14-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ప్రతిరోజూ తమను తాము ప్రశ్నించుకోండి - ఆత్మనైన నేను ఎంత శుద్ధంగా అయ్యాను అని, ఎంతగా శుద్ధంగా అవుతారో, అంతగా సంతోషముంటుంది, సేవ చేయాలనే ఉల్లాసము కలుగుతుంది’’

ప్రశ్న:-
వజ్ర సమానంగా శ్రేష్ఠంగా అయ్యేందుకు పురుషార్థమేమిటి?

జవాబు:-
దేహీ-అభిమానులుగా అవ్వండి, శరీరము పట్ల కొద్దిగా కూడా మోహము ఉండకూడదు. చింత నుండి దూరంగా ఉంటూ ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి - ఈ శ్రేష్ఠ పురుషార్థమే వజ్ర సమానంగా చేస్తుంది. ఒకవేళ దేహాభిమానము ఉన్నట్లయితే అవస్థ అపరిపక్వంగా ఉందని, తండ్రి నుండి దూరంగా ఉన్నారని అర్థం చేసుకోండి. మీరు ఈ శరీరాన్ని సంభాళించాలి కూడా, ఎందుకంటే ఈ శరీరంలో ఉంటూ కర్మాతీత అవస్థను పొందాలి.

పాట:-
ముఖాన్ని చూసుకో ఓ ప్రాణీ...

ఓంశాంతి
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఎవరికైతే యోగబలంతో పాపాలు కట్ అవుతూ ఉంటాయో, వారికి సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కుతుంది. పిల్లలు తమ అవస్థ గురించి తమకు తాము తెలుసుకోగలరు. ఎప్పుడైతే అవస్థ బాగుంటుందో, అప్పుడు సేవ పట్ల అభిరుచి చాలా బాగుంటుంది. ఎంతగా శుద్ధంగా అవుతూ ఉంటారో, అంతగా ఇతరులను కూడా శుద్ధంగా మరియు యోగీలా చేయాలనే ఉల్లాసం కలుగుతుంది, ఎందుకంటే మీరు రాజయోగులు మరియు రాజఋషులు. హఠయోగ ఋషులు తత్వాన్ని భగవంతునిగా భావిస్తారు. రాజయోగ ఋషులు భగవంతుడిని తండ్రిగా భావిస్తారు. తత్వాన్ని స్మృతి చేయడంతో వారి పాపాలేమీ తొలగిపోవు. తత్వంతో యోగము జోడించడము వలన బలమేమీ లభించదు. ఏ ధర్మం వారికీ యోగము గురించి తెలియదు, అందుకే ఎవరూ సత్యమైన యోగిగా అయ్యి తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు మీ అవస్థ గురించి మీరు కూడా తెలుసుకోగలరు. ఎంతగా ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటుందో, అంతగా సంతోషం కలుగుతుంది. స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలు కూడా ఇతరుల అవస్థను మరియు స్వయము యొక్క అవస్థను తెలుసుకోగలరు. మాకు శరీర భానమేమీ లేదు కదా అని చూసుకోవాలి! దేహాభిమానము ఉందంటే - మేము చాలా అపరిపక్వంగా ఉన్నామని, బాబా నుండి చాలా దూరంగా ఉన్నామని భావించండి. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు - పిల్లలూ, మీరు ఇప్పుడు వజ్ర సమానంగా అవ్వాలి. తండ్రి దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. తండ్రికి దేహాభిమానము ఉండదు. దేహాభిమానమనేది పిల్లలకు ఉంటుంది. తండ్రి స్మృతితో మీరు దేహీ-అభిమానులుగా అవుతారు. నేనెంత సమయము స్మృతి చేస్తున్నాను అని తమను తాము చెక్ చేసుకుంటూ ఉండండి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషపు పాదరసం పైకి ఎక్కుతుంది మరియు తమను తాము యోగ్యులుగా తయారుచేసుకుంటారు. పిల్లల్లో ఎవరైనా కర్మాతీత అవస్థకు చేరుకున్నారని భావించకండి. లేదు. ఇంకా రేస్ నడుస్తుంది. రేస్ పూర్తయినప్పుడు ఫైనల్ రిజల్టు వెలువడుతుంది. అప్పుడిక వినాశనము కూడా మొదలవుతుంది. కర్మాతీత అవస్థను చేరుకోనంతవరకు ఈ రిహార్సల్స్ జరుగుతూనే ఉంటాయి. మనము ఎవరికీ చెడు చేయలేము. అంతిమంలోనే అందరి గురించి తెలుస్తుంది. ఇప్పుడింకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ దాదా కూడా అంటారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడింకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ సమయంలో ఒక్కరు కూడా కర్మాతీత అవస్థను పొందలేరు. అనారోగ్యాలు మొదలైనవి వస్తాయి - వాటిని కర్మభోగమని అంటారు. కర్మభోగాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని గురించి ఎవరికీ తెలియదు, ఆ నొప్పి లోలోపల ఉంటుంది.

ఇప్పుడు ఎవరికీ ఇంకా ఏకరస అవస్థ తయారవ్వలేదు. ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటారో, అంతగా వికల్పాలు, తుఫాన్లు చాలా వస్తాయి. పిల్లలకు ఎంత సంతోషముండాలి. విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది ఏమైనా తక్కువ విషయమా? షావుకారు వ్యక్తులకు పెద్ద-పెద్ద బంగళాలు ఉంటాయి కనుక సంతోషముంటుంది ఎందుకంటే వాటిలో చాలా సుఖము ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు తండ్రి నుండి అపారమైన సుఖాన్ని తీసుకుంటారు. బాబా నుండి మనము రాజ్యం తీసుకుంటామని మీకు తెలుసు. ధనంతో ఎంతైతే సంతోషం కలుగుతుందో, శాంతితో అంతటి సంతోషం కలగదు. సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళి అడవులలో ఉండేవారు. ఎప్పుడూ ధనాన్ని తీసుకునేవారు కాదు, కేవలం రొట్టెలు తీసుకునేవారు. ఇప్పుడైతే ఎంత ధనవంతులుగా అయిపోయారు. అందరికీ ధనము గురించి చాలా చింత ఉంది. వాస్తవానికి రాజుకు ప్రజల గురించి చింత ఉంటుంది, అందుకే యుద్ధ సామాగ్రిని పెట్టుకుంటారు. సత్యయుగంలోనైతే యుద్ధానికి సంబంధించిన విషయమేమీ ఉండదు. మేము మా రాజ్యంలోకి వెళ్తున్నామని - ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషం ఉంటుంది. అక్కడ భయపడే విషయమేమీ ఉండదు. టాక్స్ మొదలైన విషయాలు ఉండవు. శరీరానికి సంబంధించిన చింత ఇక్కడే ఉంటుంది. ఆ స్వామి, ఆ సద్గురువు మమ్మల్ని చింతల నుండి దూరము చేసారు... అని అంటూ ఉంటారు. చింతల నుండి దూరమయ్యేందుకు, ఇప్పుడు మనము ఇంత పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. ఇక తర్వాత 21 జన్మల వరకు ఏ చింత ఉండదు. బాబాను స్మృతి చేయడము వలన మీరు చాలా స్థిరంగా ఉంటారు. రామాయణ కథ కూడా మీపైనే తయారుచేయబడింది. మీరే మహావీరులుగా అవుతారు. రావణుడు మమ్మల్ని కదిలించలేడని ఆత్మ అంటుంది. ఆ అవస్థ చివర్లో వస్తుంది. ఇప్పుడైతే ఎవరైనా కదిలిపోతారు, చింతలు ఉంటాయి. విశ్వంలో యుద్ధం మొదలైనప్పుడు - ఇప్పుడు సమయము వచ్చేసిందని అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థం ఎంతగా చేస్తూ ఉంటారో, అంతగా లాభం కలుగుతుంది. పురుషార్థం చేసే సమయము ఇదే. ఇక తర్వాత వినాశం యొక్క అలజడి మొదలవుతుంది. ఇప్పుడైతే శరీరము పట్ల కూడా మోహం ఉంటుంది కదా. బాబా స్వయంగా చెప్తున్నారు - శరీరాన్ని సంభాళించండి. ఇది అంతిమ శరీరము, ఇందులో ఉంటూనే పురుషార్థం చేసి కర్మాతీత అవస్థను చేరుకోవాలి. జీవించి ఉన్నంతవరకు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, జీవిస్తూ ఉండండి. ఎంత ఎక్కువ సమయము జీవించి ఉంటారో, అంతగా తండ్రిని స్మృతి చేసి ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతారు. ఇప్పుడు మీ సంపాదన జరుగుతూ ఉంటుంది. శరీరాన్ని నిరోగిగా, ఆరోగ్యంగా ఉంచుకోండి, పొరపాట్లు చేయకూడదు. ఆహార-పానీయాలను సంభాళించుకున్నట్లయితే, అప్పుడిక ఏమీ జరగదు. ఏకరసంగా నడుచుకుంటే శరీరము కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది అమూల్యమైన తనువు. ఇందులో ఉంటూనే పురుషార్థం చేసి దేవీ-దేవతలుగా అవుతారు కనుక ఈ సమయానిదే గొప్పతనము. సంతోషముండాలి. ఎంతగా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా నారాయణీ నషా ఎక్కి ఉంటుంది. తండ్రి స్మృతితోనే మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. మీరు ఎంత సంతోషంగా ఉంటున్నారు, ఎంత నషాలో ఉంటున్నారు అనేది చూసుకోవాలి. పేదవారికైతే ఇంకా ఎక్కువ సంతోషముండాలి. షావుకారులకైతే ధనము గురించి చింత ఉంటుంది. మీలో కూడా కుమారీలకు ఎటువంటి చింత లేదు. ఒకవేళ ఎవరి మిత్ర-సంబంధీకులైనా పేదవారిగా ఉంటే, వారిని సంభాళించాల్సి ఉంటుంది. వారిని మేలుకొలుపుతూ కూడా ఉండాలి. ఒకవేళ మేలుకోలేదంటే, ఇంకా ఎంతవరకని సహాయము చేస్తూ ఉంటారు. బాబా అంటారు కదా - స్వయము మీరు కూడా సర్వీసబుల్ గా అవ్వండి మరియు మీ పత్నిని ఆత్మిక సేవ కొరకు పంపించండి.

మీరు బాబాకు సహాయకులు. సహాయమనేది అందరికీ కావాలి కదా. తండ్రి ఒక్కరే ఏమి చేయగలరు, ఎంతమందికని మంత్రాన్ని ఇస్తారు! నేను మీకు ఇస్తాను, మీరు ఇతరులకు ఇవ్వాలి, అంటు కట్టాలి. ఎంత వీలైతే అంత సహాయకులుగా అవ్వండి, మంత్రాన్ని ఇస్తూ వెళ్ళండి అని పిల్లలకు చెప్తూ ఉంటారు. మనుష్యులకు ఈ విధముగా చెప్పండి - అందరికీ ఈ సందేశాన్ని ఇచ్చినట్లుగా మీ శాస్త్రాలలో కూడా ఉంది, ఆ సందేశమేమిటంటే - తండ్రి వచ్చారు కనుక వారసత్వాన్ని పొందాలంటే తండ్రిని స్మృతి చేయండి, దేహధారులను స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు వారసత్వం లభిస్తుంది. గీతనైతే చాలామంది వింటారు, వినిపిస్తారు. అందులో ప్రసిద్ధమైన పదం - ‘మన్మనాభవ’. తండ్రిని స్మృతి చేసినట్లయితే ముక్తిని పొందుతారు. ఇది సన్యాసులు కూడా ఇష్టపడతారు. ‘మధ్యాజీభవ’ అనగా జీవన్ముక్తి. పిల్లలు తండ్రికి చెందినవారిగా అయినట్లయితే తండ్రి అంటారు - పిల్లలూ, మీ ఆత్మ పతితంగా ఉంది, పతితులు తిరిగి వెళ్ళలేరు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భారతవాసులైన మీరు సతోప్రధానంగా ఉండేవారు. తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి కనుక తండ్రి అంటారు - పురుషార్థం చేసినట్లయితే ఉన్నత పదవి లభిస్తుంది. భక్తినైతే జన్మజన్మలుగా చేస్తూ వచ్చారు. మొట్టమొదట అవ్యభిచారీ భక్తి ప్రారంభమయ్యిందని మీకు తెలుసు. ఇప్పుడు ఎంత వ్యభిచారీ భక్తి ఉంది. శరీరాలకు కూడా పూజ జరుగుతుంది. అది భూత పూజ. దేవతలు పవిత్రమైనవారు కానీ ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు, కనుక పూజ కూడా తమోప్రధానమవుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. భక్తి మాటలేవీ మాట్లాడకూడదు. అయ్యో రామా, అనేది కూడా భక్తిలోని మాటే. ఈ విధముగా పిలవకూడదు. ఇక్కడ ఏమీ ఉచ్చరించవలసిన విషయము లేదు. ఓంశాంతి అని కూడా పదే-పదే చెప్పకూడదు. శాంతి అనగా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఆత్మ ఎలాగూ శాంతి స్వరూపమే. ఇందులో చెప్పాల్సిన అవసరము లేదు. ఇతర మనుష్యులెవరికైనా ‘ఓంశాంతి’ అని చెప్తే, వారు ఈ మాటను కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. వారైతే ఓం అనే పదానికి చాలా గొప్పగా మహిమ చేస్తారు. మీకైతే ఎలాగూ దాని అర్థం తెలుసు కనుక ‘ఓంశాంతి’ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే, శివబాబా స్మృతిలో ఉన్నారా అని ఒకరినొకరు ఈ విధముగా అడగవచ్చు. నేను కూడా కుమార్తెను అడుగుతాను కదా, మీరు ఎవరిని అలంకరిస్తున్నారు అని? అప్పుడామె శివబాబా రథాన్ని అలంకరిస్తున్నానని చెప్తారు. ఇది శివబాబా రథం కదా! ఎలాగైతే హుస్సేన్ రథం ఉంటుంది కదా! వారు గుర్రాన్ని అలంకరిస్తారు. గుర్రం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. ధర్మ స్థాపన చేయడానికి ఎవరైతే వస్తారో, ఆ ఆత్మలు పవిత్రంగా ఉంటారు. పాత పతిత ఆత్మలు ధర్మ స్థాపన చేయలేరు. మీరు ధర్మ స్థాపన చేయరు, శివబాబా మీ ద్వారా చేస్తారు. మిమ్మల్ని పవిత్రంగా తయారుచేస్తారు. వారు భక్తి మార్గంలో అలంకరణలు మొదలైనవి చాలా చేస్తారు. ఇక్కడ అలంకరణను ఇష్టపడరు. తండ్రి ఎంత నిరహంకారి. వారు స్వయంగా చెప్తున్నారు - నేను అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమంలో వస్తాను. సత్యయుగంలో ముందు శ్రీనారాయణుడు ఉంటారు. శ్రీలక్ష్మి కంటే కూడా ముందుగా శ్రీనారాయణుడు వస్తారు. అతను పెద్దవారు కదా, అందుకే శ్రీకృష్ణుని పేరు మహిమ చేయబడింది. శ్రీనారాయణుడి కంటే కూడా శ్రీకృష్ణుడిని ఎక్కువ మహిమ చేస్తారు. శ్రీకృష్ణుని జన్మాష్టమినే జరుపుకుంటారు. శ్రీనారాయణుడి పుట్టినరోజును జరుపుతారు. శ్రీకృష్ణుడే శ్రీనారాయణునిగా అవుతారని ఎవరికీ తెలియదు. చిన్ననాటి పేరే నడుస్తుంది కదా. ఫలానావారు జన్మించారు అని చెప్పి వారి పుట్టినరోజును జరుపుతారు, అందుకే శ్రీకృష్ణుని పుట్టినరోజునే జరుపుతారు. శ్రీనారాయణుడి పుట్టినరోజు గురించి ఎవరికీ తెలియదు. మొట్టమొదట శివజయంతి జరుగుతుంది, ఆ తర్వాత శ్రీకృష్ణ జయంతి, ఆ తర్వాత రామునిది... శివునితో పాటు గీతా జయంతి కూడా జరుగుతుంది. వీరి అనేక జన్మల అంతిమ జన్మలోనే శివబాబా వస్తారు. అనుభవజ్ఞుడైన వృద్ధుని రథంలోనే వస్తారు. ఎంత బాగా అర్థం చేయించబడింది, అయినా కూడా ఇది ఎవరి బుద్ధిలోకీ రాదు.

తండ్రి అంటారు - ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. నేను వచ్చి వినిపించినప్పుడే, మీరు కూడా వినిపించగలరు. మనము భవిష్యత్తులో ఏక్యురేట్ గా ఇలా (దేవీ-దేవతలుగా) అవుతామని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. బాబాకు 2-3 రకాల సాక్షాత్కారాలు జరిగాయి. ఇలా అవుతాను, కిరీటధారిగా అవుతాను, తలపాగా ధరించినవాడిగా అవుతాను అని, రాజ్యంలో తీసుకున్న 2-4 జన్మల సాక్షాత్కారాలను పొందారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. ఈ విషయాలను ప్రపంచంలో ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మంచి కర్మలు చేసినట్లయితే మంచి జన్మ లభిస్తుందని మాత్రం అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు భవిష్యత్తు కొరకే, నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మీరు ఈ పదవిని పొందుతారని మీకు తెలుసు. ఎవరైతే కర్మాతీత అవస్థను పొందే పురుషార్థం చేస్తూ ఉంటారో, వారికి ఈ సంతోషం ఎక్కువగా ఉంటుంది. బాబా, మేమైతే మమ్మా-బాబాలను ఫాలో చేస్తేనే సింహాసనంపై కూర్చోగలము అని అంటారు. తాము ఎంత సేవను చేస్తున్నారు మరియు ఎంత సంతోషంలో ఉంటున్నారు అనేది కూడా అర్థం కావాలి. స్వయము సంతోషంలో ఉన్నట్లయితే, ఇతరులకు కూడా సంతోషాన్ని కలిగించగలరు. లోపల ఏదైనా చెడు ఉన్నట్లయితే మనసు తింటూ ఉంటుంది. బాబా, నాలో క్రోధముంది, నాలో ఈ భూతముందని కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు. ఇది చింతించే విషయము కదా. భూతాన్ని ఉండనివ్వకూడదు. క్రోధం ఎందుకు చేయాలి! ప్రేమగా అర్థం చేయించాల్సి ఉంటుంది. బాబా ఎవరిపైనా క్రోధం చేయరు. శివబాబాకు మహిమ ఉంది కదా! చాలామంది వ్యర్థమైన, అసత్యపు మహిమను కూడా చేస్తారు. నేను ఏమి చేస్తాను! మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు. నా అనారోగ్యాన్ని దూరము చేయండి అని డాక్టరును అడుగుతారు కదా. అతను మందులిచ్చి ఇంజెక్షన్ వేస్తారు. అతని పనే అది. అది గొప్ప విషయమేమీ కాదు. వాళ్ళు సేవ చేయడము కోసమనే చదువుకుంటారు. ఎక్కువ చదువుకుంటే ఎక్కువ సంపాదిస్తారు. తండ్రికైతే సంపాదించాల్సిన అవసరమేమీ లేదు. తండ్రి సంపాదన చేయిస్తారు. బాబా అంటారు - మీరు నన్ను అవినాశీ సర్జన్ అని కూడా అంటారు. ఇలా అంటూ ఎక్కువ మహిమను చేసేసారు. పతిత-పావనుడిని సర్జన్ అని ఏమీ అనరు, ఇది కేవలం మహిమ మాత్రమే. తండ్రి అయితే కేవలం - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని చెప్తారు. అంతే. నన్నొక్కరినే స్మృతి చేయండి అని మీకు అర్థం చేయించడమే నా పాత్ర. ఎంతగా స్మృతి చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇది ఉన్నదే రాజయోగ జ్ఞానము. ఎవరైతే గీతను చదివారో, వాళ్ళకు సులువుగా అర్థం చేయించవచ్చు. మీరు పూజ్య రాజులకే రాజులుగా అవుతారు, తర్వాత పూజారులుగా అవుతారు. మీరు శ్రమించాలి. మీరు విశ్వాన్ని పవిత్రంగా తయారుచేస్తారు. ఇది ఎంత గొప్ప పదవి! మీరందరూ కలియుగీ పర్వతాన్ని పరివర్తన చేయడానికి చేతి వేలును అందిస్తారు. ఇకపోతే ఇక్కడ పర్వతం మొదలైన విషయమేమీ లేదు. కొత్త ప్రపంచం రానున్నదని ఇప్పుడు మీకు తెలుసు. అందుకే రాజయోగాన్ని తప్పకుండా నేర్చుకోవాలి. దీనిని తండ్రియే వచ్చి నేర్పిస్తారు. సతోప్రధానంగా అవ్వాలి. ఎవరైతే కల్పక్రితం తయారయ్యారో, వారికి ఇది అర్థం చేయిస్తే నచ్చుతుంది, సరైన విషయమే చెప్తున్నారని అంటారు. నిజంగా తండ్రియే ‘మన్మనాభవ’ అని చెప్పారని భావిస్తారు. ఇది సంస్కృత పదము. ముఝే యాద్ కరో అని తండ్రి హిందీలో చెప్తారు (నన్ను స్మృతి చేయండి). మనము ఎంత ఉన్నతమైన ధర్మం మరియు ఉన్నతమైన కర్మలు కలవారము అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అందుకే 16 కళల సంపూర్ణులు... అని గాయనము చేయడము జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. స్వయాన్ని చూసుకోవాలి - నేను ఎంతవరకు సతోప్రధానంగా అయ్యాను, ఎంతవరకు పావనంగా అయ్యాను, ఎంతవరకు నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేసే సేవను చేస్తున్నాను. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. ఈ శరీరాన్ని సంభాళిస్తూ శివబాబాను స్మృతి చేయాలి. ఆత్మిక సేవలో తండ్రికి సహాయకులుగా అవ్వాలి.

2. లోపల ఏ భూతాన్ని ఉండనివ్వకూడదు. ఎప్పుడూ ఎవరిపైనా క్రోధము చేయకూడదు. అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. తల్లి-తండ్రిని ఫాలో చేసి సింహాసనాధికారులుగా అవ్వాలి.

వరదానము:-
స్వార్థము అనే పదానికి అర్థం తెలుసుకుని సదా ఏకరస స్థితిలో స్థితులయ్యే సహజ పురుషార్థీ భవ

ఈ రోజుల్లో ఒకరి పట్ల ఒకరికి ఏదైతే మోహము ఉందో, అది స్నేహంతో కాదు, స్వార్థంతో ఉంది. స్వార్థము కారణంగా మోహము ఉంది మరియు మోహము కారణంగా అతీతముగా అవ్వలేరు, అందుకే స్వార్థము అనే పదము యొక్క అర్థంలో స్థితులవ్వండి అనగా ముందు స్వ యొక్క రథాన్ని స్వాహా చేయండి. ఈ స్వార్థం పోయింది అంటే అతీతంగా అయిపోతారు. ఈ ఒక్క పదము యొక్క అర్థాన్ని తెలుసుకుంటే, సదా ఒక్కరికి చెందినవారిగా మరియు ఏకరసంగా అవుతారు, ఇదే సహజ పురుషార్థము.

స్లోగన్:-
ఫరిశ్తా రూపంలో ఉన్నట్లయితే ఎలాంటి విఘ్నము తన ప్రభావాన్ని చూపించలేదు.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

సంపూర్ణ పవిత్రత బ్రాహ్మణులైన మీ అలంకారము, సదా అలంకరించబడిన మూర్తి అనగా సదా పవిత్ర స్వరూపములో స్థితులై అనంతమైన స్టేజ్ పై హీరో పాత్రను అభినయించండి. సదా బ్రహ్మచారి అనగా సంకల్పములో కూడా ఏ విధమైన అపవిత్రత వృత్తిని చంచలము చేయకూడదు. వృత్తి యొక్క చంచలత కూడా రిజిస్టర్ కు మచ్చ తీసుకువస్తుంది - అందుకే వృత్తి ద్వారా కూడా సదా బ్రహ్మచారిగా అవ్వండి.