14-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రిని స్మృతి చేయడానికి రకరకాల యుక్తులను రచించండి, పురుషార్థము చేసి చార్టు పెట్టుకోండి, అలసిపోకండి, తుఫానులలో స్థిరముగా ఉండండి’’

ప్రశ్న:-
పిల్లలు తమ ఏ అనుభవాన్ని పరస్పరములో ఒకరికొకరు వినిపించుకోవాలి?

జవాబు:-
నేను తండ్రిని ఎంత సమయము మరియు ఎలా స్మృతి చేస్తాను, భోజనము చేసే సమయములో తండ్రి స్మృతి ఉంటుందా లేక అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయా! బాబా అంటారు - పిల్లలూ, ప్రయత్నించి చూడండి. భోజనము చేసే సమయములో తండ్రి తప్ప ఇంకేదీ గుర్తు రావడము లేదు కదా! ఆ తర్వాత పరస్పరములో ఒకరికొకరు అనుభవము వినిపించుకోండి. 2. ఏదైనా బాధాకరమైన దృశ్యము చూసినప్పుడు నా స్థితి ఎలా ఉంది! ఈ అనుభవాన్ని కూడా ఒకరికొకరు వినిపించుకోవాలి.

పాట:-
ప్రపంచములోని లక్షలాది మంది ఏమి అన్నా కానీ...

ఓంశాంతి
ఏ అనంతమైన తండ్రి నుండి అయితే అనంతమైన వారసత్వము లభిస్తుందో, వారిని మధురాతి-మధురమైన పిల్లలు ఎలా మర్చిపోతారు. వారిని అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ ఉన్నారు. మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరని అర్థం చేయించడము జరిగింది. మరి ఇప్పుడు అనంతమైన తండ్రి లభించారు కనుక వారి స్మృతిలోనే చమత్కారముంది. పతిత-పావనుడైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా పావనముగా అవుతూ ఉంటారు. ఎప్పటివరకైతే అంతిమ సమయము రాదో, అప్పటివరకు మిమ్మల్ని మీరు పావనులుగా చెప్పుకోలేరు. ఎప్పుడైతే సంపూర్ణ పావనముగా అయిపోతారో, అప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి సంపూర్ణ పవిత్రమైన శరీరాన్ని తీసుకుంటారు. సత్యయుగములో కొత్త శరీరము లభించినప్పుడు సంపూర్ణులని అంటారు. అప్పుడిక రావణుడు సమాప్తమైపోతాడు. సత్యయుగములో రావణుడి దిష్టిబొమ్మను తయారుచేయరు. పిల్లలైన మీరు కూర్చున్నా, నడుస్తూ-తిరుగుతూ ఉన్నా, బుద్ధిలో ఈ విషయాలు గుర్తుండాలి. ఇప్పుడు మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము, మళ్ళీ కొత్త చక్రము మొదలవుతుంది. అది కొత్త పవిత్ర ప్రపంచము, కొత్త భారత్, కొత్త ఢిల్లీ. ముందుగా యమునా నదీ తీరము ఉంటుంది, అక్కడ పరిస్తాన్ తయారవ్వనున్నదని పిల్లలకు తెలుసు. ముందుగా తండ్రిని స్మృతి చేయండి అని పిల్లలకు చాలా మంచి రీతిలో అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి అయిన భగవంతుడు చదివిస్తారు. వారే తండ్రి, టీచర్, గురువు, ఇది గుర్తుంచుకోండి. మీరు పిల్లిమొగ్గలాట ఆడుతారని కూడా బాబా అర్థం చేయించారు. వర్ణాల చిత్రము కూడా చాలా అవసరము. అందరికన్నా పైన శివబాబా ఉంటారు, ఆ తర్వాత పిలక అయిన బ్రాహ్మణులు. మీకు అర్థం చేయించడము కోసం బాబా ఇలా చెప్తారు. అచ్ఛా, మనము 84 జన్మల పిల్లిమొగ్గలాటను ఆడతాము అనేది బుద్ధిలో ఉంచుకోండి. ఇప్పుడిది సంగమము, తండ్రి ఎక్కువ సమయము ఉండరు, కానీ ఎంతైనా 100 సంవత్సరాలైతే పడుతుంది. పూర్తిగా అతలాకుతలం అయిన తర్వాత రాజ్యము ప్రారంభమవుతుంది. ఇది ఆ మహాభారత యుద్ధమే, ఇందులో అనేక ధర్మాల వినాశనము, ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతూ ఉంది. మీ ప్రతిభ అయితే అద్భుతమైనది. ఫకీర్లు తమ ప్రతిభతో విన్యాసాలు వంటివి ప్రదర్శిస్తూ తీర్థ స్థానాలకు వెళ్తారని మీకు తెలుసు. మనుష్యులకు వారి పట్ల గౌరవము ఉంటుంది కదా, కనుక వారికి ఏదో ఒకటి ఇస్తారు. ఈ విధముగా వారి పోషణ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తులు తమతో పాటు ఏమి తీసుకునివెళ్తారు. బాబా ఈ అన్ని విషయాలలోనూ అనుభవజ్ఞులు. బాబా అనుభవజ్ఞుడి రథాన్ని తీసుకున్నారు. వీరు గురువులను కూడా ఆశ్రయించారు, ఎంతో చూసారు, తీర్థయాత్రలు కూడా చేసారు. ఇప్పుడు బాబా అంటారు - మీరు ఈ పిల్లిమొగ్గలాటను గుర్తు చేసుకోవచ్చు. మనము ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము, ఆ తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా అవుతాము. ఇదంతా భారత్ కు సంబంధించిన విషయము. దానిని తండ్రి ఈ విధముగా అర్థం చేయించారు. ఇతర ధర్మాలవి ఉపకథలు వంటివి. తండ్రి మీకు మాత్రమే మీ 84 జన్మల కథను తెలియజేశారు. ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో, వారు - ఇస్లాములు వస్తే సగటున ఎన్ని జన్మలు తీసుకుంటారు అనే లెక్కను అర్థం చేసుకోగలరు. ఖచ్చితమైన లెక్క అవసరము లేదు. ఈ విషయాలలో చింతించడానికి ఏమీ లేదు. అన్నింటికంటే ఎక్కువ చింత ఏముంటుందంటే - మేము బాబాను స్మృతి చేస్తూ ఉండాలి అని. కేవలం ఒకటే చింత ఉంది - ఆ ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి అని. ఘడియ-ఘడియ మాయ వేరే చింతలు కలిగిస్తూ ఉంటుంది, ఇందులో మాయ చాలా చింత కలిగిస్తూ ఉంటుంది. పిల్లలు స్మృతి చేయాల్సే ఉంటుంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. స్వీట్ హోమ్ ఎవరికీ గుర్తు రాదు. శాంతిదేవా అని పిలుస్తారు కూడా. భగవంతుడిని మాకు శాంతినివ్వండి అని అడుగుతారు.

ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది, మిగతా మనుష్యులు ఘోర అంధకారములో ఉన్నారు. శాంతి సత్యయుగములోనే ఉంటుంది. ఒకే ధర్మము, ఒకే భాష, ఆచార-పద్ధతులు కూడా ఒకే విధముగా ఉంటాయి. అక్కడ ఉన్నదే శాంతి రాజ్యము. అద్వైతము యొక్క ప్రసక్తే లేదు. అక్కడైతే ఒకటే రాజ్యముంటుంది, అది సతోప్రధానముగా ఉంటుంది. యుద్ధము జరిగేందుకు అక్కడ రావణ రాజ్యమే ఉండదు. పిల్లలైన మీకు సంతోషపు పాదరసము పైకి ఎక్కాలి. అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగండి అని శాస్త్రాలలో గాయనముంది. ఆ గోప-గోపికలు మీరే కదా. మీరు సమ్ముఖములో కూర్చున్నారు. బాబా మాకు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా అన్న విషయము గుర్తుండేవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఇది అద్భుతము కదా. జీవితాంతము తోడుగా ఉంటారు. దత్తత తీసుకున్న వెంటనే చదివించడము మొదలుపెడతారు. ఇది గుర్తున్నా సరే చాలా సంతోషముంటుంది. కానీ మాయ ఇది కూడా మరపింపజేస్తుంది. మనుష్యులకు ఇది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని అంటారు కదా, దానికి ఋజువేమిటి అని మనుష్యులు అడుగుతారు. వారికి ఇలా చెప్పండి - చూడండి, ఇందులో భగవానువాచ అని వ్రాయబడి ఉంది. యజ్ఞము కూడా రచించబడి ఉంది. ఇది జ్ఞాన యజ్ఞము. ఇప్పుడు శ్రీకృష్ణుడైతే యజ్ఞాన్ని రచించలేరు.

బ్రాహ్మణులైన మనము ఈ అనంతమైన యజ్ఞానికి చెందినవారమని కూడా పిల్లల బుద్ధిలో ఉండాలి. బాబా మనల్ని నిమిత్తులుగా చేసారు. మీరు జ్ఞానాన్ని మరియు యోగాన్ని మంచి రీతిలో ధారణ చేసినప్పుడు, ఆత్మ సంపూర్ణముగా అవుతుంది, అప్పుడు ఈ ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. ఇది అనంతమైన కర్మక్షేత్రమని, ఇక్కడకు అందరూ వచ్చి పాత్రను అభినయిస్తారని మనుష్యులకే తెలుస్తుంది కదా. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉంది, అది ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు... తండ్రి అంటారు - పిల్లలూ, ఏదైనా జరగకూడనిది జరిగితే దాని గురించి చింతించాల్సి ఉంటుంది. ఏదైతే జరిగిందో, అది డ్రామాలో నిశ్చితమై ఉంది కావున దాని గురించి ఎందుకు చింతించాలి. మనము డ్రామాలు చూస్తాము. ఆ డ్రామాలలో ఎప్పుడైనా ఏవైనా బాధాకరమైన దృశ్యాలు ఉంటే, వాటిని చూసి మనుష్యులు ఏడుస్తారు. కానీ అది అసత్యమైన డ్రామా. ఇది సత్యమైన డ్రామా. మనుష్యులు ఇది సత్యము, ఇది సత్యము అని అంటూ ఉంటారు. కానీ మీకు దుఃఖపు కన్నీరు రాకూడదు. మీరు సాక్షీగా ఉంటూ చూడాలి. ఇది డ్రామా అని మీకు తెలుసు, ఇందులో ఏడ్వాల్సిన అవసరమేముంది. గతం గతః (జరిగిపోయిందేదో జరిగిపోయింది). ఇక దాని గురించి ఎప్పుడూ ఆలోచించను కూడా ఆలోచించకూడదు. మీరు ముందుకు వెళ్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి మరియు అందరికీ మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. బాబా అయితే సలహాలు ఇస్తూ ఉంటారు. మీ వద్ద త్రిమూర్తి చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో - వారు శివబాబా, ఇది వారసత్వము అని క్లియర్ గా వ్రాసి ఉంది. పిల్లలైన మీకు ఈ చిత్రాలను చూసినప్పుడు చాలా సంతోషము కలగాలి. బాబా నుండి మనకు విష్ణుపురి యొక్క వారసత్వము లభిస్తుంది. పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. కేవలం ఈ చిత్రాలను ఎదురుగా పెట్టుకోండి, ఇందులో ఖర్చేమీ లేదు. కల్పవృక్షము చిత్రము కూడా చాలా బాగుంది. రోజూ ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము చేయండి. మీకు మీరే టీచర్ గా అయి చదువుకోండి. బుద్ధి అయితే అందరికీ ఉంది. చిత్రాలను మీ ఇంటిలో పెట్టుకోండి. ప్రతి చిత్రములోనూ ఫస్ట్ క్లాస్ జ్ఞానముంది. వినాశనము జరుగుతుందని అంటారు, మరి మీకు తండ్రి పట్ల ప్రీతి ఉంది కదా. సద్గురువు మధ్యవర్తి రూపములో లభించారు... అని కూడా అంటూ ఉంటారు. మీకు అర్థం చేసుకునేందుకు మరియు అర్థం చేయించేందుకు ఎంత మంచి-మంచి విషయాలు లభించాయి. కానీ మాయ ఆర్భాటము చాలా ఉంది. 100 సంవత్సరాల క్రితం ఈ కరెంటు, గ్యాస్ మొదలైనవి ఉండేవి కావు. ఇదివరకు వైస్రాయ్ మొదలైనవారు 4 గుర్రాల బండిలో లేక 8 గుర్రాల బండిలో వచ్చేవారు. ఇదివరకు షావుకారులు కార్లలో ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడైతే విమానాలు మొదలైనవి వచ్చాయి. ఇంతకుముందు ఇవేవీ ఉండేవి కావు. ఈ 100 సంవత్సరాలలోనే ఏమైపోయిందో చూడండి. మనుష్యులు దీనినే స్వర్గముగా భావిస్తారు. కానీ ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - స్వర్గమైతే స్వర్గమే. ఇవన్నీ పైసకు కొరగాని వస్తువులు, దీనిని కృత్రిమమైన వైభవమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రిని స్మృతి చేయాలనే చింత ఒక్కటే ఉండాలి, ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. బాబా తమ ఉదాహరణను కూడా చెప్తారు - భోజనము చేసేటప్పుడు స్మృతిలో ఉంటూ తినాలని చాలా ప్రయత్నిస్తాను కానీ మర్చిపోతాను. కావున పిల్లలకైతే చాలా శ్రమ అనిపిస్తూ ఉండవచ్చు అని నాకు అర్థమవుతుంది. అచ్ఛా, పిల్లలూ, మీరు ప్రయత్నించి చూడండి. బాబా స్మృతిలో ఉండి చూపించండి. బాబా స్మృతి పూర్తి సమయము నిలవగలదేమో చూడండి. మీ అనుభవాన్ని వినిపించాలి. బాబా, స్మృతి పూర్తి సమయము నిలవడము లేదు, అనేక రకాల విషయాలు గుర్తుకువస్తున్నాయి అని పిల్లలంటారు. బాబా స్వయంగా వారి అనుభవాన్ని వినిపిస్తారు - బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో, వారు కూడా పురుషార్థీయే, వారికైతే చాలా బాధ్యతలున్నాయి. పెద్దవారు అని పిలిపించుకోవడమంటే ఎక్కువ దుఃఖము పొందడము అని అర్థం. ఎన్ని సమాచారాలు వస్తాయి. వికారాల కారణముగా ఎంతగా కొడతారు, ఇంటి నుండి పంపించేస్తారు. కుమార్తెలు, నేను ఈశ్వరుని శరణులోకి వచ్చాను అని అంటారు. ఎన్ని విఘ్నాలు కలుగుతాయి. ఎవ్వరి వద్ద శాంతి లేదు. పిల్లలైన మీకు గౌరవముంది. ఇప్పుడు పురుషార్థము చేసి శ్రీమతాన్ని అనుసరిస్తూ శాంతిగా ఉంటారు. ఈ బాబా ఇక్కడ కూడా - పరస్పరములో చాలా కలిసి-మెలిసి ఉండేటువంటి పరివారాలను ఎన్నో చూసారు. అందరూ పెద్దల ఆజ్ఞానుసారముగా నడుచుకుంటారు. మేము స్వర్గములో ఉన్నాము అన్నట్లుగా ఉందని అంటారు.

ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అటువంటి స్వర్గములోకి తీసుకువెళ్తారు, అక్కడ అన్ని రకాల సుఖాలు ఉంటాయి. దేవతలకు 36 రకాల భోజనాన్ని అర్పిస్తారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు స్వర్గ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటారు. అక్కడ ఎంత రుచికరమైనవి, వైభవముగా ఉండే పదార్థాలు తింటూ ఉంటారు మరియు పవిత్రముగా ఉంటారు. ఇప్పుడు మీరు ఆ ప్రపంచానికి యజమానులుగా అవుతారు. రాజు-రాణులకు మరియు ప్రజలకు వ్యత్యాసముంటుంది కదా. ఇంతకుముందు రాజులు చాలా ఆర్భాటముగా ఉండేవారు కానీ ఎంతైనా వారు పతితులు మరియు రావణ రాజ్యములో ఉన్నవారు. మరి ఆలోచించండి, సత్యయుగములో ఉండేవారు ఎలా ఉండి ఉండవచ్చు. ఎదురుగా లక్ష్మీ-నారాయణుల చిత్రము పెట్టడము జరిగింది. శ్రీకృష్ణుని గురించి అసత్యమైన విషయాలను వ్రాసి అప్రతిష్ఠపాలు చేసేసారు. అసత్యమంటే అసత్యమే, సత్యమనేది ఇసుమంత కూడా లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు - మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తర్వాత 84 జన్మలు తీసుకుని పూర్తిగా శూద్రబుద్ధి కలవారిగా అయ్యాము. ఎలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేసి ఎలా తయారవుతున్నారు! మీరు ఏమవుతారు అని బాబా కూడా అడుగుతారు కదా. అప్పుడు, మేము సూర్యవంశీయులుగా అవుతామని అందరూ చేతులెత్తుతారు - మేము మాత-పితలను పూర్తిగా ఫాలో చేస్తాము, తక్కువ పురుషార్థము చేయము అని అంటారు. శ్రమంతా స్మృతి చేయడములో మరియు తమ సమానముగా తయారుచేయడములో ఉంది, అందుకే తండ్రి అంటారు - ఎంత వీలైతే అంత సేవ చేయడము నేర్చుకోండి. ఇది చాలా సహజము. వీరు శివబాబా, ఇది విష్ణుపురి, ఇదే లక్ష్మీ-నారాయణుల రాజ్యము. ఇతను చాలా అనుభవజ్ఞులు. మెట్ల వరస చిత్రము చూపించి మీరు అర్థం చేయించవచ్చు.

పిల్లలైన మీకు ఈ వృక్షాన్ని మరియు చక్రాన్ని చూస్తూనే, బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా రావాలి. ఈ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఎక్కడికి వెళ్ళిపోయింది! ఎవరు యుద్ధము చేసారు! మిమ్మల్ని ఓడించింది ఎవరు? ఇప్పుడు ఆ రాజ్యము లేదు. ఈ ఈశ్వరీయ విషయాల గురించి ఏమీ తెలియదు. గుహలలోకి, గనులలోకి వెళ్ళి బంగారము, వజ్రాలు మొదలైనవి ఎలా తీసుకువస్తారు అనే సాక్షాత్కారము కూడా పిల్లలైన మీకు జరిగింది. అక్కడ సైన్స్ మీ సుఖము కోసముంటుంది. ఇక్కడ సైన్స్ దుఃఖము కోసముంది, అక్కడ విమానాలు కూడా ఫుల్ ఫ్రూఫ్ గా ఉంటాయి. ప్రారంభములో, పిల్లలకు ఈ సాక్షాత్కారాలన్నీ జరిగాయి. చివరిలో కూడా మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. దొంగలు దోచుకునేందుకు వస్తారు, అప్పుడు మీ శక్తి రూపాన్ని చూసి పారిపోతారు - అని కూడా మీకు సాక్షాత్కారము జరిగింది. ఈ విషయాలన్నీ అంతిమ సమయానికి సంబంధించినవి. దొంగలు దోచుకునేందుకు వస్తారు కానీ మీరు తండ్రి స్మృతిలో నిలబడి ఉంటే వారు వెంటనే పారిపోతారు.

ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, బాగా పురుషార్థము చేయండి. ముఖ్యమైన విషయము పవిత్రత. ఒక్క జన్మ పవిత్రముగా అవ్వాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ప్రకృతి వైపరీత్యాలు చాలా కఠినముగా వస్తాయి, అప్పుడు అంతా సమాప్తమైపోతుంది. శివబాబా వీరి ద్వారా అర్థం చేయిస్తారు, వీరి ఆత్మ కూడా వింటుంది. ఈ బాబా అన్నీ చెప్తారు. శివబాబా ఇవేవీ అనుభవించరు. మాయా తుఫానులు ఎలా వస్తాయనేది పిల్లలకు అనుభవమవుతుంది. మొదటి నంబరులో ఇతను (బ్రహ్మా) ఉన్నారు కనుక ఇతనికి అన్నీ అనుభవమవుతాయి. ఇందులో భయపడకూడదు, స్థిరముగా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉండటముతోనే శక్తి లభిస్తుంది. కొంతమంది పిల్లలు చార్టు వ్రాస్తారు, మళ్ళీ నడుస్తూ-నడుస్తూ వ్రాయడము ఆపేస్తారు. వారు అలసిపోయారని బాబాకు అర్థమవుతుంది. పారలౌకిక తండ్రి, ఎవరి నుండైతే ఇంత గొప్ప వారసత్వము లభిస్తుందో, అలాంటి తండ్రికి ఎప్పుడూ ఉత్తరము కూడా వ్రాయరు. వారిని స్మృతియే చేయరు! ఇలాంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. శివబాబా, మేము మిమ్మల్ని చాలా స్మృతి చేస్తాము. బాబా, మీ స్మృతి లేకుండా మేము ఎలా ఉండగలము! ఏ తండ్రి నుండైతే విశ్వ రాజ్యాధికారము లభిస్తుందో, అలాంటి తండ్రిని ఎలా మర్చిపోతాము. ఒక ఉత్తరము వ్రాసినా, అది కూడా స్మృతి చేసినట్లే కదా. లౌకిక తండ్రి కూడా పిల్లలకు ఉత్తరము వ్రాస్తారు - కంటి వెలుగు... అని సంబోధిస్తారు. అలాగే పత్ని, తన పతికి ఎలా ఉత్తరము వ్రాస్తుంది! ఇక్కడైతే రెండు సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా స్మృతి చేసేందుకు యుక్తి. బాబా ఎంత మధురమైనవారు! మనల్ని ఏం అడుగుతారు? ఏమీ అడగరు. వారు దాత, ఇచ్చేవారు కదా. వారు తీసుకునేవారు కాదు. బాబా అంటారు - స్వీట్ చిల్డ్రన్, నేను వచ్చాను, భారత్ ను సుగంధభరితమైన పూదోటగా తయారుచేసి వెళ్తాను. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సూర్యవంశీయులుగా అయ్యేందుకు మాత-పితలను పూర్తిగా ఫాలో చేయాలి. స్మృతిలో ఉండేందుకు మరియు తమ సమానముగా తయారుచేసేందుకు శ్రమించాలి.

2. పురుషార్థము చేసి శ్రీమతాన్ని అనుసరిస్తూ శాంతిగా ఉండాలి. పెద్దల ఆజ్ఞను పాటించాలి.

వరదానము:-
ఒకే బలము, ఒకే నమ్మకము ఆధారముపై గమ్యాన్ని సమీపముగా అనుభవం చేసే ధైర్యశాలి భవ

ఉన్నతమైన గమ్యాన్ని చేరుకునే ముందు గాలివాన, తుఫానులు తప్పకుండా వస్తాయి, స్టీమరు తీరానికి చేరుకునేందుకు సుడిగుండాలను దాటవలసి ఉంటుంది, అందుకే తొందరపాటుతో గాభరా పడకండి, అలసిపోకండి మరియు ఆగిపోకండి. సహచరుడిని తోడుగా పెట్టుకున్నట్లయితే ప్రతి కష్టము సహజమైపోతుంది, ధైర్యవంతులుగా అయి తండ్రి సహాయానికి పాత్రులుగా అవ్వండి. ఒకే బలము, ఒకే నమ్మకము - ఈ పాఠాన్ని సదా పక్కాగా ఉంచుకున్నట్లయితే సుడిగుండము నుండి సహజముగా బయటకు వచ్చేస్తారు మరియు గమ్యము సమీపముగా అనుభవమవుతుంది.

స్లోగన్:-
ఎవరైతే ప్రకృతి సహితముగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనను పెట్టుకుంటారో, వారే విశ్వ కళ్యాణకారులు.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ప్రతి ఆత్మ పట్ల దయా భావన, సదా సహయోగ భావన, ధైర్యము పెంచే భావన ఉండాలి. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యములో, ప్రతి సహయోగీ సంగఠనలో నిస్వార్థ భావన ఉండాలి, దానిని పరోపకార భావన అని అంటారు. బ్రహ్మాబాబా స్వయం కోసము ఏదీ స్వీకరించలేదు. మహిమను స్వీకరించలేదు, వస్తువులను స్వీకరించలేదు, నివసించేందుకు స్థానాన్ని కూడా స్వీకరించలేదు. స్థూలముగా మరియు సూక్ష్మముగా సదా ‘‘ముందు పిల్లలు’’ అని అనేవారు, అటువంటివారిని పరోపకారులు అని అంటారు. ఈ విషయములో ఫాలో ఫాదర్ చేసి సమానముగా అవ్వండి.