‘‘సత్యమైన హృదయముతో తండ్రికి మరియు పరివారానికి
స్నేహీలుగా అయ్యి శ్రమ నుండి ముక్తులుగా అయ్యే ప్రతిజ్ఞను
చెయ్యండి మరియు లాభాన్ని పొందండి’’
ఈ రోజు బాప్ దాదా తమ నలువైపుల ఉన్నటువంటి శ్రేష్ఠ
స్వరాజ్యాధికారీ, స్వమానధారీ పిల్లలను చూస్తున్నారు. తండ్రి
పిల్లలకు తమ కంటే కూడా ఉన్నతమైన స్వమానాన్ని ఇచ్చారు. పిల్లలు
ప్రతి ఒక్కరినీ చరణాలపై పడటము నుండి విడిపించి శిరో కిరీటముగా
చేసారు. స్వయాన్ని ఎల్లప్పుడూ ప్రియమైన పిల్లలకు సేవాధారిగానే
పిలిపించుకున్నారు. ఇంత పెద్ద అథారిటీ కల స్వమానాన్ని పిల్లలకు
ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఇంతటి స్వమానధారులుగా
భావిస్తున్నారా? స్వమానధారుల విశేష లక్షణము ఏముంటుంది? ఎవరు
ఎంత స్వమానధారులుగా ఉంటారో, అంతగానే వారు సర్వులకు గౌరవాన్ని
ఇచ్చేవారిగా ఉంటారు. ఎంతటి స్వమానధారులో, అంతే
నిర్మానచిత్తులుగా, సర్వులకు స్నేహీలుగా ఉంటారు. స్వమానధారులకు
గుర్తు - తండ్రికి ప్రియమైనవారిగా ఉండటముతోపాటు సర్వులకు
ప్రియమైనవారిగా ఉంటారు. హద్దులోని ప్రియమైనవారిగా ఉండటము కాదు,
అనంతమైన ప్రియమైనవారిగా ఉండటము. ఏ విధంగా తండ్రి సర్వులకు
ప్రియమైనవారో, అది ఒక నెల బిడ్డ కావచ్చు, ఆది రత్నాలు కావచ్చు,
ప్రతి ఒక్కరూ - నేను బాబాకు చెందినవాడిని, బాబా నా వారు అని
భావిస్తారు. అందరికీ ప్రియమైనవారు అన్నదానికి, శ్రేష్ఠ
స్వమానములో ఉన్నారు అన్నదానికి ఇది గుర్తు, ఎందుకంటే ఇటువంటి
పిల్లలు తండ్రిని ఫాలో చేసేవారిగా ఉంటారు. చూడండి, తండ్రి ప్రతి
వర్గములోని పిల్లలకు, చిన్న పిల్లల నుండి మొదలుకొని, వృద్ధుల
సమానమైన పిల్లల వరకు అందరికీ స్వమానాన్ని ఇచ్చారు. యువతకు
వినాశకారులు అన్నదానికి బదులుగా విశ్వ కళ్యాణకారులు అన్న
స్వమానాన్ని ఇచ్చారు, వారిని మహానులుగా చేసారు. ప్రవృత్తిలో
ఉండేవారిని మహాత్ములు మరియు పెద్ద-పెద్ద జగద్గురువులు కంటే కూడా
ఉన్నతమైనవారిగా చేసారు, ప్రవృత్తిలో ఉంటున్నా కూడా పర-వృత్తిలో
ఉండే మహాత్ములు కూడా తల వంచే విధంగా వీరిని తయారుచేసారు.
కన్యలకు శివ శక్తి స్వరూపులు అన్న స్వమానాన్ని గుర్తు
తెప్పించారు, వారిని అలా తయారుచేసారు. వృద్ధులైన పిల్లలకు
బ్రహ్మాబాబాకు తోటివారు, అనుభవజ్ఞులు అన్న స్వమానాన్ని ఇచ్చారు.
అలా, స్వమానధారీ పిల్లలు కూడా ప్రతి ఆత్మను ఈ విధంగా స్వమానముతో
చూస్తారు. కేవలం అలా చూడటమే కాదు, కానీ సంబంధ-సంపర్కములోకి కూడా
ఆ విధంగానే వస్తారు, ఎందుకంటే స్వమానము దేహ-అభిమానాన్ని
తొలగించేటటువంటిది. ఎక్కడైతే స్వమానము ఉంటుందో, అక్కడ దేహము
యొక్క అభిమానము ఉండదు. దేహ-అభిమానాన్ని తొలగించేందుకు చాలా సహజ
సాధనము ఏమిటంటే - సదా స్వమానములో ఉండటము, సదా ప్రతి ఒక్కరినీ
స్వమానముతో చూడటము. పాదచారులు కావచ్చు, 16 వేల మాలలోని చివరి
నంబరువారైనా కావచ్చు, కానీ చివరి నంబరులోని వారిలో కూడా
డ్రామానుసారముగా తండ్రి ద్వారా ఏదో ఒక విశేషత ఉంటుంది.
స్వమానధారులు ఆ విశేషతను చూసి స్వమానాన్ని ఇస్తారు. వారి
దృష్టిలో, వృత్తిలో, కృతిలో, ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంటుంది.
ఎవరెవరైతే తండ్రికి చెందినవారిగా అయ్యారో, వారు విశేష ఆత్మ.
వారు నంబరువారుగా ఉండి ఉండవచ్చు, కానీ ప్రపంచములోని
కోట్లాదిమందిలో వారు కొందరే. ఈ విధంగా అందరూ స్వయాన్ని విశేష
ఆత్మగా భావిస్తున్నారా? స్వమానములో స్థితులై ఉండాలి.
దేహ-అభిమానములో కాదు, స్వమానములో ఉండాలి.
తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఎందుకని ప్రేమ ఉంది?
ఎందుకంటే - నన్ను గుర్తించి, నా వారిగా అయ్యారు కదా అని
తండ్రికి తెలుసు. ఈ రోజు ఈ మేళాలో కూడా మొదటిసారిగా వచ్చినవారు
కావచ్చు, అయినా ‘బాబా’ అని అన్నారు కావున వారు తండ్రి ప్రేమకు
పాత్రులు. బాప్ దాదాకు నలువైపులా ఉన్న పిల్లలందరూ అందరూ
అందరికంటే ప్రియమైనవారు. ఇలానే తండ్రిని ఫాలో చేయండి. ఎవ్వరూ
ప్రియమైనవారిగా లేకుండా లేరు, అందరూ ప్రియమైనవారే. చూడండి,
ఏయే పిల్లలైతే ‘నా బాబా’ అని అంటారో, అక్కడ ‘నా’ అన్న భావనను
తీసుకువచ్చింది ఏమిటి? స్నేహము. ఎవరెవరైతే ఇక్కడ కూర్చున్నారో,
వారు, స్నేహమే బాబాకు చెందినవారిగా చేసింది అని భావిస్తారు.
బాబా స్నేహము అయస్కాంతము వంటిది, స్నేహమనే అయస్కాంతము ద్వారా
బాబాకు చెందినవారిగా అయ్యారు. అది హృదయపూర్వకమైన స్నేహము, నామ
మాత్రమైన స్నేహము కాదు. హృదయపూర్వకమైన స్నేహము ఈ బ్రాహ్మణ
జీవితానికి పునాది. కలుసుకునేందుకు ఎందుకు వస్తారు? స్నేహమే
తీసుకువచ్చింది కదా! మీరంతా ఎవరైతే కూర్చుని ఉన్నారో, ఎవరైతే
వచ్చారో, మీరు ఎందుకు వచ్చారు? స్నేహము ఆకర్షించింది కదా.
స్నేహము కూడా ఎంత ఉంది? 100 శాతము ఉందా లేక తక్కువగా ఉందా?
స్నేహములో మేము 100 శాతము ఉన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో,
వారు చేతులెత్తండి. స్నేహములో 100 శాతము. కొంచెము కూడా తక్కువ
కాదా? మంచిది. మరి ఇంతటి స్నేహమే పరస్పరం బ్రాహ్మణుల మధ్యన ఉందా?
ఇందులో చేతులెత్తించమంటారా? ఇందులో పర్సెంటేజ్ ఉంది. ఏ విధంగా
బాబాకు అందరి పట్ల స్నేహము ఉందో, అదే విధంగా పిల్లలకు కూడా
సర్వుల పట్ల స్నేహము ఉండాలి, సర్వుల స్నేహీలుగా ఉండాలి.
ఇతరులలోని బలహీనతలను చూడకండి. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి
వశీభూతులై ఉంటే, అప్పుడు ఎవరిని ఫాలో చేయాలి? వశీభూతులై
ఉన్నవారినా? వాస్తవానికి మీరే వశీకరణ మంత్రాన్ని ఇచ్చేవారు,
వశీభూతమవ్వడము నుండి విడిపించే మంత్రాన్ని ఇచ్చేవారు, మీరు
విడిపించేవారే కదా! లేక బలహీనతను చూసేవారా? లేక వారి బలహీనత
కనిపించేస్తుందా? ఒకవేళ ఏదైనా చెడు వస్తువు కనిపించింది
అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చూస్తూ ఉంటారా లేక పక్కకు
తప్పుకుంటారా? ఎందుకంటే బాప్ దాదా ఏం చూసారంటే, ఎవరైతే
హృదయపూర్వకమైన స్నేహము కలవారిగా ఉంటారో, తండ్రి పట్ల
హృదయపూర్వకమైన స్నేహము కలిగి ఉంటారో, వారి పట్ల సర్వులకు
తప్పకుండా స్నేహము ఉంటుంది. సంపన్నముగా మరియు సంపూర్ణముగా
అయ్యేందుకు చాలా సహజమైన విధి - హృదయపూర్వకమైనస్నేహము. ఎవరు
ఎంత జ్ఞానవంతులైనా కావచ్చు, కానీ ఒకవేళ హృదయపూర్వకమైన స్నేహము
లేకపోతే బ్రాహ్మణ జీవితము రమణీకమైన జీవితములా ఉండదు.
నిస్సారమైన జీవితములా ఉంటుంది, ఎందుకంటే జ్ఞానములో, ఒకవేళ
స్నేహము లేకుండా జ్ఞానము ఉంటే, అప్పుడు జ్ఞానములో ఎందుకు, ఏమిటి
అనే ప్రశ్నలు తలెత్తుతాయి! కానీ స్నేహము అనేది జ్ఞాన సహితముగా
ఉన్నట్లయితే, స్నేహీలు సదా స్నేహములో లవలీనులై ఉంటారు. స్నేహము
ఉన్నవారు స్మృతి చేయటానికి శ్రమ చేయవలసిన అవసరముండదు. కేవలం
జ్ఞానీలుగా ఉంటే, స్నేహము లేకపోతే, శ్రమించాల్సి వస్తుంది. వారు
శ్రమ యొక్క ఫలం తింటారు, వీరు ప్రేమ యొక్క ఫలం తింటారు. జ్ఞానము
బీజము, కానీ స్నేహము నీరు వంటిది. ఒకవేళ బీజానికి స్నేహమనే నీరు
లభించకపోతే ఫలం రాదు.
ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి హృదయములో ఉన్న స్నేహాన్ని చెక్
చేసారు. తండ్రి పట్ల ఉన్న స్నేహము మరియు సర్వుల పట్ల ఉన్న
స్నేహము. మరి మీరందరూ స్వయాన్ని ఎలా ఉన్నట్లు భావిస్తున్నారు?
స్నేహీలేనా? స్నేహము కలవారేనా? హృదయపూర్వకమైన స్నేహము కలవారము
అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. (మెజారిటీ అందరూ
చేతులెత్తారు) అచ్ఛా - సర్వుల పట్ల స్నేహము కలవారేనా? తండ్రి
పట్లనైతే హృదయపూర్వకమైన స్నేహము కలవారిగా ఉన్నారు, మరి సర్వుల
పట్ల స్నేహము కలవారిగా ఉన్నారా? సర్వుల పట్లనా? వీరు నా సోదరుడు
లేక సోదరి అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? వీరు నా వారు అని
ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? భావిస్తున్నారా? లేక కొందరు
మాత్రమే అలా భావిస్తున్నారా? ఏ విధంగా బాబా పట్ల స్నేహము ఉంది
అన్న విషయములో అందరూ చేతులెత్తుతారు, అవును, బాబా పట్ల
స్నేహముంది, మరి అదే విధంగా, అవును, సర్వుల పట్ల స్నేహముంది అని
మీరు ప్రతి ఒక్కరి కోసం చేతులెత్తుతారా? ఈ సర్టిఫికేట్
లభిస్తుందా? ఎందుకంటే బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు,
కేవలం తండ్రి నుండి మాత్రమే సర్టిఫికేట్ తీసుకోవటం కాదు,
బ్రాహ్మణ పరివారము నుండి కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఈ సమయములో
బాబా ధర్మము మరియు రాజ్యము, ఈ రెండింటినీ కలిపి స్థాపన
చేస్తున్నారు. రాజ్యములో కేవలం తండ్రి మాత్రమే ఉండరు, పరివారము
కూడా ఉంటుంది. బాబాకు కూడా ప్రియమైనవారిగా ఉండాలి, పరివారానికి
కూడా ప్రియమైనవారిగా ఉండాలి.
జ్ఞానీలుగా అయ్యారు, కానీ దానితోపాటు స్నేహీలుగా అవ్వటము
కూడా తప్పనిసరి. స్వమానములో ఉండటము మరియు గౌరవాన్ని ఇవ్వటము, ఈ
రెండూ తప్పనిసరి. బ్రాహ్మణ జన్మ తీసుకోవటంతోనే బాబా పిల్లలు
ప్రతి ఒక్కరికీ గౌరవాన్ని ఇచ్చారు, అందుకే కదా ఉన్నతముగా
అయ్యారు. ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వాలి మరియు మొత్తము
కల్పమంతా దాని ప్రారబ్ధముగా గౌరవము ప్రాప్తిస్తుంది. అర్ధకల్పము
రాజ్యాధికారిగా ఉన్న గౌరవము లభిస్తుంది, అర్ధకల్పము భక్తిలో
భక్తుల ద్వారా గౌరవము లభిస్తుంది. కానీ దీనికి ఆధారము, మొత్తము
కల్పానికి ఆధారము ఏమిటంటే - ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వటము,
గౌరవాన్ని తీసుకోవటము.
ఇప్పుడిప్పుడే బాప్ దాదా చూస్తున్నారు - నలువైపులా
విదేశాలలో కొందరు రాత్రిలో, కొందరు పగలులో మిలనము
జరుపుకుంటున్నారు. మంచిగా పురుషార్థపు గతిని పెంచుకునేందుకు
మీకు దాదీ కూడా (జానకి దాదీ) మంచిగా లభించారు. అవును కదా? ఏ
మాత్రం ఏదైనా లోపము చూసారంటే, వెంటనే క్లాస్ మీద క్లాస్
చేయిస్తారు. పిల్లలు ఎవరికైనా, అది దేశమువారు కావచ్చు,
విదేశాలవారు కావచ్చు, ఏ సబ్జెక్టులోనైనా కష్టమనిపిస్తుందంటే,
దానికి ముఖ్యమైన కారణము - హృదయపూర్వకమైన స్నేహములో లోపము.
స్నేహము అనగా లవలీనము. స్మృతి చేయవలసిన అవసరము ఉండదు, కానీ
స్మృతిని మర్చిపోవటము కష్టమవుతుంది. ఒకవేళ శ్రమ చేయవలసి
వస్తుందంటే, ఎక్కడైనా లీకేజ్ ఉందా అని మీ హృదయపూర్వకమైన
స్నేహాన్ని చెక్ చేసుకోండి. మోహము అనేది ఎవరి పట్ల ఉన్నా సరే,
వ్యక్తి పట్ల కావచ్చు, వ్యక్తి యొక్క విశేషత పట్ల కావచ్చు,
ఏదైనా సాధనము పట్ల కావచ్చు, సౌకర్యము పట్ల కావచ్చు, అదనపు
సౌకర్యము పట్ల కావచ్చు, నియమానుసారముగా లభించే సౌకర్యాలు సరే
కానీ అదనపు సౌకర్యాల పట్ల కూడా ప్రేమ ఉంటుంది, మోహము ఉంటుంది,
అప్పుడు ఆ సౌకర్యమే గుర్తుకొస్తూ ఉంటుంది. దానికి గుర్తు
ఏమిటంటే - ఎక్కడ లీకేజ్ ఉన్నా సరే, సదా జీవితములో ఏదో ఒక కారణము
వలన సంతుష్టత యొక్క అనుభూతి ఉండదు. ఏదో ఒక కారణము అసంతుష్టతను
అనుభవము చేయిస్తుంది. మరియు ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో, దానికి
గుర్తు ఏమిటంటే - సదా ప్రసన్నత ఉంటుంది. వారు సదా ఆత్మిక గులాబీ
వలె చిరునవ్వుతో ఉంటారు, వికసించి ఉంటారు. మూడ్ ఆఫ్ అవ్వరు, సదా
డబల్ లైట్ గా ఉంటారు. మరి అర్థమైందా, ఇప్పుడిక శ్రమ నుండి
ముక్తులుగా అవ్వండి. బాప్ దాదాకు పిల్లల శ్రమ మంచిగా అనిపించదు.
అర్ధకల్పము శ్రమ చేసారు, ఇప్పుడు ఇక ఆనందముగా ఉండండి, ప్రేమలో
లవలీనులై ఉండండి, జ్ఞాన సాగరుని లోతుల్లో అనుభవాలనే ముత్యాలను
అనుభవము చెయ్యండి. కేవలం మునకలు వేసి సాగరము నుండి బయటకు
వచ్చేయకండి, లవలీనులై ఉండండి.
కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము అని అందరూ ప్రతిజ్ఞనైతే
చేసారు కదా? ప్రతిజ్ఞ చేసారా? కలిసే వస్తారా లేక వెనక-వెనక
వస్తారా? ఎవరైతే కలిసి వెళ్ళేందుకు సిద్ధముగా ఉన్నారో, వారు
చేతులెత్తండి. సిద్ధముగా ఉన్నారా, ఆలోచించి చేతులెత్తండి,
సిద్ధముగా ఉన్నారు అంటే అర్థము బాబా సమానముగా ఉండటము. ఎవరు
కలిసే వెళ్తారు? సమానముగా ఉన్నవారే కలిసి వెళ్తారు కదా! మరి
వెళ్తారా? ఎవర్రెడీనా? మొదటి లైన్ లో ఉన్నవారు ఎవర్రెడీనా?
రేపే వెళ్ళాలి అని ఆర్డర్ చేస్తే, వస్తారా? అచ్ఛా,
ప్రవృత్తిలోని వారు వస్తారా? పిల్లలు గుర్తుకు రారా? మాతలు
వస్తారా? మాతలు సిద్ధముగా ఉన్నారా? ఏదీ గుర్తుకు రాదా? టీచర్లకు
సెంటర్ గుర్తుకు వస్తుందా, జిజ్ఞాసువులు గుర్తుకు వస్తారా?
గుర్తుకు రారా? అచ్ఛా. అందరూ నిర్మోహులుగా అయిపోయారా? అలా అయితే
చాలా మంచిది. అప్పుడిక శ్రమ చేయవలసిన అవసరముండదు కదా.
ఈ రోజు బాప్ దాదా అందరినీ, సమ్ముఖముగా కూర్చున్నవారు కావచ్చు,
లేక దూరముగా కూర్చుని ఉన్నా కానీ తండ్రి హృదయములో కూర్చున్నారు,
అందరినీ ఈ రోజు శ్రమ నుండి ముక్తులుగా చెయ్యాలనుకుంటున్నారు.
మరి అవుతారా? చప్పట్లు అయితే కొట్టారు, మరి అలా అవుతారా? రేపటి
నుండి ఎవ్వరూ దాదీల వద్దకు వెళ్ళరు. వారికి శ్రమ కలిగించరు కదా?
వారిని ఆనందముగా కలుస్తారు. జోన్ హెడ్ వద్దకు వెళ్ళరు,
కంప్లెయింట్లు (ఫిర్యాదులు) చెయ్యరు, కంప్లీట్ (సంపూర్ణము).
సరేనా? ఇప్పుడు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి,
ఊరికే అలా ఎత్తడం కాదు. ఎటువంటి కంప్లెయింట్ ఉండకూడదు,
నాది-నాది అనేది ఉండకూడదు, ఎవ్వరూ నా వారు కారు. నేను అనేది
ఉండకూడదు, నాది అనేది ఉండకూడదు, సమాప్తము. చూడండి,
ప్రతిజ్ఞనైతే చేసారు, మంచిది, అభినందనలు, కానీ విషయమేమిటంటే,
ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందటము లేదు. ప్రతిజ్ఞను చాలా త్వరగా
చేస్తారు, కానీ లాభాన్ని పొందేందుకు ప్రతిరోజూ - ఒకటేమో
రియలైజేషన్ అవ్వండి, రెండవది రివైజ్ చేసుకోండి. ఏం ప్రతిజ్ఞ
చేసాము అని ఆ ప్రతిజ్ఞను రోజూ రివైజ్ చేసుకోండి. అమృతవేళ
మిలనము తర్వాత ‘ప్రతిజ్ఞ’ మరియు దాని ‘లాభము’, ఈ రెండింటి
బ్యాలెన్స్యొక్క చార్టును తయారుచేసుకోండి. ఏం ప్రతిజ్ఞ చేసాము?
మరియు లాభము ఎంత పొందుతున్నాము? రియలైజ్ అవ్వండి, రివైజ్
చేసుకోండి, బ్యాలెన్స్ఉంటే మంచిగా అయిపోతుంది. మీటింగ్ వారు
ప్రతిజ్ఞ చేసారు అన్నది బాప్ దాదాకు తెలుసు.
ప్లాన్లు చాలా మంచి-మంచివి తయారుచేస్తారు అన్నది బాప్ దాదా
చూసారు, బాప్ దాదాకు అవి ఇష్టము. బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు?
బాప్ దాదా కేవలం ఒక్క మాటను కోరుకుంటున్నారు. ఆ ఒక్క మాట
ఏమిటంటే - సఫలము చేయండి, సఫలురుగా అవ్వండి. ఖజానాలు, శక్తులు,
సంకల్పాలు, మాటలు ఏవేవైతే ఉన్నాయో, ఆ మాటకొస్తే కర్మ కూడా
శక్తియే, ఈ సమయము కూడా శక్తియే, ఖజానాయే. అన్నింటినీ సఫలము
చేయాలి. స్థూల ధనము కావచ్చు, అలౌకిక ఖజానాలు కావచ్చు,
అన్నింటినీ సఫలము చేయాలి. సఫలతామూర్తి అన్న సర్టిఫికేట్ ను
తీసుకోవాల్సిందే. సఫలము చెయ్యండి మరియు సఫలము చేయించండి. ఒకవేళ
ఎవరైనా అసఫలము చేస్తుంటే, వారికి మాటల ద్వారా, శిక్షణ ద్వారా
కాదు, మీ శుభ భావన, శుభ కామన మరియు సదా శుభమైన గౌరవాన్ని
ఇవ్వటం ద్వారా వారి చేత సఫలము చేయించండి. కేవలం శిక్షణ మాత్రమే
ఇవ్వకండి, ఒకవేళ శిక్షణ ఇవ్వవలసి వచ్చినా కూడా, క్షమ మరియు
శిక్షణ, క్షమా రూపులుగా అయి శిక్షణను ఇవ్వండి. దయార్ద్ర
హృదయులుగా అవ్వండి, కరుణా హృదయులుగా అవ్వండి. మీ దయా రూపము
తప్పకుండా ఆ శిక్షణకు రిజల్టు చూపిస్తుంది. చూడండి, ఈ రోజుల్లో
సైన్స్ డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు, ముందు ఏం చేస్తారు?
మొదట మత్తు ఇచ్చి పడుకోబెడతారు, ఆ తర్వాత కోస్తారు, ముందే
కొయ్యరు. టించరు అయోడిన్ వేసేటప్పుడు కూడా ముందు ఊదుతారు, ఆ
తర్వాత టించరు వేస్తారు. మరి మీరు కూడా మొదట దయార్ద్ర హృదయులుగా
అవ్వండి, ఆ తర్వాత శిక్షణ ఇవ్వండి, అప్పుడు ప్రభావము పడుతుంది,
లేదంటే ఏం జరుగుతుంది, మీరు శిక్షణ ఇవ్వటం మొదలుపెడతారు, కానీ
వారు ముందే మీ కంటే పెద్ద శిక్షకులు. కనుక శిక్షకుడు, శిక్షకుని
శిక్షణను స్వీకరించరు. ఇలా చెయ్యకండి, ఇలా చెయ్యండి అని మీరు
ఏవైతే పాయింట్లు చెప్తారో, వాటిని ఖండించటానికి వారి వద్ద 10
పాయింట్లు ఉంటాయి, అందుకే క్షమ మరియు శిక్షణ కలిసి ఉండాలి, మరి
ఈ 70వ సంవత్సరము యొక్క థీమ్ఏమిటంటే - సఫలము చెయ్యండి, సఫలము
చేయించండి. సఫలతామూర్తులుగా అవ్వండి, అన్నింటినీ సఫలము చెయ్యండి.
డబల్ లైట్ గా అవ్వాలి కదా, మరి సఫలము చెయ్యండి. సంస్కారాన్ని
కూడా సఫలము చెయ్యండి. ఆత్మలైన మీ అసలైన ఆది సంస్కారాలు, దేవతా
సంస్కారాలు, అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాటిని
ఇమర్జ్చేయండి. తప్పుడు సంస్కారాలకు అంతిమ సంస్కారము చేయండి. ఆది,
అనాది సంస్కారాలను ఇమర్జ్చేయండి. ఇప్పుడు అందరిదీ విశేషముగా ఒకే
ఒక ఫిర్యాదు మిగిలిపోయింది, అది ఏమిటంటే - సంస్కారాలు మారటం
లేదు, సంస్కారాలు మారటం లేదు.
శ్రమ నుండి ముక్తులుగా అవుతాము అని అందరూ ప్రతిజ్ఞనైతే
చేసారు కదా! (అందరూ చేతులెత్తారు). అచ్ఛా - వీరి ఫోటో తీయండి.
ఇప్పుడు ఒక్క నిమిషము కొరకు మీ హృదయపూర్వకముగా ఈ ప్రతిజ్ఞకు
దృఢతతో అండర్ లైన్ చెయ్యండి. మీ మనసులో పక్కా చేసుకోండి (డ్రిల్).
అచ్ఛా.
నలువైపులా ఉన్న స్వమానధారీ పిల్లలందరికీ, సదా తండ్రి పట్ల
హృదయపూర్వకమైన స్నేహము కలవారికి, సర్వుల పట్ల స్నేహము కల
శ్రేష్ఠ ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా ఉంటూ జీవన్ముక్తిని
అనుభవము చేసే తీవ్ర పురుషార్థీ పిల్లలకు, సదా ప్రతిజ్ఞ
చేసేవారికి మరియు ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందేవారికి,
బ్యాలెన్స్పెట్టుకునే ఆనంద స్వరూపులైన పిల్లలకు, సదా ఆనందములో
ఉండేవారికి, ఇతరులను కూడా ఆనందములో ఉండేలా చేసేవారికి, ఇటువంటి
సంగమయుగీ శ్రేష్ఠ భాగ్యము యొక్క అధికారీ పిల్లలకు బాప్ దాదాల
ప్రియస్మృతులు మరియు హృదయాభిరాముని హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను
స్వీకరించండి. ప్రియస్మృతులు మరియు నమస్తే.