ఓంశాంతి
మధురమైన పిల్లలకు తండ్రి - ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్న స్మృతిని
కలిగించారు. మనము తండ్రి ద్వారా ఏదైతే తెలుసుకున్నామో, తండ్రి మనకు ఏదైతే మార్గాన్ని
తెలియజేసారో, అది ప్రపంచములోని వారికెవ్వరికీ తెలియదు అని ఇప్పుడు పిల్లలైన మీకు
తెలుసు. తామే పూజ్యులు, తామే పూజారులు అన్నదాని అర్థాన్ని కూడా మీకు అర్థం చేయించారు.
ఎవరైతే పూజ్యులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారో, వారే మళ్ళీ పూజారులుగా అవుతారు.
పరమాత్మ గురించి ఇలా అనరు. ఇది ఖచ్చితంగా యథార్థమైన విషయమని ఇప్పుడు మీకు స్మృతి
కలిగింది. సృష్టి ఆదిమధ్యాంతాల సమాచారాన్ని తండ్రియే వినిపిస్తారు, ఇంకెవ్వరినీ కూడా
జ్ఞానసాగరులని అనడము జరుగదు. ఈ మహిమ శ్రీకృష్ణునిది కాదు. శ్రీకృష్ణుని ఆత్మ ఇప్పుడు
జ్ఞానము తీసుకుంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అద్భుతమైన విషయము.
తండ్రి తప్ప ఇంకెవ్వరూ దీనిని అర్థం చేయించలేరు. ఆ మాటకొస్తే ఎంతోమంది
సాధు-సత్పురుషులు రకరకాల హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. అదంతా భక్తి మార్గము.
సత్యయుగములో మీరు ఎవ్వరి పూజ చేయరు. అక్కడ మీరు పూజారులుగా అవ్వరు. వారు పూజ్య
దేవీ-దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు అని అంటారు. ఆ పూజ్యులే ఇప్పుడు మళ్ళీ
పూజారులుగా అయ్యారు. తండ్రి అంటారు, ఇతను కూడా పూజలు చేసేవారు కదా. మొత్తం
ప్రపంచమంతా ఈ సమయములో పూజారిగా ఉంది. కొత్త ప్రపంచములో పూజ్య దేవీ-దేవతా ధర్మము
ఒక్కటే ఉంటుంది. తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారముగా ఇది ఖచ్చితంగా కరక్ట్ అని
పిల్లలకు స్మృతిలోకి వచ్చింది. ఇది తప్పకుండా గీతా అధ్యాయమే. కేవలం గీతలో పేరు
మార్చేసారు. ఇది అర్థం చేయించేందుకే మీరు కృషి చేస్తారు. 2500 సంవత్సరాల నుండి గీత
శ్రీకృష్ణునిదని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో గీతను నిరాకార భగవానుడే
వినిపించారని అర్థం చేసుకోవాలంటే, దానికి సమయమైతే పడుతుంది కదా. భక్తి వృక్షము ఎంతగా
వ్యాపించి ఉంది అని భక్తిని గురించి కూడా అర్థం చేయించారు కదా. తండ్రి మనకు
రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీరు వ్రాయవచ్చు. ఏ పిల్లలకైతే నిశ్చయము ఏర్పడుతుందో,
వారు నిశ్చయముతో అర్థం చేయిస్తారు కూడా. నిశ్చయము లేకపోతే - ఎలా అర్థం చేయించాలి,
ఏదైనా గొడవ జరుగుతుందేమోనని స్వయము కూడా తికమకపడుతూ ఉంటారు. ప్రస్తుతము ఇంకా
నిర్భయులుగా అవ్వలేదు కదా. ఎప్పుడైతే పూర్తిగా దేహీ-అభిమానులుగా అవుతారో అప్పుడు
నిర్భయులుగా అవుతారు, భయపడడము అనేది భక్తి మార్గములో జరుగుతుంది. మీరందరూ మహావీరులు.
మాయపై విజయాన్ని ఎలా పొందుతారు అనేది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన
మీకిప్పుడు స్మృతిలోకి వచ్చింది. ఇంతకుముందు కూడా తండ్రి మన్మనాభవ అని చెప్పారు.
పతిత-పావనుడైన తండ్రియే వచ్చి ఇది అర్థం చేయిస్తారు. గీతలో ఈ పదము ఉంది కానీ ఈ
విధముగా ఎవ్వరూ అర్థం చేయించరు. తండ్రి అంటారు, పిల్లలూ, దేహీ-అభిమానీ భవ. పిండిలో
ఉప్పంత అన్నట్లు గీతలో కొన్ని పదాలైతే ఉన్నాయి. ప్రతి ఒక్క విషయములోనూ తండ్రి
నిశ్చయాన్ని కలిగిస్తారు. నిశ్చయబుద్ధి విజయంతి.
మీరు ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి అంటారు, గృహస్థ
వ్యవహారములో కూడా తప్పకుండా ఉండాలి. అందరూ ఇక్కడకు వచ్చి కూర్చోవలసిన అవసరము లేదు.
సేవ చేయాలి, సెంటర్లు తెరవాలి. మీరు సాల్వేషన్ ఆర్మీ (ముక్తి దళము). మీరు ఈశ్వరీయ
మిషన్ కు చెందినవారు కదా. ఇంతకుముందు శూద్ర, మాయావీ మిషన్ కు చెందినవారిగా ఉండేవారు,
ఇప్పుడు మీరు ఈశ్వరీయ మిషన్ కు చెందినవారిగా అయ్యారు. మీకు చాలా మహత్వము ఉంది. ఈ
లక్ష్మీ-నారాయణులకు ఏం మహిమ ఉంది. రాజులు ఏ విధముగా ఉంటారో, ఆ విధముగా రాజ్యము
చేస్తారు. ఇకపోతే వీరిని సర్వగుణ సంపన్నులని, విశ్వానికి యజమానులని అంటారు ఎందుకంటే
ఆ సమయములో ఇంకే రాజ్యమూ ఉండదు. విశ్వానికి యజమానులుగా ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు
పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనమే దేవతలుగా అవుతాము కావున మళ్ళీ వారి ముందు
మనమెలా తల వంచగలము? మీరు నాలెడ్జ్ ఫుల్ గా అయ్యారు. ఎవరికైతే జ్ఞానము లేదో వారు తల
వంచి నమస్కరిస్తూ ఉంటారు. మీరు అందరి కర్తవ్యాలను గురించి ఇప్పుడు తెలుసుకున్నారు.
ఏ చిత్రాలు తప్పుగా ఉన్నాయి, ఏ చిత్రాలు సరైనవి అన్నది కూడా మీరు అర్థం చేయించగలరు.
రావణ రాజ్యము గురించి కూడా మీరు అర్థం చేయిస్తారు. ఇది రావణ రాజ్యము, దీనికి నిప్పు
అంటుకుంటుంది. అడవికి నిప్పు అంటుకోనున్నది, అడవి అని విశ్వాన్ని అంటారు. ఏ పదాలనైతే
ఇంతకుముందు ఉపయోగించారో, వాటిపై ఇప్పుడు అర్థం చేయిస్తారు. భక్తి మార్గములోనైతే
అనేక చిత్రాలను తయారుచేసారు. వాస్తవానికి అసలైన పూజ శివబాబాకు జరుగుతుంది, ఆ తర్వాత
బ్రహ్మా-విష్ణు-శంకరులకు జరుగుతుంది. త్రిమూర్తి చిత్రము ఏదైతే తయారుచేస్తారో అది
సరియైనది. ఆ తర్వాత ఈ లక్ష్మీ-నారాయణులు, అంతే. త్రిమూర్తులలో బ్రహ్మా-సరస్వతులు
కూడా వచ్చేస్తారు. భక్తి మార్గములో ఎన్ని చిత్రాలను తయారుచేస్తారు. హనుమంతునికి కూడా
పూజ చేస్తారు. మీరు మహావీరులుగా అవుతున్నారు కదా. మందిరాలలో కూడా కొందరు ఏనుగులపై
సవారీ చేస్తున్నట్లు, కొందరు గుర్రాలపై సవారీ చేస్తున్నట్లు చూపించారు. వాస్తవానికి
అటువంటి సవారీ ఏదీ లేదు. తండ్రి మహారథి అని ఉంటారు. మహారథి అనగా ఏనుగుపై సవారీ
చేసేవారు. దానినే వారు ఏనుగుపై సవారీ చేసినట్లుగా చూపించారు. ఏనుగును మొసలి ఎలా
తినేస్తుంది అనేది కూడా అర్థం చేయించారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మహారథులు
ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు వారిని కూడా మాయా మొసలి మింగేస్తుంది. మీకు ఇప్పుడు
జ్ఞాన వివేచన లభించింది. మంచి-మంచి మహారథులను మాయ తినేస్తుంది. ఇవన్నీ జ్ఞాన విషయాలు,
వీటిని ఎవ్వరూ వర్ణించలేరు. తండ్రి అంటారు, నిర్వికారులుగా అవ్వాలి, దైవీ గుణాలను
ధారణ చేయాలి. కల్ప-కల్పము తండ్రి చెప్తారు - కామము మహాశత్రువు. ఇందులోనే కృషి ఉంది.
దీనిపై మీరు విజయము పొందుతారు. ప్రజాపితకు చెందినవారిగా అయ్యారు కావున పరస్పరములో
మీరు సోదరీ-సోదరులుగా అయ్యారు. వాస్తవానికి మీరు ఆత్మలు. ఆత్మ ఆత్మతో మాట్లాడుతుంది.
ఆత్మయే ఈ చెవుల ద్వారా వింటుంది, ఇది గుర్తుంచుకోవలసి ఉంటుంది. మనము ఆత్మకు
వినిపిస్తాము, అంతేకానీ దేహానికి కాదు. వాస్తవానికి ఆత్మలమైన మనము పరస్పరము సోదరులము,
మళ్ళీ పరస్పరము సోదరీ-సోదరులము కూడా. సోదరులకు వినిపించవలసి ఉంటుంది. దృష్టి ఆత్మ
వైపుకు వెళ్ళాలి. నేను సోదరునికి వినిపిస్తున్నాను. సోదరా, వింటున్నారా? అవును,
ఆత్మనైన నేను వింటున్నాను. బికనేర్ లో ఒక బిడ్డ ఉన్నారు, అతను సదా ఆత్మ-ఆత్మ అని
వ్రాస్తూ ఉంటారు. నా ఆత్మ ఈ శరీరము ద్వారా వ్రాస్తోంది, ఇది ఆత్మనైన నా ఆలోచన, నా
ఆత్మ ఇది చేస్తుంది అని అంటూ ఉంటారు. ఇలా ఆత్మాభిమానులుగా అవ్వడమనేది కృషితో కూడిన
విషయము కదా. నా ఆత్మ నమస్కరిస్తుంది. బాబా కూడా ఆత్మిక పిల్లలు అని అంటారు కదా,
అప్పుడు భృకుటి వైపు చూడాలి. ఆత్మయే వింటుంది, ఆత్మకు నేను వినిపిస్తాను. మీ దృష్టి
ఆత్మ వైపుకు వెళ్ళాలి. ఆత్మ భృకుటి మధ్యలో ఉంది. శరీరము వైపుకు దృష్టి వెళ్తే
విఘ్నాలు కలుగుతాయి. ఆత్మతో మాట్లాడాలి. ఆత్మనే చూడాలి. దేహాభిమానాన్ని వదిలేయండి.
తండ్రి కూడా ఇక్కడ భృకుటి మధ్యలో కూర్చుని ఉన్నారని ఆత్మకు తెలుసు. వారికి మనము
నమస్కరిస్తాము. నేను ఆత్మను, ఆత్మయే వింటుంది అని బుద్ధిలో ఈ జ్ఞానము ఉంది. ఈ
జ్ఞానము ఇంతకుముందు లేదు. ఈ దేహము పాత్రను అభినయించేందుకు లభించింది, అందుకే
దేహానికే పేరు పెట్టడము జరుగుతుంది. ఈ సమయములో మీరు దేహీ-అభిమానులుగా అయి తిరిగి
వెళ్ళాలి. పాత్రను అభినయించేందుకని ఈ పేరును పెట్టారు. పేరు లేకుండానైతే
కార్యవ్యవహారాలు జరగవు. అక్కడ కూడా కార్యవ్యవహారాలైతే జరుగుతాయి కదా. కానీ మీరు
సతోప్రధానముగా అయిపోతారు కావున అక్కడ ఎటువంటి వికర్మలు తయారవ్వవు. వికర్మలుగా
తయారయ్యేందుకు మీరు అటువంటి పనులే చెయ్యరు. అక్కడ మాయా రాజ్యమే ఉండదు. ఇప్పుడు
తండ్రి చెప్తున్నారు - ఆత్మలైన మీరు తిరిగి వెళ్ళాలి. ఇది పాత శరీరము, ఆ తర్వాత
సత్య, త్రేతాయుగాలలోకి వెళ్తారు. అక్కడ జ్ఞానము యొక్క అవసరమే లేదు. ఇక్కడ మీకు
జ్ఞానము ఎందుకు ఇస్తారు? ఎందుకంటే మీరు దుర్గతిని పొందారు. కర్మలైతే అక్కడ కూడా
చేయాలి కానీ అవి అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు తండ్రి అంటారు - చేతులు పని వైపు,
హృదయము ప్రియుని వైపు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. సత్యయుగములో మీరు పావనముగా
ఉంటారు కావున కార్యవ్యవహారాలన్నీ పావనముగా ఉంటాయి. తమోప్రధాన రావణ రాజ్యములో మీ
కార్యవ్యవహారాలు నష్టము కలిగించేవిగా అయిపోతాయి, అందుకే మనుష్యులు తీర్థయాత్రలు
మొదలైనవాటికి వెళ్తారు. సత్యయుగములో తీర్థయాత్రలకు వెళ్ళవలసి వచ్చేందుకు, అక్కడ ఎవరూ
పాపాలు చేయరు. అక్కడ మీరు ఏ పనులు చేసినా, అవి సత్యముగానే చేస్తారు. సత్యము యొక్క
వరదానము లభించేసింది. అక్కడ వికారాల విషయమే ఉండదు. కార్యవ్యవహారాలలో కూడా అసత్యము
యొక్క అవసరమే ఉండదు. ఇక్కడైతే లోభము ఉన్న కారణముగా మనుష్యులు దొంగతనాలు, మోసాలు
చేస్తారు, అక్కడ ఈ విషయాలు ఉండవు. డ్రామానుసారముగా మీరు అటువంటి పుష్పాలుగా అవుతారు.
అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము, ఇది వికారీ ప్రపంచము. మొత్తం ఆటంతా బుద్ధిలో ఉంది.
ఈ సమయములోనే పవిత్రముగా అయ్యేందుకు కృషి చేయవలసి ఉంటుంది. యోగబలముతో మీరు విశ్వానికి
యజమానులుగా అవుతారు, యోగబలము ముఖ్యమైనది. తండ్రి అంటారు, భక్తి మార్గపు యజ్ఞ,
తపాదులు మొదలైనవాటితో ఎవ్వరూ నన్ను పొందలేరు. సతో, రజో, తమోలలోకి వెళ్ళవలసిందే.
జ్ఞానము చాలా సహజమైనది మరియు రమణీకమైనది, ఇందులో కృషి కూడా చేయవలసి ఉంది. మహిమ అంతా
ఈ యోగానిదే, దీని ద్వారా మీరు సతోప్రధానముగా తయారవ్వాలి. తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అయ్యే మార్గాన్ని తండ్రియే తెలియజేస్తారు. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని
ఇవ్వలేరు. కొందరు చంద్రుని వరకు వెళ్తారు, కొందరు నీటిపై నడుస్తారు, కానీ అదేమీ
రాజయోగము కాదు. వారు నరుని నుండి నారాయణునిగా అయితే అవ్వలేరు. మేము ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నాము అని
ఇక్కడ మీరు భావిస్తారు. మీకు ఆ స్మృతి కలిగింది. తండ్రి కల్పక్రితము కూడా ఇది అర్థం
చేయించారు. తండ్రి అంటారు, నిశ్చయబుద్ధి విజయంతి. నిశ్చయము లేకపోతే వారు వినడానికి
రారు కూడా. నిశ్చయబుద్ధి కలవారి నుండి తిరిగి సంశయబుద్ధి కలవారిగా కూడా అవుతారు.
ఎంతో మంచి-మంచి మహారథులు కూడా సంశయములోకి వచ్చేస్తారు. మాయ తుఫాను కొద్దిగా రావడముతో
దేహాభిమానము వచ్చేస్తుంది.
ఈ బాప్ దాదా ఇరువురూ కంబైన్డ్ గా ఉన్నారు కదా. శివబాబా జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత
వెళ్ళిపోతారా లేక ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్తారు. మీరు సదా ఉంటారా లేక
వెళ్ళిపోతారా అని బాబాను అడుగుతారా? తండ్రినైతే ఇలా అడగలేరు కదా. తండ్రి అంటారు,
పతితము నుండి పావనముగా అయ్యేందుకు నేను మీకు మార్గాన్ని తెలియజేస్తాను. వస్తాను,
వెళ్తాను, నేనైతే ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. పిల్లల వద్దకు కూడా వెళ్తాను, వారితో
కార్యాలు చేయిస్తాను. ఇందులో సంశయపడే విషయాన్ని ఏమీ రానివ్వకూడదు. మన పని తండ్రిని
స్మృతి చేయడము. సంశయములోకి రావడముతో పడిపోతారు. మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది.
తండ్రి అన్నారు, అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమములో నేను వీరిలోకి వస్తాను.
తప్పకుండా తండ్రే మాకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని పిల్లలకు
నిశ్చయముంది. అయినా ఈ నిశ్చయము నుండి ఎంతమంది కిందకు పడిపోతారు అనేది తండ్రికి
తెలుసు. తండ్రి అంటారు, మీరు పావనముగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకే
విషయాలలోనూ చిక్కుకోకండి. మీరు అలాంటి, ఇలాంటి మాటలు మాట్లాడితే, మీకు పక్కా
నిశ్చయము లేదని అర్థమవుతుంది. మొదట ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి, దాని ద్వారా మీ
పాపాలు నశిస్తాయి, మిగిలిన వ్యర్థ విషయాలు మాట్లాడవలసిన అవసరము లేదు. తండ్రి
స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి, ఇక ఇతర విషయాలలోకి ఎందుకు వెళ్తారు! ఎవరైనా
ప్రశ్నొత్తరాలలో తికమకపడుతుంటే, మీరు వారికి ఇలా చెప్పండి - మీరు ఈ విషయాలను వదిలి
ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసే పురుషార్థము చేయండి. సంశయములోకి వచ్చారంటే
చదువునే వదిలేస్తారు, ఇక కళ్యాణమే జరగదు. నాడిని చూసి అర్థం చేయించాలి. సంశయము
ఉన్నట్లయితే ఒక్క పాయింటుపై నిలబెట్టాలి. చాలా యుక్తితో అర్థం చేయించవలసి ఉంటుంది.
పిల్లలకు మొదట ఉండవలసిన నిశ్చయము ఏమిటంటే - బాబా వచ్చారు, మనల్ని పావనముగా
తయారుచేస్తున్నారు. ఈ సంతోషము ఉంటుంది. చదవకపోతే ఫెయిల్ అయిపోతారు, వారికి సంతోషము
కూడా ఎందుకు కలుగుతుంది? స్కూల్లో చదువు అనేది ఒక్కటే ఉంటుంది, కానీ కొందరు
చదువుకుని లక్షలు సంపాదిస్తారు, కొందరు 5-10 రూపాయలు సంపాదిస్తారు. మీ
లక్ష్యము-ఉద్దేశ్యము నరుని నుండి నారాయణునిగా అవ్వడము. రాజ్యము స్థాపనవుతుంది. మీరు
మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. దేవతల రాజధాని చాలా పెద్దగా ఉంటుంది, అందులో
ఉన్నత పదవిని పొందడమనేది మీ చదువుపై మరియు నడవడికపై ఆధారపడి ఉంటుంది. మీ నడవడిక చాలా
బాగుండాలి. బాబా తన గురించి కూడా చెప్తున్నారు - ఇప్పుడు కర్మాతీత అవస్థ ఇంకా
తయారవ్వలేదు, నేను కూడా సంపూర్ణముగా అవ్వాలి, ఇప్పుడింకా అలా తయారవ్వలేదు. జ్ఞానమైతే
చాలా సహజమైనది. తండ్రిని స్మృతి చేయడము కూడా సహజమే, కానీ అది చేయాలి కదా. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.