(మమ్మా యొక్క పుణ్య
స్మృతి దివసం నాడు ఉదయం క్లాసులో వినిపించేందుకు మాతేశ్వరి గారి
మధురమైన మహావాక్యాలు)
‘‘కర్మలే సుఖము మరియు దుఃఖానికి కారణము’’
జీవితంలో దుఃఖము మరియు సుఖము కర్మల ఆధారంగా ప్రారబ్ధ రూపంలో
నడుస్తాయి అనైతే మనుష్యులందరికీ తెలుసు. తప్పకుండా ఇంతకుముందు
అటువంటి కర్మలు చేసారు, దాని ప్రారబ్ధాన్ని దుఃఖము లేక సుఖము
యొక్క రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. కావున సుఖము మరియు దుఃఖము
యొక్క సంబంధము కర్మలతో ఉంది. కర్మలను భాగ్యము అని అనరు.
భాగ్యంలో ఏదుంటే అది అని చాలా మంది భావిస్తారు, అందుకే
దుఃఖాన్ని మరియు సుఖాన్ని భాగ్యమని భావిస్తారు, అలా అనుకుంటే ఈ
భాగ్యాన్ని ఏదో భగవంతుడు తయారుచేసినట్లు లేక ఇంకెవరో
తయారుచేసినట్లు అవుతుంది, అందుకే భాగ్యంలో ఏదుంటే అది అని అంటూ
ఉంటారు, కానీ ఆ భాగ్యాన్ని కూడా ఎవరు తయారుచేసారో అర్థం
చేసుకోవడం చాలా అవసరము. భాగ్యాన్ని పరమాత్మ ఏమీ తయారుచేయలేదు.
అలాగని భాగ్యమనేది ముందు నుండే తయారై ఉందని కూడా కాదు. అలా కాదు.
ఈ దుఃఖము లేక సుఖము ఏదైతే మనుష్యులు అనుభవిస్తారో, ఆ
సుఖ-దుఃఖాలను తయారుచేసుకునేవారు కూడా మనుష్యులే, ఎందుకంటే
కర్మలు చేసేవారు మనుష్యులు, అందుకే ఈ బాధ్యత తమదవుతుంది. ఏది
చేస్తే అది అనుభవిస్తారు, ఇదైతే సాధారణమైన నానుడి మరియు ఎవరైతే
చేస్తారో వారు పొందుతారు. గీతలో కూడా ఏమని వర్ణన ఉందంటే -
జీవాత్మ తనకు తానే మిత్రుడు మరియు తనకు తానే శత్రువు. నేను నీకు
శత్రువును, నేను నీకు మిత్రుడను అనైతే చెప్పలేదు. అలా కాదు.
జీవాత్మ తనకు తానే శత్రువు మరియు తనకు తానే మిత్రుడు, అందుకే
తనతో తాను మిత్రుత్వము మరియు తనతో తాను శత్రుత్వము, అలాగే
దుఃఖాన్ని మరియు సుఖాన్ని తయారుచేసుకునేది స్వయంగా మనిషే. కనుక
సుఖ-దుఃఖాలకు మనిషి తనకు తానే బాధ్యుడు అన్న విషయము ఎంతో
స్పష్టమవుతుంది, అందుకే ఎప్పుడైనా ఏ రూపంలోనైనా దుఃఖం వస్తే,
దానిని పారద్రోలే ప్రయత్నం చేస్తారు. ఏవైనా గొడవలు-కొట్లాటలు
వస్తే, వాటిని సమాప్తం చేసే ప్రయత్నం చేస్తారు, ఇందులో ఎవరికైనా
అకాల మరణాలు సంభవిస్తే, అప్పుడు కూడా దుఃఖం కలుగుతుంది. అప్పుడు,
నా విషయంలో ఎందుకిలా జరిగిందో తెలియదు అని అనుకుంటారు.
అప్పుడిక, అదే వేగంలో (ఆవేశంలో) కి వచ్చి భగవంతుడిని కూడా
నిందించడం మొదలుపెడతారు. ఇప్పుడు మీ ఎదురుగా ఈ విషయాలు ఏవైతే
జరిగాయో, అవి చేసుకుంది ఎవరు? ఈ అకాల మృత్యువు ఏదైతే
సంభవించిందో, వ్యాధి రూపంలో ఈ దుఃఖం ఏదైతే వచ్చిందో, ఇదేమైనా
భగవంతుడు చేసారా? ఈ గొడవలు-కొట్లాటలు, ప్రపంచంలో దుఃఖానికి
ఎన్ని అయితే కారణాలు ఉన్నాయో, అవన్నీ ఏమైనా భగవంతుడు కలిగించారా?
అరే! భగవంతుడిని దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు, అందుకే ఎప్పుడైనా
ఏదైనా దుఃఖం కలిగినప్పుడు వారిని తలచుకుంటారు. శరీరానికి వ్యాధి
వచ్చినప్పుడు కూడా, ఓ భగవంతుడా! అనే అంటారు. దుఃఖంలో వారినే
తలచుకుంటారు, ఒకవేళ అది వారే ఇచ్చినట్లయితే, మరి ఎవరైతే
దుఃఖమిస్తారో, వారిని ఏం చేయాలి? చెప్పండి. అయినా ఇది కూడా
ఆలోచించాలి - దుఃఖం సమయంలో ఎవరైతే గుర్తుకొస్తారో, వారి విషయంలో
- ఈ దుఃఖాన్ని వారే ఇచ్చారు అని అనలేరు కూడా. ఇది కూడా అర్థం
చేసుకోవాల్సిన విషయము. వారిని గుర్తు చేసుకుంటున్నారంటే,
తప్పకుండా వారికి మనతో వేరే ఇంకేదో విషయంలో సంబంధముంది,
అంతేకానీ దుఃఖమిచ్చే విషయంలో కాదు. దీని బట్టి ఏమి
ఋజువవుతుందంటే, దుఃఖానికి కారణము లేక దానికి బాధ్యులు వేరే ఎవరో
ఉన్నారు! అందులో కూడా ఎవరో మూడవ వారైతే లేరు. ఒకరు నేను మరియు
రెండవవారు నా రచయిత, అంతే. ఇద్దరమే ఉన్నాము కదా. ఒకరేమో నేను,
వారి రచన లేక వారి సంతానము అనండి మరియు రెండవవారు తండ్రి.
కావున, అయితే తండ్రి బాధ్యులు లేక నేను బాధ్యుడిని! కానీ
ఎప్పుడైతే నా వద్దకు దుఃఖం వస్తుందో, అప్పుడు నాకెలా
కనిపిస్తుందంటే, ఆ రచయితనే నాకు దుఃఖమిచ్చారు అని. మళ్ళీ లోపల
నుండి, వారైతే నా సుఖదాత అని కూడా అనిపిస్తుంది. ఏ విధంగానైతే
సుఖం కోసము - ఓ భగవంతుడా, ఈ దుఃఖాన్ని దూరం చేయండి, భగవంతుడా,
నా ఆయుష్షును పెంచండి అని చేయూతను అడుగుతారు. చూడండి, ఆయుష్షు
కోసం కూడా అడుగుతారు. కనుక ఆయుష్షు గురించి, దుఃఖం గురించి,
శరీర వ్యాధుల గురించి మరియు ఏవైనా గొడవలు-కొట్లాటలు, ఏదైనా
ఇటువంటి అశాంతికి సంబంధించిన కారణం వస్తే, భగవంతుడిని అడుగుతారు.
ఎవరి బిడ్డ అయినా అలా-ఇలా ఉన్నప్పుడు కూడా - భగవంతుడా, ఇతడికి
సుమతాన్ని ఇవ్వండి అని అంటారు, అంటే మతము కోసం కూడా వారినే
అడుగుతారు. ఏదైనా విషయం గురించి ఎప్పుడైనా ఏదైనా దుఃఖము లేక
కష్టము కలిగితే, అప్పుడు ఆ కష్టంలో వారినే తలచుకుంటారు మరియు
ఏది కావాలన్నా వారినే అడుగుతారు. వారినే అడుగుతున్నారంటే
తప్పకుండా వారే దాని దాత మరియు వారే మనకు సుఖాన్ని ఇచ్చేవారు,
అనగా ఈ అన్ని విషయాలకు పరిష్కారం కేవలం వారి వద్దనే ఉంది.
ఊరికినే వారిని గుర్తు చేసుకోరు, వారి వద్ద పరిష్కారముంది.
కనుక మన ఈ అలవాట్లన్నీ ఏవైతే ఉన్నాయో, తెలిసినా లేక
తెలియకపోయినా కానీ, భగవంతుడిని దుఃఖం యొక్క సమయంలో తప్పకుండా
గుర్తు చేసుకుంటాము. ఏదైనా విషయం జరిగినప్పుడు, నోటి నుండి -
‘‘ఓ మై గాడ్’’ (ఓ నా భగవంతుడా) అని వస్తుంది. ఆ భగవంతుడు ఎవరు,
ఏమిటి అనేది ఎవరికైనా తెలిసినా, తెలియకపోయినా కానీ, నోటి నుండి
అయితే తప్పకుండా వెలువడుతుంది. కావున అర్థం చేసుకోవాల్సిన
విషయమేమిటంటే, చివరికి మనం ఎవరినైతే గుర్తు చేసుకుంటామో, వారికి
మన ఈ దుఃఖాలన్నింటితో ఏమైనా సంబంధముందా! వారేమైనా దుఃఖదాతనా
లేక వారికి సుఖమిచ్చే విషయంలో సంబంధముందా! కావున మన స్మృతితో
కూడా ఏమని ఋజువవుతుందంటే, వారిది దుఃఖమిచ్చే పని కానే కాదు.
ఒకవేళ ఇస్తే, ఇక వారిని ఎందుకు తలచుకుంటారు? దుఃఖమిచ్చే వారి
పట్లనైతే లోపల నుండి కోపం వస్తుంది, వీరిని ఏం చేయాలో తెలియడం
లేదు... అని అనుకుంటారు. కానీ భగవంతుని పట్లనైతే సదా మరియు
దుఃఖం సమయంలోనైతే ప్రత్యేకంగా ప్రేమ కలుగుతుంది. లోపల నుండి,
వారు నాకు ఎంతో గొప్ప మిత్రుడు అన్నట్లు అనిపిస్తుంది. లోపల ఆ
సంతోషం కలుగుతుంది. కావున తప్పకుండా వారికి మనతో సుఖం యొక్క
సంబంధముంది. కనుక దుఃఖానికి కారణము తప్పకుండా వేరే ఎవరో ఉన్నారు!
కానీ ఇప్పుడు మూడవ వారైతే ఎవరూ లేనే లేరు, ఒకటేమో నేను, రెండవది
వారు, అంటే తప్పకుండా నేనే బాధ్యుడను అయినట్లు.
కావున దేని కోసమైతే నేను నిమిత్తుడనో, అక్కడ నేనే దుఃఖంలో
దుఃఖితునిగా అవుతాను, మరియు దానిని నాకు నేనే చేతులారా
తయారుచేసుకుంటున్నాను - ఇది ఎంత తెలివితక్కువతనమో చూడండి. దేని
నుండైతే విడుదలవ్వాలని కోరుకుంటున్నానో, దానిని నేను నా కోసము
స్వయమే తయారుచేసుకుంటున్నాను, ఇది ఆశ్చర్యం కలిగించే విషయము కదా.
మనుష్యులు కోరుకోరు, అయినా కూడా దుఃఖం తయారవుతూ ఉంటుంది, అంటే
తప్పకుండా వారికేదో విషయం తెలియదు, తెలివిహీనులుగా ఉన్నారు.
కనుక ఏ విషయం గురించైతే తెలియదో, మొదట ఆ విషయం గురించి
తెలుసుకోవాలి కదా. తప్పకుండా నాకు దానికి సంబంధించి కొంత
జ్ఞానము (తెలివి) ఉండాలి. కావున ఈ తెలివి కోసమే మొదట
అన్వేషించాలి. కానీ ఆశ్చర్యమేమిటంటే, ఈ రోజు ఇలాంటి విషయాన్ని
అర్థం చేసుకునేందుకు కూడా చాలా మంది అభాగ్యులు ఎన్ని సాకులు
చెప్తారో చూడండి. తీరిక లేదు, సమయం లేదు అని అంటారు. ఏం చేయాలి,
గృహస్థ వ్యవహారము మొదలైనవి సంభాళించాలా లేక ఇది చేయాలా, అది
చేయాలా, ఏం చేయాలి... అని అంటారు. అందుకే అది చూస్తూ,
సంభాళిస్తూ కూడా అందులో దుఃఖితులై ఉన్నారు. ఇప్పుడు నేనే,
నాది-నాది అని అంటూ ఈ దుఃఖం యొక్క రూపాన్ని తయారుచేసుకున్నాను,
దానిని దుఃఖం యొక్క రూపంలోకి తీసుకొచ్చాను కనుక మొదట దాని
గురించి అన్వేషించాలి. దానిని తయారుచేసుకునే ముందు, దేనినైతే
తయారుచేసుకుని నేను దుఃఖితునిగా అవుతున్నానో, దానికి కారణమేమిటి
అన్నదాని గురించి తెలుసుకుని ఉండాలి. మొదట, నేను దుఃఖితునిగా
ఎందుకు ఉన్నాను అన్న తెలివైతే నాకు ఉండాలి! సుఖమనేది నాకు ఉండనే
ఉండదా! దీని గురించి కూడా తెలుసుకోవాలి.
ఈ విషయం గురించే ఇక్కడ చెప్పడం జరుగుతుంది - ఏ వస్తువులనైతే
మీరు తమవిగా భావించారో, అవే దుఃఖానికి కారణము. దుఃఖాన్ని
తొలగించుకునే ఉపాయమేమిటి, జీవితంలో అది తెలుసుకోవడం కూడా చాలా
అవసరము. కానీ తెలిసినా కూడా - ఏం చేయాలి, ఎలా చేయాలి, మా
గృహస్థ-వ్యవహారాలను వదిలేయాలా ఏమిటి! అని అంటారు. కనుక
మనుష్యుల బుద్ధిని చూస్తే, ఆశ్చర్యమనిపిస్తుంది, వివేకం
లభిస్తున్నప్పటికీ దానిని ధారణ చేయలేకపోతారు. మనం అనుభవంతో ఆ
విషయాలనే అర్థం చేసుకుని మరియు ధారణ చేసి, ఇది అనుభవంతో కూడిన
విషయమని తెలియజేస్తాము. తప్పకుండా అనుభవం అయ్యింది కావుననే
ప్రాక్టికల్ గా ఏ విధంగా సుఖం యొక్క ప్రాప్తి లభించగలదు అన్నది
చెప్తాము. ఎవరికోసమైతే ఎంతోకాలం బట్టి ఆశను పెట్టుకుంటూ వచ్చారో,
ఇప్పుడు ఆ సుఖదాత ఎవరైతే ఉన్నారో, వారు స్వయంగా మనకు తమ
పరిచయాన్ని ఇస్తున్నారు - ఓ పిల్లలూ, మీరు దుఃఖితులుగా ఎందుకు
అయ్యారు? కారణమైతే మీదే కానీ మీలో ఉన్న ఏ విషయము మీకు స్వయమే
తెలియడం లేదు, దాని కారణంగా మీరు దుఃఖాన్ని తీసుకుంటున్నారు.
మీ కర్మలే మీ దుఃఖానికి కారణమవుతూ ఉన్నాయా ఏమిటి! అది వచ్చి
అర్థం చేసుకోండి, చూడండి, మనం ఇంతగా ఆఫర్ చేస్తాము. అయినా కూడా
ఆశ్చర్యము, చూడండి, ఇది వింటూ కూడా - బహుశా ఇలాగే ఉంటుందేమో అని
అనుకుంటారు పాపం. దీనినే, అహో, మమ మాయ! అని అంటారు. మాయ
పూర్తిగా పట్టుకుని కూర్చుంది. మరియు దేని గురించైతే
తెలుసుకోవడానికి మొత్తం రోజంతా కష్టపడతారో, ఆ విషయాన్ని తండ్రి
ఎదురుగా కూర్చుని తెలియజేస్తారు, పిల్లలూ, మీ సుఖానికి కారణము
మరియు దుఃఖానికి కారణము ఏమిటి అని.
తండ్రి స్వయంగా అంటారు, నేను మీ దుఃఖాలన్నింటినీ హరించడానికి
మరియు మీకు సుఖాన్ని ఇవ్వడానికి వచ్చాను, అందుకే
దుఃఖహర్త-సుఖకర్త అని మహిమ చేస్తారు. ఈ రోజు దుఃఖకర్త-సుఖహర్తగా
ఉన్నారని ఎప్పుడూ అనరు. అలా అనరు. కానీ వారు ప్రతి దుఃఖాన్ని
హరించేవారు. తండ్రి అంటారు, పిల్లలూ, నేను వచ్చిందే మీ
దుఃఖాన్ని హరించడానికి. కానీ దాని కోసము మీకు ఎటువంటి కర్మలు
చేయడం నేర్పిస్తానంటే, వాటి ద్వారా మీ దుఃఖం దూరమవుతుంది. కేవలం
నేను మీకు ఏదైతే నేర్పిస్తానో, అర్థం చేయిస్తానో, దానిని అర్థం
చేసుకుని దుఃఖం దూరమయ్యే పురుషార్థం చేయండి. మీ దుఃఖాన్ని దూరం
చేసే శిక్షణ నేను ఇస్తాను, దానిని ధారణ చేయండి ఎందుకంటే అది మీ
వస్తువు కదా. కానీ పాపం చాలా మంది ఎలాంటి కారణాలు చెప్తారంటే,
వారేదో భగవంతునికి ఉపకారం చేస్తున్నట్లు మాట్లాడుతారు. మరికొంత
మంది, సమయం లభిస్తే చేస్తామని అంటారు. అరే సోదరా!
తినిపించడము-తాగించడము, ఈ విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ కర్మల
ద్వారా తయారైన ఖాతాలలోనే మీరు చిక్కుకుని ఉన్నారు, వాటి
కారణంగానే దుఃఖితులుగా అయ్యారు. ఒకవైపేమో దుఃఖం నుండి
విడుదలవ్వాలని అంటారు మరియు ఇంకొక వైపు, ఈ దుఃఖాలన్నింటి నుండి
విడుదలయ్యే మార్గాన్ని స్వయంగా తండ్రి అర్థం చేయిస్తున్నారు,
అయినా కూడా చూడండి, ఎక్కడో ఏ ఒక్కరికో బుద్ధిలో కష్టం మీద
కూర్చుంటుంది. ఇదే విధంగా మాయ అని ఈ 5 వికారాలను అంటారు, కానీ
పాపం మనుష్యులు ధన-సంపదలను మాయ అని భావిస్తారు. చాలా మంది
శరీరాన్ని కూడా మాయ అని అంటారు. దాని నుండి రక్షించుకునేందుకు
ఉపాయాలు వెతుకుతూ ఉంటారు, కానీ తండ్రి అంటారు - మీ దుఃఖానికి
కారణం వేరే ఏదో ఉంది. ఈ ప్రకృతి అయితే నా రచన, ఇది అనాదిగా ఉంది,
ఇదేమీ దుఃఖానికి కారణం కాదు. మీలో అదనంగా ఇంకేదో వచ్చింది, అదే
దుఃఖానికి కారణము, దానినే 5 వికారాలు (మాయ) అని అంటారు.
వికారాలంటే శరీరమేమీ కాదు, ప్రపంచము వికారాలు కాదు, ధన-సంపదలు
వికారాలు కావు. వికారాలు అనేవి వేరు, అవి రావడంతో ఇవన్నీ
దుఃఖానికి కారణముగా అయ్యాయి. లేదంటే ఈ పదార్థాలన్నీ ఆత్మ యొక్క
సుఖానికి కారణాలు. ఆత్మలకు ఈ సంపద, ధనము మొదలైనవి ఏవైతే ఉన్నాయో,
అవన్నీ సుఖానికి కారణాలు. కానీ ఈ విషయాలన్నింటి గురించి పూర్తి
జ్ఞానం లేని కారణంగా ఇవన్నీ దుఃఖం కలిగించేవిగా అయ్యాయి. నేను
ఈ అనాది రచనను ఏదైతే రచించానో, అదేమీ దుఃఖానికి కారణము కాదు.
అలా కాదు. దుఃఖానికి కారణము మీరు అయ్యారు, మీలో ఇంకేదో వేరేది
వచ్చింది. ఆ వేరేది ఏమిటంటే, ఈ 5 వికారాలు అనే మాయ, ఇప్పుడు
దానినే మీరు తొలగించాలి. మనుష్యులేమో, ఇవన్నీ భగవంతుడు ఇచ్చారని
అంటారు, ఒకవేళ భగవంతుడు ఇస్తే, వారు సుఖమిచ్చే వస్తువులను ఇచ్చి
ఉంటారు కదా. ఇందులో మీరు వికారాలను కలిపి, ఈ వస్తువులన్నింటినీ
పాడు చేసారు. అందుకే తండ్రి అంటారు - మీరు ఈ వికారాలను
తొలగించండి, అప్పుడు సదా కోసము సుఖమయంగా అవుతారు. ఈ విషయాలన్నీ
అర్థం చేసుకోవాల్సినవి. దీని కోసము కాస్త సమయమైతే ఇవ్వాల్సి
ఉంటుంది. దుఃఖాలను అంతం చేసే విధిని నేర్చుకోవాల్సి ఉంటుంది.
దీని కోసమే పదే పదే - రండి, ఎంతో కొంత అర్థం చేసుకోండి అని
అంటారు. కానీ అలాగని ఇక్కడ విని, బయటకు వెళ్తూనే విషయం
సమాప్తమవ్వడం కాదు. చాలా మంది, ఇది పెద్దవారు లేక వృద్ధుల పని
అని అంటారు. జీవితాన్ని తయారు చేసుకోవడమనేది కేవలం వృద్ధులకే
అవసరమా! వృద్ధులు అనగా తప్పుడు మెట్లు ఎక్కి మళ్ళీ చూసుకుని
దిగినవారు, దీని కన్నా మెట్లు ఎక్కే ముందే - మేము జీవితాన్ని
ఎలా నడిపించాలి అని ఎందుకు జాగ్రత్త పడకూడదు, అందుకే వారికి
సలహా ఇస్తాము - ఈ విషయాలను అర్థం చేసుకుని తమ జీవితంలో
దుఃఖానికి మూలమేదైతే ఉందో, దుఃఖానికి కారణమేదైతే ఉందో, దానిని
తొలగించుకునేందుకు పూర్తి-పూర్తి ప్రయత్నం (పురుషార్థం) చేయాలి.
తండ్రి అయిన భగవంతుడు, ఎవరైతే అందరికీ తండ్రినో, వారిపై మనకు
ఏదైతే హక్కు ఉందో, దానిని కూడా అర్థం చేసుకోవాలి మరియు ఆ
హక్కును తీసుకోవాలి. ఊరికినే వారిని తండ్రి అని అనడం కాదు, కానీ
వారి ద్వారా మనం ఏ ప్రాప్తిని చేసుకోవాలి అనేది కూడా ఎవరైనా
వచ్చి వినాలి మరియు అర్థం చేసుకోవాలి. మనం అందరికీ ఆఫర్ అయితే
చేస్తూనే ఉంటాము. ఇంతకుముందు కూడా నిమంత్రణ మరియు సందేశాన్ని
ఇస్తూనే ఉన్నాము. అప్పుడు కోట్లలో కొందరు మేల్కొంటారు.
ఇంతకుముందు కూడా ఇలా జరిగింది, అందుకే భగవంతుడు స్వయంగా అన్నారు
- కోట్లలో కొందరికే నా గురించి తెలుసు. కావున ఇక్కడికి వచ్చి,
ఈ విషయాన్ని అర్థం చేసుకుని మరియు ఎంతో కొంత ధారణ చేసే మాటలు
మాట్లాడండి. ఒక్క రోజులోనే ఈ విషయాలన్నీ అర్థం చేయించడానికి
అవ్వదు. అచ్ఛా. మధురాతి-మధురమైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు
నమస్తే.