04-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇవ్వడానికి వచ్చారు, దాని ద్వారా ఆత్మ జ్యోతి వెలుగుతుంది’’

ప్రశ్న:-
తండ్రిని కరన్-కరావన్ హార్ (చేసేవారు చేయించేవారు) అని ఎందుకు అనడము జరిగింది? వారు ఏమి చేస్తారు మరియు ఏమి చేయిస్తారు?

జవాబు:-
బాబా అంటారు - నేను పిల్లలైన మీకు మురళీని వినిపించే కార్యము చేస్తాను. మురళీని వినిపిస్తాను, మంత్రాన్ని ఇస్తాను, మిమ్మల్ని యోగ్యులుగా చేస్తాను మరియు మీ ద్వారా స్వర్గము యొక్క ప్రారంభోత్సవాన్ని చేయిస్తాను. మీరు సందేశకులుగా అయి అందరికీ సందేశాన్ని ఇస్తారు. నేను పిల్లలైన మీకు డైరెక్షన్ ఇస్తాను, ఇదే నా కృప మరియు ఆశీర్వాదము.

పాట:-
ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
పిల్లలు పాట విన్నారు. పిల్లలైన మనల్ని ఉదయాన్నే మేలుకొలపడానికి ఎవరు వచ్చారు, దాని ద్వారా మన జ్ఞానము యొక్క మూడవ నేత్రము పూర్తిగా తెరుచుకుంది. జ్ఞాన సాగరుడైన పరమపిత పరమాత్ముని ద్వారా మన జ్ఞానము యొక్క మూడవ నేత్రము తెరుచుకుంది. తండ్రిని జ్యోతి వెలిగించేవారని కూడా అంటారు. కానీ వారు తండ్రి - ఈ విషయము ఎవరికీ తెలియదు. వారు దీపమని, జ్యోతి అని బ్రహ్మ సమాజము వారు అంటారు. మందిరాలలో ఎప్పుడూ జ్యోతినే వెలిగిస్తారు, ఎందుకంటే వారు పరమాత్మను జ్యోతి స్వరూపముగా భావిస్తారు, అందుకే అక్కడ మందిరాలలో జ్యోతిని వెలిగిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తండ్రి ఏమీ అగ్గిపుల్లలతో జ్యోతిని వెలిగించరు. ఈ విషయము పూర్తిగా అతీతమైనది. ఈశ్వరుడు ఇచ్చే గతి, వారు చూపే మార్గము అతీతమైనవని అంటూ ఉంటారు. తండ్రి సద్గతిని ఇవ్వడానికి వచ్చి జ్ఞాన-యోగాలను నేర్పిస్తారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. నేర్పించేవారైతే తప్పకుండా కావాలి కదా. శరీరమైతే నేర్పించదు. ఆత్మయే అంతా చేస్తుంది. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. ఈ సమయములో రావణుడు ప్రవేశించిన కారణముగా మనుష్యుల సంస్కారాలు కూడా చెడుగా ఉన్నాయి అనగా 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. దేవతలలో ఈ 5 వికారాలు ఉండవు. భారత్ లో దైవీ స్వరాజ్యము ఉన్నప్పుడు ఈ చెడు సంస్కారాలు ఉండేవి కావు. సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు, దేవీ-దేవతల సంస్కారాలు ఎంత బాగుండేవి, వాటిని ఇప్పుడు మీరు ధారణ చేస్తున్నారు. తండ్రియే వచ్చి క్షణములో సర్వులకు సద్గతిని ఇస్తారు. ఇకపోతే గురువులు-సత్పురుషులు మొదలైనవారు భక్తి మార్గములో ఉన్న వారు, వారు ఒక్కరికి కూడా గతి-సద్గతిని ఇవ్వలేరు. తండ్రి రావడముతోనే సర్వుల సద్గతి జరుగుతుంది. పరమపిత పరమాత్మను అసలు ఎందుకు పిలుస్తారంటే - మీరు వచ్చి పతిత ప్రపంచాన్ని వినాశనము చేసి, పావన ప్రపంచము యొక్క ప్రారంభోత్సవాన్ని చేయండి మరియు ద్వారాలు తెరవండి. తండ్రి వచ్చి శివ శక్తి మాతల ద్వారా గేటు తెరిపిస్తారు. వందే మాతరం అని అంటూ ఉంటారు. ఈ సమయములోని మాతలెవరికీ వందనము చేయడము జరగదు ఎందుకంటే ఎవరూ శ్రేష్ఠాచారీ మాతలుగా లేరు. శ్రేష్ఠాచారులు అని ఎవరిని అంటారంటే, ఎవరైతే యోగబలముతో జన్మిస్తారో వారు. లక్ష్మీ-నారాయణులను శ్రేష్ఠాచారులని అంటారు. భారత్ లో దేవీ-దేవతలు ఉన్నప్పుడు భారత్ శ్రేష్ఠాచారిగా ఉండేది. ఈ విషయాల గురించి మనుష్యులకు అసలు తెలియనే తెలియదు. వారు తమ-తమ ప్లాన్లు తయారుచేసుకుంటున్నారు. గాంధీ కూడా రామ రాజ్యాన్ని కోరుకునేవారు, దీని ద్వారా ఇది రావణ రాజ్యమని ఋజువవుతుంది. భారత్ పతితముగా ఉంది. కానీ రామ రాజ్యాన్ని స్థాపించేందుకైతే అనంతమైన బాపూజీ కావాలి, వారు రామ రాజ్యాన్ని స్థాపన చేసి, రావణ రాజ్యాన్ని వినాశనము చేస్తారు. రావణ రాజ్యానికి ఇప్పుడు నిప్పు అంటుకోనున్నదని పిల్లలకు తెలుసు. ఆత్మలందరూ అజ్ఞాన అంధకారములో నిద్రిస్తున్నారు. మనము కూడా నిద్రపోతూ ఉండేవారము, తండ్రి వచ్చి మేలుకొలిపారని మీకు తెలుసు. భక్తి యొక్క రాత్రి పూర్తయ్యి, పగలు మొదలవుతుంది. రాత్రి పూర్తయ్యి ఇప్పుడు పగలు వస్తుంది. తండ్రి సంగమములో వచ్చి ఉన్నారు. పిల్లలకు దివ్య దృష్టి మరియు జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తారు, దీని ద్వారా మీరు మొత్తం విశ్వాన్ని తెలుసుకున్నారు. ఇది తయారై, తయారుచేయబడిన అవినాశీ డ్రామా అని, ఇది తిరుగుతూనే ఉంటుందని మీ బుద్ధిలో కూర్చుంది. ఇప్పుడు మీరు ఎంతగా మేలుకున్నారు, ప్రపంచమంతా నిద్రిస్తూ ఉంది.

ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాలు, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి తెలుసు. మిగిలిన ప్రపంచమంతా కుంభకర్ణుని అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంది. పతిత-పావనుడు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఓ పతిత-పావనా రండి, అని పిలుస్తారు. మీరు వచ్చి సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించండి అని ఎవరూ అనరు. తండ్రి అంటారు - మీరు ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడము ద్వారానే చక్రవర్తి రాజులుగా అవుతారు. స్మృతితోనే పావనముగా అవుతారు. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని, యుద్ధము కూడా జరగనున్నదని మీకు తెలుసు. ఇకపోతే కౌరవులకు, పాండవులకు యుద్ధము జరగలేదు. పాండవులు ఎవరు! ఇది కూడా ఎవరికీ తెలియదు. సైన్యము మొదలైనవాటి విషయమేమీ లేదు. మీ వైపు అయితే సాక్షాత్తు పారలౌకిక పరమపిత ఉన్నారు. ఆ తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలను అనుభవించి, ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటుందని మీరు తెలుసుకున్నారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు వినాశనము కన్నా ముందే సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉండాలి. భగవానువాచ - గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ ఒక్క జన్మ పవిత్రముగా అవ్వండి అని కూడా అంటూ ఉంటారు. పాస్ట్ ఈజ్ పాస్ట్ (గతం గతః). ఇదైతే డ్రామాలో నిశ్చితమై ఉంది. సృష్టి అయితే సతోప్రధానముగా అవ్వాల్సిందే, ఇది డ్రామా యొక్క రాత. ఇది ఈశ్వరుని రాత కాదు, డ్రామా రాత ఈ విధముగా తయారై ఉంది. దీనిని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పము ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు తండ్రి వస్తారు. తండ్రి అంటారు - ఎప్పుడైతే రాత్రి పూర్తయ్యి పగలు ప్రారంభమవుతుందో, అప్పుడే నేను వస్తాను. శివరాత్రి అని కూడా అంటారు కదా. శివుని పూజారులు శివరాత్రిని నమ్ముతారు. గవర్నమెంట్ అయితే సెలవును కూడా రద్దు చేసింది. లేకపోతే తక్కువలో తక్కువ ఒక నెల అయినా సెలవులు ఉండాలి. శివబాబా సర్వులకు సద్గతిని ఇచ్చేవారని, వారే సర్వుల దుఃఖహర్త-సుఖకర్త అని ఎవరికీ తెలియదు. వారి జయంతినైతే అసలు అన్ని ధర్మాలవారు చాలా ఘనముగా ఒక నెలంతా జరుపుకోవాలి. విశేషముగా భారత్ కు తండ్రి డైరెక్టుగా వచ్చి సద్గతిని ఇస్తారు. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు దేవీ-దేవతల రాజ్యము ఉండేది, ఆ సమయములో వేరే ధర్మాలేవీ ఉండేవి కాదు, దేవతలు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. విభజనలు మొదలైనవేవీ ఉండేవి కాదు. అందుకే స్థిరమైన, అఖండమైన, సుఖ-శాంతి-సంపత్తుల దైవీ రాజ్యాన్ని మేము మళ్ళీ పొందుతున్నామని అంటారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము 5 వేల సంవత్సరాల క్రితం కూడా లభించింది. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలలో ఎటువంటి దుఃఖము అన్న పేరే లేదు. రాముని రాజ్యములో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరములో అందరూ దాతలే కావున ధర్మానికి సదా ఉపకారము జరుగుతుంది... అని అంటూ ఉంటారు. అక్కడ అధర్మమనే మాటే ఉండదు.

బాబా మీకు, బ్రహ్మా మరియు విష్ణువుకు పరస్పరములో కల సంబంధము ఏమిటి అనేది కూడా అర్థం చేయించారు. బ్రహ్మా నాభి ద్వారా విష్ణువు వెలువడినట్లుగా చూపిస్తారు... ఎంత అద్భుతమైన చిత్రాన్ని తయారుచేసారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ లక్ష్మీ-నారాయణులే చివరిలో బ్రహ్మా-సరస్వతులుగా, జగదంబ-జగత్పితలుగా అవుతారు. వీరిరువురూ మళ్ళీ విష్ణువుగా అనగా లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మీరు ఏవైతే చిత్రాలు చూస్తుంటారో, అవేవీ యథార్థమైనవి కావు. శివునికి పెద్ద చిత్రాన్ని తయారుచేస్తారు, అది కూడా అయథార్థమైనదే. భక్తి కారణముగా పెద్దదిగా తయారుచేసారు, లేదంటే బిందువుకు పూజ ఎలా జరుగుతుంది? అచ్ఛా, బ్రహ్మా-విష్ణు-శంకరుల గురించి కూడా అర్థం చేసుకోలేరు. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన... అని కూడా అంటారు కానీ బ్రహ్మా అయితే స్థాపన చేయరు. స్వర్గ స్థాపన బ్రహ్మా చేస్తారా? చేయరు. స్వర్గ స్థాపనను పరమపిత పరమాత్మయే చేస్తారు. వీరి ఆత్మ అయితే పతితముగా ఉంది, వీరిని వ్యక్త బ్రహ్మా అని అంటారు. ఈ ఆత్మయే పావనముగా అవుతుంది మరియు వెళ్ళిపోతుంది. తర్వాత సత్యయుగములోకి వెళ్ళి నారాయణునిగా అవుతుంది. కావున ప్రజాపిత బ్రహ్మా తప్పకుండా ఇక్కడే కావాలి కదా. కానీ చిత్రములో అక్కడ ఉన్నట్లుగా చూపించారు. వాస్తవానికి జ్ఞానము యొక్క ఈ అలంకారాలు మీవి, కానీ విష్ణువుకు చూపించారు. నవ విధ భక్తిలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరా పేరు కూడా గాయనము చేయబడింది కదా. పురుషులలో నంబర్ వన్ భక్తుడు నారదుడు. మాతలలో మీరా గాయనము చేయబడ్డారు. మీరిప్పుడు నారాయణుడిని లేక లక్ష్మిని వరించేందుకు ఈ జ్ఞానాన్ని వింటున్నారు. మీకే స్వయంవరము జరుగుతుంది. సభలోకి వచ్చి, నేను లక్ష్మిని వరించవచ్చా అని అడిగినట్లుగా నారదుని గురించి కూడా చూపిస్తారు! ఇప్పుడు లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా మీరు అవుతున్నారు. ఇకపోతే, అవన్నీ భక్తి మార్గపు కథలు. తండ్రి కూర్చుని వాస్తవిక విషయాలను అర్థం చేయిస్తారు. లక్ష్మి సత్యయుగములో ఉంటారు, భక్తుడైన నారదుడు ద్వాపరములో ఉంటారు. సత్యయుగములోకి నారదుడు ఎక్కడ నుండి వచ్చారు? రాధా-కృష్ణులకే స్వయంవరం తర్వాత లక్ష్మీ-నారాయణులు అనే పేర్లు పెడతారు. ఈ విషయము కూడా భారతవాసులకు తెలియదు. ఎంతటి అజ్ఞాన అంధకారము ఉంది. తండ్రి కళ్యాణకారి. మిమ్మల్ని కూడా కళ్యాణకారులుగా తయారుచేస్తారు. ఇతరులకు కూడా ఎలా అర్థం చేయించాలని ఇప్పుడు విచార సాగర మంథనము చేయాలి. చిత్రాలు మొదలైనవి ఎలా తయారుచేయబడ్డాయి అనేది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. గాంధీ నాభి నుండి నెహ్రూ వెలువడినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు దేవత అయిన ఆ విష్ణువు ఎక్కడ, ఈ మనుష్యులెక్కడ... ఈ విషయాలన్నింటి గురించి పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. నంబరువారుగా మీకు సంతోషము కలుగుతుంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎప్పుడూ వినలేదు, ఎందుకంటే గీతలోనైతే శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాసేసారు. భగవంతుడు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వచ్చి గీతను వినిపించారు! దీనికి సంబంధించిన తిథి-తారీఖులు ఏమీ లేవు. కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని చెప్తారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోకీ రావు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. బ్రాహ్మణుల వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ-చెందుతూ లెక్కలేనంతమంది అవుతారు. వర్ణాలలో ఎలా చక్రము తిరుగుతాము అనేది పిల్లలైన మీకు తెలుసు. బ్రాహ్మణులైన మన వర్ణము అన్నింటికన్నా ఉన్నతమైనది. మనము భారత్ యొక్క గుప్తమైన, సత్యమైన ఆత్మిక సమాజ సేవకులము. పరమపిత పరమాత్మ మన ద్వారా సేవ చేయిస్తున్నారు. మనము ఆత్మిక సేవ చేస్తాము, వారు దైహిక సేవ చేస్తారు. మీరు భారత్ కు ఏమి సేవ చేస్తారని మిమ్మల్ని అడుగుతారు? మేము ఆత్మిక సేవాధారులము అని చెప్పండి. మా ద్వారా స్వర్గాన్ని ప్రారంభోత్సవం చేయిస్తున్నారని, స్థాపన చేయిస్తున్నారని చెప్పండి. శివబాబా చేసేవారు, చేయించేవారు. ఎవరైతే చేయిస్తున్నారో, వారు చేస్తారు కూడా. మురళీని ఎవరు వినిపిస్తారు? అంటే, వారు కర్మ చేస్తున్నట్లు. మురళీని ఇలా వినిపించండని మీకు కూడా నేర్పిస్తారు. ‘మన్మనాభవ’ అనే మహామంత్రాన్ని ఇస్తారు. కర్మను నేర్పించారు కదా. తర్వాత ఇతరులకు నేర్పించండి అని మీకు చెప్తారు. అందుకే వారిని - చేసేవారు చేయించేవారు అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇదే శిక్షణను ఇస్తారు. తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ సందేశాన్ని పిల్లలైన మీరు అందించాలి. అలాగని ఇతరులకు సందేశాన్ని ఇచ్చి, స్వయము స్మృతిలో లేకపోతే ఏమవుతుంది? ఇతరులు పురుషార్థము చేసి పైకి వెళ్ళిపోతారు, కానీ సందేశాన్ని ఇచ్చినవారు ఉండిపోతారు. స్మృతి యొక్క పురుషార్థము చేయకపోతే అంత ఉన్నత పదవిని పొందలేరు. రెండు - స్మృతియాత్రతో పావనముగా అవుతారు. బాబా బంధనములో ఉన్నవారి ఉదాహరణను ఇస్తారు. వారు స్మృతిలో ఎక్కువగా ఉంటారు. బాబాను చూడకపోయినా సరే, ఉత్తరము వ్రాస్తారు - బాబా, మేము మీవారిగా అయిపోయాము, మేము పవిత్రముగా తప్పకుండా ఉంటాము. పిల్లలైన మీకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంది. మీ మాలయే తయారుచేయబడింది. విష్ణు మాల మరియు రుద్రాక్ష మాలలో పైన జంటపూసలు ఉంటాయి. మాలను చేతిలోకి తీసుకోగానే ముందు పుష్పము మరియు రెండు పూసలు చేతికి వస్తాయి, వాటికి నమస్కరిస్తారు. తర్వాత మిగతా మాల ఉంటుంది. మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు కనుక ఈ మాల మీ స్మృతిచిహ్నమే. తండ్రి ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు, ఇందులో ఈ పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. తండ్రి అత్యంత ప్రియమైన ఫాదర్. మీకు భవిష్య 21 జన్మల కోసం సదా సుఖము యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైతే కల్పక్రితం వారసత్వాన్ని తీసుకున్నారో, వారు తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారముగా వస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, సుఖధామానికి వెళ్ళాలంటే పవిత్రముగా అవ్వాలి. నన్ను స్మృతి చేయండి. కృప చూపించండి లేక సహాయము చేయండి అని అడగకూడదు. నేనైతే అందరికీ సహాయము చేస్తాను. పురుషార్థమైతే మీరు చేయాలి. ఇక్కడ ఆశీర్వాదాల విషయమేమీ లేదు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతి చేయడము మీ పని. డైరెక్షన్ ఇవ్వడమే కృప చూపించడము. ఇకపోతే తినండి, తాగండి, తిరగండి... మీరు పవిత్ర భోజనాన్నే తినాలి. మనము దేవీ-దేవతలుగా అవుతాము, అక్కడ ఉల్లిపాయలు మొదలైనవి ఉండవు. అవన్నీ ఇక్కడే వదిలేయాలి. ఈ వస్తువులు అక్కడ ఉండవు. ఆ విత్తనాలే ఉండవు. సత్యయుగములో అనారోగ్యాలు మొదలైనవి ఉండవు. ఇప్పుడు ఎన్ని అనారోగ్యాలు వెలువడ్డాయో చూడండి. అక్కడ తమోగుణీ వస్తువేదీ ఉండదు. ప్రతి వస్తువు సతోప్రధానముగా ఉంటుంది. ఇక్కడ మనుష్యులు ఏమేమి తింటున్నారో చూడండి. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి, ఇతర సాంగత్యాలను వదిలి నాతో సాంగత్యాన్ని జోడించినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పాస్ట్ ఈజ్ పాస్ట్ (గతం గతః), గతించిపోయిన దానిని మరచి గృహస్థ వ్యవహారములో ఉంటూ, సతోప్రధానముగా అయ్యే పురుషార్థము చేయాలి. వినాశనానికి ముందే పావనముగా తప్పకుండా అవ్వాలి.

2. భారత్ ను స్వర్గముగా తయారుచేసే సత్యాతి-సత్యమైన సేవలో తత్పరులై ఉండాలి. ఆహార-పానీయాలను చాలా శుద్ధముగా ఉంచుకోవాలి. పవిత్ర భోజనాన్నే తినాలి.

వరదానము:-
స్థూల కార్యాలను చేస్తూ కూడా మనసా ద్వారా విశ్వ పరివర్తనా సేవను చేసే బాధ్యతాయుత ఆత్మా భవ

ఏ స్థూల కార్యమునైనా చేస్తూ సదా ఈ స్మృతి ఉండాలి - నేను విశ్వమనే స్టేజిపై విశ్వ కళ్యాణ సేవార్థము నిమిత్తమై ఉన్నాను, నాకు నా శ్రేష్ఠ మనసా ద్వారా విశ్వ పరివర్తనా కార్యము చేసే చాలా పెద్ద బాధ్యత లభించింది. ఈ స్మృతి ద్వారా నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది మరియు సమయము కూడా వ్యర్థమవ్వడము నుండి రక్షంచబడుతుంది. ఒక్కొక్క క్షణాన్ని అమూల్యముగా భావిస్తూ విశ్వ కళ్యాణ కార్యములో మరియు జడమును-చైతన్యమును పరివర్తన చేసే కార్యములో సఫలం చేస్తూ ఉంటారు.

స్లోగన్:-
ఇప్పుడు యోధులుగా అయ్యేందుకు బదులుగా నిరంతర యోగులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలీ స్మృతిని అనుభవము చేయండి

ఎలా అయితే దుఃఖముతో ఉన్నవారి మనసులో - ఇప్పుడు వినాశనమైపోవాలి అన్న శబ్దము మొదలైందో, అలాగే విశ్వ కళ్యాణకారీ ఆత్మలైన మీ మనసులో ఈ సంకల్పము ఉత్పన్నమవ్వాలి - ఇప్పుడు త్వరలోనే సర్వుల కళ్యాణము జరగాలి. అప్పుడే సమాప్తి జరుగుతుంది. వినాశకారీ ఆత్మలకు కళ్యాణకారీ ఆత్మల సంకల్పము యొక్క సూచన కావాలి, అందుకే ఎవర్రెడీగా అవ్వాలి అనే తమ శక్తిశాలి సంకల్పముతో జ్వాలా రూప యోగము ద్వారా వినాశ జ్వాలను వేగవంతము చేయండి.