23-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఇక్కడి కోట్ల ధనం మీకు ఎందుకూ ఉపయోగపడదు, అంతా మట్టిలో కలిసిపోతుంది, అందుకే ఇప్పుడు మీరు సత్య ఖండం కోసం సత్యమైన సంపాదన చేసుకోండి

ప్రశ్న:-

ఏ ఒక్క కారణం వలన బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉన్నతమైనవారిగా భావించబడతారు?

జవాబు:-

బ్రాహ్మణులైన మనము ఇప్పుడు సర్వుల ఆత్మిక సేవ చేస్తాము. మనము ఆత్మలందరి మిలనము పరమాత్మ తండ్రితో చేయిస్తాము. ఈ ప్రజా సేవను దేవతలు చేయరు. అక్కడైతే రాజా-రాణి మరియు ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఏ పురుషార్థమైతే చేసారో, దాని ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు అక్కడ. సేవ చేయరు, అందుకే సేవాధారీ బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా కూడా ఉన్నతమైనవారు.

ఓంశాంతి

ఇది ఎవరి సభ జరుగుతుంది? జీవాత్మలు మరియు పరమాత్మది. ఎవరికైతే శరీరం ఉంటుందో, వారిని జీవాత్మ అని అంటారు, వారు మనుష్యులు మరియు వీరిని పరమాత్మ అని అంటారు. జీవాత్మలు మరియు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు... దీనిని మంగళ మిలనము అని అంటారు. పిల్లలకు తెలుసు, పరమపిత పరమాత్మను జీవాత్మ అని అనలేరు ఎందుకంటే వారు లోన్ తీసుకుంటారు. తనువు యొక్క ఆధారాన్ని తీసుకుంటారు. స్వయంగా వచ్చి అంటారు, పిల్లలూ, నేను కూడా ఈ ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. నేను గర్భంలోకైతే వెళ్ళను. నేను వీరిలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తాను. జీవాత్మలైన మీకైతే తమ-తమ శరీరాలు ఉన్నాయి. నాకు నా శరీరం లేదు. కనుక ఇది అతీతమైన సభ అయినట్లు కదా. ఇక్కడ ఎవరైనా గురువు లేక శిష్యులు కూర్చున్నారని కాదు. అలా కాదు, ఇదైతే స్కూలు. గురువు తర్వాత ఆసనం లభిస్తుందని కాదు. ఇక్కడ ఆసనం యొక్క విషయం లేదు. మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అని పిల్లలకు నిశ్చయముంది. నిశ్చయం లేకుండా ఎవ్వరూ కూడా రాలేరు. జీవాత్మల వర్ణము బ్రాహ్మణ వర్ణము ఎందుకంటే బ్రహ్మా ద్వారా పరమపిత పరమాత్మ రచనను రచిస్తారు. మీకు తెలుసు, బ్రాహ్మణులైన మనము అందరికన్నా సర్వోత్తములము, దేవతల కన్నా ఉత్తములము. దేవతలు ఏమీ ప్రజా సేవ చేయరు. అక్కడైతే యథా రాజా-రాణి తథా ప్రజా ఉన్నారు, ఏదైతే పురుషార్థం చేసి ఉన్నారో, దాని అనుసారంగా తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ ఎవ్వరూ సేవ చేయరు. బ్రాహ్మణులు సేవ చేస్తారు. పిల్లలకు తెలుసు, మనం అనంతమైన తండ్రి ద్వారా ఖచ్ఛితంగా 5 వేల సంవత్సరాల క్రితము వలె రాజయోగము నేర్చుకుంటున్నాము. మీరు పిల్లలుగా అయినట్లు. ఇక్కడ శిష్యరికము విషయం లేదు. తండ్రి ఘడియ-ఘడియ పిల్లలూ, పిల్లలూ, అని అర్థం చేయిస్తారు. మీరు ఇప్పుడు ఆత్మాభిమానిగా అయ్యారు. ఆత్మ అవినాశీ. శరీరము వినాశీ. శరీరాన్ని వస్త్రమని అంటారు. ఇది మురికి పట్టిన వస్త్రము ఎందుకంటే ఆత్మ ఆసురీ మతముపైన వికారాల్లోకి వెళ్తుంది, పతితంగా అవుతుంది. పావనము మరియు పతితము అన్న పదాలు వికారాలను ఉద్దేశ్యించే వెలువడ్డాయి. తండ్రి అంటారు, ఇప్పుడు ఎక్కువ పతితంగా అవ్వకండి. ఇప్పుడు అందరూ రావణుని సంకెళ్ళలో చిక్కుకొని ఉన్నారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. కనుక తండ్రి మిమ్మల్ని రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేసి రామ రాజ్యములోకి తీసుకువెళ్తారు. గాడ్ ఫాదర్ లిబరేటర్ (ముక్తిదాత). నేను అందరినీ దుఃఖం నుండి విడిపించి తిరిగి శాంతిధామంలోకి తీసుకువెళ్తాను అని అంటారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా వచ్చి పిల్లలు తమ పాత్రను రిపీట్ చేయాలి. మొట్టమొదట దేవతలు పాత్రను రిపీట్ చేయాలి. వారే మొదట ఉండేవారు. ఇప్పుడు బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. కలియుగ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. చాలా అంధకారంలో పడి ఉన్నారు. పదమపతులుగా, కోటీశ్వరులుగా అయితే అయ్యారు. రావణుడి ఆర్భాటము చాలా ఉంది. దీని పట్ల ప్రలోభం కలిగి ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇది అసత్యపు సంపాదన, ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. వారికేమీ లభించేది లేదు. మీరైతే భవిష్య 21 జన్మల కోసం తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకే వచ్చారు. ఇది సత్య ఖండము కోసం సత్యమైన సంపాదన. అందరూ తిరిగి వెళ్ళాల్సిందే. అందరిదీ వానప్రస్థ అవస్థ. తండ్రి అంటారు, నేనే అందరికీ సద్గతి దాతను, సద్గురువును. నేను సాధువులను, పతితులను అందరినీ ఉద్ధరిస్తాను. శివబాబాను స్మృతి చేయండి అని చిన్న పిల్లలకు కూడా నేర్పించడం జరుగుతుంది. మిగిలిన చిత్రాలన్నింటినీ తీసేయండి. ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు.

మీకు తెలుసు, మనం తండ్రి నుండి మళ్ళీ అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చాము. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వాన్ని అయితే జన్మ-జన్మాంతరాలు తీసుకున్నారు. రావణుడి ఆసురీ మతముపై పతితులుగా అవుతూ వచ్చారు. మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. రావణుడిని కాలుస్తారు. కనుక కాలిపోయి సమాప్తమైపోవాలి కదా. మనుష్యులను కాలిస్తే వారి నామ-రూపాలన్నీ అంతమైపోతాయి. రావణుడి పేరు, రూపమైతే మాయం అవ్వనే అవ్వదు. మళ్ళీ-మళ్ళీ కాలుస్తూనే ఉంటారు. తండ్రి అంటారు, ఈ 5 వికారాల రూపీ రావణుడు మీకు 63 జన్మల శత్రువు. భారతదేశ శత్రువు అనగా మన శత్రువు. వామ మార్గంలోకి వచ్చినప్పుడు రావణుడి జైలులో పడిపోయారు. తప్పకుండా అర్ధకల్పము నుండి రావణ రాజ్యము ఉంది. రావణుడు కాలనే కాలడు, మరణించనే మరణించడు. ఇప్పుడు మీకు తెలుసు, రావణుడి రాజ్యంలో మనం చాలా దుఃఖితులుగా అయ్యాము. ఇది సుఖము మరియు దుఃఖము యొక్క ఆట. మాయతో ఓడిపోతే ఓడిపోయినట్లు, మాయను జయిస్తే జయించినట్లు అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు మాయను జయించి మనం మళ్ళీ రామ రాజ్యాన్ని తీసుకుంటాము. సీతా-రాముల రాజ్యము త్రేతాలో ఉంది. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉంది. అక్కడ ఉన్నదే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము. దానిని ఈశ్వరీయ రాజ్యమని అంటారు. దానిని తండ్రి స్థాపన చేసారు. తండ్రిని ఎప్పుడూ సర్వవ్యాపి అని అనలేరు. సోదరత్వము కదా. తండ్రి ఒక్కరే. మీరందరూ పరస్పరంలో సోదరులు. తండ్రి కూర్చుని ఆత్మలను చదివిస్తారు. తండ్రి ఆజ్ఞ ఉంది, నన్ను స్మృతి చేయండి. నేను భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎవరికి? ఎవరైతే ప్రారంభం నుండి అంతిమం వరకు భక్తి చేసారో, వారికి. మొట్టమొదట మీరు ఒక్క శివబాబానే భక్తి చేసేవారు. సోమనాథ మందిరం ఎంత గొప్పది. మనం ఎంత షావుకార్లుగా ఉండేవారము అని ఆలోచించాలి. ఇప్పుడు పేదవారిగా, గవ్వ సమానంగా అయిపోయాము. ఇప్పుడు మీకు 84 జన్మల స్మృతి వచ్చింది. ఇప్పుడు మీకు తెలుసు, మనం ఎలా ఉండేవారము, ఎలా అయ్యాము.

ఇప్పుడు మీకు స్మృతి కలిగింది - స్మృతిర్లబ్ధః అన్న పదం కూడా ఇప్పటిదే. దీని అర్థము భగవంతుడు వచ్చి సంస్కృతంలో గీతను వినిపించారని కాదు. సంస్కృతంలో చెప్పినట్లయితే పిల్లలైన మీరు ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. హిందీ భాష ముఖ్యమైనది. ఈ బ్రహ్మా యొక్క భాష ఏదైతే ఉందో ఆ భాషలోనే అర్థం చేయిస్తున్నారు. కల్ప-కల్పము ఈ భాషలోనే అర్థం చేయిస్తారు. మీకు తెలుసు, మనం బాప్ దాదా ఎదురుగా కూర్చున్నాము. ఇది ఇల్లు - మమ్మా-బాబా, సోదరి మరియు సోదరులు, అంతే, ఇంకే సంబంధమూ లేదు. ఎప్పుడైతే ప్రజాపిత బ్రహ్మాకు చెందినవారిగా అవుతారో, అప్పుడే సోదరీ-సోదరుల సంబంధం ఉంటుంది. లేదంటే ఆత్మిక సంబంధం పరంగా అందరూ సోదరులు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఆత్మకు తెలుసు, మన బాబా వచ్చి ఉన్నారు. మీరు బ్రహ్మాండానికి యజమానిగా ఉండేవారు. తండ్రి కూడా బ్రహ్మాండానికి యజమాని కదా! ఎలా అయితే ఆత్మ నిరాకారినో, అలా పరమాత్మ కూడా నిరాకారుడు. వారి పేరే పరమపిత పరమాత్మ అనగా అత్యంత దూరంగా ఉండే ఆత్మ. పరమ ఆత్మ అనగా పరమాత్మ. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇక్కడ సాధు-సన్యాసులు, మహాత్ములు ఎవ్వరూ లేరు. పిల్లలు ఉన్నారు. తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇంకెవ్వరూ వారసత్వాన్ని ఇవ్వలేరు. తండ్రి సత్యయుగాన్ని స్థాపన చేసేవారు. తండ్రి ఎల్లప్పుడూ సుఖమే ఇస్తారు. సుఖ-దుఃఖాలను తండ్రే ఇస్తారని కాదు. అలా నియమము లేదు. తండ్రి స్వయంగా చెప్తారు, నేను పిల్లలైన మీతో పురుషార్థం చేయిస్తాను. 21 జన్మల కోసం మీరు దేవతలుగా అవ్వండి, కనుక వారు సుఖదాత అయ్యారు కదా, వారు దుఃఖహర్త-సుఖకర్త. ఇప్పుడు మీకు తెలుసు దుఃఖం ఎవరిస్తారు? రావణుడు. దీనిని వికారీ ప్రపంచమని అంటారు. స్త్రీ-పురుషులు ఇరువురూ వికారులుగా ఉన్నారు. సత్యయుగంలో ఇరువురూ నిర్వికారులుగా ఉండేవారు. లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది. అక్కడ నియమానుసారంగా రాజ్యం నడుస్తుంది. ప్రకృతి మీ ఆజ్ఞానుసారముగా నడుస్తుంది. అక్కడ ఏ ఉపద్రవాలు జరగవు. పిల్లలైన మీరు స్థాపన యొక్క సాక్షాత్కారాలను పొందారు. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. హోలీ నాడు దిష్టిబొమ్మను తయారుచేస్తారు కదా. దీని కడుపు నుండి ఏం వెలువడుతుంది అని అడుగుతారు, అప్పుడు మూసలము అని చెప్తారు. యథార్థమైన విషయమైతే మీకు తెలుసు. వారి సైన్సు ఎంత వేగంగా ఉంది. బుద్ధి యొక్క పని కదా? సైన్సు యొక్క గర్వం ఎంతగా ఉంది. ఎన్ని వస్తువులను, విమానాలు మొదలైనవాటిని సుఖం కోసం తయారుచేస్తారు. మళ్ళీ ఈ వస్తువుల ద్వారా వినాశనం కూడా జరుగుతుంది. చివర్లో తమ కులాన్ని తామే వినాశనం చేసుకుంటారు. మీరు ఉన్నదే గుప్తముగా. మీరు ఎవరితోనూ యుద్ధం చేసేవారు కాదు. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. బాబా అంటారు, మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు. తండ్రి ఎప్పుడైనా, ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తారా? సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తారు. మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వండి. బాబా అర్థం చేయించారు, ఎవరు ఏమన్నా శాంతిగా, హర్షితముఖులుగా ఉండాలి. యోగంలో ఉంటూ చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. మీ యోగబలంతో వారు కూడా శాంతిగా అయిపోతారు. ముఖ్యంగా టీచర్ల నడవడిక చాలా మంచిగా ఉండాలి. ఎవరి పైనా ద్వేషం ఉండకూడదు. తండ్రి అంటారు, నాకు ఎవరి పైనైనా ద్వేషం ఉంటుందా. అందరూ పతితులు అని తెలుసు. ఈ డ్రామా తయారై ఉంది. వీరి నడవడికయే ఇలా ఉంది అని నాకు తెలుసు. ఆహార-పానీయాలు ఎంత అశుద్ధంగా ఉన్నాయి. ఏది పడితే అది తింటూ ఉంటారు. జీవితం అందరికీ ప్రియమనిపిస్తుంది. జీవితం మనకు కూడా చాలా ప్రియంగా అనిపిస్తుంది. దీని ద్వారా మనం బాబా నుండి వారసత్వం పొందాలి అని తెలుసు. యోగంలో ఉండడం ద్వారా మీ ఆయువు పెరుగుతుంది, వికర్మలు తగ్గుతాయి, భవిష్య 21 జన్మల కోసం ఆయువు ఎక్కువ అవుతుంది. పురుషార్థము ఇప్పటిదే. దీని ద్వారా మళ్ళీ ప్రారబ్ధం తయారవుతుంది. యోగబలంతో మనం ఆరోగ్యంగా తయారవుతాము, జ్ఞానంతో సంపన్నులుగా తయారవుతాము. ఆరోగ్యము, సంపద ఉంటే సుఖం ఉన్నట్లే. కేవలం సంపద ఉండి ఆరోగ్యం లేకపోతే కూడా సుఖంగా ఉండలేరు. ఇలా చాలామంది రాజులు, పెద్ద-పెద్ద షావుకార్లు ఉన్నారు కానీ వికలాంగులుగా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. అటువంటి వికర్మలు చేసారు, దానికి ఫలము లభించింది అని అనడం జరుగుతుంది. తండ్రి మీకు చాలా వినిపిస్తారు. బయటకు వెళ్ళడంతోనే ఇక్కడిది ఇక్కడే ఉండిపోయేలా ఉండకూడదు. ఇలా ఉండకూడదు కదా. ధారణ చేయాలి. ఇంకేదీ గుర్తుండకపోతే, అచ్ఛా, శివబాబాను స్మృతి చేయండి. లోపల చాలా గుప్త మహిమను చేయాలి. బాబా, మీరు వచ్చి చదివిస్తారని మనసు, చిత్తంలో కూడా ఉండేది కాదు! నిరాకార పరమపిత పరమాత్మ వచ్చి చదివిస్తారు అన్న విషయం ఏ శాస్త్రాలలోనూ లేదు. బాబా, ఇప్పుడు మేము తెలుసుకున్నాము, తండ్రికి బదులుగా కృష్ణుని పేరు వేయడంతో గీత ఖండితమైపోయింది. కృష్ణుడికి ఈ చరిత్ర ఉండజాలదు. గీత ఈ సంగమం యొక్క శాస్త్రము. వారు మళ్ళీ ద్వాపరంలో చూపించారు. తండ్రి అంటారు, పిల్లలూ, మిగిలిన విషయాలన్నీ విడిచిపెట్టి చదువు పైన అటెన్షన్ పెట్టాలి. తండ్రి స్మృతిలో లేకపోతే చదువులో నిమగ్నమై ఉండకపోతే సమయం వ్యర్థమైపోతుంది. మీ సమయం ఎంతో విలువైనది. అందుకే, దీనిని వ్యర్థము చేయకూడదు. శరీర నిర్వహణ అయితే చేయండి. కానీ వ్యర్థమైన ఆలోచనలలో సమయాన్ని పోగొట్టుకోకూడదు. మీ క్షణ-క్షణం వజ్రం వలె విలువైనది. తండ్రి అంటారు, మన్మనాభవ. అంతే. ఆ సమయం మాత్రమే లాభదాయకమైనది. మిగిలిన సమయమంతా వ్యర్థమైపోతుంది. చార్టు పెట్టుకోండి, మేము ఎంత సమయం వ్యర్థంగా పోగొట్టుకుంటున్నాము? ఒకే పదము ఉంది, మన్మనాభవ. అర్ధకల్పము జీవన్ముక్తి ఉండేది, తర్వాత అర్ధకల్పము జీవన బంధనంలోకి వచ్చాము. సతోప్రధానము, సతో, రజో, తమోలలోకి వచ్చాము. మళ్ళీ మనం జీవన్ముక్తులుగా అవుతున్నాము. తయారుచేసేవారు తండ్రే. అందరికీ జీవన్ముక్తి లభిస్తుంది. తమ-తమ ధర్మాల అనుసారంగా మొట్టమొదట సుఖాన్ని చూస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని చూస్తారు. కొత్త ఆత్మలు ఎవరైతే మొదట వస్తారో, వారు సుఖాన్ని అనుభవిస్తారు. కొందరి మహిమ వెలువడుతుంది ఎందుకంటే కొత్త ఆత్మ అయిన కారణంగా శక్తి ఉంటుంది. మీ లోపల సంతోషం యొక్క వాయిద్యాలు మోగాలి. మనం బాప్ దాదా ఎదురుగా కూర్చున్నాము. ఇప్పుడు కొత్త రచన జరుగుతుంది. మీ ఈ సమయం యొక్క మహిమ సత్యయుగము కన్నా చాలా గొప్పది. జగదంబ, దేవీలందరూ సంగమములోనే ఉండేవారు, బ్రాహ్మణులుగా ఉండేవారు. మీకు తెలుసు, ఇప్పుడు మనం బ్రాహ్మణులము, మళ్ళీ దేవతలుగా పూజ్యనీయ యోగ్యంగా అవుతాము. మళ్ళీ మీ స్మృతిచిహ్న మందిరాలు తయారవుతాయి. మీరు చైతన్య దేవీలుగా అవుతారు. అవి జడమైనవి. వీరు దేవీలుగా ఎలా అయ్యారు అని వారిని అడగండి. ఎవరైనా మాట్లాడితే - మనమే బ్రాహ్మణులుగా ఉండేవారము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతామని అర్థం చేయించండి. మీరు చైతన్యంగా ఉన్నారు. ఈ జ్ఞానం ఎంత ఫస్ట్ క్లాస్ అయినది అన్నది మీరు తెలియజేస్తారు. తప్పకుండా మీరు స్థాపన చేస్తున్నారు. పిల్లలంటారు, బాబా, మేము లక్ష్మీ-నారాయణుల కన్నా తక్కువ పదవి తీసుకోము, మేమైతే పూర్తి వారసత్వము తీసుకుంటాము. ఈ స్కూలే అటువంటిది. అందరూ అంటారు, మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్చుకోవడానికి వచ్చాము. యోగం ద్వారా దేవీ-దేవతలుగా అవుతారు. ఇప్పుడైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ముఖ్యమైన విషయము, స్మృతికి సంబంధించినది. స్మృతిలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. మీరు ఎంతో ప్రయత్నిస్తారు, అయినా కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇందులోనే శ్రమ అంతా ఉంది.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా సుఖ దాతగా అవ్వాలి. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. సదా శాంతచిత్తులుగా, హర్షితముఖులుగా ఉండాలి.

2. వ్యర్థమైన ఆలోచనలలో సమయాన్ని వృథా చేసుకోకూడదు. తండ్రి మహిమను లోపల నుండి చేయాలి.

వరదానము:-

శ్రేష్ఠ మతాన్ని అనుసరిస్తూ ప్రతి కర్మను కర్మయోగిగా అయి చేసే కర్మ బంధన ముక్త భవ

ఏ పిల్లలైతే శ్రేష్ఠ మతము అనుసారంగా ప్రతి కర్మను చేస్తూ అనంతమైన ఆత్మిక నషాలో ఉంటారో, వారు కర్మలు చేస్తూ కర్మ బంధనంలోకి రారు, అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. కర్మయోగిగా అయి కర్మలు చేస్తే వారి వద్దకు దుఃఖం యొక్క అల రాలేదు, వారు ఎల్లప్పుడూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఎటువంటి కర్మ బంధనమూ వారిని తనవైపుకు లాగలేదు. సదా యజమానులుగా అయి కర్మలు చేయిస్తారు అందుకే బంధనముక్త స్థితి యొక్క అనుభవం అవుతుంది. అటువంటి ఆత్మ స్వయం కూడా సదా సంతోషంగా ఉంటుంది మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తుంది.

స్లోగన్:-

అనుభవాల అథారిటీగా అయినట్లయితే ఎప్పుడూ మోసపోరు.