03-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి సమానముగా దయార్ద్ర హృదయులుగా అయి అనేకులకు మార్గాన్ని తెలియజేయండి, ఏ పిల్లలైతే రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై ఉంటారో, వారే ధైర్యవంతులు’’

ప్రశ్న:-
ఉన్నతమైన భాగ్యము ముఖ్యముగా ఏ విషయముపై ఆధారపడి ఉంటుంది?

జవాబు:-
స్మృతియాత్రపై. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తూ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడు భాగ్యము ఉన్నతముగా అవుతూ ఉంటుంది.

పాట:-
భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను...

ఓంశాంతి
పిల్లలు జన్మించినప్పుడు, కర్మల అనుసారముగా తమతో పాటు తమ భాగ్యాన్ని తెచ్చుకుంటారు. కొందరు షావుకారుల వద్ద, కొందరు పేదవారి వద్ద జన్మ తీసుకుంటారు. ఆ తండ్రి కూడా, వారసుడు వచ్చాడని భావిస్తారు. తాము చేసిన దానపుణ్యాల అనుసారముగా జన్మ లభిస్తుంది. ఇప్పుడు మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలైన మీకు, కల్పము తర్వాత, మళ్ళీ తండ్రి వచ్చి అర్థం చేయించారు. మేము మా భాగ్యాన్ని తీసుకుని వచ్చామని పిల్లలకు కూడా తెలుసు. స్వర్గ రాజ్యాధికారము యొక్క భాగ్యాన్ని తీసుకునివచ్చారు. దీనిని బాగా తెలుసుకున్నవారు తండ్రిని స్మృతి చేస్తున్నారు. భాగ్యానికి స్మృతితో కనెక్షన్ ఉంది. జన్మ తీసుకున్నారు కనుక తండ్రి స్మృతి కూడా ఉండాలి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా భాగ్యము ఉన్నతముగా ఉంటుంది. ఇది ఎంత సహజమైన విషయము. సెకెండులో జీవన్ముక్తి లభిస్తుంది. మీరు సుఖధామము యొక్క భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పురుషార్థము చేస్తున్నారు. తాము ఎలా పురుషార్థము చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకుంటున్నారు. మమ్మా, బాబా మరియు సర్వీసబుల్ పిల్లలు ఏ విధముగా పురుషార్థము చేస్తున్నారో, అలా వారిని ఫాలో చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి పరిచయాన్ని ఇచ్చారంటే, అందులో రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయము కూడా వచ్చేస్తుంది. ఋషులు, మునులు మొదలైనవారెవరూ రచయిత మరియు రచనల యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తము చక్రమంతా స్మృతిలో ఉంటుంది. ప్రపంచములో ఎవ్వరికీ తండ్రి మరియు వారసత్వము గురించి తెలియదు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి గురించి మరియు మీ భాగ్యము గురించి తెలుసు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళించాలి. ఎవరైనా నిర్బంధనులుగా ఉంటే, వారు బాగా సేవ చేయగలరు. పిల్లలు లేనివారికి సేవ చేయడానికి మంచి అవకాశము ఉంటుంది. పత్నికి, పతి మరియు పిల్లల యొక్క బంధనముంటుంది. ఒకవేళ పిల్లలు లేకపోతే, బంధనముక్తులు అన్నట్లే కదా. వారు వానప్రస్థులు వలె ఉన్నట్లు. ఇకపోతే ముక్తిధామానికి వెళ్ళేందుకు సాంగత్యము కావాలి. భక్తి మార్గములోనైతే సాధువులు మొదలైనవారు మరియు నివృత్తి మార్గము వారి యొక్క సాంగత్యము లభిస్తుంది. ఆ నివృత్తి మార్గము వారు ప్రవృత్తి మార్గము యొక్క వారసత్వాన్ని ఇప్పించలేరు. పిల్లలైన మీరే ఇప్పించగలరు. మీకు తండ్రి మార్గాన్ని తెలియజేశారు. భారత్ యొక్క 84 జన్మల చరిత్ర-భౌగోళికాలను అర్థం చేయించండి. భారతవాసులే 84 జన్మలను తీసుకుంటారు, ఇది ఒక్కరి విషయము కాదు. సూర్యవంశీయులే మళ్ళీ చంద్రవంశీయులుగా అవుతారు, ఆ తర్వాత వైశ్యవంశములోకి... వస్తారు, నంబరువారుగా అయితే ఉంటారు కదా. భారత్ యొక్క మొదటి నంబరు రాకుమారుడు శ్రీకృష్ణుడు, వారిని ఊయలలో ఊపుతారు. రెండవ నంబరు వారిని ఊపనే ఊపరు ఎందుకంటే కళలు తగ్గిపోయాయి. ఎవరైతే మొదటి నంబరు శ్రీకృష్ణుడు ఉన్నారో, పూజ వారికి జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఒక్కరా లేక ఇద్దరు ముగ్గురు ఉంటారా అన్నది మనుష్యులకు అర్థం కాదు. శ్రీకృష్ణుని వంశావళి కొనసాగుతుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. పూజ కేవలం మొదటి నంబరు వారికి మాత్రమే జరుగుతుంది. మార్కులైతే నంబరువారుగానే లభిస్తాయి. కనుక నేను మొదటి నంబరులోకి ఎందుకు రాకూడదు అని పురుషార్థము చేయాలి. మమ్మా, బాబాలను ఫాలో చేయాలి, వారి రాజధానిని తీసుకోవాలి. ఎవరైతే మంచి సేవ చేస్తారో, వారు మంచి మహారాజు ఇంటిలో జన్మ తీసుకుంటారు. అక్కడ ఉన్నదే మహారాజు-మహారాణి. ఆ సమయములో ఎవరికీ రాజు-రాణి అనే టైటిల్స్ ఉండవు, అవి తర్వాత ప్రారంభమవుతాయి. ద్వాపరము నుండి ఎప్పుడైతే పతితముగా అవుతారో, అప్పుడు వారిలో ఎక్కువ ప్రాపర్టీ ఉన్నవారిని మహారాజు అని అంటారు, అప్పుడిక రాజు పదవి తగ్గిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గము ప్రారంభమవుతుందో, అప్పుడు పేదవారు, షావుకారులలో తేడా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరే శివబాబాను స్మృతి చేస్తారు మరియు వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మిగిలిన సత్సంగాలలో మనుష్యులు కూర్చుని కథలను వినిపిస్తారు. మనుష్యులు, మనుష్యులకు భక్తిని నేర్పిస్తారు. వారు జ్ఞానాన్ని ఇచ్చి సద్గతిని కలిగించలేరు. వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. సద్గతి అయితే జ్ఞానము ద్వారానే కలుగుతుంది. పునర్జన్మలను కూడా నమ్ముతారు. మధ్యలోనైతే ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. చివరిలోనే తండ్రి వచ్చి అందరినీ తీసుకువెళ్తారు. ఇంతమంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అన్ని ధర్మాల వారి సెక్షన్లు వేర్వేరుగా ఉంటాయి కదా. కనుక ఇది కూడా అర్థం చేయించాలి. ఆత్మల వృక్షము కూడా ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తము వృక్షము యొక్క జ్ఞానము ఉంటుంది. ఆత్మల వృక్షము కూడా ఉంటుంది, జీవాత్మల వృక్షము కూడా ఉంటుంది. మేము ఈ పాత శరీరాలను వదిలి ఇంటికి వెళ్తున్నామని పిల్లలకు తెలుసు. ‘‘నేను ఒక ఆత్మను’’, ఈ శరీరానికి వేరుగా ఉన్నాను - ఇది అర్థం చేసుకోవడమంటే జీవిస్తూ మరణించడము. మీరు మరణించినట్లయితే మీకు సంబంధించినంత వరకు ప్రపంచము మరణించినట్లే. మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరినీ వదిలేశారు. ముందు పూర్తి శిక్షణను తీసుకుని, పదవికి అధికారులుగా అయి, అప్పుడు వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయడమైతే చాలా సహజము. ఎవరైనా అనారోగ్యముగా ఉన్నా సరే, వారికి కూడా - శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని చెప్తూ ఉండాలి. ఎవరైతే పక్కా యోగీగా ఉంటారో, వారు త్వరగా మరణించడము (శరీరాన్ని వదలడము) కూడా మంచిది కాదు, ఎందుకంటే వారు యోగములో ఉంటూ ఆత్మిక సేవను చేస్తారు. మరణించినట్లయితే సేవ చేయలేరు. సేవ చేసినట్లయితే తమ పదవిని ఉన్నతముగా చేసుకుంటూ ఉంటారు మరియు సోదరీ-సోదరుల సేవ కూడా జరుగుతుంది. వారు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. మనము పరస్పరములో సోదరులము, ఒక్క తండ్రి పిల్లలము.

తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇంతకుముందు కూడా ఇలా చెప్పారు. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు - సోదరీ లేక సోదరా, మీ ఆత్మ తమోప్రధానముగా అయిపోయింది. ఇదివరకు సతోప్రధానముగా ఉన్న ఆత్మ, ఇప్పుడు మళ్ళీ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయి సతోప్రధాన ప్రపంచములోకి వెళ్ళాలి. స్మృతియాత్రతో ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. స్మృతి చార్టును పూర్తిగా పెట్టుకోవాలి. జ్ఞానము యొక్క చార్టును పెట్టుకోలేరు. తండ్రి అయితే జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. నాపై ఉన్న వికర్మల భారము ఎలా తొలగుతుందని చెక్ చేసుకోవాలి. అందుకే, నేను ఎన్ని గంటలు స్మృతి చేసాను అని స్మృతి చార్టును పెట్టుకోవడము జరుగుతుంది. మూలవతనాన్ని కూడా స్మృతి చేస్తారు, మళ్ళీ కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తారు. అతలాకుతలం అవ్వనున్నది. దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాంబులు మొదలైనవి కూడా తయారవుతూ ఉంటాయి. ఒకవైపు, మేము మృత్యువు కోసం ఇటువంటి సామాగ్రిని తయారుచేస్తున్నామని అంటారు. మరోవైపు, మృత్యువు యొక్క సామాగ్రిని తయారుచేయకండి అని అంటారు. సముద్ర గర్భములో కూడా హతమార్చే సామాగ్రిని ఉంచారు, అవి పైకి వచ్చి బాంబులు వేసి మళ్ళీ సముద్రములోకి వెళ్ళిపోతాయి. ఇలాంటి వస్తువులను తయారుచేస్తూ ఉంటారు. ఇవి తమ వినాశనము కోసమే తయారుచేసుకుంటున్నారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇంత పెద్ద-పెద్ద మహళ్ళను తయారుచేస్తున్నారు. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయని మీకు తెలుసు. కొందరిది మట్టిలో కూరుకుపోతుంది... యుద్ధము తప్పకుండా జరుగుతుంది. అప్పుడు అందరి జేబులను ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తారు. దొంగలు కూడా ఎంతమంది చొరబడతారు. యుద్ధాలకు ఎంత ఖర్చు చేస్తారు. ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది. ఇళ్ళు మొదలైనవన్నీ కూలిపోతాయి. బాంబులు మొదలైనవి పడటముతో సృష్టిలోని మూడు భాగాలు సమాప్తమైపోతుంది, ఒక భాగము మిగులుతుంది. భారత్ ఒక భాగములో ఉంది కదా, మిగిలినవన్నీ తర్వాత వచ్చినవి. ఇప్పుడు భారతఖండము యొక్క భాగము మాత్రమే మిగులుతుంది. మృత్యువైతే అందరిదీ జరిగేదే ఉంది కావున మనము తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు, అందుకే తండ్రి అంటారు - లౌకిక సంబంధీకులతో కూడా తోడును నిర్వర్తించాలి. ఒకవేళ బంధనాలేవీ లేకపోతే, సేవలో ఎందుకు నిమగ్నమవ్వకూడదు అని బాబా సలహానిస్తారు. స్వతంత్రులుగా ఉన్నట్లయితే, అనేకులకు మేలు చేయగలరు. అచ్ఛా, ఒకవేళ బయటకు ఎక్కడికీ వెళ్ళలేకపోతే మీ మిత్ర-సంబంధీకులపైనే దయ చూపించాలి. బాబా, దయ చూపించండి అని ఇంతకుముందు అనేవారు కదా. ఇప్పుడు మీకు మార్గము లభించింది కనుక బాబా ఏ విధముగా దయ చూపిస్తారో, అలా మీరు ఇతరులపై కూడా దయ చూపించాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. సన్యాసులైతే హఠయోగము మొదలైనవాటిలో ఎంతగా కృషి చేస్తారు. ఇక్కడైతే అలాంటిదేమీ లేదు. కేవలం స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయి, ఇందులో ఎటువంటి కష్టము లేదు. కేవలం స్మృతియాత్ర యొక్క విషయమే ముఖ్యమైనది. నిలబడండి-కూర్చోండి, కర్మేంద్రియాలతో కర్మలు కూడా చేయండి, కేవలం బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి. ఆ ప్రియునికి సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అవ్వాలి. వారు స్వయంగా అంటున్నారు - ఓ ప్రేయసులారా, ఓ పిల్లలూ! భక్తి మార్గములోనైతే చాలా స్మృతి చేసారు. కానీ ఇప్పుడు ప్రియుడినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. కొన్ని-కొన్ని విషయాలు శాస్త్రాలలో కూడా ఉన్నాయి. భగవంతుని ద్వారా గీతను వినడముతో మీరు జీవన్ముక్తిని పొందుతారు. మనుష్యుల ద్వారా గీతను వినడముతో జీవన బంధనములోకి వచ్చేశారు, మెట్లు దిగుతూ వచ్చారు. ప్రతి విషయములోనూ విచార సాగర మంథనము చేయాలి. మీ బుద్ధిని ఉపయోగించాలి. ఇది బుద్ధితో చేసే యాత్ర, దీనితో వికర్మలు వినాశనమవుతాయి. వేద-శాస్త్రాలు చదవడము, యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడముతో పాపాలు నశించవు, వాటితో కిందకే దిగుతూ వచ్చారు. ఇప్పుడు మీరు పైకి వెళ్ళాలి. మెట్ల వరుస చిత్రముపై ఎవరైనా అర్థం చేయించనంతవరకు, కేవలం చిత్రాన్ని చూసి అర్థం చేసుకోలేరు. ఎలాగైతే చిన్న పిల్లలకు చిత్రాన్ని చూపించి, ఇది ఏనుగు అని నేర్పించవలసి ఉంటుంది. వారు ఏనుగును చూసినప్పుడు, చిత్రము కూడా గుర్తుకొస్తుంది. మీ బుద్ధిలోకి ఇదే విధముగా వచ్చింది. చిత్రములోని బొమ్మలను ఎప్పుడూ చిన్నవిగా చూపించడము జరుగుతుంది. కానీ వైకుంఠము పెద్దదిగా ఉంటుందనైతే మీకు తెలుసు కదా, పెద్ద రాజధాని ఉంటుంది. అక్కడ వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి, అవి తర్వాత కనుమరుగైపోతాయి. అన్ని వస్తువులు మాయమైపోతాయి. లేదంటే, ఈ భారత్ పేదదిగా ఎలా అయ్యింది? షావుకారుల నుండి పేదవారిగా, పేదవారి నుండి షావుకారులుగా అవ్వాలి. ఈ డ్రామా తయారై, తయారుచేయబడినది, అందుకే మెట్ల వరుస చిత్రముపై అర్థం చేయించడము జరుగుతుంది. కొత్త-కొత్తవారు వస్తారు, వారికి అర్థం చేయించడము వలన అభ్యాసమైపోతుంది, నోరు తెరుచుకుంటుంది. పిల్లలను సేవకు యోగ్యులుగా తయారుచేయడము జరుగుతుంది. చాలా సెంటర్లలో చాలామంది పిల్లలు అశాంతిని వ్యాపింపజేస్తూ ఉంటారు. బుద్ధియోగము బయట భ్రమిస్తున్నట్లయితే నష్టము కలిగిస్తారు, వాయుమండలాన్ని పాడు చేస్తారు. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. అప్పుడు తండ్రి, నీవు చదువుకోలేదు, అందుకే నీ పరిస్థితి ఎలా ఉందో చూడు అని అంటారు. రోజురోజుకు ఎక్కువ సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. పాపాలు చేసేవారికి శిక్షలు కూడా లభిస్తూ ఉంటాయి. అప్పుడు, నేను అనవసరముగా పాపం చేసానే అని అంటారు. తండ్రికి వినిపించి ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లయితే కొంత తగ్గవచ్చు, లేకపోతే వృద్ధి అవుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది. స్వయము కూడా రియలైజ్ అవుతారు కానీ ఏమంటారంటే - ఏమి చేయాలి, మా ఈ అలవాటు తొలగడము లేదే, దీనికన్నా ఇంటికి వెళ్ళి ఉండడము మంచిది అని అంటారు. కొందరైతే మంచి సర్వీస్ చేస్తారు. కొందరు డిస్సర్వీస్ కూడా చేస్తారు. మన సైన్యములో ఎవరెవరు ధైర్యవంతులు అన్న పేర్లను తండ్రి కూర్చుని తెలియజేస్తారు. ఇకపోతే యుద్ధము మొదలైన విషయాలేవీ ఇక్కడ ఉండవు. ఇవి అనంతమైన విషయాలు. మంచి పిల్లలనైతే తండ్రి తప్పకుండా మహిమ చేస్తారు. పిల్లలు చాలా దయార్ద్ర హృదయులుగా, కళ్యాణకారులుగా అవ్వాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. పాపాత్మ మరియు పుణ్యాత్మ అని అంటారు కదా. అంతేకానీ లోపల పరమాత్మ ఉండరు, అలాగే ఆత్మ పరమాత్మగా అవ్వదు. ఇదంతా రాంగ్. పరమాత్మకు పాపము అంటుకోదు కదా. వారికి డ్రామాలో సేవ చేసే పాత్ర ఉంది. మనుష్యులే పాపాత్ములుగా, పుణ్యాత్ములుగా అవుతారు. ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో, వారే తమోప్రధానముగా అయ్యారు. వారి తనువులో తండ్రి కూర్చుని సతోప్రధానముగా తయారుచేస్తారు కావున వారి మతమనుసారముగా నడుచుకోవలసి ఉంటుంది కదా.

ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని విశాలబుద్ధి కలవారిగా చేసారు. రాజధాని ఎలా స్థాపన అవుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రియే బ్రహ్మా తనువులోకి వచ్చి బ్రహ్మా ముఖవంశావళి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించి దేవీ-దేవతలుగా తయారుచేస్తారు. తర్వాత వారు పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతారు. ఇప్పుడు మళ్ళీ అంతా రిపీట్ అవ్వనున్నది. తండ్రి మళ్ళీ బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తున్నారు. యోగబలముతో మీరు 5 వికారాలపై విజయాన్ని పొంది జగత్ జీతులుగా అవుతారు, అంతేకానీ యుద్ధము మొదలైనవాటి విషయాలేవీ లేవు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బంధనముక్తులుగా అయి తండ్రి సేవలో నిమగ్నమవ్వాలి, అప్పుడే ఉన్నతమైన భాగ్యము తయారవుతుంది. దయార్ద్ర హృదయులుగా అయి అనేకులకు మార్గాన్ని తెలియజేయాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి.

2. ఈ శరీరము పట్ల మమకారాన్ని తొలగించుకుని జీవిస్తూ మరణించాలి ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అనారోగ్యములో కూడా ఒక్క తండ్రి స్మృతియే ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి.

వరదానము:-
కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలను పరివర్తన చేసే నిశ్చయబుద్ధి భవ

ఏ విధముగా తండ్రి పట్ల 100 శాతము నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో, ఎవరు ఎంతగా కదిలించే ప్రయత్నము చేసినా కానీ కదలరో, అలా దైవీ పరివారమువారు లేక ప్రపంచములోని ఆత్మలు, ఎవరు మీకు ఎలాంటి పరీక్ష తీసుకున్నా, క్రోధీగా అయి ఎదిరించినా లేక ఎవరైనా అవమానించినా, నిందించినా - అందులో కూడా చలించకూడదు. దీని కోసం కేవలం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి, ఈ భావన వారి సంస్కారాలను పరివర్తన చేస్తుంది. ఇందులో కేవలం ఓర్పును కోల్పోకూడదు, అంతే. సమయమనుసారముగా ఫలము తప్పకుండా లభిస్తుంది - ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది.

స్లోగన్:-
పవిత్రతా శక్తితో తమ సంకల్పాలను శుద్ధముగా, జ్ఞాన స్వరూపముగా తయారుచేసుకుని బలహీనతలను సమాప్తము చేయండి.

అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

వాచాలో సదా సత్యత మరియు మధురత ఉన్నట్లయితే వాణికి మార్కులు జమ అవుతూ ఉంటాయి. మధురతా గుణము జీవితములో ఉన్నట్లయితే ప్రతి పలుకు ముత్యము వలె ఉంటుంది. వారు మాట్లాడటము లేదు, కానీ ముత్యాల వర్షము కురుస్తుంది అన్నట్లు అనిపిస్తుంది. వారు ఎటువంటి మాటలు మాట్లాడుతారంటే, అటువంటి మాటలను మేము కూడా మాట్లాడాలి అని వినేవారు అనుకుంటారు. అందరూ విని నేర్చుకోవడానికి, ఫాలో చేయడానికి ప్రేరణ లభిస్తుంది. ఇటువంటి మధురమైన మాటల యొక్క వైబ్రేషన్లు అందరినీ స్వతహాగానే ఆకర్షిస్తాయి.