14-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - స్మృతియాత్రలో ఎప్పుడూ అలసిపోకండి,
దేహాభిమానపు తుఫానులు అలసిపోయేలా చేస్తాయి, దేహీ-అభిమానులుగా అయినట్లయితే అలసట
దూరమైపోతుంది’’
ప్రశ్న:-
ఏ సంస్కారము
21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని పాడు చేస్తుంది?
జవాబు:-
ఒకవేళ
ఎవరిలోనైనా అలిగే సంస్కారముంటే, తండ్రిపై లేక చదువుపై అలిగినట్లయితే 21 జన్మల
భాగ్యము పాడైపోతుంది, అందుకే బాబా అంటారు - మధురమైన పిల్లలూ, దేహాభిమానానికి వశమై -
నేను ఇంతమందికి అర్థం చేయించాను, ఇంత సహాయము చేసాను అనే తప్పుడు నషా ఎప్పుడూ
కలగకూడదు. చూడండి, బాబా ఎంత గొప్ప అథారిటీ, అయినా కానీ ఎంత నిరహంకారిగా ఉన్నారు,
అందుకే సీ ఫాదర్ (తండ్రినే చూడండి).
పాట:-
రాత్రి
ప్రయాణీకుడా అలసిపోకు...
ఓంశాంతి
మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారు. ఎవరైతే
యోగయుక్తులైన సర్వీసబుల్ పిల్లలు ఉన్నారో, వారు ఈ పాట అర్థాన్ని వెంటనే అర్థం
చేసుకుంటారు. రాత్రి ప్రయాణీకులైన మన యొక్క అనగా బ్రాహ్మణుల యొక్క రాత్రి ఇప్పుడు
పూర్తయ్యింది. భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు. అర్ధకల్పపు రాత్రి పూర్తవుతుంది.
హద్దులో కూడా రాత్రి మరియు పగలు ఉంటాయి. ఇక్కడ బ్రాహ్మణుల యొక్క అర్ధకల్పపు పగలు
మరియు అర్ధకల్పపు రాత్రి ఉంటాయి. ఈ సమయములో తండ్రి వచ్చినప్పుడు అంధకారముంది.
ఇప్పుడు ప్రభాత సమయములోని మొదటి వెలుగు మొదలైంది, తెల్లవారుతుంది. మధురాతి మధురమైన
పిల్లలూ, స్మృతియాత్రలో అలసిపోకండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారని పిల్లలకు
తెలుసు. ఎలాగైతే దైహిక యాత్రలు ఉంటాయి, వాటికి పూర్వము కాలినడకన వెళ్ళేవారు. చాలా
నెమ్మది-నెమ్మదిగా వెళ్ళేవారు, మధ్యమధ్యలో వసతి గృహాలు నిర్మించబడి ఉండేవి. మేము
ఫలానా-ఫలానా గమ్య స్థానాలలో ఆగాల్సి ఉంటుందని వారికి తెలుసు. పూర్వము చాలా శ్రద్ధతో
కాలినడకన వెళ్ళేవారు, అందులో చాలా శ్రమ ఉండేది. ఇప్పుడు ఇక్కడి యాత్ర అయితే చాలా
సహజమైనది. దీనిని సహజ స్మృతి లేక సహజ యోగము అని అంటారు. కేవలం తండ్రిని స్మృతి
చేయాలి, అలసిపోవడమంటే అర్థమే దేహాభిమానులుగా అవ్వడము. అయితే, మాయ విఘ్నాలు కలుగుతాయి,
ఇందులో అనుమానమేమీ లేదు, కానీ ఇందులో అలసిపోకూడదు. అలసిపోవడము వల్ల దేహాభిమానము
వచ్చేస్తుంది. తండ్రి అంటారు - పిల్లలూ, శరీర నిర్వహణ కోసం పని అయితే చేయాలి, దాని
కోసం అనుమతి ఉంది. 8 గంటలు శరీర నిర్వహణ కోసము, 8 గంటలు విశ్రాంతి, మిగతా 8 గంటలు
దీని కోసం కేటాయించండి. ఇప్పుడైతే 8 గంటలు ఎవరూ పూర్తిగా ఇవ్వడము లేదు. అంతిమములో 8
గంటల వరకు ఉంటారు. చార్టును పెంచుతూ ఉండండి. ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు,
స్మృతినిప్పించడము జరుగుతుంది, దానిని మీరు నిష్ఠ (యోగము) అని అంటారు. ఇక్కడకు వచ్చి
బాబా స్మృతిలో కూర్చుంటారు. అలాగని, కేవలం ఇక్కడికే వచ్చి స్మృతిలో కూర్చోవాలని కాదు.
5-10 నిమిషాలు యోగము చేసి లేద్దాము అని భావించేవారు చాలామంది ఉంటారు కానీ తండ్రి
అంటారు - వ్యాపార-వ్యవహారాలు చేసుకుంటూ, ఎక్కడికైనా వస్తూ-వెళ్తూ కూడా మీరు యోగములో
ఉండండి. గంగా స్నానాలు మొదలైనవి చేయడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామ-రామ అని
జపిస్తూ ఉంటారు కదా. ఇక్కడ మీరు ఏమీ స్మరించవలసిన అవసరము లేదు, కేవలం తండ్రిని
స్మృతి చేయాలి. ఇక్కడ తండ్రి పిల్లలతోనే మాట్లాడుతున్నారు. మీ కళ్యాణము
స్మృతియాత్రలోనే ఉంది, ఇందులో అలసిపోకూడదు. ఇందులో తుఫానులు చాలా వస్తాయి. తుఫానులు
అంటే మట్టి తుఫానులు మొదలైనవేమీ కాదు. మాయా తుఫానులు రావడముతో బుద్ధియోగము
తెగిపోతుంది, ఇక అప్పుడు దేహాభిమానములోకి రావడముతో వ్యాపార-వ్యవహారాలు, పిల్లలు
మొదలైనవారు గుర్తుకువస్తారు. తండ్రి అంటారు - ఇప్పుడైతే ఈ వ్యాపార-వ్యవహారాలు
మొదలైనవన్నీ సమాప్తమవ్వనున్నాయి. మీ పిల్లలు వారసులుగా అవ్వడమనేది జరగనే జరగదు, అంతా
సమాప్తమవ్వనున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి యొక్క వారసులు నిలబడ్డారు. హద్దు
వారసత్వము నశించనున్నది. ఇప్పుడు కొడుకు పెద్దవాడవుతాడు, వివాహము చేసుకుంటాడు,
తర్వాత ఇలా జరుగుతుంది, అని షావుకారులు అనుకుంటారు. తండ్రి అంటారు - ఇప్పుడు అంత
సమయము లేదు, అందుకే ప్రపంచము పట్ల ఉన్న మోహాన్ని పూర్తిగా తొలగించండి. ఇది
శ్మశానవాటిక. వ్యాపార-వ్యవహారాలు, పిల్లలు మొదలైనవాటి చింతనలో మరణించినట్లయితే
అనవసరంగా తమను తాము నాశనము చేసుకుంటారు. శివబాబాను స్మృతి చేసినట్లయితే, చాలా
సుసంపన్నులుగా అవుతారు. దేహాభిమానములోకి రావడము వల్ల నాశనమవుతారు. దేహీ-అభిమానులుగా
అవ్వడము వల్ల సుసంపన్నులుగా అవుతారు. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా భవిష్య 21 జన్మల
వారసత్వాన్ని పొందుతారు. స్మృతి చేయకపోతే చాలా నష్టము కలుగుతుంది. అది ఇక
కల్ప-కల్పానికి అలాగే ఉండిపోతుంది. ఇది ఎంత పెద్ద నష్టము. మేము పూర్తి వారసత్వాన్ని
ఎలా పొందాలి అని ఆలోచించాలి. ధనము పట్ల కూడా ఎక్కువ లోభము పెట్టుకోకూడదు. టూ మచ్ (అతి)లోకి
వెళ్ళకూడదు. ఎవరైనా దివాలా తీస్తే, చాలా చింతిస్తారు. శివబాబాను పూర్తిగా
మర్చిపోతారు. అప్పుడిక - జ్ఞానములోకి వచ్చాము, అందుకే దివాలా తీసాము, అనారోగ్యము
పాలయ్యాము అని అంటూ దోషం మోపుతారు. ఎప్పుడూ ఇలా అనుకోకూడదు. అనారోగ్యాలు మొదలైనవి
వస్తాయి, అది కర్మభోగము. ఇది మంచిదే, వికర్మలు వినాశనమవుతాయి. ధర్మరాజు శిక్షలు
అనుభవించడము కంటే అనారోగ్యము మంచిదే కదా. కర్మభోగాన్ని సమాప్తము చేసుకోవాలి. ఇది
మహారోగీ శరీరము. దీనిని ఎంతగా సంభాళించడము జరుగుతుంది. నడుస్తూ-నడుస్తూ ఆగిపోతారు,
హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇటువంటి పాత ప్రపంచాన్ని అయితే బుద్ధి ద్వారా పూర్తిగా
మర్చిపోవాలి. తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తూ ఉండటాన్ని చూస్తే, పిల్లల మనసు పాతదాని
నుండి పూర్తిగా తొలగిపోతుంది. నాన్నగారు, ఇల్లు త్వరగా కట్టండి, పాత ఇంటిలో చాలా
కష్టముగా ఉందని అంటారు. ఈ పాత ప్రపంచము చాలా అశుద్ధముగా ఉందని మీకు కూడా తెలుసు. ఇది
మీ అనంతమైన సన్యాసము. వారు ఇళ్ళు-వాకిళ్ళను సన్యసిస్తారు. దానిని హద్దు సన్యాసమని
అంటారు. మీరు వికారాలను సన్యసిస్తారు.
తండ్రి అంటారు - దేహ సహితముగా మీ దేహ సంబంధాలేవైతే ఉన్నాయో, వాటన్నింటినీ త్యజించి
నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మనము
స్వర్గ రాజధాని కోసం పురుషార్థము చేస్తున్నామని ఇప్పుడు మీ బుద్ధికి తెలుసు. జ్ఞానము
యొక్క మూడవ నేత్రము లభించింది. ఇదంతా శ్మశానవాటికగా అవ్వనున్నది, దీని పట్ల ప్రేమను
ఉంచుకోకూడదు. ఈ రోజుల్లో మనుష్యుల వద్ద చాలా ధనముంది కనుక వికారాలు కూడా
తీవ్రమైపోయాయి. కామ వికారము ఎంత తీవ్రముగా ఉంది. కామము లేకుండా ఉండలేరు. 4-5
సంవత్సరాలు పవిత్రముగా ఉంటారు, ఆ తర్వాత వ్రాస్తారు - బాబా, ఈ రోజు వీరికి భూతము
పట్టింది, నల్ల ముఖము చేసుకున్నారు అని. ఎంతటి ఎదురుదెబ్బ తిన్నారు! ఒక్కసారిగా 5
అంతస్థుల నుండి పడిపోయారు. మొట్టమొదటిది దేహాభిమానము. పై నుండి పడ్డారంటే ఇక
ముక్కలు-ముక్కలుగా అయిపోతారు, అంతా సమాప్తమైపోతుంది, ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి.
మళ్ళీ పురుషార్థము చేయడానికి సమయము పడుతుంది. ఇదే అన్నింటికంటే పెద్ద దెబ్బ. అందుకే
బాబా అంటారు, కామము మహాశత్రువు. వికారాలనే పతితత్వము అని అంటారు. బాబా, మమ్మల్ని
పతితుల నుండి పావనముగా చేయండి అని అంటారు. భారత్ లోనే సంపూర్ణ నిర్వికారులు ఉండేవారు
కదా. భారత్ యే నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు భారత్ వికారీగా అయిపోయింది. సంపూర్ణ
నిర్వికారులని సూర్యవంశీయులను అంటారు. రామచంద్రుని రాజ్యములో కూడా వికారాల విషయము
ఉండదు. కానీ కళలైతే తగ్గిపోతాయి. 1250 సంవత్సరాలు గడిచాయి కనుక ఆ ప్రపంచము యొక్క
శక్తి తగ్గిపోయినట్లే కదా. అందుకే మొదటిదానిని సతోప్రధానమని, తర్వాత దానిని సతో అని
అంటారు. మేము మమ్మా-బాబాలను ఫాలో చేసి, సూర్యవంశీ మహారాజు-మహారాణులుగా అవ్వాలని మీరు
కోరుకుంటారు. ఇందులో కష్టము లేక ఖర్చు మొదలైనవాటి విషయమే లేదు, ఇందులో నోటితో ఏమీ
మాట్లాడాల్సింది కూడా లేదు. కేవలం స్మృతి చేయాలి, దీనినే సహజ యోగమని అంటారు. దీని
కోసం చాలా కృషి చేయాలి. బాబా ముందు అందరూ మహారథులే. ఇందులో యోగము పూర్తిగా కావాలి,
అప్పుడే బాణము తగులుతుంది. యోగబలము కదా. యోగము చాలా తక్కువగా ఉంది. విఘ్నాలు కూడా
యోగములో చాలా కలుగుతాయి.
అనంతమైన తండ్రి కూర్చుని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ,
తండ్రిపై లేక చదువుపై ఎప్పుడూ అలగకండి. అలిగినట్లయితే 21 జన్మలు భాగ్యముపై అలుగుతారు.
చాలా మంచి-మంచి పిల్లలు కూడా అలుగుతారు. నేను ఇంతమందికి అర్థం చేయించాను అని
దేహాభిమానము యొక్క నషా ఎక్కుతుంది. దేహ-అహంకారము రావడముతో పడిపోతారు. ఇందులో
అహంకారము రాకూడదు. శివబాబాకు ఏమైనా అహంకారము ఉందా? వారు ఎంతటి నిరహంకారి కానీ ఎంత
గొప్ప అథారిటీ! నేను సాధారణ తనువులోకి, సాధారణ ఇంటిలోకి వస్తాను అని అంటారు కూడా.
నేను షావుకారు ఇంటిలోకి ఏమైనా వస్తానా. ఇప్పుడు పిల్లలు మేలుకోవాలి. బాబా యుక్తులైతే
చాలా మంచివి తెలియజేస్తూ ఉంటారు. పిల్లలైన మీదే ఆలస్యము. డ్రామానుసారముగా పిల్లల
అవస్థ ఇంకా అంత శక్తివంతముగా అవ్వలేదు. మున్ముందు శక్తివంతముగా అవుతుంది. ఇన్ని
సంవత్సరాలలో స్వర్గ స్థాపన జరిగిపోతుందని మనము గవర్నమెంట్ కు సూచననిస్తాము.
మనుష్యులు ఈ విషయాలను వార్తాపత్రికలు మొదలైనవాటిలో చదివినప్పుడు, వచ్చి మిమ్మల్ని
అడుగుతారు. కొన్ని సంవత్సరాలలో స్థాపన జరుగుతుంది అంటే వినాశనము కూడా తప్పకుండా
జరుగుతుంది. ఎంతోమంది వస్తారు. ఈ ఆస్తులు మొదలైనవి కొంత సమయము కోసమే ఉంటాయి. ఈ
ఆస్తిని మీరు ఆస్తిగా భావించరు. ఇవి కొద్ది రోజుల కోసమే ఉంటాయని మీకు తెలుసు. ఈ
భవనాలు మొదలైనవి నివసించడము కోసం నిర్మించారు, ఎందుకంటే మధుబన్ కు చాలామంది పిల్లలు
రిఫ్రెష్ అవ్వడము కోసం వస్తారు. హెడ్ ఆఫీస్ మధుబన్. ఈ రోజు మీరేమి చేస్తున్నారు,
రేపు ఏమి చేస్తారు? ఇక్కడ తపస్య చేస్తారు. ఆ తర్వాత ఢిల్లీ, బృందావనము మొదలైన
చోట్లకు వెళ్ళి రాజ్యము చేస్తారు. మన స్మృతిచిహ్నాలు ఎలా నిర్మించబడి ఉన్నాయనేది
మంచి రీతిలో చూపించాలి. ఇప్పుడు మనము ఏ పని అయితే చేస్తున్నామో, అది 5 వేల
సంవత్సరాల క్రితం కూడా చేసాము. మొట్టమొదట శివబాబా మందిరాలను నిర్మిస్తాము. ఇకపోతే,
దిల్వాడా మందిరము మొదలైనవి తర్వాత తయారయ్యాయి. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సి
ఉంటుంది. దిల్వాడా మందిరము ఎప్పుడు నిర్మించబడింది అనే లెక్కను తీయాలంటే తీయవచ్చు.
అది మన సంపూర్ణ స్మృతిచిహ్నము. అది స్థాపన యొక్క స్మృతిచిహ్నమని మీకు తెలుసు.
మధురాతి మధురమైన పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. సేవను వృద్ధి చేసే యుక్తులను
రచించాలి. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, అతడి పెద్ద పరివారము కూడా
వెళ్ళిపోయింది. రావణుడి పరివారము ఎంత పెద్దదో చూడండి. రామునిది ఎంత చిన్న పరివారము.
ఈ గాయనము కరెక్టుగా ఉంది. కానీ ఎవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి కూర్చుని అర్థం
చేయించినా కానీ నిశ్చయము కూర్చోదు. శరీర నిర్వహణార్థము కూడా మీరు కర్మలు తప్పకుండా
చేయాలి. అయితే, ఎవరైతే సర్వీసబుల్ పిల్లలు ఉన్నారో - పాండవులు, వారు ఈ గవర్నమెంట్
నుండి పాలన తీసుకోవచ్చు. వారి సంభాళన అంతా మనమే చేయవలసి ఉంటుంది. మరి పిల్లల అవస్థ
కూడా ఆ విధముగా ఉండాలి. బాబా స్మృతిలో ఈ ప్రపంచానికి సంబంధించినదంతా మర్చిపోవాలి.
స్మృతియాత్రలో ఎవరైతే పక్కాగా, ఆనందముగా ఉంటారో, వారి అవస్థ కూడా చాలా శక్తిశాలిగా
ఉంటుంది. శివబాబా స్మృతిలో ఉంటూ మీరు శరీరాన్ని వదులుతారు. సన్యాసులు బ్రహ్మతత్వము
స్మృతిలో శరీరాన్ని వదులుతారు, అప్పుడు కూడా వాయుమండలములో పూర్తిగా నిశ్శబ్దత
ఏర్పడుతుంది. బాబాకు అనుభవముంది. మనుష్యులు మరణించినప్పుడు, ఇంట్లో నిశ్శబ్దత
ఏర్పడుతుంది కదా, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. చివరిలో అంతా మర్చిపోయినట్లుగా
అవుతుంది. ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి. దేహాభిమానము తొలగిపోతూ ఉంటుంది.
చివరిలో శరీరాన్ని సంతోషముగా వదలాలి, హర్షితముఖులుగా ఉంటూ వదలాలి. అంతే. మనము
ఎక్కడికి వెళ్తున్నాము... ఆ అవస్థ ఉంటే, అప్పుడు విజయమాలలో కూర్చబడేందుకు యోగ్యులుగా
అవుతారు. మీలో శాంతి యొక్క కరెంట్ ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు, ఇక్కడ ఎంతో శాంతి
ఉందని అంటారు. ఇది రియల్ శాంతి. ఆత్మ శరీరము నుండి అతీతమవుతుంది. ఆత్మలమైన మనము
శాంతి స్వరూపులమని మీకు తెలుసు. మనము మన స్వధర్మములో కూర్చుండిపోతాము. కర్మలు
చేయకుండానైతే ఏ మనిషి ఉండలేరు. వాళ్ళు హఠయోగముతో ఏమేమో చేస్తుంటారు. మన స్వధర్మమే
శాంతి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడకు మనము పాత్రను అభినయించేందుకు
వచ్చాము. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి
మరియు ఇంటిని కూడా స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వము
లభిస్తుంది. తండ్రి అంటారు - నన్ను కూడా ఆ ఇంటిలో స్మృతి చేయండి. ఇక్కడికైతే నేను
తాత్కాలికముగా వస్తాను. మీ బుద్ధి బాబా స్మృతిలో శాంతిధామములో నిలిచి ఉండాలి. ఆ ఇంటి
యొక్క వారసత్వాన్ని కూడా తీసుకోవాలి కదా. అది ఆత్మల ఇల్లు. ఇది జీవాత్మల ఇల్లు. మీ
ఇంటిని కూడా మర్చిపోకండి, తండ్రిని కూడా మర్చిపోకండి. తండ్రిని స్మృతి
చేసినట్లయితేనే పవిత్రముగా అయి ఇంటికి వెళ్ళిపోతారు. జ్ఞానాన్ని ధారణ చేసినట్లయితే
మళ్ళీ కొత్త ప్రపంచములో రాజ్యము చేయడానికి వస్తారు. ఎంత వీలైతే అంత, ఇతరులకు
మార్గాన్ని తెలియజేస్తూ వెళ్ళండి. సదా తండ్రినే చూస్తూ ఉండండి. తండ్రి ఏమి చేసారు
అనేది మీకు తెలుసు! అంతా మాతలకు ఇచ్చేశారు. అంతా మాతల సేవలో పెట్టండి అని శివబాబానే
డైరెక్షన్ ఇచ్చారు. ఒకరిని చూసి ఇతరులు ఫాలో చేసారు, స్వాహా అయిపోయారు. కానీ తర్వాత
ఇక్కడ నిలవగలగాలి కూడా కదా. డ్రామానుసారముగా భట్టీ కూడా జరిగింది.
పాకిస్తాన్-హిందుస్థాన్ ఏర్పడ్డాయి. మీ భట్టీ ముందు పాకిస్తాన్ లోనే మొదలయ్యింది.
మీరు నదిని దాటి వచ్చారు - శాస్త్రాలలోనైతే ఏవేవో విషయాలను రాసేసారు. ప్రాక్టికల్
గా అయితే ఇప్పుడు మీరు వింటున్నారు కదా. మళ్ళీ కల్పము తర్వాత మీరే వింటారు. ఇప్పుడు
తండ్రి అంటారు - చెడు వినకండి, వ్యాపారము మొదలైనవి చేసుకోండి కానీ చెడు వినకండి.
తండ్రి అంటారు - ప్రతి విషయములోనూ శ్రీమతాన్ని తీసుకోండి. బాబా, ఈ పరిస్థితిలో మేము
ఏమి చేయము అని అడిగినట్లయితే బాబా అంతా చెప్తారు. ఏ విషయాన్ని అయినా అడగాలనుకుంటే
మీరు బాబా వద్దకు రండి. మీరెందుకు భయపడతారు. అడుగడుగునా అడగాలి. శ్రీమతముపై
నడుచుకున్నట్లయితే అడుగడుగులోనూ పదమాలు ఉంటాయి. మీ ప్రతి క్షణము ఏదైతే గడుస్తుందో,
అందులో పదమాలు ఉంటాయి. కనుక ఎంత సంపాదన జరుగుతుంది! అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విజయమాలలో కూర్చబడేందుకు ఈ శరీరము నుండి అతీతముగా అయ్యే పురుషార్థము పూర్తిగా
చేయాలి. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.
2. ధనము పట్ల టూ మచ్ (అతి) లోభము ఉండకూడదు. తండ్రి స్మృతి తప్ప వేరే ఏ చింతన
ఉండకూడదు. ఎప్పుడూ కూడా తండ్రిపై లేక చదువుపై అలగకూడదు.
వరదానము:-
యజమానత్వపు స్మృతి ద్వారా హైయ్యెస్ట్ అథారిటీని అనుభవము చేసే
కంబైండ్ స్వరూపధారీ భవ
మొదట మీ శరీరము మరియు ఆత్మ యొక్క కంబైండ్ రూపాన్ని
స్మృతిలో ఉంచుకోండి. శరీరము రచన, ఆత్మ రచయిత. దీని ద్వారా యజమానత్వపు స్మృతి
స్వతహాగా ఉంటుంది. యజమానత్వపు స్మృతి ద్వారా స్వయాన్ని హైయ్యెస్ట్ అథారిటీ గా
అనుభవము చేస్తారు. శరీరాన్ని నడిపించేవారిగా అవుతారు. రెండవది - తండ్రి మరియు బిడ్డ
(శివశక్తి) అన్న కంబైండ్ స్వరూపపు స్మృతి ద్వారా మాయ విఘ్నాలను అథారిటీతో దాటి
వేస్తారు.
స్లోగన్:-
విస్తారాన్ని
క్షణములో ఇముడ్చి వేసి జ్ఞాన సారాన్ని అనుభవము చేయండి మరియు చేయించండి.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
ఎప్పుడైతే స్మృతి
జ్వాలా స్వరూపముగా ఉంటుందో, అప్పుడే పాప కటేశ్వరులుగా, పాప హరిణిగా అవ్వగలరు. ఈ
స్మృతి ద్వారానే అనేకాత్మల నిర్బలత దూరమవుతుంది, దీని కొరకు ప్రతి క్షణము, ప్రతి
శ్వాసలో బాబా మరియు మీరు కంబైండ్ అయ్యి ఉండండి. ఏ సమయములోనూ సాధారణ స్మృతి ఉండవద్దు.
స్నేహము మరియు శక్తి, రెండు రూపాలు కంబైండ్ గా ఉండాలి.