‘‘తమ శ్రేష్ఠ స్వమానము యొక్క నషాలో ఉంటూ అసంభవాన్ని
సంభవము చేస్తూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి’’
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ స్వమానధారీ
విశేష పిల్లలను చూస్తున్నారు. ప్రతి బిడ్డ యొక్క స్వమానము ఎంత
విశేషమైనదంటే అటువంటి స్వమానము విశ్వములోని ఏ ఆత్మకు లేదు.
మీరందరూ విశ్వములోని ఆత్మలకు పూర్వజులు కూడా మరియు పూజ్యులు
కూడా. మొత్తము సృష్టి రూపీ వృక్షము యొక్క వేర్లలో మీరు
ఆధారమూర్తులు. మీరు విశ్వమంతటికీ పూర్వజులు, మొదటి రచన. చిన్న
పిల్లవాడైనా, వృద్ధ మాతలైనా, ప్రవృత్తిలోని వారైనా, ప్రతి
బిడ్డలోని విశేషతను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ప్రతి
ఒక్కరివీ వేర్వేరు విశేషతలు. ఈ రోజుల్లో ఎంత పెద్ద సైన్స్
వారైనా, ప్రపంచము లెక్కలో విశేషమైనవారైనా, వారు ప్రకృతీజీతులుగా
అయితే అయ్యారు, చంద్రుని వరకు కూడా చేరుకున్నారు, కానీ ఇంతటి
చిన్నని జ్యోతి స్వరూప ఆత్మను గుర్తించలేకపోయారు! కానీ ఇక్కడైతే
చిన్న పిల్లవాడు కూడా నేను ఆత్మను అని అంటాడు, అతడికి జ్యోతి
బిందువు గురించి తెలుసు. ‘‘నేను ఆత్మను’’ అని నషాతో అంటాడు.
ఎంతో పెద్ద మహాత్ములు ఉన్నారు మరియు బ్రాహ్మణ మాతలు ఉన్నారు.
మాతలు - మేము పరమాత్ముడిని పొందేసాము అని గర్వముతో అంటారు.
పొందేసారు కదా! మరియు మహాత్ములు ఏమంటారు? పరమాత్ముడిని పొందటము
చాలా కష్టమని అంటారు. ప్రవృత్తిలో ఉన్నవారు ఏమని ఛాలెంజ్
చేస్తారంటే - మేమంతా ప్రవృత్తిలో ఉంటూ, కలిసి ఉంటూ పవిత్రముగా
ఉంటాము ఎందుకంటే మా మధ్యన తండ్రి ఉన్నారు, అందుకే ఇద్దరూ కలిసి
ఉంటూ కూడా సహజముగానే పవిత్రముగా ఉండగలుగుతారు ఎందుకంటే పవిత్రత
మన స్వధర్మము. పర ధర్మము కష్టమనిపిస్తుంది, స్వ ధర్మము
సహజమనిపిస్తుంది. ఇతరులు ఏమంటారు? నిప్పు మరియు దూది కలిసి
ఉండలేవు, అది చాలా కష్టము అని అంటారు. కానీ మీరందరూ ఏమంటారు?
చాలా సహజము అని అంటారు. మొదటిలో మీ అందరిదీ ఒక పాట ఉండేది, అది
ఏమిటంటే - ఎంత పెద్ద ధనవంతులైనా లేక యజమానులైనా కానీ, ఒక్క
భగవంతుడిని తెలుసుకోలేదు, చిన్నని బిందువైన ఆత్మను తెలుసుకోలేదు,
కానీ పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు, పొందారు. అసంభవము
సంభవమైంది అని ఎంత నిశ్చయముతో మరియు నషాతో అంటారు. బాప్ దాదా
కూడా ప్రతి బిడ్డను విజయీ రత్నముగా చూసి హర్షిస్తారు ఎందుకంటే
ధైర్యము చేసే పిల్లలకు తండ్రి సహాయము లభిస్తుంది. అందుకే
ప్రపంచము కొరకు ఏ విషయాలైతే అసంభవమో, అవి మీ కొరకు సహజమయ్యాయి
మరియు సంభవమయ్యాయి. మేము పరమాత్మునికి డైరెక్ట్ పిల్లలము అని
నషా ఉంటుంది! ఈ నషా కారణముగా, నిశ్చయము కారణముగా, పరమాత్ముని
పిల్లలైన కారణముగా మాయ నుండి కూడా రక్షింపబడ్డారు. పిల్లలుగా
అవ్వటము అనగా సహజముగా రక్షింపబడటము. కావున మీరు పిల్లలు,
అంతేకాక అన్ని విఘ్నాల నుండి, సమస్యల నుండి రక్షింపబడ్డవారు.
మరి మీ యొక్క ఇంతటి శ్రేష్ఠ స్వమానము గురించి మీకు తెలుసు
కదా! ఇది ఎందుకు సహజము? ఎందుకంటే మీరు సైలెన్స్ శక్తి ద్వారా
పరివర్తనా శక్తిని కార్యములో ఉపయోగిస్తారు. నెగెటివ్ ను
పాజిటివ్ లోకి పరివర్తన చేస్తారు. మాయ ఎంత పెద్ద సమస్య రూపములో
వచ్చినా కానీ మీరు పరివర్తనా శక్తి ద్వారా, సైలెన్స్ శక్తి
ద్వారా సమస్యను సమాధాన స్వరూపముగా చేసేస్తారు. కారణాన్ని
నివారణ రూపములోకి మార్చేస్తారు. ఇంతటి శక్తి ఉంది కదా? కోర్స్
కూడా చేయిస్తుంటారు కదా! నెగెటివ్ ను పాజిటివ్ గా చేసే విధిని
నేర్పిస్తారు. ఈ పరివర్తనా శక్తి తండ్రి ద్వారా వారసత్వముగా
లభించింది. ఒక్క శక్తే కాదు, సర్వ శక్తులూ పరమాత్మ వారసత్వముగా
లభించాయి, అందుకే బాప్ దాదా ప్రతిరోజూ చెప్తుంటారు, ప్రతిరోజూ
మురళిని వింటుంటారు కదా! ప్రతిరోజూ బాప్ దాదా ఇదే చెప్తుంటారు
- తండ్రిని స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి.
తండ్రి స్మృతి కూడా ఎందుకని సహజముగానే వస్తుంది? వారసత్వపు
ప్రాప్తిని గుర్తు చేసుకున్నప్పుడు ఆ ప్రాప్తి కారణముగా తండ్రి
స్మృతి సహజముగా వచ్చేస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరికీ ఈ ఆత్మిక
నషా ఉంటుంది. పొందాల్సినదంతా పొందేసాము అని మనసులో పాటను
పాడుతారు. అందరి హృదయాలలో స్వతహాగానే ఈ పాట మ్రోగుతుంది కదా!
నషా ఉంది కదా! ఎంతగా ఈ నషాలో ఉంటారో, నషాకు గుర్తు ఏమిటంటే -
నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ సంకల్పములోనైనా, మాటలలోనైనా లేక
సంబంధ-సంపర్కములోనైనా ఏ విధమైన చింత ఉన్నా నషా లేనట్లే. బాప్
దాదా అయితే నిశ్చింత చక్రవర్తులుగా చేసారు. చెప్పండి, నిశ్చింత
చక్రవర్తులేనా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులో వారు చేతులెత్తండి.
నిశ్చింతులేనా లేక అప్పుడప్పుడు చింత వస్తుందా? మంచిది. తండ్రి
నిశ్చింతులైనప్పుడు, ఇక పిల్లలకు ఏం చింత ఉంది!
బాప్ దాదా అయితే చెప్పి ఉన్నారు - అన్ని చింతలను మరియు ఏ
రకమైన భారము ఉన్నా సరే దానిని బాప్ దాదాకు ఇచ్చేయండి. తండ్రి
సాగరుడు కదా, కావున భారము అంతా ఇమిడిపోతుంది. అప్పుడప్పుడు బాప్
దాదా పిల్లలది ఒక పాటను విని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. అది ఏ
పాటనో తెలుసా? ఏమి చేయాలి, ఎలా చేయాలి... అప్పుడప్పుడు అయితే
పాడుతుంటారు కదా. బాప్ దాదా అయితే వింటూ ఉంటారు. కానీ బాప్ దాదా
పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు - ఓ మధురమైన పిల్లలూ, ప్రియమైన
పిల్లలూ - సాక్షీ దృష్టా స్థితి యొక్క సీట్ పై సెట్ అవ్వండి
మరియు సీట్ పై సెట్ అయ్యి ఆటను చూడండి, చాలా మజా వస్తుంది, వాహ్
అనిపిస్తుంది! త్రికాలదర్శీ స్థితిలో స్థితులవ్వండి. సీట్ నుండి
కిందకు వస్తారు, అందుకే అప్సెట్ అవుతారు. సెట్ అయ్యి
ఉన్నట్లయితే అప్సెట్ అవ్వరు (అలజడిలోకి రారు). ఏ మూడు విషయాలు
పిల్లలను వ్యాకులపరుస్తాయి? 1. చంచలమైన మనసు, 2. భ్రమిస్తున్న
బుద్ధి మరియు 3. పాత సంస్కారాలు. బాప్ దాదాకు పిల్లలు మాట్లాడే
ఒక విషయాన్ని వింటే నవ్వు వస్తుంటుంది, అది ఏ విషయమో తెలుసా?
పిల్లలు ఏమంటారంటే - బాబా, ఏం చెయ్యాలి, ఇవి నా పాత సంస్కారాలు
కదా! బాప్ దాదా చిరునవ్వు నవ్వుతారు. నా సంస్కారాలు అని
అంటున్నారంటే, వాటిని ‘నావిగా’ చేసుకున్నారనే కదా? మరి నావి
అన్నవాటిపైనైతే అధికారము తప్పకుండా ఉంటుంది. పాత సంస్కారాలను
నావిగా చేసుకున్నారంటే, మరి నావి అన్నవి కొంత స్థానము
తీసుకుంటాయి కదా! నా సంస్కారాలు అన్న మాటను బ్రాహ్మణ ఆత్మ
అనవచ్చా? మీరు వాటిని నావి-నావి అని అన్నారు కావున ఆ నావి
అన్నవి తమ స్థానము ఏర్పాటు చేసుకున్నాయి. బ్రాహ్మణులైన మీరు
నావి అని అనకూడదు. అవి గత జీవితము యొక్క సంస్కారాలు. అవి శూద్ర
జీవితము యొక్క సంస్కారాలు. అవి బ్రాహ్మణ జీవితపు సంస్కారాలు
కావు. వాటిని నావి-నావి అని అన్నందుకు అవి కూడా సొంత అధికారముతో
కూర్చుండిపోయాయి. బ్రాహ్మణ జీవితము యొక్క శ్రేష్ఠ సంస్కారాల
గురించి తెలుసు కదా! మీరు ఏ సంస్కారాలనైతే పాత సంస్కారాలు అని
అంటున్నారో, అవి పాతవి కాదు. శ్రేష్ఠ ఆత్మలైన మీ అత్యంత పాత
సంస్కారాలు అనాది మరియు ఆది సంస్కారాలు. మీరు వేటినైతే పాత
సంస్కారాలు అని అంటున్నారో, అవి మధ్యలో ద్వాపరము నుండి మొదలైన
సంస్కారాలు. కావున మధ్యలో వచ్చిన సంస్కారాలను బాబా సహాయముతో
సమాప్తము చెయ్యండి, అది కష్టమేమీ కాదు. కానీ జరుగుతుంది ఏమిటి?
ఏ తండ్రి అయితే సదా మీతోపాటు కంబైండ్ గా ఉన్నారో, వారు కంబైండ్
గా ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకుని సహయోగము తీసుకోరు.
కంబైండ్ అంటే అర్థమే అవసరమైన సమయములో సహయోగీ. కానీ అవసరమైన
సమయములో సహయోగము తీసుకోని కారణముగా మధ్యలో వచ్చిన సంస్కారాలు
ప్రాముఖ్యతలోకి వచ్చేస్తాయి.
పిల్లలందరూ తండ్రి ప్రేమకు పాత్రులు, అధికారులు అని బాప్
దాదాకు తెలుసు. ప్రేమ కారణముగానే అందరూ చేరుకున్నారని బాబాకు
తెలుసు. విదేశాల నుండి వచ్చినా, దేశము నుండి వచ్చినా కానీ,
అందరూ పరమాత్ముని ప్రేమ యొక్క ఆకర్షణతో తమ ఇంటికి చేరుకున్నారు.
ప్రేమలో మెజారిటీ పాస్ అయినవారు అని బాప్ దాదాకు కూడా తెలుసు.
విదేశాల నుండి ప్రేమ అనే విమానములో చేరుకున్నారు. చెప్పండి,
మీరందరూ ప్రేమ అనే బంధములో బంధింపబడి ఇక్కడకు చేరుకున్నారు కదా!
ఈ పరమాత్మ ప్రేమ మనసుకు ప్రశాంతతను కలిగించేటువంటిది. అచ్ఛా -
ఎవరైతే మొదటిసారి ఇక్కడకు చేరుకున్నారో వారు చేతులెత్తండి.
చేతులు ఊపండి. వచ్చారు, మంచిది.
బాప్ దాదా ఏదైతే హోంవర్క్ ను ఇచ్చారు, ఆ హోంవర్క్ గుర్తుందా?
గుర్తుందా? బాప్ దాదా వద్దకు చాలావైపుల నుండి రిజల్ట్ వచ్చింది.
అందరి రిజల్ట్ రాలేదు. కొందరిది కొంత శాతములో కూడా వచ్చింది.
కానీ ఇప్పుడు ఏం చేయాలి? బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్
దాదా ఇదే కోరుకుంటున్నారు - అందరూ పూజ్యనీయ ఆత్మలే, పూజ్యనీయ
ఆత్మల యొక్క విశేషమైన లక్షణము ఆశీర్వాదాలను ఇవ్వటమే. మరి
మీరందరూ పూజ్యనీయ ఆత్మలని మీ అందరికీ తెలుసా? కావున
ఆశీర్వాదాలను ఇవ్వండి. ఆశీర్వాదాలను ఇవ్వటమంటే ఆశీర్వాదాలను
తీసుకోవటము అని అర్థము. ఎవరైతే ఆశీర్వాదాలను ఇస్తారో, ఎవరికైతే
ఇస్తారో, వారి హృదయము నుండి పదే-పదే ఇచ్చినవారి పట్ల
ఆశీర్వాదాలు వెలువడుతాయి. కావున ఓ పూజ్య ఆత్మలారా, మీ నిజ
సంస్కారము - ఆశీర్వాదాలను ఇవ్వటము, మీ అనాది సంస్కారము -
ఆశీర్వాదాలను ఇవ్వటము. మీ జడ చిత్రాలు కూడా ఆశీర్వాదాలను
ఇస్తున్నప్పుడు, ఇక చైతన్య పూజ్య ఆత్మలకైతే ఆశీర్వాదాలను
ఇవ్వటమనేది న్యాచురల్ సంస్కారము. నా సంస్కారము అని దీనిని అనండి.
ద్వాపరము నుండి మొదలైన సంస్కారాలు మధ్య సంస్కారాలు, అవి
న్యాచురుల్ గా మరియు నేచర్ గా అయిపోయాయి. వాస్తవానికి
ఆశీర్వాదాలను ఇచ్చే సంస్కారము మీ నేచురల్ నేచర్. ఎప్పుడైనా
ఎవరికైనా ఆశీర్వాదాలను ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎంత సంతోషిస్తుంది,
ఆ సంతోషముతో కూడిన వాయుమండలము ఎంత సుఖదాయిగా ఉంటుంది! కావున
ఎవరైతే హోంవర్క్ చేసారో వారందరికీ, వారు ఇక్కడకు వచ్చినా,
రాకపోయినా కానీ, వారందరూ బాప్ దాదా ఎదురుగా ఉన్నారు. వారందరికీ
బాప్ దాదా అభినందనలను ఇస్తున్నారు. హోంవర్క్ చేసారు, ఇప్పుడు
దానిని మీ నేచురల్ నేచర్ గా తయారుచేసుకుంటూ ఇకముందు కూడా
ఆశీర్వాదాలను ఇవ్వటము అనేది చేస్తూ, చేయిస్తూ ఉండండి. మరియు
ఎవరైతే హోంవర్క్ ను కొద్దిగా చేసారో, లేక చెయ్యకపోయినా కానీ,
వారందరూ స్వయాన్ని సదా - నేను పూజ్య ఆత్మను, నేను తండ్రి
శ్రీమతముపై నడిచే విశేష ఆత్మను అని భావించండి. ఈ స్మృతిని
పదే-పదే మీ స్మృతి మరియు స్వరూపములోకి తీసుకురండి ఎందుకంటే
ప్రతి ఒక్కరినీ మీరు ఎలా తయారవ్వబోతున్నారు అని అడిగినప్పుడు,
అందరూ - మేము లక్ష్మీ-నారాయణులుగా తయారవ్వబోతున్నాము అని అంటారు.
సీతా-రాములుగా అవుతాము అని ఎవ్వరూ చేతులెత్తరు. 16 కళలు
కలిగినవారిగా అవ్వాలి అన్న లక్ష్యము ఉన్నప్పుడు, 16 కళలు అనగా
పరమ పూజ్యులు, పూజ్య ఆత్మల కర్తవ్యమే ఆశీర్వాదాలను ఇవ్వటము. ఈ
సంస్కారాన్ని నడుస్తూ-తిరుగుతూ సహజముగా మరియు సదా కాలము కొరకు
తయారుచేసుకోండి. మీరు ఉన్నదే పూజ్యులుగా, 16 కళలు కలిగినవారిగా.
లక్ష్యమైతే ఇదే కదా!
ఎవరెవరైతే హోంవర్క్ చేసారో, వారు తమ మస్తకముపై బాబా ద్వారా
విజయ తిలకాన్ని పెట్టించుకున్నారు అని బాప్ దాదా
సంతోషిస్తున్నారు. అలాగే సేవా సమాచారము కూడా అందరివైపు నుండి,
వర్గాల నుండి, సెంటర్ల నుండి చాలా మంచి రిజల్ట్ తో బాప్ దాదా
వద్దకు చేరుకుంది. కావున ఒకటేమో, హోంవర్క్ చేసినందుకు అభినందనలు
మరియు దానితోపాటు సేవ కోసం కూడా అభినందనలు, పదమాల, పదమాల రెట్లు
అభినందనలు. బాబా చూసారు, గ్రామ-గ్రామాలలో సందేశాన్ని ఇచ్చే సేవ
చాలా మంచి రీతిలో మెజారిటీ ఏరియాల్లో చేసారు, ఈ సేవను కూడా
దయార్ద్ర హృదయులుగా అయి చేసారు, అందుకే సేవ యొక్క
ఉల్లాస-ఉత్సాహాలలో రిజల్ట్ కూడా మంచిగా కనిపించింది. ఈ విషయములో
శ్రమించారని కాదు, కానీ తండ్రి పట్ల ప్రేమ అంటే సందేశము ఇవ్వటము
పట్ల ప్రేమ, ఆ ప్రేమలో సేవ చేసారు కావున ఆ ప్రేమకు రిటర్నులో
సేవాధారులందరికీ స్వతహాగానే బాబా నుండి పదమాల, పదమాల రెట్లు
ప్రేమ ప్రాప్తించింది మరియు ప్రాప్తిస్తూనే ఉంటుంది. అంతేకాక,
అందరూ తమ ప్రియమైన దాదీని చాలా స్నేహముతో గుర్తు చేసుకుంటూ,
దాదీకు వారి ప్రేమకు రిటర్న్ ఇస్తున్నారు. ఈ ప్రేమ సుగంధము బాప్
దాదా వద్దకు చాలా మంచి రీతిలో చేరుకుంది.
ఇప్పుడు మధుబన్ లో ఏవేవైతే కార్యాలు జరుగుతూ ఉన్నాయో, అవి
విదేశీయులవైనా లేక భారత్ వారివి అయినా, ఆ కార్యాలన్నీ కూడా
పరస్పర సహయోగము, గౌరవము యొక్క ఆధారముతో చాలా బాగా సఫలమయ్యాయి
మరియు ముందు జరిగే కార్యాలు కూడా సఫలమయ్యే ఉన్నాయి ఎందుకంటే
సఫలత మీ మెడలోని హారము. మీరు బాబా మెడలోని హారము కూడా. బాబా
గుర్తు తెప్పించారు - మీరు ఎప్పుడూ ఓడిపోవద్దు ఎందుకంటే మీరు
బాబా మెడలోని హారము. మెడలోని హారముగా ఉన్నవారు ఎప్పుడూ
ఓడిపోలేరు. మరి హారముగా అవ్వాలా లేక ఓడిపోవాలా? ఓడిపోకూడదు కదా!
హారముగా అవ్వటము మంచిది కదా! కావున ఎప్పుడూ ఓడిపోవద్దు.
ఓడిపోయేవారు అయితే అనేక కోట్లమంది ఆత్మలు ఉన్నారు, కానీ మీరు
హారముగా అయ్యి మెడలో ఉన్నారు. అలానే ఉన్నారు కదా! కావున
సంకల్పము చెయ్యండి, మాయ ఎన్ని తుఫానులను ఎదురుగా తీసుకువచ్చినా
కానీ బాబా ప్రేమలో, మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మల ఎదురుగా
తుఫాను కూడా తోఫాగా (కానుకగా) అయిపోతుంది. ఈ వరదానాన్ని సదా
గుర్తుంచుకోండి. ఎంత పెద్ద పర్వతమైనా కానీ, పర్వతము మారిపోయి
దూదిలా అయిపోతుంది. ఇప్పుడు సమయము యొక్క సమీపత అనుసారముగా
వరదానాలను ప్రతి సమయము అనుభవములోకి తీసుకురండి. అనుభవము యొక్క
అథారిటీలుగా అవ్వండి.
ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరులుగా అయ్యే, ఫరిశ్తా
స్వరూపులుగా అయ్యే ఎక్సర్ సైజ్ ను చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే
బ్రాహ్మణ్, ఇప్పుడిప్పుడే ఫరిశ్తా, ఇప్పుడిప్పుడే అశరీరి.
నడుస్తూ, తిరుగుతూ, కార్య వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క
నిమిషము, రెండు నిమిషాలు కేటాయించి అభ్యాసము చెయ్యండి. ఏ
సంకల్పమైతే చేసానో, ఆ స్వరూపాన్నే అనుభవము చేసానా అని చెక్
చేసుకోండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ స్వమానధారులు, సదా స్వయాన్ని
పరమ పూజ్యులు మరియు పూర్వజులుగా అనుభవము చేసేవారు, సదా
స్వయాన్ని ప్రతి సబ్జెక్టులోనూ అనుభవీ స్వరూపులుగా
తయారుచేసుకునేవారు, సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు, భృకుటీ
సింహాసనాధికారులు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవాలలో
స్థితులయ్యేవారు, నలువైపులా ఉన్న పిల్లలందరికీ ప్రియస్మృతులు
మరియు నమస్తే.
అన్నివైపుల నుండి అందరి ఉత్తరాలు, ఈ-మెయిల్స్, సమాచారాలన్నీ
బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి, సేవ యొక్క ఫలము మరియు బలము
సేవాధారులందరికీ ప్రాప్తించాయి మరియు ప్రాప్తిస్తూ ఉంటాయి.
ప్రేమ పత్రాలు కూడా చాలా వస్తుంటాయి, పరివర్తనా పత్రాలు కూడా
చాలా వస్తుంటాయి. పరివర్తనా శక్తి కలిగినవారికి బాప్ దాదా అమర
భవ యొక్క వరదానాన్ని ఇస్తున్నారు. ఏ సేవాధారులైతే శ్రీమతాన్ని
పూర్తిగా ఫాలో చేసారో, అలా ఫాలో చేసే పిల్లలతో బాప్ దాదా
అంటున్నారు - ‘‘సదా ఆజ్ఞాకారీ పిల్లలూ వాహ్!’’ బాప్ దాదా వారికి
ఈ వరదానాన్ని ఇస్తున్నారు మరియు ప్రేమ కలిగిన పిల్లలకు
చాలా-చాలా ప్రేమతో ఏ వరదానాన్ని ఇస్తున్నారంటే - ‘‘హృదయములో
ఇమిడిపోయే అతి ప్రియమైనవారు మరియు మాయ విఘ్నాల నుండి అతి
అతీతమైనవారు’’. అచ్ఛా!
ఇప్పుడు అందరి హృదయములో ఏ ఉల్లాసము వస్తుంది? బాబా సమానముగా
తయారవ్వాల్సిందే అన్న ఒకే ఉల్లాసము ఉంది. ఉందా ఈ ఉల్లాసము?
పాండవులూ, చేతులెత్తండి, తయారవ్వాల్సిందే. చూస్తాములే,
అవుతాములే, లే, లే అని అనవద్దు... అవ్వాల్సిందే. పక్కానా,
పక్కానా? అచ్ఛా! ప్రతి ఒక్కరూ మీ ఓ.కె. కార్డును మీ టీచర్లకు
చార్ట్ రూపములో ఇస్తూ ఉండండి. ఎక్కువ వ్రాయకండి, ఒక కార్డు
తీసుకోండి అంతే, అందులో ఓ.కె. అని వ్రాయండి లేదా ఓ.కె. కు
అడ్డముగా ఒక గీత గీయండి, అంతే. ఇదైతే చెయ్యగలరు కదా. పెద్ద
ఉత్తరము వద్దు. అచ్ఛా!