02-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇది బాబా యొక్క అద్భుతమైన దుకాణము, ఇందులో అన్ని వెరైటీ సామాన్లు లభిస్తాయి, ఈ దుకాణానికి మీరు యజమానులు’’

ప్రశ్న:-
ఈ అద్భుతమైన దుకాణదారుడిని ఎవ్వరూ కాపీ చేయలేరు - ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే వీరు స్వయమే సర్వ ఖజానాల భాండాగారము. వీరు జ్ఞానము, సుఖము, శాంతి, పవిత్రత, అన్నింటిలోనూ సాగరుడు, ఎవరికి ఏది కావాలంటే అది లభించగలదు. నివృత్తి మార్గము వారి వద్ద ఈ సామాన్లు లభించవు. ఎవ్వరూ స్వయాన్ని తండ్రి సమానముగా సాగరులు అని చెప్పుకోలేరు.

పాట:-
మిమ్మల్ని పొంది మేము...

ఓంశాంతి
ఇప్పుడు పిల్లలు అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నారు. వీరిని అనంతమైన తండ్రి అని కూడా అనవచ్చు, అలాగే అనంతమైన తాతయ్య అని కూడా అనవచ్చు మరియు ఇక్కడ అనంతమైన పిల్లలు కూర్చుని ఉన్నారు మరియు తండ్రి అనంతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. హద్దు విషయాలను ఇప్పుడు విడిచిపెట్టేసారు. ఇప్పుడు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ దుకాణము ఒక్కటే ఉంది. తమకు ఏమి కావాలి అనేది మనుష్యులకు తెలియదు. అనంతమైన తండ్రి యొక్క దుకాణమైతే చాలా పెద్దది. వారిని సుఖ సాగరుడు, పవిత్రతా సాగరుడు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు... అని అంటారు. కొంతమంది దుకాణదారుల వద్దనైతే చాలా వెరైటీలు ఉంటాయి. అలాగే వీరు అనంతమైన తండ్రి, వీరి వద్ద కూడా వెరైటీ సామాన్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? బాబా జ్ఞాన సాగరుడు, సుఖ-శాంతుల సాగరుడు. వారి వద్ద ఈ అద్భుతమైన, అలౌకిక సామాన్లు ఉన్నాయి. వారిని సుఖకర్త అని కూడా మహిమ చేస్తారు. ఇదొక్కటే దుకాణము, ఇంకెవరికీ ఇటువంటి దుకాణాలు లేవు. బ్రహ్మా, విష్ణు, శంకరుల వద్ద ఏమి సామాన్లు ఉన్నాయి? ఏమీ లేవు. అన్నింటికన్నా ఉన్నతమైన సామాన్లు తండ్రి వద్ద ఉన్నాయి, అందుకే వారి మహిమను పాడటము జరుగుతుంది. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ... ఇటువంటి మహిమ ఎప్పుడూ ఎవరికీ జరగదు. మనుష్యులు శాంతి కోసం భ్రమిస్తూ ఉంటారు. కొందరికి మెడిసిన్స్ కావాలి, మరికొందరికి ఇంకేదో కావాలి. అవన్నీ హద్దు దుకాణాలు. మొత్తము ప్రపంచములో అందరి వద్ద హద్దు వస్తువులు ఉన్నాయి. ఈ తండ్రి ఒక్కరి వద్ద మాత్రమే అనంతమైన వస్తువులు ఉన్నాయి, అందుకే వారికి పతిత-పావనుడు, ముక్తిదాత, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని మహిమను కూడా పాడుతారు. ఇవన్నీ వెరైటీ సామాన్లు. లిస్ట్ వ్రాసినట్లయితే చాలా పెద్దదవుతుంది. ఏ తండ్రి వద్దనైతే ఈ వస్తువులు ఉన్నాయో, వారి పిల్లలకు కూడా వాటిపై హక్కు ఉంది. కానీ ఇటువంటి తండ్రికి మేము పిల్లలైనప్పుడు, మరి తండ్రి వస్తువులకు మేము యజమానులుగా అవ్వాలి కదా అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. తండ్రి రావడము కూడా భారత్ లోనే వస్తారు. తండ్రి వద్దనున్న వస్తువులన్నింటినీ వారు తప్పకుండా తీసుకువస్తారు. వారి నుండి తీసుకునేందుకు ఎవరూ వారి వద్దకు వెళ్ళలేరు. తండ్రి అంటారు, నేనే రావలసి ఉంటుంది. కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమములో నేను వచ్చి మీకు అన్ని వస్తువులను ఇచ్చి వెళ్తాను. నేను మీకు ఏ సామానునైతే ఇస్తానో, అది మళ్ళీ ఎప్పుడూ లభించజాలదు. అర్ధకల్పము కోసం మీ భాండాగారము నిండిపోతుంది. అక్కడ తండ్రిని పిలవాల్సి వచ్చేందుకు, అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారముగా మీరందరూ వారసత్వాన్ని తీసుకుని నెమ్మది-నెమ్మదిగా మెట్లు దిగుతారు. పునర్జన్మలు కూడా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. 84 జన్మలు కూడా తీసుకోవాలి. 84 జన్మల చక్రమని అంటారు కానీ అర్థం తెలియదు. 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలు అని అంటారు. మాయ తప్పులు చేయిస్తుంది. ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఆ తర్వాత ఇదంతా మర్చిపోతారు. ఈ సమయములో సామాన్లు తీసుకుంటారు, సత్యయుగములో రాజ్యము చేస్తారు. కానీ ఈ రాజ్యాన్ని మాకు ఎవరిచ్చారు అనేది వారికి తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడుండేది అనేది తెలియదు. స్వర్గ సుఖాలు అని అంటూ ఉంటారు కూడా. అన్ని రకాల సుఖాలను ఇస్తారు. దీని కన్నా గొప్ప సుఖము ఏదీ ఉండదు. తర్వాత ఆ సుఖము కూడా కనుమరుగైపోతుంది. అర్ధకల్పము తర్వాత రావణుడు వచ్చి అన్ని సుఖాలను లాక్కుంటాడు. ఎవరిపైనైనా కోప్పడినప్పుడు - నీలో ఉన్న శక్తి మరియు విశేషతలు సమాప్తమైపోయాయి అని అంటారు కదా. మీరు కూడా సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. ఆ కళలన్నీ ఇప్పుడు సమాప్తమైపోయాయి. ఒక్క తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ ఇంతటి మహిమ లేదు. ధనముంటే వెళ్ళి లాడ్కానా (పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతములోని ఒక నగరము పేరు) తిరిగి రండి అని అంటారు కదా.

స్వర్గములో ఎంతటి అపారమైన ధనము-సంపద ఉండేవో మీరు ఆలోచించండి. ఇప్పుడవి లేవు. అన్ని మాయమైపోతాయి. ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోతారు కావున ధనము-సంపద కూడా మాయమైపోతాయి, అప్పుడిక కిందకు పడిపోవడము మొదలవుతుంది. బాబా అర్థం చేయిస్తున్నారు - మీకు ఇంత ధనము ఇచ్చాను, మిమ్మల్ని వజ్రము వలె తయారుచేసాను, మరి మీరు ఆ ధనము-సంపదలను ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు మళ్ళీ తండ్రి అంటున్నారు, మీ వారసత్వాన్ని పురుషార్థము చేసి తీసుకోండి. బాబా మనకు మళ్ళీ స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. బాబా అంటున్నారు - ఓ పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీకు పట్టి ఉన్న తుప్పు అంతా తొలగిపోతుంది. పిల్లలంటారు - బాబా, మేము మర్చిపోతున్నాము. ఇదేమిటి? కన్య వివాహము చేసుకున్న తర్వాత పతిని ఎప్పుడైనా మర్చిపోతుందా! పిల్లలు ఎప్పుడైనా తండ్రిని మర్చిపోతారా? తండ్రి అయితే దాత. వారసత్వాన్ని పిల్లలు తీసుకోవాలంటే తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలూ, స్మృతియాత్రలో ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే ఉపాయము లేదు. భక్తి మార్గములో తీర్థ యాత్రలు, గంగా స్నానాలు మొదలైనవి ఏవైతే చేస్తూ వచ్చారో, వాటితో మెట్లు దిగుతూనే వచ్చారు. పైకి ఎవ్వరూ ఎక్కలేరు. నియమము అలా లేదు. అందరిదీ దిగే కళే ఉంటుంది. ఫలానావారు ముక్తిలోకి వెళ్ళారు అని ఏదైతే అంటారో, అది అసత్యము చెప్తున్నట్లు. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. మిమ్మల్ని 16 కళల సంపూర్ణులుగా చేయడానికి బాబా వచ్చారు. నిర్గుణుడినైన నాలో ఎటువంటి గుణాలు లేవు... అని మీరే పాడేవారు. బాబా గుణవంతులుగా చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనమే గుణవంతులుగా, పూజ్యులుగా ఉండేవారము, మనమే వారసత్వాన్ని తీసుకున్నాము. ఇది జరిగి 5000 సంవత్సరాలయ్యింది. మీకు వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళానని తండ్రి కూడా అంటారు. శివజయంతి, రక్షాబంధనము, దసరా మొదలైనవాటిని జరుపుకుంటారు కూడా, అయినా కానీ ఏమీ అర్థం చేసుకోరు. అంతా మర్చిపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి స్మృతినిప్పిస్తారు. అక్కడ మీరే ఉండేవారు, మళ్ళీ మీరే రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఈ మొత్తము ప్రపంచమంతా పాతదిగా, శిథిలావస్థలో ఉంది. ప్రపంచమైతే ఇదే ఉంటుంది. ఈ భారత్ యే కొత్తదిగా ఉండేది, ఇప్పుడు పాతదిగా అయ్యింది. స్వర్గములో సదా సుఖముంటుంది. మళ్ళీ ద్వాపరము నుండి దుఃఖము ప్రారంభమైనప్పుడు, ఈ వేద-శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. భక్తి చేస్తూ-చేస్తూ మీరు ఎప్పుడైతే భక్తిని పూర్తి చేస్తారో, అప్పుడే భగవంతుడు వస్తారు కదా. బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి. సగం-సగం ఉంటాయి కదా. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. వారైతే కల్పము ఆయువును తప్పుగా వ్రాశారు.

మొట్టమొదట మీరు అందరికీ తండ్రి మహిమను కూర్చుని వినిపించండి. తండ్రి జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు. శ్రీకృష్ణుడిని నిరాకారుడు, పతిత-పావనుడు, సుఖ సాగరుడు... అని అనరు. అతని మహిమ వేరు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. శివుడిని బాబా అని అంటారు. శ్రీకృష్ణుడికి బాబా అన్న పదము శోభించదు. ఇది ఎంత పెద్ద పొరపాటు. ఇక చిన్న-చిన్న పొరపాటులు చేస్తూ 100 శాతము మర్చిపోయారు. తండ్రి అంటారు - సన్యాసుల నుండి ఎప్పుడూ ఈ వ్యాపారము లభించదు. వారు నివృత్తి మార్గము వారు. మీరు ప్రవృత్తి మార్గము వారు. మీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, అప్పుడు నిర్వికారీ ప్రపంచముండేది. ఇది వికారీ ప్రపంచము. మరి సత్యయుగములో పిల్లలు జన్మించరా, అక్కడ కూడా వికారాలు ఉండేవి కదా అని అంటారు. అరే, అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము, సంపూర్ణ నిర్వికారులుగా ఉన్నవారు వికారులుగా ఎలా అవ్వగలరు? మరి అలా అయితే, సత్యయుగములో ఇంతమంది మనుష్యులు ఉండడమనేది ఎలా సాధ్యము అని అడుగుతారు. అక్కడ ఇంతమంది మనుష్యులు ఉండరు. భారత్ తప్ప ఇంకే ఖండాలు ఉండవు. వారు - మేము ఒప్పుకోము, ప్రపంచమైతే సదా నిండుగానే ఉంటుంది అని అంటారు. ఏమీ అర్థం చేసుకోరు. భారత్ స్వర్ణిమ యుగముగా ఉండేదని, ఇప్పుడు ఇనుప యుగముగా ఉందని, రాతి బుద్ధి కలవారిగా ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. గాంధీ మొదలైనవారంతా రామ రాజ్యాన్ని కోరుకునేవారు. కానీ మహాభారత యుద్ధము జరిగినట్లుగా, ఇక తర్వాత ఆట సమాప్తమైనట్లుగా చూపిస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఏమీ చూపించలేదు. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇది చాలా సహజము. శివజయంతిని జరుపుకుంటారు అంటే తప్పకుండా శివబాబా వస్తారు. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్ కావున తప్పకుండా స్వర్గము యొక్క గేటులను తెరవడానికి వస్తారు. అది కూడా నరకము ఉన్నప్పుడే వస్తారు. స్వర్గ ద్వారాలను తెరిచి, నరక ద్వారాలను మూసి వేస్తారు. స్వర్గ ద్వారాలు తెరుచుకుంటే తప్పకుండా అందరూ స్వర్గములోకే వస్తారు. ఈ విషయాలేమీ కష్టమైనవి కాదు. మహిమ కేవలం ఒక్క తండ్రికి మాత్రమే ఉంది. శివబాబాది ఒకే ఒక్క దుకాణము. వారు అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రి ద్వారా భారత్ కు స్వర్గ సుఖము లభిస్తుంది. అనంతమైన తండ్రి స్వర్గ స్థాపనను చేస్తారు. తప్పకుండా అక్కడ అనంతమైన సుఖముండేది. మరి మనము నరకములో ఎందుకు ఉన్నాము. ఇది ఎవరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరే అలా ఉండేవారు, మళ్ళీ మీరే పడిపోయారు. దేవతలే 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు పతితులుగా అయ్యారు. మళ్ళీ వారే పావనముగా అవ్వాలి. తండ్రి జన్మ కూడా జరుగుతుంది, అలాగే రావణుడి జన్మ కూడా జరుగుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. రావణుడిని ఎప్పటి నుండి కాలుస్తున్నారని ఎవరినైనా అడిగితే, అది అనాదిగా నడుస్తూ వస్తుందని అంటారు. ఈ రహస్యాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి యొక్క దుకాణానికి మాత్రమే మహిమ ఉంది. సుఖము, శాంతి, పవిత్రతలు మనుష్యుల నుండి మనుష్యులకు లభించవు. శాంతి అనేది కేవలం ఒక్కరికి మాత్రమే లభించదు. ఫలానావారి నుండి శాంతి లభించిందని అసత్యము చెప్తారు. అరే, శాంతి అయితే శాంతిధామములోనే లభించనున్నది. ఇక్కడైతే ఒకరు శాంతిగా ఉన్నప్పుడు, మరొకరు అశాంతపరిస్తే శాంతిగా ఉండలేకపోతారు. సుఖము, శాంతి, పవిత్రత, ఈ వస్తువులన్నింటి వ్యాపారి ఒక్క శివబాబాయే. వారితో ఎవరైనా వచ్చి వ్యాపారము చేయవచ్చు. వారిని వ్యాపారస్థుడు అని అంటారు. పవిత్రత, సుఖము, శాంతి, సంపద అన్నీ వారి వద్ద ఉన్నాయి. అప్రాప్తి అన్న వస్తువేదీ లేదు. మీరు స్వర్గ రాజ్యాన్ని పొందుతారు. తండ్రి అయితే ఇవ్వడానికి వచ్చారు, తీసుకునేవారు తీసుకుంటూ-తీసుకుంటూ అలసిపోతారు. నేను వచ్చేదే ఇవ్వడానికి కానీ మీరు తీసుకోవడములో చల్లబడిపోతారు. పిల్లలంటారు - బాబా, మాయ తుఫానులు వస్తున్నాయి. అవును, మరి పదవి కూడా చాలా ఉన్నతమైనది పొందాలి. స్వర్గానికి యజమానులుగా అవుతారు, ఇదేమైనా తక్కువ విషయమా! కావున కృషి చేయాలి. శ్రీమతముపై నడుస్తూ ఉండండి. మీకు ఏ సామానైతే లభిస్తుందో, దానిని మళ్ళీ ఇతరులకు కూడా ఇవ్వవలసి ఉంటుంది. దానము చేయవలసి ఉంటుంది. పవిత్రముగా అవ్వాలంటే, పంచ వికారాలను తప్పకుండా దానము చేయాలి. కష్టపడాలి. తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడే తుప్పు వదులుతుంది. ముఖ్యమైనది స్మృతి. బాబా, మేము వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళము, ఎవరిపైనా క్రోధము చేయము అని ప్రతిజ్ఞ చేయండి. కానీ స్మృతిలో తప్పకుండా ఉండాలి. లేదంటే ఇన్ని పాపాలు ఎలా వినాశనమవుతాయి. ఇకపోతే, జ్ఞానమైతే చాలా సహజమైనది. 84 జన్మల చక్రములో ఎలా తిరిగాము అన్నది మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇకపోతే, స్మృతియాత్రలోనే శ్రమ ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఏ జ్ఞానాన్ని ఇస్తారు. మన్మనాభవ అనగా నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఇతర సాంగత్యాలను వదిలి మీ ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాము, మీపై బలిహారమవుతాము, మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము అని మీరు పాడేవారు కూడా. ప్రతిజ్ఞ చేసారు, మరి ఎందుకు మర్చిపోతారు? చేతులు పని వైపు, హృదయము ప్రియుని వైపు... అని అంటారు కూడా. మీరే కర్మయోగులు. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. ప్రియుడైన తండ్రి స్వయంగా చెప్తున్నారు - ప్రేయసులైన మీరు అర్ధకల్పము స్మృతి చేసారు, ఇప్పుడు నేను వచ్చాను, నన్ను స్మృతి చేయండి. ఈ స్మృతినే పదే-పదే మర్చిపోతుంటారు, ఇందులోనే శ్రమ ఉంది. కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక ఈ శరీరాన్ని కూడా వదలవలసి ఉంటుంది. ఎప్పుడైతే రాజధాని స్థాపన అయిపోతుందో, అప్పుడు మీరు కర్మాతీత అవస్థను పొందుతారు. ఇప్పుడైతే అందరూ పురుషార్థులే. అందరికన్నా ఎక్కువగా మమ్మా-బాబా స్మృతి చేస్తారు. సూక్ష్మవతనములో కూడా వారు కనిపిస్తారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో, అది వారి అనేక జన్మల అంతిమ జన్మ. వారు కూడా పురుషార్థము చేస్తున్నారు. కర్మాతీత అవస్థకు ఇప్పుడింకా ఎవ్వరూ చేరుకోలేరు. కర్మాతీత అవస్థను చేరుకున్నట్లయితే, ఇక ఈ శరీరము ఉండదు. బాబా అయితే చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇక మిగిలినది అర్థం చేసుకునేవారి బుద్ధిపై ఆధారపడి ఉంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ ఒక్కరే. వారి వద్దనే జ్ఞానము యొక్క సామాను అంతా ఉంది. వారే ఇంద్రజాలికుడు. ఇంకెవ్వరి నుండి సుఖము-శాంతి-పవిత్రతల వారసత్వము లభించదు. తండ్రి చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పిల్లలు ధారణ చేయాలి మరియు ధారణ చేయించాలి. ఎంతగా ధారణ చేస్తారో, అంతగా వారసత్వాన్ని తీసుకుంటారు. రోజురోజుకు చాలా తాజా సరుకు లభిస్తుంది. లక్ష్మీ-నారాయణులను చూడండి, వారు ఎంత మధురమైనవారు, వారి వలె మధురముగా తయారవ్వాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఇంకే సత్సంగములోనైనా ఈ విధముగా చెప్తారా? మన ఈ భాష పూర్తిగా కొత్తది, దీనిని స్పిరిచ్యుల్ నాలెడ్జ్ అని అంటారు. అచ్ఛా!

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ద్వారా సుఖము-శాంతి-పవిత్రతల సామాను ఏదైతే లభించిందో, దానిని అందరికీ ఇవ్వాలి. ముందు వికారాలను దానమిచ్చి పవిత్రముగా అవ్వాలి, ఆ తర్వాత అవినాశీ జ్ఞాన ధనాన్ని దానము చేయాలి.

2. దేవతల వలె మధురముగా అవ్వాలి. బాప్ దాదాకు ఏదైతే ప్రతిజ్ఞ చేశారో, దానిని సదా గుర్తుంచుకోవాలి మరియు తండ్రి స్మృతిలో ఉంటూ వికర్మలను కూడా వినాశనము చేసుకోవాలి.

వరదానము:-
నిమిత్తము అనే స్మృతి ద్వారా తమ ప్రతి సంకల్పముపై అటెన్షన్ పెట్టే నివారణ స్వరూప భవ

నిమిత్తముగా ఉన్న ఆత్మల పట్ల అందరి దృష్టి ఉంటుంది, అందుకే నిమిత్తముగా అయ్యేవారు విశేషముగా తమ ప్రతి సంకల్పము పట్ల అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నిమిత్తముగా ఉన్న పిల్లలు కూడా ఏదైనా కారణాన్ని వినిపిస్తే, వారిని ఫాలో చేసేవారు కూడా అనేక కారణాలు వినిపిస్తారు. ఒకవేళ నిమిత్తముగా ఉన్నవారిలో ఏదైనా లోపముంటే, అది దాగి ఉండలేదు, అందుకే విశేషముగా మీ సంకల్పాలు, మాటలు మరియు కర్మల పట్ల అటెన్షన్ పెట్టి నివారణ స్వరూపులుగా అవ్వండి.

స్లోగన్:-
ఎవరికైతే తమ గుణాలు మరియు విశేషతల గురించి కూడా అభిమానము ఉండదో, వారే జ్ఞాన స్వరూప ఆత్మలు.

అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

ఎప్పుడైతే స్వయము మరియు ఇతరుల యొక్క గతాన్ని చూడకుండా లోపలి సంస్కారాలను సరళముగా మరియు నమ్రచిత్తముగా తయారుచేసుకుంటారో, అప్పుడు మధురత అనే గుణము జీవితములోకి వస్తుంది. సరళచిత్త ఆత్మ యొక్క గుణమే మధురత. వారి నయనాల ద్వారా మధురత, నోటి ద్వారా మధురత మరియు నడవడిక ద్వారా మధురత ప్రత్యక్ష రూపములో కనిపిస్తుంది. మధురత మరియు నమ్రత, ఈ రెండు విశేష ధారణల ద్వారా సదా విశ్వ కళ్యాణకారులుగా, మహాదానులుగా, వరదానులుగా అవుతారు మరియు సహజముగానే స్నేహానికి ఋజువును ఇవ్వగలుగుతారు.