05-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఎప్పుడైతే ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము ఉంటుందో, అప్పుడే తండ్రితో పాటు కలిసి వెళ్ళగలరు’’

ప్రశ్న:-
భగవంతుడు సమర్థుడు అయినప్పటికీ కూడా వారి ద్వారా రచించబడిన యజ్ఞములో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి?

జవాబు:-
ఎందుకంటే రావణుడు భగవంతుని కన్నా చురుకైనవాడు. అతని రాజ్యాన్ని లాక్కున్నప్పుడు, తప్పకుండా అతను విఘ్నాలను కలిగిస్తాడు. ప్రారంభము నుండి మొదలుకుని, డ్రామానుసారముగా, ఈ యజ్ఞములో విఘ్నాలు కలుగుతూనే వచ్చాయి, అవి కలగాల్సిందే. మనము పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాము కావున తప్పకుండా పతిత మనుష్యులు విఘ్నాలను కలిగిస్తారు.

పాట:-
ఓ దూరపు బాటసారీ...

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ విన్నారు. ఏ విధముగా వేద-శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గపు దారిని తెలియజేస్తాయో, అలాగే పాట కూడా కొద్దిగా దారిని తెలియజేస్తుంది. వారైతే ఏమీ అర్థం చేసుకోరు. శాస్త్రాల కథలు మొదలైనవి వినడమనేది చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. దూరదేశపు బాటసారి అని ఎవరిని అంటారు అనేది ఇప్పుడు పిల్లలకు తెలుసు. నేను కూడా దూరపు బాటసారిని, నా ఇల్లు శాంతిధామము - అని ఆత్మకు తెలుసు. మనుష్యులకు ఈ విషయాలు అర్థం కాకపోతే ఏమీ అర్థం కానట్లే. తండ్రిని తెలుసుకోకపోతే ఎవరూ సృష్టి చక్రాన్ని తెలుసుకోలేరు. నేను తాత్కాలికముగా జీవాత్మగా అవుతాను, మీరు ఎల్లప్పుడూ జీవాత్మలుగా అవుతారు అని శివబాబా చెప్పారని - ఆత్మ అర్థం చేసుకుంటుంది. నేను కేవలం సంగమములోనే తాత్కాలికముగా జీవాత్మగా అవుతాను, అది కూడా మీరు అయినట్లుగా అవ్వను. నేను నా పరిచయాన్ని ఇచ్చేందుకని ఈ శరీరములో ప్రవేశిస్తాను. లేకపోతే మీకు నా పరిచయము ఎలా లభిస్తుంది? ఆత్మిక తండ్రి ఒక్కరేనని, వారిని శివబాబా లేదా భగవంతుడని అంటారని తండ్రి అర్థం చేయించారు. వారి గురించి ఇతరులెవరికీ తెలియదు. ఇక్కడ పవిత్రత యొక్క బంధనము కూడా ఉంది. అన్నింటి కన్నా పెద్ద బంధనము స్వయాన్ని ఆత్మగా భావించడము. ఆ దూరపు బాటసారి అయిన పతిత-పావనుడిని భక్తి మార్గములో తలచుకుంటారు. ఆ ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను అందరినీ తీసుకువెళ్తాను, ఎవరినీ వదిలి వెళ్ళను, అందరూ అయితే తిరిగి వెళ్ళాల్సిందే. ప్రళయము కూడా జరగదు. భారత ఖండమైతే తప్పకుండా ఉంటుంది. భారత ఖండము ఎప్పుడూ వినాశనము అవ్వదు. సత్యయుగము ఆదిలో కేవలం భారత ఖండము మాత్రమే ఉంటుంది. కల్పము యొక్క సంగమములో తండ్రి వచ్చినప్పుడు, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చెయ్యాల్సి ఉంటుంది. మిగిలిన ధర్మాలన్నీ వినాశనము అవ్వనున్నాయి. మీరు కూడా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయడములో సహాయము చేస్తున్నారు. బాబా, మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండని అంటారని పాటలో విన్నారు. తండ్రి అంటారు - ఎప్పటివరకైతే పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలగదో, అప్పటివరకు ఎవరూ ఈ విధముగా నాతో పాటు వెళ్ళలేరు. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు, పాతదాని నుండి మనసు తెగిపోతుంది. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని, ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలని మీకు కూడా తెలుసు. ఎప్పటివరకైతే సతోప్రధానముగా అవ్వరో, అప్పటివరకు సతోప్రధాన దేవీ-దేవతలుగా అవ్వలేరు, అందుకే బాబా పదే-పదే అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. సద్గతిని ఇచ్చే దూరపు బాటసారి ఒక్కరే, వారు వచ్చి ఉన్నారు, వారి గురించి ప్రపంచానికి తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేసారు. మనము శివబాబా సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడు - మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నామని భావిస్తారు, అంటే ఇది ఫ్యామిలీ అయినట్లు. ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. ఎవరికైనా చాలామంది పిల్లలుంటే, అది ఒక పెద్ద సైన్యమైపోతుంది. శివబాబా పిల్లలైన, ఇంతమంది బి.కె సోదరీ-సోదరులు ఎవరైతే ఉన్నారో, వీరందరిదీ కూడా ఒక పెద్ద సైన్యమైపోతుంది. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నాము - అని బ్రహ్మాకుమార-కుమారీలందరికీ తెలుసు. పాండవులు-కౌరవులు జూదమాడారని, సామ్రాజ్యాన్ని పణంగా పెట్టారని శాస్త్రాలలో చూపిస్తారు. ఇప్పుడు రాజ్యమనేది కౌరవులకు లేదు, పాండవులకు లేదు. కిరీటము మొదలైనవేవీ కూడా లేవు. వారిని రాజ్యము నుండి బహిష్కరించారని, వారు వెళ్ళి ఆయుధాలు మొదలైనవి దాచిపెట్టారని చూపిస్తారు. అవన్నీ కల్పిత కథలు. పాండవుల రాజ్యము లేదు, కౌరవుల రాజ్యము లేదు. వారికి పరస్పరంలో యుద్ధము కూడా జరగలేదు. యుద్ధము రాజుల మధ్యన జరుగుతుంది, వీరైతే పరస్పరంలో సోదరులు. కౌరవులకు మరియు యాదవులకు మధ్యన యుద్ధము జరిగింది. అంతేకానీ సోదరులు ఒకరినొకరు ఎలా అంతం చేసుకుంటారు. పాండవులు మరియు కౌరవులు యుద్ధము చేసుకున్నారని, 5 పాండవులు మరియు ఒక కుక్క మిగిలారని, వారంతా కూడా పర్వతాల పైకి వెళ్ళి కరిగిపోయారని చూపిస్తారు. ఇక ఆట సమాప్తమైపోయినట్లే. అలా అయితే రాజయోగానికి అర్థమే లేనట్లు.

తండ్రి కల్ప-కల్పము వచ్చి ఏక ధర్మ స్థాపన చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఓ పతిత-పావన బాబా రండి, వచ్చి పతితుల నుండి పావనులుగా చేయండి అని పిలుస్తారు కూడా. సత్యయుగములో సూర్యవంశ రాజధాని మాత్రమే ఉంటుంది. బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతోంది. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున వారి డైరెక్షన్లపై నడుచుకోవాలి. కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉండాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండమని కన్యలకైతే చెప్పరు. వారు ఎలాగూ పవిత్రమైనవారే. ఈ మాట గృహస్థుల కొరకు చెప్పడము జరుగుతుంది. కుమారులు మరియు కుమారీలైతే అసలు వివాహమే చేసుకోకూడదు. లేకపోతే వారు కూడా గృహస్థులుగా అయిపోతారు. అక్కడక్కడ గంధర్వ వివాహాల గురించి వర్ణన ఉంది. ఒకవేళ కన్యను కొడుతూ ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో గంధర్వ వివాహము చేయించడము జరుగుతుంది. వాస్తవానికి దెబ్బలనైనా కూడా సహించాలి కానీ అధర్ కుమారీలుగా మాత్రం అవ్వకూడదు. బాల బ్రహ్మచారులకు చాలా మంచి పేరుంటుంది. వివాహము చేసుకుంటే హాఫ్ పార్ట్నర్ అయిపోతారు. మీరు పవిత్రముగా ఉండండి అని కుమారులకు చెప్పడము జరుగుతుంది. గృహస్థ వ్యవహారములో ఉన్నవారికి - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా అవ్వండి అని చెప్పడము జరుగుతుంది. వారికే శ్రమ ఉంటుంది. వివాహము చేసుకోకపోతే బంధనాలు ఉండవు. కన్యలైతే చదువుకోవాలి మరియు జ్ఞానములో చాలా దృఢముగా ఉండాలి. ఇక్కడ మైనర్ గా ఉన్న చిన్న కుమారీలను మనం తీసుకోలేము. వారు తమ ఇంటిలో ఉంటూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు జ్ఞానములో ఉన్నట్లయితే మైనర్ కుమారీలను తీసుకోవచ్చు. ఇది స్కూళ్ళకే స్కూలు, ఇళ్ళకే ఇల్లు మరియు సత్సంగాలకే సత్సంగము. సత్ అంటే ఒక్క తండ్రి, వారినే ఓ దూరపు బాటసారి అని అంటారు. ఆత్మ సుందరముగా అవుతుంది. తండ్రి అంటారు - బాటసారినైన నేను సదా సుందరముగా ఉంటాను, పవిత్రముగా ఉంటాను, నేను వచ్చి ఆత్మలందరినీ పవిత్రముగా, సుందరముగా తయారుచేస్తాను, ఇటువంటి బాటసారి ఇంకెవరూ ఉండరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను రావణ రాజ్యములోకి వచ్చాను, ఈ శరీరము కూడా పరాయిది. ఇది నా శరీరమని మీ ఆత్మ అంటుంది. బాబా అంటారు - ఇది నా శరీరము కాదు, ఇది ఇతని శరీరము, ఈ పతిత శరీరము నాది కాదు. వీరి అనేక జన్మల అంతిమ జన్మలోనే వస్తాను. ఎవరైతే నంబర్ వన్ పావనముగా ఉండేవారో, వారే లాస్ట్ నంబర్ గా అవుతారు అనగా అంతిమములో వికారీగా అవుతారు. మొదటి నంబర్ వారు 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు, ఇప్పుడు ఏ కళ మిగలలేదు. అందరూ పతితముగానే ఉన్నారు. తండ్రి దూరదేశపు బాటసారి అయినట్లే కదా. ఆత్మలైన మీరు కూడా బాటసారులే. ఇక్కడికి వచ్చి మీరు పాత్రను అభినయిస్తారు. ఈ సృష్టి చక్రము గురించి ఎవరికీ తెలియదు. ఎవరు ఎన్ని శాస్త్రాలు మొదలైనవి చదివినా కానీ ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను ఈ తనువులో ప్రవేశించి ఈ ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తాను. అక్కడ మనుష్యులు, మనుష్యులకు శాస్త్రాల జ్ఞానాన్ని ఇస్తారు. వారు భక్తులు. సద్గతిదాత అయితే ఒక్కరే. వారే జ్ఞాన సాగరుడు, వారి గురించి తెలియని కారణముగా దేహాభిమానము వచ్చేస్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి అని వారెవరూ అర్థం చేయించరు. ఆత్మ చదువుకుంటుంది. ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేయించరు ఎందుకంటే దేహాభిమానము ఉంది. ఇప్పుడు దూరదేశపు బాటసారి అని శివబాబానే అంటారు. మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసామని మీకు తెలుసు.

తండ్రి అంటారు - పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదని 5 వేల సంవత్సరాల క్రితం కూడా అర్థం చేయించాను. గీతలో పిండిలో ఉప్పు అంత మాత్రమే ఏదో ఉందని నాకు తెలుసు. ఇది అదే గీతా అధ్యాయము, అదే మహాభారత యుద్ధము, అదే మన్మనాభవ-మధ్యాజీభవ యొక్క జ్ఞానము. నన్నొక్కరినే స్మృతి చేయండి. యుద్ధము కూడా తప్పకుండా జరిగింది. పాండవులకు విజయము లభించింది. విష్ణువు యొక్క విజయ మాల అని అంటూ ఉంటారు. పాండవులు కరిగిపోయారని శాస్త్రాలలో చూపించారు. మరి మాల ఎక్కడ నుండి తయారయ్యింది. మనము విష్ణు మాలగా తయారయ్యేందుకు ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పైన పతిత-పావనుడైన తండ్రి ఉన్నారు. వారి స్మృతిచిహ్నము కావాలి కదా. భక్తి మార్గములో స్మృతిచిహ్నాలు మహిమ చేయబడతాయి. కొందరు 8 మణుల మాలను, కొందరు 108 మణుల మాలను, కొందరు 16,108 మణుల మాలను తయారుచేసారు. మీ ఎక్కే కళ ద్వారా సర్వులకు మేలు జరుగుతుందని పాడుతారు. మనది ఎక్కే కళ అని ఇప్పుడు మీకు తెలుసు. మనము మన సుఖధామానికి వెళ్ళిపోతాము, మళ్ళీ మనం అక్కడి నుండి కిందకు ఎలా దిగుతాము, 84 జన్మలు ఎలా తీసుకుంటాము, ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మర్చిపోకూడదు. మన దుఃఖాలన్నింటినీ దూరం చేసి, శాపాన్ని తొలగించి, సుఖపు వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చారు. రావణుడి శాపముతో అందరికీ దుఃఖము కలుగుతుంది. కనుక ఇప్పుడు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. సూర్యవంశీయులైన మనము భారత్ లో రాజ్యము చేసామని మీకు తెలుసు. భారత్ లోనే శివబాబా వస్తారు. భారత్ యే స్వర్గముగా ఉండేది, ఇది పదే-పదే బుద్ధితో గుర్తుచేసుకోవాలి. ఎవరైతే 84 జన్మల చక్రములో తిరిగి ఉండరో, వారు ధారణ చేయరు, చేయించరు. అటువంటివారు 84 జన్మలు తీసుకోలేదని అర్థం చేసుకోవడము జరుగుతుంది, వారు ఆలస్యముగా వస్తారు, వారు స్వర్గములోకి రారు. పై నుండి కిందకు ముందుగా రావడమనేది మంచిదే కదా. కొత్త ఇంటిలో ముందు స్వయం ఉంటారు, ఆ తర్వాత అద్దెకు ఇస్తారు. అప్పుడది సెకండ్ హ్యాండ్ అయినట్లు కదా. సత్యయుగము కొత్త ప్రపంచము. త్రేతాయుగాన్ని సెకండ్ హ్యాండ్ అని అంటారు. కనుక, మనము కొత్త ప్రపంచమైన స్వర్గములోకి వెళ్ళాలని ఇప్పుడు బుద్ధిలోకి వస్తుంది. పురుషార్థము చేయాలి, ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. మాలలో ఎవరెవరు కూర్చబడతారు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా నేరుగా, నీవు మాలలోకి రావు అని చెప్తే హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అందుకే పురుషార్థము చేయమని చెప్పడము జరుగుతుంది. నా బుద్ధియోగము భ్రమించడము లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. మీకు శివబాబా పట్ల ఎంతో ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది. మేము బాప్ దాదా వద్దకు వెళ్తామని, శివబాబా నుండి దాదా ద్వారా వారసత్వము తీసుకోవడానికి వెళ్తామని అంటారు. ఇటువంటి తండ్రి వద్దకైతే చాలా సార్లు వెళ్ళాలి. కానీ గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. కొందరు చాలా ధనవంతులుగా ఉంటారు కానీ అంత తీరిక ఉండదు, పూర్తి నిశ్చయము ఉండదు. లేదంటే నెలకొకసారి, రెండు నెలలకొకసారి వచ్చి రిఫ్రెష్ అవ్వచ్చు. వారికి పదే-పదే ఆకర్షణ కలుగుతుంది. సూదికి తుప్పు పట్టి ఉన్నట్లయితే అయస్కాంతము అంతగా ఆకర్షించదు. ఎవరి యోగమైతే పూర్తిగా ఉంటుందో, వారికి వెంటనే ఆకర్షణ కలుగుతుంది, పరుగు పరుగున వస్తారు. ఎంతగా తుప్పు తొలగుతూ ఉంటుందో, అంతగా మేము అయస్కాంతాన్ని కలుసుకోవాలనే ఆకర్షణ కలుగుతుంది. మీరు కొట్టండి, ఏమైనా చేయండి... మేము మీ ద్వారము నుండి ఎప్పటికీ వెళ్ళము... అని పాట ఉంది. కానీ ఆ అవస్థ అయితే చివరిలో ఉంటుంది. తుప్పు తొలగి ఉంటే ఆ అవస్థ ఉంటుంది. తండ్రి అంటారు - ఓ ఆత్మలారా, మన్మనాభవ. మీరు ఉండటము మీ గృహస్థ వ్యవహారములోనే ఉండండి, మీరు పారిపోయి వచ్చి ఇక్కడ కూర్చుండిపోవాలని కాదు. మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు సాగరము వద్దకు రావాలి, మళ్ళీ సేవ కోసం వెళ్ళాలి. బంధనాలు ఎప్పుడైతే సమాప్తమవుతాయో, అప్పుడు సేవ కోసం వెళ్ళగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలను సంభాళించాలి. తండ్రి స్మృతిలో ఉండాలి, పవిత్రముగా అవ్వాలి.

తండ్రి అర్థం చేయించారు - జ్ఞాన యజ్ఞములో అనేక రకాల విఘ్నాలు కలుగుతాయి. ఈశ్వరుడైతే సమర్థుడు కదా, మరి విఘ్నాలు ఎందుకు వస్తాయి అని అడుగుతారు. రావణుడు భగవంతుని కన్నా చురుకైనవాడని మనుష్యులకు తెలియదు. అతడి రాజ్యాన్ని లాక్కోవడము జరుగుతుంది కనుక అనేక రకాల విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. డ్రామా ప్లాన్ అనుసారముగా మళ్ళీ విఘ్నాలు కలుగుతాయి. ప్రారంభము నుండి మొదలుకుని పతితుల విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి. శ్రీకృష్ణునికి 16,108 మంది పట్టపు రాణులు ఉండేవారని, సర్పం కాటేసిందని, రాముని సీత అపహరించబడ్డారని శాస్త్రాలలో కూడా వ్రాశారు. ఇప్పుడు రావణుడు స్వర్గములోకి ఎక్కడి నుండి వస్తాడు. చాలా అసత్యము ఉంది. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. ఎవరైతే వారసత్వము తీసుకునేవారు ఉంటారో, వారు మాత్రమే వచ్చి అర్థం చేసుకుంటారని మనుష్యులకు తెలియదు. కావున ఈ జ్ఞాన యజ్ఞములో అసురుల విఘ్నాలు కలుగుతాయి. పతితులను అసురులని అంటారు. ఇది రావణ సాంప్రదాయము. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. రావణ రాజ్యము నుండి దూరంగా వచ్చేశారు కానీ దాని ప్రభావము ఎంతోకొంత ఉంటుంది. మేము వెళ్తున్నాము అనే జ్ఞానము బుద్ధిలో ఉంది. కూర్చోవడమైతే ఇక్కడే కూర్చుని ఉన్నారు. బుద్ధిలో జ్ఞానముంది. ఇక్కడే కూర్చున్నారు కానీ దీని పట్ల మీకు వైరాగ్యము ఉంది. ఈ ఛీ-ఛీ ప్రపంచము శ్మశానవాటికగా అవ్వనున్నది. రకరకాల పాయింట్లతో అర్థం చేయించడము జరుగుతుంది. వాస్తవానికైతే ఒకటే పాయింట్ ఉంది - మన్మనాభవ. బాబా, మేము బంధనములో ఉన్నాము - అని ఎంతమంది నుండి ఉత్తరాలు వస్తాయి. ద్రౌపది అనేవారు ఒక్కరే కాదు, వేలాదిమంది ఉన్నారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఎవరైతే కల్పక్రితం పుష్పాలుగా అయ్యారో, వారే వెలువడుతారు. గార్డెన్ ఆఫ్ అల్లా (భగవంతుని పూదోట) యొక్క స్థాపన ఇక్కడ జరుగుతుంది. కొంతమంది ఎటువంటి మంచి-మంచి పుష్పాలుగా ఉంటారంటే, వారిని చూడగానే ప్రశాంతముగా అనిపిస్తుంది. కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ (పుష్పాల రాజు) అనే పేరు ఉంది. వాటిని 5 రోజులు ఉంచినా కూడా వికసించే ఉంటాయి, సుగంధము వ్యాపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో మరియు స్మృతిని ఇప్పిస్తారో, వారి సుగంధము వ్యాపిస్తుంది. వారు సదా సంతోషముగా ఉంటారు. అటువంటి మధురాతి-మధురమైన పిల్లలను చూసి తండ్రి సంతోషిస్తారు. వారి ఎదురుగా బాబా యొక్క జ్ఞాన డ్యాన్స్ చాలా బాగా జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన-యోగాలలో దృఢముగా అవ్వాలి. ఒకవేళ ఏ బంధనము లేకపోతే, తెలిసి-తెలిసి బంధనాలలో చిక్కుకోకూడదు. బాల బ్రహ్మచారులుగా ఉండాలి.

2. ఇప్పుడు మనది ఎక్కే కళ, బాబా మన దుఃఖాలన్నింటినీ దూరం చేయడానికి, శాపాన్ని తొలగించి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ అపారమైన సంతోషములో ఉండాలి. నా బుద్ధియోగము ఎక్కడా భ్రమించడము లేదు కదా అని చెక్ చేసుకోవాలి.

వరదానము:-
ఇముడ్చుకునే మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మిక సేవాధారీ భవ

ఆత్మిక సేవాధారులకు సేవ తప్ప మరేదీ తోచదు. వారు మనసా-వాచా-కర్మణా ఒక్క క్షణము కూడా సేవ నుండి రెస్ట్ తీసుకోరు, అందుకే వారు బెస్ట్ గా అయిపోతారు. వారు సేవలలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా ఇదే గుర్తుంచుకుంటారు - ఇముడ్చుకోవడము మరియు ఎదుర్కోవడము, ఇదే మా లక్ష్యము. వారు తమ పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు మరియు మాయను ఎదుర్కుంటారు, అంతేకానీ దైవీ పరివారాన్ని కాదు. ఇటువంటి పిల్లలెవరైతే జ్ఞాన స్వరూపులుగా ఉండటముతోపాటుగా శక్తి స్వరూపులుగా కూడా ఉంటారో, వారినే ఆత్మిక సేవాధారులు అని అంటారు.

స్లోగన్:-
చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి, వాతావరణాన్ని శక్తిశాలిగా తయారుచేయండి.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

ప్రపంచములోని మనుష్యులు జీవించి ఉన్నా కానీ నిరాశ అనే చితిపై కూర్చుని ఉన్నారు. అటువంటి ఆత్మలను మరజీవాగా చేయండి, కొత్త జీవితాన్ని దానమివ్వండి. మీ భాగ్యశాలి, హర్షిత ముఖము ద్వారా వారికి మానవ జీవితములో జీవించడాన్ని నేర్పించండి, మిమ్మల్ని చూసి వారిలో ధైర్యము, ఉల్లాస-ఉత్సాహాలు రావాలి. దీని కోసం మీ స్వభావాన్ని సరళముగా తయారుచేసుకోండి మరియు సదా కమలపుష్ప సమానమైన స్థితి అనే ఆసనముపై కూర్చుని డబల్ లైట్ స్థితిలో స్థితులవ్వండి.