21-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - దేవతల కన్నా కూడా ఉన్నతమైనది మీ ఈ బ్రాహ్మణ జీవితము ఎందుకంటే ఈ సమయంలో మీకు మూడు లోకాలు మరియు మూడు కాలాల గురించి తెలుసు, మీరు ఈశ్వరీయ సంతానము

ప్రశ్న:-

పిల్లలైన మీరు ఇప్పుడు ఏ ఉన్నతమైన ఎత్తుకు ఎక్కుతారు?

జవాబు:-

మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము, ఇది ఎత్తైన గమ్యము, దాని పైకి మీరు ఎక్కుతున్నారు. ఎక్కితే ప్రేమ రసాన్ని పొందుతారు... అని అంటారు కూడా. ఇది చాలా ఎత్తయినది. కానీ ఆశ్చర్యమేమిటంటే, ఎక్కడము ఒక్క క్షణంలో ఎక్కుతారు, దిగడానికి సమయం పడుతుంది.

ప్రశ్న:-
పాపపు కుండ పగలడంతోనే జయ జయకారాలు జరుగుతాయి, దీనికి భక్తి మార్గంలో ఏ గుర్తు ఉంది?

జవాబు:-
కుండ నుండి సీత వెలువడినట్లుగా చూపిస్తారు అనగా ఎప్పుడైతే పాపపు కుండ నిండిపోయి పగులుతుందో, అప్పుడు సీత మరియు రాధే యొక్క జన్మ జరుగుతుంది.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి... (ఇస్ పాప్ కీ దునియా సే...)

ఓంశాంతి

మధురాతి-మధురమైన పిల్లలు భక్తి మార్గం యొక్క పాటను విన్నారు. ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి, అశాంతి యొక్క ప్రపంచము నుండి శాంతి ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. బుద్ధిలో కూర్చుంది, ఇంకొక ప్రపంచం ఉండేది, అక్కడ శాంతి కూడా ఉండేది, సుఖం కూడా ఉండేది. మహారాజ, మహారాణి, లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది, వారి చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనుష్యులు ఏ చరిత్ర-భౌగోళికాలనైతే చదువుతారో, అది కేవలం పావు వంతు ప్రపంచానిది. అర్ధకల్పానిది కూడా కాదు. సత్య-త్రేతా యుగాల గురించైతే ఎవ్వరికీ తెలియదు. కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఒంటి కన్నువారిగా ఉన్నారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. ప్రపంచము ఎంత పెద్దది. కొత్త ప్రపంచం ఎప్పుడు ప్రారంభమయ్యింది, మళ్ళీ ఎప్పుడు పాతదిగా అవుతుంది, మళ్ళీ పాతదాని నుండి కొత్తదిగా ఎప్పుడు అవుతుంది, ఇవి పిల్లలైన మీకిప్పుడు తెలుసు. తయారవ్వడమైతే తప్పకుండా తయారవుతుంది కదా. బంగారం, వెండి, రాగి, ఇనుములలోనికి రావాల్సిందే. కలియుగము తర్వాత సత్యయుగము మళ్ళీ తప్పకుండా వస్తుంది. సంగమములో సత్యయుగ స్థాపన చేసేవారు వస్తారు. ఇవి అర్థం చేయించేందుకు గొప్ప యుక్తులు. కలియుగాన్ని సత్యయుగంగా చేసేవారు తండ్రి మాత్రమే. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవరి బుద్ధిలోకి రావు ఎందుకంటే బుద్ధికి మాయ యొక్క తాళం వేయబడి ఉంది. పరమపిత పరమాత్మ యొక్క మహిమను కూడా పాడుతారు, ఓ పరమపిత పరమాత్మ, బుద్ధివంతులకు బుద్ధి మీరు. బుద్ధిహీనులకు మీరు బుద్ధినివ్వండి. మిగిలినవారందరూ ఆసురీ మతాన్ని ఇచ్చేవారు, శ్రేష్ఠ మతాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులు పాడుతారు కానీ ఏమీ అర్థం చేసుకోరు.

పిల్లలైన మీకిప్పుడు మూడు లోకాల జ్ఞానం ఉంది. కేవలం ప్రపంచ జ్ఞానమే కాదు, మీకు ప్రపంచం కన్నా ఎక్కువ తెలుసు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, ఈ మూడు లోకాల జ్ఞానం బుద్ధిలో ఉంది. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో, వారి బుద్ధిలో ఉంది. మీరు స్కూలులో చదువుతారు, కావున చదువు పూర్తి రీతిగా బుద్ధిలో ఉండాలి. మూడు కాలాల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. మీరు త్రికాలదర్శిగా అవుతారు. మిమ్మల్ని త్రిలోకనాథులు అని అనరు. త్రిలోకనాథులుగా ఎవ్వరూ అవ్వరు. త్రికాలదర్శి అన్న పదము సరైనది. మూడు లోకాలు, మూడు కాలాల గురించి మీకు తెలుసు. తప్పకుండా మనం మూలవతనంలో ఉంటాము. ఆత్మలైన మనం అక్కడ నివసించేవారము. ఈ జ్ఞానం ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. పరమపిత పరమాత్మ త్రికాలదర్శి అని మీకు తెలుసు. ఆది మధ్యాంతాలు, మూడు కాలాల గురించి మరియు మూడు లోకాల గురించి వారికి తెలుసు. లక్ష్మీ-నారాయణులను వైకుంఠనాథులు అని అనవచ్చు, త్రిలోకనాథులు అని అనరు. వారు హెవెన్ కు లేక స్వర్గానికి యజమానులు. తండ్రిని స్వర్గానికి యజమాని అని అనలేరు. కావున ఇవి కూడా అర్థం చేసుకునే విషయాలు. పరమాత్మ వంటి మనుష్యులెవ్వరూ ఉండజాలరు. పరమాత్మను సర్వము తెలిసినవారు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు కూడా, కానీ అర్థం తెలియదు. సర్వము తెలిసినవారు కావున అందరి మనసులో ఏముందో తెలిసి ఉంటుంది అని భావిస్తారు. వారిని సర్వవ్యాపి అని అంటూ నిందిస్తారు.

ఇప్పుడు మీరు ఈశ్వరీయ వంశావళి, తర్వాత దైవీ వంశావళిగా అవుతారు. ఈశ్వరుడు గొప్పవారా లేక సత్యయుగ దేవతలు గొప్పవారా? ఆ దేవతల కన్నా గొప్పవారు సూక్ష్మవతనవాసులైన దేవతలు. సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మాను గొప్పవారు అని అంటారు కదా! వారు ఉన్నదే అవ్యక్తముగా. వీరైతే వ్యక్తముగా ఉన్నారు కదా. వీరు ఎప్పుడైతే పావన ఫరిశ్తాగా అవుతారో, అప్పుడు మహిమ ఉంటుంది. బ్రాహ్మణులకు ఇప్పుడే అలంకారాలు ఇచ్చినట్లయితే వారికి ఆ అస్త్ర శస్త్రాలు శోభించవు, అందుకే విష్ణువుకు స్వదర్శన చక్రాన్ని చూపిస్తారు. శంఖము, చక్రము, గద, పద్మము, ఇప్పుడు వీటి అర్థాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణులకైతే అస్త్ర శస్త్రాలను చూపించరు. ఇది ఇప్పటి విషయము. వాస్తవానికి ఇవి జ్ఞానం యొక్క అస్త్ర శస్త్రాలు. స్థూలమైన ఆయుధాల విషయమే లేదు. శాస్త్రాలలోనైతే స్థూలమైన ఆయుధాలు మొదలైనవి ఉన్నాయి. పాండవులు మరియు కౌరవుల సైన్యాన్ని చూపించారు, కానీ అందులో స్త్రీలను చూపించలేదు. పాండవ సైన్యంలో పురుషులను చూపిస్తారు. మరి శక్తి సైన్యము ఏమయ్యింది. వీరు గుప్తముగా ఉన్నారు. ఈ శివ శక్తులు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియనే తెలియదు. వీరి కథనేమీ చూపించరు. శక్తులు ఎలా యుద్ధం చేసారు! సైన్యాన్ని అయితే చూపిస్తారు కదా! ఎవ్వరికీ అర్థము కాదు, ఎవరు ఏం చెప్తే దానిని రాసేసారు. యథార్థ రీతిలో ఇప్పుడు మీకు తెలుసు. మనమందరము పాత్రధారులము. ప్రతి ఒక్క ఆత్మకు తన పాత్ర లభించి ఉంది. బాబా, ఎవరినైతే రచయిత, డైరెక్టర్, ముఖ్యమైన పాత్రధారి అని అంటారో, వారి ద్వారా మీరు మొత్తం డ్రామా రహస్యాన్ని తెలుసుకున్నారు. ఇందులో 4 యుగాలు ఉన్నాయి అనగా 4 భాగాలు ఉన్నాయి, వీటిని యుగాలు అని అంటారు. వాస్తవానికి 5 ఉన్నాయి, ఐదవది ఈ కళ్యాణకారీ యుగము. సత్యయుగము మరియు త్రేతా యొక్క సంగమాన్ని కళ్యాణకారి అని అనరు ఎందుకంటే దిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సతోప్రధానము, సతో, రజో, తమో, ఇవి మెట్లు. కావున మెట్లు దిగాల్సే ఉంటుంది. జ్ఞానములో మీరు ఒక్కసారే వేగంగా ముందుకు వెళ్తారు, ఆ తర్వాత పైకి ఎక్కిన మెట్లను దిగుతూనే ఉంటారు. మెట్లు దిగడము చాలా సహజంగా ఉంటుంది. ఎక్కడంలో చాలా కష్టము ఉంటుంది. మీరు ఎంత శ్రమిస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము ఎత్తుకు ఎక్కడము కదా. పైకి ఎక్కితే ప్రేమ రసాన్ని పొందుతారు అని అంటారు కదా. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నామని మీకు తెలుసు. మళ్ళీ పడిపోయినట్లయితే ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా అవుతారు. ఎంత సమయం పడుతుంది! ఇది చాలా ఎత్తుకు ఎక్కడము. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాము, మళ్ళీ దిగిపోతామని మీకు తెలుసు. పైకి ఎక్కడానికి క్షణం పడుతుంది, చివరిలో వచ్చేవారు క్షణంలో పైకి ఎక్కగలరు. అబలలు, మాతలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. బాబా, వివస్త్రగా అవ్వకుండా రక్షించండి అని పిల్లలు పిలుస్తారు. చాలామంది పిల్లలు ఉన్నారు. అబలలపై అత్యాచారాలు చాలా జరుగుతాయి, అబలలను కొట్టినప్పుడు పాపపు కుండ నిండుతుంది, అది నిండిపోయి పగులుతుంది. కుండ నుండి సీత వెలువడినట్లు చూపిస్తారు కదా. ఇప్పుడు సత్యాతి-సత్యమైన సీతలైన మీరు వెలువడుతున్నారు. రాధే కూడా వెలువడ్డారు, సీత కూడా వెలువడ్డారు. రఘుపతి రాఘవ రాజా రామ అని రాయడంతో సీత పేరును కూడా వేసేసారు. జగదంబ, జగత్పితలే మళ్ళీ రాజ-రాజేశ్వరునిగా, రాజ-రాజేశ్వరిగా అవుతారు. వీరే లక్ష్మీ-నారాయణులుగా ఉండేవారు, మళ్ళీ అంతిమంలో ఏమవుతారో చూడండి! సత్యయుగంలో ఏమీ 33 కోట్ల మంది మనుష్యులు ఉండేవారు కారు. అక్కడైతే చాలా కొద్దిమంది ఉంటారు. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. దైవీ సంప్రదాయంవారే పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మళ్ళీ ఆసురీ సంప్రదాయంవారిగా అవుతారు. ఇప్పుడు ఆసురీ సంప్రదాయాన్ని మళ్ళీ దైవీ సంప్రదాయంగా చేస్తున్నారు. కల్ప-కల్పము తయారుచేస్తారు. మీ బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేసింది. మీరే త్రికాలదర్శిగా అవుతారు. మీకు మూడు లోకాల జ్ఞానం కూడా లభించింది. మీరంటారు, మేము పూజ్యులుగా, వైకుంఠనాథునిగా ఉండేవారము, ఇప్పుడు పూజారులుగా నరకం యొక్క నాథులుగా అయ్యాము. హమ్ సో కు యథార్థమైన అర్థము తెలియని కారణంగానే ఆత్మే పరమాత్మ అని అంటారు. ఎంత తేడా చేసేసారు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలను ఇప్పుడు మీకు అర్థం చేయించారు. మీరు ఈ అనంతమైన చక్రాన్ని కూడా తెలుసుకున్నారు. మూడు లోకాలు, మూడు కాలాల గురించి కూడా మీకు తెలుసు.

ఈ గుప్తమైన విషయాలను తండ్రి చదివిస్తారు. గీతలో ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటాయా అన్నది ఎవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానం ఎవరి వద్దనైతే ఉంటుందో, వారే నేర్పిస్తారు. మళ్ళీ వారి పాత్రను ఆ సమయంలోనే రిపీట్ చేస్తారు. క్రైస్టు తమ పాత్రను తమ సమయానికే రిపీట్ చేస్తారు. మనం సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్యులుగా, శూద్రవంశీయులుగా అవుతామని మీకు తెలుసు. చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇస్లాములు, బౌద్ధులు మళ్ళీ తమ పాత్రను రిపీట్ చేస్తారు. ఎప్పుడైతే ఒక్క దేవీ-దేవతా ధర్మం ఉంటుందో, అప్పుడు మిగిలిన ధర్మాలు ఉండవు. ప్రపంచమైతే ఒక్కటే. తండ్రి రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు, ప్రతి మనిషి హద్దు యొక్క బ్రహ్మా. పిల్లలను రచిస్తారు, తర్వాత వారి పాలన చేస్తారు. రచనకు వారసత్వము రచయిత అయిన తండ్రి నుండి లభిస్తుంది. సోదరుడు, సోదరునికి వారసత్వమిస్తారు అని ఎప్పుడైనా విన్నారా? ఒకరేమో హద్దు తండ్రి, వారి గురించైతే అందరికీ తెలుసు. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. లౌకిక టీచరు చదివిస్తారు, చదివించడం ద్వారా ఎవరైనా మొత్తం సృష్టికి యజమానిగా అవుతారా, ఇది అనంతమైన విషయము. హద్దులోని వారందరూ ఆ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. వారిని బాబా, శివబాబా అనే అంటారు. రచయితను బాబా అని అంటారు కదా. కేవలం బాబా అన్నది సాధారణమైన పేరు, అందుకే శివబాబా అని అంటారు. వారు ఉన్నదే నిరాకారుడు. శివబాబాతో మీకు ఏం సంబంధం ఉంది? అని అడగడం జరుగుతుంది. శివబాబా జోలిని నింపండి, అని అంటారు కదా. బాబాకు శివ అన్న పేరు ఖచ్ఛితమైనది. శంకరుని చిత్రము వేరు. శివుడు మరియు శంకరుడు, ఇద్దరినీ కలిపి శివ-శంకరులు అని అనడము, ఇదైతే చాలా పెద్ద పొరపాటు. ఉన్నతోన్నతమైన తండ్రిని మర్చిపోయారు. చిత్రాలు చాలా బాగున్నాయి. బ్రహ్మా ద్వారా ఇప్పుడు స్థాపన జరుగుతుంది. జ్ఞానం కూడా ఇప్పుడు లభిస్తుంది. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణులు ఎక్కడ నుండి వచ్చారు? వారిని దత్తత తీసుకుంటాను. బ్రహ్మాను కూడా దత్తత తీసుకున్నాను. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు జన్మించారు. మీకు తెలుసు, ఇప్పుడు మనం ప్రజాపిత బ్రహ్మాకుమారులము-కుమారీలము. ప్రజాపిత అన్న పదాన్ని తప్పకుండా రాయాలి. కేవలం బ్రహ్మా అని అంటే బ్రహ్మా పేరైతే చాలామందికి ఉంది. ప్రజాపిత బ్రహ్మా పేరు అయితే ఎవ్వరికీ ఉండదు. వీరైతే మనిషి కదా. రుద్రుడైన శివబాబా ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణులుగా ఎలా అవుతారో మీకు తెలుసు. యజ్ఞము బ్రాహ్మణుల ద్వారా రచించబడుతుంది. బ్రాహ్మణులైన మీరు మళ్ళీ దేవతలుగా అవ్వాలి. తర్వాత ఈ సృష్టిలోకి రావాలి, తర్వాత వీరందరూ ఎక్కడికి వెళ్తారు? ఈ రుద్రజ్ఞాన యజ్ఞములో అందరూ స్వాహా అయిపోతారు. పాత ప్రపంచం యొక్క ఆహుతి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో జరుగుతుంది. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారానే వినాశజ్వాల వెలువడింది. శంకరుని ద్వారా వినాశనము అని అంటూ ఉంటారు. గుర్తులు కూడా తప్పకుండా చూస్తారు. ఇది ఖచ్ఛితంగా అదే సమయము. యూరప్ వాసులైన యాదవులు, కౌరవులు మరియు పాండవులు అని అంటూ ఉంటారు. భారతవాసులు తమ ధర్మాన్నే మర్చిపోయారు. చిత్రాలు కూడా ఉన్నాయి కానీ ఎవ్వరికీ తెలియదు. దేవీ-దేవతల రాజ్యం ఉండేది కానీ వారికి ఈ రాజ్యం ఎవరు ఇచ్చారు? దేవీ-దేవతా ధర్మ స్థాపన ఎలా జరిగింది? ఇది అసలు తెలియనే తెలియదు. ఎవరైతే ధర్మ స్థాపన చేస్తారో, వారే అర్థం చేయిస్తారు. ఇతరులెవ్వరూ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలను అర్థం చేయించలేరు. మూడు లోకాల జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. అందరి పాత్రను మీరు అర్థం చేసుకున్నారు. వీరందరూ మళ్ళీ తమ సమయానికి పాత్రను అభినయించడానికి వస్తారు. మున్ముందు మీ మహిమ కూడా పెరుగుతూ ఉంటుంది. వృద్ధి త్వరగా జరుగుతుంది. కావున ఎంత పెద్ద భవనాలు నిర్మించవలసి వస్తుంది. డ్రామాలో పాత్ర ఉంది. ఎంతమంది పిల్లలు వస్తారు అన్నది మీరు అర్థం చేసుకుంటారు. వృద్ధి చెందుతూనే ఉంటారు. శిక్షణ తీసుకునేందుకు వస్తారు కూడా. ఇకపోతే, కేవలం విహరించేందుకు చాలామంది వస్తారు. ఎవరైనా ఎడ్యుకేషన్ మినిస్టరు మొదలైనవారు వచ్చారనుకోండి, వారికి కూడా జ్ఞానము అర్థం చేయించాలి. మనది ప్రపంచపు చరిత్ర-భౌగోళికము. మొత్తం కల్పం యొక్క చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరుని ద్వారా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనంతమైన చరిత్ర-భౌగోళికాలను చదవాలి మరియు చదివించాలి. సర్వ అలంకారాలను ధారణ చేసేందుకు పావన ఫరిశ్తాలుగా అవ్వాలి.

2. బుద్ధివంతులకు బుద్ధివంతుడు తండ్రి ఒక్కరే, వారి శ్రీమతముపైనే నడుచుకుంటూ బుద్ధివంతులుగా అవ్వాలి. ఈ బ్రాహ్మణ జీవితం అమూల్యమైనది - ఈ నషాలో ఉండాలి.

వరదానము:-

రంగు మరియు రూపముతో పాటు సంపూర్ణ పవిత్రత యొక్క సుగంధాన్ని ధారణ చేసే ఆకర్షణమూర్త భవ

బ్రాహ్మణులుగా అవ్వడంతో అందరిలో రంగు కూడా వచ్చింది మరియు రూపం కూడా పరివర్తన అయింది కానీ సుగంధం నంబరువారుగా ఉంది. ఆకర్షణమూర్తులుగా అయ్యేందుకు రంగు మరియు రూపంతో పాటు సంపూర్ణ పవిత్రత యొక్క సుగంధం కావాలి. పవిత్రత అనగా కేవలం బ్రహ్మచారి అని కాదు కానీ దేహం యొక్క ఆకర్షణ నుండి కూడా అతీతముగా ఉండడము. మనసు తండ్రిపై తప్ప మరే విధమైన ఆకర్షణలోకి వెళ్ళకూడదు. తనువు ద్వారా కూడా బ్రహ్మచారి, సంబంధంలో కూడా బ్రహ్మచారి మరియు సంస్కారాలలో కూడా బ్రహ్మచారి - ఇటువంటి సుగంధభరితమైన ఆత్మిక గులాబీలే ఆకర్షణమూర్తులుగా అవుతారు.

స్లోగన్:-

యథార్థ సత్యాన్ని గ్రహించినట్లయితే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయడము సహజమవుతుంది.