ఓంశాంతి
పిల్లలు ఏమన్నారు మరియు ఓ జ్ఞాన సాగరా, ఓ జ్ఞాన సూర్యుడైన బాబా... అని ఎవరిని
పిలిచారు. భగవంతుడిని బాబా అని అంటారు కదా. భగవంతుడు తండ్రి కావున మీరంతా సంతానము.
మేము అంధకారములోకి వచ్చి పడ్డాము, మీరు మమ్మల్ని ప్రకాశములోకి తీసుకువెళ్ళండి అని
పిల్లలంటారు. ‘బాబా’ అని అనడముతో తండ్రిని పిలుస్తున్నారని ఋజువవుతుంది. ‘బాబా’
అన్న మాటను పలకడముతో ప్రేమ కలుగుతుంది ఎందుకంటే తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకోవడము జరుగుతుంది. కేవలం ఈశ్వరా లేక ప్రభు అని అనడముతో, తండ్రి వారసత్వము
యొక్క మాధుర్యము అనుభూతి అవ్వదు. ‘బాబా’ అని అనడముతో వారసత్వము గుర్తుకువస్తుంది.
బాబా, మేము అంధకారములోకి వచ్చి పడ్డాము, మీరు ఇప్పుడు మళ్ళీ జ్ఞానముతో మా జ్యోతిని
వెలిగించండి అని మీరు పిలుస్తారు, ఎందుకంటే ఆత్మల జ్యోతి ఆరిపోయి ఉంది. మనుష్యులు
మరణించినప్పుడు 12 రోజులు దీపాన్ని వెలిగిస్తారు. దీపము ఆరిపోకుండా నేతిని
వేసేందుకని ఒకరు కూర్చుని ఉంటారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - భారతవాసులైన మీరు ప్రకాశములో అనగా పగలులో ఉండేవారు,
ఇప్పుడు రాత్రిలో ఉన్నారు. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. అది హద్దులోని
విషయము. ఇది అనంతమైన పగలు మరియు అనంతమైన రాత్రి. సత్య-త్రేతాయుగాలను బ్రహ్మా యొక్క
పగలు అని అంటారు, ద్వాపర-కలియుగాలను బ్రహ్మా యొక్క రాత్రి అని అంటారు. రాత్రివేళలో
అంధకారము ఉంటుంది, మనుష్యులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుడిని వెతికేందుకనే
అన్నివైపులకు తిరుగుతూ ఉంటారు కానీ పరమాత్మను పొందలేరు. పరమాత్ముడిని పొందేందుకనే
భక్తి చేస్తారు. ద్వాపరము నుండి భక్తి ప్రారంభమవుతుంది అనగా రావణ రాజ్యము
ప్రారంభమవుతుంది. దసరా గురించి కూడా ఒక కథను తయారుచేసారు. కథలను ఎప్పుడూ మనసుకు
తోచినట్లుగా తయారుచేస్తారు, బయోస్కోప్ (సినిమా), నాటకాలు మొదలైనవి తయారుచేసినట్లుగా
తయారుచేస్తారు. శ్రీమత్ భగవద్గీతయే సత్యమైనది. పరమాత్మ పిల్లలకు రాజయోగాన్ని
నేర్పించారు, రాజ్యాన్ని ఇచ్చారు. తర్వాత భక్తి మార్గములో కూర్చుని కథలను
తయారుచేస్తారు. వ్యాసుడు గీతను తయారుచేసారు అనగా కథను తయారుచేసారు. సత్యమైన
విషయాన్ని అయితే తండ్రి ద్వారా మీరు ఇప్పుడు వింటున్నారు. ఎల్లప్పుడూ బాబా-బాబా అని
అంటూ ఉండాలి. పరమాత్మ మన తండ్రి, వారు కొత్త ప్రపంచ రచయిత, కావున తప్పకుండా వారి
నుండి మనకు స్వర్గ వారసత్వము లభించాలి. ఇప్పుడైతే 84 జన్మలను అనుభవించి మనము
నరకములోకి వచ్చి పడ్డాము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, భారతవాసులైన మీరు
సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా ఉండేవారు, విశ్వానికి యజమానులుగా ఉండేవారు.
అప్పుడు ఇతర ధర్మాలేవీ ఉండేవి కావు, దానిని స్వర్గము లేక కృష్ణపురి అని అంటారు. ఇది
కంసపురి. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేదని బాప్ దాదా స్మృతినిప్పిస్తున్నారు.
తండ్రియే జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, పతిత-పావనుడు, అంతేకానీ నీటి గంగ కాదు.
వధువులందరికీ భగవంతుడు ఒక్కరే వరుడు - ఇది మనుష్యులకు తెలియదు. అందుకే ఆత్మల తండ్రి
ఎవరు, అని అడగడము జరుగుతుంది, అప్పుడు తికమకపడతారు. మాకు తెలియదు అని అంటారు. అరే
ఆత్మా, నీకు నీ తండ్రి గురించి తెలియదా? గాడ్ ఫాదర్ అని అంటారు. మరి వారి నామ-రూపాలు
ఏమిటి, గాడ్ ను మీరు గుర్తించగలరా అని అడగడము జరుగుతుంది. అప్పుడు, వారు సర్వవ్యాపి
అని అంటారు. అరే, పిల్లల తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి అవ్వగలరా? రావణుడి ఆసురీ
మతాన్ని అనుసరించి ఎంత తెలివిహీనులుగా అయిపోతారు. దేహాభిమానము నంబరువన్. స్వయాన్ని
ఆత్మ అని నిశ్చయము చేసుకోరు. నేను ఫలానాను అని అంటారు, అప్పుడది శరీరానికి
సంబంధించిన విషయమవుతుంది. వాస్తవానికి స్వయము ఎవరు అన్నది తెలియదు. నేను జడ్జిని,
నేను ఫలానాను... ‘నేను’, ‘నేను’ అని అంటూ ఉంటారు, కానీ ఇది రాంగ్. నేను మరియు నాది,
ఇవి రెండు విషయాలు. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. పేరు శరీరానికి పెట్టడము
జరుగుతుంది. ఆత్మకు పేరేమీ పెట్టడము జరగదు. తండ్రి అంటారు - నా పేరు శివ మాత్రమే.
శివజయంతిని కూడా జరుపుకుంటారు. ఇప్పుడు నిరాకారుని జయంతి ఎలా జరుగుతుంది. వారు
ఎవరిలోకి వస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఆత్మలందరికీ ఆత్మ అన్న పేరే ఉంటుంది.
పరమాత్ముని పేరు శివ. మిగిలినవారందరూ సాలిగ్రామాలు. ఆత్మలు పిల్లలు. ఒక్క శివుడే
ఆత్మలందరికీ తండ్రి. వారు అనంతమైన తండ్రి. మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి,
మేము దుఃఖితులుగా ఉన్నాము అని అందరూ వారిని పిలుస్తారు. ఆత్మ పిలుస్తుంది, దుఃఖములో
పిల్లలందరూ స్మృతి చేస్తారు, ఆ పిల్లలే సుఖములో ఉన్నప్పుడు ఎవ్వరూ స్మృతి చేయరు.
దుఃఖితులుగా చేసింది రావణుడు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ రావణుడు మీ పాత శత్రువు. డ్రామా ఆట ఇలా
తయారుచేయబడి ఉంది. ఇప్పుడు అందరూ అంధకారములో ఉన్నారు, అందుకే - ఓ జ్ఞానసూర్యుడా రండి,
మమ్మల్ని ప్రకాశములోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. భారత్ సుఖధామముగా ఉన్నప్పుడు
ఎవరూ పిలిచేవారు కాదు. అక్కడ అప్రాప్తి అన్న వస్తువేదీ ఉండేది కాదు. ఇక్కడైతే - ఓ
శాంతిదేవా, అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు -
శాంతి అనేదైతే మీ స్వధర్మము, మీ కంఠహారము. ఆత్మ శాంతిధామ నివాసి, శాంతిధామము నుండి
మళ్ళీ సుఖధామములోకి వెళ్తుంది. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. మీకు ఆర్తనాదాలు
చేయవలసిన అవసరము ఉండదు. దుఃఖములోనే ఇలా ఆర్తనాదాలు చేస్తారు - దయ చూపించండి,
దుఃఖహర్త-సుఖకర్త అయిన తండ్రి, రండి, శివబాబా, మధురమైన తండ్రి, మళ్ళీ రండి అని
అంటారు. వారు తప్పకుండా వస్తారు కావుననే శివజయంతిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు
స్వర్గము యొక్క రాకుమారుడు. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు
ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. రాధా-కృష్ణులే స్వయంవరము తర్వాత
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఓ గాడ్ ఫాదర్... అని మనుష్యులే
పిలుస్తూ ఉంటారు. అచ్ఛా, మరి వారి నామ-రూపాలు ఏమిటి అని అడిగితే, వారు నామ-రూపాలకు
అతీతుడు అని అంటారు. అరే, మీరు గాడ్ ఫాదర్ అని అంటారు, మళ్ళీ నామ-రూపాలకు అతీతుడు
అని అంటారు. ఆకాశము శూన్యము, దానికి కూడా ‘ఆకాశము’ అన్న పేరుంది. తండ్రి యొక్క
నామ-రూపాలు మొదలైనవాటి గురించి మాకు తెలియదని మీరంటారు, అచ్ఛా, మీ గురించి మీకు
తెలుసా, అని అడగండి. తెలుసు, మేము ఆత్మలము అని అంటారు. అచ్ఛా, ఆత్మ యొక్క నామ-రూపాలు
చెప్పండి - అని అడగండి. అప్పుడు ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఆత్మ నామ-రూపాలకు
అతీతమైతే కాదు. ఆత్మ ఒక బిందువు, నక్షత్రము వలె ఉంటుంది, భృకుటి మధ్యలో ఉంటుంది. ఈ
చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయము,
అందుకే 7 రోజుల భట్టీ గాయనము చేయబడింది. ద్వాపరము నుండి రావణ రాజ్యము
ప్రారంభమయ్యింది, అప్పటినుండి వికారాలు ప్రవేశించాయి, మెట్లు దిగుతూ వచ్చారు.
ఇప్పుడు అందరికీ గ్రహణము పట్టి ఉంది, నల్లగా అయిపోయారు, అందుకే - ఓ జ్ఞానసూర్యుడా
రండి, వచ్చి మమ్మల్ని ప్రకాశములోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. జ్ఞాన అంజనమును
సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారము వినాశనమయ్యింది... అని అంటారు. అప్పుడు,
బుద్ధిలోకి తండ్రి వస్తారు. అంతేకానీ, జ్ఞాన అంజనాన్ని గురువు ఇస్తారని కాదు...
గురువులైతే అనేకమంది ఉన్నారు, వారిలో జ్ఞానము ఎక్కడుంది, వారికి గాయనము లేదు.
జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. అటువంటప్పుడు
ఇతరులెవరైనా జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు. భగవంతుడిని కలుసుకునేందుకు అనేక మార్గాలు
ఉన్నాయని సాధువులు అంటారు. శాస్త్రాలు చదవడము, యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడము -
ఇవన్నీ భగవంతుడిని కలుసుకునేందుకు మార్గాలని అంటారు కానీ పతితులు పావన ప్రపంచములోకి
ఎలా వెళ్ళగలరు. నేను స్వయముగా వస్తానని తండ్రి అంటారు. భగవంతుడైతే ఒక్కరే,
బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా దేవతలే. వారిని భగవంతుడు అని అనరు, వారికి కూడా తండ్రి
శివుడే. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడే ఉంటారు కదా. ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత
బ్రహ్మాకుమారీ ఇన్స్టిట్యూషన్ అన్న పేరు కూడా వ్రాయబడి ఉంది. కనుక మీరు పిల్లలైనట్లు.
ఎంతోమంది బి.కె.లు ఉన్నారు. వారసత్వము శివుడి నుండి లభిస్తుంది, అంతేకానీ బ్రహ్మా
నుండి కాదు. వారసత్వము తాతగారి నుండి లభిస్తుంది. బ్రహ్మా ద్వారా స్వర్గములోకి
వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు. బ్రహ్మా ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటారు.
పిల్లలు కూడా - బాబా, మేము మీవారిమే, మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటామని అంటారు.
బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. శివబాబా రాజయోగాన్ని
నేర్పిస్తారు. శ్రీమతము అనగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన భగవంతుని గీత. భగవంతుడు ఒక్కరే,
వారు నిరాకారుడు. పిల్లలైన మీరు 84 జన్మలు తీసుకున్నారని తండ్రి అర్థం
చేయిస్తున్నారు. ఆత్మ, పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు... అని అంటారు. చాలా కాలం
నుండి వేరుగా ఉన్నది భారతవాసులే. ఆ సమయములో వేరే ధర్మమేమీ ఉండేది కాదు. ఈ ధర్మమువారే
మొట్టమొదట దూరమయ్యారు. తండ్రి నుండి దూరమై, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు.
తండ్రి అంటారు - ఓ ఆత్మలూ, ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇది స్మృతియాత్ర
లేక యోగాగ్ని. మీ శిరస్సుపై ఏదైతే పాపాల భారము ఉందో, అది ఈ యోగాగ్నితో భస్మమవుతుంది.
ఓ మధురమైన పిల్లలూ, మీరు బంగారుయుగము నుండి ఇనుపయుగములోకి వచ్చేశారు. ఇప్పుడు నన్ను
స్మృతి చేయండి. ఇది బుద్ధితో చేసే పని కదా. దేహ సహితముగా దేహపు సంబంధాలన్నింటినీ
వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు ఆత్మ కదా. ఇది మీ శరీరము. నేను, నేను అని
ఆత్మ అంటుంది. మిమ్మల్ని రావణుడు పతితులుగా చేసాడు. ఈ ఆట తయారుచేయబడి ఉంది. పావన
భారత్ మరియు పతిత భారత్ ఉంటాయి. పతితముగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు.
రామరాజ్యము కావాలని అంటారు కూడా, కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. జ్ఞానాన్ని ఇచ్చే
జ్ఞానసాగరుడు అయితే ఒక్క తండ్రి మాత్రమే. తండ్రియే వచ్చి క్షణములో వారసత్వాన్ని
ఇస్తారు. ఇప్పుడు తండ్రి నుండి సూర్యవంశీ, చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకునేందుకు
మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు. తర్వాత సత్య, త్రేతాయుగాలలో మీరు అమరులుగా
అయిపోతారు. ఫలానావారు మరణించారు అని అక్కడ ఇలా అనరు. సత్యయుగములో అకాల మృత్యువులు
ఉండవు. మీరు కాలుడిపై విజయము పొందుతారు. అక్కడ దుఃఖము యొక్క పేరే ఉండదు. దానిని
సుఖధామమని అంటారు. తండ్రి అంటారు, నేను మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తాను,
అక్కడ చాలా వైభవాలు ఉంటాయి. భక్తి మార్గములో మందిరాలను నిర్మించారు. ఆ సమయములో కూడా
ఎంత ధనముండేది. భారత్ ఎలా ఉండేది! మిగిలిన ఆత్మలందరూ నిరాకారీ ప్రపంచములో ఉండేవారు.
ఉన్నతోన్నతమైన బాబా ఇప్పుడు స్వర్గ స్థాపనను చేస్తున్నారని పిల్లలు తెలుసుకున్నారు.
ఉన్నతోన్నతమైనవారు శివబాబా, తర్వాత సూక్ష్మ వతనవాసులైన బ్రహ్మా-విష్ణు-శంకరులు, ఆ
తర్వాత ఈ ప్రపంచము.
జ్ఞానము ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతుంది. జ్ఞానము, భక్తి మరియు
వైరాగ్యము అని అంటూ ఉంటారు కూడా. పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలుగుతుంది ఎందుకంటే
సత్యయుగ రాజ్యాధికారము లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, నన్నొక్కరినే
స్మృతి చేయండి, నన్ను స్మృతి చేస్తూ మీరు నా వద్దకు వచ్చేస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.