26-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 27-02-1986


"ఆత్మిక సైన్యము కల్ప-కల్పపువిజయులు"

ఆత్మిక శక్తి సైన్యము, పాండవ సైన్యము, ఆత్మిక సైన్యమంతా సదా విజయులమనే నిశ్చయము మరియు నషాలో ఉంటున్నారు కదా, ఇతర ఏ సైన్యమైనా యుద్ధము చేస్తున్నప్పుడు విజయులుగా అవుతామనే గ్యారంటీ ఉండదు. విజయము నిశ్చితమయ్యే ఉంది అనే నిశ్చయము ఉండదు. కానీ ఆత్మిక సైన్యము, శక్తి సైన్యము అయిన మీరు కేవలం ఇప్పుడు మాత్రమే విజయులము కాదు, కల్ప-కల్పానికి విజయులము అనే నిశ్చయము మరియు నషాలో సదా ఉంటారు. మీ కల్పక్రితపు విజయ కథలను కూడా భక్తిమార్గంలో వింటున్నారు. పాండవుల విజయానికి గుర్తుగా ఉన్న కథను ఇప్పుడు కూడా వింటున్నారు. మీ విజయ చిత్రాలను ఇప్పుడు కూడా చూస్తున్నారు. భక్తిలో కేవలం అహింసకులకు బదులుగా హింసకులుగా చూపించారు. ఆత్మిక సైన్యాన్ని సాధారణమైన భౌతిక సైన్యంగా చూపించారు. మీ విజయపు గాయనాన్ని ఇప్పుడు కూడా భక్తుల ద్వారా విని హర్షితులవుతారు. ప్రభు ప్రీతి బుద్ధి విజయంతి, విపరీత బుద్ధి వినశ్యంతి అని కూడా గాయనము ఉంది. మరి కల్పక్రితపు మీ మహిమ ఎంత ప్రసిద్ధమైనది! విజయము నిశ్చితమై ఉన్నందుకు నిశ్చయబుద్ధి విజయులుగా ఉన్నారు, అందుకే మాలను కూడా విజయమాల అని అంటారు. మరి నిశ్చయము మరియు నషా రెండూ ఉన్నాయి కదా. ఎవరైనా ఒకవేళ అడిగితే, మా విజయము ఉండనే ఉన్నది అని నిశ్చయంతో చెప్తారు. స్వప్నంలో కూడా, ఏమో తెలియదు విజయము వస్తుందో రాదో అనే సంకల్పము రాకూడదు, విజయము తథ్యము. గడిచిన కల్పము గురించి మరియు భవిష్యత్తు గురించి కూడా మీకు తెలుసు. త్రికాలదర్శులుగా అయి అదే నషాతో చెప్తారు. అందరూ పక్కాగా ఉన్నారు కదా! ఒకవేళ ఎవరైనా, ఆలోచించండి, చూడండి అని అంటే ఏం చెప్తారు? అనేకసార్లు చూసేశాము అని చెప్తారు. ఏదైనా కొత్త విషయముంటే ఆలోచించాలి, చూడాలి కూడా. అనేకసార్లు జరిగిన విషయాన్ని ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. మరి మీరందరూ ఇటువంటి నిశ్చయబుద్ధి జ్ఞానీ ఆత్మలు, యోగీ ఆత్మలే కదా!

ఈ రోజు ఆఫ్రికా గ్రూపు వారి టర్ను. వాస్తవానికి అందరూ ఇప్పుడు మధువనవాసులే. పర్మనెంట్ అడ్రస్సు మధువనమే కదా. అదైతే సేవాస్థానము. సేవాస్థానము అంటే ఆఫీసు వంటిది, కానీ ఇల్లయితే మధువనము కదా. సేవార్థము ఆఫ్రికా, యు.కె మొదలైన స్థానాలకు నలువైపులా వెళ్ళారు. ధర్మము మారినా కానీ, దేశము మారినా కానీ సేవ కొరకే వెళ్ళారు. ఏ ఇల్లు గుర్తుకొస్తుంది? మధువనమా, పరంధామమా? సేవా స్థానంలో సేవ చేస్తున్నా సదా మధువనము మరియు మురళి, ఇవే గుర్తుంటాయి కదా. ఆఫ్రికాకు కూడా సేవ కోసమే వెళ్ళారు కదా. సేవ మిమ్మల్ని జ్ఞాన గంగలుగా చేసింది. జ్ఞాన గంగలలో జ్ఞాన స్నానము చేసి ఈ రోజు ఎంతమంది పావనంగా అయ్యారు! భిన్న-భిన్న స్థానాలలో పిల్లలు సేవ చేయడాన్ని చూసిన బాప్ దాదా, సేవ కోసం ఎటువంటి స్థానాలకు వెళ్ళి నిర్భయులుగా అయి ఎంతో ప్రేమతో ఉంటున్నారు అన్నదానిని ఆలోచిస్తారు. ఆఫ్రికా వారి వాయుమండలము, వారి ఆహార-వ్యవహారాలు ఎటువంటివి, అయినా కూడా సేవ కారణంగా ఉన్నారు. సేవా బలము లభిస్తూ ఉంటుంది. సేవకు ప్రత్యక్ష ఫలము లభిస్తుంది, ఆ బలము నిర్భయులుగా తయారుచేస్తుంది. ఎప్పుడూ భయపడరు కదా. అఫీషియల్ నిమంత్రణ మొదట ఇక్కడి నుండి లభించింది. విదేశాల సేవ కొరకు నిమంత్రణ లభించడంతో అటువంటి దేశాలకు చేరుకున్నారు. నిమంత్రణ ద్వారా సేవకు పునాది ఇక్కడి నుండే ప్రారంభమైంది. సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాల ప్రత్యక్ష ఫలాన్ని ఇక్కడి పిల్లలు చూపించారు. నిమిత్తంగా అయిన ఆ ఒక్కరి బలిహారం వలన ఎన్నో మంచి-మంచి దాగి ఉన్న రత్నాలు బయటకు వచ్చాయి. ఇప్పుడైతే చాలా వృద్ధి జరిగింది. వారు దాగి ఉన్నారు, మీరు ప్రత్యక్షమయ్యారు. నిమంత్రణ కారణంగా మీ నంబరు ముందుకు వచ్చేసింది. కావున ఆఫ్రికా వారిని బాప్ దాదా ఆఫ్రీన్ (బహుమతి)ని తీసుకునేవారు అని అంటారు. అది బహుమతి తీసుకునే స్థానము ఎందుకంటే అక్కడ వాతావరణము అశుద్ధంగా ఉంది. అశుద్ధమైన వాతావరణంలో వృద్ధి జరుగుతుంది. అందువలన బహుమతి అని అంటారు.

ఈ శక్తి సైన్యము మరియు పాండవ సైన్యము ఇరువురూ శక్తిశాలురే. మెజారిటీ ఇండియా వారే, కానీ ఇండియా నుండి దూరమైపోయారు కావున దూరంగా ఉన్నా తమ హక్కునైతే వదల్లేరు. అక్కడ కూడా తండ్రి పరిచయము లభించింది. తండ్రికి చెందినవారిగా అయ్యారు. నైరోబీలో కష్టమనిపించలేదు. తప్పిపోయినవారు సహజంగానే వచ్చి చేరుకున్నారు మరియు గుజరాతీయుల విశేష సంస్కారమిది. అందరూ కలిసి గర్బా రాస్ చేస్తారు - ఇదే వారి పద్ధతి. ఒంటరిగా చెయ్యరు. చిన్నవారు అయినా, లావుగా ఉన్నవారు అయినా, అందరూ కలిసి గర్బా డాన్స్ తప్పకుండా చేస్తారు. ఇది సంగఠనకు గుర్తు. గుజరాత్ వారు సంగఠన కలవారిగా ఉండడాన్ని సేవలో కూడా చూడడం జరుగుతుంది. ఒక్కరు వచ్చారంటే, వారు తప్పకుండా 10 మందిని తీసుకొస్తారు. వారిలో సంగఠితంగా ఉండే ఈ పద్ధతి బాగుంది, అందుకే త్వరగా వృద్ధి చెందుతుంది. సేవ యొక్క వృద్ధి మరియు విస్తారము కూడా అవుతుంది. ఇటువంటి స్థానాలలో శాంతి శక్తిని ఇవ్వడం, భయానికి బదులుగా సంతోషాన్ని ఇవ్వడం - ఇదే శ్రేష్ఠమైన సేవ. ఇటువంటి స్థానాలలో అవసరముంది. మీరు విశ్వకళ్యాణకారులు కావున విశ్వం నలువైపులా సేవ పెరగాలి మరియు నిమిత్తంగా అవ్వాల్సిందే. ఏ మూల అయినా ఒకవేళ మిగిలిపోయినట్లైతే ఫిర్యాదు చేస్తారు. అచ్ఛా, పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయం లభిస్తుంది. అక్కడ నుండే హ్యాండ్స్ వెలువడి, సేవ చేస్తున్నారు. ఇది కూడా సహయోగమైంది కదా. స్వయం మేల్కుంటే చాలా మంచిది కానీ, స్వయం మేల్కొని తర్వాత ఇతరులను మేల్కొల్పేందుకు కూడా నిమిత్తంగా అయ్యారు, ఇది డబల్ లాభము అయింది. చాలావరకు హ్యాండ్స్ కూడా అక్కడివారే. ఈ విశేషత బాగుంది. విదేశాల సేవలో మెజారిటీ అక్కడే వెలువడి అక్కడే సేవకు నిమిత్తంగా అవుతారు. విదేశాలవారు భారతదేశానికి హ్యాండ్స్ ఇవ్వలేదు. భారతదేశము విదేశం వారికి ఇచ్చింది. భారతదేశము కూడా చాలా పెద్దది, వేరు-వేరు జోన్లు ఉన్నాయి. స్వర్గంగా అయితే భారతదేశాన్నే చేయాల్సి ఉంటుంది. విదేశాలు పిక్నిక్ స్థానాలుగా అవుతాయి. కావున అందరూ ఎవర్రెడీగా ఉన్నారు కదా. ఈరోజు ఎవరినైనా ఎక్కడికైనా పంపిస్తే, వెళ్ళేందుకు ఎవర్రెడీగా ఉన్నారు కదా! ధైర్యముంచినట్లైతే సహయోగము కూడా లభిస్తుంది. ఎవర్రెడీగా తప్పకుండా ఉండాలి. అటువంటి సమయం వచ్చినప్పుడు, ఆర్డర్ చెయ్యాల్సి వస్తుంది. తండ్రి ద్వారా ఆర్డర్ రానే వస్తుంది. ఎప్పుడు చేస్తారో, ఆ తేదీని చెప్పరు. తేదీని చెప్పినట్లైతే అందరూ నంబరువన్ లో పాస్ అయిపోతారు. ఇక్కడ అకస్మాత్తుగా తేదీని గురించి ఒక్కటే ప్రశ్న వస్తుంది. ఎవర్రెడీగా ఉన్నారు కదా. ఇక్కడే కూర్చుండిపోండి అని చెప్తే పిల్లా పాపలు, ఇల్లు మొదలైనవి గుర్తుకు వస్తాయా? సుఖ సాధనాలైతే అక్కడ ఉన్నాయి కానీ స్వర్గమైతే ఇక్కడే తయారవ్వాలి. కావున సదా ఎవర్రెడీగా ఉండడమే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత. మీ బుద్ధి లైను స్పష్టంగా ఉండాలి. సేవ కోసం నిమిత్తమాత్రంగా స్థానాన్ని తండ్రి ఇచ్చారు. కావున నిమిత్తంగా అయి సేవలో ఉపస్థితులయ్యారు. తర్వాత తండ్రి నుండి సూచన లభించిందంటే ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. డైరెక్షన్ అనుసారంగా సేవ బాగా చేస్తున్నారు, అందుకే అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉన్నారు. ఆఫ్రికా వారు కూడా బాగా వృద్ధి చేశారు. వి.ఐ.పి సేవ బాగా జరుగుతుంది. గవర్నమెంట్ తో కూడా కనెక్షన్ బాగుంది. అన్ని రకాల వర్గాలకు చెందిన ఆత్మల సంపర్కము ఏదో ఒక సమయంలో సమీపంగా తప్పకుండా తీసుకొస్తుంది, ఇది విశేషత. ఈ రోజు సంపర్కంలో ఉన్నవారు రేపు సంబంధంలోకి వచ్చేస్తారు. వారిని మేల్కొల్పుతూ ఉండాలి. లేకపోతే కొద్దిగా కళ్ళు తెరిచి, మళ్ళీ నిద్రపోతారు. కుంభకర్ణులుగా అయితే ఉండనే ఉన్నారు. నిద్ర మత్తు ఉన్నప్పుడు ఏమైనా తిన్నా, తాగినా మర్చిపోతారు. కుంభకర్ణులు కూడా అలాగే ఉంటారు. మళ్ళీ వస్తాము, ఇది చేస్తాము అని అంటారు కానీ మళ్ళీ అడిగితే గుర్తు లేదని అంటారు, కావున మాటిమాటికీ మేల్కొల్పవలసి వస్తుంది. గుజరాత్ వారు తండ్రికి చెందినవారిగా అవ్వడంలో, తనువు-మనసు-ధనముల ద్వారా స్వయాన్ని సేవలో నిమగ్నం చేయడంలో మంచి నంబరు తీసుకున్నారు. సహజంగానే సహయోగులుగా అవుతారు. ఇది కూడా భాగ్యము. గుజరాత్ వారి సంఖ్య బాగుంది. తండ్రికి చెందినవారిగా అయ్యే లాటరీ తక్కువైనదేమీ కాదు.

ప్రతి స్థానంలోనూ తండ్రి నుండి విడిపోయిన రత్నాలు ఎవరో ఒకరు ఉండనే ఉన్నారు. ఎక్కడ కాలు పెట్టినా, ఎవరో ఒకరు తప్పకుండా వెలువడతారు. నిశ్చింతులుగా అయి, నిర్భయులుగా అయి సేవలో తపనతో ముందుకు వెళ్తే పదమాలరెట్ల సహయోగం కూడా లభిస్తుంది. అఫీషియల్ నిమంత్రణ అయితే ఇక్కడి నుండే ప్రారంభమయింది. అయినా సేవకు జమా అయితే అయింది కదా. ఆ జమా ఖాతా సమయానికి తప్పకుండా లాగుతుంది. కావున అందరూ నంబరువన్, తీవ్ర పురుషార్థులు, బహుమతిని తీసుకునేవారే కదా. సంబంధాలు నిర్వర్తించడంలో నంబరువన్, సేవలో ఋజువు చూపించడంలో నంబరువన్, అన్నింటిలోనూ నంబరువన్ అవ్వవలసిందే, అప్పుడే బహుమతిని తీసుకుంటారు కదా. బహుమతుల మీద బహుమతులు పొందుతూ ఉండాలి. అందరి ధైర్యాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తారు. అనేక ఆత్మలకు తండ్రి ఆధారాన్ని ఇప్పించేందుకు నిమిత్తులై ఉన్నారు. పరివారాలకు పరివారాలే మంచివి ఉన్నాయి. పరివారాన్ని బాబా పుష్పగుచ్ఛమని అంటారు. ఈ విశేషత కూడా బాగుంది. వాస్తవానికి అన్నీ బ్రాహ్మణుల స్థానాలే. ఒకవేళ ఎవరైనా నైరోబీ వెళ్ళినా లేక మరెక్కడికైనా వెళ్ళినా, ఇది మా సెంటరు, బాబా సెంటరు అని అంటారు. మా పరివారము అని అంటారు, మరి ఎంత భాగ్యశాలీగా అయ్యారు! బాప్ దాదా ప్రతి ఒక్క రత్నాన్ని చూసి సంతోషిస్తారు. ఏ స్థానానికి చెందినవారైనా సరే వారు తండ్రికి చెందినవారు మరియు తండ్రి పిల్లలకు చెందినవారు, అందుకే బ్రాహ్మణ ఆత్మలు అత్యంత ప్రియమైనవారు. విశేషమైనవారు. ఒకరి కంటే ఒకరు ఎక్కువ ప్రియంగా అనిపిస్తారు. అచ్ఛా.

ఇప్పుడు ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేయండి (ఎన్నుకోబడిన అవ్యక్త మహావాక్యాలు)

బ్రాహ్మణులైన మీ వంటి ఆత్మిక పర్సనాలిటీ పూర్తి కల్పమంతటిలో ఇంకెవ్వరికీ లేదు, ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారుచేసేవారు స్వయం ఉన్నతోన్నతుడైన పరమాత్మ. అన్నింటికంటే మీ అతి పెద్ద పర్సనాలిటీ - స్వప్నము లేక సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత. ఈ పవిత్రతతో పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మికత యొక్క పర్సనాలిటీ కూడా ఉంది. మీ ఈ పర్సనాలిటీలో సదా స్థితులై ఉంటే సేవ స్వతహాగానే జరుగుతుంది. ఎటువంటి ఆందోళన, అశాంతితో ఉన్న ఆత్మ అయినాగానీ, మీ ఆత్మిక పర్సనాలిటీ యొక్క మెరుపు, ప్రసన్నతా దృష్టి వారిని ప్రసన్నం చేస్తుంది. దృష్టి ద్వారా తృప్తి చెందుతారు. సమయ సమీపత అనుసారంగా ఇప్పుడిది దృష్టి ద్వారా తృప్తపరిచే సేవ చేసే సమయము. మీ ఒక్క దృష్టితో వారు ప్రసన్నచిత్తులుగా అవుతారు, వారి మనసులోని కోరిక పూర్తైపోతుంది.

ఎలా అయితే బ్రహ్మాతండ్రి యొక్క ముఖము మరియు నడవడిక యొక్క పర్సనాలిటీ పట్ల మీరందరూ ఆకర్షితమయ్యారో, అలా తండ్రిని అనుసరించండి. సర్వ ప్రాప్తుల లిస్టును బుద్ధిలో ఇమర్జ్ చేసుకుంటే ముఖము మరియు నడవడికలో ప్రసన్నతా పర్సనాలిటీ కనిపిస్తుంది, అంతేకాక ఈ పర్సనాలిటీ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేసేందుకు మీ మూడ్ ను సదా హర్షితంగా మరియు జాగ్రత్తగా ఉంచుకోండి. మూడ్ మారిపోకూడదు. కారణమేదైనా కానీ, ఆ కారణాన్ని నివారణ చేయండి. సదా ప్రసన్నతా పర్సనాలిటీలో ఉండండి. ప్రసన్నచిత్తులుగా ఉంటే ఎంతో మంచి అనుభవాన్ని చేస్తారు. ప్రసన్నచిత్తులుగా ఉండే ఆత్మల సాంగత్యంలో ఉండడం, వారితో మాట్లాడడం, కూర్చోవడం అందరికీ బాగా అనిపిస్తుంది. కావున ప్రశ్నచిత్తులుగా కాదు, ప్రసన్నచిత్తులుగా ఉండాలనే లక్ష్యముంచుకోండి.

పిల్లలైన మీరు బాహ్య రూపంలో సాధారణ పర్సనాలిటీ కలవారిగా ఉన్నా కానీ ఆత్మిక పర్సనాలిటీలో అందరికంటే నంబరువన్ గా ఉన్నారు. మీ ముఖము, నడవడికలో పవిత్రతా పర్సనాలిటీ ఉంది. ఎవరైనాసరే ఎంతగా పవిత్రంగా ఉన్నారో, అంతగా వారి పర్సనాలిటీ కేవలం కనిపించడమే కాకుండా అనుభవమవుతుంది మరియు ఆ పర్సనాలిటీయే సేవ చేస్తుంది. ఎవరైతే ఉన్నతమైన పర్సనాలిటీ కలవారిగా ఉంటారో వారికి ఎక్కడా, దేనిపైకీ దృష్టి వెళ్ళదు ఎందుకంటే వారు సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. వారెప్పుడూ తమ ప్రాప్తుల భాండాగారంలో ఎటువంటి అప్రాప్తినీ అనుభవం చేయరు. వారు సదా మనసుతో నిండుగా ఉన్న కారణంగా సంతుష్టంగా ఉంటారు, ఇటువంటి సంతుష్టంగా ఉండే ఆత్మయే ఇతరులను సంతుష్టంగా చేయగలదు.

ఎంతగా పవిత్రత ఉంటుందో, అంతగా బ్రాహ్మణ జీవిత పర్సనాలిటీ ఉంటుంది, ఒకవేళ పవిత్రత తక్కువగా ఉంటే పర్సనాలిటీ తక్కువగా ఉంటుంది. ఈ పవిత్రతా పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతనిప్పిస్తుంది. కానీ ఒకవేళ ఒక్క వికారమైనా, అంశమాత్రం ఉన్నాసరే మిగిలిన సహచరులన్నీ దానితో పాటు తప్పకుండా ఉంటాయి. ఎలాగైతే పవిత్రతకు సుఖ-శాంతులతో లోతైన సంబంధముందో, అలా అపవిత్రతకు కూడా 5 వికారాలతో లోతైన సంబంధముంది, కావున ఏ వికారమూ అంశమాత్రం కూడా ఉండకూడదు, అప్పుడే పవిత్రతా పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారు అని అంటారు.

ఈ రోజుల్లో రెండు రకాల పర్సనాలిటీల గాయనముంది - ఒకటి శారీరిక పర్సనాలిటీ, రెండవది - పొజిషన్ యొక్క పర్సనాలిటీ. బ్రాహ్మణ జీవితంలో ఏ బ్రాహ్మణాత్మలోనైతే సంతుష్టత అనే మహానత ఉందో వారి ముఖంలో సంతుష్టత మరియు శ్రేష్ఠ స్థితి అనే పొజిషన్ యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. ఎవరి నయనాలలో, ముఖంలో, నడవడికలో సంతుష్టతా పర్సనాలిటీ కనిపిస్తుందో వారే తపస్వీలు. వారి చిత్తము సదా ప్రసన్నంగా ఉంటుంది, మనసు, బుద్ధి సదా విశ్రాంతిగా, సుఖశాంతుల స్థితిలో ఉంటాయి, ఎప్పుడూ అశాంతిగా ఉండవు. ప్రతి మాట మరియు కర్మ ద్వారా, దృష్టి మరియు వృత్తి ద్వారా ఆత్మిక పర్సనాలిటీ మరియు రాయల్టీని అనుభవం చేయిస్తారు.

విశేషమైన ఆత్మలను మరియు మహాన్ ఆత్మలను దేశము లేక విశ్వం యొక్క పర్సనాలిటీలు అని అంటారు. పవిత్రతా పర్సనాలిటీ అనగా ప్రతి కర్మలో మహానత మరియు విశేషత. ఆత్మిక పర్సనాలిటీ గల ఆత్మలు తమ శక్తి, సమయము, సంకల్పాలను వ్యర్థంగా పోగొట్టుకోరు, సఫలం చేస్తారు. ఇటువంటి పర్సనాలిటీ గల ఆత్మలు ఎప్పుడూ చిన్న-చిన్న విషయాలలో తమ మనసు-బుద్ధిని బిజీగా పెట్టుకోరు. ఆత్మిక పర్సనాలిటీ గల విశేషమైన ఆత్మల దృష్టి, వృత్తి, మాట.... అన్నింటిలో అలౌకికత ఉంటుంది, సాధారణత కాదు. సాధారణమైన కార్యం చేస్తున్నా కూడా శక్తిశాలీ, కర్మయోగీ స్థితిని అనుభవం చేయిస్తారు. బ్రహ్మా తండ్రి పర్సనాలిటీ ఎలాగైతే, పిల్లలతో కలిసి కూరగాయలు కట్ చేస్తున్నా, ఆటలాడుతున్నా సదా ఆకర్షిస్తూ ఉండడాన్ని చూసారో, అలా ఫాలో ఫాదర్.

బ్రాహ్మణ జీవితానికి పర్సనాలిటీ ‘ప్రసన్నత’. ఈ పర్సనాలిటీని అనుభవంలోకి తీసుకురండి మరియు ఇతరులను కూడా అనుభవీలుగా చేయండి. సదా శుభచింతనతో సంపన్నంగా ఉండండి, శుభ చింతకులుగా అయి అందరినీ స్నేహీలు, సహయోగులుగా చెయ్యండి. శుభచింతక ఆత్మలే సదా ప్రసన్నతా పర్సనాలిటీలో ఉంటూ విశ్వం ఎదురుగా విశేషమైన పర్సనాలిటీ కలవారిగా అవుతారు. ఈ రోజుల్లో పర్సనాలిటీ కల ఆత్మలు కేవలం ప్రసిద్ధంగా అవుతారు అనగా వారి పేరు ప్రసిద్ధమవుతుంది కానీ ఆత్మిక పర్సనాలిటీ కల మీరు కేవలం ప్రసిద్ధమవ్వడం అనగా గాయన యోగ్యులుగా అవ్వడమే కాదు, కానీ గాయన యోగ్యులగా అవ్వడంతోపాటు పూజ్యనీయ యోగ్యులుగా కూడా అవుతారు. ధర్మ క్షేత్రంలో, రాజ్య క్షేత్రంలో, సైన్సు క్షేత్రంలో ఎంత గొప్ప పర్సనాలిటీ కలవారు ప్రసిద్ధులయ్యారు, కానీ ఆత్మిక పర్సనాలిటీ కలవారైన మీ సమానంగా 63 జన్మలు పూజ్యనీయులుగా అవ్వలేదు.

వరదానము:-

కంబైండ్ స్వరూప స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి అనే సీటుపై సెట్ అయి ఉండే సదా సంపన్న భవ

సంగమయుగంలో శివశక్తి కంబైండ్ స్వరూప స్మృతిలో ఉంటే ప్రతి అసంభవ కార్యము సంభవమైపోతుంది. ఇదే సర్వ శ్రేష్ఠమైన స్వరూపము. ఈ స్వరూపంలో స్థితులై ఉంటే సంపన్న భవ అనే వరదానము లభిస్తుంది. బాప్ దాదా పిల్లలందరికీ సదా సుఖదాయీ స్థితి అనే సీటును ఇస్తారు. సదా ఈ సీటుపై సెట్ అయి ఉంటే అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉంటారు, కేవలం విస్మృతి సంస్కారాన్ని సమాప్తం చేయండి.

స్లోగన్:-

శక్తిశాలీ వృత్తి ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారుచేయండి.