25-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి, దేహీ-అభిమానులనే ఈశ్వరీయ సాంప్రదాయనికి చెందినవారని అంటారు”

ప్రశ్న:-

పిల్లలైన మీరిప్పుడు చేసే సత్సంగం ఇతర సత్సంగాలకు అతీతమైనది, అది ఎలా ?

జవాబు:-

ఈ ఒక్క సత్సంగములో మాత్రమే మీరు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము వింటారు. ఇక్కడ చదువు ఉంటుంది. ఇక్కడ లక్ష్యము ఉద్దేశ్యము కూడా మీ ముందు ఉంది. ఇతర సత్సంగాలలో చదువూ ఉండదు, అలాగే ఎటువంటి లక్ష్యమూ ఉద్దేశ్యమూ ఉండదు.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలు వింటున్నారు. మీరు ఎప్పుడు కూర్చున్నా మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి, దేహముగా భావించకండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. దేహాభిమానము కలిగినవారిని ఆసురీ సాంప్రదాయానికి చెందినవారు అని అంటారు. దేహీ-అభిమానులను ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు అని అంటారు. ఈశ్వరుడికి తన దేహము ఉండదు. వారు సదా ఆత్మాభిమానిగానే ఉంటారు. వారు సుప్రీం ఆత్మ, ఆత్మలందరికీ తండ్రి. పరమ ఆత్మ అంటే ఉన్నతాతి ఉన్నతమైనవారు. భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారని మనుష్యులు అన్నప్పుడు వారు నిరాకారుడని, లింగ రూపుడని వారి బుద్ధిలోకి వస్తుంది. నిరాకార లింగానికి పూజ కూడా జరుగుతుంది. వారు పరమాత్మ, వారే ఆత్మలందరి కన్నా ఉన్నతమైనవారు. వారు కూడా ఆత్మనే కానీ వారు ఉన్నతమైన ఆత్మ. వారు జనన-మరణాలలోకి రారు. మిగిలిన వారందరూ పునర్జన్మలను తీసుకుంటారు. మిగిలినవారందరూ వారి రచనయే. రచయిత అయితే ఒక్క తండ్రియే. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా రచనయే. అలాగే, మనుష్య సృష్టి అంతా కూడా రచనయే. రచయితను తండ్రి అని అంటారు. పురుషుడిని కూడా రచయిత అని అంటారు. స్త్రీని దత్తత తీసుకుంటారు, తర్వాత ఆమె ద్వారా రచిస్తారు, పాలన చేస్తారు. వినాశనము ఎవ్వరూ చేయరు. ఇతర ధర్మస్థాపకులు కూడా రచిస్తారు, ఆ తర్వాత వారి పాలన చేస్తారు కానీ ఎవ్వరూ వినాశనం చేయరు. అనంతమైన తండ్రిని పరమ ఆత్మ అని అంటారు, ఏ విధంగా ఆత్మ బిందు రూపంలో ఉంటుందో, అదే విధంగా పరమపిత పరమాత్మ కూడా బిందు రూపంలో ఉంటారు. భక్తి మార్గములో పూజ చేసేందుకు ఇంత పెద్ద లింగాలను తయారుచేస్తారు. బిందువుకు పూజ ఎలా జరుగుతుంది. భారత్ లో రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు శివలింగాన్ని మరియు సాలిగ్రామాలను మట్టితో తయారుచేసి మళ్ళీ వాటిని పూజిస్తారు. దానిని రుద్ర యజ్ఞం అని అంటారు. వాస్తవానికి, అసలు పేరు రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. శాస్త్రాలలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇతర సత్సంగాలలో ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు, ఎవ్వరూ ఇవ్వలేరు. అక్కడైతే లక్ష్యమూ ఉద్దేశ్యమూ ఉండదు. పిల్లలైన మీరిప్పుడు చదువును చదువుకుంటున్నారు. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందని మీకు తెలుసు. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. అత్మ, శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మ అయితే అశరీరి కదా. నగ్నంగా వచ్చాము, నగ్నంగా వెళ్ళాలి అని కూడా అంటారు. శరీరాన్ని ధారణ చేశాము, మళ్ళీ శరీరాన్ని వదిలి నగ్నంగా వెళ్ళాలి. ఈ విషయం తండ్రి కూర్చుని పిల్లలైన మీకే అర్థము చేయిస్తున్నారు. భారత్ లో ఒకప్పుడు సత్యయుగముండేదని, అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేదని, ఒకే ధర్మముండేదని కూడా పిల్లలకు తెలుసు. ఇది కూడా భారతవాసీయులకు తెలియదు. తండ్రి గురించి ఎవరికైతే తెలియదో, వారికేమీ తెలియనట్లే లెక్క. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని ప్రాచీన ఋషులు-మునులు కూడా చెప్పేవారు. రచయిత అనంతమైన తండ్రి, వారికి మాత్రమే రచన ఆదిమధ్యాంతాలను గురించి తెలుసు. ప్రారంభాన్ని ఆది అని, మధ్య సమయాన్ని మధ్యమము అని అంటారు. ఆది అంటే సత్యయుగము, దానిని పగలు అని అంటారు, తర్వాత మధ్యమము నుండి అంతిమం వరకు రాత్రి అని అంటారు. సత్య-త్రేతా యుగాలు పగలు, స్వర్గము ప్రపంచ అద్భుతము. భారత్ యే స్వర్గంగా ఉండేది, అందులో లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేసేవారు, దీనిని గురించి భారతవాసీయులకు తెలియదు. తండ్రి ఇప్పుడు స్వర్గ స్థాపన చేస్తున్నారు.

మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తారు. నేను ఫస్ట్ క్లాస్ ఆత్మను. ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు. ఆత్మ అంటే ఏమిటి అన్నది కూడా తండ్రి తెలియజేస్తారు. మనుష్యులకు ఏమీ తెలియదు. భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రములాగా ప్రకాశిస్తూ ఉంటుందని కూడా అంటారు, కానీ అది ఏమిటో, దానిలో పాత్ర ఏ విధంగా నిండి ఉందో వారికి ఏమాత్రం తెలియదు. భారతవాసీయులైన మీరే 84 జన్మల పాత్రను అభినయించడం జరుగుతుందని ఇప్పుడు మీకు తండ్రి అర్థము చేయించారు. భారత్ యే ఉన్నతమైన ఖండము, మనుష్యమాత్రులందరికీ కూడా ఇది తీర్థ స్థానము, సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి ఇక్కడకు వస్తారు. రావణ రాజ్యము నుండి ముక్తిని కలిగించి మార్గదర్శకులై తీసుకువెళ్తారు. మనుష్యులు కూడా అలాగే అంటారు కానీ ఏ మాత్రము అర్థము తెలియదు. భారత్ లో మొదట దేవీ-దేవతలు ఉండేవారు. వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది. భారతవాసీయులే దేవతలుగా, మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటారు కదా. ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి 7 రోజులు పడుతుంది. పతిత బుద్ధిని పావనంగా తయారుచేయాలి. ఈ లక్ష్మీ-నారాయణులు పావన ప్రపంచములో రాజ్యము చేసేవారు కదా. భారత్ లో వారి రాజ్యమే ఉండేది, అప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు. ఒకే రాజ్యముండేది. భారత్ ఎంత సంపన్నంగా ఉండేది. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి, ఆ తర్వాత రావణ రాజ్యములో పూజారులుగా అయ్యారు. మళ్ళీ భక్తి మార్గములో ఈ మందిరాలు మొదలైనవి నిర్మించారు. సోమనాథుని మందిరము ఉండేది కదా. కేవలం ఒకే మందిరం ఉండదు. ఇక్కడ కూడా శివుని మందిరంలో ఎన్నో వజ్ర వైఢూర్యాలుండేవి, వాటిని మహమ్మద్ గజనీ ఒంటెలపై నింపుకొని తీసుకువెళ్ళాడు. ఒక్క ఒంటె ఏమిటి, కొన్ని లక్షల ఒంటెలను తీసుకొచ్చినా కూడా నింపుకోలేనంత సంపద ఉండేది. సత్యయుగములో బంగారం, వజ్ర-వైఢూర్యాలతో కూడిన మహళ్ళు ఎన్నో ఉండేవి. మహమ్మద్ గజనీ అయితే ఇప్పుడు వచ్చారు. ద్వాపరంలో కూడా ఎన్నో మహళ్ళు మొదలైనవి ఉంటాయి. అవి మళ్ళీ భూకంపములో లోపలికి వెళ్ళిపోతాయి. రావణునికి బంగారు లంక అంటూ ఏదీ ఉండదు. రావణ రాజ్యంలో భారత్ కు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 100 శాతము అధర్మయుక్తంగా, అసత్యంగా, నిరుపేదగా, పతితంగా, వికారీగా తయారయ్యింది, కొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచం అని అంటారు. భారత్ శివాలయంగా ఉండేది, దానిని వండర్ ఆఫ్ వరల్డ్ అని అంటారు. చాలా కొద్దిమంది మనుష్యులు ఉండేవారు. ఇప్పుడైతే కోట్లాది మంది మనుష్యులున్నారు. మరి ఆలోచించాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు ఇది పురుషోత్తమ సంగమయుగము, ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పురుషోత్తములుగా, పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తున్నారు. తండ్రి మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీకు సుమతాన్ని ఇస్తున్నారు. మీ గతి-మతి అతీతమైనవి అని తండ్రి మతానికే గాయనం జరుగుతుంది...... దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. మీరు దేవతలుగా అయ్యేటటువంటి శ్రేష్ఠ మతాన్ని నేను ఇస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు కలియుగము పూర్తి అవుతుంది, పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. మనుష్యులు పూర్తిగా అంధకారములో కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు ఎందుకంటే శాస్త్రాలలో, కలియుగము ఇంకా బాల్యంలో ఉంది, 40 వేల సంవత్సరాలు ఉన్నాయి అని వ్రాసేశారు. 84 లక్షల యోనులలో జన్మ తీసుకుంటామని భావించిన కారణంగా కల్పం ఆయుష్షును కూడా చాలా ఎక్కువగా చూపించారు. వాస్తవానికి ఇది 5 వేల సంవత్సరాలు. మీరు 84 జన్మలు తీసుకుంటారు కానీ 84 లక్షలు కాదు అని తండ్రి అర్థము చేయిస్తారు. అనంతమైన తండ్రికి ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు, అందుకే ఇవన్నీ భక్తిమార్గానికి చెందినవి, ఇవి అర్థకల్పము నడుస్తాయి, వీటి ద్వారా నన్నెవ్వరూ కలుసుకోలేరు అని చెప్తారు. 2000 సంవత్సరాలలోనే క్రిస్టియన్ల సంఖ్య ఇంతగా ఉంది, ఒకవేళ కల్పము ఆయుష్షు లక్షల సంవత్సరాలైతే మరి జన సంఖ్య ఎక్కువగా ఉండాలి, ఇది కూడా ఆలోచించవలసిన విషయము. భారత్ యొక్క అసలైన ధర్మము దేవీ-దేవతా ధర్మము, అది కొనసాగుతూ ఉండాలి కానీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని మర్చిపోయిన కారణంగా మాది హిందూ ధర్మము అని అంటారు. హిందూ ధర్మమనేది ఏదీ లేదు. భారత్ ఎంత ఉన్నతంగా ఉండేది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉన్నప్పుడు విష్ణుపురిగా ఉండేది. ఇప్పుడిది రావణపురి. ఆ దేవీ-దేవతలే 84 జన్మల తర్వాత ఎలా అయిపోయారు. దేవతలను నిర్వికారులుగా భావిస్తూ, స్వయాన్ని వికారులుగా భావిస్తూ వారిని పూజిస్తారు. సత్యయుగంలో భారత్ నిర్వికారీగా ఉండేది, కొత్త ప్రపంచం ఉండేది, దానినే కొత్త భారత్ అని అంటారు. ఇది పాత భారత్. కొత్త భారత్ ఎలా ఉండేది, పాత భారత్ ఎలా ఉంది. కొత్త ప్రపంచములో భారత్ యే కొత్తదిగా ఉండేది, ఇప్పుడు పాత ప్రపంచములో భారత్ కూడా పాతదైపోయింది. ఎటువంటి గతి ఏర్పడింది. భారత్ యే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా అయిపోయింది. భారత్ చాలా సంపన్నంగా ఉండేది, అదే భారత్ పూర్తి నిరుపేదగా అయిపోయింది, అందరి దగ్గర భిక్షం యాచిస్తుంది. ప్రజల నుండి కూడా భిక్షం యాచిస్తుంది. ఇదైతే అర్థము చేసుకోవాల్సిన విషయం కదా. దేహాభిమానంలో ఉన్న నేటి మనుష్యులకు కొంచెం ధనము లభించినాసరే, మేమైతే స్వర్గములో కూర్చున్నాము అని భావిస్తారు. సుఖధామము (స్వర్గము) గురించి అస్సలు తెలియదు ఎందుకంటే రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు వారిని పారసబుద్ధికలవారిగా తయారుచేసేందుకు 7 రోజుల భట్టీలో కూర్చోబెట్టండి ఎందుకంటే పతితంగా ఉన్నారు కదా. పతితులను ఇక్కడ కూర్చోబెట్టలేరు. ఇక్కడ పావనంగా అయిన వారే ఉండగలరు. పతితులను అనుమతించలేరు.

మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగములో కూర్చున్నారు. బాబా మనల్ని అటువంటి పురుషోత్తములుగా తయారుచేస్తారని మీకు తెలుసు. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. సత్యమైన తండ్రి మీకు నరుని నుండి నారాయణునిగా అయ్యే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జ్ఞానము కేవలం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది, వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు అని వారికొక్కరికే ఈ మహిమ ఉంది. ఇంకెవ్వరికీ ఈ మహిమ ఉండదు. దేవతల మహిమ వేరు, పరమపిత పరమాత్మ శివుని మహిమ వేరు. వారు తండ్రి, కృష్ణుడిని తండ్రి అని అనరు. ఇప్పుడు భగవంతుడు ఎవరు? భారతవాసీ మనుష్యులకు ఇప్పటికీ తెలియదు. కృష్ణ భగవానువాచ అని అనేస్తారు. వారైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. సూర్య వంశము నుండి చంద్ర వంశములోకి, చంద్ర వంశము నుండి వైశ్య వంశములోకి వస్తారు......, హం సో అంటే అర్థమేమిటో కూడా మనుష్యులకు తెలియదు. ఆత్మనైన నేనే పరమాత్మ అని అంటారు, ఇది ఎంత తప్పు. భారత్ యొక్క ఎక్కే కళ మరియు దిగే కళ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. ఇది జ్ఞానము, అదంతా భక్తి. సత్యయుగంలో అందరూ పావనంగా ఉండేవారు, రాజా-రాణుల రాజ్యము నడిచేది. అక్కడ మంత్రులు కూడా ఉండరు ఎందుకంటే స్వయంగా రాజా-రాణులే యజమానులు. తండ్రి నుండి వారసత్వము తీసుకున్నారు. వారిలో తెలివి ఉంది, లక్ష్మీ-నారాయణులకు ఎవరి సలహా తీసుకోవలసిన అవసరము ఉండదు. అక్కడ మంత్రులుండరు. భారత్ వంటి పవిత్ర దేశము ఏదీ లేదు. మహాన్ పవిత్ర దేశంగా ఉండేది. దాని పేరే స్వర్గము, ఇప్పుడిది నరకము. నరకము నుండి మళ్ళీ స్వర్గంగా తండ్రియే తయారుచేస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి సుమతంపై నడుస్తూ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. ఈ కళ్యాణకారీ సంగమయుగములో స్వయాన్ని పురుషోత్తములుగా, పారసబుద్ధి కలవారిగా తయారుచేసుకోవాలి.

2. 7 రోజుల భట్టీలో కూర్చుని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారుచేసుకోవాలి. సత్యమైన తండ్రి నుండి సత్యనారాయణుని సత్యమైన కథను విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి.

వరదానము:-

ఫరిస్తాతనపు స్థితి ద్వారా తండ్రి స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూప భవ

ఫరిస్తాతనపు స్థితిలో స్థితి అవ్వడమే తండ్రి స్నేహానికి రిటర్న్ ఇవ్వడం, ఈ విధంగా రిటర్న్ ఇచ్చేవారు సమాధాన స్వరూపులుగా అయిపోతారు. సమాధాన స్వరూపులుగా అవ్వడం వలన స్వయం మరియు ఇతర ఆత్మల సమస్యలు స్వతహాగా సమాప్తమైపోతాయి. కనుక ఇప్పుడు అటువంటి సేవ చేసే సమయము, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయము. కావున ఇప్పుడు తండ్రి సమానంగా ఉపకారులుగా అయి, పిలుపును విని మీ ఫరిస్తా రూపం ద్వారా ఆ ఆత్మల వద్దకు చేరుకోండి మరియు సమస్యలతో అలసిపోయిన ఆత్మల అలసటను తొలగించండి.

స్లోగన్:-

వ్యర్థము నుండి నిశ్చింతులుగా అవ్వండి కానీ మర్యాదలలో కాదు.