆ సంతోషం మిమ్మల్ని అచలంగా-స్థిరంగా తయారుచేస్తుంది. ఇదే విచార సాగర మథనము చేస్తూ ఉండాలి. ఇది బుద్ధికి సంబంధించిన విషయము. ఆత్మలైన మనము వెళ్తున్నాము. ఇప్పుడు ఇక తీరానికి సమీపంగా చేరుకున్నాము. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. దీనినే స్మృతియాత్ర అని అంటారు. ఇది కూడా మర్చిపోతారు. చార్టు వ్రాయడం కూడా మర్చిపోతారు. మీ హృదయముపై చేయి వేసుకొని చూడండి - నేను తీరానికి సమీపంగా నిలబడి ఉన్నాను అని ఈ విధంగా మీరు భావించండి అని బాబా ఏదైతే చెప్తున్నారో, అటువంటి స్థితి నాకు ఉందా? బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. తండ్రి రకరకాలుగా స్మృతి యాత్ర చేయడం నేర్పిస్తూ ఉంటారు, ఈ స్మృతియాత్రలోనే ఆనందంగా ఉండాలి. ఇక నేనిప్పుడు వెళ్ళాలి. ఇక్కడ అన్నీ అసత్యపు సంబంధాలు. సత్యయుగములో సత్యమైన సంబంధాలు ఉంటాయి. నేను ఎక్కడ నిలబడి ఉన్నాను అని స్వయాన్ని చూసుకోండి. సత్యయుగము నుండి మొదలుకొని బుద్ధిలో ఈ చక్రాన్ని గుర్తు చేసుకోండి. మీరు స్వదర్శన చక్రధారులు కదా. సత్యయుగము నుండి మొదలుకొని చక్రము తిరిగి వచ్చి తీరంలో నిలబడి ఉన్నారు. సమీపంగా వచ్చేశారు కదా. కొందరు తమ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటారు. 5-10 నిముషాలు కూడా కష్టంగా స్మృతిలో ఉంటూ ఉండవచ్చు. స్వదర్శన చక్రధారులుగానైతే, రోజంతా అవ్వాలి. కానీ అలా ఉండరు. బాబా రకరకాల పద్ధుతులలో అర్థం చేయిస్తారు. ఆత్మకు సంబంధించిన విషయమే. మీ బుద్ధిలో చక్రము తిరుగుతూ ఉంటుంది. బుద్ధిలో ఇది ఎందుకు గుర్తు ఉండకూడదు. ఇప్పుడు మనము తీరంలో నిలబడి ఉన్నాము. బుద్ధిలో ఈ తీరం ఎందుకు గుర్తుండదు, మనము పురుషోత్తములుగా అవుతున్నామని తెలిసినప్పుడు వెళ్ళి తీరంలో నిలబడి ఉండండి. పేను వలె నడుస్తూనే ఉండండి. ఈ అభ్యాసాన్ని ఎందుకు చేయరు? చక్రము బుద్ధిలోకి ఎందుకు రాదు? ఇది స్వదర్శన చక్రము కదా. బాబా ప్రారంభము నుండి మొదలుకొని చక్రమంతా అర్థము చేయిస్తూ ఉంటారు. మీ బుద్ధి చక్రమంతా తిరిగి, వచ్చి తీరంలో నిలబడిపోవాలి, ఇక బయట వాతావరణపు జంజాటలేవీ ఉండకూడదు. రోజు-రోజుకు పిల్లలైన మీరు సైలెన్స్ లోకే వెళ్ళాలి. సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. పాత ప్రపంచాన్ని వదిలి క్రొత్త సంబంధాలతో మీ బుద్ధి యోగాన్ని జోడించండి. యోగము జోడించకపోతే పాపాలెలా తొలగుతాయి? ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు, దీని మోడల్ ఎంత చిన్నది. 5 వేల సంవత్సరాల ప్రపంచము. అజ్మేరులో స్వర్గము మోడల్ ఉంది కానీ ఎవ్వరికైనా స్వర్గము గుర్తుకొస్తుందా? స్వర్గమంటే ఏమిటో వారికేమి తెలుసు. 40 వేల సంవత్సరాల తర్వాత స్వర్గము వస్తుందని భావిస్తారు. ఈ ప్రపంచంలో కార్యవ్యవహారాలు చేస్తూ, ఈ ప్రపంచము సమాప్తము అవ్వనున్నదని బుద్ధిలో గుర్తుంచుకోవాలని బాబా కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు వెళ్ళాలి, మనము చివరిలో నిలబడి ఉన్నాము. అడుగడుగు పేను వలె నడుస్తుంది. లక్ష్యము ఎంత గొప్పది. తండ్రికి లక్ష్యము గురించి తెలుసు కదా. తండ్రితో పాటు దాదా కూడా కలిసి ఉన్నారు. వారు అర్థము చేయిస్తున్నప్పుడు మరి వీరెందుకు అర్థము చేయించలేరు. వీరు కూడా వింటారు కదా. వీరు ఈ విధంగా విచార సాగర మథనము చేస్తూ ఉండరా? తండ్రి మీకు విచార సాగర మథనము చేసేందుకు పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. బాబా చాలా వెనుక ఉన్నారని కాదు. అరే, వీరు నాకు తోక వలె వేలాడుతూ ఉన్నారు, అటువంటప్పుడు వెనుక ఎలా ఉంటారు. ఇవన్నీ గుహ్యాతి-గుహ్యమైన, ధారణ చేయవలసిన విషయాలు. పొరపాట్లను విడిచిపెట్టేయాలి. బాబా వద్దకు 2-2 సంవత్సరాల తర్వాత వస్తారు. మేము తీరానికి సమీపంగా నిలబడి ఉన్నామని స్మృతి ఉండి ఉంటుందా? ఇప్పుడు వెళ్ళాలి. ఇలాంటి స్థితి ఏర్పడితే ఇంకేం కావాలి? బాబా ఇది కూడా అర్థము చేయించారు - ద్వికిరీటధారులు..... ఇది కేవలం పేరు, అంతేకానీ అక్కడ లైట్ యొక్క కిరీటమేమీ ఉండదు. ఇది పవిత్రతకు గుర్తు. ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో, వారి చిత్రాలలో తప్పకుండా ప్రకాశాన్ని చూపిస్తారు ఎందుకంటే వారు నిర్వికారులు, సతోప్రధానమైనవారు, తర్వాత రజో తమోలలోకి వస్తారు. పిల్లలైన మీకు జ్ఞానము లభిస్తుంది, అందులో ఆనందంగా ఉండాలి. మీరు ఈ ప్రపంచంలో ఉన్నా కానీ బుద్ధియోగము అక్కడ జోడింపబడి ఉండాలి. వీరితో కూడా తోడును నిర్వర్తించాలి. ఎవరైతే ఈ కులానికి చెందినవారు ఉంటారో, వారు వెలువడుతారు. అంటు కట్టాలి. ఎవరైతే ఆదిసనాతన దేవీదేవతా ధర్మమువారు ఉంటారో, వారు ముందో-వెనుకో తప్పకుండా వస్తారు. వెనుక వచ్చేవారు కూడా ముందువారి కన్నా వేగంగా వెళ్ళిపోతారు. ఇది చివరివరకు జరుగుతూ ఉంటుంది. వారు పాతవారికన్నా వేగంగా అడుగులు ముందుకు వేస్తారు. పరీక్షంతా స్మృతియాత్రకు సంబంధించినది. ఆలస్యంగా వచ్చినా కూడా, స్మృతియాత్రలో నిమగ్నమవ్వాలి మరియు వ్యాపార వ్యవహారాలన్నీ వదిలి ఈ యాత్రలోనే కూర్చుండిపోవాలి, భోజనం అయితే తినవలసిందే. మంచి రీతిగా స్మృతిలో ఉన్నట్లయితే ఈ సంతోషం వంటి ఔషధం లేదు. ఇప్పుడు మనము వెళ్తాము అని ఇదే చింత ఉండాలి. 21 జన్మల రాజ్యభాగ్యము లభిస్తుంది. లాటరీ లభించినవారికి సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది కదా. మీరు చాలా శ్రమ చేయాలి. దీనినే అంతిమ, అమూల్యమైన జీవితమని అంటారు. స్మృతియాత్రలో చాలా ఆనందము ఉంటుంది. హనుమంతుడు కూడా పురుషార్థము చేస్తూ-చేస్తూ స్థిరంగా అయిపోయారు కదా. అడవికి నిప్పంటుకుంది, రావణ రాజ్యము కాలిపోయింది. ఇదొక కథగా తయారుచేశారు. తండ్రి కూర్చొని యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. రావణ రాజ్యము సమాప్తమైపోతుంది. దీనినే స్థిరమైన బుద్ధి అని అంటారు. ఇప్పుడిక తీరములో ఉన్నాము, మనము వెళ్ళిపోతున్నాము. ఈ స్మృతిలో ఉండే పురుషార్థము చేసినప్పుడు సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది, ఆయుష్షు కూడా యోగబలము ద్వారా పెరుగుతుంది. మీరిప్పుడు దైవీగుణాలను ధారణ చేస్తారు, అవి అర్థకల్పము నడుస్తాయి. ఈ ఒక్క జన్మలోనే మీరెంత పురుషార్థము చేస్తారంటే, ఇక మీరు వెళ్ళి ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. మరి ఎంత పురుషార్థము చేయాలి. ఇందులో పొరపాట్లు చేయకూడదు మరియు సమయాన్ని వృథా చేయకూడదు, ఎవరైతే చేస్తారో వారే పొందుతారు. తండ్రి శిక్షణనిస్తూ ఉంటారు. మనము కల్ప-కల్పము విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు, ఇంత తక్కువ సమయములోనే అద్భుతం చేసేస్తారు. మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. ఇది తండ్రికి పెద్ద విషయమేమీ కాదు. కల్ప-కల్పము చేస్తారు. నడుస్తూ-తిరుగుతూ, తింటూ-తాగుతూ మీ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి అని తండ్రి అర్థము చేయిస్తారు. ఈ గుప్తమైన విషయాన్ని తండ్రియే కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తారు. మీ అవస్థను మంచిరీతిగా తయారుచేసుకుంటూ ఉండండి. లేకపోతే ఉన్నతమైన పదవిని పొందరు. పిల్లలైన మీరు నంబరువారు పురుషార్థానుసారంగా శ్రమ చేస్తారు. ఇప్పుడు మనము తీరంలో నిలబడి ఉన్నామని భావిస్తారు. మళ్ళీ మనం వెనుకకు ఎందుకు చూడాలి? అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఇందులో చాలా అంతర్ముఖత కావాలి, అందుకే తాబేలు ఉదాహరణ కూడా ఉంది. ఈ ఉదాహరణలు మొదలైనవన్నీ మీ కొరకే ఉన్నాయి. సన్యాసులైతే హఠయోగులు, వారు రాజయోగాన్ని నేర్పించలేరు. వారు వింటే, వీళ్ళు మమ్మల్ని అవమానపరుస్తున్నారని భావిస్తారు కనుక ఇవి కూడా యుక్తిగా వ్రాయాలి. తండ్రి తప్ప ఎవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారికి ఆలోచన నడవకుండా - ఇండైరెక్టుగా చెప్పడం జరుగుతుంది. యుక్తిగా నడుచుకోవాలి కదా, పాము కూడా మరణించాలి, కర్ర కూడా విరగకూడదు. కుటుంబ పరివారము మొదలైన వారందరి పట్ల ప్రీతినుంచాలి కానీ బుద్ధియోగము తండ్రితో జోడించాలి. ఇప్పుడు మనము ఒక్కరి మతంపైనే ఉన్నామని మీకు తెలుసు. ఇది దేవతలుగా అయ్యే మతము, దీనినే అద్వైత మతమని అంటారు. పిల్లలు దేవతలుగా అవ్వాలి. మీరు ఎన్నిసార్లు అయ్యారు? అనేకసార్లు. ఇప్పుడు మీరు సంగమయుగములో నిలబడి ఉన్నారు. ఇది అంతిమ జన్మ. ఇప్పుడిక వెళ్ళాలి. వెనుకకు ఎందుకు చూడాలి. చూస్తున్నా కూడా మీరు మీ స్థిరత్వంలో నిలబడి ఉండండి. గమ్యాన్ని మర్చిపోకూడదు. మీరే మాయపై విజయాన్ని పొందే మహావీరులు. ఈ గెలుపు-ఓటముల చక్రం తిరుగుతూనే ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబాది ఎంత అద్భుతమైన జ్ఞానము. స్వయాన్ని బిందువుగా భావించాలి అని ఇంతకుముందు తెలుసా, ఇంత చిన్న బిందువులో మొత్తం పాత్ర రచింపబడి ఉంది, ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనది. కేవలం అద్భుతము అని వదిలేయాల్సి ఉంటుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వెనుకకు తిరిగి చూడకూడదు. ఏ విషయములోనూ ఆగిపోకూడదు. ఒక్క తండ్రి వైపు చూస్తూ తమ స్థితిని ఏకరసంగా ఉంచుకోవాలి.

2. ఇప్పుడు మేము తీరంలో నిలబడి ఉన్నామని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఇంటికి వెళ్ళాలి, పొరపాట్లను విడిచిపెట్టాలి. తమ స్థితిని తయారుచేసుకునేందుకు గుప్తమైన శ్రమ చేయాలి.

వరదానము:-

విహంగ మార్గపు సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేసే సత్యమైన సేవాధారి భవ

విహంగమార్గపు సేవ చేసేందుకు సంగఠిత రూపంలో "రూప్ మరియు బసంత్” ఈ రెండు విషయాల బ్యాలెన్స్ కావాలి. ఎలాగైతే బసంత్ రూపంతో ఒకే సమయంలో అనేక ఆత్మలకు సందేశమునిచ్చే కార్యము చేస్తారో, అదే విధంగా రూప్ అనగా స్మృతి బలం ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల బలం ద్వారా విహంగమార్గపు సేవ చేయండి. దీని ఆవిష్కరణ కూడా చెయ్యండి. దీనితో పాటు సంగఠిత రూపంలో, దృఢ సంకల్పంతో పాత సంస్కారాలను, స్వభావాలను మరియు పాత నడవడిక అనే నువ్వులు మరియు యవలను యజ్ఞములో స్వాహా చేసినట్లైతే విశ్వపరివర్తన కార్యం సంపన్నమవుతుంది మరియు యజ్ఞం యొక్క సమాప్తి అవుతుంది.

స్లోగన్:-

బాలక మరియు యజమానత్వం యొక్క బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకురండి.