03-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ (పవిత్రాతి పవిత్రమైన) తండ్రి ఒడిలోకి వచ్చారు, మీరు మనసులో కూడా హోలీగా (పవిత్రముగా) అవ్వాలి’’

ప్రశ్న:-
హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ (పవిత్రాతి పవిత్రమైన) పిల్లలకు ఏ నషా ఉంటుంది మరియు వారి గుర్తులేమిటి?

జవాబు:-
వారికి ఏం నషా ఉంటుంది అంటే - మేము హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ (పవిత్రాతి పవిత్రమైన) తండ్రి ఒడిని స్వీకరించాము, మేము హోలియెస్ట్ (పవిత్రమైన) దేవీ-దేవతలుగా అవుతున్నాము. వారికి మనసులో కూడా చెడు ఆలోచనలు రాలేవు. వారు సుగంధభరితమైన పుష్పాలుగా ఉంటారు, వారి ద్వారా ఎటువంటి తప్పుడు కర్మలు జరగవు. వారు అంతర్ముఖులుగా అయి స్వయాన్ని చెక్ చేసుకుంటారు - నా నుండి అందరికీ సుగంధము వస్తుందా? నా కళ్ళు ఎవరివైపుకూ ఆకర్షితమైతే అవ్వడము లేదు కదా?

పాట:-
నీ దారిలోనే మరణించాలి...

ఓంశాంతి
పిల్లలు పాట విన్నారు, ఆ తర్వాత లోపల విచార సాగర మంథనము చేసి దాని అర్థాన్ని కూడా వెలికితీయాలి. నీ దారిలోనే మరణించాలి అని ఎవరు అన్నారు? ఆత్మ అంటుంది, ఎందుకంటే ఆత్మ పతితముగా ఉంది. పావనము అని అంతిమములో అంటారు లేదా శరీరము కూడా పావనమైనది లభించినప్పుడు పావనము అని అంటారు. ఇప్పుడైతే పురుషార్థీగా ఉన్నారు. తండ్రి వద్దకు వచ్చి మరణించవలసి ఉంటుంది అని ఇది కూడా మీకు తెలుసు. ఒక తండ్రిని వదిలి మరొకరిని తండ్రిగా చేసుకోవడము అనగా ఒకరి వద్ద మరణించి మరొకరి వద్ద జీవించడము. లౌకిక తండ్రి యొక్క కొడుకు కూడా శరీరాన్ని వదిలేస్తే మరొక తండ్రి వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటారు కదా. ఇది కూడా అలాగే. మీరు మరణించి హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ అయినవారి ఒడిలోకి వెళ్తారు. హోలియెస్ట్ ఆఫ్ హోలీ (పవిత్రాతి పవిత్రమైనవారు) ఎవరు? (తండ్రి). మరి హోలీ (పవిత్రమైనవారు) ఎవరు? (సన్యాసులు). అవును, ఈ సన్యాసులు మొదలైనవారిని పవిత్రమైనవారు అని అంటారు. మీకు మరియు సన్యాసులకు మధ్యన తేడా ఉంది. వారు పవిత్రముగా అవుతారు కానీ జన్మ అయితే ఎంతైనా పతితుల నుండే తీసుకుంటారు కదా. మీరు పవిత్రాతి పవిత్రమైనవారిగా అవుతారు. మిమ్మల్ని అలా తయారుచేసేవారు పవిత్రాతి పవిత్రమైన తండ్రి. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పవిత్రముగా అవుతారు. ఆత్మ పవిత్రముగా అవుతుంది కదా. మీరు స్వర్గములోని దేవీ-దేవతలు కావున మీరు పవిత్రాతి పవిత్రముగా అవుతారు. మీ ఈ సన్యాసము అనంతమైన సన్యాసము. అది హద్దులోని సన్యాసము. వారు పవిత్రముగా అవుతారు, మీరు పవిత్రాతి పవిత్రముగా అవుతారు. మేమైతే కొత్త ప్రపంచములోకి వెళ్తామని బుద్ధి కూడా చెప్తుంది. ఆ సన్యాసులైతే రజోలోకి వస్తారు. తేడా ఉంది కదా. రజో ఎక్కడ, సతోప్రధానము ఎక్కడ. మీరు పవిత్రాతి పవిత్రమైనవారి ద్వారా పవిత్రముగా అవుతారు. వారు జ్ఞానసాగరుడు కూడా, ప్రేమసాగరుడు కూడా. ఇంగ్లీష్ లో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ లవ్ అని అంటారు. వారు మిమ్మల్ని ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. ఇటువంటి ఉన్నతోన్నతమైన పవిత్రాతి పవిత్రమైనవారిని పిలుస్తారు - మీరు వచ్చి పతితులను పావనముగా చేయండి, పతిత ప్రపంచములోకి వచ్చి మమ్మల్ని పవిత్రాతి పవిత్రమైనవారిగా తయారుచేయండి అని. కావున పిల్లలకు - మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు, మేము ఎలా తయారవుతాము అని అంతటి నషా ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పిల్లలు వ్రాస్తుంటారు - బాబా, మాయ మాకు చాలా తుఫానులను తీసుకొస్తుంది, మమ్మల్ని మనసులో శుద్ధముగా అవ్వనివ్వడము లేదు, మేము పవిత్రాతి పవిత్రముగా తయారవ్వాలి అన్నప్పుడు ఇటువంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? తండ్రి అంటారు - ఇప్పుడు మీరు పూర్తిగా అన్-హోలియెస్ట్ ఆఫ్ హోలీగా (అతి అపవిత్రముగా) అయ్యారు. అనేక జన్మల అంతిమములో ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్ళీ జోరుగా చదివిస్తున్నారు. మేము ఎలా తయారవుతున్నాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఈ నషా ఉండాలి. ఈ లక్ష్మీ-నారాయణులను ఇలా ఎవరు తయారుచేసారు? భారత్ స్వర్గముగా ఉండేది కదా. ఈ సమయములో భారత్ తమోప్రధానముగా, భ్రష్ఠాచారిగా ఉంది. దీనిని మళ్ళీ మనము పవిత్రాతి పవిత్రముగా తయారుచేస్తాము. తయారుచేసేవారైతే తప్పకుండా కావాలి కదా. మేము దేవతలుగా తయారవ్వాలి అని స్వయములో కూడా ఆ నషా కలగాలి. దాని కోసం గుణాలు కూడా ఆ విధముగా ఉండాలి. పూర్తిగా కింద నుండి పైకి ఎక్కారు. మెట్ల వరుస చిత్రములో కూడా ఉన్నతి మరియు పతనము అని వ్రాసి ఉంది కదా. ఎవరైతే కింద పడిపోయారో వారు స్వయాన్ని పవిత్రాతి పవిత్రమైనవారు అని ఎలా చెప్పుకుంటారు. పవిత్రాతి పవిత్రమైన తండ్రియే వచ్చి పిల్లలను అలా తయారుచేస్తారు. మీరు ఇక్కడకు వచ్చిందే విశ్వానికి యజమానులుగా, పవిత్రాతి పవిత్రముగా తయారవ్వడము కోసము కావున ఎంత నషా ఉండాలి. బాబా మనల్ని ఇంత ఉన్నతముగా తయారుచేయడానికి వచ్చారు. మనసా-వాచా-కర్మణా పవిత్రముగా అవ్వాలి. సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. అక్కడ ఎటువంటి దుర్గంధము ఉండదు. దేహాభిమానాన్ని దుర్గంధము అని అంటారు. ఎవరి పట్ల చెడు దృష్టి కలగకూడదు. మనసు తినే మరియు ఖాతా తయారయ్యే తప్పుడు పనులు ఏవీ చేయకూడదు. మీరు 21 జన్మల కోసం ధనాన్ని జమ చేసుకుంటారు. మేము చాలా ధనవంతులుగా అవుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. తమ ఆత్మను చూసుకోవాలి - మేము దైవీ గుణాలతో నిండుగా ఉన్నామా? బాబా చెప్పిన విధముగా మేము పురుషార్థము చేస్తున్నామా? మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎలా ఉందో చూడండి. సన్యాసులు ఎక్కడ, మీరు ఎక్కడ!

పిల్లలైన మీకు నషా ఉండాలి - మేము ఎవరి ఒడిలోకి వచ్చాము, వారు మమ్మల్ని ఎలా తయారుచేస్తున్నారు? అంతర్ముఖులుగా అయి స్వయాన్ని చూసుకోవాలి - మేము ఎంతవరకు యోగ్యులుగా అయ్యాము? అందరికీ జ్ఞాన సుగంధము వచ్చే విధముగా మనమెంతగా పుష్పాలుగా అవ్వాలి? మీరు అనేకులకు సుగంధాన్ని ఇస్తారు కదా. మీ సమానముగా తయారుచేస్తారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు అని ముందుగా ఈ నషా ఉండాలి. వారంతా అయితే భక్తి మార్గము యొక్క గురువులు. జ్ఞాన మార్గము యొక్క గురువుగా ఒక్క పరమపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ ఉండలేరు. మిగిలినవారంతా భక్తి మార్గానికి చెందినవారు. భక్తి ఉండేది కలియుగములోనే. రావణుడి ప్రవేశము జరుగుతుంది. ఇది కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. సత్యయుగములో మనము 16 కళల సంపూర్ణులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు, ఆ తర్వాత ఒక్క రోజు గడిచినా దానిని పౌర్ణమి అని అనరు. ఇక్కడ కూడా అలాగే. పేను వలె కొద్ది-కొద్దిగా చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్తిగా 16 కళల సంపూర్ణులుగా అవ్వాలి, అది కూడా అర్ధకల్పము కోసమవ్వాలి. ఆ తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది కావున పిల్లలైన మీకు ఎంత నషా ఉండాలి. మనల్ని చదివిస్తున్నవారు ఎవరు అన్నది చాలామంది బుద్ధిలోకి రాదు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. వారు పిల్లలతో - నమస్తే పిల్లలూ అని అంటారు. మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు. మీరందరూ అక్కడ ఉంటారు, ఆ తర్వాత మీరు విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. మీ ఉత్సాహాన్ని పెంచేందుకు తండ్రి అంటారు - మీరు నా కన్నా ఉన్నతముగా అవుతారు. నేను విశ్వానికి యజమానిగా అవ్వను, నా కంటే కూడా మిమ్మల్ని ఉన్నతమైన మహిమ కలవారిగా తయారుచేస్తాను. తండ్రి యొక్క పిల్లలు ఉన్నతముగా అయితే, వీరు చదువుకొని ఇంత ఉన్నతమైన పదవిని పొందారని తండ్రి భావిస్తారు కదా. అలాగే ఈ తండ్రి కూడా అంటారు - నేను మిమ్మల్ని చదివిస్తాను. ఇప్పుడు మీ పదవిని ఎంతగా తయారుచేసుకోవాలనుకుంటే, అంతగా పురుషార్థము చేయండి. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని మొట్టమొదట ఈ నషా కలగాలి. తండ్రి అయితే ఎప్పుడైనా వచ్చి మాట్లాడుతారు. వారు వీరిలోనే ఉన్నారు అన్నట్లుగా ఉంటుంది. పిల్లలైన మీరు వారికి చెందినవారు కదా. ఈ రథము కూడా వారిదే కదా. మరి ఇటువంటి పవిత్రాతి పవిత్రమైన తండ్రి వచ్చారు, మిమ్మల్ని పావనముగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు తిరిగి ఇతరులను పావనముగా తయారుచేయండి. నేను రిటైర్ అవుతాను. మీరు పవిత్రాతి పవిత్రమైనవారిగా అయినప్పుడు ఇక్కడకు పతితులెవ్వరూ రాలేరు. ఇది హోలియెస్ట్ ఆఫ్ హోలీ (పవిత్రాతి పవిత్రమైన) చర్చి. ఆ చర్చికైతే అందరూ వికారులు వెళ్తారు, అందరూ పతితమైనవారు, అపవిత్రమైనవారు. ఇదైతే చాలా పెద్ద హోలీ చర్చి. ఇక్కడ పతితులెవ్వరూ పాదము కూడా మోపలేరు. కానీ ఇప్పుడే అలా చేయలేరు. ఎప్పుడైతే పిల్లలు కూడా ఆ విధముగా తయారవుతారో, అప్పుడు ఇటువంటి నియమాలను పెట్టడము జరుగుతుంది. ఇక్కడ లోపలకి ఎవ్వరూ రాలేరు. మేము వచ్చి సభలో కూర్చోవచ్చా అని అడుగుతుంటారు కదా. బాబా అంటారు, ఆఫీసర్లు మొదలైనవారితో పని ఉంటుంది కావున వారిని కూర్చోబెట్టవలసి ఉంటుంది. ఎప్పుడైతే మీ పేరు ప్రసిద్ధమవుతుందో, అప్పుడిక మీరు ఎవ్వరినీ లెక్కచేయవలసిన అవసరము లేదు. ప్రస్తుతం వారిని రానివ్వవలసి ఉంటుంది. పవిత్రాతి పవిత్రమైనవారు కూడా వారికి అనుమతిని ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతం నిరాకరించలేరు. ప్రభావము వెలువడినప్పుడు ఇక అందరికీ ఉన్న శత్రుత్వము కూడా తగ్గిపోతుంది. మీరు కూడా ఇలా అర్థం చేయిస్తారు - బ్రాహ్మణులైన మాకు రాజయోగము నేర్పించేది పవిత్రాతి పవిత్రమైన తండ్రి అని. సన్యాసులను పవిత్రాతి పవిత్రమైనవారు అని అనరు. వారు రజో గుణములోనే వస్తారు. వారేమైనా విశ్వానికి యజమానులుగా అవ్వగలరా? ఇప్పుడు మీరు పురుషార్థులుగా ఉన్నారు. అప్పుడప్పుడు చాలా మంచి నడవడిక ఉంటుంది, అప్పుడప్పుడు అయితే పేరును పాడుచేసే విధమైన నడవడిక ఉంటుంది. ఏ మాత్రము అర్థం చేసుకోనివారు చాలామంది సెంటర్లకు వస్తుంటారు. మేము ఎలా తయారవుతాము అని మీరు స్వయము గురించి కూడా మర్చిపోతారు. వీరు ఎలా తయారవుతారు అన్నది తండ్రి కూడా నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు. భాగ్యములో ఉన్నత పదవి ఉన్నట్లయితే నడవడిక చాలా రాయల్టీతో నడుచుకుంటారు. మమ్మల్ని చదివిస్తున్నవారు ఎవరు అని కేవలం ఇది గుర్తున్నా కూడా అమితమైన సంతోషము ఉంటుంది. మనము గాడ్ ఫాదర్లీ విద్యార్థులము కావున వారి పట్ల ఎంత గౌరవము ఉండాలి. ప్రస్తుతం ఇంకా నేర్చుకుంటున్నారు. ఇంకా సమయము పడుతుందని తండ్రికైతే తెలుసు. ప్రతి విషయములోనూ నంబరువారుగానే ఉంటారు. ఇల్లు కూడా మొదట సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత సతో, రజో, తమోగా అవుతుంది. ఇప్పుడు మీరు సతోప్రధానముగా, 16 కళల సంపూర్ణులుగా అవ్వనున్నారు. భవనము తయారవుతూ ఉంది. మీరంతా కలిసి స్వర్గ భవనాన్ని తయారుచేస్తూ ఉన్నారు. మీకు ఈ సంతోషము కూడా చాలా ఉండాలి. భారత్ అతి అపవిత్రమైనదిగా అయిపోయింది, దానిని మనము పవిత్రాతి పవిత్రముగా తయారుచేస్తున్నాము, కావున స్వయము పట్ల ఎంతటి జాగ్రత్త వహించాలి. మన పదవి భ్రష్టమయ్యే విధముగా మన దృష్టి ఉండకూడదు. బాబాకు వ్రాస్తే బాబా ఏమంటారో అని అనుకోకూడదు. అలా కాదు. ఇప్పుడైతే అందరూ పురుషార్థము చేస్తున్నారు. వీరిని కూడా ఇప్పుడు పవిత్రాతి పవిత్రమైనవారు అని అనరు. అలా తయారైపోతే ఇక ఈ శరీరము కూడా ఉండదు. మీరు కూడా పవిత్రాతి పవిత్రముగా తయారవుతారు. ఇకపోతే అందులో పదవులు ఉంటాయి. దాని కోసం పురుషార్థము చేయాలి మరియు చేయించాలి. బాబా పాయింట్లు అయితే చాలానే ఇస్తూ ఉంటారు. ఎవరైనా వస్తే పోల్చి చూపించండి, పవిత్రాతి పవిత్రమైన వీరెక్కడ, పవిత్రమైన వారెక్కడ. ఈ లక్ష్మీ-నారాయణులదైతే జన్మయే సత్యయుగములో జరుగుతుంది. వారు రావడమే తర్వాత వస్తారు, ఎంత తేడా ఉంది. శివబాబా మమ్మల్ని ఇలా తయారుచేస్తున్నారని పిల్లలు భావిస్తారు. వారు అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. ఉన్నతోన్నతమైన శివబాబా చదివించి ఉన్నతోన్నతమైనవారిగా తయారుచేస్తున్నారు. బ్రహ్మా ద్వారా మనము ఇది చదువుకుంటున్నాము. బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు. ఇది కూడా మీకు తెలుసు. మనుష్యులైతే ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు సృష్టి అంతటిపైనా రావణ రాజ్యము ఉంది. మీరు రామ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు, దీని గురించి మీకు తెలుసు. డ్రామానుసారముగా మనము స్వర్గ స్థాపన చేయడానికి యోగ్యులుగా అవుతున్నాము. ఇప్పుడు బాబా యోగ్యులుగా తయారుచేస్తారు. తండ్రి తప్ప శాంతిధామానికి, సుఖధామానికి ఇంకెవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఫలానావారు స్వర్గస్థులయ్యారు, ముక్తిధామానికి వెళ్ళారు అని గొప్పగా చెప్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఈ వికారీ పతితాత్మలు శాంతిధామానికి ఎలా వెళ్తారు. మీరు చెప్పవచ్చు, అప్పుడు వీరికి ఎంత నషా ఉంది అని భావిస్తారు. ఎలా అర్థం చేయించాలి అని విచార సాగర మంథనము చేయండి. నడుస్తూ-తిరుగుతూ లోలోపల ఇది ఉండాలి. ఓర్పు కూడా వహించాలి, మనము కూడా యోగ్యులుగా అవ్వాలి. భారతవాసులే పూర్తిగా యోగ్యులుగా మరియు పూర్తిగా అయోగ్యులుగా అవుతారు. ఇంకెవ్వరూ అలా అవ్వరు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని యోగ్యులుగా తయారుచేస్తున్నారు. జ్ఞానము చాలా ఆనందదాయకమైనది. మేము ఈ భారత్ ను పవిత్రాతి పవిత్రముగా తయారుచేస్తామని లోలోపల చాలా సంతోషము ఉంటుంది. నడవడిక చాలా రాయల్ గా ఉండాలి. అన్నపానాదులు, నడవడిక ద్వారా తెలిసిపోతుంది. శివబాబా మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేస్తున్నారు, వారి పిల్లలుగా అయ్యారు కావున వారి పేరును ప్రఖ్యాతము చేయాలి. నడవడిక ఎలా ఉండాలంటే - వీరు పవిత్రాతి పవిత్రమైనవారి సంతానము అని భావించాలి. మెల్లమెల్లగా మీరు అలా తయారవుతూ ఉంటారు. మహిమ వెలువడుతూ ఉంటుంది. ఆ తర్వాత పతితులెవ్వరూ లోపలికి రాని విధముగా నియమాలు-నిబంధనలు అన్నీ తయారుచేస్తారు. ప్రస్తుతం దానికి ఇంకా సమయము పడుతుందని బాబా అర్థం చేసుకోగలరు. పిల్లలు చాలా పురుషార్థము చేయాలి. మీ రాజధాని కూడా తయారవ్వాలి, ఆ తర్వాత అలా చేసినా పర్వాలేదు. అప్పుడిక ఇక్కడ నుండి కింద ఆబూ రోడ్ వరకు క్యూ ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. బాబా మీ భాగ్యాన్ని పెంచుతూ ఉంటారు. పదమాపదమ భాగ్యశాలి అని కూడా నియమానుసారముగా అంటారు కదా. పాదాలలో పద్మమును చూపిస్తారు కదా. ఇదంతా పిల్లలైన మీ మహిమ. అయినా తండ్రి అంటారు - మన్మనాభవ, తండ్రిని స్మృతి చేయండి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనసు తినే విధమైన పనులేవీ చేయకూడదు. పూర్తిగా సుగంధభరితమైన పుష్పాలుగా తయారవ్వాలి. దేహాభిమానపు దుర్గంధాన్ని తొలగించివేయాలి.

2. నడవడికను చాలా రాయల్ గా ఉంచుకోవాలి. పవిత్రాతి పవిత్రముగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. పదవి భ్రష్టమయ్యే విధమైన దృష్టి ఉండకూడదు.

వరదానము:-
నిరాశ రూపీ చితిపై కూర్చొని ఉన్న ఆత్మలకు కొత్త జీవితాన్ని దానమిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ

సంగమయుగములో బాబా ద్వారా పిల్లలందరికీ ఎవర్ హెల్దీ, వెల్దీ మరియు హ్యాపీగా ఉండే త్రిమూర్తీ వరదానము ప్రాప్తిస్తుంది. ఏ పిల్లలైతే ఈ మూడు ప్రాప్తులతో సదా సంపన్నముగా ఉంటారో, వారి భాగ్యశాలి, హర్షితముఖాన్ని చూసి మానవ జీవితములో జీవించే ఉల్లాస-ఉత్సాహాలు కలుగుతాయి, ఎందుకంటే ఇప్పుడు మనుష్యులు జీవించి ఉంటూ కూడా నిరుత్సాహపు చితిపై కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మరజీవాగా తయారుచేయండి. కొత్త జీవితాన్ని దానము ఇవ్వండి. ఈ మూడు ప్రాప్తులు మా జన్మ సిద్ధ అధికారము అని సదా స్మృతిలో ఉండాలి. మూడు ధారణల కోసం డబుల్ అండర్ లైన్ చేయండి.

స్లోగన్:-
అతీతముగా మరియు అధికారిగా అయ్యి కర్మలోకి రావటము, ఇదే బంధనముక్త స్థితి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

కర్మాతీతము అనగా అర్థమే - అన్ని రకాల హద్దు స్వభావ-సంస్కారాల నుండి అతీతముగా అనగా దూరముగా ఉండటము. హద్దు అనేది బంధనము, అనంతము అనేది నిర్బంధనము. బ్రహ్మాబాబా సమానముగా ఇప్పుడు హద్దుకు చెందిన నాది-నాది అన్నదాని నుండి ముక్తులుగా అయ్యే అనగా కర్మాతీతముగా అయ్యే అవ్యక్తి దివసాన్ని జరుపుకోండి, దీనినే స్నేహానికి ప్రమాణము అని అంటారు.