03-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీకు ఈ డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల
గురించి తెలుసు, మీకు తండ్రి ద్వారా జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది, అందుకే మీరు
ఆస్తికులు’’
ప్రశ్న:-
తండ్రికి
చెందిన ఏ టైటిల్ ను ధర్మ స్థాపకులకు ఇవ్వలేము?
జవాబు:-
బాబా సద్గురువు.
ఏ ధర్మ స్థాపకుడిని గురువు అని అనలేము ఎందుకంటే గురువు అనగా దుఃఖము నుండి
విముక్తులుగా చేసి సుఖములోకి తీసుకువెళ్ళేవారు. ధర్మ స్థాపన చేసేవారి వెనుక వారి
ధర్మానికి చెందిన ఆత్మలు పై నుండి కిందకు వస్తారు, అంతేకానీ ధర్మ స్థాపన చేసేవారు
ఎవరినీ తీసుకువెళ్ళరు. తండ్రి వచ్చినప్పుడు ఆత్మలందరినీ ఇంటికి తీసుకువెళ్తారు,
అందుకే వారు అందరికీ సద్గురువు.
పాట:-
ఈ పాపపు
ప్రపంచము నుండి...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ విన్నారు. ఇది పాపపు ప్రపంచము. ఇది
పాపాత్ముల ప్రపంచమని పిల్లలకు తెలుసు కూడా. ఇది ఎంత చెడు పదము. కానీ, నిజంగానే ఇది
పాపాత్ముల ప్రపంచమని మనుష్యులు అర్థం చేసుకోలేరు. తప్పకుండా పుణ్యాత్ముల ప్రపంచమనేది
కూడా ఉండేది, దానిని స్వర్గమని అంటారు. పాపాత్ముల ప్రపంచాన్ని నరకమని అంటారు. భారత్
లోనే స్వర్గము మరియు నరకము గురించి చాలా చర్చ జరుగుతుంది. మనుష్యులు మరణిస్తే వారు
స్వర్గవాసులయ్యారని అంటారు, దీని ద్వారా - వారు ఇంతవరకు నరకవాసులుగా ఉండేవారని,
పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి వెళ్ళారని నిరూపించబడుతున్నట్లు. కానీ
మనుష్యులకు అసలేమీ తెలియదు, ఏది తోస్తే అది మాట్లాడుతారు. యథార్థ అర్థాన్ని అసలేమీ
అర్థం చేసుకోరు.
తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఓదార్చుతున్నారు - ఇప్పుడు కొద్దిగా ఓర్పు వహించండి.
మీరు పాపాల బరువుతో చాలా భారముగా అయిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని పుణ్యాత్ములుగా
తయారుచేసి స్వర్గము అని అనబడే ప్రపంచములోకి తీసుకువెళ్తారు. అక్కడ ఎటువంటి పాపము
ఉండదు, ఎటువంటి దుఃఖము ఉండదు. పిల్లలకు ఇప్పుడు ఓదార్పు లభించింది. ఈ రోజు ఇక్కడ
ఉన్నారు, రేపు తమ శాంతిధామానికి, సుఖధామానికి వెళ్తారు. ఉదాహరణకు అనారోగ్యము కల
మనిషి కొంచెం కోలుకుంటున్నప్పుడు, మీరు త్వరలోనే చాలా బాగైపోతారు అని అతనికి డాక్టర్
ఓదార్పునిస్తారు. ఇప్పుడు ఇక్కడిది అనంతమైన ఓదార్పు. అనంతమైన తండ్రి చెప్తున్నారు,
మీరు చాలా దుఃఖితులుగా, పతితులుగా అయిపోయారు, ఇప్పుడు నేను పిల్లలైన మిమ్మల్ని
ఆస్తికులుగా చేస్తాను. తర్వాత రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తాను. మాకు రచయిత మరియు
రచనల గురించి తెలియదని ఋషులు మొదలైనవారు అంటూ వచ్చారు. మరి ఇప్పుడు వాటి గురించి
ఎవరికి తెలుసు? ఎప్పుడు మరియు ఎవరి ద్వారా తెలుసుకోగలరు అనేది ఎవరికీ తెలియదు.
డ్రామా ఆదిమధ్యాంతాల గురించి అసలెవరికీ తెలియనే తెలియదు. తండ్రి అంటారు, నేను
సంగమయుగములో వచ్చి డ్రామానుసారముగా పిల్లలైన మిమ్మల్ని మొట్టమొదట ఆస్తికులుగా
తయారుచేస్తాను, తర్వాత మీకు రచన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తాను అనగా మీ
జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని తెరుస్తాను. మీకు ప్రకాశము లభించింది. కనుల వెలుగు
పోయినట్లయితే మనుష్యులు అంధులవుతారు. ఈ సమయములో మనుష్యులకు జ్ఞానము యొక్క మూడవ
నేత్రము లేదు. మనుష్యులై ఉంటూ ఆ తండ్రిని మరియు రచన ఆదిమధ్యాంతాలను తెలుసుకోకపోతే
వారిని బుద్ధిహీనులని అనడము జరుగుతుంది. కొందరేమో, అంధులకు పిల్లలు అంధులుగా ఉన్నారు,
మరికొందరు నేత్రాలు కలవారు అని పాటలో కూడా ఉంది. మహాభారత యుద్ధము జరిగినట్లుగా మరియు
ఆ ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరిగినట్లుగా చూపిస్తారు. సత్యయుగ
స్వరాజ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పించారు. నేను
రాజును, నేను బ్యారిస్టరును అని ఆత్మలు అంటారు. మనము విశ్వ రచయిత అయిన తండ్రి ద్వారా
విశ్వ స్వరాజ్యాన్ని పొందుతున్నామని ఆత్మ అయిన మీకు ఇప్పుడు తెలుసు. వారు దేనికి
రచయిత? కొత్త ప్రపంచానికి రచయిత. తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు. వారు క్రియేటర్
కావున వారిలో మొత్తము జ్ఞానమంతా ఉంది. మొత్తము ప్రపంచము యొక్క చరిత్ర గురించి ఏ
ఒక్కరికీ కూడా తెలియదు. ఎవరికీ జ్ఞానము యొక్క మూడవ నేత్రము లేదు. తండ్రి తప్ప
ఇంకెవరూ మూడవ నేత్రాన్ని ఇవ్వలేరు. ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు, మూలవతనము,
సూక్ష్మవతనము, స్థూలవతనము... ఇవన్నీ మీకు తెలుసు. మూలవతనము ఆత్మల సృష్టి. మేము
బ్రహ్మతత్వములో లీనమైపోతామని లేదా జ్యోతి జ్యోతిలో కలిసిపోతుందని సన్యాసులు అంటారు.
కానీ అలా జరగదు. బ్రహ్మతత్వములోకి వెళ్ళి నివసిస్తామని మీకు తెలుసు. ఆ శాంతిధామము
ఇల్లు. వారు బ్రహ్మతత్వమునే భగవంతుడని అంటారు. ఎంత వ్యత్యాసము ఉంది. బ్రహ్మము అనేది
తత్వము. ఏ విధముగా ఆకాశము ఒక తత్వమో, అలాగే బ్రహ్మము కూడా ఒక తత్వము. అక్కడ
ఆత్మలమైన మనము మరియు పరమపిత పరమాత్మ నివసిస్తాము, దానిని స్వీట్ హోమ్ అని అంటారు.
అది ఆత్మల ఇల్లు. బ్రహ్మ మహాతత్వములో ఆత్మలు లీనమవ్వవని మరియు ఆత్మ ఎప్పుడూ వినాశనము
చెందదని పిల్లలకు తెలిసింది. ఆత్మ అవినాశీ. ఈ డ్రామా కూడా తయారై, తయారుచేయబడినది,
అవినాశీ అయినది. ఈ డ్రామాలో ఎంతమంది పాత్రధారులు ఉన్నారు. ఇప్పుడిది సంగమయుగము, ఈ
సమయములో పాత్రధారులందరూ హాజరై ఉన్నారు. నాటకము పూర్తి అయితే పాత్రధారులందరూ, రచయిత
మొదలైనవారంతా వచ్చి హాజరవుతారు. ఈ సమయములో ఈ అనంతమైన డ్రామా కూడా పూర్తవుతుంది,
తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఆ హద్దు నాటకాలలో మార్పులు జరగవచ్చు. డ్రామా
పాతదైపోతుంది. ఈ అనంతమైన డ్రామా అనాది, అవినాశీ అయినది. తండ్రి త్రికాలదర్శులుగా,
త్రినేత్రులుగా తయారుచేస్తారు. దేవతలు త్రికాలదర్శులుగా ఉండరు. అలాగే, శూద్ర వర్ణము
వారు త్రికాలదర్శులుగా ఉండరు. త్రికాలదర్శులు కేవలం బ్రాహ్మణ వర్ణానికి చెందిన మీరు
మాత్రమే. ఎప్పటివరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో, అప్పటివరకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము
లభించడము జరగదు. మీకు వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల గురించి మరియు అన్ని ధర్మాల
గురించి కూడా తెలుసు. మీరు కూడా మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు. తండ్రి పిల్లలను
తమ సమానముగా తయారుచేస్తారు కదా. జ్ఞాన సాగరుడైతే ఒక్క తండ్రి మాత్రమే, వారు
ఆత్మలందరికీ తండ్రి. పిల్లలందరినీ ఆస్తికులుగా చేసి త్రికాలదర్శులుగా తయారుచేస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ చెప్పాలి - శివబాబా వచ్చారు, వారిని స్మృతి చేయండి.
ఎవరైతే ఆస్తికులుగా అవుతారో, వారు తండ్రిని చాలా బాగా ప్రేమిస్తారు. మీపై తండ్రికి
కూడా ప్రేమ ఉంది. మీకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి
వినశ్యంతి మరియు వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని అంటూ ఉంటారు. గీతలో కొన్ని
విషయాలు సత్యమైనవి ఉన్నాయి. శ్రీమద్భగవద్గీత సర్వోత్తమమైన శాస్త్రము. ఇది ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము యొక్క శాస్త్రము. ముఖ్యమైన ధర్మ శాస్త్రాలు 4 అని కూడా అర్థం
చేయించడము జరిగింది. మిగిలిన ధర్మాలవారు కేవలం వారి ధర్మాలను స్థాపన చేయడానికే
వస్తారు, అక్కడ రాజ్యము మొదలైనవాటి విషయమేమీ ఉండదు, వారిని గురువులని కూడా అనలేరు.
గురువు కర్తవ్యము తిరిగి తీసుకువెళ్ళడము. ఇబ్రహీమ్, బుద్ధుడు, క్రైస్టు మొదలైనవారు
వస్తారు, తర్వాత వారి వెనుక వారి వంశావళి కూడా వస్తుంది. గురువు అనగా దుఃఖము నుండి
విముక్తులుగా చేసి సుఖములోకి తీసుకువెళ్ళేవారు. ఆ ధర్మ స్థాపకులు కేవలం ధర్మ
స్థాపనను చేయడానికి వస్తారు. ఇక్కడైతే చాలామందిని గురువులని అంటూ ఉంటారు. బ్రహ్మా,
విష్ణు, శంకరులను కూడా గురువులని అనలేము. ఒక్క శివబాబా మాత్రమే సర్వుల సద్గతిదాత.
పిలవడము కూడా ఒక్క రాముడినే పిలుస్తారు. శివబాబాను కూడా రాముడని అంటారు. చాలా భాషలు
ఉన్నాయి కావున పేర్లు కూడా చాలా పెట్టేసారు. వారి అసలు పేరు శివ. వారిని సోమనాథుడని
కూడా అంటారు. సోమ రసాన్ని తాగించారు అనగా జ్ఞాన ధనాన్ని ఇచ్చారు. ఇకపోతే నీరు
మొదలైనవాటి విషయమైతే ఏమీ లేదు. మిమ్మల్ని సమ్ముఖములో నాలెడ్జ్ ఫుల్ గా, బ్లిస్ ఫుల్
గా తయారుచేస్తున్నారు. తండ్రి అయితే జ్ఞాన సాగరుడు. పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన
నదులుగా తయారుచేస్తారు. సాగరము ఒకటే ఉంటుంది. ఒకే సాగరము నుండి అనేక నదులు
వెలువడుతాయి. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఈ సమయములో ఈ భూమి అంతా రావణుడి
స్థానముగా ఉంది. కేవలం లంకలో మాత్రమే కాదు, మొత్తము భూమిపై రావణుడి రాజ్యముంది. రామ
రాజ్యములో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. ఇది కేవలం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది.
బాబా అర్థం చేయించారు - నేను 3 ధర్మాలను స్థాపన చేస్తాను - బ్రాహ్మణ, దేవత,
క్షత్రియ ధర్మాలు. తర్వాత వైశ్య, శూద్ర వర్ణాలలో మిగిలినవారంతా వచ్చి తమ-తమ ధర్మాలను
స్థాపన చేస్తారు. బాబా అనేక ధర్మాల వినాశనము కూడా చేయిస్తారు. భారత్ లో త్రిమూర్తి
చిత్రాన్ని కూడా తయారుచేస్తారు కానీ అందులో శివుని చిత్రాన్ని మాయం చేసేసారు.
పరమపిత పరమాత్మ అయిన శివుడు బ్రహ్మా ద్వారా స్థాపన మరియు విష్ణువు ద్వారా పాలన
చేయిస్తారని, వారిని కరన్ కరావన్ హార్ (చేసి చేయించేవారు) అని అంటారని శివుని
చిత్రము ద్వారానే నిరూపించబడుతుంది. వారు స్వయమూ కర్మలు చేస్తారు, పిల్లలైన మీకు
కూడా నేర్పిస్తారు. కర్మ-అకర్మ-వికర్మల గతులను కూడా అర్థం చేయిస్తారు. రావణ
రాజ్యములో మీరు ఏ కర్మలైతే చేస్తారో, అవి వికర్మలు అవుతాయి. సత్యయుగములో మీరు ఏవైతే
కర్మలు చేస్తారో, అవి అకర్మలు అవుతాయి. ఇక్కడ వికర్మలే జరుగుతాయి ఎందుకంటే ఇది రావణ
రాజ్యము. సత్యయుగములో 5 వికారాలు ఉండనే ఉండవు. ఒక్కొక్క విషయము అర్థం చేసుకోవలసినది
మరియు అది క్షణములో అర్థం చేయించడము జరుగుతుంది. ఓం యొక్క అర్థాన్ని వారైతే చాలా
విస్తారముగా అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా
శరీరము. ఇది ఎంత సహజము. మనము సుఖధామానికి వెళ్తున్నామని మీరు భావిస్తారు.
శ్రీకృష్ణుని మందిరాన్ని సుఖధామమని అంటారు. వాస్తవానికి అది కృష్ణపురి కూడా. మాతలు
కృష్ణపురిలోకి వెళ్ళేందుకు చాలా కృషి చేస్తారు. మీరు ఇప్పుడు భక్తి చేయరు. మీకు
జ్ఞానము లభించింది, మిగిలిన మనుష్యమాత్రులు ఎవరిలోనూ ఈ జ్ఞానము లేదు. నేను మిమ్మల్ని
పావనముగా తయారుచేసి వెళ్తాను, మళ్ళీ పతితముగా ఎవరు తయారుచేస్తారు? ఈ విషయాన్ని ఎవరూ
చెప్పలేరు. మేల్ మరియు ఫిమేల్, అందరూ భక్తురాళ్ళే, సీతలే. అందరి సద్గతిని చేసేవారు
తండ్రి. అందరూ రావణుడి జైలులో ఉన్నారు. ఇది ఉన్నదే దుఃఖధామము. తండ్రి మిమ్మల్ని
సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తారు. ఇటువంటి తండ్రిని 5 వేల సంవత్సరాల తర్వాత
కేవలం మీరు మాత్రమే చూస్తారు. లక్ష్మీ-నారాయణుల ఆత్మలకు ఇప్పుడు జ్ఞానముంది. నేను
చిన్నప్పుడు ఇలా (కృష్ణునిగా) ఉండేవాడిని, పెద్దవాడిగా అయిన తర్వాత ఈ విధముగా
శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను అన్న జ్ఞానముంది, ఇంకెవరికీ ఈ జ్ఞానము లేదు.
తండ్రి అంటారు, మీరంతా పార్వతులు, శివబాబా మిమ్మల్ని అమరులుగా తయారుచేసేందుకు,
అమరలోకములోకి తీసుకువెళ్ళేందుకు మీకు అమరకథను వినిపిస్తున్నారు. ఇది మృత్యులోకము.
పార్వతులైన మీరంతా అమరనాథుని ద్వారా అమరకథను వింటున్నారు. మీరు నిజంగా అలా
తయారవుతారు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ అయిన మీరు అమరులుగా అవుతారు,
అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. ఉదాహరణకు సర్పము ఒక కుబుసాన్ని వదిలి మరొకటి ధరిస్తుంది.
ఈ ఉదాహరణలన్నీ ఇక్కడికి చెందినవే. భ్రమరము ఉదాహరణ కూడా ఇక్కడికి చెందినదే.
బ్రాహ్మణులైన మీరు ఏమి చేస్తారు? వికారీ పురుగులను మార్చి దేవతలుగా తయారుచేస్తారు.
ఇది మనుష్యుల విషయమే. ఇది భ్రమరముకు సంబంధించిన ఒక ఉదాహరణ. బ్రాహ్మణ పిల్లలైన మీరు
ఇప్పుడు తండ్రి ద్వారా అమరకథను వింటున్నారు, ఇతరులకు కూడా కూర్చుని జ్ఞానాన్ని
భూ-భూ చేస్తారు, దీని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా, స్వర్గములోని దేవకన్యలుగా
తయారవుతారు. అంతేకానీ మానస సరోవరములో మునక వేయడముతో ఎవరూ దేవకన్యలుగా అవ్వరు. అదంతా
అసత్యము. మీరు అసత్యమే వింటూ వచ్చారు, ఇప్పుడు తండ్రి సత్యము వినిపిస్తారు. ఇప్పుడు
తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. నిరాకార పరమపిత పరమాత్మ ఈ నోటి ద్వారా
వినిపిస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. మనము ఈ చెవుల ద్వారా వింటున్నాము.
ఆత్మాభిమానులుగా అవ్వాలి, తర్వాత పరమాత్మ తాను ఎవరు అనేది కూడా రియలైజ్ చేయిస్తారు.
ఇతరులెవరూ ఆత్మాభిమానులుగా తయారుచేయలేరు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి
తప్ప ఇంకెవరూ చెప్పలేరు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారి జయంతి ఎలా
జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు -
నేను సాధారణ వృద్ధ తనువులోకి ప్రవేశిస్తాను. లేదంటే బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు?
పతిత తనువే కావాలి. సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మాలో విరాజమానమై బ్రాహ్మణులను రచించరు
కదా. వారు అంటారు, నేను పతిత శరీరములోకి, పతిత ప్రపంచములోకి వస్తాను. బ్రహ్మా ద్వారా
స్థాపన అని అంటూ ఉంటారు. అప్పుడు ఎవరి స్థాపన అయితే జరుగుతుందో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని
పొందుతారో, వారు దేవతలుగా అవుతారు. మనుష్యులు బ్రహ్మా చిత్రాన్ని చూసి తికమకపడతారు.
ఇది దాదా చిత్రము కదా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు.
సూక్ష్మవతనములో ప్రజలను ఎలా రచిస్తారు? ప్రజాపితకు పిల్లలైన బ్రహ్మాకుమార-కుమారీలు
వేల సంఖ్యలో ఉన్నారు కావున ఇది అసత్యము అవ్వదు కాదు. మనము శివబాబా ద్వారా
వారసత్వాన్ని పొందుతున్నాము. వారు అవ్యక్త బ్రహ్మా అని పిల్లలైన మీకు అర్థం
చేయించారు. ప్రజాపిత అయితే సాకారములో ఉండాలి. పతితముగా ఉన్న వీరే పావనముగా అవుతారు.
తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మాభిమానులుగా అయి ఈ చెవుల ద్వారా అమరకథను వినాలి. జ్ఞానాన్ని భూ-భూ చేస్తూ
తమ సమానముగా తయారుచేసే సేవలో ఉండాలి.
2. తండ్రి సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా, బ్లిస్ ఫుల్ గా అవ్వాలి. సోమరసాన్ని తాగాలి
మరియు తాగించాలి.
వరదానము:-
మాయ విఘ్నాలను ఒక ఆటలా అనుభవము చేసే మాస్టర్ విశ్వ నిర్మాత
భవ
ఎలాగైతే ఎవరైనా పెద్దవారి ముందు చిన్నపిల్లలు తమ బాల్యపు
నిర్లక్ష్యము కారణముగా ఏదైనా మాట్లాడేసినా, ఏదైనా అలాంటి, ఇలాంటి పనులు చేసినా, ఆ
పెద్దవారు ఏమని భావిస్తారంటే - వీరు నిర్దోషులు, వీరికి ఏమీ తెలియదు, వీరు చిన్న
పిల్లలు అని. కావున వారిపై ఎటువంటి ప్రభావమూ ఉండదు. అలాగే, ఎప్పుడైతే మీరు స్వయాన్ని
మాస్టర్ విశ్వ నిర్మాతలుగా భావిస్తారో, అప్పుడు ఈ మాయ విఘ్నాలు చిన్న పిల్లల
చేష్టల్లా అనిపిస్తాయి. మాయ ఎవరో ఒక ఆత్మ ద్వారా సమస్యగా, విఘ్నముగా లేక పరీక్షా
పత్రముగా అయి వచ్చినప్పుడు, దానికి భయపడరు. అక్కడ వారిని నిర్దోషులుగా భావిస్తారు.
స్లోగన్:-
స్నేహాన్ని,
శక్తిని మరియు ఈశ్వరీయ ఆకర్షణను స్వయములో నింపుకున్నట్లయితే అందరూ సహయోగులుగా
అయిపోతారు.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
ఇప్పుడు జ్వాలాముఖీగా
అయ్యి ఆసురీ సంస్కారాలను, ఆసురీ స్వభావాన్ని, అన్నింటినీ భస్మము చేయండి. దేవీల
స్మృతిచిహ్నాలలో జ్వాల ద్వారా అసురులను సంహరించినట్లుగా చూపిస్తారు. అక్కడ అసురులంటే
ఎవరో వ్యక్తులని కాదు, అక్కడ ఆసురీ శక్తులను అంతము చేసారు. ఇది ఇప్పటి మీ జ్వాలా
స్వరూప స్థితికి స్మృతిచిహ్నము. ఇప్పుడు యోగానికి చెందిన ఎటువంటి జ్వాలను
ప్రజ్వలితము చెయ్యండి అంటే, ఆ జ్వాలలో ఈ కలియుగీ ప్రపంచము కాలి భస్మమైపోవాలి.