05-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.11.2009


‘‘స్వరాజ్యము యొక్క రిజల్టును చెక్ చేసుకుని స్వయాన్ని ఛేంజ్ చేసుకోండి మరియు అఖండ రాజ్యానికి అధికారులుగా అవ్వండి’’

ఈ రోజు హృదయాభిరాముడైన బాబా తమ అత్యంత ప్రియమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఎందుకు అత్యంత ప్రియమైనవారు? పిల్లలైన మీలోని ప్రతి ఒక్కరూ మూడు సింహాసనాలకు యజమానులు అని మీకు తెలుసా? ఒకటి, స్వరాజ్య సింహాసనము, రెండవది బాప్ దాదా హృదయ సింహాసనము మరియు మూడవది భవిష్య సింహాసనము. మీరు మూడు సింహాసనాలకు అధికారులు. మీ భవిష్య సింహాసనము కోసం కూడా ఇక్కడే అభ్యాసము చేస్తున్నారు. భవిష్యత్తు కోసం తయారీలు మరియు పురుషార్థాన్ని ఇప్పుడే చేస్తున్నారు. ఇప్పటి పురుషార్థము అనేక జన్మలకు రాజ్య భాగ్యాన్ని ఇప్పించేటటువంటిది. ఈ సమయములోనే మీ రాజ్య భాగ్య సంస్కారాలను ధారణ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి పురుషార్థమే భవిష్య రాజ్యానికి అధికారులుగా చేస్తుంది. కావున చెక్ చేసుకోండి, ఈ సమయములో ఉన్న మీ పురుషార్థము యథార్థముగా ఉందా? ఏ విధముగా భవిష్యత్తులో ఒకే రాజ్యముంటుందో, అలా ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి - మా మనసులో ఒకే రాజ్యము నడుస్తుందా? పురుషార్థములో ఒకే రాజ్యము ఉంటుందా? లేదా రాజ్యములో మాయ విఘ్నాలను కలిగిస్తుందా? ఒక్క రాజ్యానికి బదులుగా మాయ ప్రభావము పడటము లేదు కదా? రెండు రాజ్యాలైతే లేవు కదా? భవిష్యత్తు యొక్క విశేషతయే ఏక రాజ్యము. ఇప్పటి అభ్యాసమే భవిష్యత్తులో కొనసాగుతుంది. కావున చెక్ చేసుకోండి - ఇప్పుడు స్వరాజ్యము ఉందా? స్వరాజ్యములో ఎక్కడా మాయ జోక్యము చేసుకోవడము లేదు కదా? రెండు రాజ్యాలైతే లేవు కదా? ఒకవేళ రెండు రాజ్యాలు ఉన్నట్లయితే ఏక రాజ్యము యొక్క సంస్కారాలను ఎప్పుడు నింపుకుంటారు? భవిష్య రాజ్యములోని విశేషతయే ఏక రాజ్యము మరియు ఏక ధర్మము. అక్కడ ఏ ధర్మము ఉంటుంది? మీ విశేష ధారణ ఏమిటి? సంపూర్ణ పవిత్రత. కావున చెక్ చేసుకోండి, ఒకే ధర్మము ఉందా? మధ్యలో అపవిత్రత అనే రెండవ ధర్మము జోక్యము చేసుకోవడము లేదు కదా? దీనితో పాటు ఇది కూడా చెక్ చేసుకోండి, లా అండ్ ఆర్డర్ ఒక్కరిదే ఉంటుందా లేక మాయ కూడా మధ్యలో జోక్యము చేసుకుంటుందా? ఒక్కరి రాజ్యమే నిర్విఘ్నముగా జరుగుతుందా? మరొక విషయమేమిటంటే - ఆ రాజ్యములో సదా సుఖ-శాంతులు న్యాచురల్ గా ఉంటాయి, మరి ఇప్పుడు చూసుకోండి - మీ రాజ్యములో సదా సుఖ-శాంతులు ఉన్నాయా? ఎవ్వరూ మధ్యలో జోక్యము చేసుకోవడము లేదు కదా? స్వరాజ్యములో మాయ జోక్యము చేసుకుని అశాంతిని వ్యాపింపజేయడము లేదు కదా? స్వరాజ్యములో ఏదో ఒక సౌకర్యము లేక ప్రశంస యొక్క ప్రభావాన్ని అయితే మాయ తీసుకురావడము లేదు కదా? సదా సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, అతీంద్రియ సుఖము స్థిరముగా ఉంటున్నాయా? ఎందుకంటే భవిష్య రాజ్యములో సర్వ ప్రాప్తులు, సంపన్నత ఉంటాయి అని మీకు తెలుసు. వాటి కారణముగా సంతుష్టత కూడా ఉంటుంది. మరి ఇప్పుడు కూడా స్వరాజ్యము సంపన్నముగా ఉంటుందా లేదా ఏదైనా లోటు ఉంటుందా? ఎందుకంటే ఇప్పటి పురుషార్థములో ఒకవేళ లోపము ఉండిపోయినట్లయితే ఇక భవిష్య అఖండ రాజ్యానికి అధికారులుగా ఎలా అవ్వగలరు! ఆధారమంతా ఇప్పటి పురుషార్థముపైనే ఉంది. ఇప్పుడు ఏ లోపము ఉన్నా భవిష్యత్తులో సంపూర్ణ రాజ్యానికి అధికారులుగా అవ్వలేరు. బహుకాలపు ఈ స్వరాజ్య అభ్యాసము భవిష్య రాజ్యానికి అధికారులుగా చేస్తుంది. కావున మీ ఈ చెకింగ్ సదా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బహుకాలపు పురుషార్థము లేనట్లయితే ప్రారబ్ధము కూడా తక్కువ లభిస్తుంది, అందుకే బాప్ దాదా ఎప్పటికప్పుడు ఈ అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు, ఏమని అంటే - దీని కోసం ఇప్పుడు స్వయాన్ని సంపన్నముగా మరియు సంపూర్ణముగా తయారుచేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మధ్యమధ్యలో - పురుషార్థము నడుస్తూ ఉందిలే అని అన్నట్లయితే ఆ పురుషార్థము మధ్యలో ‘అయితే-అయితే’ అనేది రావడము లేదు కదా! ఇది అయితే అయిపోతుందిలే, ఇది అయితే చేస్తాములే, ఈ సంస్కారము 21 జన్మల అవినాశీ, అఖండ రాజ్యానికి అధికారులుగా అవ్వనివ్వదు.

బాప్ దాదా సదా కోసం అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు, చెక్ చేసుకోండి - ఒకవేళ ఏ విఘ్నము వచ్చినా కానీ, తుఫాను వచ్చినా కానీ, ఆ తుఫాను తోఫాగా (కానుకగా) అయిపోతుందా? ఆ తుఫాను, తుఫాను కాదు, కానుకగా అయిపోవాలి. ఏ విధమైన మాయా దాడి జరిగినా, మాయ అక్కడ దానిని దాడిలా అనుభవము చేయిస్తుంది, ఆ అనుభవము కూడా మనకు ఎలా అనుభవమవ్వాలంటే ఆ అనుభవము అనే మెట్లు మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి అన్నట్లు అనిపించాలి. దీని కోసం బాప్ దాదా చెప్తున్నారు, సదా మీ చార్టును మీరే చెక్ చేసుకోండి. ఎంతగా మీ చార్టును చెక్ చేసుకుంటారో అంతగానే చెక్ చేసుకుని ఛేంజ్ చేసుకుంటారు. మరి ప్రతి ఒక్కరూ మీ చార్టును చెక్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారా? ఎవరైతే రోజూ చెక్ చేసుకుంటున్నారో, వారు చేతులెత్తండి. ఎవరైతే రోజూ చెక్ చేసుకుంటున్నారో, వారు చేతులెత్తండి, అప్పుడప్పుడూ చేసుకునేవారు కాదు. రోజూ చార్టు చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి ఎందుకంటే సమయము యొక్క సూచనను బాప్ దాదా చాలాకాలం నుండి ఇస్తున్నారు. సమయాన్ని చూస్తున్నారు కూడా. మనుష్యుల మనసులలో చింత పెరుగుతుంది మరియు మీ మనసులో చింత కాదు, ప్రభు చింతన ఉంది. ప్రభు చింతన ఉన్న కారణముగా మీకు సదా తెలుసు - మేము నిమిత్తులము, నిర్మానచిత్తులము ఎందుకంటే చేయించేవారు బాబా. దీని కారణముగా మీ మనసులో చింత లేదు, చేయించేవారు చేయిస్తున్నారు అన్న స్మృతి సదా ముందుకు తీసుకువెళ్తూ ఉంది.

ఇప్పుడు విశేషముగా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి - ఈ సంగమయుగము యొక్క ఒక్కొక్క సెకండు, సమయము మరియు సంకల్పాలు శుభముగా నడుస్తున్నాయా? ఈ సమయానికి ఉన్న మహత్వాన్ని తెలుసుకోండి, ఒక్క సెకండు సెకండు కాదు, కానీ ఒక్క సెకండుకు కూడా విలువ ఉంది, మహత్వము ఉంది. అప్పుడప్పుడు పిల్లలు ఏమంటారంటే, సంకల్పాలు వచ్చాయి కానీ రెండు-నాలుగు సెకండ్లు మాత్రమే వచ్చాయి అని, కానీ సంగమ సమయానికి విలువ ఉంది, ఇప్పటి ఒక్క సెకండు ఒక్క గంటతో సమానము. ఈ సమయానికి అంతటి మహత్వము ఉంది, ఎందుకంటే బాప్ దాదా అన్నారు, అకస్మాత్తుగా ఏ సమయములోనైనా మీ ఫైనల్ పేపర్ రావచ్చు, బాప్ దాదా కూడా ముందు చెప్పరు, అందుకే ఈ సమయములోని అటెన్షన్ ఏమిటంటే, స్వయాన్ని సంపూర్ణముగా మరియు సంపన్నముగా చేసుకోవడము. బాప్ దాదా ఏవైతే సర్వ ఖజానాలను ఇచ్చారో, ఆ ఒక్కొక్క ఖజానాను సమయానికి కార్యములో వినియోగించండి. మీరు ఖజానాలకు యజమానులు. యజమాని యొక్క విశేషత ఏమిటంటే, ఏ సమయములో ఏ ఖజానా అవసరమో ఆ సమయములో ఆ ఖజానాను కార్యములో వినియోగిస్తారు. ఒకవేళ ఇముడ్చుకునే శక్తిని ఆజ్ఞాపిస్తే ఇముడ్చుకునే శక్తి కార్యములోకి వస్తుందా? ఎందుకంటే యజమాని అని ఎవరిని అంటారంటే, ఎవరైతే సమయానికి తమ ఖజానాలను కార్యములో వినియోగించగలరో వారిని. మరి ఇప్పుడు అందరూ స్వయముపై అంతటి అటెన్షన్ ను పెట్టాలి. అందరిలోనూ సంతోషము యొక్క ఖజానా సదా ముఖములో మరియు నడవడికలో కనిపించాలి. సంతోషము అవినాశీ తండ్రి యొక్క ప్రసాదము. అవినాశీ తండ్రి ఇచ్చిన కానుకను అవినాశీగా నిలుపుకోండి. సంతోషము గురించి ఏమంటూ ఉంటారంటే - సంతోషము వంటి ఔషధము ఇంకేదీ లేదు, సంతోషము వంటి ఖజానా ఇంకేదీ లేదు. ఎవరిలోనైతే సదా సంతోషము ఉంటుందో, అది వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. బాప్ దాదా ఇచ్చిన వరదానమేమిటంటే, సదా సంతోషముగా ఉండండి మరియు సదా సంతోషాన్ని పంచండి, ఎందుకంటే సంతోషాన్ని పంచినట్లయితే సంతోషము పెరుగుతుంది. మిగతా ఏ ఖజానాలను పంచినా అవి తరిగిపోతాయి, కానీ సంతోషము యొక్క ఖజానాను ఎంతగా పంచుతారో అంతగా అది పెరుగుతుంది. కావున చెక్ చేసుకోండి, సంతోషము యొక్క ఖజానా స్థిరముగా నిలిచి ఉందా?

ఇప్పుడు పిల్లలందరికీ భారత్ వారు కావచ్చు, విదేశాల వారు కావచ్చు, పిల్లలందరికీ బాప్ దాదా ఒక విషయములో విశేషమైన అభినందనలను తెలియజేస్తున్నారు, అది ఏ విషయము? దేశములో గాని, విదేశాలలో గాని అందరూ తమ ఉల్లాస-ఉత్సాహాలతో ఆత్మలకు బాబా సందేశాన్ని ఇచ్చారు. అందరూ తమ సంతోషముతో ఏదైతే కార్యాన్ని చేశారో, ఆ కార్యములో ప్రోగ్రామ్ ఒకటి చేసారు. ప్రతి చోట ఒక ప్రోగ్రామ్ నే చేసారు కానీ దానికి ఫలము వేయి రెట్లు పొందారు. బాప్ దాదాకు ఇదే సంకల్పము ఉంది, అదేమిటంటే, ఇప్పటి సమయమనుసారముగా ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, అవి మున్ముందు మరింత నాజూకుగా అవుతూ ఉంటాయి, అందుకే గ్రామములోనైనా లేక ఏ మూలన అయినా, మా తండ్రి వచ్చారు కానీ మాకు మీరు సందేశము ఇవ్వలేదు అన్న ఫిర్యాదు ఉండిపోకూడదు. అందుకే అందరూ ఏవైతే ఉల్లాస-ఉత్సాహాలతో ఈ సేవను చేశారో, బాప్ దాదా సంతోషిస్తున్నారు మరియు ఇలాగే పరస్పరములో కలుసుకుని ఇటువంటి ప్రోగ్రాములను తయారుచేస్తూ ఉండండి. బాప్ దాదా చూసారు, ఉల్లాస-ఉత్సాహాలను మరియు ధైర్యమును అందరూ తమ-తమ విధి అనుసారముగా కార్యములో వినియోగించారు కానీ ఇప్పుడైతే అందరూ చాలా బాగా చేసారు. మున్ముందు కోసం కూడా సమయమనుసారముగా ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి, ఏ మూల కూడా సందేశము లేకుండా మిగిలిపోకూడదు. ఇందులో స్వ పురుషార్థము కూడా బాగా అవుతుంది మరియు ఆత్మల కళ్యాణము కూడా జరుగుతుంది. అందరికీ ఈ ప్రోగ్రాములు మంచిగా అనిపించాయి కదా! మంచిగా అనిపించాయా! బాప్ దాదా పిల్లలందరికీ పదే-పదే ఇదే చెప్తున్నారు - ఆత్మల పట్ల దయార్ద్ర హృదయులుగా అవ్వండి. ఈ రోజుల్లో దుఃఖము, అశాంతి కారణముగా అందరూ - దయ చూపించండి, కృప చూపించండి అని మనసు లోతుల్లో నుండి అడుగుతున్నారు. మరి బాబాకు సహచరులు పిల్లలైన మీరే. బాబా పిల్లల నుండి, ఇప్పుడు ప్రతి బిడ్డ నుండి దయా హృదయపు పాత్రను చూడాలని కోరుకుంటున్నారు. ఈ దుఃఖమయ ప్రపంచము మారి సుఖమయ ప్రపంచము రావాలి అన్నది మీ అందరి ఉత్సాహము. మరి సుఖమయ ప్రపంచము రావడానికి, ఈ దుఃఖ-అశాంతులు వినాశనము అవ్వడానికి పరిస్థితులు మారుతున్నాయి. కావున ఈ రోజు బాబా ఇస్తున్న ఈ సందేశాన్నే గుర్తుంచుకోండి - ఇప్పుడు మనసా కావచ్చు, వాచా కావచ్చు, ముఖము మరియు నడవడికతో కావచ్చు, సేవ వేగాన్ని పెంచుతూ వెళ్ళండి. మీ రాజ్యాన్ని సమీపముగా తీసుకువస్తూ వెళ్ళండి. అచ్ఛా.

ఈ సారి బాప్ దాదాను కలవడానికి మొదటిసారిగా ఎవరైతే వచ్చారో, వారు చేతులెత్తండి. అచ్ఛా, చాలా మంది ఉన్నారు. అందరూ లేవండి. అభినందనలు. ఎంతైనా సమాప్తికి ముందే చేరుకున్నారు. కొత్త జన్మ తీసుకున్నారు. దీని కోసం ఇప్పుడు వచ్చిన పిల్లలకు అందరి తరఫు నుండి బాప్ దాదా మరియు నలువైపులా ఉన్న పిల్లల నుండి అభినందనలు, అభినందనలు. బ్రాహ్మణ పరివారాన్ని చూస్తే సంతోషము కలుగుతుంది కదా! కానీ ఎవరైతే ఇప్పుడు వచ్చారో వారికి బాప్ దాదా ఇదే చెప్తున్నారు - ఇప్పుడు చాలా సమయము గడిచిపోయింది, చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది, అందుకే పురుషార్థాన్ని తీవ్రతరం చేయండి. తీవ్ర పురుషార్థులు ముందుకు వెళ్తారు. నడవ వద్దు, ఎగరండి. ఎగిరే కళ యొక్క పురుషార్థాన్ని చేసినట్లయితే ఆలస్యముగా వచ్చినా సరే బాబా ఇచ్చే వారసత్వముపై తమ పూర్తి హక్కును తీసుకోవచ్చు. ప్రతి సెకండు సంతోషముగా ఉండండి మరియు అందరికీ సందేశము ఇవ్వాలి. అచ్ఛా.

ఈ రోజు బాప్ దాదా - స్వరాజ్య అధికారిగా అయి స్వరాజ్యపు రిజల్టును చెక్ చేసుకోండి అని ఏదైతే చెప్పారో, దానిని చెక్ చేసుకుని ఎటువంటి లోపాన్ని అయినా బహుకాలము నుండి ఛేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే బహుకాలము అఖండ రాజ్యము ఉండాలంటే దానికి బహుకాలపు పురుషార్థము అవసరము. వారు బహుకాలపు ప్రారబ్ధానికి స్వతహాగానే అధికారులుగా అవుతారు, అందుకే అండర్ లైన్ చేసుకోండి - బహుకాలపు పురుషార్థము ఉండాలి. చెకింగ్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి.

నలువైపులా ఉన్న బాప్ దాదా హృదయ సింహాసనాధికారులైన పిల్లలు ప్రతి ఒక్కరికీ బాప్ దాదా ప్రతిరోజూ అమృతవేళ విశేషముగా శక్తిని పంచుతారు. అమృతవేళలో విశేషముగా వరదానాలను, శక్తులను పంచుతారు. ఎవరైతే అమృతవేళలోని శక్తిని, విశేష వరదానాలను స్వీకరిస్తారో, వారు విశేషముగా తీవ్ర పురుషార్థులు అవుతారు. అమృతవేళకు మహత్వాన్ని ఇవ్వడము అంటే బాప్ దాదా హృదయ సింహాసనాధికారులుగా సదా ఉండటము. కొంతమంది పిల్లలకు అటెన్షన్ ఉంది మరియు బాప్ దాదా వారికి రోజూ - వాహ్ పిల్లలు వాహ్ అని సర్టిఫికేట్ ను ఇస్తారు!

నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థీ పిల్లలకు, ప్రతి సమయము బాప్ దాదాను తమ సహచరునిగా చేసుకుని కంబైన్డుగా ఉండే అభ్యాసమున్న పిల్లలకు బాప్ దాదా విశేషముగా వరదానాన్ని ఇస్తున్నారు - సదా ఎగురుతూ వెళ్ళండి మరియు ఇతరులకు కూడా ఎగిరే సహయోగాన్ని అందించి ఎగిరేలా చేస్తూ ఉండండి. అందరూ విజయులే మరియు విజయానికి ఫలముగా అన్నివేళలా బాప్ దాదా నుండి దీవెనలు ప్రాప్తిస్తాయి. అమరులుగా అయి అందరికీ అమృతాన్ని తాగిస్తూ ఉండండి. నలువైపులా ఉన్న పిల్లలు బాప్ దాదా ఎదురుగా ఉన్నారు. ప్రతి బిడ్డ పట్ల బాప్ దాదాకు మనసులో ప్రేమ ఉంది ఎందుకంటే ప్రతి బిడ్డలో ఏదో ఒక విశేషత ఉంది. ఇప్పుడు సర్వ విశేషతలతో స్వయాన్ని విశేష ఆత్మగా చేసుకుని ముందుకు సాగుతూ వెళ్ళండి. బాప్ దాదా తరఫున ప్రతి బిడ్డ పర్సనల్ గా పదమాల రెట్లు ప్రియస్మృతులను స్వీకరించండి. అచ్ఛా, ఇప్పుడిక కలుస్తూనే ఉంటాము. నమస్తే.

దాదీలతో:- అందరూ బాగా తిరిగి వచ్చారు. ఈ రోజుల్లో అశాంతి పెరుగుతూ ఉంటుంది కావున రోజంతా ఆందోళనలో ఉంటూ ఉంటారు మరియు శాంతి వైబ్రేషన్లు శాంతిని కలిగిస్తాయి కావున సంతోషపడతారు. ఉదాహరణకు ఎవరైనా అలసిపోయి ఉంటే, వారికి అరగంట విశ్రాంతి లభించినా సంతోషిస్తారు. అందరూ మంచిగా చేసారు. అన్ని చోట్ల, చిన్నవారైనా లేక పెద్దవారైనా, అందరూ బాగా చేసారు. ఉల్లాసము ఎక్కడైతే ఉంటుందో, అక్కడ ఖర్చు యొక్క విషయమేమీ ఉండదు. ఇంతమంది ఆత్మలకు సందేశమైతే లభించింది. మీ ఫిర్యాదైతే సమాప్తమైపోయింది. బాగుంది. ఇలా మధ్యమధ్యలో ప్రోగ్రాములు చేస్తూ ఉండండి. ప్రతి పట్టణము తమ అనుసారముగా ఎలా చేసినా అది మంచిదే.

డబుల్ విదేశీ పెద్దక్కయ్యలతో:- బాప్ దాదాకు గ్రూపుల వారీగా పిలిచి రిఫ్రెష్ చెయ్యడము మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ చాలా దూరదూరాలలో ఉంటారు. దగ్గరకు వచ్చినప్పుడు ఇతరుల గుణాలు కనిపిస్తాయి. దూరదూరాలలో ఉన్నప్పుడు తెలియదు. ఒకరిని చూసి ఇతరులకు కూడా ఉత్సాహము వస్తుంది. ఆబూలో ఈ ప్రోగ్రామ్ బాగా అనిపిస్తుంది మరియు ఇతరులలో ఉత్సాహాన్ని నింపి సంగఠనను పక్కా చేస్తూ ఉంటారు, ఇది బాగుంది. మంచిది. అంతా బాగానే నడుస్తుంది కదా!

ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకోవడము ద్వారా ముందుకు వెళ్తారు. సమయాన్ని కేటాయిస్తారు కదా. మీ సేవను వదిలిపెట్టి సమయాన్ని మనస్ఫూర్తిగా ఇస్తారు. మీ కార్యాన్ని పూర్తి చేసారు, సఫలత లభించింది, ఇప్పుడిక వెళ్తే వెళ్ళండి. అందరూ మంచి సహాయాన్ని అందించారు. విదేశాలలో కూడా చేసారు, ఇండియాలో కూడా చేసారు. అచ్ఛా!

యు.పి. జోన్ సేవాధారులతో:- బాప్ దాదా అన్ని జోన్ల వారికి చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ మీ జోన్ లో ఒక గ్రూపును ఎలా తయారుచెయ్యండి అంటే, ఆ గ్రూపులో అన్ని వర్గాలకు చెందినవారు ఉండాలి. సేవ కొరకు మీ వర్గాలు తయారై ఉన్నాయి మరియు ప్రతి జోన్ వారు తమ ఏరియాలో ప్రతి వర్గము యొక్క సేవను చేస్తూ ఉన్నారు, చేస్తూ కూడా ఉంటారు, కానీ ప్రతి జోన్ లోనూ సేవ కోసం ఎటువంటి గ్రూపు ఉండాలంటే, అందులో ప్రతి వర్గానికి చెందినవారు ఒకరు ఉండాలి మరియు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా అక్కడ ఆ గ్రూపు తమ వర్గమువారికి విశేష ఆహ్వానమును ఇవ్వండి. మాకైతే సందేశము లభించలేదు అని ఏ వర్గమువారు కూడా ఫిర్యాదు చేయకూడదు. వెరైటీ గ్రూపుగా అయిన ప్రతి ఒక్కరూ తమ వర్గము యొక్క సేవను కూడా పెంచాలి, అలాగే ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానము ద్వారా తమకు ఏం లభించింది మరియు ఏం అనుభవము చేస్తున్నారు అని తమ-తమ అనుభవాలను వినిపించాలి. ప్రతి జోన్ లోనూ ఇటువంటి సేవ గ్రూపును తయారుచేయండి. భాషణ చెయ్యటానికి అంత సమయము లభించకపోయినా కానీ వారిని ఫంక్షన్ జరిగే సమయములో వెనక లైన్ లో కూర్చోబెట్టి స్టేజ్ సెక్రటరీ వారి పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరి అనుభవమునైనా వినిపించగలిగితే వినిపించవచ్చు. కుటుంబములో ఉంటూ తమ-తమ కార్యాలను చేసుకుంటూ తమ జీవితము ఎలా గడిచింది, అది ఎలా మారింది అన్న అనుభవాన్ని సమయము ఉంటే అవకాశము తీసుకుని వినిపించాలి. కనుక సేవను చేస్తూ ఉండే అటువంటి విశేషమైన మైక్ ను తయారుచేయండి. మంచిది, యు.పి.వారు విశేషముగా బ్రహ్మాబాబా పాలనను తీసుకునే అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. యు.పి.లో బ్రహ్మా పేరుతో స్మృతిచిహ్నము కూడా ఉంది. జగదంబ, బ్రహ్మాబాబా యొక్క పాలనను తీసుకోవడము యు.పి.వారి భాగ్యము. అది పాలన ధరణి. భాగ్యసితారను బ్రహ్మాబాబా మరియు జగదంబ యు.పి.కి వరదానముగా ఇచ్చారు. మంచిది. ఇప్పుడు బాబా చూసారు, రోజురోజుకు సేవా స్థానాలు మరియు ఉపసేవాకేంద్రాలు, గీతా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, అవి ముందు కంటే ఇప్పుడు మంచి వృద్ధిని పొందాయి, అందుకే బాప్ దాదా ప్రత్యేకముగా అభినందనలను ఇస్తున్నారు - మందుకు వెళ్తూ ఉండండి మరియు సంఖ్యను వృద్ధి చేయటములో, సందేశాన్ని ఇవ్వటములో నంబర్ వన్ అవ్వండి. మంచిది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. మరింత వృద్ధి చేస్తూ వెళ్ళండి. టీచర్లకు అభినందనలు. వృద్ధిని చేస్తున్నారు మరియు దీని కంటే కూడా ఎక్కువలో ఎక్కువ వృద్ధిని చేస్తూ ఉండండి. అచ్ఛా!

వరదానము:-
సంగఠనలో సహయోగ శక్తి ద్వారా విజయులుగా అయ్యే సర్వుల శుభచింతక భవ

సంగఠనలో ఒకవేళ ప్రతి ఒక్కరూ, పరస్పరంలో సహాయకులుగా, శుభచింతకులుగా అయి ఉన్నట్లయితే సహయోగ శక్తి యొక్క ముట్టడి ఎంతో అద్భుతము చేయగలదు. పరస్పరములో ఒకరికొకరు శుభచింతకులుగా, సహయోగులుగా అయి ఉన్నట్లయితే ఈ ముట్టడి లోపలకి రాగలిగే ధైర్యము మాయకు ఉండదు. కానీ సంగఠనలో సహయోగ శక్తి ఎప్పుడు వస్తుందంటే, ఎన్ని విషయాలను సహనము చేయవలసి వచ్చినా కానీ ఎదుర్కునే చూపిస్తాము, విజయులుగా అయ్యే చూపిస్తాము అన్న ఈ దృఢ సంకల్పము చేసినప్పుడు.

స్లోగన్:-
ఏ కోరిక అయినా సరే మంచిగా అవ్వనివ్వదు, అందుకే కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

ఏ విధముగా తీపి పదార్థాన్ని తిన్నప్పుడు మరియు తినిపించినప్పుడు కొద్ది సమయము కోసం నోరు తీపి అవుతుందో, సంతోషపడతారో, అదే విధముగా స్వయమే మధురముగా అయిపోతే ఇక సదా నోటిలో మధురమైన మాటలే ఉంటాయి. ఇటువంటి మధురమైన మాటలు స్వయాన్ని కూడా సంతోషపరుస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. ఈ విధితో సదా సర్వుల నోటిని మధురముగా చేస్తూ ఉండండి, సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు ఉండాలి.