01-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.12.2008


‘‘ఒకే రాజ్యము, ఒకే ధర్మము మరియు లా అండ్ ఆర్డర్ స్థాపన అవుతున్న సమయములో స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తకులుగా అవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ అత్యంత ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొద్దిమందికే ప్రాప్తిస్తుంది. పరమాత్ముని ప్రేమలో బాప్ దాదా ప్రతి బిడ్డను మూడు సింహాసనాలకు అధికారులుగా చేసారు. ఒకటి - స్వరాజ్య అధికారపు భృకుటి సింహాసనము, రెండవది - బాప్ దాదా హృదయ సింహాసనము మరియు మూడవది - విశ్వ రాజ్యాధికార సింహాసనము. ఈ మూడు సింహాసనాలను బాబా తమ స్నేహీ, ప్రియమైన పిల్లలకు ఇచ్చారు. ఈ మూడు సింహాసనాలు సదా స్మృతిలో ఉన్నట్లయితే ప్రతి బిడ్డకు ఆత్మిక నషా ఉంటుంది. మరి పిల్లలందరూ బాబా ద్వారా ప్రాప్తించిన వారసత్వాన్ని చూసుకుని సంతోషముగా ఉంటున్నారు కదా! హృదయములో స్వతహాగా - వాహ్ బాబా వాహ్! మరియు వాహ్ నా భాగ్యము వాహ్! అనే పాట మ్రోగుతూనే ఉంటుంది. ఏదైతే స్వప్నములో కూడా లేదో, అది ప్రాక్టికల్ జీవితములో లభించింది. సింహాసనముతో పాటుగా బాప్ దాదా ఈ సంగమములో డబుల్ కిరీటము ద్వారా ఎగిరే కళ యొక్క అనుభవీగా కూడా చేసారు. బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క డబల్ కిరీటధారీ స్వరూపాన్ని చూస్తున్నారు - ఒకటి, పవిత్రతతో కూడిన రాయల్టీ యొక్క కిరీటము, రెండు, సేవా బాధ్యత యొక్క కిరీటము.

బాప్ దాదా ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లల యొక్క పురుషార్థపు వేగాన్ని చెక్ చేసారు ఎందుకంటే సమయము యొక్క వేగాన్ని అయితే మీరందరూ కూడా చూస్తున్నారు మరియు తెలుసుకుంటున్నారు. బాప్ దాదా ఏమి చూసారంటే - ప్రతి ఒక్కరికీ బాబా ద్వారా ఏదైతే రాజ్య భాగ్యపు వారసత్వము లభించిందో, తమ రాజ్యము, భవిష్య ప్రాప్తి, మరి భవిష్యత్తులో ఎలా అయితే మీ అందరి సంస్కారాలు నేచురల్ గా (సహజముగా) మరియు నేచర్ గా (స్వాభావికముగా) ఉంటాయో, అవి ఇప్పటినుండే బహుకాలపు సంస్కారాలుగా అనుభవము అవ్వాలి, ఎందుకంటే మీ అందరి కొత్త సంస్కారాల ద్వారానే ఈ కొత్త ప్రపంచము తయారవుతూ ఉంది. కావున కొత్త ప్రపంచపు విశేషతలేవైతే ఉన్నాయో, వాటిని కూడా అనుభవమైతే చేస్తూ ఉంటారు కదా. మా రాజ్యములో ఏముంటుంది అని నషా ఉంది కదా! మా రాజ్యము, మా కొత్త ప్రపంచము ఇక వచ్చేసినట్లే అని మనసు చెప్తుంది కదా. కావున బాప్ దాదా చూస్తున్నారు, కొత్త ప్రపంచపు విశేషతలేవైతే ఉంటాయో, అవి పిల్లల యొక్క పురుషార్థీ జీవితములో ఎంతవరకు ఇమర్జ్ అయి ఉన్నాయి. కొత్త సంస్కారాలు మరియు కొత్త ప్రపంచములోని విశేషతలు ఏమిటి అనేదైతే తెలుసు కదా! అందరి బుద్ధిలోనూ కొత్త ప్రపంచము యొక్క విశేషతలు ఇమర్జ్ అయి ఉన్నాయి కదా! తెలుసు కదా! పాడుతారు కూడా, తెలుసు కూడా. మొదటి విశేషత ఏమిటంటే... ఒక్కొక్క విశేషత నాలో ఎంత ఇమర్జ్ అయి ఉంది అని చెక్ చేసుకోండి. ముఖ్యమైన విశేషత ఏమిటంటే - ఒకే రాజ్యము. ఏ విధముగానైతే అక్కడ ఒకే రాజ్యము స్వతహాగా ఉంటుందో, మరో రాజ్యము ఉండదో, అదే విధముగా మీ సంగమ జీవితములో చూడండి, మీ జీవితములో కూడా ఒకే రాజ్యము ఉందా? లేక అప్పుడప్పుడు మరో రాజ్యము కూడా ఉంటుందా? ఒకవేళ నడుస్తూ-నడుస్తూ స్వ రాజ్యముతో పాటుగా మాయా రాజ్యము కూడా నడుస్తుంటే మరి ఏక రాజ్యము యొక్క సంస్కారాలు ఉంటాయా? ఏక రాజ్యము ఉంటూ ఉండగా మరో రాజ్యమైతే నడవటము లేదు కదా? పరమాత్ముని శ్రీమతము యొక్క రాజ్యము ఉందా లేక అప్పుడప్పుడూ మాయ ఒత్తిడి కూడా ఉంటుందా? హృదయములో మాయా రాజ్యమైతే ఉండటము లేదు కదా? ఇది చెక్ చేసుకోండి. ఈ విషయాల ఆధారముగా మీ చార్టును చెక్ చేసుకోండి. ఇప్పుడు సంగమములో ఒక్క పరమాత్ముని రాజ్యమే ఉందా లేక మాయ ఒత్తిడి కూడా ఉంటుందా? చెక్ చేసుకున్నారా? ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి. మీ చార్టునైతే చూసుకుంటూ ఉంటారు కదా. మరి ఒకవేళ ఇప్పటివరకు కూడా రెండు రాజ్యాలు ఉన్నట్లయితే ఏక రాజ్యానికి అధికారులుగా ఎలా అవుతారు? శ్రీమతముతో పాటు మాయా మతము కూడా మిక్స్ అయిపోతూ ఉంటుందా ఏమిటి? అదే విధముగా ఒకే ధర్మము. అక్కడ ఒకే రాజ్యము కూడా ఉంటుంది, అలాగే ఒకే ధర్మము కూడా ఉంటుంది. ధర్మము అనగా ధారణ. మరి మీ విశేష ధారణ ఏమిటి? పవిత్రత యొక్క ధారణ. కావున చెక్ చేసుకోండి - సదా మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలలో సంపూర్ణ పవిత్రత మరియు సదా పవిత్రత యొక్క నేచర్ న్యాచురల్ అయ్యిందా? ఎలా అయితే అక్కడ మీ రాజ్యములో పవిత్రత యొక్క స్వధర్మము స్వతహాగా ఉంటుందో, అదే విధముగా ఈ సమయములో పవిత్రత యొక్క ధారణ నేచురల్ గా మరియు నేచర్ గా (సహజముగా మరియు స్వభావముగా) అయ్యిందా? ఎందుకంటే మీ అనాది స్వరూపము మరియు ఆది స్వరూపము పవిత్రత అని మీకు తెలుసు. కావున చెక్ చేసుకోండి - ఏక ధర్మము అనగా పవిత్రత నేచురల్ గా ఉందా? ఏదైతే నేచర్ (స్వభావము) ఉంటుందో అది వద్దనుకున్నా కూడా పని చేసేస్తుంది. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారు? చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతారు, ఏమంటారంటే - కావాలని అనుకోవటము లేదు కానీ ఒక్కోసారి మనసాలో, ఒక్కోసారి వాచాలో ఏదో ఒక అపవిత్రతా అంశము ఇమర్జ్ అయిపోతుంది. అది అనేక జన్మల సంస్కారము కదా, అందుకే అలా అవుతుంది. ఏక ధర్మము అనగా అర్థము పవిత్రత యొక్క ధారణ నేచర్ గా మరియు నేచురల్ గా ఉండాలి. వాచాలో ఆవేశము వచ్చినా కూడా ఏమంటారంటే, క్రోధము కాదు కానీ కొద్దిగా ఆవేశము వచ్చేసింది అని. మరి ఆవేశము అంటే ఏమిటి? అది క్రోధము యొక్క సంతానమే కదా. మరి ఏక ధర్మము యొక్క సంస్కారాలు ఎప్పటికి నేచురల్ అవుతాయి? కావున చెక్ చేసుకోండి కానీ చెక్ చేసుకోవడముతో పాటు బాబా ద్వారా లభించిన శక్తుల ద్వారా చేంజ్ (పరివర్తన) చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాప్ దాదా ముందు నుండే అటెన్షన్ ఇప్పిస్తున్నారు - ఇప్పటికైనా చెక్ చేసుకుని చేంజ్ చేసుకునే తీవ్ర పురుషార్థము చేసినట్లయితే ఇంకా అవకాశము ఉంది, కానీ కొద్ది సమయము తర్వాత అకస్మాత్తుగా టూ లేట్ (చాలా ఆలస్యము) అన్న బోర్డును పెట్టబడేదే ఉంది. అప్పుడు మళ్ళీ, బాబా అయితే చెప్పనే లేదు అని అనకండి. ఇప్పుడిక పురుషార్థము చేసే సమయమైతే గడిచిపోయింది, కానీ తీవ్ర పురుషార్థము చేసేందుకు ఇప్పటికీ సమయము ఉంది. కావున చెక్ చేసుకోండి, కానీ కేవలం చెక్ చేసుకోవడమే కాదు, దానితో పాటు చేంజ్ కూడా చేసుకోండి. కొంతమంది చెక్ చేసుకుంటారు కానీ చేంజ్ చేసుకునే శక్తి లేదు. చెక్ చేసుకోవడము మరియు చేంజ్ చేసుకోవడము, రెండూ కలిపి-కలిపి జరగాలి ఎందుకంటే మీ అందరి స్వమానము మరియు మీ అందరి మహిమ ఏమిటి? టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తివాన్. అంతేనా, మీరు మాస్టర్ సర్వశక్తివంతులేనా లేక శక్తివంతులా? ఎవరైతే, మేము మాస్టర్ సర్వశక్తివంతులము అని అంటారో వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) అచ్ఛా. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు! అందుకు అభినందనలు. కానీ మాస్టర్ సర్వశక్తివంతులు అన్నప్పుడు చేంజ్ చేసుకోలేకపోతే ఏమని అనడము జరుగుతుంది? తమ సంస్కారాన్ని మరియు స్వభావాన్నే చేంజ్ చేసుకోవాలనుకుని కూడా చేసుకోలేకపోతే ఏమంటారు? స్వయాన్ని ప్రశ్నించుకోండి - మీరు మాస్టర్ శక్తివంతులా లేక మాస్టర్ సర్వశక్తివంతులా? మాస్టర్ సర్వశక్తివంతులు ‘ఇది చెయ్యాల్సిందే’ అని సంకల్పము చేసిన వెంటనే అది జరిగి తీరుతుంది. అవుతుందిలే, చూద్దాములే... ఇలా జరగదు. మరి ఇప్పుడు సమయమనుసారముగా రిజల్టు ఏముండాలంటే - ఏదైతే ఆలోచించారో, సంకల్పము మరియు స్వరూపముగా అవ్వడము, రెండూ ఒకేసారి జరగాలి.

ఇప్పుడు కొత్త సంవత్సరము, అవ్యక్త సంవత్సరము రానున్నది. అవ్యక్త పాలన మొదలై 40 సంవత్సరాలు కావస్తుంది. అవ్యక్త పాలన మరియు వ్యక్త రూప పాలన మొదలై 72 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇద్దరు తండ్రుల పాలనకు రిటర్న్ బాప్ దాదాకు ఇవ్వరా! ఆలోచించండి, పాలన ఏమిటి మరియు ప్రాక్టికల్ ఏమిటి? బాప్ దాదా చూసారు - ఇప్పడు కూడా నిర్లక్ష్యము మరియు రాయల్ సోమరితనము ఉన్నాయి. రాయల్ సోమరితనము అంటే - అయిపోతుందిలే, తయారైపోతాములే, చేరుకుంటాములే అని అనుకోవటము. నిర్లక్ష్యము అంటే - చేయడమైతే చేస్తున్నాములే,... లే, లే అని అనుకోవటము. ఇదైతే అవ్వవలసిందే, ఇదైతే చెయ్యవలసిందే - చెప్పడములో మరియు చెయ్యడములో తేడా వచ్చేస్తుంది. బాప్ దాదా ఒక దృశ్యాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. మీరు ఏమంటారు? ఇది కనుక జరిగిపోతే, ఇది కనుక చేసేస్తే నేను చాలా బాగా ముందుకు వెళ్ళగలను అని అంటారు. ఇతరులను పరివర్తన చెయ్యాలన్న వృత్తి ఉంటుంది కానీ స్వ పరివర్తన యొక్క వృత్తి అక్కడక్కడ తక్కువైపోతుంది. ఇప్పుడు ఇతరులను చూసే వృత్తిని పరివర్తన చేసుకోండి. ఒకవేళ చూడాలనుకుంటే వారిలోని విశేషతను చూడండి. ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది, ఇలా అయితే నడుస్తూనే ఉంటుంది, వీరు కూడా చేస్తున్నారు కదా... ఈ భావనను తగ్గించండి. స్వయాన్ని చూసుకోండి, బాబాను ఎదురుగా పెట్టుకోండి. ఇక ఎవరైనా కానీ, మహారథి కావచ్చు, మధ్యలోనివారు కావచ్చు, ఎవరైనా సరే పురుషార్థములో ఏదో ఒక లోపాన్ని పరివర్తన చేసుకుంటూనే ఉన్నారు. అందుకే సీ ఫాదర్, సీ డబుల్ ఫాదర్. బ్రహ్మాబాబాను చూడండి, శివబాబాను చూడండి. బాబా మిమ్మల్ని తమ హృదయ సింహాసనముపై కూర్చోబెట్టుకున్నారు మరియు మీరు కూడా మీ హృదయ సింహాసనముపై బాబాను కూర్చోబెట్టుకున్నారు. మీ స్లోగన్ కూడా ఉంది - సీ ఫాదర్ (తండ్రిని చూడండి) అని. సీ సిస్టర్, సీ బ్రదర్ అన్నది మీ స్లోగన్ కానే కాదు.

ఏదో ఒక లోపము అందరిలోనూ ఇప్పుడింకా మిగిలి ఉంది, కానీ ఒకవేళ ఇతరులను చూడాలంటే విశేషతను చూడండి. వారు వారిలో నుండి ఏ లోపాన్ని అయితే తీసేస్తూ ఉన్నారో దానిని చూడకండి. రెండవ విషయము - మీ రాజ్యములో... మీ రాజ్యము గుర్తుంది కదా. నిన్ననే ఉంది మరియు రేపు రాబోతుంది. మీ బుద్ధిలోకి, నయనాలలోకి మీ రాజ్యము స్పష్టముగా వచ్చేసింది కదా. ఎన్ని సార్లు రాజ్యము చేసారు? లెక్కపెట్టారా? అనేక సార్లు రాజ్యము చేసారు. అనగానే ఎదురుగా వచ్చేస్తుంది. మీ రాజ్యాధికార రూపము మరియు శ్రేష్ఠ రాజ్యము. ఏ విధముగా మీ రాజ్యములో లా అండ్ ఆర్డర్ స్వతహాగా నడుస్తాయో... అక్కడ అందరూ జ్ఞానవంతమైన సంస్కారాలు కలవారే, లా ఏమిటి, ఆర్డర్ ఏమిటి అనేది అందరికీ తెలుసు, అదే విధముగా ఇప్పుడు మీ జీవితములో చూడండి, బాబా ఆర్డర్ అనుసారముగా నడుస్తున్నారా లేక అప్పుడప్పుడు మాయ యొక్క ఆర్డర్ కూడా నడుస్తుందా? శ్రీమతము కాకుండా ఒక్కోసారి పరమతము, మన్మతములో అయితే నడవడము లేదు కదా? మరియు లా ఏమిటి? లా అనగా నిశ్చింత చక్రవర్తి, ఏ చింతా లేదు, ఎందుకంటే సర్వ ప్రాప్తులు ఉన్నాయి. అలాగే, చెక్ చేసుకోండి, సంగమము యొక్క శ్రేష్ఠ జన్మలో కూడా సర్వ ప్రాప్తులు ఉన్నాయా? బాబా ఏదైతే ఇచ్చారో, అది భగవంతుని ప్రసాదము వంటిది కదా, ప్రసాదానికి ఎంతటి మహత్వము ఉంటుంది. కావున బాబా ఏవైతే ప్రాప్తులను ఇచ్చారో, ఆ ప్రభు ప్రసాదము ప్రాప్తించిందా, ఆ ప్రభు ప్రసాదము యొక్క మహత్వము ఉందా? అది వారసత్వము కూడా, అధికారము కూడా మరియు ప్రసాదము కూడా. కావున చెక్ చేసుకోండి - లా అండ్ ఆర్డర్, రెండింటిలోనూ సంపన్నముగా ఉన్నారా?

బాప్ దాదా ఒక విషయాన్ని చూస్తూ ఉన్నారు, అదేమిటంటే, మెజారిటీ పిల్లలకు పరివర్తన చేసుకునేందుకు ఏదైతే శక్తి లభించిందో, ఆ పరివర్తనా శక్తిని సమయానికి కార్యములో వినియోగించినట్లయితే ఎటువంటి కష్టము ఉండదు. చూడండి, అందరికీ అనుభవముంది, ఒకవేళ ఎప్పుడైనా, ఏ విధముగానైనా మాయతో ఓటమి కలిగితే, అందరూ భాషణ చేసేటప్పుడు కూడా చెప్తారు మరియు క్లాస్ చేసేటప్పుడు కూడా చెప్తుంటారు - రెండు పదాలు పడవేసేవి కూడా మరియు పైకి తీసుకువెళ్ళేవి కూడా అని. ఆ రెండు పదాలు ఏమిటి అనేది అందరికీ తెలుసు, అవి అందరి మనసులోకి వచ్చేసాయి. ఆ రెండు పదాలు ఏమిటంటే - నేను, నాది. భాషణలో చెప్తారు కదా, క్లాసులో కూడా చెప్తారు. బాప్ దాదా క్లాసు కూడా వింటుంటారు, ఏమంటారు? ఇప్పుడు ఈ రెండు పదాలను పరివర్తనా శక్తి ద్వారా పరివర్తన చేయండి. ‘నేను’ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా, ‘నేను ఫలానాను’ అని అంటారు, ‘నేను బ్రాహ్మణుడినే’ కానీ ‘నేను’ ఎవరిని? బాప్ దాదా ఏ స్వమానాలనైతే ఇచ్చారో, ‘నేను’ అన్న పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా కానీ దానితో పాటు ఏదో ఒక స్వమానాన్ని చెప్పండి అంటే బుద్ధిలోకి తీసుకురండి. ‘నేను’ అన్న పదము పలకగానే స్వమానము గుర్తుకు వచ్చేయాలి. ‘నాది’ అన్న పదాన్ని ఉపయోగించగానే బాబా గుర్తుకు రావాలి. ‘నా బాబా’. ఇది నేచురల్ స్మృతిగా అయిపోవాలి. ఈ పరివర్తన తీసుకురండి, చాలు. రెండవ విషయము ఏమిటంటే - చాలా వరకు సంబంధ-సంపర్కాలలోకి వచ్చినప్పుడు రెండు పదాల ద్వారా మాయ వస్తుంది - ఒకటి భావము మరియు రెండు భావన. భావము అన్న పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా, ఆలోచించినా, ఆత్మిక భావము ఉండాలి. భావము అన్న పదాన్ని పలకగానే ఆత్మిక భావము ముందుగా గుర్తుకు రావాలి మరియు భావన అంటే శుభ భావన గుర్తుకు రావాలి. పదము యొక్క అర్థాన్ని పరివర్తన చేయండి. మీ టైటిల్ ఏమిటి? విశ్వ పరివర్తకులు. విశ్వ పరివర్తకులు ఈ పదాన్ని పరివర్తన చేయలేరా? సమయానికి పరివర్తన శక్తిని ఉపయోగించి చూడండి. అది సమయము గడిచిపోయిన తర్వాత వస్తుంది, మనసుకు నచ్చనప్పుడు, మనసులో తమంతట తామే ఆలోచిస్తారు, కానీ సమయమైతే గడిచిపోయింది కదా. అందుకే ఇప్పుడు తీవ్ర గతి యొక్క అవసరము ఉంది, అప్పుడప్పుడు కాదు. చాలా సమయమైతే బాగానే ఉంటాను కదా అని అనుకోకండి. బాప్ దాదా అయితే ముందుగానే వినిపించి ఉన్నారు కదా - అంతిమ ఘడియపై ఎటువంటి నమ్మకము లేదు అని. అకస్మాత్తు యొక్క ఆటలు జరగనున్నాయి. కొంతమంది పిల్లలు బాబాకు కూడా చాలా మధురాతి మధురమైన మాటలను వినిపిస్తారు, ఏమంటారంటే - సమయము మరికాస్త అతిలోకి వెళ్తుంది కదా, అప్పుడు వైరాగ్యమైతే ఎలాగూ కలుగుతుంది, ఆ వైరాగ్య సమయములో దానంతటదే వేగము తీవ్రతరమవుతుంది అని. కానీ బాప్ దాదా వినిపించారు - బహుకాలపు పురుషార్థము కావాలి. ఒకవేళ కొద్ది సమయపు పురుషార్థము ఉన్నట్లయితే ప్రారబ్ధము కూడా కొద్ది సమయానికే లభిస్తుంది, పూర్తిగా 21 జన్మల ప్రారబ్ధము లభించదు. బాప్ దాదా యొక్క మూడు పదాలను సదా గుర్తుంచుకోండి - ఒకటి అకస్మాత్తు, రెండు ఎవర్రెడీ మరియు మూడు బహుకాలము. ఈ మూడు పదాలను సదా బుద్ధిలో పెట్టుకోండి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరిదైనా అంతిమ కాలము రావచ్చు. ఇప్పుడిప్పుడే చూడండి, ఎంతమంది బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారు. వారికేమైనా ముందే తెలుసా. అందుకే బహుకాలపు పురుషార్థముతో పూర్తి 21 జన్మల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోవలసిందే. ఈ తీవ్ర పురుషార్థాన్ని గుర్తుంచుకోండి. మీ రాజ్యములో ఫస్ట్ నంబరు, ఫస్ట్ జన్మ. ఏమి ఆలోచించారు? ఫస్ట్ జన్మలోకి రావాలి కదా! మజా ఎందులో ఉంటుంది? ఫస్ట్ జన్మలోనా లేక ఏ జన్మలోనైనా ఉంటుందా? తమ రాజ్యములో ఫస్ట్ జన్మలో శ్రీకృష్ణుడితో పాటు మా పాత్ర కూడా ఉండాలి అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) అచ్ఛా, పాత్ర ఫస్ట్ ఉందా? చేతులు చూసైతే సంతోషపడుతున్నాము. చప్పట్లు కొట్టండి. ఫస్ట్ జన్మలోకి వస్తున్నందుకు అభినందనలు. కానీ... కానీ ఏమిటో చెప్పమంటారా... చెప్పవద్దా? ఫస్ట్ జన్మలోకే రావాలి అన్నప్పుడు ఇక ‘కానీ’ అన్న విషయము చెప్పటము ఎందుకు? మంచిది, ఎంతమందైతే వచ్చారో అందరూ ఫస్ట్ జన్మలోకి రావలసిందే. చప్పట్లయితే కొట్టారు, ఫస్ట్ జన్మ మరియు ఫస్ట్ స్టేజ్ కూడా. మరి ఫస్ట్ స్టేజ్ ను తయారుచేసుకోవలసిందే అని ఎవరికైతే దృఢ సంకల్పము ఉందో, వారు ఫాస్ట్ గా వెళ్ళవలసిందే, ఎటువంటి విఘ్నము వచ్చినా కూడా విఘ్నము విఘ్నముగా ఉండకూడదు, విఘ్నవినాశకుల ఎదురుగా విజయ రూపముగా మారిపోవాలి ఎందుకంటే మీరందరూ విఘ్నవినాశకులు. మీ టైటిల్ ఏమిటి? విఘ్నవినాశకులు. కావున ఒకవేళ విఘ్నము వచ్చినా కూడా ఆట ఆడుకోవడానికి వస్తుంది. కానీ మీరు దూరము నుండే తెలుసుకోండి, రాయల్ రూపములో వస్తుంది కానీ విఘ్నవినాశకులైన మీరు ఏమి ఆట నడుస్తుంది అనేది దూరము నుండే తెలుసుకుంటారు. అందుకే బాప్ దాదా కూడా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలందరూ నాతోపాటు రావాల్సిందే, వెనుక ఉండిపోకూడదు అని. బాప్ దాదాకు పిల్లలు లేనిదే మజా రాదు. కావున దృఢతను ఎప్పుడూ బలహీనము చేసుకోకండి. చెయ్యాల్సిందే. లే, లే అని అనకండి, చేస్తాములే, చూస్తాములే, అయిపోతుందిలే... చూడండి, ఈ మాటలు మాట్లాడకండి. దృఢత సఫలతకు తాళంచెవి. ఈ తాళంచెవిని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మాయ కూడా తెలివైనది కదా, అది తాళంచెవిని వెతికేస్తుంది, అందుకే ఈ తాళంచెవిని జాగ్రత్తగా సంభాళించి పెట్టుకోండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ దృఢ సంకల్పము కల పిల్లలకు, ఆలోచించారు మరియు చేసారు, చేస్తాములే, చూస్తాములే కాదు, ఆలోచించారు మరియు చేసారు, సదా స్వయము నష్టోమోహులో, కేవలం సంబంధపు మోహము కాదు, తమ దేహ భానము మరియు దేహ అభిమానపు మోహము కూడా ఉండకూడదు, ఇటువంటి నష్టోమోహా ఎవర్రెడీ పిల్లలకు, సదా శ్రీమతము అనే చేతిలో చేయి వేసి, కలిసి ఎగిరేవారు మరియు బ్రహ్మాబాబాతో పాటు కలిసి తమ రాజ్యములోకి వచ్చే, తీవ్ర పురుషార్థీ ఎగిరే కళలో ఉండే పిల్లలకు బాప్ దాదా తరఫున చాలా చాలా ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులను స్వీకరించండి మరియు బాలక్ సో మాలిక్ పిల్లలకు నమస్తే.

వరదానము:-
పరివర్తనా శక్తి ద్వారా సర్వుల ధన్యవాదాలకు పాత్రులుగా అయ్యే విఘ్నజీత్ భవ

ఒకవేళ ఎవరైనా మీకు అపకారము చేస్తే మీరు ఒక్క క్షణములో అపకారాన్ని ఉపకారములోకి పరివర్తన చేయండి. ఎవరైనా తమ స్వభావ-సంస్కారాల రూపములో పరీక్షగా అయ్యి ఎదురుగా వస్తే మీరు ఆ ఒక్కరి స్మృతితో అటువంటి ఆత్మ పట్ల కూడా దయార్ద్ర హృదయపు శ్రేష్ఠ స్వభావ-సంస్కారాలను ధారణ చేయండి, ఎవరైనా దైహిక దృష్టితో ఎదురుగా వస్తే వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేయండి, ఆ విధముగా పరివర్తన చేసే యుక్తి వచ్చినట్లయితే విఘ్నజీతులుగా అవుతారు. అప్పుడు సంపర్కములోకి వచ్చే సర్వాత్మలు మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు.

స్లోగన్:-
అనుభవాల స్వరూపముగా అయినట్లయితే ముఖము ద్వారా భాగ్యము యొక్క మెరుపు కనిపిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపాలు-రంగులు ఉన్నప్పటికి కూడా అందరి హృదయాలలో ఏకత కనిపించాలి ఎందుకంటే మీరు ఒకే తండ్రికి పిల్లలు. అందరూ ఒకే వృక్షానికి చెందిన కొమ్మలు, ఒక్కరి శ్రీమతముపై నడిచేవారు. భిన్నత్వములో ఏకతను చూపించటము, పాడైపోయినవారిని బాగుచెయ్యటము, అనేకతలో ఏకతను తీసుకురావటము, ఇది అన్నిటికన్నా పెద్ద సేవ. ఇదే అద్భుతము మరియు ఇదే సఫలతకు ఆధారము.