01-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి శ్రీమతమేమిటంటే - ఈ పాత ప్రపంచము నుండి మీ ముఖాన్ని తిప్పుకోండి, జీవన్ముక్తి కోసం మీరు దైవీ మ్యానర్స్ ను ధారణ చేయండి’’

ప్రశ్న:-
ఏ మ్యానర్స్ ను తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు?

జవాబు:-
పవిత్రముగా అవ్వడము మరియు ఇతరులను పవిత్రముగా తయారుచేయడము - ఇవి అన్నింటికన్నా గొప్ప దైవీ మ్యానర్స్. మీరు ఇంటిలో, గృహస్థములో ఉంటూ పవిత్రముగా ఉండండి, ఈ శిక్షణను ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. పిల్లలైన మీది అనంతమైన సన్యాసము. మీరు బుద్ధి ద్వారా ఈ పాత ప్రపంచాన్నే మర్చిపోతారు. పవిత్రత యొక్క ధారణతో మిగిలిన మ్యానర్స్ అన్నీ స్వతహాగా వచ్చేస్తాయని మీకు తెలుసు.

పాట:-
నేడు మానవులైన మనము అంధకారములో ఉన్నాము...

ఓంశాంతి
పిల్లలు పాటలోని ఒక లైన్ ను విన్నారు. ఒక వైపు - ప్రపంచమంతా ఉంది, భక్తి మార్గము వారు ఉన్నారు మరియు ఇంకొక వైపు - జ్ఞాన మార్గములో ఉన్న పిల్లలైన మీరు ఉన్నారు. వారు భక్తి యొక్క మెట్లు ఎక్కుతూ ఉంటారు మరియు పిల్లలైన మీరు జ్ఞానము యొక్క మెట్లు ఎక్కుతారు, భక్తి యొక్క మెట్లు దిగుతారు. అర్ధకల్పము నుండి భక్తి యొక్క మెట్లు ఎక్కవలసి ఉంటుందని పిల్లలకు తెలుసు. భక్తి కూడా ముందు అవ్యభిచారిగా ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారిగా అవుతుంది. పూర్తిగా అంధశ్రద్ధలో చిక్కుకుపోతారు. ఏమీ అర్థం చేసుకోరు. మేము అంధకారములో ఉన్నాము, సద్గురువు లేకపోతే ఘోర అంధకారమని పాడుతారు కూడా. గురువులైతే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇప్పుడు సత్యమైన గురువు ఎవరు? సాధు-సత్పురుషులు, మహాత్ములు, భక్తులు మొదలైనవారంతా సాధన చేస్తారు అనగా స్మృతి చేస్తారు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదువుతారు, అయినా కూడా, భగవంతుడు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మాకు సద్గతినిస్తారని అంటారు. సద్గతిదాతనే పతిత-పావనుడని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఘోర అంధకారములో లేరు. మీరు జ్ఞాన ప్రకాశములోకి వచ్చారు. పతిత-పావనుడైన తండ్రిని తెలుసుకున్నారు మరియు వారిని స్మృతి చేస్తారు. పిల్లల్లో ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో మరియు జ్ఞాన ధారణను చేస్తారో, అంతగా వారి అజ్ఞాన అంధకారము వినాశనమవుతుంది. ఇప్పుడు ప్రకాశములోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు... అదేమీ కాటుక కాదు. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయము. జ్ఞానముతో పాటు యోగము కూడా ఉంటుంది. వాస్తవానికి ఏ మనుష్యులైతే భక్తి నేర్పిస్తారో వారితో కూడా యోగముంటుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధియోగము నిరాకార పరమపిత పరమాత్మునితో జోడించబడి ఉంది. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. పిల్లలైన మీకు తప్ప ఇతర మనుష్యమాత్రులెవ్వరికీ సర్వశక్తివంతుడైన పరమపిత పరమాత్మునితో యోగము లేదు. మీరు తండ్రితో మరియు ముక్తి, జీవన్ముక్తిధామాలతో యోగము జోడించవలసి ఉంటుంది. జీవన్ముక్తి కోసం దైవీ మ్యానర్స్ కూడా చాలా బాగుండాలి. ఈ సమయములోనైతే అందరి మ్యానర్స్ ఆసురీగా ఉన్నాయి. పరమపిత పరమాత్ముని గుణాలు కూడా మహిమ చేయబడతాయి కదా. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్యమైనవారు, చైతన్యమైనవారు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు. వారు సదా పవిత్రతా సాగరుడు. వారి ఈ పదవి అవినాశీ అయినది, ఇతర మనుష్యులెవరికీ ఈ అవినాశీ పదవి ఉండదు. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరులుగా, పవిత్రతా సాగరులుగా అవుతారు కానీ లిమిటెడ్ గా అవుతారు. తండ్రి అంటారు - నేను అన్ లిమిటెడ్. మిమ్మల్ని అన్ లిమిటెడ్ గా తయారుచేయలేను. లేదంటే సృష్టి ఆట ఎలా నడుస్తుంది? 84 జన్మలను ఎలా అనుభవిస్తారు? మీరు సదా కోసం అలా అవ్వలేరు. మిమ్మల్ని లిమిటెడ్ గా తయారుచేస్తాను, మీరు 21 జన్మల కోసం తయారవుతారు. 21 తరాలు అని కూడా వ్రాసి ఉంది. మీరు సదా కోసం అవ్వడమనే నియమము ఈ డ్రామాలో లేదు. నేను అయితే సదా పవిత్రుడను. నేను ఉండటము కూడా పరంధామములో ఉంటాను. నా వద్ద జ్ఞానము, పవిత్రత మొదలైనవి ఎలాగూ ఉన్నాయి. మీరు మర్చిపోతారు, అందుకే ఈ సమయములో తండ్రి వచ్చి పిల్లలను ఘోర అంధకారము నుండి బయటకు తీసి జ్ఞానము మరియు యోగముతో పవిత్రముగా తయారుచేస్తారు. నేను పరంధామము నుండి వచ్చాను, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని ఇతరులెవ్వరూ అనలేరు. నా ఈ మహావాక్యాలను ఎవరూ కాపీ చేయలేరు. నేను పిల్లలైన మిమ్మల్ని 21 జన్మల కొరకు రాజులకే రాజులుగా తయారుచేయడానికి వచ్చాను కావున అలా తయారవ్వాలి కదా. అది కూడా ఎవరైతే కల్పక్రితం తయారయ్యారో, వారే తయారవుతారు.

ఎంతమంది పిల్లలు పవిత్రముగా అవుతారు, ఎంతమంది అజామిళుడు వంటి పాపాత్ములుగా అవుతారు అనేది మీకు తెలుసు. ఎంతమంది అశుద్ధముగా, మలినముగా తయారవుతారు. తండ్రికి మురికి పట్టిన వస్త్రాలను వచ్చి శుభ్రం చేయవలసి ఉంటుంది. ఆత్మయే మలినముగా అవుతుంది. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు - మాయ మిమ్మల్ని ఎంత మలినముగా చేసింది, కేవలం ఈ ఒక్క జన్మ విషయము కాదు, ఇది జన్మజన్మల విషయము. ఆత్మను శుభ్రం చేసుకునేందుకని లక్ష్యము అనే సబ్బును ఇస్తాను. నన్ను స్మృతి చేసినట్లయితే, ఆరిపోయిన మీ ఆత్మ, ఈ యోగముతో వెలుగుతుంది - తండ్రినైన నన్ను ఎంతెంతగా స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా వెలుగుతుంది. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు - నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను, తర్వాత మాయ మలినముగా చేసేసింది, ఇప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చాను. నేను ఈ బ్రహ్మా తనువు ద్వారా శిక్షణను ఇస్తున్నాను. ఆత్మలతో మాట్లాడుతారు - ఓ పిల్లలూ, లౌకిక తండ్రిని మర్చిపోండి. దేహ సహితముగా దేహపు సంబంధీకులందరినీ మరచి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ శుభ్రమవుతూ ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో మీకు శరీరము కూడా కొత్తది లభిస్తుంది. తత్వాలు మొదలైనవన్నీ కొత్తగా, సతోప్రధానముగా అవుతాయి. తండ్రి అంటారు - ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతూ వెళ్ళండి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చి, తర్వాత స్వర్గములోకి వెళ్తారు. ఇది పాత ప్రపంచము. ఇక్కడ ఏదైనా వస్తువును తయారు చేసినప్పుడు, దానికి కొత్త పేరు పెడతారు. ఉదాహరణకు కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు కానీ ప్రపంచమైతే పాతదే కదా. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచము నుండి బుద్ధియోగము పూర్తిగా తొలగిపోవాలి. ఆత్మలైన మనది స్వీట్ హోమ్ లేక నిర్వాణధామము, అక్కడకు వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోవాల్సి ఉంటుంది. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే, అంతమతి సో గతి ఏర్పడుతుంది (అంతిమ సమయములో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అటువంటి జన్మ లభిస్తుంది). మనుష్యులు అనేకమందిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది గురువులను, కొంతమంది శ్రీకృష్ణుడిని గుర్తు చేసుకుంటారు. శ్రీకృష్ణుడు మొదలైనవారు ఎక్కడకు వెళ్ళారు? ఇది ఎవరికీ తెలియదు. అందరూ పునర్జన్మల్లోకి రావాల్సిందేనని అర్థం చేసుకోరు. ఈ పద్ధతి సృష్టి ఆది నుండి కొనసాగుతూ వస్తుంది. సత్యయుగము ఆదిలో దేవీ-దేవతలు ఉంటారు, తప్పకుండా పునర్జన్మలనేవి అక్కడి నుండే ప్రారంభమై ఉంటాయి. మొట్టమొదటి వారు శ్రీకృష్ణుడు, వారు ఫస్ట్ పవిత్ర మానవుడు, వారి మహిమ అందరికన్నా ఎక్కువ. లక్ష్మీ-నారాయణులకు అంత మహిమ లేదు, ఎందుకంటే పిల్లలు పవిత్రముగా, సతోప్రధానముగా ఉంటారు కనుక పిల్లలను మహిమ చేయడము జరుగుతుంది. శ్రీకృష్ణునికి చాలా మహిమ ఉంది కానీ కృష్ణపురి ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలియదు. సత్యయుగాన్ని వైకుంఠమని కూడా అంటారు కానీ శ్రీకృష్ణుడు ద్వాపరములో ఉంటారని ఎందుకన్నారో తెలియదు. ఆ శ్రీకృష్ణుడు ఇంకే ఇతర నామ-రూప-దేశాలలో రాలేరు. అవే నామ రూపాలు వేరే జన్మలో ఉండవు. శ్రీకృష్ణుడైతే సత్యయుగములో ఉండేవారు. ఈ జగదంబ, జగత్పితలు లక్ష్మీ-నారాయణులుగా అవుతారని మీకు తెలుసు. సత్యయుగాన్ని కృష్ణపురి అని అంటారు. ఇప్పుడిది కంసపురి. ఇవన్నీ ఆసురీ పేర్లు. అక్కడ దైవీ సాంప్రదాయము ఉండేది. ఇక్కడ ఆసురీ సాంప్రదాయము ఉంది. తండ్రి కూర్చుని పిల్లలకు సంగమములో అర్థం చేయిస్తారు, ఆ తండ్రి రచయిత. వారిని మనుష్య సృష్టికి బీజరూపుడని అంటారు కావున తప్పకుండా కొత్త మనుష్య సృష్టిని రచిస్తారు. మీరు పాడుతారు కూడా - బాబా, మీరు పతిత-పావనుడు, మీరు వచ్చి ఈ పతిత సృష్టిని పావనముగా చేయండి, పావన సృష్టిని రచించి పతిత సృష్టిని వినాశనము చేయించండి. తప్పకుండా బ్రహ్మా ద్వారా పావన సృష్టిని రచించి, శంకరుని ద్వారా పతిత సృష్టిని వినాశనము చేయిస్తారు. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రితో యోగము జోడిస్తారు. బాబా మురికి పట్టిన వస్త్రాలను ఉతికి శుభ్రం చేయడాన్ని మీరు చూస్తారు. అప్పుడు కొన్ని చిరిగిపోతాయి, కొన్ని ముక్కలుగా అయిపోతాయి. కొందరైతే చాలా మలినముగా, అజామిళుడు వంటి పాపాత్ముల వలె ఉన్నారు, వారికి ఏ మాత్రం ధారణ జరగదు. తండ్రి ఎంత మంచి విషయాలను అర్థం చేయిస్తారు. మధురమైన ప్రియమైన పిల్లలూ - అత్యంత ప్రియమైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అత్యంత ప్రియమైన సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ విషయాలు కూడా మీకు ఇప్పుడు తెలుసు. ఇవి ప్రపంచములో ఎవరికీ తెలియవు. ఇప్పుడిది అతి దుఃఖధామము. మనుష్యులు దుఃఖములో రక్షణ కోసం అలమటిస్తూ ఉంటారు, ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. మళ్ళీ, భగవంతుడా, రక్షించండి అని అంటారు. నోటి నుండి ఈ మాటలు తప్పకుండా వెలువడుతాయి. తండ్రి అయితే ముక్తిదాత.

ముఖ్యముగా పిల్లలైన మనల్ని మరియు మామూలుగా మిగతా అందరినీ సుఖధామానికి తీసుకువెళ్ళేందుకని తండ్రి వచ్చారని మీకు తెలుసు. పిల్లలైన మీలో కూడా ఈ నషా ఉన్నవారు నంబరువారుగా ఉన్నారు. ఈ చదువు తక్కువైనదేమీ కాదు, చదివించడము కూడా ఎవరిని చదివిస్తున్నారో చూడండి. అజామిళుడు వంటి పాపాత్ములను చదివించి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. అందరూ తమోప్రధానముగా ఉన్నారు, వారిని సతోప్రధాన ప్రపంచములోకి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ దైవీ గుణాలను ధారణ చేయాలని పిల్లలకు పదే-పదే అర్థం చేయిస్తారు. ఇక్కడ మీకు లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉంది. పవిత్రత యొక్క ఈ మ్యానర్స్ ను ఇతరులెవ్వరూ నేర్పించరు. సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలేలా చేస్తారు. ఇక్కడ తండ్రి అంటారు - మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు. మీరు ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి. అది హద్దు సన్యాసము, ఇది అనంతమైన సన్యాసము. ఆ సన్యాసులకు కూడా ఎంత గౌరవము లభిస్తుంది. సాధు సమాజము వారు గవర్నమెంట్ కు కూడా సలహాలనిస్తారు. మున్ముందు ఈ సన్యాసులు మొదలైనవారు కూడా మాతలైన మీ చరణాలపై పడతారు. మాతలు లేకుండా సన్యాసుల ఉద్ధరణ జరగదు ఎందుకంటే మీరు జ్ఞానాన్ని ఇస్తారు. ఇకపోతే చరణాలపై పడే విషయమేమీ లేదు. అయితే, ఒకవేళ ఎవరైనా నమస్తే లేక రామ్-రామ్ అని అంటే బదులు ఇవ్వవలసి ఉంటుంది. బాబా కూడా, పిల్లలూ, నమస్తే అని అంటారు. నేను పిల్లలైన మిమ్మల్ని నా కన్నా ఉన్నతముగా తయారుచేస్తాను. మిమ్మల్ని బ్రహ్మాండానికి మరియు సృష్టికి, రెండింటికీ యజమానులుగా చేస్తాను మరియు నేను వానప్రస్థములోకి వెళ్ళిపోతాను. కానీ మీరు శ్రీమతాన్ని కూడా అనుసరించవలసి ఉంటుంది. ఈ పాత ప్రపంచము నుండి ముఖము తిప్పుకోవాల్సి ఉంటుంది. రాముడు, రావణుడు మరియు సీతకు సంబంధించిన ఆట వస్తువు ఉంది కదా. సీత రావణునికి వెన్ను చూపిస్తుంది, రాముని వైపుకు ముఖము తిప్పుకుంటుంది. శ్రీకృష్ణుని చిత్రము కూడా ఉంది - నరకాన్ని కాలదన్నుతున్నారు మరియు స్వర్గము చేతిలో ఉంది. తండ్రి చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు కానీ ఎవరో అరుదైన వ్యాపారస్థుడు మాత్రమే ఈ వ్యాపారాన్ని చేస్తారు. తండ్రికి తమ పాత తనువు, మనసు, ధనములను ఇచ్చి కొత్తవి తీసుకుంటారు. ఇది చాలా ఫస్ట్ క్లాస్ ఇన్షూరెన్స్. తండ్రి అంటారు - మీరు మీ ఆత్మను పవిత్రముగా చేసుకున్నట్లయితే శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. అప్పుడు మీరు స్వర్గములో రాజ్యము చేస్తారు, అందుకే వారిని వ్యాపారస్థుడు, ఇంద్రజాలికుడు అని అంటారు. పతితులను పావనముగా చేయడము - దీనిని ఈశ్వరీయ ఇంద్రజాలమని అంటారు కదా. తండ్రి అంటారు - నరకవాసులను స్వర్గవాసులుగా చేయండి, ఇది ఎంతటి ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలము. ఇందులో చాలా ప్రాప్తి ఉంది. తండ్రి అంటారు - రాజులకే రాజుగా అవ్వండి, ఫాలో చేయండి. తండ్రి కూర్చుని ఉన్నారు కదా. వీరు అధర్ కుమార్, మమ్మా కుమారి కన్య. కావున వీరిని ఫాలో చేయవలసి ఉంటుంది. వారసత్వము తండ్రి నుండి లభించనున్నది. సోదరీ-సోదరులమైన మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామని మీరంటారు. వాస్తవానికి లౌకిక పరంగా సోదరికి వారసత్వము లభించదు, సోదరుడికి వారసత్వము లభిస్తుంది. ఇక్కడైతే మీ అందరికీ లభించనున్నది ఎందుకంటే మీరందరూ ఆత్మలు కదా. తండ్రి అంటారు - మీరంతా నా వద్దకు రావాలి. అప్పుడిక ఈ సోదరీ-సోదరుల సంబంధము కూడా తెగిపోతుంది. అక్కడ నిర్వాణధామములో తండ్రి మరియు పిల్లల సంబంధము ఉంటుంది, అందుకే మనమంతా సోదరులము అని అంటారు. ఒకవేళ ఈశ్వరుడిని సర్వవ్యాపి అన్నట్లయితే ఫాదర్ హుడ్ అయిపోతుంది. ఈ సర్వవ్యాపి జ్ఞానము ఎంతగా నష్టము కలిగించింది.

ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి స్మృతి ఉంది. తండ్రిని స్మృతి చేయడములోనే ఎక్కువ శ్రమ ఉంది. అలాగని ఎవరైనా మిమ్మల్ని యోగములో కూర్చోబెట్టాలని కాదు. మీకైతే లక్ష్యము లభించి ఉంది. ఇక్కడైతే మీరు కేవలం కూర్చుని మురళీని వినిపిస్తారు. యోగమైతే మీకు సదా ఉంటుంది. మురళీ విన్న తర్వాత నడుస్తూ-తిరుగుతూ స్మృతిలో ఉండాలి. మనము యాత్రకు వెళ్తున్నాము. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. 8 గంటలు ఉద్యోగము చేసుకోండి, దానికి కూడా అనుమతి ఉంది. మిగతా సమయాన్ని ఇవ్వాలి. ముఖ్యమైన విషయము పవిత్రత. ఇది ముళ్ళ అడవి అని మీకు తెలుసు. ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటారు - శ్రీమతాన్ని అనుసరించండి. శివబాబా కూడా మాట్లాడుతారు, బ్రహ్మా కూడా మాట్లాడుతారు. కానీ శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మీరు విద్యార్థులు. వారు మాకు తండ్రి కూడా, టీచరు మరియు సద్గురువు కూడా అని మీరంటారు. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తానని గ్యారంటీ ఇస్తారు. ఈ విధముగా ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. బాబాయే అంటారు - గాడ్ ఫాదర్ మాత్రమే సుఖాన్నిచ్చే ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. ఒకవేళ తండ్రిని తెలుసుకున్నట్లయితే, తండ్రి ఆస్తి గురించి కూడా తెలుసుకుంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లక్ష్యము-ఉద్దేశ్యమును సదా ఎదురుగా ఉంచుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి. సతోప్రధాన ప్రపంచములోకి వెళ్ళేందుకు పవిత్రత యొక్క మ్యానర్స్ ను అలవరచుకోవాలి. బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసము చేయాలి.

2. అత్యంత ప్రియమైన తండ్రిని మరియు తమ సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామము నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి.

వరదానము:-
సర్వుల గుణాలను చూసే మరియు సంతుష్టపరిచే ఉత్సుకత ద్వారా సదా ఏకరస ఉత్సాహములో ఉండే గుణమూర్త భవ

సదా ఏకరసమైన ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేందుకు ఎవరు మీ సంబంధములోకి వచ్చినా వారిని సంతుష్టపరిచే ఉత్సుకత ఉండాలి. మీరు ఎవరిని చూసినా వారి నుండి అన్నివేళలా గుణాలనే గ్రహిస్తూ ఉండండి. సర్వుల గుణాల బలము లభించడము ద్వారా ఉత్సాహము సదాకాలికంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల భిన్న-భిన్న స్వరూపాలను, భిన్న-భిన్న విషయాలను చూస్తారో, వింటారో, అప్పుడు ఉత్సాహము తగ్గుతుంది, కానీ గుణాలను చూసే ఉత్సుకత ఉన్నట్లయితే ఏకరసమైన ఉత్సాహము ఉంటుంది మరియు సర్వుల గుణాలను చూడడము ద్వారా స్వయమూ గుణమూర్తులుగా అయిపోతారు.

స్లోగన్:-
అనంతమైన వైరాగ్య వృత్తి రూపీ పునాది దృఢముగా ఉన్నట్లయితే క్షణములో అశరీరులుగా అవ్వడము సహజము.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

మీ ముఖాన్ని సదా హర్షితముగా ఉంచుకోవడము - ఇది సంగమయుగము యొక్క అన్నింటికన్నా పెద్ద కానుక. ముఖముపై ఎప్పుడూ కూడా వ్యాకులతకు చెందిన రేఖలు ఉండకూడదు. ఏ విధముగా నిండు చంద్రుడు ఎంతో సుందరముగా అనిపిస్తాడో, అలా మీ ముఖము సదా హర్షితముగా ఉండాలి. మీ ముఖము ఎలా మెరుస్తూ ఉండాలంటే ఇతరులు కూడా మీ ముఖములో తమ రూపాన్ని చూసుకోగలగాలి, దీని కోసం మీ స్వభావాన్ని సరళముగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి.