ఓంశాంతి
తండ్రి ప్రతిరోజు పిల్లలకు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చోండి
అని అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ రోజు దానికి ఇంకొకటి కలుపుతున్నారు, అదేమిటంటే -
వారిని కేవలం తండ్రిగా మాత్రమే భావించడం కాదు, ఇంకొక విధంగా కూడా భావించాలి.
ముఖ్యమైన విషయమే ఇది - పరమపిత పరమాత్మ శివుడు, వారిని గాడ్ ఫాదర్ అని కూడా అంటారు,
వారు జ్ఞానసాగరుడు కూడా. జ్ఞానసాగరుడైన కారణముగా వారు టీచరు కూడా, వారు రాజయోగాన్ని
నేర్పిస్తారు. ఈ విషయాన్ని అర్థం చేయించినట్లయితే - వీరిని సత్యమైన తండ్రి
చదివిస్తున్నారు అని వారు అర్థం చేసుకోగలరు. తండ్రి మనకు ప్రాక్టికల్ విషయాన్ని
వినిపిస్తున్నారు, అదేమిటంటే - వారు అందరికీ తండ్రి కూడా, టీచరు కూడా, సద్గతిదాత
కూడా, అలాగే వారిని నాలెడ్జ్ ఫుల్ అని కూడా అంటారు. వారు తండ్రి, టీచరు,
పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు. మొట్టమొదటైతే తండ్రి మహిమను చేయాలి. వారు మనల్ని
చదివిస్తున్నారు. మనము బ్రహ్మాకుమార-కుమారీలము. బ్రహ్మా కూడా శివబాబా యొక్క రచనయే,
అంతేకాక ఇప్పుడు ఇది సంగమయుగము. మన లక్ష్యము-ఉద్దేశ్యము కూడా రాజయోగానికి
సంబంధించినదే, వారు మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, కావున వారు టీచర్ అన్నది
కూడా నిరూపించబడినట్లు. అంతేకాక ఈ చదువు ఉన్నదే కొత్త ప్రపంచము కొరకు. ఇక్కడ
కూర్చుని - మేము ఏయే విషయాలను అర్థం చేయించాలి అన్నది పక్కా చేసుకోండి. అవి లోపల
ధారణ అవ్వాలి. కొందరికి ఎక్కువగా ధారణ అవుతుంది మరియు కొందరికి తక్కువగా ధారణ
అవుతుంది అన్నదైతే తెలుసు. ఇక్కడ కూడా ఎవరైతే జ్ఞానములో బాగా చురుకుగా ముందుకు
వెళ్తారో వారి పేరు ప్రఖ్యాతమవుతుంది మరియు పదవి కూడా వారికి ఉన్నతముగా ఉంటుంది.
పథ్యము గురించి కూడా బాబా తెలియజేస్తూ ఉంటారు. మీరు పూర్తి వైష్ణవులుగా అవుతారు.
వైష్ణవులు అనగా శాకాహారులుగా ఉండేవారు, వారు మాంసము, మద్యము మొదలైనవి స్వీకరించరు.
కానీ వారు వికారాలలోకైతే వెళ్తారు, ఇకప్పుడు వైష్ణవులుగా అయినా కానీ లాభమేముంది.
వైష్ణవ కులమువారు అని పిలువబడతారు అనగా ఉల్లి మొదలైన తమోగుణీ పదార్థాలను తినరు.
తమోగుణీ పదార్థాలు ఏమిటి అనేది పిల్లలైన మీకు తెలుసు. కొందరు మంచి వ్యక్తులు కూడా
ఉంటారు, వారిని ధార్మిక మనస్కులు లేక భక్తులు అని అంటారు. సన్యాసులను పవిత్ర ఆత్మలు
అని అంటారు మరియు ఎవరైతే దానాలు మొదలైనవి చేస్తారో వారిని పుణ్యాత్ములు అని అంటారు.
దీని బట్టి - ఆత్మయే దాన-పుణ్యాలు చేస్తుందని, అందుకే పుణ్య ఆత్మ, పవిత్ర ఆత్మ అని
పిలవబడుతుందని నిరూపించబడుతుంది. ఆత్మ నిర్లేపి ఏమీ కాదు. ఇటువంటి మంచి-మంచి పదాలను
గుర్తుంచుకోవాలి. సాధువులను కూడా మహాన్ ఆత్మలు అని అంటారే కానీ మహాన్ పరమాత్మ అని
అనరు. కావున పరమాత్మను సర్వవ్యాపి అని అనడం తప్పు. అందరూ ఆత్మలే, ఎవరెవరైతే ఉన్నారో,
అందరిలోనూ ఆత్మ ఉంది. చదువుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారు వృక్షములో కూడా ఆత్మ ఉందని
నిరూపించి చెప్తారు. వారేమంటారంటే - 84 లక్షల యోనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా
ఆత్మ ఉంది, ఒకవేళ ఆత్మ లేకపోతే మరి అక్కడ వృద్ధి ఎలా జరుగుతుంది! అని అంటారు.
మనుష్య ఆత్మ ఎప్పుడూ జడమైన రూపముగా మారదు కానీ శాస్త్రాలలో ఇటువంటి విషయాలను
వ్రాసేశారు. ఉదాహరణకు ఇంద్రప్రస్థము నుండి బయటకు గెంటేస్తే వెళ్ళి రాయిగా అయిపోయారు
అని వ్రాశారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి పిల్లలకు
చెప్తున్నారు - దేహ సంబంధాలను తెంచి స్వయాన్ని ఆత్మగా భావించండి. నన్నొక్కరినే
స్మృతి చేయండి. ఇప్పుడు మీ 84 జన్మలు ఇక పూర్తయ్యాయి, అంతే. ఇప్పుడు తమోప్రధానము
నుండి సతోప్రధానముగా అవ్వాలి. దుఃఖధామము అపవిత్ర ధామము. శాంతిధామము మరియు సుఖధామము
పవిత్ర ధామాలు. ఇదైతే అర్థం చేసుకున్నారు కదా. సుఖధామములో ఉండే దేవతల ఎదురుగా వెళ్ళి
తల వంచి నమస్కరిస్తారు. భారత్ లో కొత్త ప్రపంచములో పవిత్ర ఆత్మలు ఉండేవారని, వారు
ఉన్నత పదవి కలిగి ఉండేవారని నిరూపణ అవుతుంది. ఇప్పుడైతే నిర్గుణుడినైన నాలో ఏ గుణము
లేదు అని పాడుతారు. నిజానికి ఉండడము కూడా అలాగే ఉన్నారు, ఏ గుణమూ లేదు. మనుష్యులలో
మోహము కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మరణించినవారి స్మృతి కూడా ఉంటూ ఉంటుంది. వీరు నా
పిల్లలు అని బుద్ధిలోకి వస్తుంది. పతి లేదా పిల్లలు మరణిస్తే వారిని తలచుకుంటూ
ఉంటారు. స్త్రీ 12 నెలల వరకైతే చాలా తలచుకుంటూ ఉంటుంది, ముఖము కప్పుకుని ఏడుస్తూ
ఉంటుంది. ఈ విధంగా ముఖము కప్పుకుని ఒకవేళ మీరు రాత్రింబవళ్ళు తండ్రిని స్మృతి
చేసినట్లయితే ఇక మీ నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. తండ్రి అంటారు - ఏ విధంగా నీవు
పతిని స్మృతి చేస్తూ ఉంటావో అలా నన్ను స్మృతి చేసినట్లయితే నీ వికర్మలన్నీ
వినాశనమైపోతాయి. ఇలా, ఇలా చేయండి అని తండ్రి యుక్తులను తెలియజేస్తారు.
ఈ రోజు ఇంత ఖర్చు అయ్యింది, ఇంత లాభము కలిగింది అని లెక్కాపత్రాన్ని చూసుకుంటారు,
రోజూ బ్యాలెన్స్ ను లెక్క వేస్తారు. కొందరు ప్రతి నెల లెక్క వేస్తారు. ఇక్కడైతే ఇది
చాలా అవసరమని తండ్రి పదే-పదే అర్థం చేయించారు. తండ్రి అంటారు - పిల్లలైన మీరు
సౌభాగ్యశాలులు, వేల రెట్ల భాగ్యశాలులు, కోటాను రెట్ల భాగ్యశాలులు, పదమాల, కోటాను
కోట్ల రెట్ల భాగ్యశాలులు. ఏ పిల్లలైతే స్వయాన్ని సౌభాగ్యశాలురుగా భావిస్తారో, వారు
తప్పకుండా మంచి రీతిలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. వారే గులాబీ పుష్పాలుగా
అవుతారు. అర్థం చేయించడం సారములో అర్థం చేయించవలసి ఉంటుంది కానీ తయారవ్వడమైతే
సుగంధభరితమైన పుష్పముగా తయారవ్వాలి. ముఖ్యమైనది స్మృతి యొక్క విషయము. సన్యాసులు
యోగము అన్న పదాన్ని ఉపయోగిస్తారు. లౌకిక తండ్రి ఎప్పుడూ ‘నన్ను గుర్తు చేయండి’ అని
అనరు లేదా ‘నన్ను గుర్తు చేస్తున్నారా’ అని అడగరు. తండ్రికి తన బిడ్డ మరియు బిడ్డకు
తన తండ్రి గుర్తు ఉండనే ఉంటారు, ఇది ఒక నియమము. కానీ ఇక్కడ అడగవలసి వస్తుంది
ఎందుకంటే మాయ మరపింపజేస్తుంది. ఇక్కడకు వచ్చినప్పుడు, మేము తండ్రి వద్దకు
వెళ్తున్నాము అని భావిస్తారు, కావున తండ్రి యొక్క స్మృతి ఉండాలి. అందుకే బాబా
చిత్రాలను కూడా తయారుచేయిస్తూ ఉంటారు, అవి కూడా మీతో పాటు ఉండాలి. మొట్టమొదట ఎప్పుడూ
తండ్రి మహిమతో ప్రారంభించండి. వీరు మన బాబా, నిజానికి వీరు అందరికీ తండ్రి. వీరు
సర్వుల సద్గతిదాత, జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్. బాబా మనకు సృష్టి చక్రము యొక్క
ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు, దాని ద్వారా మనము త్రికాలదర్శులుగా అవుతాము. ఈ
సృష్టిపై ఉండే మానవమాత్రులెవ్వరూ త్రికాలదర్శులు కారు. తండ్రి అంటారు, ఈ
లక్ష్మీ-నారాయణులు కూడా త్రికాలదర్శులు కారు. లక్ష్మీ-నారాయణులు త్రికాలదర్శులుగా
అయి ఏమి చేస్తారు! మీరు త్రికాలదర్శులుగా అవుతారు మరియు అలా తయారుచేస్తారు. ఈ
లక్ష్మీ-నారాయణులలో జ్ఞానము ఉన్నట్లయితే అది పరంపరగా కొనసాగుతూ వచ్చేది. మధ్యలో
వినాశనము అవుతుంది కావున అది పరంపరగా కొనసాగదు. పిల్లలు ఈ చదువును మంచి రీతిలో
స్మరణ చేయాలి. మీ ఉన్నతోన్నతమైన చదువు కూడా సంగమములోనే ఉంటుంది. మీరు స్మృతి
చేయకపోతే, దేహాభిమానములోకి వస్తే మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఎప్పుడైతే 16 కళల
సంపూర్ణులుగా అవుతారో, అప్పుడు వినాశనానికి కూడా ఏర్పాట్లు జరుగుతాయి. వారు వినాశనము
కొరకు మరియు మీరు అవినాశీ పదవి కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌరవులు మరియు
పాండవులకు మధ్యన యుద్ధము జరగలేదు, కౌరవులు మరియు యాదవులకు మధ్యన యుద్ధము జరిగింది.
డ్రామానుసారముగా పాకిస్తాన్ కూడా ఏర్పడింది. మీ జన్మ జరిగినప్పుడే అది కూడా
తయారయ్యింది. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున అన్నీ ప్రాక్టికల్ గా జరగాలి కదా. రక్తపు
నదులు ప్రవహిస్తాయి అని ఇక్కడ కోసమే అంటారు, ఆ తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి.
ఇప్పుడు కూడా చూడండి, కొట్లాడుకుంటూ ఉంటారు. ఫలానా పట్టణము మాకు ఇవ్వండి లేకపోతే
యుద్ధము చేస్తాము అని అంటారు. ఇటువైపు నుండి వెళ్ళకండి, ఇది మా మార్గము అని అంటారు.
ఇక అలా అయితే వారేమి చేయగలరు. స్టీమర్లు ఎలా వెళ్తాయి! అప్పుడు చర్చలు జరుపుతారు.
తప్పకుండా సలహాలు అడుగుతారు. అప్పుడు ఎవరి నుండైనా సహాయము లభిస్తుంది అన్న ఆశ
కలుగుతుంది, ఇక పరస్పరమే అంతం చేసేసుకుంటారు. ఇక్కడైతే డ్రామాలో గృహ యుద్ధాలు
నిశ్చితమై ఉన్నాయి.
ఇప్పుడు తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, చాలా-చాలా వివేకవంతులుగా అవ్వండి.
ఇక్కడి నుండి బయటకు ఇంటికి వెళ్ళగానే మర్చిపోకండి. ఇక్కడకు మీరు సంపాదన జమ
చేసుకోవడానికి వస్తారు. చిన్న-చిన్న పిల్లలను తీసుకువస్తే మరి వారి బంధనములో ఉండవలసి
వస్తుంది. ఇక్కడైతే జ్ఞానసాగరుని తీరము వద్దకు వస్తారు, ఎంత సంపాదన చేసుకుంటే అంత
మంచిది. ఇందులో నిమగ్నమైపోవాలి. మీరు అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకునేందుకే
వస్తారు. భోళానాథుడా, మా జోలెను నింపు అని గానం కూడా చేస్తారు కదా. భక్తులైతే
శంకరుని ఎదురుగా వెళ్ళి జోలెను నింపండి అని కోరుకుంటారు. వారు శివ-శంకరులు ఒక్కరే
అని భావిస్తారు. శివ-శంకర మహాదేవ అని అంటూ ఉంటారు, అలా అయితే మహాదేవుడు పెద్దవారు
అవుతారు. ఇటువంటి చిన్న-చిన్న విషయాలు బాగా అర్థం చేసుకోవలసినవి.
ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, జ్ఞానము లభిస్తుంది అని పిల్లలైన మీకు అర్థం చేయించడం
జరుగుతుంది. చదువు ద్వారా మనుష్యులు తీర్చిదిద్దబడతారు, నడత, నడవడిక కూడా మంచిగా
తయారవుతాయి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఎవరైతే అందరికంటే ఎక్కువుగా
చదువుకుంటారో మరియు చదివిస్తారో, వారి మ్యానర్స్ కూడా బాగుంటాయి. అందరికన్నా
మమ్మా-బాబా యొక్క మ్యానర్స్ బాగుంటాయి అని మీరు అంటారు. వీరు పెద్ద తల్లి అయినట్లు,
వీరిలోకి ప్రవేశించి పిల్లలను రచిస్తారు. ఈ తల్లి-తండ్రి కంబైండుగా ఉన్నారు. ఇవి
ఎంత గుప్తమైన విషయాలు. ఏ విధంగా మీరు చదువుకుంటున్నారో అలాగే మమ్మా కూడా
చదువుకునేవారు. ఆమెను దత్తత తీసుకున్నారు. ఆమె వివేకవంతురాలు కావున డ్రామానుసారముగా
సరస్వతి అన్న పేరు వచ్చింది. బ్రహ్మపుత్రా పెద్ద నది. సాగరము మరియు బ్రహ్మపుత్రా నది
యొక్క మేళా కూడా జరుగుతుంది. ఇతను పెద్ద నది కూడా, అలాగే ఇతను తల్లి కూడా కదా.
మధురాతి-మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఎంత ఉన్నతిలోకి తీసుకువెళ్తారు. తండ్రి
పిల్లలైన మిమ్మల్నే చూస్తారు. తండ్రి అయితే ఎవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరం లేదు.
వీరి ఆత్మ అయితే తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి అంటారు - మనమిద్దరమూ పిల్లలను
చూస్తాము. ఆత్మనైన నేను అయితే సాక్షీగా అయి చూడనవసరం లేదు, కానీ తండ్రి సాంగత్యములో
నేను కూడా అలానే చూస్తాను. నేను తండ్రితోపాటే ఉంటాను కదా. నేను వారి బిడ్డను కావున
వారితోపాటు చూస్తాను. నేను విశ్వానికి యజమానిగా అయి తిరుగుతాను, నేనే అంతా
చేస్తున్నట్లు ఉంటుంది. నేను దృష్టి ఇస్తాను. దేహ సహితముగా అన్నింటినీ మర్చిపోవలసి
ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బిడ్డ మరియు తండ్రి ఒక్కటి అయిపోయినట్లు ఉంటుంది. తండ్రి
అర్థం చేయిస్తున్నారు, చాలా పురుషార్థము చేయండి. తప్పకుండా మమ్మా-బాబా అందరికంటే
ఎక్కువ సేవ చేస్తారు. ఇంట్లో కూడా తల్లి-తండ్రులు చాలా సేవ చేస్తారు కదా. సేవ
చేసేవారు తప్పకుండా పదవి కూడా ఉన్నతమైనది పొందుతారు కావున వారిని ఫాలో చేయాలి కదా.
ఏ విధంగా తండ్రి అపకారులకు కూడా ఉపకారము చేస్తారో, ఈ విషయములో మీరు కూడా తండ్రిని
ఫాలో చేయండి. దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి అంటారు - నన్ను స్మృతి
చేయండి, ఇంకెవ్వరిదీ వినకండి. ఎవరైనా ఏదైనా అన్నా వినీ-విననట్లుగా వదిలేయండి. మీరు
చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్లయితే వారు తమంతట తామే చల్లబడిపోతారు. బాబా అంటున్నారు -
ఎవరైనా క్రోధము చేస్తే మీరు వారిపై పుష్పాలు చల్లండి. మీరు అపకారము చేస్తున్నారు,
నేను ఉపకారము చేస్తాను అని చెప్పండి. తండ్రి స్వయం అంటారు - మొత్తం ప్రపంచములోని
మనుష్యులు నాకు అపకారులుగా ఉన్నారు, నన్ను సర్వవ్యాపి అంటూ ఎంతగా నిందిస్తారు, కానీ
నేనైతే అందరికీ ఉపకారిని. పిల్లలైన మీరు కూడా అందరికీ ఉపకారము చేసేవారు. మనము ఎలా
ఉండేవారము, ఇప్పుడు ఎలా తయారవుతాము అని మీరు ఆలోచించండి. మీరు విశ్వానికి యజమానులుగా
అవుతారు. ఇది కనీసం ఆలోచనలో లేక స్వప్నములో కూడా లేదు. చాలామందికి ఇంట్లో కూర్చుని
ఉండగానే సాక్షాత్కారము కలిగింది. కానీ సాక్షాత్కారము ద్వారా ఏమీ జరగదు.
మెల్ల-మెల్లగా వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ కొత్త దైవీ వృక్షము స్థాపన
అవుతోంది కదా. మా దైవీ పుష్పాల తోట తయారవుతుందని పిల్లలకు తెలుసు. సత్యయుగములో
దేవతలే ఉంటారు, వారే మళ్ళీ రానున్నారు, చక్రము తిరుగుతూ ఉంటుంది. 84 జన్మలు కూడా
వారే తీసుకుంటారు. వేరే ఆత్మలు మళ్ళీ ఎక్కడి నుండి వస్తారు. డ్రామాలో ఆత్మలెవరైతే
ఉన్నారో, వారెవ్వరూ కూడా పాత్ర నుండి విముక్తులవ్వలేరు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది.
ఆత్మ ఎప్పుడూ అరిగిపోదు. చిన్నగా-పెద్దగా అవ్వదు.
తండ్రి కూర్చుని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, పిల్లలూ,
సుఖవంతులుగా అవ్వండి అని చెప్తున్నారు. మీరు పరస్పరములో కొట్లాడుకోకండి, గొడవపడకండి
అని తల్లి చెప్తుంది కదా. అనంతమైన తండ్రి కూడా పిల్లలకు చెప్తున్నారు, స్మృతి యాత్ర
చాలా సహజమైనది. ఆ యాత్రలనైతే జన్మ-జన్మాంతరాలు చేస్తూ వచ్చారు, అయినా కానీ మెట్లు
కిందకు దిగుతూ పాపాత్ములుగా అవుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఇది ఆత్మిక యాత్ర,
మీరు ఈ మృత్యులోకములోకి తిరిగి వచ్చేది లేదు. ఆ యాత్రల నుండైతే తిరిగి వస్తారు,
మళ్ళీ ఎలా ఉన్నవారు అలాగే తయారవుతారు. కానీ మీరు స్వర్గములోకి వెళ్తారని మీకు తెలుసు.
స్వర్గము ఒకప్పుడు ఉండేది, మళ్ళీ ఉంటుంది. ఈ చక్రము తిరగాలి. ప్రపంచము ఒక్కటే.
ఇకపోతే నక్షత్రాలు మొదలైనవాటిలో ప్రపంచమేమీ లేదు. పైకి వెళ్ళి చూసేందుకు ఎంతగా
కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడుతూ, కష్టపడుతూ మృత్యువు ఎదురుగా వచ్చేస్తుంది. ఇదంతా
సైన్స్. పైకి వెళ్తారు, ఆ తర్వాత ఏమి జరుగుతుంది. మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది.
ఒకవైపు పైకి వెళ్ళి వెతుకుతుంటారు, ఇంకొకవైపు మృత్యువు కోసమని బాంబులు
తయారుచేస్తున్నారు. మనుష్యుల బుద్ధి ఎలా ఉందో చూడండి. ప్రేరేపించేవారు ఎవరో ఉన్నారు
అని కూడా అనుకుంటూ ఉంటారు. ప్రపంచ యుద్ధము తప్పకుండా జరగనున్నది అని వారు స్వయం
అంటారు. ఇది ఆ మహాభారత యుద్ధమే. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఎంత పురుషార్థము
చేస్తారో, అంతగానే కళ్యాణము చేస్తారు. ఖుదాకు పిల్లలుగానైతే ఉండనే ఉన్నారు. భగవంతుడు
తమ పిల్లలుగా చేసుకున్నారు కావున మీరు భగవాన్-భగవతీలుగా అవుతారు. లక్ష్మీ-నారాయణులను
గాడ్-గాడెస్ (భగవాన్-భగవతీ) అని అంటారు కదా. కృష్ణుడిని భగవంతునిగా భావిస్తారు,
రాధను అంతగా భావించరు. సరస్వతికి పేరు ఉంది, రాధకు అంత పేరు లేదు. కలశము లక్ష్మికి
చూపిస్తారు, ఇది పొరపాటు చేసారు. సరస్వతికి కూడా అనేక పేర్లు పెట్టారు. అది మీరే కదా.
దేవీలకు కూడా పూజ జరుగుతుంది, అలాగే ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. తండ్రి పిల్లలకు
ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.