01-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు రావణుడి మతాన్ని అనుసరించి తండ్రిని నింద చేశారు కావున భారత్ గవ్వ సమానముగా అయ్యింది, ఇప్పుడు ఆ తండ్రిని గుర్తించి స్మృతి చేసినట్లయితే ధనవంతులుగా అయిపోతారు’’

ప్రశ్న:-
మెట్ల వరుస చిత్రములో ఏ అద్భుతమైన రహస్యము ఇమిడి ఉంది?

జవాబు:-
అర్ధకల్పము భక్తి డ్యాన్స్ ఉంటుంది మరియు అర్ధకల్పము జ్ఞాన డ్యాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే భక్తి డ్యాన్స్ జరుగుతుందో, అప్పుడు జ్ఞాన డ్యాన్స్ ఉండదు మరియు ఎప్పుడైతే జ్ఞాన డ్యాన్స్ జరుగుతుందో, అప్పుడు భక్తి డ్యాన్స్ ఉండదు. అర్ధకల్పము రావణుడి ప్రారబ్ధము కొనసాగుతుంది మరియు అర్ధకల్పము పిల్లలైన మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ గుహ్యమైన రహస్యము మెట్ల వరుస చిత్రములో ఇమిడి ఉంది.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - భక్తి మార్గములో భక్తి డ్యాన్స్ ను చాలా చేశారు, జ్ఞాన డ్యాన్స్ చేయలేదు. భక్తి డ్యాన్స్ ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు జ్ఞాన డ్యాన్స్ ఉండదు. జ్ఞాన డ్యాన్స్ జరుగుతున్నప్పుడు భక్తి డ్యాన్స్ ఉండదు, ఎందుకంటే భక్తి డ్యాన్స్ దిగే కళలోకి తీసుకువెళ్తుంది. సత్య-త్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తి ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో, అప్పుడు జ్ఞాన ప్రారబ్ధము పూర్తవుతుంది, అప్పుడిక దిగే కళలోకి వస్తారు. ఎలా దిగుతారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. నేను కల్ప-కల్పము వచ్చి పిల్లలకు చెప్తాను - పిల్లలైన మీరు నన్ను చాలానే నింద చేశారు. ఎప్పుడెప్పుడైతే భారత్ లో ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క నింద చాలా జరుగుతుందో, అప్పుడు నేను వస్తాను. నింద అని దేనినంటారు అనేది కూడా అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము వచ్చి, భారత్ యొక్క వికారీ నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేస్తాను. మీరు ఆసురీ మతాన్ని అనుసరించి నన్ను నింద చేసిన కారణముగా ఎంత నిరుపేదలుగా అయిపోయారు. ఇంతకుముందు రామ రాజ్యము ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యము ఉంది, వీటినే గెలుపు మరియు ఓటమి, పగలు మరియు రాత్రి అని అనడము జరుగుతుంది. మరి నేను ఎప్పుడు రావాలో ఇప్పుడు ఆలోచించండి. ఎవరికైతే రాజ్యాన్ని ఇచ్చానో, వారే రాజ్యాన్ని పోగొట్టుకుని కూర్చున్నారు. లెక్కలన్నీ అయితే అర్థం చేయించడము జరిగింది. నేను వచ్చి వారసత్వాన్ని ఇస్తాను మరియు రావణుడు వచ్చి మిమ్మల్ని శాపగ్రస్తులుగా చేస్తాడు అనగా ముఖ్యముగా భారత్ ను మరియు మొత్తం ప్రపంచాన్ని శాపగ్రస్తులుగా చేస్తాడు. భారత్ మహిమ గురించి కూడా ఎవరికీ తెలియదు. మొట్టమొదట భారత్ యే ఉండేది, ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది, ఎవరు రాజ్యము చేసేవారు అనే విషయాలు ఎవరికీ ఏమీ తెలియవు. ఏమీ అర్థం చేసుకోరు. దేవతలు ఎవరైతే ఉండేవారో, వారి ముఖము మనుష్యుల వలె ఉండేది, లక్షణాలు దేవతల వలె ఉండేవి. ప్రస్తుతం ముఖము మనుష్యులదే ఉంది కానీ లక్షణాలు ఆసురీగా ఉన్నాయి, ఎవరికైనా అర్థం చేయించినా సరే అర్థం చేసుకోరు, ఎందుకంటే పారలౌకిక తండ్రి గురించే తెలియదు, అంతేకాక కూర్చుని వారిని నిందిస్తారు. తండ్రిని నిందిస్తూ-నిందిస్తూ పూర్తిగా గవ్వ సమానముగా అయిపోయారు. భారత్ యొక్క డౌన్ ఫాల్ (పతనము) జరిగింది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో, అప్పుడు నేను వస్తానని తండ్రి అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నాను. కల్పక్రితం కూడా ఇలాగే అర్థం చేయించాను. ఈ దైవీ సాంప్రదాయ స్థాపన జరుగుతుంది, మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి ఎప్పుడు వస్తారు అనేది మనుష్యులకు తెలియనే తెలియదు, సత్య-త్రేతాయుగాలలో మీరు చాలా సంతోషముగా ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత ద్వాపరము నుండి రావణుడి శాపాన్ని పొందుతూ, పొందుతూ పూర్తిగా సమాప్తమైపోతారు. ఏ విధముగా దేవతలు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ-అనుభవిస్తూ త్రేతా అంతిమములో సమాప్తమైపోతారు, తర్వాత రావణుడి ఆసురీ ప్రారబ్ధము మొదలవుతుంది. భక్తి కూడా ముందు అవ్యభిచారిగా ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారిగా అవుతుంది. మెట్ల వరుస చిత్రము సరైన విధముగా తయారుచేయబడి ఉంది. ప్రతి వస్తువు సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత సతో-రజో-తమోగా అవుతుంది. మాలిన్యము చేరుతూ ఉంటుంది. పిల్లలైన మీకైతే చాలా బాగా అర్థం చేయించడము జరుగుతుంది కానీ ధారణ తక్కువగా జరుగుతుంది. కొందరికైతే అర్థం చేయించే తెలివి అసలు లేదు. కొందరు మంచి అనుభవజ్ఞులున్నారు, వారి ధారణ చాలా బాగుంటుంది. నంబరువారుగా అయితే ఉంటారు కదా. విద్యార్థులందరూ ఒకే విధముగా ఉండరు. ఏదో ఒక నంబరు తప్పకుండా ఇవ్వడము జరుగుతుంది. ఎవరికైనా అర్థం చేయించడము చాలా సహజము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. నేను మీ అనంతమైన తండ్రిని, సృష్టి రచయితను. నన్ను స్మృతి చేసినట్లయితే మీకు అనంతమైన వారసత్వము లభిస్తుంది. స్మృతితోనే మాలిన్యము తొలగుతుంది. భారతవాసులైన మీరు సత్యయుగములో సతోప్రధానముగా ఉండేవారని, ఇప్పుడు కలియుగములో తమోప్రధానముగా అయ్యారని కేవలం ఇది మాత్రమే అర్థం చేయించండి. ఆత్మలో మాలిన్యము చేరుతుంది. పవిత్రముగా అవ్వకుండా ఎవరూ అక్కడకు వెళ్ళలేరు. కొత్త ప్రపంచములో ఉన్నదే సతోప్రధానమైనవారు. వస్త్రము కొత్తదిగా ఉన్నప్పుడు సతోప్రధానమని అంటారు, ఆ తర్వాత పాతదిగా, తమోప్రధానముగా అయిపోతుంది. ఇప్పుడు అందరి వస్త్రాలు చిరిగిపోయే విధముగా ఉన్నాయి. అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో, వారే పూర్తిగా పేదవారిగా అయ్యారు. మళ్ళీ వారే షావుకారులుగా అవ్వాలి. ఈ విషయాల గురించి మనుష్యులకు తెలియదు. భారత్ స్వర్గముగా ఉండేది, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, మిగిలిన ధర్మాల వారందరూ అయితే తర్వాత వచ్చారు. తండ్రి కూర్చుని మీకు సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. గీతకు ఎంత గౌరవముందో చూడండి. కానీ అది చదువుతూ-చదువుతూ పూర్తిగా కింద పడిపోయారు, అప్పుడు - ఓ పతితపావనా రండి, మేము భ్రష్టాచారులుగా అయిపోయాము అని పిలుస్తారు. సద్గతిని అయితే భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు. ఇకపోతే, శాస్త్రాలలో ఉన్నదంతా భక్తి మార్గము. మేము బాబా జ్ఞానము ద్వారా దేవతలుగా అవుతామని - మీ బుద్ధిలో కూర్చుని ఉంది. ఇప్పుడు మీకు మొత్తము ప్రపంచం పట్ల వైరాగ్యముంది. సన్యాసులు కూడా భక్తి చేస్తారు, గంగా స్నానాలు మొదలైనవి చేస్తారు కదా. భక్తి కూడా ముందు సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత రజో, తమోగా అవుతుంది. ఇది కూడా అలాగే. అర్ధకల్పము బ్రహ్మా యొక్క పగలు మరియు అర్ధకల్పము రాత్రి అని అంటూ ఉంటారు. బ్రహ్మాతో పాటు తప్పకుండా బ్రాహ్మణులకు కూడా రాత్రి-పగలు ఉంటుంది. ఇప్పుడు మీరు పగలులోకి వెళ్తారు, భక్తి యొక్క రాత్రి పూర్తవుతుంది. భక్తిలోనైతే చాలా దుఃఖముంది, దానిని రాత్రి అని అంటారు. భగవంతుడిని కలుసుకునేందుకు అంధకారములో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భక్తి మార్గములో సద్గతినిచ్చేవారు ఎవరూ ఉండరు. మీకు తప్ప ఇంకెవరికీ భగవంతుని గురించి యథార్థముగా తెలియదు. ఆత్మ కూడా బిందువే, పరమాత్మ కూడా బిందువే, ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. పరమాత్మయే స్వయం వచ్చి బ్రహ్మా తనువు ద్వారా అర్థం చేయిస్తారు. దానికి వారు భగీరథుడి రూపములో, నంది రూపములో చూపించారు. ఇప్పుడు నంది యొక్క విషయమేమీ లేదు. తండ్రి అన్ని విషయాలను మంచి రీతిలో అర్థం చేయిస్తారు కానీ ఎవరి బుద్ధిలోనూ పూర్తిగా కూర్చోవు.

తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నేను ఆత్మలైన మీకు తండ్రిని, మీరు నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, అప్పుడు మీ వికర్మలు వినాశనమవుతాయి. అయినా సరే మర్చిపోతున్నామని అంటారు. వాహ్! ఇలాంటి ప్రియుడిని మరియు తండ్రిని మర్చిపోవచ్చా. స్త్రీ తన పతిని లేదా పిల్లలు తమ తండ్రిని ఎప్పుడైనా మర్చిపోతారా? మరి ఇక్కడ, మీరెందుకు మర్చిపోతున్నారు? బాబా, మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు, అయినా మేము మర్చిపోతున్నాము అని అంటారు కూడా. తండ్రి అంటారు - స్మృతి చేయకపోతే లోపల ఏదైతే తుప్పు పట్టి ఉందో, అది ఎలా తొలగుతుంది. ముఖ్యమైన విషయము స్మృతి. మీకు వేరే ఏ ధర్మాలతోనూ సంబంధము లేదు. పాఠశాలలోనైతే చరిత్ర-భౌగోళికాలను అర్థం చేయిస్తారు. కొందరైతే అసలు అర్థం చేసుకోరు. తండ్రి చదివిస్తున్నారు అనేది బుద్ధిలో కూర్చోదు. అచ్ఛా, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి లేదా ఇది కూడా మర్చిపోతున్నారా! ఎవరి కోసమైతే అర్ధకల్పము నుండి భక్తి చేస్తూ వచ్చారో, ఆ తండ్రిని స్మృతి చేయరు. ఇప్పుడు మేము ఈ శరీరాన్ని వదిలి రాజ్యములోకి వెళ్తాము, ఇది అంతిమ జన్మ అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూక్ష్మవతనములో వారిని అవే రూపురేఖలతో చూస్తారు, అలాగే వైకుంఠములో కూడా చూస్తారు. ఈ మమ్మా-బాబాయే లక్ష్మీ-నారాయణులుగా అవుతారని మీకు తెలుసు. మీరు సత్యయుగములో ఉన్నప్పుడు - ఒక శరీరాన్ని వదలి మరొకటి తీసుకోవాలని అర్థం చేసుకుంటారు. అక్కడ వారికి సత్యయుగము తర్వాత త్రేతా వస్తుందని, ఆ తర్వాత ద్వాపరము వస్తుందని, మేము దిగిపోతూ ఉంటామని తెలియదు. అక్కడ జ్ఞానానికి సంబంధించిన విషయము ఉండదు. పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు, ఆ తర్వాత ఆత్మాభిమానుల నుండి దేహాభిమానులుగా అయిపోతారు. ఈ జ్ఞానము కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది, ఇంకెవరి వద్ద లేదు. ఇది జ్ఞాన-జ్ఞానేశ్వరుడైన, జ్ఞాన సాగరుడైన తండ్రి మాత్రమే వినిపిస్తారు. తప్పకుండా బ్రహ్మాకు పిల్లలైన బ్రాహ్మణులకే వినిపిస్తారు. బ్రహ్మా యొక్క పిల్లలు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. మీరు పురుషార్థము చేసి సంపూర్ణ గుణవంతులుగా అవుతారు, సంపూర్ణ నిర్వికారులుగా అవుతారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా మీరు తండ్రిని స్మృతి చేయండి, కర్మలైతే చేయాల్సిందే. ఏ కర్మనైనా చేయండి, కార్పెంటర్ పనినైనా చేయండి లేదా రాజ్యము చేసే పనినైనా చేయండి, బుద్ధియోగము తండ్రితో జోడించబడి ఉండాలి. రాజా జనకుని గాయనము కూడా ఉంది కదా. రాజ్యము చేస్తూ ఉండండి కానీ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించినట్లయితే వారసత్వము లభిస్తుంది. తండ్రి అంటారు, మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి చేయండి. కేవలం శివ అని అన్నట్లయితే లింగము గుర్తుకువస్తుందని శివబాబా అంటారు. మిగిలినవారందరికీ శరీరాల పేర్లు తీసుకోవడము జరుగుతుంది, శరీరము ద్వారా పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారుచేయడము జరుగుతుంది, అది అర్ధకల్పము కొనసాగుతుంది. ఈ సమయములో అందరూ దేహాభిమానములో ఉన్నారు. అక్కడ యథా రాజా-రాణి, తథా ప్రజా, అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఆయుష్షు అయితే అందరిదీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అందరి ఆయుష్షు తక్కువగా ఉంది. కావున తండ్రి సమ్ముఖముగా కూర్చుని - ఓ ఆత్మలూ, అని అంటూ పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు, ఎందుకంటే జ్ఞానాన్ని ఆత్మ తీసుకుంటుంది, ధారణ ఆత్మలోనే జరుగుతుంది. బాబాకైతే శరీరము లేదు. ఆత్మలో మొత్తము జ్ఞానమంతా ఉంది. ఆత్మ కూడా నక్షత్రము వంటిది, బాబా కూడా నక్షత్రము వంటివారు. బాబా పునర్జన్మలు తీసుకోరు, ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి, అందుకే బాబా కార్యాన్ని ఇచ్చారు - పరమాత్ముని మహిమను మరియు పిల్లల మహిమను వ్రాసుకుని రండి అని. ఇరువురి మహిమ వేరు-వేరు. శ్రీకృష్ణుని మహిమ వేరు. అతను సాకారుడు, వీరు నిరాకారుడు. అతడిని అంత గుణవంతునిగా ఎవరు తయారుచేసారు? తప్పకుండా పరమాత్మయే తయారుచేశారని అంటారు.

ఈ సమయములో మీరు ఈశ్వరీయ సాంప్రదాయము వారు. మీకు తండ్రి నేర్పిస్తున్నారు. ప్రారబ్ధాన్ని తర్వాత అనుభవిస్తారు. సత్యయుగములోనైతే ఎవరూ నేర్పించరు. భక్తి మార్గపు సామాగ్రి సమాప్తమైపోతుంది. ఈ ప్రపంచము పట్ల వైరాగ్యము కూడా కలగాలి అనగా దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. అశరీరిగా వచ్చాము, అశరీరిగానే వెళ్ళాలి. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది, మనమంతా కొత్త ప్రపంచములోకి వెళ్ళబోతున్నాము. కేవలం ఈ స్మృతి చేసే కృషిని చేస్తూ ఉండండి, ఇందులోనే ఫెయిల్ అవుతారు. స్మృతి చేయరు. అర్థం చేసుకునేందుకు ఎవరు వచ్చినా కానీ, వారికి కూడా ఇదే అర్థం చేయించాలి - నన్ను స్మృతి చేసినట్లయితే, ఆ స్మృతితో మీ మాలిన్యము తొలగిపోతుందని, మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారని శివబాబా బ్రహ్మా ద్వారా చెప్తున్నారని చెప్పండి. విష్ణుపురియే స్వర్గపురి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. ఏ తండ్రినైతే అర్ధకల్పము స్మృతి చేసారో, ఇప్పుడు వారు సమ్ముఖముగా వచ్చారు, నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. వారి గురించి ఎవరికీ తెలియదు. వారే స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. నేను ఎవరిని, ఎలా ఉంటాను అనేది ఎవరో అరుదుగా తెలుసుకుంటారు మరియు నిశ్చయము ఏర్పరచుకుంటారు. నిశ్చయము ఏర్పరచుకుంటే, పురుషార్థము చేసి వారసత్వాన్ని పొందుతారు. శివబాబా అంటారు - నన్ను స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎలాంటి వికర్మలను చేయకూడదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పురుషార్థము చేసి సంపూర్ణ గుణవంతులుగా అవ్వాలి. కర్మ ఏదైనా కానీ తండ్రి స్మృతిలో ఉంటూ చేయాలి. ఎలాంటి వికర్మలు చేయకూడదు.

2. ఈ పాత వస్త్రము (శరీరము) శిథిలావస్థలో ఉంది, దీని పట్ల మమకారాన్ని తొలగించాలి. ఆత్మను సతోప్రధానముగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థము చేయాలి.

వరదానము:-
సదా అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని చేసే అచంచలమైన, అఖండమైన స్వరాజ్య అధికారీ భవ

ఏ పిల్లలైతే సంగమయుగములో అతీంద్రియ సుఖము యొక్క వారసత్వాన్ని సదా కాలము కొరకు ప్రాప్తి చేసుకుంటారో అనగా ఎవరికైతే తండ్రి వీలునామాపై పూర్తి అధికారముంటుందో, వారు విల్ పవర్ కలిగి ఉంటారు. వారికి ఎడతెగని, అచంచలమైన అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి కలుగుతుంది. ఇటువంటి వారసులే అనగా సంపూర్ణ వారసత్వానికి అధికారులే భవిష్యత్తులో అచంచలమైన, అఖండమైన స్వరాజ్యము యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు.

స్లోగన్:-
ఎక్కడైతే నేను అనే భావన వస్తుందో, అక్కడ బుద్ధి పూర్తిగా తిరిగిపోతుంది.

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘ఎక్కే కళకు మరియు దిగే కళకు ముఖ్యమైన మూలం ఏమిటి?’’

చాలామంది మనుష్యులు ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు - ఇంత పురుషార్థము చేసి జీవన్ముక్త పదవిని పొందినప్పుడు, మళ్ళీ అక్కడ నుండి కింద పడిపోయేందుకు కారణము ఏమవుతుంది? ఇది గెలుపు-ఓటముల ఆట అని మనము అంటాము కానీ ఇందులో ఎక్కే కళ మరియు దిగే కళ జరుగుతున్నందుకు కూడా ఏదో కారణము తప్పకుండా ఉంది. ఆ కారణము ఆధారముగానే ఈ ఆట నడుస్తుంది. ఎలాగైతే పురుషార్థముతో మనము పైకి ఎక్కుతున్నామో, అలా కిందకు పడిపోయేందుకు కూడా కారణము తప్పకుండా ఉంది. ఆ కారణము కూడా పెద్దదేమీ కాదు, కేవలం ఒక చిన్న పొరపాటు జరిగింది. ఎలాగైతే పరమాత్మ - నన్ను స్మృతి చేస్తే నేను మీకు ముక్తి-జీవన్ముక్తుల పదవిని ఇస్తాను అని అంటారో, అలాగే దేహాభిమానులుగా అయి పరమాత్మను మర్చిపోయినప్పుడు కింద పడిపోతారు. ఇక వామ మార్గములోకి వెళ్ళిపోతారు, అప్పుడు 5 వికారాలలో చిక్కుకోవడముతో దుఃఖము అనుభవిస్తారు. కావున ఇది మన దోషము, అంతేకానీ రచయిత దోషము కాదు. మనుష్యులు పరమాత్మయే సుఖ-దుఃఖాలను ఇస్తారని అంటారు కానీ అలా అనడము పూర్తిగా తప్పు. బాబా సుఖాన్ని రచిస్తారు, అంతేకానీ దుఃఖాన్ని రచించరు. ఇకపోతే మనము శ్రేష్ఠ కర్మలతో సుఖాన్ని పొందుతాము మరియు భ్రష్ట కర్మలతో దుఃఖాన్ని అనుభవిస్తాము. ఇకపోతే మంచి కర్మల ఫలము మరియు చెడు కర్మల శిక్ష పరమాత్మ ద్వారా తప్పకుండా లభిస్తాయి, అలాగని సుఖము-దుఃఖము రెండూ పరమాత్మయే ఇస్తారని అనము. అలా కాదు. పరమాత్మ అయితే ఎక్కే కళలో మనతో పాటు ఉన్నారు, ఇకపోతే కింద పడేసేది మాయ. మామూలుగా కూడా సుఖము కోసమే ఎవరి తోడునైనా లేక సహాయాన్ని అయినా తీసుకుంటాము. అంతేకానీ, దుఃఖాన్ని పొందేందుకు ఎవరూ ఎవరి తోడును తీసుకోరు. ఇకపోతే కర్మలు ఎలా ఉంటే, ఫలం యొక్క రిజల్టు కూడా అలాగే ఉంటుంది. కావున ఈ డ్రామాలో సుఖ-దుఃఖాల ఆట మన కర్మల ఆధారముగా ఉంటుంది, కానీ తుచ్ఛ బుద్ధి కల మనుష్యులకు ఈ రహస్యము తెలియదు. అచ్ఛా - ఓం శాంతి.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చెయ్యండి’’

సమయమనుసారముగా ఇప్పుడు సదా అచంచలముగా, స్థిరముగా ఉంటూ సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉండండి. కొద్దిగా కింద-మీద అయినా కానీ సర్వ ఖజానాల అనుభవము కలగదు. బాబా ద్వారా లభించిన ఖజానాలను సదా స్థిరముగా ఉంచుకునేందుకు సాధనము - సదా అచంచలముగా, స్థిరముగా ఉండటము. అచంచలముగా ఉండటము వలన సదా సంతోషము యొక్క అనుభవమవుతూ ఉంటుంది. ఏ విధముగా వినాశీ ధనము, పేరు-ప్రతిష్ఠ-గౌరవము, కుర్చీ మొదలైనవి లభిస్తే సంతోషము కలుగుతుంది కదా, అలా ఇదైతే అవినాశీ సంతోషము, కానీ ఈ సంతోషము ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిలో ఉంటారో వారికి.