03-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - నామ-రూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు, ఆత్మ మరియు పరమాత్మను కూడా నామ-రూపాలకు అతీతము అని అనరు, వారిలో కూడా అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది’’

ప్రశ్న:-
శివబాబాను భోళానాథుడు అంటూ స్మృతి చేస్తారు, వారిని భోళా అని ఎందుకన్నారు?

జవాబు:-
ఎందుకంటే తండ్రియే అహల్యలను, వేశ్యలను, కుబ్జలను ఉద్ధరిస్తారు. వారికి విశ్వ రాజ్యము యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మనుష్యులైతే తండ్రి గురించి - దుఃఖము కూడా వారే ఇస్తారు, సుఖము కూడా వారే ఇస్తారు అని అంటారు. కానీ బాబా అంటారు - నేనైతే పిల్లలైన మీ కోసం సుఖపు రాజ్యాన్ని స్థాపన చేస్తాను. నన్ను దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు. ఆలోచించండి, తండ్రినైన నేను నా పిల్లలకు దుఃఖాన్ని ఎలా ఇవ్వగలను.

పాట:-
దూరదేశములో నివసించేవారు...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు పాటను విన్నారు అనగా ఆత్మలు ఈ శరీరములోని చెవులు రూపీ కర్మేంద్రియాల ద్వారా పాటను విన్నారు - దూరదేశము నుండి యాత్రికుడు వచ్చారు. మీరందరూ యాత్రికులే కదా. ఆత్మలైన మనుష్యమాత్రులందరూ యాత్రికులే. ఇక్కడ ఆత్మలకు ఇల్లంటూ ఏదీ లేదు. ఆత్మ నిరాకారి. నిరాకారీ ప్రపంచములో నివసించేవారు నిరాకారీ ఆత్మలు. దానిని నిరాకారీ ఆత్మల ఇల్లు, దేశము లేక లోకము అని అంటారు. దీనిని జీవాత్మల దేశమని అంటారు. అది ఆత్మల దేశము, తర్వాత ఆత్మలు ఇక్కడకు వచ్చి శరీరములోకి ప్రవేశించినప్పుడు నిరాకారీ నుండి సాకారిగా అవుతాయి. అయితే, ఆత్మకు ఏ రూపము లేదని కాదు. ఆత్మకు రూపము కూడా తప్పకుండా ఉంటుంది, పేరు కూడా ఉంటుంది. ఇంత చిన్నని ఆత్మ ఈ శరీరము ద్వారా ఎంతటి పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఆత్మలోనూ పాత్రను అభినయించేందుకు ఎంతటి రికార్డు నిండి ఉంది. రికార్డు ఒక్కసారి నిండితే ఇక తర్వాత ఎన్ని సార్లు రిపీట్ చేసినా, అదే నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ శరీరములో ఉన్న ఆత్మ ఒక రికార్డు వంటిది. అందులో 84 జన్మల పాత్ర అంతా నిండి ఉంది. ఎలాగైతే ఆత్మ నిరాకారియో, అలా తండ్రి కూడా నిరాకారుడే. అక్కడక్కడ శాస్త్రాలలో - వారు (తండ్రి) నామ-రూపాలకు అతీతమైనవారని వ్రాశారు. కానీ నామ-రూపాలకు అతీతమైన వస్తువంటూ ఏదీ ఉండదు. ఆకాశము కూడా పోలార్ (అంతరిక్ష స్థానము) కానీ దానికి నామ-రూపాలైతే ఉన్నాయి కదా. పేరు లేని వస్తువంటూ ఏదీ ఉండదు. పరమపిత నామ-రూపాలకు అతీతమైనవారని మనుష్యులు భావిస్తారు. కానీ పేరు లేకపోతే రూపము కూడా ఉండదు, దేశము కూడా ఉండదు, అప్పుడిక ఏమీ ఉండదు. దూరదేశములో నివసించే పరమపిత పరమాత్మ - అని పిలుస్తారు కూడా. ఆ దూరదేశములో ఆత్మలు నివసిస్తాయి. ఇది సాకార దేశము, ఇందులో రెండు రాజ్యాలు ఉన్నాయి - రామ రాజ్యము మరియు రావణ రాజ్యము. అర్ధకల్పం రామ రాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యము. సత్యయుగము నుండి ఈశ్వరీయ రాజ్యము మొదలవుతుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. రామ రాజ్యాన్ని స్థాపన చేసేవారు పరమపిత పరమాత్మ. వారెప్పుడూ రావణ రాజ్యాన్ని స్థాపన చేయరు. తండ్రి ఎప్పుడూ పిల్లల కోసం దుఃఖపు రాజ్యాన్ని తయారుచేయరు. ఈశ్వరుడే సుఖ-దుఃఖాలను ఇస్తారని అంటారు. తండ్రి అంటారు - నేను పిల్లలకు దుఃఖాన్ని ఎలా ఇవ్వగలను, నా పేరే దుఃఖహర్త-సుఖకర్త. ఇది మనుష్యులు చేసిన పొరపాటు. ఈశ్వరుడు ఎప్పుడూ దుఃఖము ఇవ్వరు. ఈ సమయములో దుఃఖధామమే ఉంది. అర్ధకల్పం రావణ రాజ్యములో దుఃఖమే లభిస్తుంది. సుఖమనేది ఇసుమంత కూడా లేదు. సుఖధామములో ఎప్పుడూ దుఃఖము ఉండదు. తండ్రి స్వర్గ రచయిత. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. దీనిని ఎవరూ కొత్త ప్రపంచమని అనరు. కొత్త ప్రపంచము పేరే స్వర్గము. అదే మళ్ళీ పాత ప్రపంచముగా తయారవుతుంది. కొత్త వస్తువు పాతదిగా పాడైనట్లుగా కనిపిస్తే, ఆ పాత వస్తువును సమాప్తము చేయడం జరుగుతుంది. మనుష్యులు విషాన్నే (వికారాలనే) సుఖముగా భావిస్తారు. అమృతాన్ని వదిలి విషమెందుకు త్రాగాలి అని అంటూ ఉంటారు. గ్రంథ్ లో గురునానక్ చెప్పిన మాటలు కూడా ఉన్నాయి, అవేమిటంటే - ఇతరుల సంపాదనను భక్షించే దొంగలు మరియు దోపిడీదారులు లెక్కలేనంత మంది ఉన్నారు... తండ్రి మహిమను పాడుతారు - మీరు ఏదైతే వచ్చి చేస్తారో, దాని వలన మేలే జరుగుతుంది అని. లేదంటే రావణ రాజ్యములో మనుష్యులు చెడు పనులే చేస్తారు. తండ్రియే వచ్చి మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరుస్తారు. గ్రంథ్ లో చాలా విషయాలు వ్రాశారు. సింధీలు గ్రంథ్ ను పెట్టుకుంటారు కానీ వారు సిక్కు ధర్మమువారు కారు. ఇక్కడ ఉన్నవారు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. సిక్కుల గురువు గురునానక్, వారికి గడ్డం, పొడుగు జుట్టు ఉండేవి. అలాంటప్పుడు సిక్కులందరికీ గడ్డం, పొడుగు జుట్టు ఉండాలి. ఈ రోజుల్లో గడ్డం ఉంచుకోవటం లేదు. చాలా ఫ్యాషనబుల్ గా అయిపోయారు. లేదంటే గురువును ఫాలో చేయాలి కదా. వారు గురునానక్ కు ఫాలోవర్స్ అని అన్నప్పుడు, మరి గురునానక్ ను ఫాలో చేయాలి కదా. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలైంది అని ఇప్పుడు పిల్లలకు తెలిసింది. వారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అనే మాటకు మీరు వెంటనే సమాధానమిస్తారు. గురునానక్ ఎప్పుడు వస్తారో చెప్పండి అని ఎవరినైనా అడగండి. అప్పుడు వారు - వారి ఆత్మ జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది కావున మళ్ళీ ఎలా వస్తారు అని అంటారు. నేటికి 4500 సంవత్సరాల తర్వాత గురునానక్ మళ్ళీ వస్తారని మీరంటారు. మీ బుద్ధిలో మొత్తం ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలు తిరుగుతూ ఉంటాయి. బుద్ధుడు, క్రైస్టు మొదలైనవారంతా ఈ సమయములో తమోప్రధానముగా ఉన్నారని, శ్మశానగ్రస్థులుగా ఉన్నారని మీరంటారు. దీనిని వినాశన సమయమని అంటారు. మనుష్యమాత్రులందరూ మరణించినట్లుగా ఉన్నారు. అందరి జ్యోతి ఆరిపోయినట్లుగా ఉంది. అందరినీ మేల్కొల్పేందుకు తండ్రి వస్తారు. కామ చితిపై కూర్చుని భస్మమైన పిల్లలందరినీ అమృత వర్షముతో మేల్కొల్పి తమతో పాటు తీసుకువెళ్తారు. మాయ కామ చితిపై కూర్చోబెట్టి శ్మశానగ్రస్థులుగా చేసేసింది, అందరూ నిద్రపోయారు. ఇప్పుడు తండ్రి అమృతాన్ని తాగిస్తారు. అందుకే అమృత్సర్ అనే పేరు పెట్టారు. తండ్రి వచ్చి అమృతాన్ని తాగిస్తారు. జ్ఞానామృతము ఎక్కడ, సాధారణ నీరు ఎక్కడ! సిక్కుల పండుగ నాడు చాలా ఘనముగా కొలనును శుభ్రము చేస్తారు, మట్టి తీసేస్తారు. అందుకే దానికి అమృత్సర్ అనే పేరును పెట్టారు అనగా అమృతము యొక్క కొలను. ఇప్పుడు గురునానక్ సాహెబ్ జ్ఞాన సాగరుడేమీ కారు, వారు కూడా తండ్రిని మహిమ చేసారు. వారు స్వయంగా - ఏక్ ఓంకార్, సత్ నామ్, వారు సదా సత్యాన్ని చెప్పేవారు అని అంటారు. సత్యనారాయణుడి కథ ఉంది కదా. సింధ్ ప్రాంతానికి చెందినవారు విదేశాలకు వెళ్ళేటప్పుడు సత్యనారాయణుడి కథను వినడం కోసం సభ ఏర్పాటు చేస్తారు. సత్యనారాయణ కథను వినడం ద్వారా చేరవలసిన స్థానానికి క్షేమముగా చేరుకుంటారని భావిస్తారు. అమరకథ, మూడవ నేత్రము కథ, ఇలా భక్తి మార్గపు కథలు ఎన్ని వింటూ వచ్చారు. శంకరుడు పార్వతికి కథ వినిపించారని అంటారు. శంకరుడు సూక్ష్మవతనములో నివసించేవారు, అక్కడ ఏ కథను వినిపించారు? ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వాస్తవానికి మీకు అమరకథను వినిపించి అమరలోకానికి తీసుకువెళ్ళేందుకు నేను వచ్చాను. మృత్యులోకము నుండి అమరలోకానికి నేను తీసుకువెళ్తాను. ఇకపోతే, సూక్ష్మవతనములో పార్వతి ఏ తప్పు చేసారని ఆమెకు వచ్చి కథ వినిపిస్తారు. మనం నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇది అమరలోకానికి వెళ్ళేందుకు సత్యమైన సత్యనారాయణ కథ, మూడవ నేత్రము కథ. ఆత్మలైన మీకు ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరే పుష్పాలుగా, పూజ్యులుగా ఉండేవారు, 84 జన్మల తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. అందుకే, మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటూ ఉంటారు. తండ్రి అంటారు - నేనైతే సదా పూజ్యుడను, నేను వచ్చి మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేస్తాను. ఓ రామా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని అంటారు. భక్తులందరూ పిలుస్తూ ఉంటారు. ఓ పతిత-పావన, అని ఆత్మ పిలుస్తుంది కదా. గీతను శ్రీకృష్ణుడేమీ వినిపించలేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పావనముగా తయారుచేసేవారు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే, కేవలం ఆ రాముడొక్కరు మాత్రమే. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని, గీతా భగవానుడు శివుడని, శ్రీకృష్ణుడు కాదని ఒపీనియన్ (అభిప్రాయము) వ్రాయించుకుంటూ ఉండండి. ముందు, భగవంతుడు అని ఎవరినంటారో అడగండి - నిరాకారుడినా లేక సాకారుడినా? శ్రీకృష్ణుడైతే సాకారుడు, శివుడు నిరాకారుడు. వారు కేవలం ఈ తనువును లోన్ గా తీసుకుంటారు. అంతేకానీ, తల్లి గర్భము ద్వారా జన్మించరు. మొట్టమొదటగా గర్భములో ప్రవేశించే ఆత్మ శ్రీకృష్ణుని ఆత్మ. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా సూక్ష్మ శరీరధారులు. శివునికి శరీరము లేదు. ఇక్కడ ఈ లోకములో స్థూల శరీరాలు ఉంటాయి. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత, సర్వుల లిబరేటర్ (ముక్తిదాత), దుఃఖహర్త, సుఖకర్త అని తండ్రికి మహిమ ఉంది. అచ్ఛా, సుఖము ఎక్కడ ఉంటుంది? సుఖమనేది తర్వాత జన్మలో, రావణ రాజ్యము సమాప్తమై స్వర్గ స్థాపన జరిగినప్పుడు లభిస్తుంది. అచ్ఛా, దేని నుండి విముక్తులుగా చేస్తారు? రావణుడి దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు. ఇది దుఃఖధామము కదా. అచ్ఛా, వారు గైడ్ (మార్గదర్శకునిగా) గా కూడా అవుతారు. ఈ శరీరాలైతే ఇక్కడే సమాప్తమైపోతాయి. ఇకపోతే, ఆత్మలను తీసుకువెళ్తారు. అందరినీ దుఃఖము నుండి విడిపించి, పవిత్రముగా తయారుచేసి ఇంటికి తీసుకువెళ్తారు. మనుష్యులు వివాహము చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు, ముందు పతి ఉంటారు, వెనుక వధువు ఉంటారు, ఆ తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు మీ మాల కూడా అలాగే ఉంది. పైన ఉన్న పుష్పము శివబాబా. ముందు పుష్పానికి నమస్కరిస్తారు. తర్వాత జంట పూసలైన బ్రహ్మా-సరస్వతులు ఉంటారు. ఆ తర్వాత తండ్రికి సహాయకులైన పిల్లలైన మీరు ఉంటారు. పుష్పమైన శివబాబా స్మృతి ద్వారానే సూర్యవంశములోని విష్ణుమాల తయారయింది. బ్రహ్మా-సరస్వతులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. దేవత, క్షత్రియ... అలా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి ఈ జ్ఞానాన్ని తీసుకుని లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. వారి మాల ఇలా తయారయింది. ఈ బ్రహ్మా-సరస్వతులే రాజు-రాణిగా తయారవుతారు. వారు శ్రమించారు, అందుకే పూజించబడతారు. మాల అంటే ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. కేవలం అలా మాలను తిప్పుతూ ఉంటారు. 16,108 మాల కూడా ఉంటుంది. ఈ మాలను పెద్ద-పెద్ద మందిరాలలో పెడుతూ ఉంటారు. ఒకరు ఒక చోట నుండి, మరొకరు మరో చోట నుండి ఆ మాలను తిప్పుతూ ఉంటారు. బాబా బొంబాయిలో లక్ష్మీ-నారాయణుల మందిరానికి వెళ్ళేవారు. అక్కడ మాలను తిప్పేవారు, రామ-రామ అని జపిస్తూ ఉండేవారు. పుష్పము శివబాబా కదా. పుష్పాన్నే రామ-రామ అని అంటారు. ఆ తర్వాత మాల అంతటికీ నమస్కరిస్తారు కానీ జ్ఞానము ఏమీ ఉండదు. ఫాదర్లు కూడా చేతిలో మాలను తిప్పుతూ ఉంటారు. మీరు ఎవరి మాలను తిప్పుతున్నారు అని వారిని అడిగితే, క్రైస్టు స్మృతిలో మాలను తిప్పుతున్నామని చెప్తారు. పోప్ వారందరికీ పెద్ద ఫాదర్ కనుక వారికి పోప్ ల మాల ఉంటుంది. వారందరి చిత్రాలు ఉన్నాయి. పోప్ లకు ఎంత గౌరవముంటుంది. క్రైస్టు ఆత్మ ఎక్కడ ఉంది అనేది స్వయం పోప్ కు తెలియదు! క్రైస్టు ఆత్మ కూడా ఇప్పుడు బికారి రూపములో ఉందని మీకు తెలుసు. మీరు కూడా ఇప్పుడు బికారుల నుండి రాకుమారులుగా అవుతున్నారు. భారత్ యే రాకుమారునిగా ఉండేది. ఇప్పుడు బికారిగా ఉంది. మళ్ళీ రాకుమారునిగా తయారవుతుంది. అలా తయారుచేసేవారు ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే. బికారుల నుండి రాకుమారులుగా తయారవుతారు. రాకుమార, రాకుమారీల కాలేజి కూడా ఒకటుంది, వారు అక్కడకు వెళ్ళి చదువుకుంటారు. మీరు ఇక్కడ చదువుకుని 21 జన్మల కొరకు స్వర్గములో రాకుమార-రాకుమారీలుగా తయారవుతారు. జ్ఞానముతో మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు.

సత్యయుగములో రాకుమారునిగా ఉన్న శ్రీకృష్ణుడే 84 జన్మల తర్వాత బికారిగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. 5 వేల సంవత్సరాల క్రితం దేవీ-దేవతలు ఎంత షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడు వారే నిరుపేదలుగా, బికారులుగా తయారయ్యారు. ఈ విషయాలను కేవలం మీరు మాత్రమే వినగలరు. భగవానువాచ - వారు అందరికీ తండ్రి. మీరు గాడ్ ఫాదర్ ద్వారా వింటారు. గీతలో కేవలం ఈ ఒక్క పొరపాటు చేసారు - శివ భగవానువాచకు బదులుగా శ్రీకృష్ణ భగవానువాచ అనే పేరును వ్రాశారు. అందుకే అసత్యపు ప్రపంచమని అంటూ ఉంటారు. ఈ సమయములో ప్రపంచమంతా ముళ్ళ అడవిగా అయిపోయింది. బొంబాయిలో బబుల్ నాథ్ మందిరముంది. తండ్రి వచ్చి ఈ ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. అందరూ పరస్పరములో ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు అనగా కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. ఆ పుష్పాలే ముళ్ళగా అవుతారు, మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. సత్యయుగములో ఎప్పుడూ రావణుడిని కాల్చరు. రావణుడు భారత్ యొక్క పాత శత్రువు. మీకు రావణుడితో యుద్ధము జరుగుతుంది, అతడు అర్ధ కల్పము దుఃఖమిచ్చాడు. చివరిలో పెద్ద యుద్ధము కూడా జరుగుతుంది. సత్యాతి-సత్యమైన దసరా జరగనున్నది. రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది. మీకు తర్వాత బంగారు మహళ్ళు లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణుడిపై విజయము పొంది స్వర్గానికి యజమానులుగా తయారవుతారు. బాబా మొత్తం విశ్వము యొక్క రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. అందుకే వారిని శివ భోళా భండారి అని అంటారు. వేశ్యలు, అహల్యలు, కుబ్జలు... తండ్రి అందరినీ విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. వారెంత భోళా. వారు రావడము కూడా పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వస్తారు. ఇకపోతే, ఎవరైతే స్వర్గానికి యోగ్యులు కారో, వారు వికారాలను విడిచిపెట్టలేరు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు ఈ అంతిమ జన్మలో మీరు పావనముగా అవ్వండి. ఈ వికారాలు విషము వంటివి. ఇవి ఆదిమధ్యాంతాలు మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తాయి. మీరు ఈ ఒక్క అంతిమ జన్మలో వీటిని విడిచిపెట్టలేరా? నేను మీకు అమృతాన్ని తాగించి అమరులుగా చేస్తాను, అయినా మీరు పవిత్రముగా అవ్వరు, వికారాలు లేకుండా, సిగరెట్ లేకుండా, మద్యము లేకుండా ఉండలేకపోతారు. అనంతమైన తండ్రినైన నేను చెప్తున్నాను - మీరు ఈ ఒక్క జన్మ పవిత్రముగా అయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను.

మొత్తం ప్రపంచమంతటినీ దుఃఖము నుండి ముక్తి చేసి సుఖధామము, శాంతిధామాలకు తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము స్థాపన అవుతుంది. గ్రంథ్ లో కూడా పరమపిత పరమాత్మను అకాల్ మూర్త్ అని అంటారు. తండ్రి మహాకాలుడు. ఆ కాలుడైతే కేవలం ఒక్కరినో, ఇద్దరినో తీసుకువెళ్తాడు. నేనైతే ఆత్మలందరినీ తీసుకువెళ్తాను ,అందుకే నన్ను మహాకాలుడు అని అంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అంతిమ జన్మలో జ్ఞానామృతాన్ని తాగి అమరులుగా అవ్వాలి. స్వయాన్ని స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేసుకోవాలి. చెడు అలవాట్లను వదిలేయాలి.

2. ఇప్పుడు చదువును చదువుకుని 21 జన్మల కొరకు స్వర్గములో రాకుమార-రాకుమారీలుగా అవ్వాలి. సత్యాతి-సత్యమైన సత్యనారాయణుడి కథను విని నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థము చేయాలి.

వరదానము:-
తక్కువ మాటలతో జ్ఞానము యొక్క రహస్యాలన్నింటినీ స్పష్టము చేసే యథార్థ మరియు శక్తిశాలి భవ

ఏ వస్తువైనా ఎంత ఎక్కువ శక్తిశాలిగా ఉంటే, దాని క్వాంటిటీ (పరిమాణం) అంత తక్కువగా ఉంటుంది. అదే విధముగా మీరు మీ నిర్వాణ స్థితిలో స్థితులై వాణిలోకి వచ్చినట్లయితే మాటలు తక్కువగా ఉంటాయి కానీ యథార్థముగా మరియు శక్తిశాలిగా ఉంటాయి. ఒక్క పదములో వేలాది పదాల రహస్యము ఇమిడి ఉంటుంది, దాని ద్వారా వ్యర్థ వాణి స్వతహాగా సమాప్తమైపోతుంది. ఒక్క పదముతో జ్ఞానము యొక్క రహస్యాలన్నింటినీ స్పష్టము చేయగలరు, విస్తారము సమాప్తమైపోతుంది.

స్లోగన్:-
హృదయపూర్వకముగా బాబా అని అనడం అనగా సంతోషాన్ని మరియు శక్తిని ప్రాప్తి చేసుకోవడము.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

దాత పిల్లలు అందరికీ ఇచ్చే భావనతో నిండుగా అవ్వండి. ఇది జరిగితే నేను కూడా ఇది చేస్తాను, ఇటువంటి పరిస్థితి, వాయుమండలము ఉంటే నేను ఇది చేస్తాను అన్న ఇటువంటి సంకల్పాలు చెయ్యకండి. దాతాతనపు సంస్కారము కలవారికి అన్నివైపుల నుండి స్వతహాగానే సహయోగము ప్రాప్తిస్తుంది. అందుకే మాస్టర్ దాతలు ఇతరుల నుండి తీసుకునే భావనను పెట్టుకోలేరు.