05-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మిమ్మల్ని సుందరమైన దేవీ-దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు, ఆ సౌందర్యానికి ఆధారము పవిత్రత’’

ప్రశ్న:-
ఆత్మిక దీపముపై బలిహారమయ్యే దీపపు పురుగులు ఎవరైతే ఉన్నారో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
బలిహారమయ్యే దీపపు పురుగులు:- 1. దీపము ఎవరో, ఎలా ఉన్నారో వారిని యథార్థ రూపములో తెలుసుకుంటారు మరియు స్మృతి చేస్తారు, 2. బలిహారమవ్వడము అనగా తండ్రి సమానముగా అవ్వడము, 3. బలిహారమవ్వడము అనగా తండ్రి కన్నా ఉన్నతమైన రాజ్యాధికారులుగా తయారవ్వడము.

పాట:-
సభలో జ్యోతి వెలిగింది...

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట లోని లైన్ ను విన్నారు. ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఆత్మిక తండ్రి. వారు ఒక జ్యోతి కూడా. వారికి ఎన్నో పేర్లు పెట్టారు. తండ్రి యొక్క మహిమను కూడా ఎంతగానో చేస్తారు. ఇది కూడా పరమపిత పరమాత్మ యొక్క మహిమ కదా. దీపపు పురుగుల కోసం తండ్రి దీపము వలె అయి వచ్చారు. దీపపు పురుగులు ఎప్పుడైతే దీపాన్ని చూస్తాయో, అప్పుడు ఆ దీపముపై బలిహారమయ్యి శరీరాన్ని వదిలేస్తాయి. దీపముపై ప్రాణాలను అర్పించే దీపపు పురుగులు అనేకము ఉంటాయి. అందులో కూడా విశేషముగా ఎప్పుడైతే దీపావళి పండుగ జరుగుతుందో, ఆ సమయములో ఎన్నో దీపాలు వెలుగుతాయి కదా, అప్పుడు చిన్న-చిన్న జీవులు ఎన్నో రాత్రివేళ మరణిస్తాయి. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - మన బాబా ఉన్నతోన్నతమైన ఆత్మ. వారిని హుస్సేన్ అని కూడా అంటారు, వారు చాలా సుందరమైనవారు, ఎందుకంటే వారు సదా పవిత్రులు. ఆత్మ పవిత్రముగా అయినప్పుడు తనకు శరీరము కూడా పవిత్రమైనది, ప్రకృతి సిద్ధమైన సౌందర్యము కలది లభిస్తుంది. శాంతిధామములో ఆత్మలు పవిత్రముగా ఉంటారు, తర్వాత ఎప్పుడైతే పాత్రను అభినయించడానికి ఇక్కడకు వస్తారో, అప్పుడు సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి వస్తారు. మళ్ళీ సుందరము నుండి శ్యామముగా అనగా నల్లగా, అపవిత్రముగా అయిపోతారు. ఆత్మ పవిత్రముగా ఉన్నప్పుడు స్వర్ణిమయుగపు ఆత్మగా పిలవబడుతుంది. అప్పుడు ఆ ఆత్మకు శరీరము కూడా స్వర్ణిమయుగముదే లభిస్తుంది. ప్రపంచము కూడా పాతదిగా మరియు కొత్తదిగా అవుతుంది. ఆ అతి సుందరమైన పరమపిత పరమాత్మ, ఎవరినైతే భక్తి మార్గములో ఓ శివబాబా అని పిలుస్తూ ఉంటారో, ఆ నిరాకార పరమపిత పరమాత్మ వచ్చి ఉన్నారు. ఆత్మలను అపవిత్రము నుండి పవిత్రముగా, సుందరముగా తయారుచేయడానికి వచ్చారు. అలాగని, ఈ రోజుల్లో ఎవరైతే చాలా సుందరముగా ఉంటారో, వారి ఆత్మ పవిత్రమైనదని కాదు. అలా కాదు. శరీరము సుందరముగా ఉన్నా కానీ ఆత్మ అయితే పతితమైనదే కదా. విదేశాలలో ఎంత సుందరముగా తయారవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులది సత్యయుగీ సౌందర్యమని మరియు ఇక్కడి వారిది నరకపు సౌందర్యమని మీకు తెలుసు. మనుష్యులకు ఈ విషయాల గురించి తెలియదు. ఇది నరకము యొక్క సౌందర్యము అని పిల్లలకే అర్థం చేయించడం జరుగుతుంది. మనము ఇప్పుడు స్వర్గము కోసం సహజ సిద్ధమైన సౌందర్యము కలవారిగా తయారవుతున్నాము. 21 జన్మల కొరకు వీరి వలె సుందరముగా తయారవుతాము. ఇక్కడి సౌందర్యము అయితే ఒక్క జన్మ కొరకే ఉంటుంది. ఇక్కడకు బాబా వచ్చి ఉన్నారు, మొత్తము ప్రపంచములో ఉన్న మనుష్యమాత్రులందరినీ మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా సుందరముగా తయారుచేస్తారు. సత్యయుగీ కొత్త ప్రపంచములో సుందరమైన దేవీ-దేవతలే ఉండేవారు. ఆ విధంగా తయారయ్యేందుకు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. తండ్రిని దీపము అని కూడా అంటారు కానీ వారు పరమ ఆత్మ. ఏ విధంగా మిమ్మల్ని ఆత్మ అని అంటారో, అలాగే వారిని పరమ ఆత్మ అని అంటారు. పిల్లలైన మీరు తండ్రి మహిమను గానం చేస్తారు, తండ్రి మళ్ళీ పిల్లల మహిమను గానం చేస్తారు. మిమ్మల్ని ఏ విధంగా తయారుచేస్తానంటే నా కంటే కూడా మీ పదవి ఉన్నతమైనదిగా ఉంటుంది. నేను ఎవరిని, ఎలా ఉన్నాను, ఎలా నేను పాత్రను అభినయిస్తాను, అది ఇంకెవ్వరికీ తెలియదు. ఆత్మలమైన మనము పాత్రను అభినయించేందుకు ఏ విధంగా పరంధామము నుండి వస్తాము అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనము శూద్ర కులములో ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ కులములోకి వచ్చాము. ఇవి కూడా మీ వర్ణాలు. ఇతర ధర్మాలవారికెవ్వరికీ ఈ వర్ణాలు లేవు. వారికి వర్ణాలు ఉండవు. వారికైతే ఒకే వర్ణము ఉంది, క్రిస్టియన్లుగానే కొనసాగుతూ వచ్చారు. అయితే, వారిలో కూడా సతో, రజో, తమోలలోకి వస్తారు. మిగిలిన ఈ వర్ణాలన్నీ మీ కోసమే ఉన్నాయి. సృష్టి కూడా సతో, రజో, తమోలలోకి వస్తుంది. ఈ సృష్టి చక్రాన్ని అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఏ తండ్రి అయితే జ్ఞానసాగరుడు, పవిత్రతా సాగరుడో, వారు స్వయం అంటున్నారు - నేను పునర్జన్మలను తీసుకోను. శివజయంతిని కూడా జరుపుకుంటారు, కానీ వారు ఎప్పుడు వస్తారు అనేది మనుష్యులకు తెలియదు. వారి జీవిత గాథను గురించి కూడా తెలియదు. తండ్రి అంటారు - నేను ఎవరినో, ఎలా ఉన్నానో, నాలో ఏ పాత్ర ఉందో, సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో - ఈ విషయాలను పిల్లలైన మీకు నేను కల్ప-కల్పము అర్థం చేయిస్తాను. మనము మెట్లు దిగుతూ-దిగుతూ తమోప్రధానముగా అయిపోయామని మీకు తెలుసు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. చివరిలో ఎవరైతే వస్తారో వారు కూడా సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. మీరు తమోప్రధానముగా అయినప్పుడు మొత్తం ప్రపంచమంతా తమోప్రధానముగా అయిపోతుంది. మళ్ళీ మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి. ఈ సృష్టి చక్రము అలా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడిది కలియుగము, దీని తర్వాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. కలియుగము యొక్క ఆయువు పూర్తి అయ్యింది. తండ్రి అంటారు - నేను పిల్లలైన మీకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించేందుకు సాధారణమైన తనువులో కల్ప పూర్వము వలె ప్రవేశించాను. యోగాలైతే ఈ రోజుల్లో అనేకమున్నాయి. బ్యారిస్టర్ యోగము, ఇంజనీర్ యోగము... బ్యారిస్టర్ చదువును చదువుకునేందుకు బ్యారిస్టర్ తో బుద్ధియోగాన్ని జోడించవలసి ఉంటుంది. మేము బ్యారిస్టర్ గా అవుతున్నాము కావున అది చదివించేవారిని స్మృతి చేస్తున్నాము అని అక్కడ వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకైతే తండ్రి వేరుగా ఉంటారు, గురువు కూడా ఉన్నట్లయితే వారిని కూడా స్మృతి చేస్తారు, అయినా కానీ బ్యారిస్టర్ తో బుద్ధియోగము ఉంటుంది. ఆత్మయే చదువుకుంటుంది. ఆత్మయే శరీరము ద్వారా జడ్జి, బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతుంది.

ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయ్యే సంస్కారాన్ని మీలో అలవరచుకుంటారు. అర్ధకల్పము దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహీ-అభిమానిగా అవ్వండి. ఆత్మలోనే చదువు యొక్క సంస్కారము ఉంటుంది. మనుష్య ఆత్మయే జడ్జిగా అవుతుంది, అలా ఇప్పుడు మనము విశ్వానికి యజమానులుగా, దేవతలుగా అవుతున్నాము, చదివించేవారు శివబాబా, వారు పరమ ఆత్మ. వారే జ్ఞానసాగరుడు, శాంతి, సంపదల సాగరుడు. సముద్రము నుండి రత్నాల పళ్ళెములు వెలువడినట్లుగా చూపిస్తారు. ఇవి భక్తి మార్గానికి సంబంధించిన విషయాలు. తండ్రి వీటి గురించి ప్రస్తావించవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇవి అవినాశీ జ్ఞాన రత్నాలు. ఈ జ్ఞాన రత్నాల ద్వారా మీరు చాలా షావుకారులుగా అవుతారు మరియు వజ్ర-వైఢూర్యాలు కూడా మీకు ఎన్నో లభిస్తాయి. ఈ రత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయలు విలువ చేసేవి, అవే మిమ్మల్ని ఇంతటి షావుకార్లుగా చేస్తాయి. భారత్ యే ఒకప్పుడు నిర్వికారీ ప్రపంచముగా ఉండేదని మీకు తెలుసు. అందులో పవిత్రమైన దేవతలు ఉండేవారు. ఇప్పుడు నల్లగా, అపవిత్రముగా అయిపోయారు. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా జరుగుతుంది. ఆత్మ శరీరములో ఉన్నప్పుడే వినగలుగుతుంది. పరమాత్మ కూడా శరీరములోకి వస్తారు. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క ఇల్లు శాంతిధామము. అక్కడ కదలికలు ఏమీ ఉండవు. ఇక్కడ పరమాత్మ అయిన తండ్రి వచ్చి పిల్లలను కలుసుకుంటారు. శరీర సహితముగా కలుసుకుంటారు. అక్కడైతే అది ఇల్లు, కావున అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. మిగిలిన ప్రపంచమంతా కలియుగములో ఉంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - భక్తి మార్గములో ఎంతో ఖర్చుపెడతారు, చిత్రాలు కూడా ఎన్నో తయారుచేస్తారు, పెద్ద-పెద్ద మందిరాలను తయారుచేస్తారు. లేదంటే శ్రీకృష్ణుడి చిత్రాన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ ధర కల చిత్రాలు ఉంటాయి, అయినా కానీ ఇంత దూరదూరాలలో ఉన్న మందిరాలకు ఎందుకు వెళ్తారు. ఇది భక్తి మార్గము. సత్యయుగములో ఈ మందిరాలు మొదలైనవి ఉండవు. అక్కడ పూజ్యులే ఉంటారు. కలియుగములో ఉన్నది పూజారులు. మీరు ఇప్పుడు సంగమయుగములో పూజ్య దేవతలుగా తయారవుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ సమయములో మీ ఈ అంతిమ పురుషార్థీ శరీరము చాలా విలువైనది. ఈ శరీరములో ఉంటూ మీరు ఎంతో సంపాదనను చేసుకుంటారు. అనంతమైన తండ్రితో పాటు మీరు తింటూ, త్రాగుతూ ఉంటారు. పిలవడము కూడా వారినే పిలుస్తారు. శ్రీకృష్ణుడితోపాటు తినాలి అని అనరు. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము... అంటూ తండ్రిని స్మృతి చేస్తారు. పిల్లలైతే తండ్రితో ఆడుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణుడికి మేమంతా పిల్లలము అని ఈ విధంగా అనరు. ఆత్మలందరూ పరమపిత పరమాత్మునికి పిల్లలు. మీరు వచ్చినట్లయితే మేము మీతోపాటు ఆడుకుంటాము, తింటాము అన్నీ చేస్తాము అని ఆత్మ శరీరము ద్వారా అంటుంది. మీరు బాప్ దాదా అనే పిలుస్తారు. అంటే ఇది ఒక కుటుంబము అయినట్లు. బాప్ దాదా మరియు పిల్లలు. ఈ బ్రహ్మా అనంతమైన రచయిత. తండ్రి వీరిలోకి ప్రవేశించి వీరిని దత్తత తీసుకుంటారు. నీవు నా వాడివి అని వీరితో అంటారు. ఇది ముఖవంశావళి. ఉదాహరణకు స్త్రీని కూడా దత్తత తీసుకుంటారు కదా. అప్పుడు ఆమె కూడా ముఖవంశావళి అవుతారు. నీవు నాకు చెందిన ఆమెవు అని అంటారు. ఆ తర్వాత ఆమె నుండి కుఖ వంశావళి పిల్లలు జన్మిస్తారు. ఈ ఆచారము ఎక్కడి నుండి కొనసాగింది? తండ్రి అంటారు - నేను వీరిని దత్తత తీసుకున్నాను కదా. వీరి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకుంటాను. మీరు నా పిల్లలు. కానీ వీరు పురుషుడు. మీ అందరినీ సంభాళించడానికి సరస్వతిని కూడా దత్తత తీసుకున్నాను. ఆమెకు మాత (తల్లి) అన్న టైటిల్ లభించింది. సరస్వతీ నది. ఈ నది తల్లి అయ్యారు కదా. తండ్రి సాగరుడు. వీరు కూడా సాగరము నుండే వెలువడ్డారు. బ్రహ్మపుత్రా నది మరియు సాగరము యొక్క మేళాకు సంబంధించి చాలా పెద్దగా ఏర్పాటు జరుగుతుంది. ఇటువంటి మేళా ఇంకెక్కడా జరగదు. అది నదుల మేళా. ఇది ఆత్మలు మరియు పరమాత్మల మేళా. అది కూడా వారు ఎప్పుడైతే శరీరములోకి వస్తారో, అప్పుడే మేళా జరుగుతుంది. తండ్రి అంటారు, నేను హుస్సేన్ ను. నేను ఇతనిలోకి కల్ప-కల్పము ప్రవేశిస్తాను. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. మీ బుద్ధిలో మొత్తము సృష్టి చక్రమంతా ఉంది, దీని ఆయువు 5 వేల సంవత్సరాలు. ఈ అనంతమైన ఫిల్మ్ నుండి హద్దులోని ఫిల్మ్ లు తయారుచేస్తారు. ఏదైతే గతించిందో అది వర్తమానమవుతుంది. వర్తమానము మళ్ళీ భవిష్యత్తుగా మారుతుంది, అప్పుడు దానిని గతము అని అనడం జరుగుతుంది. అది గతముగా మారేందుకు ఎంత సమయము పట్టింది. కొత్త ప్రపంచములోకి వచ్చి ఎంత సమయము గతించింది? 5 వేల సంవత్సరాలు. మీరిప్పుడు ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులు. మనము మొదట బ్రాహ్మణులుగా ఉండేవారమని, ఆ తర్వాత దేవతలుగా అయ్యామని మీరు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి ద్వారా శాంతిధామము, సుఖధామము యొక్క వారసత్వము లభిస్తుంది. తండ్రి వచ్చి మూడు ధర్మాలను ఒకేసారి స్థాపన చేస్తారు. ఇక మిగిలిన వాటన్నింటినీ వినాశనము చేయిస్తారు. తమతోపాటు తిరిగి తీసుకువెళ్ళే సద్గురువు అయిన తండ్రి మీకు లభించారు. మమ్మల్ని సద్గతిలోకి తీసుకువెళ్ళండి, శరీరాన్ని సమాప్తము చేయించండి అని పిలుస్తారు కూడా. మేము శరీరాన్ని వదిలి శాంతిధామములోకి వెళ్ళగలిగే యుక్తిని తెలియజేయండి అని అంటారు. గురువుల వద్దకు కూడా మనుష్యులు దీని కోసమే వెళ్తారు. కానీ ఆ గురువు అయితే శరీరము నుండి విముక్తులుగా చేసి తమతోపాటు తీసుకువెళ్ళలేరు. పతిత-పావనుడు ఒక్క తండ్రియే. కావున వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనము పావనముగా తప్పకుండా అవ్వాలి. తండ్రినే కాలుడికే కాలుడు మహాకాలుడు అని అంటారు. అందరినీ శరీరాల నుండి విముక్తులుగా చేసి తమతోపాటు తీసుకువెళ్తారు. వీరు సుప్రీమ్ గైడ్ (ఉన్నతోన్నతమైన మార్గదర్శకుడు). ఆత్మలందరినీ తిరిగి తీసుకువెళ్తారు. ఇది ఛీ-ఛీ శరీరము, దీని బంధనము నుండి విముక్తులవ్వాలని కోరుకుంటారు. శరీరము నుండి విడుదల అయితే బంధనాలు అన్నీ విడుదలవుతాయని భావిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఈ ఆసురీ బంధనాలన్నింటి నుండి విడిపించి సుఖపు దైవీ సంబంధములోకి తీసుకువెళ్తారు. మనము వయా శాంతిధామము సుఖధామములోకి వస్తామని మీకు తెలుసు. ఆ తర్వాత దుఃఖధామములోకి ఎలా వస్తారు అనేది కూడా మీకు తెలుసు. బాబా వచ్చిందే శ్యామము నుండి సుందరముగా తయారుచేసేందుకు. తండ్రి అంటారు - నేను మీకు విధేయుడినైన సత్యమైన తండ్రిని కూడా. తండ్రి ఎల్లప్పుడూ విధేయుడిగానే ఉంటారు. సేవ ఎంతగానో చేస్తారు. ఖర్చు పెట్టి చదివించి మళ్ళీ ధన, సంపదలన్నింటినీ పిల్లలకు ఇచ్చి వారు స్వయం వెళ్ళి సాధువుల సాంగత్యాన్ని చేస్తారు. తమ కంటే కూడా పిల్లలను ఉన్నతముగా తయారుచేస్తారు. ఈ తండ్రి కూడా అంటారు, నేను మిమ్మల్ని డబుల్ యజమానులుగా చేస్తాను. మీరు విశ్వానికి కూడా యజమానులుగా, అలాగే బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు. మీకు పూజ కూడా డబుల్ జరుగుతుంది. ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. దేవతా వర్ణములో కూడా పూజ జరుగుతుంది. నాకైతే సింగిల్ రూపములో అనగా కేవలం శివలింగ రూపములో పూజ జరుగుతుంది. నేను రాజుగానైతే అవ్వను. మీకు ఎంత సేవ చేస్తాను! ఇటువంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతారు! ఓ ఆత్మా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే నీ వికర్మలు వినాశనమవుతాయి. నీవు ఎవరి వద్దకు వచ్చావు? మొదట తండ్రి, ఆ తర్వాత దాదా. మొదట ఫాదర్ ఉన్నారు, ఆ తర్వాత గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన ఆదిదేవ్ ఆడమ్ ఉంటారు ఎందుకంటే చాలా వంశాలు తయారవుతాయి కదా. శివబాబాను ఎవరైనా గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారా? వారు ప్రతి విషయములోనూ మిమ్మల్ని ఎంతో ఉన్నతముగా తయారుచేస్తారు. ఇటువంటి తండ్రి లభించారు, మరి వారిని మీరు ఎందుకు మర్చిపోతారు? మర్చిపోతే పావనముగా ఎలా అవుతారు! తండ్రి పావనముగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. ఈ స్మృతి ద్వారానే మాలిన్యము తొలగుతుంది. తండ్రి అంటారు - మధురాతి-మధురమైన ప్రియమైన పిల్లలూ, దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వాలి, పవిత్రముగా కూడా అవ్వాలి. కామము మహాశత్రువు. ఈ ఒక్క జన్మ నా కోసం పవిత్రముగా అవ్వండి. లౌకిక తండ్రి కూడా అంటారు కదా - ఏ చెడు పని చేయవద్దు, నా గడ్డము పరువును నిలబెట్టు అని. పారలౌకిక తండ్రి కూడా అంటారు - నేను పావనముగా తయారుచేయడానికి వచ్చాను, ఇప్పుడు ఇక నల్ల ముఖము చేసుకోకండి, లేకపోతే పరువు పోతుంది. బ్రాహ్మణులందరి పరువును మరియు తండ్రి పరువును కూడా పోగొడతారు. బాబా, మేము పడిపోయాము, నల్ల ముఖము చేసుకున్నాము అని వ్రాస్తారు. బాబా అంటారు - నేను మిమ్మల్ని సుందరముగా తయారుచేయడానికి వస్తే, మీరు మళ్ళీ నల్ల ముఖము చేసుకున్నారా. మీరైతే సదా సుందరముగా అయ్యే పురుషార్థము చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అంతిమ పురుషార్థీ శరీరము చాలా విలువైనది, దీనితో చాలా సంపాదన చేసుకోవాలి. అనంతమైన తండ్రితో కలిసి తింటూ, త్రాగుతూ... సర్వ సంబంధాల అనుభూతిని చేసుకోవాలి.

2. బ్రాహ్మణ పరివారపు పరువు మరియు తండ్రి పరువు పోయే విధమైన కర్మలేవీ చేయకూడదు. ఆత్మాభిమానులుగా అయి పూర్తిగా పవిత్రముగా అవ్వాలి. స్మృతి ద్వారా పాత మాలిన్యాన్ని తొలగించాలి.

వరదానము:-
వినడముతో పాటు స్వరూపముగా అయి మనసు యొక్క మనోరంజనము ద్వారా సదా శక్తిశాలి ఆత్మ భవ

ప్రతి రోజు మనసులో స్వయం కోసము మరియు ఇతరుల కోసము ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన సంకల్పాలను తీసుకురండి. స్వయం కూడా ఆ సంకల్పాల స్వరూపముగా అవ్వండి మరియు ఇతరుల సేవలో కూడా ఉపయోగించండి, అప్పుడు మీ జీవితము కూడా సదా కొరకు ఉత్సాహము కలదిగా అవుతుంది మరియు ఇతరులకు కూడా ఉత్సాహాన్ని ఇప్పించేవారిగా అవ్వగలుగుతారు. ఏ విధంగా మనోరంజన ప్రోగ్రామ్ లు ఉంటాయో, అదే విధంగా మనసు యొక్క మనోరంజన ప్రోగ్రామ్ ను తయారుచేసుకోండి, ఏదైతే వింటారో దాని స్వరూపముగా అవ్వండి, అప్పుడు శక్తిశాలిగా అవుతారు.

స్లోగన్:-
ఇతరులను మార్చే కన్నా ముందు స్వయాన్ని మార్చుకోండి, ఇదే వివేకము.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి

అన్నింటికంటే తీవ్రగతి కల సేవా సాధనము - శుభమైన మరియు శ్రేష్ఠమైన సంకల్పాల శక్తి. ఏ విధంగా బ్రహ్మాబాబా శ్రేష్ఠ సంకల్పాల విధి ద్వారా సేవ యొక్క వృద్ధిలో సదా సహయోగులుగా ఉన్నారు, విధి తీవ్రమైనదిగా ఉంటే వృద్ధి కూడా తీవ్రమైనదిగా ఉంటుంది, అలా పిల్లలైన మీరు కూడా శ్రేష్ఠమైన, శుభమైన సంకల్పాలతో సంపన్నులుగా అవ్వండి.