22-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
“మధురమైనపిల్లలూ - ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయము,
భారతదేశము నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది, మీరు తండ్రి నుండి సత్యయుగీ
రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకోండి”
ప్రశ్న:-
తండ్రికి గల ఏ టైటిల్ శ్రీకృష్ణునికి ఇవ్వలేము?
జవాబు:-
తండ్రి పేదల పెన్నిధి. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారు చాలా
ధనవంతుడు, వారి రాజ్యములో అందరూ షావుకార్లుగా ఉంటారు. తండ్రి వచ్చినప్పుడు భారతదేశము
అందరికన్నా నిరుపేదగా ఉన్నది. భారతదేశాన్నే షావుకారుగా తయారుచేస్తారు. మన భారతదేశము
స్వర్గముగా ఉండేది, ఇప్పుడు అలా లేదు, మళ్ళీ ఆ విధంగా తయారవ్వనున్నదని మీరంటారు.
పేదల పెన్నిధి అయిన బాబానే భారతదేశాన్ని స్వర్గముగా తయారుచేస్తారు.
గీతము:-
చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది..... (ఆఖర్ వహ్ దిన్
ఆయా ఆజ్.....)
ఓంశాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము
ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తమైనది. ఆత్మ
తప్పకుండా ఉంటుంది కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంటుంది, అందుకే ఆత్మ గుప్తమైనదని అంటారు.
ఆత్మ స్వయంగా అంటుంది - నేను నిరాకారుడిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తముగా
అయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము, అక్కడ గుప్తముగా ఉండే విషయమేమీ లేదు. పరమపిత
పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతాతి ఉన్నతమైన
ఆత్మ, అతీతముగా ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో,
అలాగే నేను కూడా గుప్తముగా రావలసి ఉంటుంది, నేను గర్భ జైలులోకి రాను. నాకు శివ అన్న
ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది, నేను ఈ తనువులోకి వచ్చినా కూడా నా పేరు మారదు, వీరి
ఆత్మ యొక్క శరీరానికి పేరు మారుతుంది, నన్ను శివ అనే అంటారు - నేను ఆత్మలందరికీ
తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు, ఈ శరీరం ద్వారా కర్మలు
చేస్తారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. కనుక ఆత్మ ఈ శరీరంతో కప్పబడి ఉంది అన్న ఈ
జ్ఞానము పిల్లలకు ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తమైనది, శరీరము ప్రత్యక్షముగా
ఉంటుంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు, మీరు
కూడా గుప్తమైనవారే, శరీరము ద్వారా వింటారు. భారతదేశాన్ని మళ్ళీ నిరుపేద నుండి
షావుకారుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మా భారతదేశమని మీరంటారు.
మా గుజరాత్, మా రాజస్థాన్ అని ప్రతి ఒక్కరు తమ రాష్ట్రాలను గురించి అంటారు. మాది
మాది అని అనడంతో దాని పట్ల మోహము కలుగుతుంది. మన భారతదేశము నిరుపేదగా ఉందని అని
అందరూ అనుకుంటారు, కానీ మన భారతదేశము షావుకారుగా ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది అనేది
వారికి తెలియదు. పిల్లలైన మీకు చాలా నషా ఉంటుంది. మన భారతదేశము చాలా షావుకారుగా
ఉండేది, దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగములో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు, ఒక్క
దేవీ దేవతా ధర్మమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళము ఎవ్వరికీ
తెలియదు, ఇప్పుడు మీరు మంచి రీతిగా అర్థము చేసుకున్నారు. మన భారతదేశము చాలా
షావుకారుగా ఉండేది, ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది, ఇప్పుడు మళ్ళీ షావుకారుగా
తయారుచేయడానికి బాబా వచ్చారు. భారతదేశము సత్యయుగములో చాలా షావుకారుగా ఉండేది,
అప్పుడు దేవీదేవతల రాజ్యముండేది, ఇప్పుడు ఆ రాజ్యము ఏమైపోయింది అనేది ఎవ్వరికీ
తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని
అనేవారు. సత్యయుగములో కూడా దేవీదేవతలకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము
ఉండేది కాదని తండ్రి అంటారు. మేము మెట్లు దిగుతూ కలియుగములోకి వెళ్ళిపోతామని, ఒకవేళ
దేవతలకు కూడా ఈ జ్ఞానమున్నట్లయితే, వారికి రాజ్యాధికారము యొక్క సుఖము ఉండదు, చింత
కలుగుతుంది. మేము సతోప్రధానముగా ఉండేవారిమి, ఇప్పుడు మళ్ళీ మేము సతోప్రధానముగా ఎలా
అవ్వాలనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మేము నిరాకారీ ప్రపంచములో ఉండేవారిమి, అక్కడ
నుండి మళ్ళీ సుఖధామములోకి ఎలా వచ్చాము అన్న జ్ఞానము కూడా మీకు ఉంది. ఇప్పుడు మనము
ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారముగా ప్రతి ఒక్క పాత్రధారి
నంబరువారుగా తమ తమ సమయానికి వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిధి అని ఎవరిని
అంటారు అన్నది పిల్లలైన మీకిప్పుడు తెలుసు, ఈ ప్రపంచానికి తెలియదు. పాటలో కూడా
విన్నారు - భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో, చివరికి ఆ రోజు నేడు వచ్చింది.....
భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము నుండి విడిపించి సద్గతిలోకి
తీసుకువెళ్తారు అన్నది మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. బాబా ఈ శరీరంలోకి మళ్ళీ
వచ్చేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా వస్తారు. నేను
కృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది,
వారి అనేక జన్మల అంతిమములో ఇది అంతిమ జన్మ అని తండ్రి అంటారు. ఎవరైతే మొదటి నంబరులో
ఉండేవారో, వారిప్పుడు చివరిలో ఉన్నారు, తతత్వమ్. నేను సాధారణ తనువులోకి వస్తాను,
మీరు 84 జన్మలను ఎలా అనుభవించారు అన్నది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు
కూడా ఏక్ ఓంకార్, పరమపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు, వారు తప్పకుండా
మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. మరి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు.
ఎవరైతే ఇంతకుముందు దేవతలుగా అయ్యి ఉంటారో, వారు బాబాకు పూర్తిగా అతుక్కుపోతారు.
స్వయాన్ని దేవీదేవతా ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల
చరిత్ర చాలా చిన్నది, కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరి కొందరిది 1250 సంవత్సరాల
చరిత్ర. మీ చరిత్ర 5 వేల సంవత్సరాలది. దేవతా ధర్మము వారే స్వర్గములోకి వస్తారు, ఇతర
ధర్మాల వారు తర్వాతే వస్తారు. దేవతా ధర్మము వారు కూడా డ్రామానుసారముగా ఇప్పుడు ఇతర
ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి తమ తమ ధర్మాలలోకి తిరిగి
వస్తారు.
తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా
స్వర్గ స్థాపన చేసేటువంటివారు, మరి మేము స్వర్గములో ఎందుకు ఉండము, మేము తండ్రి నుండి
తప్పకుండా వారసత్వమును తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు మన
ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది, అలా కాని వారు ఇక్కడకు రానే రారు. పరాయి
ధర్మములోకి మేము ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో దేవతలకు
చాలా సుఖముండేదని, అక్కడ బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ
మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరమంతటి భారీ
మందిరము ఇంకేదీ ఉండదు, అందులో చాలా వజ్ర వైఢూర్యాలుండేవి. బుద్ధుడు మొదలైనవారికి
వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రైతే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతంగా
తయారుచేసారో, వారికి మీరు ఎంత గౌరవాన్నిచ్చారు! గౌరవాన్ని ఇస్తారు కదా. మంచి కర్మలు
చేసి వెళ్ళారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతితపావనుడైన తండ్రియే చేసి
వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవ అనంతమైన తండ్రి వచ్చి
చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి
రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారతదేశమును స్వర్గముగా తయారుచేస్తారో,
వారినిప్పుడు ఎవరూ గౌరవించడము లేదు. ఉన్నతాతి ఉన్నతమైన మందిరము అని గాయనం చేయబడిన
దానిని దోచుకొని వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవ్వరూ
దోచుకోలేదు, సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో కూడా చాలా
ధనవంతులుంటారు. రాజుల్లో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి
గలవారుంటారో, వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బారులో కూడా
నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు
ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది - వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్ళు కూడా
అంత బాగుంటాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని
ఇప్పుడు మీకు తెలుసు. మనము స్వర్గము యొక్క మహారాజా-మహారాణులుగా అవుతాము, మళ్ళీ
పడిపోతూ పడిపోతూ భక్తులుగా అవుతాము, అప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము.
ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా చేశారో, వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా
షావుకార్లుగా చేస్తారు. ఇప్పుడు భారతదేశము ఎంత పేదగా ఉంది, ఏ భూమినైతే ఇంతకుముందు
500 రూపాయలకు తీసుకున్నామో, ఈ రోజు దాని విలువ 5000 కన్నా కూడా ఎక్కువైపోయింది.
ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడ భూమికి ధర ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత
తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది, మధురమైన నదుల వద్ద మీ మహళ్ళు ఉంటాయి. మనుష్యులు
చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది, మంచి-మంచి ఫలాలు, పుష్పాలు లభిస్తూ
ఉంటాయి. ఇప్పుడు ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది, అయినా అన్నము లభించదు, మనుష్యులు చాలా
ఆకలి దప్పికలతో మరణిస్తారు. పాట వింటూనే మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని
పేదల పెన్నిధి అని అంటారు, పేదల పెన్నిధి అంటే అర్థము తెలుసు కదా! ఎవరిని
షావుకార్లుగా తయారుచేస్తారు? వారు ఎక్కడికైతే వస్తారో, తప్పకుండా అక్కడున్నవారినే
షావుకార్లుగా తయారుచేస్తారు కదా. మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల
సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితము నుండి
పావనముగా తయారుచేస్తారు, ఉన్నతాతి ఉన్నతముగా తయారుచేస్తారు, ఒక్క సెకండులో
జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, మేము మీ వారము అని అంటారు. తండ్రి అంటారు - పిల్లలూ,
మీరు విశ్వానికి యజమానులు. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు, ఎంత సంతోషము
కలుగుతుంది. కూతురిని చూస్తే ముఖము క్రిందకు దించుకుంటారు. ఇక్కడైతే ఆత్మలందరూ
కొడుకులు. 5 వేల సంవత్సరాల క్రితము మేము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు
తెలిసింది. అలా బాబా మనల్ని తయారుచేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు
ఎప్పుడు వచ్చారు అన్నది తెలియదు. లక్ష్మీనారాయణుల రాజ్యముండేదని కూడా ఎవ్వరికీ
తెలియదు. శివజయంతిని జరుపుకుంటారు, కేవలం లింగాన్ని పెట్టి పెద్ద పెద్ద మందిరాలను
నిర్మిస్తారు. కానీ వారు ఎలా వచ్చారు, వచ్చి ఏమి చేశారు అన్నది ఏమీ తెలియదు, దీనిని
అంధ విశ్వాసము, అంధ శ్రద్ధ అని అంటారు. మన ధర్మము ఏది, ఎప్పుడు స్థాపించబడింది అనేది
వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మము గురించి తెలుసు, బుద్ధుడు ఎప్పుడు
వచ్చారు, తిథి-తారీఖులు ఏమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివబాబాకు,
లక్ష్మీనారాయణులకు ఎటువంటి తిథి, తారీఖులు లేవు. 5 వేల సంవత్సరాల విషయాన్ని లక్షల
సంవత్సరాలని వ్రాసేశారు, లక్షల సంవత్సరాల విషయమైతే ఎవరికైనా గుర్తు వస్తుందా.
భారతదేశంలో దేవీదేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల
లెక్కలోనైతే భారతదేశ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి, భారతదేశ భూభాగము కూడా
అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు,
ఇప్పటికి లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయి ఉండాలి. కానీ అంతమంది లేరు, ఇంకా జనాభా
తగ్గిపోయింది. ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇవి మనుష్యులు
వింటారు, విని ఈ విషయాలను మేము ఎప్పుడూ వినలేదు, ఏ శాస్త్రములోనూ చదవలేదు అని అంటారు.
ఇవి అద్భుతమైన విషయాలు.
ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రం యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల
అంతిమములో కూడా అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు, వీరు సతోప్రధానముగా ఉండేవారు,
ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు
శిక్షణ లభిస్తుంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరము ఊగుతుంది ఎందుకంటే
ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు తీసుకుంటాము, 84 జన్మలలో
తప్పకుండా 84 తల్లిదండ్రులు లభించి ఉంటారు, ఇది కూడా లెక్క కదా. మనము 84 జన్మలు
తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది, అయితే తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు.
అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేశారు అనేది తండ్రి కూర్చొని
అర్థము చేయిస్తారు. మీ విషయంలో కనీసం 84 జన్మలు అని అయినా అంటారు కానీ నా కోసమైతే
లెక్కలేనన్ని, అనేక జన్మలని అంటారు. కణకణములోకి, రాయిరప్పలలోకి నన్ను తోసేశారు.
ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. మధుర, బృందావనములో ఈ విధంగా
అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ వర్గానికి చెందినవారు ఎక్కడ
చూసినా రాధయే రాధ, నీవు రాధనే, నేను రాధనే అని అంటారు.
ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారతదేశమైతే అన్నింటికన్నా షావుకారుగా ఉండేదో,
ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయిపోయింది, అందుకే నేను భారతదేశంలోకే రావలసి
వస్తుంది. ఇది తయారై తయారవుతున్న డ్రామా, ఇందులో ఏ మాత్రం తేడా ఏర్పడజాలదు. డ్రామాలో
ఏ షూటింగ్ అయితే జరిగిపోయిందో, అది అలాగే రిపీట్ అవుతుంది, ఇందులో పైసా అంత తేడా
కూడా ఉండదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి, డ్రామా అంటే డ్రామా. అది హద్దు
డ్రామా, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు.
పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడిని మాత్రమే అనుకుంటారు, కృష్ణుడిని అనుకోరు.
కృష్ణుడైతే ధనవంతుడిగా, సత్యయుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికి తనకంటూ శరీరము
లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తారు, మీకు రాజయోగము
యొక్క శిక్షణనిస్తారు. చదువుతో బ్యారిస్టరు మొదలైనవారిగా అయి, తర్వాత సంపాదిస్తారు.
తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి
నారాయణునిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. అంతేకానీ స్వర్గము సముద్రం
నుండి బయటకు వస్తుందని కాదు. కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయములో
కంసపురి మొదలైనవి లేనే లేవు. కృష్ణుని పేరు ఎంతగా గాయనము చేయబడుతుంది, అతని తండ్రికి
అంతటి గాయనము లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? కృష్ణుడు తప్పకుండా ఎవరో ఒకరికి
కుమారుడు కదా. కృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఆ
పతితులు పూర్తిగా సమాప్తమైపోయినప్పడు అతను సింహాసనముపై కూర్చుంటారు, తన
రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, అప్పటి నుండి అతని శకము ప్రారంభమవుతుంది.
లక్ష్మీనారాయణుల నుండే శకము ప్రారంభమవుతుంది. వీరి రాజ్యము ఇంత సమయము ఉంటుంది,
తర్వాత వారిది ఇంత సమయము ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. ఈ కల్పము
యొక్క ఆయువు పెద్దదిగా ఉండదని మనుష్యులు అర్థము చేసుకుంటారు, 5 వేల సంవత్సరాల పూర్తి
లెక్క ఉంది, ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. మనం నిన్న స్వర్గానికి
యజమానులుగా ఉండేవారము, బాబాయే మనల్ని అలా తయారుచేశారు, అందుకే మనము వారి శివజయంతిని
జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. క్రీస్తు, గురునానక్ మొదలైనవారు మళ్ళీ
ఎప్పుడు వస్తారు అనేది మీకు జ్ఞానము ఉంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు యథావిధిగా రిపీట్
అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గము గురించి తెలుసు. తప్పకుండా భారతదేశము
స్వర్గముగా ఉండేది. భారతదేశము అవినాశీ ఖండము. భారతదేశానికున్న మహిమ ఎవ్వరికీ ఉండదు.
అందరినీ పతితుల నుండి పావనంగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:-
1. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను
వదిలేయాలి. సతోప్రధానంగా అవ్వాలన్న ఒకే చింతను ఉంచుకోవాలి.
2. పేదల పెన్నిధి అయిన బాబా భారతదేశాన్ని నిరుపేద నుండి షావుకారుగా
తయారుచేసేందుకు వచ్చారు, వారికి పూర్తిగా సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని
గుర్తు చేసుకుంటూ సదా సంతోషముగా ఉండాలి. వరదానము:-
ఒకేసారి మూడు రూపాలతోనూ సేవ చేసే మాస్టర్ త్రిమూర్తి భవ
ఏ విధంగా బాబా, తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు అనే
మూడు స్వరూపాలతో, సదా సేవలో ఉపస్థితులై ఉన్నారో, అదే విధంగా పిల్లలైన మీరు కూడా
ప్రతి సెకండు మనసు, వాణి మరియు కర్మ, ఈ మూడింటి ద్వారా ఒకేసారి సేవ చేయండి, అప్పుడు
మాస్టర్ త్రిమూర్తి అని అంటారు. ఎవరైతే మాస్టర్ త్రిమూర్తిగా అయి, ప్రతి సెకండు మూడు
రూపాలతోనూ సేవలో ఉపస్థితులై ఉంటారో, వారే విశ్వకళ్యాణాన్ని చేయగలరు. ఎందుకంటే ఇంత
పెద్ద విశ్వానికి కళ్యాణము చేసేందుకు, ఒకే సమయములో మూడు రూపాలతో సేవ జరగాలి, అప్పుడే
ఈ సేవా కార్యము సమాప్తమవుతుంది.
స్లోగన్:-
ఎవరైతే తమ శక్తితో చెడును మంచిలోకి మారుస్తారో, వారే
ఉన్నతమైన బ్రాహ్మణులు.
| | |