22-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ- ఏకాంతంలో కూర్చుని మీతో మీరే మాట్లాడుకోండి, నేను అవినాశి ఆత్మను, తండ్రి ద్వారా వింటున్నాను, ఈ అభ్యాసము చేయండి"

ప్రశ్న:-

ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో, వారి నోటి నుండి ఏ మాటలు వస్తాయి?

జవాబు:-

వారు అంటారు - మేము శివబాబా పిల్లలమే, స్మృతిలోనే ఉన్నాము. కాని అవన్నీ వ్యర్థ ప్రలాపాలు, అది నిర్లక్ష్యము అని బాబా అంటారు. ఇందులో పురుషార్థం చేయాలి, ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మే మాట్లాడుతుంది, ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవుతారు. దేహీ-అభిమానీ పిల్లలే స్మృతి చార్టును పెడతారు, కేవలం జ్ఞానమే చెప్తూ ఉండరు.

గీతము:-

ముఖము చూసుకో ప్రాణీ..... (ముఖుడా దేఖ్ లే ప్రాణీ.....)

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ప్రాణం అంటే ఆత్మ అని అర్థం చేయించడం జరిగింది. తండ్రి ఇప్పుడు ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు, ఈ పాట భక్తి మార్గానికి సంబంధించింది. ఇక్కడైతే కేవలం దీని సారము అర్థం చేయించబడింది. మీరిప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ భానాన్ని విడిచిపెట్టాలి. ఆత్మనైన నేను చాలా చిన్న బిందువును. నేనే ఈ శరీరం ద్వారా పాత్ర అభినయిస్తున్నాను. ఈ ఆత్మ జ్ఞానము ఎవ్వరి దగ్గరా లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి - నేను చిన్న ఆత్మను. ఆత్మనే ఈ శరీరం ద్వారా మొత్తం పాత్రను అభినయిస్తుంది, కావున దేహ-అభిమానం తొలగిపోవాలి. ఇదే శ్రమ. ఆత్మలైన మనం ఈ మొత్తం నాటకంలో పాత్రధారులం. ఉన్నతాతి ఉన్నతమైన పాత్రధారి పరమపిత పరమాత్మ. వారు కూడా ఇంత చిన్న బిందువే అని, వారి మహిమ ఎంతో గొప్పదని బుద్ధిలో ఉంటుంది. జ్ఞాన సాగరుడు, సుఖసాగరుడు. కాని చిన్న బిందువు. ఆత్మలైన మనం కూడా చిన్న బిందువులమే. దివ్యదృష్టి లేకుండా ఆత్మను చూడలేము. ఈ కొత్త-కొత్త విషయాలు ఇప్పుడు మీరు వింటున్నారు. ఇవి ప్రపంచానికి ఏమి తెలుసు. ఆత్మలైన మనం చిన్న బిందువులమని యథార్థ రీతిగా అర్థం చేసుకుని, బుద్ధిలో ఉంచుకునేవారు మీలో కూడా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మన తండ్రి ఈ డ్రామాలో ముఖ్య పాత్రధారి. ఉన్నతాతి ఉన్నతమైన పాత్రధారి తండ్రి, తర్వాత ఫలానా-ఫలానావారు వస్తారు. తండ్రి జ్ఞానసాగరుడని మీకు తెలుసు కాని శరీరం లేకుండా అయితే జ్ఞానము వినిపించలేరు. శరీరం ద్వారానే మాట్లాడగలరు. అశరీరిగా అవ్వడంతో ఇంద్రియాలు వేరైపోతాయి. భక్తిమార్గంలో అయితే దేహధారులనే స్మరిస్తారు. పరమపిత పరమాత్మ యొక్క నామం, రూపం, దేశం, కాలం గురించే తెలియదు. కేవలం పరమాత్మ నామ-రూపాలకు అతీతమని అంటారు, అంతే. తండ్రి అర్థం చేయిస్తున్నారు - డ్రామానుసారంగా నంబరువన్ సతోప్రధానంగా ఉండే మీరే, మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు మీరు మళ్ళీ ఈ స్థితిని దృఢంగా చేసుకోవాలి - నేను ఆత్మను, ఆత్మ ఈ శరీరం ద్వారా మాట్లాడుతుంది. ఆత్మలోనే జ్ఞానముంది. మన ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశిగా నిశ్చితం అయ్యి ఉందనే ఈ జ్ఞానము ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇవి చాలా కొత్త-కొత్త పాయింట్లు. ఏకాంతంలో కూర్చుని మీతో మీరు ఈ విధంగా మాట్లాడుకోవాలి - నేను ఆత్మను, తండ్రి ద్వారా వింటున్నాను. ఆత్మనైన నాలోనే ధారణ జరుగుతుంది. ఆత్మనైన నాలోనే పాత్ర నిండి ఉంది. నేను అవినాశీ ఆత్మను. ఇది లోపల బాగా వల్లె వేసుకోవాలి (అభ్యాసం చేయాలి). మనం తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. దేహ-అభిమానీ మనుష్యులకు ఆత్మ గురించి కూడా జ్ఞానం లేదు, చాలా పెద్ద-పెద్ద పుస్తకాలు వారి వద్ద పెట్టుకుంటారు. ఎంత అహంకారముంటుంది. ఇది ఉన్నదే తమోప్రధాన ప్రపంచం. ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మ అయితే ఎవ్వరూ లేరు కూడా. ఇప్పుడు మనం తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలని మీకు తెలుసు. ఈ విషయం లోలోపల వల్లె వేసుకోవాలి. జ్ఞానము వినిపించేవారైతే చాలామంది ఉన్నారు. కానీ స్మృతి లేదు. లోపల ఆ అంతర్ముఖత ఉండాలి. మనం తండ్రి స్మృతి ద్వారా పతితుల నుండి పావనంగా అవ్వాలి, కేవలం పండితులుగా అవ్వకూడదు. దీని గురించి ఒక పండితుని ఉదాహరణ కూడా ఉంది - రామ-రామ అంటే నదిని దాటేయగలరని మాతలకు చెప్పారు కాని అతను దాటలేకపోయారు..... కావున ఇటువంటి ప్రగల్భాలు పలికేవారిగా అవ్వకండి. ఇటువంటివారు చాలామంది ఉన్నారు.

చాలా బాగా అర్థం చేయిస్తారు, కాని యోగము లేనే లేదు. రోజంతా దేహ-అభిమానంలోనే ఉంటారు. లేకుంటే - నేను ఈ సమయంలో లేస్తాను, ఇంత స్మృతి చేస్తానని బాబాకు చార్టు పంపాలి. ఏ సమాచారమూ పంపరు. జ్ఞానపు ప్రగల్భాలు చాలా పలుకుతూ ఉంటారు. యోగమే ఉండదు. గొప్ప-గొప్పవారికి జ్ఞానమిస్తారు, కాని యోగములో అపరిపక్వంగా ఉన్నారు. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీరు ఎంతటి ప్రియమైనవారు. ఈ విచిత్రమైన డ్రామా ఎలా తయారయ్యిందో - ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. ఆత్మ గురించి కాని, పరమాత్మ గురించి కాని తెలియదు. ఈ సమయంలో మనుష్యులు జంతువుల కంటే కూడా హీనంగా ఉన్నారు. మనం కూడా అలాగే ఉండేవారము. మాయ యొక్క రాజ్యంలో ఎంత దుర్దశ కలుగుతుంది. ఈ జ్ఞానం మీరు ఎవ్వరికైనా ఇవ్వవచ్చు. ఆత్మలైన మీరిప్పుడు తమోప్రధానంగా ఉన్నారు, మీరు సతోప్రధానంగా అవ్వాలి, మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పండి. పేదవారికైతే ఇంకా సహజం. షావుకారులకైతే చాలా బంధనాలుంటాయి.

తండ్రి చెప్తున్నారు - నేను సాధారణ శరీరంలోనే వస్తాను. చాలా పేదవాడూ కాదు, చాలా షావుకారూ కాదు. కల్ప-కల్పము తండ్రి వచ్చి పావనంగా ఎలా తయారవ్వాలనే శిక్షణను మనకిస్తారని ఇప్పుడు మీకు తెలుసు. మిగతా మీ వ్యాపారాలు మొదలైనవాటిలో చాలా గొడవలున్నాయి, బాబా వాటి కోసం రాలేదు. ఓ పతిత-పావనా రండి అని నన్నే పిలుస్తారు కనుక పావనంగా అయ్యే యుక్తిని బాబా తెలియజేస్తారు. స్వయంగా ఈ బ్రహ్మాకు కూడా ఏమీ తెలిసేది కాదు. పాత్రధారులై ఉంటూ డ్రామా యొక్క ఆది-మధ్య-అంత్యముల గురించి తెలియకపోతే వారిని ఏమంటారు? ఆత్మలైన మనం ఈ సృష్టిచక్రంలో పాత్రధారులము, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ మూలవతనంలో నివసిస్తుందని అంటారు కాని అనుభవంతో చెప్పరు. మీకైతే ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలుసు - ఆత్మలమైన మనం మూలవతనవాసులము. మనం అవినాశీ ఆత్మలము. ఇదైతే బుద్ధిలో గుర్తుండాలి. చాలామందికి అసలు యోగము లేదు. దేహ-అభిమానము కారణంగా పొరపాట్లు కూడా చాలా జరుగుతాయి. ముఖ్యమైన విషయమే - దేహీ-అభిమానిగా అవ్వడం. మేము సతోప్రధానంగా అవ్వాలనే ఈ చింత ఉండాలి. ఏ పిల్లలకైతే సతోప్రధానంగా తయారవ్వాలనే లగనము ఉంటుందో, వారి నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు రావు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే బాబాకు రిపోర్ట్ చేస్తారు. బాబా, మా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమించండి అని అంటారు. దాచిపెట్టరు. దాచిపెడితే అది ఇంకా వృద్ధి చెందుతుంది. బాబాకు సమాచారమిస్తూ ఉండండి. మీ యోగము సరిగ్గా లేదని బాబా వ్రాస్తారు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. పిల్లలైన మీ బుద్ధిలో 84 జన్మల కథ ఉంది. ఎంత వీలైతే అంత కేవలం సతోప్రధానంగా అవ్వాలనే చింతే ఉండాలి. దేహ-అభిమానాన్ని విడిచిపెట్టాలి. మీరు రాజఋషులు. హఠయోగులు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. రాజయోగం తండ్రి మాత్రమే నేర్పిస్తారు. జ్ఞానం కూడా తండ్రి మాత్రమే ఇస్తారు. ఈ సమయంలో మిగిలినదంతా తమోప్రధాన భక్తి. కేవలం సంగమయుగంలోనే తండ్రి వచ్చి జ్ఞానం వినిపిస్తారు. తండ్రి వచ్చారు కనుక భక్తి సమాప్తమవుతుంది, ఈ ప్రపంచం కూడా సమాప్తమైపోతుంది. జ్ఞానం మరియు యోగం ద్వారా సత్యయుగ స్థాపన జరుగుతుంది. భక్తి వేరే విషయము. సుఖ-దుఃఖాలు ఇక్కడే ఉన్నాయని మనుష్యులు అనేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీపై పెద్ద బాధ్యత ఉంది. మీ కళ్యాణం కోసం యుక్తులు రచిస్తూ ఉండండి. పావన ప్రపంచం అంటే శాంతిధామము మరియు సుఖధామము అని కూడా అర్థం చేయించారు. ఇది అశాంతిధామము, దుఃఖధామము. మొట్టమొదటి ముఖ్యమైన విషయము యోగము. యోగము లేకపోత పండితుని వలె కేవలం జ్ఞాన ప్రగల్భాలు ఉంటాయి. ఈ రోజుల్లో రిద్ధులు-సిద్ధులు కూడా ఎన్నో వెలువడ్డాయి, వీటికి జ్ఞానంతో సంబంధం లేదు. మనుష్యులు అసత్యములో ఎంతగా చిక్కుకుని ఉన్నారు. పతితంగా ఉన్నారు. నేను పతిత ప్రపంచం, పతిత శరీరంలో వస్తాను అని తండ్రి స్వయం చెప్తున్నారు. ఇక్కడ పావనమైనవారైతే ఎవ్వరూ లేనే లేరు. వీరైతే స్వయాన్ని భగవంతుడినని చెప్పుకోరు. నేను కూడా పతితంగా ఉన్నాను అని చెప్తున్నారు, పావనంగా అయితే ఫరిస్తాగా అయిపోతారు. మీరు కూడా పవిత్రంగా ఫరిస్తాలుగా అయిపోతారు. కనుక మనం పావనంగా ఎలా అవ్వాలి అనేదే ముఖ్యమైన విషయం. స్మృతి చాలా అవసరము. ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారు - మేము శివబాబా పిల్లలమే కదా, స్మృతిలోనే ఉన్నాము అని అంటారు. కాని అవన్నీ ప్రగల్భాలు, అది నిర్లక్ష్యము అని బాబా అంటారు. ఇందులో పురుషార్థం చేయాలి, ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మనే మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మీరు దేహీ-అభిమానిగా అవుతారు. ఎవరైతే ఇతరుల కళ్యాణం చేస్తారో, వారి మహిమ కూడా చేయబడుతుంది కదా. అక్కడ దేహ మహిమ జరుగుతుంది. ఇక్కడైతే నిరాకార పరమపిత పరమాత్మ మహిమ జరుగుతుంది. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఈ మెట్ల చిత్రం ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మనం 84 జన్మలెలా తీసుకున్నాము, మళ్ళీ కిందకు ఎలా వస్తాము. ఇప్పుడైతే పాపము కుండ నిండిపోయింది, అది శుభ్రమెలా అవుతుంది? అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. మీరు ధర్మ శక్తి కలవారే కాక రాజ్య శక్తి కలవారు కూడా. బాబా అన్ని ధర్మాల గురించి అర్థం చేయిస్తారు. ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఆ ధర్మస్థాపన చేసేవారు ఏం చేస్తారు, వారి వెనుక ఇతరులు కూడా కిందకు రావలసి వస్తుంది. అయితే వారెవ్వరూ మోక్షమునేమీ ఇవ్వలేరు. తండ్రినే అంతిమంలో వచ్చి అందరినీ పవిత్రులుగా తయారుచేసి తిరిగి తీసుకెళ్తారు, కనుక వారికి తప్ప ఇతరులెవ్వరికీ మహిమ లేదు. బ్రహ్మాకు లేక మీకు ఎటువంటి మహిమా లేదు. బాబా రాకపోతే మీరు కూడా ఏం చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎక్కే కళలోకి తీసుకెళ్తారు. మీవల్ల సర్వులకు మేలు కలుగుతుందని కూడా పాడుతూ ఉంటారు. కానీ ఏ మాత్రం అర్థం చేసుకోరు. మహిమనైతే ఎంతో చేస్తారు.

ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఆత్మ అకాల్ (మృత్యువులేనిది), ఇది ఆత్మ యొక్క సింహాసనము. ఆత్మ అవినాశి. మృత్యువు ఎప్పుడూ కబళించదు. ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక పాత్రను అభినయించాలి. అంతేకాని తీసుకెళ్ళేందుకు కాలుడేమీ రాడు. ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినా మీకు దుఃఖము కలగదు. శరీరాన్ని విడిచిపెట్టి మరొక పాత్రను అభినయించేందుకు వెళ్ళింది, ఏడ్చే అవసరమేముంది. ఆత్మలైన మనం సోదరులము. ఇది కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఆత్మలు పరమాత్మ చాలాకాలం వేరుగా ఉన్నారు..... అని పాడుతారు. తండ్రి ఎక్కడకు వచ్చి కలుస్తారో కూడా తెలియదు. ఇప్పుడు మీకు ప్రతి విషయం గురించిన వివరణ లభిస్తుంది. ఎప్పటి నుండో వింటూనే వస్తున్నారు. పుస్తకాలు మొదలైనవైతే తీయరు కదా. కేవలం అర్థం చేయించేందుకు రిఫర్ చేస్తారు. తండ్రి సత్యమైనవారు కనుక సత్యమైన రచనను రచిస్తారు. సత్యం చెప్తారు. సత్యముతో గెలుపు, అసత్యముతో ఓటమి. సత్యమైన తండ్రి సత్య ఖండం యొక్క స్థాపన చేస్తారు. రావణుడి ద్వారా మీరు చాలా ఓటమి పొందారు. ఈ ఆటంతా తయారుచేయబడింది. మన రాజ్యము స్థాపన అవుతూ ఉందని ఇప్పుడు మీకు తెలుసు, తర్వాత వీరందరూ ఉండరు. వీరంతా వెనుక వచ్చినవారు. ఈ సృష్టి చక్రమును బుద్ధిలో ఉంచుకోవడం ఎంత సహజము. పురుషార్థీ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మేము జ్ఞానమునైతే చాలా బాగా వినిపిస్తున్నామని, దీనిలోనే సంతోషపడరు. దానితో పాటు యోగము మరియు నడవడికను కూడా ధారణ చేస్తారు. మీరు చాలా-చాలా మధురంగా అవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ప్రేమగా అర్థం చేయించాలి. పవిత్రత గురించి కూడా ఎన్ని గొడవలు జరుగుతాయి. అవి కూడా డ్రామానుసారంగానే జరుగుతాయి. ఇది తయారై తయారవుతున్న డ్రామా కదా. డ్రామాలో ఉంటే లభిస్తుందని భావించకూడదు. శ్రమ చేయాలి. దేవతల వంటి దైవీగుణాలు ధారణ చేయాలి. ఉప్పునీరుగా అవ్వకూడదు. మేము తప్పుడు నడవడిక నడుచుకుని తండ్రి గౌరవాన్ని పోగొట్టడం లేదు కదా అని చూసుకోవాలి. సద్గురువుకు నింద తీసుకొచ్చెవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్. ఇప్పుడు ఆత్మకు స్మృతి కలుగుతుంది. బాబా జ్ఞానసాగరులు, సుఖసాగరులు. తప్పకుండా జ్ఞానాన్నిచ్చి వెళ్ళాను, అందుకే మహిమ జరుగుతుంది. వీరి ఆత్మలో జ్ఞానమేమైనా ఉండేదా? ఆత్మ అంటే ఏమిటి, డ్రామా అంటే ఏమిటి - ఇది ఎవ్వరికీ కూడా తెలియదు. మనుష్యులే కదా తెలుసుకోవలసింది. రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు ఆత్మలను పూజిస్తారు, వారి పూజ మంచిదా లేక దైవీ శరీరాల పూజ మంచిదా? ఈ శరీరం పంచ తత్వాలది కనుక ఒక్క శివబాబా పూజ మాత్రమే అవ్యభిచారీ పూజ. ఇప్పుడు ఆ ఒక్కరి ద్వారానే వినాలి, అందుకే చెడు వినకూడదు అని అంటారు.... నింద చేసే మాటలేవీ వినకండి. నా ఒక్కరి నుండే వినండి. ఇది అవ్యభిచారి జ్ఞానము. ముఖ్యమైన విషయమేమిటంటే దేహ-అభిమానం తొలగిపోయినప్పుడే మీరు శీతలంగా అవుతారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే నోటి ద్వారా కూడా తప్పుడు మాటలు మాట్లాడరు, చెడు దృష్టి ఉండదు. చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. మన జ్ఞానం యొక్క మూడవ నేత్రం తెరవబడింది. తండ్రి వచ్చి త్రినేత్రి, త్రికాలదర్శిగా తయారుచేశారు. ఇప్పుడు మీకు మూడు కాలాల, మూడు లోకాల జ్ఞానము ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానము వినిపించడంతో పాటు యోగములో కూడా ఉండాలి. మంచి నడవడికను ధారణ చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు.

2. అంతర్ముఖులుగా అయ్యి ఏకాంతములో కూర్చుని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. పావనంగా అయ్యేందుకు యుక్తులు వెతకాలి. ఉదయము-ఉదయమే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి.

వరదానము:-

అందరి నుండి హృదయపూర్వకమైన ప్రేమను ప్రాప్తి చేసుకునే అతీతమైన, ప్రియమైన, నిస్సంకల్ప భవ

ఏ పిల్లలకైతే అతీతంగా, ప్రియంగా ఉండే గుణము లేక నిస్సంకల్పంగా ఉండే విశేషత ఉంటుందో అనగా ఎవరికైతే ఈ వరదానం ప్రాప్తించిందో వారు అందరికీ ప్రియంగా అవుతారు ఎందుకంటే అతీతత్వం ద్వారా అందరి హృదయపూర్వక ప్రేమ స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు తమ శక్తిశాలీ నిస్సంకల్ప స్థితి మరియు శ్రేష్ఠ కర్మల ద్వారా అనేకుల సేవకు నిమిత్తంగా అవుతారు, అందుకే స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. వారి ప్రతి కార్యంలో సఫలత స్వతహాగా ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-

ఒక్క "బాబా" అనే పదమే సర్వ ఖజానాలకు తాళంచెవి - ఈ తాళంచెవిని సదా జాగ్రత్తగా పెట్టుకోండి.