07-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - అవినాశీ జ్ఞాన రత్నాలను ధారణ చేసి
ఇప్పుడు మీరు నిరుపేదల నుండి ధనవంతులుగా అవ్వాలి, ఆత్మ అయిన మీరు రూప్ బసంత్ (యోగ
స్వరూపులు, జ్ఞాన స్వరూపులు)’’
ప్రశ్న:-
ఎటువంటి
శుభ భావనను ఉంచుతూ పురుషార్థములో సదా తత్పరులై ఉండాలి?
జవాబు:-
సదా ఇదే శుభ
భావనను ఉంచాలి - ఆత్మ అయిన మనము సతోప్రధానముగా ఉండేవారము, మనమే తండ్రి నుండి శక్తి
యొక్క వారసత్వాన్ని తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాము. ఈ శుభ భావనతోనే
పురుషార్థము చేసి సతోప్రధానముగా అవ్వాలి. అందరూ సతోప్రధానముగా అవ్వరు కదా అని ఇలా
ఆలోచించకండి. అలా కాదు, స్మృతి యాత్రలో ఉండే పురుషార్థాన్ని చేస్తూ ఉండాలి, సేవ
ద్వారా శక్తిని తీసుకోవాలి.
పాట:-
ఈ పాపపు
ప్రపంచము నుండి...
ఓంశాంతి
ఇది ఒక చదువు. ఇక్కడ ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి, మిగిలిన సత్సంగాలేవైతే
ఉన్నాయో, అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి చేస్తూ, చేస్తూ బికారిగా
అయిపోయారు. ఆ బికారులు, ఫకీరులు వేరు, మీరు వేరే రకమైన బికారులు. మీరు ధనవంతులుగా
ఉండేవారు, ఇప్పుడు బికారులుగా అయ్యారు. మనము ధనవంతులుగా ఉండేవారము అన్న విషయము
ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులైన మీకు తెలుసు - మనము విశ్వానికి యజమానులుగా,
ధనవంతులుగా ఉండేవారము, అమీర్ చంద్ నుండి ఫకీర్ చంద్ గా (ధనవంతుల నుండి బికారులుగా)
అయ్యాము. ఇప్పుడు ఇది చదువు. దీనిని బాగా చదువుకోవాలి, ధారణ చేయాలి మరియు ధారణ
చేయించేందుకు ప్రయత్నించాలి. అవినాశీ జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. ఆత్మ రూప్ బసంత్
(యోగ స్వరూపము, జ్ఞాన స్వరూపము) కదా. ఆత్మయే ధారణ చేస్తుంది, శరీరమైతే నశ్వరమైనది.
పనికిరాని వస్తువునైతే కాల్చడం జరుగుతుంది. అలాగే శరీరము కూడా పనికిరాకపోతే దానిని
అగ్నిలో కాల్చేస్తారు. ఆత్మనైతే కాల్చరు. మనము ఆత్మ. ఎప్పటి నుండైతే రావణ రాజ్యము
ప్రారంభమైందో అప్పటి నుండి మనుష్యులు దేహాభిమానములోకి వచ్చేసారు. నేను శరీరాన్ని
అన్నది పక్కా అయిపోతుంది. ఆత్మ అయితే అమరమైనది. అమరనాథుడైన తండ్రి వచ్చి ఆత్మలను
అమరులుగా తయారుచేస్తారు. అక్కడైతే తమ సమయమనుసారముగా, స్వ ఇచ్ఛానుసారముగా, ఒక
శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు ఎందుకంటే అక్కడ ఆత్మ యజమానిగా ఉంటుంది. ఆత్మ
ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరాన్ని వదులుతుంది. అక్కడ శరీరము యొక్క ఆయుష్షు
ఎక్కువ ఉంటుంది. సర్పము ఉదాహరణ ఉంది కదా. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మలోని పాత
శరీరమని ఇప్పుడు మీకు తెలుసు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. కొందరికి 60-70
జన్మలు కూడా ఉంటాయి, కొందరికి 50 జన్మలు ఉంటాయి. త్రేతాలో తప్పకుండా ఆయుష్షు
ఎంతోకొంత తగ్గుతుంది. సత్యయుగములో పూర్తి ఆయుష్షు ఉంటుంది. మేము సత్యయుగములో
మొట్టమొదట రావాలి అని ఇప్పుడు పురుషార్థము చేయాలి. అక్కడ శక్తి ఉంటుంది కావున అకాల
మృత్యువులు జరుగవు. శక్తి తక్కువైనట్లయితే మరి ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు
తండ్రి ఏ విధముగా సర్వశక్తివంతుడో అదే విధముగా ఆత్మ అయిన మిమ్మల్ని కూడా
శక్తివంతముగా తయారుచేస్తారు. ఒకటేమో పవిత్రముగా అవ్వాలి, మరొకటి స్మృతిలో ఉండాలి,
అప్పుడే శక్తి లభిస్తుంది. తండ్రి నుండి శక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు.
పాపాత్మ అయితే శక్తిని తీసుకోలేదు. పుణ్యాత్మగా అయినట్లయితే శక్తి లభిస్తుంది.
ఆత్మనైన నేను సతోప్రధానముగా ఉండేవాడిని అని భావిస్తూ ఇలాగే ఆలోచించండి. ఎల్లప్పుడూ
ఈ శుభ భావనను ఉంచుకోవాలి. అంతేకానీ - అందరూ ఏమీ సతోప్రధానముగా అవ్వరు కదా, కొందరైతే
సతోగా కూడా ఉంటారు కదా అని భావించకూడదు. అలా కాదు. స్వయము విషయములో - నేను
మొట్టమొదట సతోప్రధానముగా ఉండేవాడిని అని భావించాలి. నిశ్చయము ద్వారానే సతోప్రధానముగా
అవుతారు. నేను ఎలా సతోప్రధానముగా అవ్వగలను అని అనుకోకూడదు. అలా అనుకుంటే జారిపోతారు,
ఇక స్మృతి యాత్రలో ఉండరు. ఎంత వీలైతే అంత పురుషార్థము చేయాలి. స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ సతోప్రధానముగా అవ్వాలి. ఈ సమయములో మనుష్యమాత్రులందరూ తమోప్రధానముగా ఉన్నారు.
మీ ఆత్మ కూడా తమోప్రధానముగా ఉంది. ఆత్మను ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా
సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. దానితోపాటు సేవ కూడా చేసినట్లయితే శక్తి లభిస్తుంది.
ఉదాహరణకు ఎవరైనా సెంటరు తెరిస్తే వారికి అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైనా వచ్చి
విశ్రాంతిని తీసుకోవాలన్న ఉద్దేశ్యముతో మనుష్యులు ధర్మశాలలను నిర్మిస్తారు. అప్పుడు
వారి ఆత్మ సంతోషిస్తుంది కదా. అందులో ఉండేవారికి విశ్రాంతి లభిస్తే, ఆ ఆశీర్వాదము
దానిని నిర్మించినవారికి లభిస్తుంది. దాని పరిణామమేమిటి? మరుసటి జన్మలో వారు సుఖీగా
ఉంటారు, వారికి మంచి ఇల్లు లభిస్తుంది, ఇంటి యొక్క సుఖము లభిస్తుంది. అలాగని వారు
ఎప్పుడూ అనారోగ్యముపాలు అవ్వరని కాదు. కేవలం మంచి ఇల్లు మాత్రమే లభిస్తుంది.
హాస్పిటల్ తెరిస్తే ఆరోగ్యము బాగా ఉంటుంది. యూనివర్శిటీ తెరిస్తే చదువు బాగా ఉంటుంది.
స్వర్గములోనైతే ఈ హాస్పిటళ్ళు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడ మీరు పురుషార్థము ద్వారా 21
జన్మల కొరకు ప్రారబ్ధాన్ని తయారుచేసుకుంటారు. అంతేకానీ అక్కడ హాస్పిటళ్ళు, కోర్టులు,
పోలీస్ స్టేషన్లు మొదలైనవేవీ ఉండవు. ఇప్పుడు మీరు సుఖధామములోకి వెళ్తున్నారు. అక్కడ
మంత్రులు కూడా ఉండరు. అక్కడ స్వయంగా మహారాజులు, మహారాణులే ఎంతో ఉన్నతోన్నతులు కావున
వారు మంత్రుల సలహాలు తీసుకోరు. ఎప్పుడైతే బుద్ధిహీనులుగా అవుతారో, వికారాల్లో
పడిపోతారో, అప్పుడు సలహా తీసుకోవడం జరుగుతుంది. రావణ రాజ్యములో పూర్తిగా
బుద్ధిహీనులుగా, తుచ్ఛబుద్ధి కలవారిగా అయిపోతారు, అందుకే వినాశనానికి మార్గాలు
వెతుకుతూ ఉంటారు. మేము విశ్వాన్ని చాలా ఉన్నతముగా తయారుచేస్తున్నాము అని వారు
భావిస్తారు కానీ వారు స్వయమే ఇంకా కిందకు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు వినాశనము ఎదురుగా
నిలబడి ఉంది.
మనము ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైన మీకు తెలుసు. మనము భారత్ యొక్క సేవను చేసి
దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాము, ఆ తర్వాత మనము రాజ్యము చేస్తాము. ఫాలో ఫాదర్ (తండ్రిని
అనుసరించండి) అని కూడా అంటూ ఉంటారు. ఫాదర్ షోస్ సన్, సన్ షోస్ ఫాదర్ (తండ్రి
కొడుకును ప్రత్యక్షము చేస్తారు, కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తారు). ఈ సమయములో
శివబాబా బ్రహ్మా తనువులోకి వచ్చి మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు.
ఇతరులకు కూడా ఏమని అర్థం చేయించాలంటే - మేము బ్రహ్మాను భగవంతుడిగా లేక దేవతగా
భావించము, ఇతను పతితునిగా ఉండేవారు, తండ్రి పతిత శరీరములోకి ప్రవేశించారు, వృక్షములో
చూడండి, ఇతను చివరిలో పైన నిలబడి ఉన్నారు కదా, అక్కడ ఇతను పతితునిగా ఉన్నారు, మళ్ళీ
పావనముగా అయ్యేందుకు కింద తపస్య చేసి దాని ద్వారా దేవతగా అవుతారు. తపస్య చేసేవారు
బ్రాహ్మణులు. బ్రహ్మాకుమార, కుమారీలైన మీరందరూ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇది
ఎంత స్పష్టముగా ఉంది. ఇందులో యోగము చాలా బాగా ఉండాలి. స్మృతిలో ఉండకపోతే మురళిలో
కూడా ఆ శక్తి ఉండదు. శివబాబా స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారానే
సతోప్రధానముగా అవుతారు, లేదంటే శిక్షలు అనుభవించి మళ్ళీ తక్కువ పదవిని పొందుతారు.
ముఖ్యమైన విషయము స్మృతి, దీనినే భారత్ యొక్క ప్రాచీన యోగము అని అంటారు. జ్ఞానము
గురించి ఎవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాలను గురించి మాకు
తెలియదు అని పూర్వము ఋషులు, మునులు అనేవారు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఈ
పంచ వికారాలే మిమ్మల్ని పూర్తిగా పైసకు కొరగానివారిగా చేసేసాయి. ఇప్పుడు ఈ పాత
ప్రపంచము కాలిపోయి పూర్తిగా అంతమైపోనున్నది. ఇంకేమీ మిగిలేది లేదు. మీరంతా నంబరువారు
పురుషార్థానుసారముగా మీ తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేసి భారత్ ను స్వర్గముగా
తయారుచేస్తారు. ప్రదర్శనీలో మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి - బి.కె.లైన
మేము మా తనువు, మనసు, ధనముల ద్వారానే శ్రీమతమనుసారముగా సేవ చేసి రామ రాజ్యాన్ని
స్థాపన చేస్తున్నాము. గాంధీజీ ఎప్పుడూ - శ్రీమతమనుసారముగా మేము రామ రాజ్యాన్ని
స్థాపన చేస్తున్నాము అని అనలేదు. ఇక్కడైతే ఇతనిలో శ్రీశ్రీ 108 అయిన తండ్రి
కూర్చున్నారు. 108 మాలను కూడా తయారుచేస్తారు. మాల అయితే పెద్దగా తయారవుతుంది. అందులో
8 నుండి 108 వరకు ఉన్న ఆత్మలు బాగా కష్టపడతారు. బాగా కష్టపడేవారు నంబరువారుగా
ఎంతోమంది ఉన్నారు. రుద్ర యజ్ఞము జరిగినప్పుడు సాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది.
తప్పకుండా వారు ఎంతోకొంత సేవ చేసి ఉంటారు, కావుననే వారికి పూజ జరుగుతోంది.
బ్రాహ్మణులైన మీరు ఆత్మిక సేవాధారులు. మీరు అందరి ఆత్మలను మేల్కొలుపుతారు. నేను
ఆత్మను, ఈ విషయాన్ని మర్చిపోవడం వలన దేహాభిమానము వచ్చేస్తుంది. అప్పుడు, నేను ఫలానా
వ్యక్తిని అని భావిస్తారు. నేను ఒక ఆత్మను అన్న విషయము ఎవ్వరికీ తెలియదు. పేరు అనేది
ఈ శరీరానికి ఉంటుంది. ఆత్మనైన నేను ఎక్కడి నుండి వస్తాను - ఈ ఆలోచన కొద్దిగా కూడా
ఎవ్వరిలోనూ లేదు. ఇక్కడ పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ శరీర భానము పక్కా అయిపోయింది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడిక నిర్లక్ష్యముతో పొరపాట్లు చేయడం
మానండి. మాయ చాలా శక్తివంతమైనది. మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. మీరు
ఆత్మాభిమానులుగా అవ్వండి. ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ. ఆత్మ మరియు పరమాత్మ
ఎంతోకాలము దూరముగా ఉన్నారు అన్న గాయనము ఉంది. దీని అర్థము కూడా వారికి తెలియదు.
ఆత్మలమైన మనము తండ్రితోపాటు ఉండేవారము అని మీకు ఇప్పుడు తెలుసు. అది ఆత్మల ఇల్లు కదా.
తండ్రి కూడా అక్కడే ఉన్నారు, వారి పేరు శివ. శివజయంతి అని కూడా అంటూ ఉంటారు. వారికి
అసలు వేరే పేరు ఏదీ పెట్టకూడదు. తండ్రి అంటారు - నా యథార్థమైన నామము కళ్యాణకారి శివ.
కళ్యాణకారి రుద్రుడు అని అనరు. కళ్యాణకారి శివుడు అనే అంటారు. కాశీలో కూడా శివుని
మందిరము ఉంది కదా. అక్కడికి వెళ్ళి సాధువులు - శివకాశీ విశ్వనాథ గంగ అన్న మంత్రాన్ని
జపిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఏ శివుడినైతే కాశీలోని
విశ్వనాథ మందిరములో కూర్చోబెట్టారో, అతడిని విశ్వనాథుడు అని పిలుస్తారు. వాస్తవానికి
నేను విశ్వనాథుడిని కాను. విశ్వానికి నాథులుగా మీరే అవుతారు. నేను విశ్వానికి
నాథుడిగా అవ్వనే అవ్వను. బ్రహ్మతత్వానికి నాథులుగా కూడా మీరే అవుతారు. అది మీ ఇల్లు,
ఇక్కడ మీ రాజధాని ఉంటుంది. ఆ బ్రహ్మతత్వము ఒక్కటే నా ఇల్లు. నేను స్వర్గములోకి రాను.
అలాగే నేను నాథుడిగా కూడా అవ్వను. నన్ను శివబాబా అనే పిలుస్తారు. పతితులను పావనముగా
తయారుచేయడమే నా పాత్ర. మురికిపట్టిన వస్త్రాలను వారు శుభ్రపరుస్తారు... అని సిక్కు
ధర్మస్థులు కూడా అంటారు, కానీ దాని అర్థాన్ని వారు అర్థం చేసుకోరు. ఏక్ ఓంకార్...
అయోనిజుడు అని మహిమను కూడా పాడుతారు అనగా వారు జనన-మరణాలకు అతీతుడు. నేనైతే 84
జన్మలు తీసుకోను. నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను. మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు.
బాబా నాతోపాటు కలిసి కూర్చుని ఉన్నారని ఇతని ఆత్మకు తెలుసు, అయినా కూడా స్మృతిని
ఘడియ, ఘడియ మర్చిపోతూ ఉంటారు. నేను చాలా కష్టపడవలసి ఉంటుంది అని ఈ దాదా యొక్క ఆత్మ
అంటుంది. నాతోపాటు తండ్రి కూర్చుని ఉన్నారు కావున స్మృతి చాలా బాగుంటుంది అని కాదు.
అలా కాదు. అసలు పూర్తిగా కలిసి ఉన్నాము. బాబా నా వద్దే ఉన్నారని నాకు తెలుసు.
వాస్తవానికి ఈ శరీరానికి శివబాబా యజమాని వలె ఉన్నారు, అయినా కూడా నేను మర్చిపోతూనే
ఉన్నాను. ఈ శరీరమనే గృహములో ఉండేందుకు దీనిని తండ్రికి ఇచ్చాను. ఇందులో ఒక మూలలో
నేను కూర్చున్నాను. తండ్రి పెద్దవారు కదా! నా పక్కనే యజమాని కూర్చున్నారు అని నేను
ఆలోచిస్తూ ఉంటాను. ఈ రథము వారిది, వారు దీనిని సంభాళిస్తున్నారు. నాకు శివబాబా
తినిపిస్తారు కూడా, నేను వారి రథాన్ని కావున ఎంతోకొంత నాకు ప్రత్యేకమైన పాలన
చేస్తారు కదా, ఈ సంతోషములో తింటాను. మళ్ళీ రెండు-నాలుగు నిమిషాల తరువాత మర్చిపోతాను.
నాకే ఇలా ఉంటే ఇక పిల్లలకు ఇంకెంత కష్టముగా ఉంటుందని అప్పుడు అనుకుంటాను. అందుకే
బాబా అర్థం చేయిస్తూ ఉంటారు - ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. ఇందులో చాలా,
చాలా లాభము ఉంది. ఇక్కడైతే చిన్న విషయానికే అలజడి చెందుతారు, ఇక చదువును వదిలేస్తారు.
బాబా, బాబా అని అంటూ వారిని వదిలి వెళ్ళిపోతారు. తండ్రిని తమవారిగా చేసుకుంటారు,
అందరికీ జ్ఞానాన్ని వినిపిస్తారు, ఇష్టపడతారు, దివ్యదృష్టితో స్వర్గాన్ని చూస్తారు,
రాసలీల చేస్తారు, ఆ తరువాత అహో మాయా, నన్ను వదిలేస్తారు, పారిపోతారు! ఎవరైతే
విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని వదిలి వెళ్ళిపోతారు. చాలా ప్రసిద్ధమైన
పెద్దవారు కూడా వదిలి వెళ్ళిపోతారు.
ఇప్పుడు మీకు మార్గము తెలియజేయడం జరుగుతుంది. అంతేకానీ మీ చేయి పట్టుకొని
తీసుకువెళ్తారని కాదు. ఈ నేత్రాల పరంగానైతే అంధులు కారు కదా. అయితే, జ్ఞానమనే మూడవ
నేత్రము మీకు లభిస్తుంది. మీకు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. ఈ 84 జన్మల
చక్రము బుద్ధిలో తిరగాలి. స్వదర్శన చక్రధారి అన్నది మీ పేరు. ఒక్క తండ్రినే స్మృతి
చేయాలి. ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. అంతిమములో ఈ అవస్థ ఉండాలి. ఉదాహరణకు పత్నికి తన
పతి పట్ల ప్రేమ ఉంటుంది. వారిది దైహికమైన ప్రేమ, ఇక్కడ మీది ఆత్మిక ప్రేమ. మీరు
లేస్తూ, కూర్చుంటూ పతులకే పతి, తండ్రులకే తండ్రి అయిన ఆ తండ్రిని స్మృతి చేయాలి. పతి,
పత్ని మరియు పరివారము అంతా పరస్పరము చాలా ప్రేమతో ఉండే కుటుంబాలు ప్రపంచములో ఎన్నో
ఉన్నాయి. ఇంట్లో స్వర్గము ఉన్నట్లుగా ఉంటుంది. 5-6 మంది పిల్లలు ఒకే చోట కలిసి
ఉంటారు, ఉదయమే త్వరగా లేచి పూజ చేయడానికి కూర్చుంటారు, ఇంట్లో ఏ గొడవలూ ఉండవు. అందరూ
ఏకరసముగా ఉంటారు. కొన్ని చోట్ల అయితే ఒకే ఇంట్లో కొందరు రాధాస్వామి శిష్యులుగా
ఉంటారు, మరికొందరు అసలు ధర్మాన్నే నమ్మరు. చిన్న విషయానికి కూడా అలజడి చెందుతూ
ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో పూర్తి పురుషార్థము చేయాలి. మీ ధనాన్ని
కూడా సఫలము చేసుకుని మీ కళ్యాణము చేసుకోండి, తద్వారా భారత్ యొక్క కళ్యాణము కూడా
జరుగుతుంది. మనము మన రాజధానిని శ్రీమతమనుసారముగా మళ్ళీ స్థాపన చేసుకుంటున్నామని మీకు
తెలుసు. స్మృతి యాత్ర ద్వారా మరియు ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడం ద్వారానే మనము
చక్రవర్తీ రాజులుగా అవుతాము, ఇక ఆ తర్వాత మళ్ళీ మెట్లు దిగడం ప్రారంభమవుతుంది,
చివరిలో మళ్ళీ బాబా వద్దకు వచ్చేస్తాము. శ్రీమతముపై నడవడం ద్వారానే ఉన్నత పదవిని
పొందుతారు. తండ్రి ఏమీ ఉరికంబానికి ఎక్కించడం లేదు కదా. ఒకటి పవిత్రముగా ఉండండి,
రెండు తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. సత్యయుగములో పతితులెవ్వరూ ఉండరు.
దేవీ-దేవతలు కూడా చాలా తక్కువమందే ఉంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ
ఉంటుంది. దేవతల వృక్షము చాలా చిన్నది. ఆ తర్వాత అది ఎంతగా పెరుగుతూ ఉంటుంది.
ఆత్మలన్నీ కిందికి వస్తూ ఉంటాయి. ఇది తయారై, తయారుచేయబడిన ఆట. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మిక సేవాధారులుగా అయి ఆత్మలను మేల్కొలిపే సేవ చేయాలి. తనువు-మనసు-ధనము
ద్వారా సేవ చేసి శ్రీమతమనుసారముగా రామ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు నిమిత్తులుగా
అవ్వాలి.
2. స్వదర్శన చక్రధారులుగా అయి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి. ఒక్క
తండ్రినే స్మృతి చేయాలి. ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. ఎప్పుడూ ఏ విషయములోనూ విసుగు
చెంది చదువును విడిచిపెట్టకూడదు.
వరదానము:-
సంగఠనలో ఉంటూ లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానము చేసుకునే
సదా శక్తిశాలి ఆత్మ భవ
సంగఠనలో ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఉల్లాస-ఉత్సాహాలు
కూడా వస్తాయి, అలాగే నిర్లక్ష్యము కూడా వస్తుంది. వీరు కూడా చేస్తున్నారు, మరి నేను
కూడా చేస్తే ఏమవుతుంది అని అనుకుంటారు, అందుకే సంగఠన నుండి శ్రేష్ఠముగా అయ్యే
సహయోగాన్ని తీసుకోండి. ప్రతి కర్మ చేసే కన్నా ముందు విశేషమైన అటెన్షన్ మరియు
లక్ష్యము ఉండాలి - నేను స్వయాన్ని సంపన్నముగా చేసుకుని శ్యాంపుల్ గా అవ్వాలి, నేను
చేసి ఇతరులతో చేయించాలి. తర్వాత పదే-పదే ఈ లక్ష్యాన్ని ఇమర్జ్ చేసుకోండి,
లక్ష్యాన్ని మరియు లక్షణాలను కలుపుకుంటూ వెళ్ళండి, అప్పుడు శక్తిశాలిగా అవుతారు.
స్లోగన్:-
లాస్ట్
లో ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటే సాధారణ మరియు వ్యర్థ సంకల్పాలలో సమయాన్ని
పోగొట్టుకోకండి.
అవ్యక్త సూచనలు -
సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి
ఎవరైతే ప్రియమైనవారో,
వారిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరము ఉండదు, వారి స్మృతి స్వతహాగానే వస్తుంది.
కాకపోతే ఆ ప్రేమ హృదయపూర్వకమైనదిగా ఉండాలి, సత్యమైనదిగా, నిస్వార్థమైనదిగా ఉండాలి.
మేరా బాబా, ప్యారా బాబా (నా బాబా, ప్రియమైన బాబా) అని అన్నప్పుడు మరి
ప్రియమైనవారిని ఎప్పుడూ మర్చిపోలేము. అంతేకాక నిస్వార్థమైన ప్రేమ బాబా నుండి తప్ప
ఇతర ఏ ఆత్మ నుండీ లభించదు, అందుకే ఎప్పుడూ అవసరానికి స్మృతి చేయకండి, నిస్వార్థ
ప్రేమలో లవలీనులై ఉండండి.
| | |