04-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానవంతులుగా అయినట్లయితే ధనవంతులుగా
అవుతారు, జ్ఞాన-జ్ఞానేశ్వరి అయిన జగదాంబయే రాజ-రాజేశ్వరిగా అవుతారు’’
ప్రశ్న:-
తండ్రికి తమ
పిల్లల పట్ల దయ కలుగుతుంది, అందుకే శ్రేష్ఠ భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు ఏ
శ్రీమతాన్ని ఇస్తారు?
జవాబు:-
మధురమైన
పిల్లలూ - తలపై పాపాల భారము ఏదైతే ఉందో, దానిని మృత్యువు కన్నా ముందే స్మృతియాత్రలో
ఉంటూ తొలగించుకోండి. ఏ వికర్మ చేయకండి. తండ్రి మిమ్మల్ని యమదూతల ఉరికంబము నుండి
విడిపించేందుకు వచ్చారు, అందుకే ఇప్పుడు అటువంటి కర్మలేవీ చేయకండి.
పాట:-
రాత్రి
ప్రయాణీకుడా అలసిపోకు...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట అర్థాన్ని అర్థం చేసుకున్నారు. తండ్రి భక్తి
రూపీ రాత్రిని వినాశనము చేసి పగలును స్థాపన చేయడానికి వచ్చారు ఎందుకంటే ఓ పతిత-పావనా
రండి, అని తండ్రినే పిలుస్తారు. ఒకానొక సమయములో మేము పావనముగా ఉండేవారము, ఇప్పుడు
పతితముగా ఉన్నామని అర్థం చేసుకుంటారు. ఏ వస్తువైతే ఒకప్పుడు ఉండేదో, ఇప్పుడు లేదో,
దానినే అడగడము జరుగుతుంది. పవిత్రమైన దేవీ-దేవతల రాజధాని ఉండేదని పిల్లలైన మీకు
తెలుసు. జ్ఞాన-జ్ఞానేశ్వరియే తర్వాత రాజ-రాజేశ్వరిగా అవుతారు. జగదాంబ మరియు లక్ష్మి
వేర్వేరు. లక్ష్మిని ఎప్పుడూ జగదాంబ అని అనరు. లక్ష్మిని వారి ఇద్దరు పిల్లలు
మాత్రమే మాతేశ్వరి అని పిలుస్తారు. ఇక్కడ జగదాంబను ధార్మిక మనస్తత్వము కల
భారతవాసులందరూ తల్లి అని అంటారు. దేవీ-దేవతల మందిరాలకు వెళ్ళి వారికి భక్తి చేస్తారు.
మనము చాలా భక్తి చేసామని ఇప్పుడు మీకు తెలిసింది. దాన-పుణ్యాలు మొదలైనవి మీరు ఎంతగా
చేశారో, అంతగా ఇంకెవ్వరూ చేసి ఉండరు. మీరు అందరికంటే ఎక్కువ భక్తి చేసారు. ఇప్పుడు
మీరు మీ స్మృతిచిహ్నాన్ని జీవిస్తూనే చూసారు. ఆదిదేవ్ మరియు ఆదిదేవి ఉన్నారు, వారిని
జగదాంబ అని అంటారు. జగదాంబ ధనవంతురాలిగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. మీరు వారి
పిల్లలు కదా. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. వారు జ్ఞాన దేవి. ఆ చదువుతో ఎప్పుడూ
రాజు-రాణులుగా అవ్వరు. ఆత్మలమైన మనము శివబాబాకు పిల్లలమని మరియు వీరు ప్రజాపిత
బ్రహ్మా అని మీకు తెలుసు. శివబాబా వీరి ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన
చేస్తున్నారు. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు కూడా. ఈ విషయాలను మంచి రీతిలో
అర్థం చేసుకుని ధారణ చేయాలి. పులి పాలు కోసం బంగారు పాత్ర కావాలని అంటారు కదా. ఈ
జ్ఞానము కూడా సర్వశక్తివంతుడైన పరమపిత పరమాత్మునిది. దీని కోసం కూడా బుద్ధి రూపీ
పాత్ర బంగారముదిగా ఉండాలి. కొత్త ప్రపంచములో ఆత్మ మరియు శరీరము, రెండు బంగారము వలె
అవుతాయి. ఇప్పుడు మీ ఆత్మ రాతి పాత్ర వలె ఉంది. కనుక శరీరము కూడా అలాగే ఉంది. భారత్
లోనే శ్యామము మరియు సుందరము, పతితము మరియు పావనము అని అంటారు. మీరు వచ్చి పతితులైన
మమ్మల్ని పావనముగా తయారుచేయండని ఇంకే ఇతర ఖండాలలోనూ అనరు. దుఃఖము నుండి విడిపించి
శాంతిలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. భారతవాసులైన మనము పావనముగా ఉండేవారమని, ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని వివేకము కూడా చెప్తుంది. ఎంత పెద్ద వ్యక్తులైనా సరే,
వారు కూడా గురువుల పాదాలపై పడతారు ఎందుకంటే గురువులు సన్యాసాన్ని ధారణ చేసి ఉన్నారు,
5 వికారాలను వదిలారు. వికారులు నిర్వికారులకు గౌరవమిస్తారు. పవిత్రతకే గౌరవముంది.
ద్వాపరము నుండి రాజు-రాణి మరియు మంత్రి ఉంటారు. సత్యయుగములో రాజు-రాణులకు మంత్రులు
ఉండరు. ఎప్పుడైతే పతిత రాజు-రాణులుంటారో, అప్పుడు ఒక మంత్రిని పెట్టుకుంటారు.
ఇప్పుడు చాలా పతితముగా అయిపోయారు కావున వందలాది మంది మంత్రులను పెట్టుకుంటారు. ఇది
డ్రామాలోని వ్రాత. బాబా అంటారు - డ్రామా వ్రాత ఎలా తయారై ఉందో చూడండి. ముందు
తప్పకుండా భారత్ మాత్రమే ఉండేది, తర్వాత ఇతర ధర్మాల వారు వచ్చారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - ఈ సమయములో మీరు జ్ఞాన-జ్ఞానేశ్వరీలు. జగదాంబ బ్రహ్మా యొక్క
పుత్రిక, జ్ఞాన దేవి. జగదాంబ జ్ఞానవంతురాలు, వారు మరుసటి జన్మలో ధనలక్ష్మిగా అవుతారు.
మీకు ఇప్పుడు తండ్రి జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. మనము అక్కడ ధనవంతులుగా అవుతామని
మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు ధనవంతులుగా ఎలా అయ్యారు అనేది ప్రపంచములో ఎవ్వరికీ
తెలియదు. లక్ష్మీ-నారాయణులు ఆ బ్రహ్మా-సరస్వతులే. బ్రహ్మా జగత్పిత కనుక తప్పకుండా
బ్రాహ్మణ-బ్రాహ్మణీలు చాలామంది ఉంటారు. మీరు ఎంతమంది బ్రాహ్మణ-బ్రాహ్మణీలు ఉన్నారు.
మనము ఈ జ్ఞానముతో భవిష్యత్తులో ఇలాంటి ధనవంతులుగా అవుతామని మీకు తెలుసు. పూర్తిగా
ధన దేవీలుగా అవుతాము, వారి వద్ద ఉన్నదాని కన్నా ఎక్కువ ధనము ఎవరి వద్దా ఉండదు,
అందుకే జ్ఞానము సంపాదనకు ఆధారమని అంటూ ఉంటారు. జడ్జి, బ్యారిస్టరు మొదలైనవారిగా
జ్ఞానముతోనే అవుతారు కదా. కనుక ఇది సంపాదన కదా. కొంతమంది డాక్టర్లకు ఒక్కొక్క కేసుకు
లక్షల రూపాయలు లభిస్తాయి. ఎవరైనా రాజు-రాణి లేక రాకుమారుడు అనారోగ్యము పాలైనప్పుడు,
డాక్టర్ అనారోగ్యము నుండి విడిపిస్తే, వారు సంతోషించి పెద్ద-పెద్ద ఇళ్ళు
కట్టుకునేందుకు ధనము ఇస్తారు. అప్పుడు ఎంత సంపాదన జరుగుతుంది. కనుక చదువుతోనే పదవిని
పొందుతారు. ఇది మీ చదువు కూడా, వ్యాపారము కూడా.
మధురమైన పిల్లలైన మీరు ఇప్పుడు వ్యాపారము చేయడానికి వచ్చారు. పనికిరానివి ఇచ్చి
లక్షలు సంపాదిస్తారు. తండ్రి అవినాశీ సర్జన్ కూడా, సదా ఆరోగ్యవంతులుగా తయారయ్యేందుకు
బాబా యోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా అంటారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు 21
జన్మలకు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. మరి అటువంటి సర్జన్ ఇచ్చే మందును ఎందుకు
తీసుకోకూడదు అనగా శ్రీమతముపై ఎందుకు నడవకూడదు. తండ్రి మతాన్ని స్వీకరించండి. నన్ను
స్మృతి చేయండి. స్మరణ చేస్తూ-చేస్తూ సుఖాన్ని పొందండి, దానితో కలహ క్లేశాలు, శారీరక
రోగాలు సమాప్తమవుతాయని అంటారు కదా. భక్తి మార్గములో కలహ క్లేశాలేవీ సమాప్తమవ్వవు.
చాలామంది సన్యాసులు కూడా అనారోగ్యముతో, పక్షవాతముతో పడి ఉంటారు, పిచ్చివారిలా
అయిపోతారు. తండ్రి శ్రీమతముపై నడుస్తే మనము సదా ఆరోగ్యవంతులుగా అవుతామని పిల్లలైన
మీకు తెలుసు. అక్కడ ఆయుష్షు సగటున 125-150 సంవత్సరాలు ఉంటుంది. అలాగని ద్వాపరములో
ఆయుష్షు ఒక్కసారిగా 35 సంవత్సరాలైపోతుందని కాదు. అలా అవ్వదు. ముందు 100-125 అవుతుంది,
తర్వాత 70-80 అవుతుంది, ఇప్పుడైతే 35-40 సంవత్సరాల వరకు చేరుకుంది. చిన్నతనములోనే
మరణిస్తారు ఎందుకంటే భోగీలుగా ఉన్నారు. ఇప్పుడు భోగీల నుండి యోగీలుగా అవుతున్నారని
మీకు తెలుసు. అక్కడ ఆయుష్షు ఎంత ఎక్కువగా ఉంటుందంటే, అకాల మృత్యువు ఎప్పుడూ
సంభవించనే సంభవించదు. మీకు ఎంతటి రాజ్య భాగ్యముండేది అని తండ్రి స్మృతినిప్పిస్తారు.
ఇప్పుడు రావణుడు దోచుకున్నాడు. అక్కడ ఈ మందిరాలు మొదలైనవి ఉండవు. మీ స్లోగన్ కూడా
ఏమిటంటే - భారత్ యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము జిందాబాద్, మిగిలినవన్నీ
ముర్దాబాద్ అనగా అనేక ధర్మాల వినాశనము జరగాలి. అక్కడ కేవలం ఒక్క భారత ఖండము మాత్రమే
ఉండేది. ఒక్క ఖండములో మనుష్యులు కూడా తప్పకుండా కొద్దిమందే ఉంటారు. కొద్ది సమయములో
భారత్ యొక్క జనాభా 9 లక్షలవుతుందని, మిగిలినవారంతా సమాప్తమైపోతారని మీరు వ్రాయవచ్చు.
ఏక ధర్మ స్థాపన ఇప్పుడు జరుగుతూ ఉంది. కొత్త దైవీ రాజ్యములో ఒకే భాష ఉంటుంది, ఒకే
ఆచారము-వ్యవహారము ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి ఆచారము ఎవరిది వారిదే. అక్కడ ఒకే
రాజ్యము, ఒకే కమ్యూనిటీ ఉండేది. మీరు ఇలాంటి స్లోగన్లను వార్తాపత్రికలలో కూడా
వేయవచ్చు. బాబాను సలహా అడుగుతారు - ధనము ఖర్చు చేసి వార్తాపత్రికలలో వేయించమంటారా?
బాబా అంటారు - వేయించండి, ఏం జరుగుతుందో మనుష్యులకు తెలుస్తుంది. క్రైస్టుకు 3 వేల
సంవత్సరాల క్రితం స్వర్గముండేదని అంటారు కూడా. సూర్యవంశీ దేవీ-దేవతలది ఒకే ధర్మము,
ఒకే కమ్యూనిటీ ఉండేది. ఈ మహాభారత యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి.
వార్తాపత్రికలలో వేయండి, పేరు బి.కె.లది ఉండాలి. కానీ ఎప్పుడైతే పవిత్రముగా ఉంటారో,
అప్పుడే బి.కె.లుగా పిలువబడతారు. తండ్రిని పిలిచారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక
ఇప్పుడు తండ్రితో ప్రతిజ్ఞ చేయండి. భక్తి మార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు,
యజ్ఞతపాదులు, దానాలు మొదలైనవి చేసారు. ముందు ఒక్క శివుని భక్తిని చేసేవారు, ఆ
తర్వాత దేవతలది. ఇప్పుడైతే వ్యభిచారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అన్ని
దుఃఖాల నుండి విడిపిస్తారు. తండ్రి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చి ఎంత ఉన్నతముగా,
మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. సత్యయుగములో మీ వద్ద అన్నీ బంగారమువే ఉంటాయి.
తండ్రి మీకు శ్రీమతాన్ని ఇచ్చి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. మరి మీరు
శ్రీమతముపై ఎందుకు నడవడము లేదు. తండ్రి యమదూతల ఉరికంబము నుండి విడిపిస్తారు, గర్భ
జైలు శిక్షల నుండి విడిపిస్తారు. మీరు స్వర్గములో గర్భ మహల్లో ఉంటారు. ఇక్కడ జైలు
ఉంది ఎందుకంటే మనుష్యులు పాప కర్మలు చేస్తారు. అక్కడ 5 వికారాలే ఉండవు, అయినా
రాజు-రాణి, ప్రజా పదవులలో తేడా అయితే ఉంటుంది కదా. మనుష్యులు ధనము సంపాదించేందుకు
శ్రమ అయితే చేస్తారు కదా. అక్కడ మంత్రులు ఉండరు ఎందుకంటే మీరు ఇక్కడి ప్రారబ్ధాన్ని
పొందుతారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, మీరు శ్రీమతముపై నడవండి. నేను దూరదేశము
నుండి వచ్చాను, పతిత శరీరములోకి, పతిత రాజ్యములోకి వచ్చాను. ఇది రావణుడి దేశము. నేను
వచ్చి పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తాను. ఇటువంటి తండ్రి ఆజ్ఞను పాటించకపోవడము
అంటే వారు కుపుత్రులుగా అయినట్లు. వికారాల వెనుక ఇంతగా హైరానా పడకూడదు. బాబా అంటారు
- ఈ వికారాలు దుఃఖము ఇచ్చేవి. పతితులను పావనముగా తయారుచేయడము - ఇది నా పని. ఎంత
ప్రేమగా అర్థం చేయిస్తారు - తినండి, తాగండి, సుఖముగా ఉండండి. మేము శివబాబా వద్దకు
వచ్చామని, వారి ద్వారా మా పాలన జరుగుతుందని గుర్తుంచుకోండి. ఒకవేళ మిత్ర-సంబంధీకులు
మొదలైనవారి వస్తువులను ధరిస్తే, వారు గుర్తుకువస్తారు, పదవి భ్రష్టమవుతుంది. ఇక్కడ
శివబాబా భాండాగారము నుండి, పతిత-పావనుడైన తండ్రి యజ్ఞము నుండి పాలన జరగాలి, అంతేకానీ
పతిత ఇంటి నుండి కాదు. ఎవరైనా ఇచ్చిన వస్తువులుంటే, వారు గుర్తుకువస్తారు. దీని
గురించే అంటూ ఉంటారు - అంతిమ సమయములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో... అని. ఎంత మంచి
అవస్థ ఉండాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ, ఇదంతా సమాప్తమయ్యే ఉందని బుద్ధి ద్వారా
అర్థం చేసుకోవాలి. నా వారైతే ఒక్క బాబాయే. ఇప్పుడు తండ్రి యొక్క మాలను ఎప్పుడైనా
స్మరించడము జరుగుతుందా? నేను పిల్లలైన మీకు స్మృతిని ఇప్పిస్తున్నాను - నన్ను స్మృతి
చేయండి, మీకు చాలా బలం లభిస్తుంది, వికర్మలు వినాశనమవుతాయి, బలశాలిగా అవుతారు. ఈ
లక్ష్మీ-నారాయణులు బలశాలులు కదా. ఎవరైతే బలశాలిగా ఉంటారో, వారు రాజ్యాన్ని పొందుతారు.
బాబా తన ఉదాహరణను చెప్తున్నారు - నేను 12 మంది గురువులను ఆశ్రయించాను, ఉదయాన్నే లేచి
1000 సార్లు మాల జపించమని గురువు చెప్పారు. దానికి నేను అనేవాడిని - వేరే సమయమేదైనా
చెప్పండి, రోజంతా వ్యాపార వ్యవహారాలతో అలసిపోతాను అని. మీరు కూడా ఇలాగే చెప్తారు కదా
- బాబా, ఉదయాన్నే లేవలేకపోతున్నాము అని. తండ్రి అంటారు - మేము పవిత్రముగా ఉండలేము,
స్మృతిలో ఉండలేము అని మీరు చెప్పకండి. స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి.
మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి. ఇది అంతిమ జన్మ, తప్పకుండా
పవిత్రముగా అవ్వండి. తండ్రి శ్రీమతముపై నడవకపోతే ఏ పదవిని పొందుతారు. అర్ధకల్పము
నుండి నన్ను పిలిచారు. ఇప్పుడు నేను చెప్తున్నాను - పావనముగా అయి నన్ను స్మృతి
చేయండి, ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి, సందేశము ఇస్తూ ఉండండి. తండ్రి
అంటారు - మన్మనాభవ. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. మిమ్మల్నే మెసెంజర్ లేక పైగంబర్
(సందేశకులు) అని అంటారు. బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ మెసెంజర్ గా అవ్వలేరు.
పతిత-పావనుడైన శివబాబా వస్తారు, వారు ఎవరిలో ప్రవేశిస్తారు, ఇది కూడా వ్రాయబడి ఉంది.
బ్రహ్మా ద్వారా స్థాపన, ఇది అర్థం చేసుకోరు. సూక్ష్మవతనములో ప్రజాపిత బ్రహ్మా ఉంటారా?
ఇక్కడే పతితుల నుండి పావనులుగా అవుతారు. సైలెన్స్ బలంతో స్థాపన జరుగుతుంది, సైన్స్
బలంతో వినాశనము జరుగుతుంది. శాంతి ఎలా లభిస్తుంది అని అందరూ అంటారు. ఇప్పుడు ఆత్మ
ఉన్నదే శాంతి స్వరూపము. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చింది. ఇక్కడ శాంతిగా ఎలా
ఉంటారు? ఆ శాంతి శాంతిధామములో లభిస్తుంది. ఇక్కడైతే దుఃఖము లభిస్తుంది. సత్యయుగములో
సుఖము-శాంతి, రెండూ ఉంటాయి.
ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ సమ్ముఖములో వింటారు. తండ్రి అంటారు - పతితులు నన్ను
ఎప్పుడూ కలవకూడదు, లేదంటే వారిని తీసుకువచ్చే బ్రాహ్మణికి పాపము అంటుకుంటుంది (ఇంద్రసభలోని
దేవకన్య వలె). వాస్తవానికి ఇంద్రసభ అంటే ఇది. వీరు జ్ఞాన దేవ కన్యలు. కనుక ఇంకా
ఎక్కువ శిక్ష పడుతుంది. బాబా ఖచ్చితముగా నిరాకరిస్తారు. పతితులెవ్వరినీ
తీసుకురాకూడదు. ఇంతకుముందు బాబా ఎప్పుడూ, ప్రతిజ్ఞ చేసారా అని అడిగేవారు!
పురుషార్థము చేస్తున్నామని చెప్పేవారు. ఎప్పుడైతే పక్కా నిశ్చయము ఏర్పడుతుందో,
అప్పుడే కలవాలి. ఒకవేళ తండ్రిని కలిసి మళ్ళీ వికారాలలోకి వెళ్తే 100 రెట్లు శిక్ష
పడుతుంది. అప్పుడు తండ్రి, బహుశా వీరి భాగ్యములో లేదని భావిస్తారు. తండ్రి అయితే,
భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు పురుషార్థము చెప్తారు. మరి అటువంటి తండ్రి చెప్పినది
వినకపోతే వారి గతి ఏమవుతుంది! తండ్రికి దయ కలుగుతుంది. తండ్రి అంటారు - మిమ్మల్ని
మీరు సరి చేసుకుంటూ వెళ్ళండి. అంతేకానీ, నడుస్తూ-నడుస్తూ మరణించడము కాదు. మేము
తండ్రిని స్మృతి చేసి పాపాల భారాన్ని తొలగించుకోవాలి అనే భయముండాలి. అచ్ఛా!
అందరికీ సద్గతిని కలిగించేవారు ఒక్క శివబాబా మాత్రమే, వారి ఫోటోను తీయలేము, వారిని
దివ్య దృష్టితో మాత్రమే చూడగలరు. ఇకపోతే, వారిని తెలుసుకోగలరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎటువంటి అవస్థను తయారుచేసుకోవాలంటే, అంతిమ సమయములో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే
రావాలి. ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఇదంతా వినాశనము అవ్వనున్నదని బుద్ధిలో ఉండాలి.
2. మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. ఈ అంతిమ జన్మలో పవిత్రముగా తప్పకుండా అవ్వాలి.
మా ద్వారా ఏ పాప కర్మ జరగకూడదు అని భయముంచుకోవాలి.
వరదానము:-
డ్రామా యొక్క డాలును ఎదురుగా పెట్టుకుని సంతోషమనే ఔషధాన్ని
తినే సదా శక్తిశాలి భవ
సంతోషము రూపీ భోజనము ఆత్మను శక్తిశాలిగా తయారుచేస్తుంది,
సంతోషము వంటి ఔషధము లేదని అంటారు కూడా. దీని కోసం డ్రామా యొక్క డాలును మంచి రీతిలో
కార్యములో ఉపయోగించండి. ఒకవేళ సదా డ్రామా యొక్క స్మృతి ఉన్నట్లయితే, ఇక ఎప్పుడూ
వాడిపోలేరు, సంతోషము మాయమవ్వలేదు, ఎందుకంటే ఈ డ్రామా కళ్యాణకారి, అందుకే అకళ్యాణకారి
దృశ్యములో కూడా కళ్యాణము ఇమిడి ఉంటుంది, ఈ విధముగా భావిస్తే సదా సంతోషముగా ఉంటారు.
స్లోగన్:-
పరచింతన మరియు
పరదర్శన అనే ధూళి నుండి దూరముగా ఉండేవారే సత్యమైన, అమూల్యమైన వజ్రాలు.
అవ్యక్త ప్రేరణలు -
బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
సంపన్నతను మరియు
సంపూర్ణతను ప్రాప్తి చేసుకునేందుకు దేహ-అభిమానము నుండి సంపూర్ణ సమర్పణ అవ్వాలి.
దేహము యొక్క అభిమానము పూర్తిగా తెగిపోవాలి, అప్పుడు సర్వ సమర్పణమయ జీవితము అని
అంటారు. ఇలా ఎవరైతే సర్వ త్యాగి, సర్వ సమర్పణ జీవితము కలవారిగా ఉంటారో, వారి యొక్క
సంపూర్ణ అవస్థ గురించే చెప్పుకుంటూ ఉంటారు మరియు ఎప్పుడైతే సంపూర్ణముగా అవుతారో,
అప్పుడు కలిసి వెళ్తారు.