01-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఎవరు, ఎలా ఉన్నారు అనేది పిల్లలైన మీలో కూడా నంబరువారుగా గుర్తిస్తారు, ఒకవేళ అందరూ గుర్తిస్తే చాలా పెద్ద గుంపు తయారైపోతుంది’’

ప్రశ్న:-
నలువైపులా ప్రత్యక్షతా ధ్వని ఎప్పుడు వ్యాపిస్తుంది?

జవాబు:-
ఎప్పుడైతే మనుష్యులకు, స్వయంగా భగవంతుడు ఈ పాత ప్రపంచాన్ని వినాశనము చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చారని తెలుస్తుందో, మరియు రెండవది, మన అందరికీ సద్గతిని కలిగించే తండ్రి మనకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చారన్న నిశ్చయము కలుగుతుందో, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది, నలువైపులా అలజడి వ్యాపిస్తుంది.

పాట:-
ఎవరైతే ప్రియమైనవారితో ఉన్నారో...

ఓంశాంతి
పిల్లలు పాటలోని రెండు లైన్లు విన్నారు. ఎవరైతే ప్రియమైనవారితో ఉన్నారో... ఇప్పుడు ప్రియమైనవారు ఎవరు! ఇది ప్రపంచానికి తెలియదు. అనేకమంది పిల్లలు ఉన్నారు, వారిలో కూడా చాలామందికి తండ్రిని ఏ విధముగా స్మృతి చేయాలి అన్నది తెలియదు. వారికి స్మృతి చేయడము రాదు. పదే-పదే మర్చిపోతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, నేను బిందువును. తండ్రి జ్ఞానసాగరుడు, వారినే స్మృతి చేయాలి. స్మృతి చేయడమన్నది ఎంతగా అలవాటు అవ్వాలంటే, ఇక ఆ స్మృతి నిరంతరము నిలిచిపోవాలి. చివరి సమయములో, నేను ఆత్మను అన్న స్మృతియే ఉండాలి, శరీరము ఉంది కానీ నేను ఆత్మను అన్న జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. బాబా డైరెక్షన్ లభించి ఉంది. నేను ఎవరినో, ఆ రూపములో నన్ను ఎవరో అరుదుగా స్మృతి చేస్తారు. దేహాభిమానములోకి పిల్లలు చాలా వచ్చేస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయించారు, ఎవరికైనా సరే తండ్రి పరిచయాన్ని ఇవ్వనంత వరకు వారేమీ అర్థం చేసుకోలేరు. ఆ నిరాకారుడు మన తండ్రి అని, వారు గీతా భగవానుడని, వారే సర్వుల సద్గతిదాత అని ముందుగా వారికి ఈ విషయము తెలియాలి. వారు ఈ సమయములో సద్గతినిచ్చే పాత్రను అభినయిస్తున్నారు. ఈ పాయింటులో నిశ్చయబుద్ధి కలవారిగా అయినట్లయితే ఇక ఇంతమంది సాధువులు-సత్పురుషులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారంతా ఒక్క క్షణములో వచ్చేస్తారు. అప్పుడిక భారత్ లో చాలా హంగామా జరుగుతుంది. ఈ ప్రపంచము వినాశనమవ్వనున్నది అని ఇప్పుడు తెలిసిపోతే, ఈ విషయములో నిశ్చయము ఏర్పడితే, ఇక బొంబాయి నుండి మొదలుకుని ఆబూ వరకు క్యూ ఏర్పడుతుంది. కానీ అంత త్వరగా ఎవరికీ నిశ్చయము ఏర్పడదు. వినాశనము జరగనున్నదని మీకు తెలుసు, అందరూ గాఢ నిద్రలో నిద్రిస్తూ ఉండేదే ఉంది. మళ్ళీ, అంతిమ సమయములో మీ ప్రభావము వెలువడుతుంది. గీతా భగవానుడు పరమపిత పరమాత్మ శివుడు అన్న విషయములో నిశ్చయము ఏర్పడడము అనేది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. ఈ విషయము ప్రసిద్ధమైనట్లయితే మొత్తం భారత్ లో ధ్వని వ్యాపిస్తుంది. ఇప్పుడైతే, మీరు ఒక్కరికి అర్థం చేయిస్తే, వారిని ఇంకొకరు మీ పై గారడి జరిగిందని అంటారు. ఈ వృక్షము చాలా నెమ్మది-నెమ్మదిగా పెరగనున్నది. ఇప్పుడింకా కొంత సమయముంది, ఇప్పుడింకా పురుషార్థము చేయడానికి వీలవుతుంది. మీరు పెద్ద-పెద్ద వ్యక్తులకు అర్థం చేయిస్తారు కానీ వారేమీ అర్థం చేసుకోరు. పిల్లలలో కూడా కొంతమంది ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. తండ్రి స్మృతి లేకపోతే ఆ అవస్థ ఉండదు. నిశ్చయము అని దేనినంటారో తండ్రికి తెలుసు. ఇప్పుడైతే కొంతమంది తండ్రిని 1-2 శాతం కూడా కష్టం మీద స్మృతి చేస్తారు. ఇక్కడే కూర్చుని ఉండవచ్చు, అయినా కానీ తండ్రి పట్ల ఆ ప్రేమ లేదు. ఇక్కడ ప్రేమ కావాలి, అదృష్టము కావాలి. తండ్రి పట్ల ప్రేమ ఉన్నట్లయితే, మేము అడుగడుగునా శ్రీమతముపై నడవాలి, మేము విశ్వానికి యజమానులుగా అవుతాము అన్నది అర్థం చేసుకుంటారు. అర్ధకల్పపు దేహాభిమానము కూర్చుని ఉంది, కావున ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వడానికి చాలా శ్రమ కలుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయడము పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. అలా చేస్తే, వారి ముఖములో ప్రకాశము వస్తుంది. కన్య వివాహము చేసుకున్నప్పుడు, నగలు మొదలైనవి ధరించినప్పుడు ఆమె ముఖములో ఒక్కసారిగా సంతోషము వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ప్రియుడిని అసలు స్మృతే చేయకపోయేటప్పటికి, ఆ ముఖము వాడిపోయినట్లుగా ఉంటుంది. ఇక అడగకండి. కన్య వివాహము చేసుకున్నప్పుడు ఆమె ముఖము సంతోషభరితముగా అవుతుంది. కొందరి ముఖమైతే వివాహము తర్వాత కూడా శవం వలె ఉంటుంది. రకరకాల వారు ఉంటారు. కొందరైతే మరో ఇంటికి వెళ్ళిన తర్వాత తికమకపడతారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడములో శ్రమ ఉంటుంది. అతీంద్రియ సుఖము గురించి గోపీ వల్లభుని గోప-గోపికలను అడగండి అన్నది అంతిమము యొక్క గాయనము. తమను తాము గోప-గోపికలుగా భావించాలి మరియు తండ్రిని నిరంతరము స్మృతి చేయాలి, ఈ అవస్థ ఉండాలి. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. తండ్రి వచ్చి ఉన్నారు, వారు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇందులో మొత్తము జ్ఞానమంతా వచ్చేస్తుంది. లక్ష్మీ-నారాయణులు 84 జన్మలను పూర్తి చేసినప్పుడు, తండ్రి అంతిమములో వచ్చి వారికి రాజయోగాన్ని నేర్పించి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము నంబరువన్. వారు గత జన్మలో అటువంటి కర్మలను చేశారని మీకు తెలుసు, ఆ కర్మలను ఇప్పుడు తండ్రి నేర్పిస్తున్నారు. మన్మనాభవ, పవిత్రముగా ఉండండి అని చెప్తారు. ఏ పాపము చేయకండి ఎందుకంటే మీరిప్పుడు స్వర్గానికి యజమానులుగా, పుణ్యాత్ములుగా అవుతారు. అర్ధకల్పము బట్టి మాయా రావణుడు పాపము చేయిస్తూ వచ్చాడు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నా ద్వారా ఎటువంటి పాపము జరగడము లేదు కదా? పుణ్య కర్మలను చేస్తూ ఉన్నానా? అంధులకు చేతికర్రగా అయ్యానా? తండ్రి అంటారు - మన్మనాభవ. మన్మనాభవ అని ఎవరు చెప్పారు అనేది కూడా అడగవలసి ఉంటుంది. వారు శ్రీకృష్ణుడు చెప్పారని అంటారు. మీరు పరమపిత పరమాత్మ శివుడు చెప్పారని భావిస్తారు. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. శివజయంతితో పాటు గీతా జయంతి జరుగుతుంది. గీతా జయంతితో పాటు శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది.

మేము భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము అని మీకు తెలుసు. బికారుల నుండి రాకుమారులుగా అవ్వాలి. ఇదే రాజయోగము యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము. గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు, గీతా భగవానుడు నిరాకారుడు అన్నది మీరు ఋజువు చేసి చెప్పినట్లయితే సర్వవ్యాపి యొక్క జ్ఞానము తొలగిపోతుంది. సర్వుల సద్గతిదాత, పతిత-పావనుడు తండ్రి. వారు ముక్తిప్రదాత అని అంటారు కూడా, కానీ మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఏమి మాట్లాడుతున్నారు అనేదేమీ అర్థం చేసుకోరు. ధర్మము గురించి ఏది తోస్తే, అది చెప్తారు. ముఖ్యమైన ధర్మాలు మూడు. దేవీ-దేవతా ధర్మము అర్ధకల్పము నడుస్తుంది. తండ్రి బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తారు అని మీకు తెలుసు, ఇది ప్రపంచానికి తెలియదు. వారైతే సత్యయుగానికే లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అన్నింటికన్నా ఉన్నతమైనది, కానీ వారు తమ ధర్మాన్ని మరచి ధర్మభ్రష్టులుగా అయిపోయారు. క్రిస్టియన్ ధర్మస్థులు వారి ధర్మాన్ని విడిచిపెట్టరు. వారి ధర్మాన్ని క్రైస్ట్ స్థాపన చేసారు అన్నది వారికి తెలుసు. ఇస్లామ్ ధర్మము, బౌద్ధ ధర్మము, ఇంకా క్రిస్టియన్ ధర్మము - ఇవి ముఖ్యమైన ధర్మాలు. ఇకపోతే, చిన్న-చిన్న ధర్మాలైతే ఎన్నో ఉన్నాయి. ఈ వృద్ధి అంతా ఎక్కడి నుండి మొదలైంది? ఇది ఎవరికీ తెలియదు. మహమ్మద్ వచ్చి ఇప్పుడు కొంత సమయము అయ్యింది. ఇస్లాములు పాతవారు. క్రిస్టియన్లు కూడా ప్రసిద్ధి చెందినవారే. మిగిలినవారు ఎంతమంది ఉన్నారు. అందరికీ తమ-తమ ధర్మాలు ఉన్నాయి. రకరకాల ధర్మాలు, రకరకాల పేర్లు ఉండేటప్పటికి తికమకపడిపోయారు. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు నాలుగేనని వారికి తెలియదు. వాటిలోనే దేవతా ధర్మము, బ్రాహ్మణ ధర్మము కూడా వస్తాయి. బ్రాహ్మణుల నుండి దేవతలుగా, దేవతల నుండి క్షత్రియులుగా అవుతారని ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ దేవతాయ నమః అని పాడుతారు. పరమపిత బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను స్థాపన చేసారు అన్న మాట వ్రాసి ఉంది కానీ దానిని చిలుక పలుకులు వలె చదువుతారు.

ఇది ముళ్ళ అడవి. భారత్ పుష్పాల తోటగా ఉండేదని కూడా నమ్ముతారు. కానీ దానిని ఎప్పుడు, ఎలా, ఎవరు తయారుచేసారు, పరమాత్మ అంటే ఎవరు, ఇది ఎవరికీ తెలియదు. కావున అనాథలుగా అయినట్లే కదా, అందుకే ఈ గొడవలు-కొట్లాటలు మొదలైనవి జరుగుతున్నాయి. కేవలం భక్తి చేస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి వెలుగు తీసుకురావడానికి వచ్చారు, క్షణములో జీవన్ముక్తులుగా చేస్తారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చినప్పుడు అజ్ఞాన అంధకారము వినాశనమవుతుంది. మనము ప్రకాశములో ఉన్నాము అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు. దేవతలకు మూడవ నేత్రాన్ని చూపిస్తారు కానీ అర్థం తెలియదు. వాస్తవానికి మూడవ నేత్రము మీకు ఉంది. కానీ వారు దేవతలకు ఉన్నట్లుగా చూపించారు. గీతలో బ్రాహ్మణుల విషయమేమీ ఉండదు. అందులోనైతే కౌరవులు, పాండవులు మొదలైనవారికి యుద్ధము జరిగినట్లుగా, గుర్రపు బండి మొదలైనవి ఉన్నట్లుగా వ్రాశారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీరు అర్థం చేయించినట్లయితే, మీరు శాస్త్రాలు మొదలైనవాటిని నమ్మరు అని వారంటారు. మేము శాస్త్రాలను ఎందుకు నమ్మము, ఎందుకంటే అవన్నీ భక్తి మార్గపు సామాగ్రి అని మాకు తెలుసు - అని మీరు చెప్పవచ్చు. జ్ఞానము మరియు భక్తి అని అంటూ ఉంటారు. రావణ రాజ్యము మొదలైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. భారతవాసులు వామ మార్గములోకి వెళ్ళి ధర్మభ్రష్టులుగా మరియు కర్మభ్రష్టులుగా అయిపోతారు, అందుకే ఇప్పుడు హిందువులని చెప్పుకుంటారు. పతితులుగా అయిపోయారు. పతితులుగా ఎవరు తయారుచేసారు? రావణుడు. రావణుడిని కాలుస్తారు కూడా, ఇది పరంపరగా కొనసాగుతూ వస్తుందని భావిస్తారు. కానీ సత్యయుగములోనైతే రావణ రాజ్యమే లేదు. ఏమీ అర్థం చేసుకోరు. మాయ పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా చేసేస్తుంది. రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా తండ్రియే తయారుచేస్తారు. ఇనుపయుగములోకి వచ్చినప్పుడే బంగారుయుగాన్ని స్థాపన చేయగలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అయినా కానీ ఎవరి బుద్ధిలోనైనా అతి కష్టము మీద కూర్చుంటుంది.

కుమారీలైన మీకు ఇప్పుడు నిశ్చితార్థము జరుగుతుంది. మిమ్మల్ని పట్టపురాణులుగా చేస్తారు. మిమ్మల్ని ఎత్తుకు వెళ్ళిపోయారు అనగా ఆత్మలైన మీకు చెప్తున్నారు - మీరు నా వారిగా ఉండేవారు, కానీ తర్వాత మీరు నన్ను మర్చిపోయారు, దేహాభిమానులుగా అయి మాయకు చెందినవారిగా అయిపోయారు. అంతేకానీ ఎత్తుకు వెళ్ళిపోవడము వంటి విషయాలేవీ లేవు. నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతి చేయడములోనే శ్రమ ఉంది. చాలామంది దేహాభిమానములోకి వచ్చి వికర్మలు చేస్తారు. ఫలానా ఆత్మ నన్ను అసలు స్మృతే చేయడము లేదని తండ్రికి తెలుసు. దేహాభిమానములోకి వచ్చి చాలా పాపాలు చేసినప్పుడు పాపపు కుండ వంద రెట్లు నిండిపోతుంది. ఇతరులకు మార్గాన్ని చూపించేందుకు బదులు స్వయమే మర్చిపోతారు. ఇంకా ఎక్కువ దుర్గతిని పొందుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు, పడిపోతే ముక్కలు-ముక్కలుగా అయిపోతారు. రాజధాని స్థాపనవుతుంది. ఇందులో ఎంత తేడా ఏర్పడుతుందో చూడండి. కొందరేమో చదువుకుని ఆకాశానికి ఎక్కిపోతారు, కొందరు నేలపై పడిపోతారు. బుద్ధి డల్ గా ఉన్నట్లయితే చదువుకోలేకపోతారు. కొందరు - బాబా, మేము ఎవరికీ అర్థం చేయించలేము అని అంటారు. వారికి నేను చెప్తాను - అచ్ఛా, స్వయాన్ని కేవలం ఆత్మగా భావించండి, తండ్రినైన నన్ను స్మృతి చేయండి, అప్పుడు నేను మీకు సుఖాన్ని ఇస్తాను. కానీ అసలు స్మృతే చేయరు. స్మృతి చేస్తే ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. వారి స్మృతి లేకుండా మీరు సుఖధామానికి వెళ్ళలేరు. 21 జన్మల వారసత్వము నిరాకార తండ్రి నుండే లభించగలదు, మిగిలినవారంతా అల్పకాలిక సుఖాన్ని ఇచ్చేవారే. ఎవరికైనా మంత్ర-తంత్రాల ద్వారా పిల్లలు కలిగితే లేదా ఎవరైనా ఆశీర్వదించిన తర్వాత లాటరీ లభిస్తే, ఇక అంతే, వారిపై నమ్మకము ఏర్పడిపోతుంది. ఎవరికైనా 2-4 కోట్ల లాభము కలిగితే, ఇక చాలా మహిమ చేస్తారు. కానీ అదంతా కొంత సమయము కోసమే. 21 జన్మల కోసం ఆరోగ్యము, ఐశ్వర్యము అయితే లభించవు కదా. కానీ మనుష్యులకు తెలియదు. వారి దోషము అని అనలేము కూడా. అల్పకాలిక సుఖములోనే సంతోషపడిపోతారు.

తండ్రి పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించి స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు. ఇది ఎంత సహజము. కొందరైతే అసలు ఏమీ అర్థం చేయించలేరు. కొందరు అర్థం చేసుకుంటారు కూడా, కానీ యోగము పూర్తిగా లేని కారణముగా ఎవరికీ బాణము తగలదు. దేహాభిమానములోకి రావడము వలన ఏదో ఒక పాపము జరుగుతూ ఉంటుంది. యోగమే ముఖ్యమైనది. మీరు యోగబలము ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడు నేర్పించారు, శ్రీకృష్ణుడు కాదు. స్మృతియాత్ర చాలా మంచిది. మీరు ఏదైనా డ్రామాను చూసి వచ్చినప్పుడు, బుద్ధిలో అదంతా ఎదురుగా వచ్చేస్తుంది, కానీ దానిని ఎవరికైనా వినిపించడానికి సమయము పడుతుంది. ఇది కూడా అటువంటిదే. బీజము మరియు వృక్షము. ఈ చక్రము చాలా స్పష్టముగా ఉంది. శాంతిధామము, సుఖధామము, దుఃఖధామము... ఇది క్షణము యొక్క విషయమే కదా. కానీ గుర్తు ఉండాలి కూడా కదా. ముఖ్యమైన విషయము తండ్రి పరిచయము. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు అంతా తెలుసుకుంటారు. అచ్ఛా.

శివబాబా పిల్లలైన మిమ్మల్ని గుర్తు చేస్తారు, బ్రహ్మాబాబా గుర్తు చేయరు. నా సుపుత్రులు ఎవరెవరు అన్నది శివబాబాకు తెలుసు. సేవాధారీ, సుపుత్రులైన పిల్లలనైతే గుర్తు చేసుకుంటారు కదా. బ్రహ్మాబాబా ఎవరినీ గుర్తు చేయరు. వీరి ఆత్మకైతే - నన్నొక్కరినే స్మృతి చేయండి అన్న డైరెక్షన్ లభించింది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అదృష్టవంతులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి పట్ల సత్యాతి-సత్యమైన ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండటము అనగా అడుగడుగునా ఒక్కరి శ్రీమతముపైనే నడుస్తూ ఉండాలి.

2. రోజూ పుణ్య కర్మలను తప్పకుండా చేయాలి. అన్నింటికంటే పెద్ద పుణ్యము అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము, తండ్రిని స్మృతి చేయడము మరియు సర్వులకు తండ్రి స్మృతిని కలిగించడము.

వరదానము:-
మీ దృష్టి మరియు వృత్తి యొక్క పరివర్తన ద్వారా సృష్టిని పరివర్తన చేసే సాక్షాత్కార మూర్త భవ

మీ వృత్తిని పరివర్తన చేసుకోవడము ద్వారా దృష్టిని దివ్యముగా చేసుకోండి, అప్పుడు దృష్టి ద్వారా అనేక ఆత్మలు తమ యథార్థ రూపాన్ని, యథార్థ ఇంటిని మరియు యథార్థ రాజధానిని చూస్తారు. ఇలా యథార్థమైన సాక్షాత్కారము చేయించేందుకు వృత్తిలో కొంచెము కూడా దేహాభిమానము యొక్క చంచలత్వము ఉండకూడదు. కనుక వృత్తిని సరిదిద్దుకుని దృష్టిని దివ్యముగా చేసుకోండి, అప్పుడు ఈ సృష్టి పరివర్తన అవుతుంది. మిమ్మల్ని చూసేవారికి ఎలా అనుభవమవుతుందంటే - ఇవి నయనాలు కావు, ఇవి ఇంద్రజాలపు డిబ్బీలు వలె ఉన్నాయి. ఈ నయనాలు సాక్షాత్కారాలకు సాధనముగా అవుతాయి.

స్లోగన్:-
సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలతో పాటుగా, అనంతమైన వైరాగ్య వృత్తియే సఫలతకు ఆధారము.

అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

మధురత గుణాన్ని ధారణ చేసేవారు ఇక్కడ కూడా మహానులుగా అవుతారు మరియు అక్కడ కూడా పదవిని పొందుతారు. మధురత కలవారిని అందరూ మహాన్ రూపములో చూస్తారు. కావున మధురత అనే ఈ విశేష గుణము పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. మధురత అనే మధువు (తేనె) ఎవరి వద్దనైతే ఉంటుందో వారికి ప్రతి కార్యములోనూ సఫలతే సఫలత ఉంటుంది. వారి జీవితము నుండి అసఫలత తొలగిపోతుంది.